Sri vishnudharmothara Mahapuranam-1    Chapters   

ఎనుబదిమూడవ అధ్యాయము-కాలావయవదేవతామహాత్మ్యము

మార్కండేయ ఉవాచ :-

ఉత్తరం త్వయనం దివ్యం, పైత్ర్యంస్యా ద్దక్షిణాయనమ్‌ |

వసస్తశ్చాగ్ని దైవత్యః శాక్రోగ్రీష్మ ఉదాహృతః || 1

వైశ్వదేవీ తధాప్రావృట్‌ ప్రాజాపత్యా శరత్‌ స్మృతా |

హేమంతో వైష్ణవః ప్రోక్తో మారుత శ్శిశ్శిరః స్మృతః | 2

త్వాష్ట్ర శ్చైత్రస్తు వైశాఖోమాస శ్చైవాగ్ని దైవతః |

జ్యేష్ఠ శ్శాక్ర స్స్మృతో మాస ఆషాఢో వైశ్వదైవతః || 3

శ్రావణో విశ్వదైవత్యః ఆజో భాద్రపద స్తధా |

అశ్వయుక్తా77శ్వినో నామ ఆగ్నేయః కార్తికస్మృతః || 4

మార్గశీర్ష స్తథా సౌమ్యః పౌష స్స్యాజ్జీవదైవతః |

పైత్ర్యోమాస స్స్మృతో మాఘః ఫాల్గునో భగదైవతః || 5

మాసేషు మాసదై పత్యాః శుక్లపక్షాః ప్రకీర్తితాః | పక్ష్యామి కృష్ణపక్షాణాం దైవతాని తవానఘ! || 6

చైత్రో యామ్య స్స్మృతో రాజన్‌ ! ఆగ్నేయ శ్చా ప్యన న్తరః |

జ్యేష్ఠో రౌద్రస్స్మతః పక్షః త్వాషాఢ స్సార్ప ఉచ్యతే || 7

పైత్రశ్చ శ్రావణోమాసః సావిత్ర శ్చాప్యనన్తరః |

మైత్రశ్చాశ్వయుజో మాసః శాక్ర శ్చప్యగ్నిదై వతః || 8

తధాచ నైరృత స్సౌమ్యః పౌషస్స్యా ద్విష్ణుదైవతః |

వారుణశ్చ తధా పైత్రః ఫాల్గునః పౌష్ణ ఉచ్యతే || 9

అతః పరం ప్రవక్ష్యామి యద్దేవో యద్గ్రహ స్స్మృతః | అగ్ని రర్కస్స్మృతస్సోమో వరుణః పరికీర్తితః ||

అంగారకః కుమారశ్చ బుధ శ్చ భగవాన్‌ హరిః | బృహతిస్స్మృత శ్శక్ర శ్శుక్రో దేవీ చ పార్వతీ || 11

ప్రజాపతి శ్శనైశ్ఛారో రాహు ర్‌జ్ఞేయో గణాధిపః | విశ్వకర్మా స్మృతః కేతు ర్యేగ్రహాస్తే పురః స్మృతాః || 12

మార్కండేయ ఉవాచ :

ఆతః పరం ప్రవక్ష్యామి తవ నక్షత్ర దేవతాః | కృత్తికా చాగ్ని దైవత్యారోహిణ్యర్కేశ్వరా స్స్మృతా || 13

ఇంద్రరః సౌమ్యదైవత్యో రౌద్రీ ఆర్ద్రా తథా స్మృతా | పునర్వసు స్తదా దిత్యో పుష్యశ్చ గురుదైవతః || 14

అశ్లేషా సర్పదైవత్యా మషూచ పితృదై వతా | భాగ్యాశ్చపూర్వ ఫాల్గున్యః ఆర్యమాశ్చ తధోత్తరాః || 15

సావిత్ర శ్చతధా హస్త శ్చిత్రా త్వాష్ట్రీ ప్రకీర్తితా | స్వాతి శ్చ వాయుదైవత్యా నక్షత్రే పరికీర్తితా || 16

ఇంద్రాగ్ని దైవతా ప్రోక్తా విశాఖా యదునందన ! | మైత్ర మృక్ష మనూరాధా శాక్రం జ్యేష్ఠా ప్రకీర్తితా || 17

తధా నెరృత్య దైవత్యో మూలశ్చ తదుదా హృతమ్‌ |

ఆప్యస్త్వాషాఢ పూర్వాస్స్యు శ్చోత్తరా వైశ్వదైవతాః || 18

బ్రాహ్మీ చై వాభిజిత్‌ ప్రోక్తాశ్రవణో వైష్ణవణో వైష్ణవ స్స్మృతః | వాసవం చ తదా ఋక్షల ధనిష్ఠా ప్రోచ్య తే బుధైః || 19

