Sri vishnudharmothara Mahapuranam-1    Chapters   

తొంబదియొకటవ అధ్యాయము- గ్రహనక్షత్ర స్నానవిధి

వజ్ర ఉవాచ :

గ్రహాణాం భార్గవ శ్రేష్ఠ! నక్షత్రాణాం పృధక్‌ పృధక్‌ |

స్థానాని శ్రోతుమిచ్ఛామి తత్పీడా శకునా న్యహమ్‌ || 1

మార్కండేయ ఉవాచ :

మంజిష్ఠాం మాతులుంగంచ కుంకుమం రక్తచందనమ్‌ |

పూర్ణకుంభే కృతే తామ్రే సూర్యస్నానం విధీయతే ||

ఉశీరంచ శిరీషంచ పద్మకం చందనం తధా | శంఖే న్యస్తమిదం స్నానం చంద్ర దోష నివారణం || 3

ఖదిరం దేవదారుం చ తిలా న్యామలకానిచ | పూర్ణ కుంభే కృతే రౌప్యే భౌమ పీడా వినాశనమ్‌ || 4

నదీ సంగమతోయాని తన్యృదా సహితానిచ | న్యస్తాని కుంభే మాహీయే బుధ పీడావినాశనమ్‌ || 5

గోరోచనం నాగమదం శతపుష్పా శతావరీ | విన్యస్య రాజతేకుంభే శుక్రపీడా నివారణమ్‌ || 6

తిలాన్‌ మాషాన్‌ ప్రియం గుంచ గంధపత్రం తధైవచ | న్యస్తం కార్షాయసే కుంభే సౌరపీడ నివారణమ్‌ 7

గుగ్గులుం హింగులుం తాలం శుభాంచైవ మనశ్శిలామ్‌ | శృంగేచ మాహిషే న్యన్త రాహు పీడా వినాశనమ్‌ 8

వరహ నిర్హృతాం రాజన్‌ | పర్వతా గ్రమృదం తధా | ఛాగం క్షీరం ఖడ్గపాత్రే కేతుపీడా వినాశనమ్‌ || 9

వజ్రుడు గ్రహములకు నక్షత్రములకు వానివాని పీడాశమనమునకై వేర్వేర సేయనగు స్నానములను గూర్చి వినవలెనన మార్కండేయుడనియె. మంజిష్ఠ (ఒక సుగంధద్రవ్యము) మాతులుంగము కుంకుమపువ్వు రక్తచందనముగలిపి తామ్రపూర్ణకుంభ మునందుంచిన యుదకముతో సూర్యగ్రహమునకు స్నానము విధింపబడినది. ఉశీరము (వట్టివేరు) శిరీషము (దిరిసెన) పద్మకము చందనము ననువానితో శంఖమందలి యుదకముచే చంద్రునిజెబ్బబడినది. చంద్రగ్రహదోషనివారణమన్నమాట. ఖదిరమ చంద్రు దేవదారు తిలలు ఆమలకములు (ఉసిరికాయలు) వెండిపూర్ణకుంభమునందుంచిన యుదకముచే స్నానము కుజగ్రహ పీడానివారకము నదీసంగమ తీర్థజలమును అందలిమృత్తుతోగూడ మట్టికుంభమందుంచి చేయించుస్నానము బుధగ్రహపీడాహరము. గోరోచనము నాగమదము శతపుష్ప శతావరి పిల్లిపీచర వెండిబిందెలో నీళ్లలోనుంచి యించినస్సానము శుక్రగ్రహపీడా నివారకము. తిలలు మినుములు ప్రియంగువుగంధపుత్రము నల్ల యినుపబిందెలోనుంచిన నీళ్లుతోడి స్నానము శని పీడాహరము. గుగ్గులు హింగులము (ఇంగువ) తాళము=మనశ్శిల ననునవి గేదెకొమ్ములో నుంచిన నీటితో స్నానము రాహుగ్రహ పీడానాశనము. పంది చేతయబడి పర్వతాగ్రమందలి మృత్తుమేకపాలు ఖడ్గమృగము శృంగమందు (కొమ్మనందు) ఉంచిన నీటితో స్నానము చేసిన కేతుగ్రహపీడ నివారించును.

గ్రహస్నానమిదం ప్రోక్త మృక్షస్స్నాన మత శ్శృణు | యేన సమ్యక్‌ ప్రయుక్తేన ముచ్యతే కల్బిషా న్నరః 10

వటా శ్శత్థ శిరీషాణాం పత్రాణితు తిలై స్సహ | సర్వగంధోప పన్నాని కృత్తికాసు విధీయతే || 11

సర్వబీజోదకస్నానం రోహిణీషు ప్రశస్యతే | సర్వరత్నోదక స్నానం మృగశీర్షీ విధీయతే || 12

వచా చ గంధా కాంతాభిః స్నానం రౌద్రే ప్రకీర్తితమ్‌ | గోష్ఠ మృద్గోమయ స్నాన మాదిత్యే పాపనాశనమ్‌ || 13

సర్వౌషధ్యః పంచగవ్యం తధా గౌరాశ్చ శాలయః | సిద్దార్థకా స్సర్వగంధా స్తిష్య స్నానే శుభప్రదాః || 14

వల్మీకాగ్రమృదా స్నానం తధా సార్పే శుభప్రదమ్‌ | సతిలం దేవ నిర్మాల్యం స్నాన శస్తం మఘానుచ || 15

ఫల్గునీషు పూర్వాను శాడ్వలం లవణం ఘృతమ్‌ | ఉత్తరాసు తధా స్నానం శిమ్మిముస్తాప్రియంగుభిః 16

