Sri vishnudharmothara Mahapuranam-1    Chapters   

ఏబదియేడవ అధ్యాయము-భక్తిఫలప్రదర్శనము

రామ ఉవాచ :

అరాధ్యతే సభగవా& కర్మణా యేన శంకర! | తత్సమాచక్ష్వ | భగవ& ! సర్వసత్త్వసుఖప్రదమ్‌ || 1

శంకర ఉవాచ :

సాధురామ ! మహాభాగ ! సాధుదానవనాశన ! | యన్మాం పృచ్ఛసి ధర్మజ్ఞ ! కేశవారాధసం ప్రతి || 2

దివసం దివసార్ధంవా ముహూర్తంచైక మేవవా | నాశశ్చాశేష పాపస్య భక్తిర్భవతి కేశ##వే || 3

అనేకజన్మ సాహసై#్రర్నానా యోస్యస్తరేషుచ | జన్తోః కల్మషహీనస్య భక్తిర్భవతి కేశ##వే || 4

నాధన్యః కేశవంస్తౌతి నాథన్యోర్చయతి ప్రభుమ్‌ | నమత్యధన్యశ్చ హరింనాధన్యోపేత్తి మాధవమ్‌ || 5

మనశ్చ తద్ధి ధర్మజ్ఞ ! కేశ##వే యత్ర్పవర్తతే | సా బుద్ధి స్తద్ర్వతాయైవ సతతం ప్రతితిష్ఠతి || 6

సావాణీ కేశవం దేవం యాస్తౌతి భృగునందన ! | శ్రవణౌతౌశ్రుతా యాభ్యాం సతతం తత్కథా శ్శుభాః || 7

ఆవేహి ! ధర్మజ్ఞ ! తథా తత్పూజాకరణా త్కరౌ | తదేవం సఫలం కర్మ కేశవార్థాయ యత్కృతమ్‌ || 8

యతో ముఖ్యఫలావాప్తౌ కరణం సప్రయోజనం | మససాతేన కిం కార్యం యున్నతిష్ఠతి కేశ##వే || 9

బుద్ధ్యావా భార్గవశ్రేష్ఠ | తయానాప్తి ప్రయోజనమ్‌ | రోగస్సా రననా వాపి యయానస్తుయతే హరిః || 10

గర్తౌబ్రహ్మవ్రతౌ కర్ణౌ యాభ్యాంతత్కర్మ నశ్రుతమ్‌ | భారభూతై ః కరైః కార్యం తస్యనృపశోర్ద్విజ ! || 11

యైర్న సంపూజితో దేవః శంఖచక్ర గదా ధరః | పాదౌతౌ సఫలౌ రామ ! కేశవాలయగామినౌ || 12

తే చ నేత్రే మహాభాగ | యాభ్యాం సందృశ్యతేహరిః | కిం తస్య చరణౖః కార్యం కృతస్య నిపుణౖర్ద్విజ! || 13

యాభ్యాం న వ్రజతే జన్తుః కేశవాలయ దర్శనే | జాత్యంధతుల్యం తం మన్యే పురుషం పురుషోత్తమ ! 14

యోన పశ్యతి ధర్మజ్ఞ ! కేశవార్చాం పునః పునః | క్లేశసంజననం కర్మ వృథా తద్భృగు నందన ! 15

కేశవం ప్రతి యద్రామ ! క్రియతేహని సర్వదా ! పశ్య ! కేశవ మారాధ్య మోదమానం శచీపతిమ్‌ || 16

యమంచ వరుణంచైవ తధా వైశ్రవణం ప్రభుం | దేవేంద్రత్వ మతి స్ఫీతం సర్వభూతి స్మితం పదమ్‌ || 17

హరిభక్తి ద్రుమా త్పుష్పం రాజసాత్‌ సాత్వికం ఫలమ్‌ |

అణిమా మహిమా ప్రాప్తిః ప్రాకామ్యం లఘిమా తధా || 18

ఈశిత్వంచ వశిత్వంచ యత్ర కామవసాయితా | ఆరాధ్య కేశవం దేవం ప్రాప్యంతే నాత్ర సంశయః || 19