తధా శతభిషక్‌ప్రోక్తం నక్షత్రే వారుణం నృప | ఆజం భద్రాపదాపూర్వా అహిర్బుధ్న్యం తధో త్తరా || 20

పౌష్ణం చ రేవతీ చా ర్‌ష్ణ మశ్వినీ చాశ్విదై వతమ్‌ | భరణ్య శ్చ తధా యామ్యం ప్రోక్తాస్తే ఋక్ష దేవతాః || 21

బ్రహ్మా ప్రజాపతి ర్విష్ణుః యమస్సోమ స్తదైవచ | కుమారో మునయ స్సప్త హ్యష్టౌ చ మనవ స్తధా || 22

పిశాచశ్చతధా థర్మో రుద్రాశ్చైకాదశ స్మృతాః | ఆదిత్యా ద్వాదశ తధా కామధేవ స్తధైవచ || 23

యక్షార్యపితరశ్చైవ ప్రతిపత్‌ పభృతిః నృప! | తిధీశ్వరాః తథాప్రోక్తాః వరణా న్నామతః శృణు! || 24

తిధ్యర్ధ భోగి కరణం సదా పతి చపార్థివ ! స్థిరాణి తేషాం చత్వారి సప్త విద్ధి చరాణి చ || 25

ఉత్తరాయణము దివ్యము (దేవతలకు సంబంధించినది) దక్షిణాయనము పైత్ర్యము (పితృదేవతలకు సంబంధించినది) ఇందు ఋతువులువసంతము అగ్ని దైవత్యము గ్రీష్మము శాక్ర (ఇంద్ర) దైవత్యము వర్షఋతువు వైశ్వదైవత్యము (విశ్వేదేవదైవత్యము) శరదృతువు ప్రాజాపత్యము (ప్రజాపతి దైవత్యము) హేమంతము విష్ణు దైవత్యము. శిశిరరుతువు వాయు దైవత్యము. చైత్రమాసమునకు దైవతము త్వష్ట. వైశాఖమునకు అగ్ని జ్యేష్టమునకు ఇంద్రుడు ఆషాఢమునకు వైశ్యదేవులు శ్రావణము నకు విశ్వేదేవతలు భాద్రపదమునకు అజుడు అశ్వయుజమునకు అశ్వనీ దేవతలు కార్తీకమునకు ఆగ్నేయుడు (కుమారస్వామి) మార్గశిరమునకు సోముడు పుష్యమాసమునకు గురువు మాఘ మాసమునకు పితృ దేవతలు ఫాల్గున మునకు భగుడు ననువారు దేవతలు. ఈ చెప్పిన మాసములందీ చెప్పినవారు శుక్లపక్షాధి దేవతలు. ఇక చైత్రమాస కృష్ణ పక్ష దేవత యముడు. వైశాఖమునందగ్ని. జ్యేష్ఠమున రుద్రుడు ఆషాఢమున నాగుడు శ్రావణమున పితృదేవతలు భాద్రపదమున సవిత అశ్వయుజమున మిత్రుడు కార్తీకమునందగ్ని మార్గశిరమున నిరృతి పుష్యమున విష్ణువు మాఘమున పితరులు పాల్గునమున పూష. ఇక నేగ్రహ మేదేవతాకమో తెల్పెద. సూర్యునకు అగ్ని, చంద్రునకు వరుణుడు, కుజునకు కుమారస్వామి బుధునకు హరి, గురునకు శక్రుడు, శుకృనకు పార్వతీదేవి, శని ప్రజాపతి, రాహువునకు గణాధిపతి, కేతువువిశ్వకర్మ.

