Sri vishnudharmothara Mahapuranam-1    Chapters   

డెబ్బదియైదవ అధ్యాయము - మన్వంతర వర్ణనము

వజ్ర ఉవాచ :

మన్వంతరే పరిక్షిణ యాదృశీ ద్విజ ! జాయతే | సమవస్థా మహాభాగ ! తాదృశీం వక్తు మర్హసి || 1

మార్కండేయ ఉవాచ :

మన్వంతరే పరిక్షీణ దేవా మన్వంతరేశ్వరాః | మహర్లోక మథా೭೭సాద్య తిష్ఠన్తి గత కల్మషాః || 2

మనుశ్చ సహశ##క్రేణ దేవాశ్చ యదునందన ! | బ్రహ్మలోకం ప్రపద్యన్తే పునరావృత్తి దుర్లభమ్‌ || 3

ఋషయశ్చ తథా సప్త తత్ర తిష్ఠన్తి తే సదా | అధికారం వినా సర్వే సదృశాః పరమేష్ఠినః || 4

భూతలం సకలం వజ్ర ! తోయరూపీ మహేశ్వరః | ఊర్మిమాలీ మహావేగః సర్వమావృత్య తిష్ఠతి || 5

భోలోక మాశ్రితం సర్వం తదా నశ్యతి యాదవ ! | సవినశ్యన్తి రాజేంద్ర ! విశ్రుతాః కులపర్వతాః || 6

మహేంద్రో మలయః సహ్యఃశు క్తిమానృక్షవానపి | వింధ్యశ్చ పారియాత్రశ్చ మాల్యవాన్‌ గంధమాదనః || 7

హిమవాన్‌ హేమకూటశ్చ నిషధో నీల ఏవచ | శ్వేతశ్చ శృంగవాన్‌ మేరు ర్నవినశ్యన్తి పర్వతాః || 8

శేషం వినశ్యతి జగత్‌ స్థావరం గమంచయత్‌ | నౌర్భూత్వాతు సతీ దేవీ తదాయదుకులోద్వహ ! || 9

థారయత్యథ బీజాని సర్వాణ్యవావిశేషతః | భవిష్యశ్చ మను స్తస్యాం భవిష్యా ఋషయ స్తధా || 10

తిష్ఠన్తి రాజశార్దూల ! సప్తయే ప్రథితా భువి ! మత్స్యరూపధరో విష్ణుః శృంగీ భూత్వా జగత్పతిః || 11

అకర్షతి తు తాం నావం స్థానాత్‌ స్థానం స లీలయా | కర్షమాణంతు తం నావం దేవదేవం జగత్పతిమ్‌ || 12

స్తువన్తి ఋషయ స్సర్వే దివ్యైః కర్మభి రచ్యుతమ్‌ | ఘార్ణమాన స్తదా మత్స్యో జలవేగోర్మిసంకులే || 13

ఘార్ణమానాంతు తాం నావం నయత్యమిత విక్రమః | హిమాద్రి శిఖరం నావం దేవదేవో జగత్పతిః || 14

మత్స్యస్త్వదృశ్యో భవతి తేచ తిష్ఠన్తి తత్రగాః || 15

కృతతుల్యం తదా కాలం తావత్‌ ప్రక్షాలనం స్మృతమ్‌ |

ఆప స్సామ్య మధోయాన్తి యధాపూర్వం నరాధిప ! |

ఋషయశ్చమనుశ్చైవ సర్వం కుర్వన్తి తే తదా || 16

మన్వంతరాన్తే జగతా మవస్థౌ మయేరితా తే యదునందనాధ |

అతః పరం యత్తవ కీర్తనీయం సమాసత స్తద్వద భూమిపాల ! || 17

ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ప్రథమఖండే మార్కండేయ వజ్రసంవాదే మన్వంతరవర్ణనంనామ పంచ సప్తతి తమోధ్యాయయః.

వజ్రుండు మన్వంతరము గడుప నామీద నగు నయ్యవస్థావిశేష మాసతిమ్మన మార్కండేయు డిట్లనియె : మన్వంతర క్షీణ దశయందు మన్వతరాధిపతులు విగత కల్మషులు మహర్లోకమంది యందుందురు. మనువు దేవేంద్రుడు దేవతలును పునరా వృత్తిరహిత బ్రహ్మలోకమందుందురు. సప్తర్షులు నధికారము లేకుండ కేవలము బ్రహ్మతో సాదృశ్యమంది యచ్చట నుందురు. మహేశ్వరుడు జలరూపి భూతలమెల్ల తరంగమాలికల ముంచెత్తి మహావేగియై సర్వము నావరించియుండును. భూలోక మందున్నదెల్ల నశించును. కులపర్వతములు ప్రసిద్ధిగన్న మహాగిరులు మాత్రము నశింపవు. ఆ సంశింపని పర్వతములు మహేంద్రము మలయము సహ్యము శుక్తిమంతము ఋక్షవంతము. వింధ్యము పారియాత్రము మాల్యవంతయు గంధమాదనము హిమవంతము హేమకూటము నిషధము నీలము శ్వేతము శృంగవంతము మేరువు ననునవి. శేషించిన చరాచరజగమ్మెల్ల నశించును. వసుమతీదేవి యొక నౌకయై సర్వబీజధారణముసేసి (ధారణాద్ధరణియని పేరొంది) నిలుచును. ఆమె యందు కాబోవు మనువు సప్తర్షు లేడ్వురును నిలిచుయుందురు. విష్ణువు మత్స్యమూర్తియైన శృంగియై (కొమ్ముగొని) జగత్పతిగావున యా నావ నొక చోటు నుండి యింకొకచోటికి విలాసముగ నాకర్షించుచుండును. అట్టితరి నాయనను నా నౌకాకారయైన వసుంధరను హరుని ఋషులు దివ్య కర్మలచే సూక్తములచే స్తుతింతురు. జలవేగమున తరంగసంకులమయిన యా జలధియం దీదుచు నా మత్స్యమమిత విక్రమమున హిమాలయపర్వత శిఖరముచేర్చును. అంతలో నా మత్స్యమూర్తి యదృశ్యుడై యందున్న వారందరు నటనే యుందురు. కృతయుగ పరిమాణముగల కామట్లనే కడచును. దానికి ప్రక్షాళన మను పేరు గల్గును. నీరు సమస్ధితినిపొందును. సర్వ కార్యక్రమము నప్పుడు సర్వర్షులు షునుపుకూడ నిర్వహింతురు. యదుకుమార మన్వంతరము చివరి జగదవస్థ నీ కెరింగించితిని. ఈపైనేమి వర్ణింప వలయునది యడుగుము.

ఇది శ్రీవిష్ణు ధర్మోత్తర మహాపురాణమున ప్రథమఖండమున మన్వంతరవర్ణనమను డెబ్బదియైదవ యధ్యాయము.

Sri vishnudharmothara Mahapuranam-1    Chapters