హస్తేస్నానం ప్రశంస న్తి పర్వతాగ్రసరోమృదా |చిత్రాసు దేవనిర్మాల్యం స్వాతౌ పుషై#్పర్జలోద్భవైః || 17

విశాఖాసు ప్రశంసన్తి రైద్రచందన పద్మకైః | నదీకూల ద్వయాన్మృడ్బి ర్మైత్రే స్నానం ప్రకీర్తితమ్‌ || 18

జ్యేష్ఠోదకేన జ్యేష్ఠాను సువర్ణ సహితం హితమ్‌ | సర్వమూల జలైః స్నానమాప్యే ముక్తాఫలోదకైః || 19

వైశ్వదేవే ప్రశంసన్తి పద్మకోశీర చందనైః | సర్వౌషధై శ్చాభిజితి శ్రవణ సంగమోదకైః || 20

నదీ వాపీ జలయుతై ద్వారుణ తు ప్రశస్యతే | అజే శ్రీ వాసకం స్నానం కాంతా పురుహితం హితమ్‌ || 13

అహిర్బుధ్న్యే తధా స్నానం పద్మకోశీర చందనైః | కుంకుమాగురు కర్పూరైః సహితం పాపనాశనం |

దర్భై ర్మూలయుతైః పౌష్ణే హరిద్రాద్వయ చందనైః || 22

నాగాశ్వగంధా మదవన్తికాచ క్షౌద్రాన్వితా చాశ్వినికే ప్రదిష్టా |

సురాహ్వకాష్ఠం రజనీ ద్వయంచ స్నానంవచాభిస్సహితంచయామ్యమ్‌ || 23

ఇతి శ్రీ విష్ణు ధర్మోత్తర ప్రధమఖండే మార్కండేయ వజ్రసంవాదే గ్రహనక్షత్ర స్నానవిధి వర్ణనం నామ ఏక సవతి తమోధ్యాయః

ఇటుపై నక్షత్రస్నానవిధి వినుము. దీనివలన నరుడు సర్వకిల్బిషములందలంగును. కృత్తికా నక్షత్రములందు స్నానము నకు మఱ్ఱి రావి దిరిసెనాకులు తిలలతో గలిపి సర్వగంధ సహితమైన ఉదకముచే స్నానము విహితము. రోహిణియందు సర్వబీజోదకస్నానము తగును (బీములనగానిక్కడ నవధాన్యాలన్నమాట) మృగశిరయందు సర్వరత్నోదకము ఆర్ద్రకు వచ (వస) గంధ=గోష్ఠమృత్తు ( ) (గ్రోమయము) తోడి స్నానము ఆదిత్యనక్షత్రము పునర్వసువునకు, మంగళాగురు, కాంత=తెల్లగరిక యనువానితో స్నానము, (పుష్యమికి) సర్వౌషధులు పంచ గవ్యము తెల్లవడ్లు (శాలిధాన్యము) తెల్లఆవాలు సర్వగంధములు శుభములు. తిష్యస్నానమునకు పుట్టమన్నుతో స్నానమాశ్లేషకు మఘకు తిలలతోడి దేవనిర్మాల్యస్నానము, పూర్వఫల్థునికి పచ్చగడ్డి (శాద్వలము) ఉప్పునెయ్యి, ఉత్తరఫల్గుని, (ఉత్తరకు) శింబి=తంబతీగ ముస్త=తుంగముస్తలు ప్రియంగువులతోడిది స్నానము. హస్తకుపర్వతాగ్రమందున్న సరస్సులోని మట్టినీటితో స్నానము, చిత్రకు దేవనిర్మాల్యము, స్వాతికి, జలములందు పుట్టిన పువ్వులు, విశాఖకురౌద్ర=చందన పద్మకోదకములు, అనూరాధకు నదియిరుగుగట్టుల మన్నుతోడి నీరు, జ్యేష్ఠకు సువర్ణసహితజ్యేష్ఠోదకము =అరటిఆకులోని, నీరు మూలకుసువర్ణసహితజలములు అప్యమునకు = అభ్ధేపతాకమైన పూర్వాషాఢకు ముత్యాలనీరు, వైశ్వదేవమునకు (ఉత్తరాషాఢకు) పద్మకము = చంగల్వకోష్టు ఉశీనరము =వట్టివేరు చందనముగలిపిననీరు, అభిజిత్తునకు పూర్వాభాద్రమునకు శ్రీవాసకము = సరళ##దేవదారు కాంతా = తెల్లగరికలు, పురుహుతము (పురువనంతము) కొడిసి పాలతోడి ఉదకమును అహిర్ఛుధ్న్యము=ఉత్తరాభాద్రకు-చెంగ్వకోష్ఠ వట్టివేరు కుంకుమ పువ్వు చందనము, అగరు పచ్చకర్పూరము తోడి స్నానము, పూష దేవతాకమగురేవతికి దర్భమూలములతోడి వసపు మ్రానివసవు చందనము కలిపిననీరు. అశ్వనికి నాగ=నాగగన్నేరు, పొన్నేరు, మదవంతిక=మల్లి క్షేద్ర=తేనెయు కలిపిననీరు. యామ్యమందు=యమదేవతాకనక్షత్రమగు భరణియందు సురాహ్వకాష్ఠము=దేవదారు. రంనీద్వయం=మ్రాని వసువు కస్తూరి పసుపుపసకలిపిననీటితో స్నానము శుభప్రదము శాంతికరము.

ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణమందు ప్రధమఖండమున గ్రహనక్షత్రస్నాన విధియను తొంబదియొకటవ అధ్యాయము

Sri vishnudharmothara Mahapuranam-1    Chapters