ఇక నక్షత్రదేవతలందెల్పెద. కృత్తిక అగ్ని దైవత్యమురోహిణి అర్కేశ్వర (సూర్యదైవత్యమన్నమాట) మృగశిర సోమ దైవత్యము అర్ద్రరుద్రదేవతాక ముపునయ్యసు ఆదిత్యదైవత్యముపుష్యమి గురుదైవత్యముము అశ్లేషసర్పదైవత్యము మఘ పితృదైవ త్యము పూర్వఫల్గుని (పుబ్బ) భగదేవతాక. ఉత్తరఫల్గుని అర్యమ దేవతాకము. హస్త సవితృ దేవతాకముచిత్త త్వాష్ట్రి (త్వష్ట్రదేవతాక) స్వాతి వాయుదైవత్యము విశాఖ ఇంద్రాగ్ని దైవత్యము అనూరాధ మిత్రదైవత్యమా జ్యేష్ఠ శక్రదైవత్యము మూల నిరృతి దేవతాకముపూర్వాషాఢ అబ్దేవతాకమ ఉత్తరాషాఢ విశ్వేదేవదైవత్యము అభిజిన్నక్షత్రము బ్రహ్మదేవతాకము. శ్రవణము వైష్ణవము ధనిష్ఠ ఇంద్ర దైవత్యము శతభిషము వరుణదేవతాకము. పూర్వాభాద్ర అజదేవతాకము ఉత్తరాభాద్ర అహిర్బుద్న్య దేవతాకము. రేవతి పూషదైవత్యము అశ్విని అశ్వినీదేవతాదైవత్యము భరణి యమదేవతాకము. తిధులకు వరుసగా బ్రహ్మ ప్రజాపతి విష్ణువు యముడు సోముడు కుమారుడు సప్తర్షులు (కశ్యప-అత్రి-భరద్వాజ-విశ్వామిత్ర-గౌతమ-జమదగ్ని-వశిష్ఠు) అష్టమనువులు, పిశాచధర్ముడు, ఏకాదశరుద్రులు ద్వాదశాదిత్యులు, కామరేవుడు. యక్షులు, పితరులు పాడ్యమి యొదలుకొని తిథులకు అధిపతులు. ఇక కరణముల పేరువినుము. తిథిలో సగముభాగము కరణము.

అంతే కృష్ణ చతుర్దశ్యాం ద్వితీయే శకుని స్స్మృతః | ప్రథమే పంచ దశ్యర్థే కృష్ణే ప్రోక్తం చతుష్పదమ్‌ || 26

తసై#్యవ చాపరే రాజన్‌ | నాగాఖ్యం కరణం మతమ్‌ | శుక్ల త్రిపదార్దేతు కింస్తుఘ్వం కరణం మతమ్‌ || 27

ఏతాని రాజన్‌ ! ప్రోక్తాని స్థిరాణి కరణాని తు | కలిర్థర్మ స్తథా సప్తో యేషాం వాయుశ్చ దైవతమ్‌ || 28

శుక్ల ప్రతిపదార్థేతు ద్వితీయే యదునం దన ! || 29

పంచమ్యాంచ తథా హ్యర్ధే త్వష్టమ్యాంచ తథా పరే | ద్వాదశ్యర్థే తథా పూర్వే పౌర్ణ మాస్యాం మథా పరే || 30

కృష్ణ పక్ష చతుర్థ్యాం తు ప్రధమే7ర్థే తధై వచ | సప్తమ్యాం చాపరే త్వర్థె హ్యేకాదశ్యాం తధా ద్యకే || 31

కరణంతు బవం నామ కథితం శక్ర దైవతమ్‌ | ద్వితీయార్థే తథా77ద్యేతు పంచ మ్యర్థే తధా పరే || 32

నవమ్యర్థే తథా పూర్వే ద్వాదశ్యర్థే తథా పరే | కృష్ణ ప్రతిపదా ద్యర్థే చతుర్థ్యర్థే తథా పరే || 33

అష్టమ్యర్థే తధాపూర్వే హ్యేవాదశ్యాం తధా పరే | బాలవం నామ కరణం కధితం బ్రహ్మదై వతమ్‌ || 34

శుక్లపక్షే ద్వితీయార్థే షష్ఠ్యర్ధే ప్రథమే తధా | నవమ్యర్ధే తధై వాన్తే త్రయోదశ్యాం తథా77ద్యవే || 35

కృష్ణ ప్రతిపదార్ధేతు పంచమ్యాం ప్రథమే తధా | ర్వితీయార్ధే తధాష్టమ్యాం ద్వాదశ్యాం ప్రధమే తధా || 36

కౌలవం నౌమ! కరణం కధితం మిత్ర దైవతం | ఆద్యే శుక్ల తృతీయార్ధే షష్ఠ్యర్ధ్యేచ తధా పరే || 37

కృష్ణ ద్వితీయా ప్రధమే పంచమ్యర్ధే తధా పరే | నవమ్యర్ధే తధా పూర్వే ద్వాదశ్యర్ధే తధాపరే || 38

తౌతిలం నామ కరణమార్యవ్ణుం కధితం బుధైః | అంతే శుక్ల తృతీయార్ధే సప్త మ్యాం ప్రధమే తధా || 39