హత ప్రత్యంగ మాతంగే రుధిరారుణ భూతలే | సంగ్రామే విజయం రామ ! ప్రాప్యతే తత్ప్రసాదతః || 20

మహాకటితట శ్రోణ్యః పీనోన్నత పయోధరాః | అకలంక శశాంకాభ వదనా నీలమూర్ధజాః || 21

రమయన్తి సరం స్వప్నే దేవరామా మనోహరాః | సకృద్యే నార్చితో దేవో హేలయా వా నమస్కృతః || 22

వేదవేదాంగ వపుషాం మునీనాం భావితాత్మనాం | ఋషిత్వమపి ధర్మజ్ఞ ! విజ్ఞేయం తత్ర్పసాదజమ్‌ || 23

రమన్తే సహ రామాభిః ప్రాప్య వైద్యాధరం పదం | అన్యభావతయా నామ్నః కీర్తనాదపి భార్గవ ! || 24

రత్నపర్యంక శయితా మహాఖోగాశ్చ భోగినః | వీజ్యస్తే సహరామాభిః కేశవ స్మరణాదపి || 25

సౌగంధికే వనే రమ్యే కైలాసే పర్వతే ద్విజ | యద్యక్షా విహరన్తి స్మ తత్ప్రాహుః కుసుమంనతేః || 26

రత్నచిత్రాసు రమ్యాసు వందనోద్యాన భూమిషు | క్రీడన్తి చ సహస్త్రీభిః గంధర్వీభిః కధాశ్రుతేః || 27

చతుస్సముద్రవేలాయాం మేరు వింధ్య పయోధరాం | ధరాం యే భుంజతే భూపాః ప్రణిపాతస్య తత్ఫలమ్‌ ||

తస్మాత్తవాహం పక్ష్యామి యద్యదా చరత స్సదా | పురుషన్యేహ భగవాన్‌ సుతోష స్తుష్యతే హరిః || 29

పూజ్య స్స నిత్యం వరదో మహాత్మా స్తవ్యస్సనిత్యం జగదేక వంద్యః |

ధ్యేయ స్సనిత్యం సకలాఘహర్తాచైతావదుక్తం తప రామ! గుహ్యమ్‌ || 30

ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ప్రధమఖండే మార్కండేయ వజ్రసంవాదే శంకర గీతాసు భక్తిఫల ప్రదర్శనం నామ సప్త పంచాశత్తమోధ్యాయః.