దశమ్యర్ధే తధైవాన్తే చతుర్దశ్యాం తధాద్యకే | కృష్ణపక్ష ద్వితీయా స్తే షష్ఠ్యర్ధే ప్రథమే తధా || 40

నవమ్యాంచ తధై వాన్తే త్రయోదశ్యాం తధాద్యవే | గరౌభిధానం కరణం పృధివీదైవతమ్‌ స్మృతం || 41

భక్లపక్ష చతుర్థ్యర్ధె సప్తమ్యాం చ తధా పరే | ఏకాదశ్యాం తధా పూర్వే చతుర్ధశ్యాం తధా పరే || 42

కృష్ణ తృతీయా ప్రథమే షష్ఠ్యర్ధే చ తధా పరే | దశ మ్యర్ధే తధా పూర్వే త్రయోదశ్యాం తధా పరే || 43

వణిజం నామకరణం శ్రీదేవ మభి ధీయతే | శుక్లపక్షే చతుర్థ్యం న్తేహ్యష్టమ్యం ప్రథమే తధా || 44

ఏకాదస్య పరే చార్ధే పౌర్ణమాస్యాం తధాద్యకే | అంతే కృష్ణతృతీయార్ధే సప్తమ్యాం ప్రధమే తధా || 45

ద్వితీయే చ దశమ్యర్దే చతుర్దశ్యాం తధాద్యవే | విష్టిరిత్యేవ కరణం కథితం మృత్యు దైవతమ్‌ || 46

సర్వ కర్మసు రాజేంద్ర ! సర్వదా గర్హితం చ తత్‌ |

చతుర్వింశత్యహో రాత్రే రాజన్‌ ! హోరాః ప్రకీర్తితాః || 47

గ్రహేశ##దేవ గంధర్వ నాగ యక్షే శ్వర ప్రభాః | సూర్యోదయా దథా77రభ్య దినపాద్యాః క్రమేణతాః || 48

షష్ఠక్రమేణ చ తథా క్రమం తాసాం నిబోధ ! మే | ఆర్కశు శ్రుక్రర్జ్క రాత్రీశ సౌరజీవ కుజేశ్వరాః || 49

సర్వాసాం చ తధా కాలం రాహుర్భం క్తే మహా గ్రహః | కులికశ్చ తధానాగో యక్షః పద్మో7తి విశ్రుతః || 50

అంగార వర్ణశ్చ తథా గంధర్వ శ్చాభి ధీయతే | కులికస్య తు యా వేలా సావర్జ్యా సర్వ కర్మసు || 51

తస్యాం భుక్తేమహావ్యాధిః విషం భుక్తం స జీర్యతే | ప్రత్యోక్షమపి తార్‌క్షస్య తస్యాం దష్టోన జీవతి || 52

భుక్తం తస్యాం తు భైషజ్యం న తు కార్యకరం భ##వేత్‌ | సాతు కాలవిదా జ్ఞేయా మంత్రిణా భిషజా తధా || 53

అవిజ్ఞాయ తు తాం వేలాంత్రయస్తే రాజపుంగవ ! | వైఫల్య కరణా న్మూఢాః ప్రాప్నువ న్త్యయశో మహత్‌ || 54

ప్రత్యేకసై#్యవ వేలాయాం రాహో ర్భోగం నిబోధ మే | ఏకై కాతు భ##నే ద్దోరా సార్ధం విఘటి కా శతమ్‌ || 55

వినాడికా స్సప్తషష్ట్యా రవేష్టోడిశ కీర్తితాః | హోరాకులిక కాలస్తు శేషః కాలో రవే స్స్మృతః || 56

స్వహోరాన్తే తధావే లా శ్చతస్రస్తు వినాడికాః | రాహో శ్చక్రస్య కథితాః శేషః కాల స్సి స్యచ 57

సామ్యహోరా సమారంభే చషకౌద్వౌ ప్రకీర్తితౌ | హోరాకుళిత వేలాతు శేషః కాలో బుధస్య చ || 58

ఏక సప్తతి ముల్లంఘ్య హోరాయాం తునిశాధృతః | అష్టౌతు కులిక స్యోక్తాః శేషఃకాలో నిశా భృతః || 59

షడశీతి మతిక్రప్య చషకా స్రవిజస్య తు | యచ్ఛేష స్త ద్వినిర్ది ష్టః కాలస్తు కులికస్య చ || 60

సప్త సప్త త్యతిక్రమ్య సా ర్ధాంస్తు చషకాన్‌ గురౌ | రాహోస్తు చషకోహోరా శేషకాలో గురో ర్మతః || 61

భౌమ హోరా సమారంభే ద్వాత్రింశత్తు వినాడికాః | వేలాతు కులికస్యోక్తా శేషః కాలః కుజస్య తు || 62

జీవ జ్ఞ శుక్ర హోరాసు సర్మ కర్మాణి కారయేత్‌ | క్రూరాసుచ తధా7న్మాసు న కించి త్కులికస్య చ || 63

అతః పరం ముహూర్తానాం దైవతాని నిబోధమే | సర్వర్‌క్షణి వివర్తన్తే హ్యహోరాత్రేణపార్థివ | 64

సతతం తే వినిర్దిష్టాః ముహూర్తా స్త్రింశ దేవతు |

వజ్ర ఉవాచ :

ఆష్టావింశతి రుక్తాని త్వయాతాని మమా7నఘ| 65

త్రింశ న్ముహూర్తాశ్చ కథం త ఏవ ద్విజసత్తమ

ఇక కరణముల విషయమను బపబాలక కౌలపతైతుల, గరజ, వణజి, ఛద్ర, శకునిచతుష్పాత్‌ నాగవము కింస్తుఘ్నము అనుపదునొకండు కరణములలో నాలుగు స్థిరకరణములు, మిగిలినయేడును చరకరణములు. తరణమొక్కొకడు తిథిలో సగము వ్యాపించును. తిధిని పూర్వార్థము ఉత్తరార్థము అని రెండు భాగములు చేయగా కృష్ణచతుర్దశియొక్క రెండవ అర్థమున శకుని, పంచదశి అనగా అమానాస్య పూర్వార్ధమున నాగవము, అమావాస్య ఉత్తరార్థమున చతుష్పాత్‌, శుక్లపాడ్యమియొక్క పూర్వార్థమున కింస్తుఘ్నము నుండును. ఓరాజా! ఇవి స్థిరకరణములవ్యాప్తి ప్రకారము ఈ నాల్గింటిని వరుసగా కవి, ధర్ముడు, సర్పములు, వాయువు, ఆదిదేవతలు శుక్లపక్ష ప్రతిపత్తు పంచమి, అష్టమి ఈతిధుల ఉత్తరార్థమునందును, ద్వాదశిపూర్వార్థమునందును, పూర్ణిమ ఉత్తరార్థమునందును, కృష్ణపక్ష చతుర్థి పూర్వార్థమునందును, సప్తమి ఉత్తరార్థమునందును, ఏకాదశి పూర్వార్థమునందును. బవ అను కరణముండును. ఈ కరణమునకు ఇంద్రుడధిదేవత. విదియయొక్క పూర్వార్ధమునందును, పంచమి ఉత్తరార్థమునందును నవమి పూస్వర్ధమునందును ద్వాదశి ఉత్తరార్ధమునందును కృష్ణప్రతిపత్తు పూర్వార్థమునందును చతుర్థి ఉత్తరార్థము నందును. అష్టమి పూర్వార్ధమునందును ఏకాదశి ఉత్తరార్థమునందును బాలవ అను కరణముండును. ఈ కరణమునకు బ్రహ్మ ఆదిదేవత. శుక్లపాక్షమున విదియ షష్టుల పూర్వార్థము నందును నవమి ఉత్తరార్ధము నందును త్రయోదశి పూర్వార్దము నందును కృష్ణ పక్షముల పాడ్యమీ పర్వముల పూర్వార్ధము నందును అష్టమీ ఉత్తరార్ధము నందుకు త్వాదశి పూర్వర్థము నందును కౌలవ కరణముండును. దీనికి మిత్రుడు అధిదేవత. శుక్లపక్షమున తదియ పూర్వార్థమున షష్టి ఉత్తరార్ధమున కృష్ణ పక్షమున విదియ పూర్వార్ధమున పంచమీ ఉత్తరార్దమున నవమి పూర్వార్థమున ద్వాదశి ఉత్తరార్ధమున తైతులకరణ ముండును. దీనికి అర్యము డధిదేవత. శుక్లపక్షమున తదియ ఉత్తరార్ధమున సప్తమి పూర్వార్ధమున ధశమి ఉత్తరార్ధమున, చతుర్దశి పూర్వార్ధమున, కృష్ణపక్షమున విదియ ఉత్తరార్ధమున షష్టి పూర్వార్ధమున వవమి ఉత్తరార్ధమున, త్రయోదశి పూర్వార్ధమున గరము (శరజి) అనుకరణముండును. దీనికి పృధివి అధిదేవత, శుక్లపక్షమున చతుర్థీ సక్తుముల ఉత్తరార్ధమున, ఏకాదశి పూర్వార్ధమున, చతుర్దశి ఉత్తరార్ధమున, కృష్ణపక్షమున తదియ పూర్వార్ధమున షష్ఠి ఉత్తరార్ధమున దశమి పూర్వార్థమున త్రయోదశి ఉత్తరార్ధమున వణిజ కరణముండును. దీని కధిదేవత శ్రీదేవి. శుక్లపక్షమున చతుర్ధి ఉత్తరార్థమున అష్టమి పూర్వార్థమున ఏకాదశి ఉత్తరార్థమున పూర్ణిమ పూర్వార్థమున కృష్ణపక్షమున తదియ ఉత్తరార్దమున సప్తమి పూర్వార్దమున దశమి ఉత్తరార్ధమున చతుర్దశి పూర్వార్థమున విష్టికరణము. దీనికి మృత్యువు అధిదేవత. ఈ కరణము అన్ని కర్మలయందును నింద్యమైనది. (ఇచట చెప్పిన తిధులలోనే మరల మరల వేరు వేరు కరణములవచ్చు నట్లు చెప్పబడినవి. ఇది సిద్థాంత గణితము ప్రకారము సరియైన యంశ##మే)

ఇక హోరల విషయము - ఒక్కొక్క అహోరాత్రమందు ఇరువదినాలుగు హోరలుండును. (హోర=hour) అనగా ఒక్కొక్క హోర పరిమాణము రెండున్నర గడియలు. సూర్యోదయారంభము మొదలుకొని మొదటి ఆరు హోరలకును సూర్యడు దేవతలు, గంధర్వులు, నాగులు, కుబేరుడు, ప్రభ అనువారు ప్రతి ఆరేసి హోరలకును వరుసగా అధిదేవతలు. ఏనాడు ఏ హోరను గణనచేయవలెనో ఆ హోరను నిర్ణయించు క్రమము చెప్పబడుచున్నది :-

మనము ఏ వారమందు ఏ హోరను చూడవలెనో ఆవారపు అధిపతి అనాటి మొదటి హోరకు అధిపతి యగును. ఆక్రమమున ఆదివారమున మొదటి హోరకు సూర్యుడు అధిపతి. ఇట్లు సూర్య శుక్ర బుధ చంద్ర శని బృహస్పతి కుజులు ఒకేనాడు ఎన్నోమారులు హోరాధిపతులుగ ఆవృత్తిపొందుచుందురు. అన్ని హోరల కాలవిశేషమును రాహువు, కులికుడు, నాగుడు యక్షులు పద్ముడు, అంగారపర్ణుడు గంధర్వుడు ననువారు తమ తమ భుక్తులుగ ననుభవింతురు. వీరిలో కులికుని సమయము అన్ని కర్మల యందును వర్జ్యము. కులికుని వేళయందు తినిన అహారము వ్యాధినికల్పించును. విషమును ఆసమయమున తినినచో జీర్ణముకాదు. ఆసమయమున నెవ్వరినైన పాము కరిచినయెడల వాని యెదుట గరుత్మంతుడే వచ్చినను ఉపయోగకారికాడు. అసమయములో తినిన ఔషధము ఫలితమునీయదు. కనుక దైవజ్ఞులు, మాంత్రికులు, వైద్యులునుకులీకవేళను బాగుగ గుర్తించియుండవలెను. ఏలయన ఈ మువ్వురును దీనిని తెలీయకపోవుటచే తాము చేసిన పనులు విఫలములై మూఢులని యనిపించుకొని యెంతయో అపకీర్తికి గురి యగుదురు. ప్రతియొక్క వేళయందును రాహువు మున్నగువారి భుక్తికాలముల నెరింగించెద. అలకింపుము.

ప్రతియొక గ్రహముయొక్క హోరయందును రాహుభుక్తికాలము కొంతగలదు. అదియెట్లనగా - ఒక్కొక్క హోర నూట ఏఖది విఘడియల పరిమాణముగలది. అందుమొదటినుండి నూరు విగడియల మీద అర్ధ విఘటక వరకు రాహుభుక్తికాలము.

ఇక ప్రత్యేక గ్రహముల హోరల విషయమున ఆ గ్రహముయొక్క భుక్త్యంశమును కుళికాంశమును వేరుపరచి తెలుసు కొమవిధానము--రవి హోరయందు మొదటి అరువదిఏడు విగడియలు రవి భుక్తి కాలము. మిగిలిన యెనుబదిమూడు విగడియలు దానిలోని కుళికకాలము. శుక్ర హోరయందు చినరి నాలుగు విగడియలు శుక్రుని భక్తికాలము. మిగిలిన కాలము నూట నలుబది విగడియలు కుళిక కాలము. బుధ హోరయొకద అరంభమునందలి రెండు విగడియల(చషక) కాలము కుళికభుక్తికాలము. మిగిలిన నూటనలుబది యెనిమిది విగడియలు బుధ భుక్తికాలము. చంద్రహోరయందు మొదటి విగడియ నుండి డెబ్బదియొక్క విగడియలు గతించిన పిదప వచ్చు నెనిమిది విగడియలు మాత్రము కుశికి భుక్తి. దానికి నిటునటు గల మొత్తము నూటనలుబదిరెండు విగడియలును చంద్రభుక్తికాలము. శని హోరయందు-మొదటి విగడియ నుండి యెనుబది యారు విగడియలు గతించిన పిదప వచ్చు ఆరు పదినాలుగు విగడియలును కుళికభుక్తి. అనగా నీమొదట యెనుబదియారు విగడియలకాలము కుజభుక్తి కాలము. గురుహోదయందు డెబ్బదియేడన్నర విగడియలవరకు గురుభుక్తికాలము తరువాతవచ్చు డెబ్బదిరెండున్నర విగడియలకాలమునుభకభుక్తి. కుజహోర యందు మొదట ముప్పదిరెండు విగడియలు కుళికభుక్తి. మిగిలిన నూటపదునెనిమిది విగడియలు కుజభక్తి, గురు, బుధ శుక్రుల హోరలయందు సర్వశుభకర్మలను చేయనగును. ఇతరములగు హోరలు క్రూర హోరలు అట్టి క్రూరలయందుగాని, ప్రతిహోద యందును కుళిక భుక్తికాలములోగాని యే కార్యములను చేయరాదు.

మార్కండేయ ఉవాచ :

దిన రాత్ర్యోస్సమారంభే హ్యర్ధం భవతి పార్థివ ! 66

తయోర్మధ్యే చ సతత మభిజి చ్ఛాభిధీయతే ! తయోర్ద్విత్వా సన్మయో త్రింశ న్ముహూర్తా విహితా స్తవ || 67

నక్షత్రైర్దైవతై స్తేషాం దేవతాః పరికీర్తితాః | కేవలం క్రమహానిశ్చ క్రమస్తేషాం నిబోధ మే || 68

రౌద్రస్సార్ప స్తధామైత్రః పైత్రో వాసవ ఏవచ | ఆప్యో వైశ్వ స్తధారాజస్‌ ! కేశ్వర శ్శక్రదైవతః || 69

ఐంద్రాగ్నే ¸°నైరృతస్తు వారుభ శ్చ్య మహీ యతే | ఆర్యవ్ణుస్తు తధా భాగ్యో ముహూర్తాస్తు దివాచరాః || 70

రౌద్రాజ దేవోహిర్బుధ్న్యాః పౌష్ణ శ్చాశ్విన ఏవచ |

యాయ్యోగ్ని దైవత శ్చైవ్ర బాహ్మ స్సౌమ్య స్తధైవచ || 71

ఆదిత్యో జీవ దైవత్యో వైష్ణవ స్సూర్య దైవతః |

త్వాష్ట్ర శ్చైవాధ వాయవ్యో ముహూర్తా రాత్రి చారిణః || 72

అహ్నః పంచ దశో భాగో రాత్రేశ్చ యదునందన! |

ముహూర్త సంజ్ఞః కధితో మునిభి స్తత్వ దర్శిభిః || 73

మహాకల్యా దధా రభ్య కాలావయవ దేవతాః | ఉక్తాస్తవ ముహూర్తాశ్చ తేషాం కాలే స్వకేర్చనమ్‌ || 74

మహాఫలం హి నిర్దిష్టం స్యా ద్వియోగే విశేషతః |

స్వాకాలే దేవతాః పూజ్యాః సోపచారై ర్విశేషతః |

తస్యా స్సకాశా ధ్ధర్మజ్ఞ ! కామయర్భి ర్మహ త్ఫలమ్‌ || 75

కాలే స్వకేయః ప్రయతస్తు భక్త్యా | దేవాన్‌ యధావత్సముపైతి రాజన్‌!

సపర్యయా తస్య దిశ న్తి దేవాః | ఫలా నిభీష్టాన్‌ నృఘ లోహితాక్ష! 76

ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే మహాపురాణ ప్రథమఖండే మార్కండేయ వజ్రసంవాడే కాలావయవ దైవతానాం మాహాత్మ్యవర్ణనం నామ త్ర్యశీతితమోధ్యాయః

ఇకమీదట ముహూర్తాధి దేవతల తెలిపెదను ఒక అహోరాత్రములో అన్ని నక్షత్రములును అవృత్తి చెందుచుండును. కాని ఈ మొత్తము అరువది గడియలకాలము ముప్పది ముహూర్తములేయగును. అని పలుకగా వజ్రుడిట్లు ప్రశ్నించెను. ఓ అనఘా! నక్షత్రములు అభిజిత్తుతో కూడ ఇరువది యెనిమిది నక్షత్రములని మీరు చెప్పియుండిరి. అవియే ముప్పది ముహూర్తములు లెట్లగును? మార్కండేయుడిట్లు బదులుచెప్పెను. ఓ రాజా! అభిజిత్తు అను నక్షత్రము (వాస్తవమున నిది నక్షత్రము కాదు. కాలవిశేషమును పూర్వులు నక్షత్రముగ చెప్పినారు (పగటి ఆరంభమున రాత్రి యారంభమున రాత్రింబగళ్లు మధ్యకాలమున నుండు కాలవిశేషమే అభిజిత్‌ అని చెప్పబడును. ఈ మొత్తము కాలమును మూడు భాగములచేసి, రాత్రియారంభమున మూడింట ఒక వంతును పగట యారంభమున మూడింట ఒక వంతును దినార్ధ రాత్ర్యర్ధకాలమందలి రెండంశములను కలసి మూడింట ఒక వంతును కాగా అభిజిత్తుమూడు భాగములగుచున్నది. ఇట్లు ఈ యిరువది నక్షత్రములే ముప్పది ముహూర్తములగును. నక్షత్రముల అధి దేవతలే ముహూర్తములకును నధి దేవతలు లేకలమువారి క్రమము మాత్రము మారును. ఎలనగా - పగటిముహూర్తములకు రుద్రులు సర్పములు, మిత్రుడు, పితరులు, వసువులు జలములు, విశ్వులు, అభిజిత్‌, బ్రహ్మ, వరణుడు, ఇంద్రుడు, ఇంద్రాగ్నులు, నిర్వతి వరుణుడు, అర్యకూభగుడు అనువారు.

ఇక రాత్రిముహూర్తములకు-శివుడు, అజైవపాత్‌, అహిర్భుధ్న్యుడు శూష, అశ్వినులు, యముడు, అగ్ని, బ్రహ్మ సోముడు, ఆదిత్యుడు బృహస్పతి, విష్ణువు సూర్యుడు, త్వష్టవాయువు. అనువారును ఒకటినుండి పదునైదు వరకు అయా ముహూర్తములకు అధిపతులు. కాల తత్త్వకేత్తలగు మునులు ఏగుటని రాత్రిని వేరు వేరుగా పదునైదేసి భాగములు చేయగా రెంతేసి గడియలతో( 48 నిముషములతో) నేర్పడు కాల విభాగమును ముహూర్తమని నిర్దేశించిరి. ఈవితము గ ఓ రాజా! నీకు మహాకల్యము అనగా ఉషఃకాలపు ప్రధమక్షణము మొదలు గణన నియగా నేరుడు కాలాంశములగు ముహూర్తములను వాని యధి దేవతలను తెల్పితిని. ఆయాముహూర్తముల యధిదేవతలనెరిగి ఆయాదేవతలనుగాని ఆయాముహూర్తాధి దేవతల మిత్రకోటలోని దేవతలనుగాని వారి వారి సొంతముహూర్తములందు అర్చించుటవలన విశేషఫలమునలుగును. వ్యాధులు మున్నగు ఆపదల నివారణకై చేయు అర్చనలు ఇంకను విశేషఫలముల నిచ్చును. కావున ఆయా దేవతలను అన్ని ఉపచారములతో వారివారి స్వముహూర్తకాలమందు అర్చించుట యనునధి ఆయుదేవతలనుండి మహా ఫలముల కాక్షించువారు చేయవలసిన పని. ఓ లోహితాక్షా! ఎవరు ఆయా దేవతలను వారి ముహూర్తములందు విధి విధానమున సర్వోపచారములతో సేవింతునో, వారికాయా దేవతలు అభీష్టఫలముల నిత్తురు.

ఇది విష్ణుధర్మోత్తర మహాపురాణమున ప్రధమఖండమున కాలావయవ దేవతలమత్య వర్ణనమను ఎనుబదిమూడవ అధ్యాయము

Sri vishnudharmothara Mahapuranam-1    Chapters