పరశురాముండు శంకరా ! అభగవంతు డేకర్మముచే నారాధింపబడునో సత్వసుఖ ప్రదమైన మాయంశము తెలుపు మన శంకరుడిట్లనియె నీ ప్రశ్నమంచిది. రామా! కేశవు నారాధనముగూర్చి నీవడిగినది మహా బాగా! బాగున్నది అశేష పాపము పోవుటకు మానవునకు విష్ణువునందు ఒకేరోజ సగమురోజు లేదా ఒక్క ముహూర్తమయినను భక్తికలుగును. అనేక సహస్ర జన్మలలో అనేక యోగులందు జన్మించుటలో కల్మషహీతువికి (పాపస్పర్శలేనివానికి) హరియందు భక్తిగల్గును. ధన్యుడు కాని వాడు హరిని స్తుతింపడు అధన్యుడు అప్రభువు సర్చింపడు అధన్యుడు (అకృతార్థుడు) కేశపునికి నమస్కరింపడు. అధన్యుడు మాధవుం దెలియలేడు. హరియం దేమనస్సు ప్రవర్తించునో ఆ బుద్ధియే (నిశ్చయాత్మకమయినది) వ్రతనిష్ఠ మగును. భార్గవ శ్రీనాథువర్ణించు జిహ్వ జిహ్వ విష్ణునాకర్ణించు వీనులు వీనులు మధువైరిదవిలిన మనము మనము-హరినిస్తుతించు వాక్కే వాక్కు. హరిశుభకథాశ్రవణముసేయు చెవులే చెవులు, హరి పూజసము సేయు కరములే కరములు. విష్ణువు కొఱకు జేసిన చేతయే చేత. సప్రయోజనమైన ముఖ్యఫలము పొందుటకు సాధనమయిన మనస్సు హరియందు స్థిరముగ నిలువదేని యట్టి మనస్సుచే నేమి ప్రయోజనము! ఆమనస్సు నిశ్చయాత్మకమయినను దానం బ్రయోజనము లేదు, హరినిస్తుతింపని నాలుక యిది నాలుక గాదు. రోగము. వేనిచే హరిలీలా విలాసము వినబడదా చెవులు బ్రహ్మతయారుచేసిన గంటలు-శంఖ చక్ర గదాధరుని విష్ణుదేవునర్చింపని నరపశువుయొక్క భార భూతములైన యాకరములున్ననేమి లేకున్ననేమి? విష్ణువాలయమునకు నడుచు నడుగలవియే యడుగులు. వేనం దామోదరుడు దర్శింపబడు నా నేత్రములే నేత్రములు. కేశవాలయ దర్శనమున కేగనివాడు నిపుణులచే చేయబడిన జంతువే యైనను వానియొక్క పాదముల వలన బ్రయోజనమేమి? శ్రీ నాథునర్చనము మరి మది యెవ్వడు చూడడు వాడు జాత్యంధుని వంటివాడనుకొందును. హరి నర్చింపక చేయుకుకర్మమెల్ల క్లెశకారకము వృధాయని తలంతును. కేశవుని యారాధించి సమ్మోదించుచున్న శచీపతింగనుము. యముని వరుణుని కుబేరుని సర్వైశ్వర్య విలసమై దేవేంద్ర పదవింగనుము. హరిభక్తి తరుపునుండి రజోగుణ సంపర్కమున బుట్టు పుష్పము సాత్విక ఫలమును ఫలించును. అణిమ మహిమ ప్రాప్తి ప్రాకామ్యము లఘిమ ఈశిత్వము వశిత్వము ననెడి అష్ట సిద్దులు హరి యారాధన వలన సిద్థించును. ఇంతియేకాదు కామము లన్నింటికి (కోరికలకు) పరమ పర్యవసానము (ముక్తి) గూడ హరిభక్తియొక్క పరమార్థము, చక్కని నెన్నడుములుతూగ మహోన్నత పయోధరువై అకలంక శశాంక పదనలై నీలవేణువైన దేవాంగనలోక్కమారు హేలగనేని (వినోదమునకేని) హరి నర్చించువానిని హరిమ్రొక్కువానిని జేరి రమింపజేయుదురు. వేద వేదాంగమూర్తులు ఆత్మభావనులు నైన ఋషులయొక్క ఋషిత్వము గూడ శ్రీహర ప్రసాదమున సమకూరినదని తెలియనగును. ఇదరభావనచేనేని (హరిననుకొనకయేని) నారాయణ నామస్మరణ జేసినవారు విద్యాధరస్థానముంబొంది సుందరులతో గ్రీడింతురు. అక్కడ రత్న తల్పములందు శయనించి మహాభోగము లనుభవించును. కేశవస్మరణ పుణ్యమన నభిరామస్త్రీజము వింజామరలువీవ నానందింతురు. కైలాసమందు సౌగంధికోద్యానమందు యక్షులు విహరింతురాసుఖము శ్రీవిష్ణు వినతి పుణ్యము పూచిన పూవు. రత్న చిత్రములు. రమ్యములు నయిన నందనోద్యానములందు గంధర్వాంగనలతో విహరించు భాగ్యము హరికథా శ్రవణమువలన కల్గును, చతుస్సముద్రవేలా ప్రదేశమందు మేరు పయోధరయైన మసుంధర తోడి భోగభావము హరికి ప్రణతులయిన భూపతులకు గలుగు మహాఫలము. కావున నీకు దెల్పుచున్నాను. మానవుడెప్పుడేమి సేయు నెంతసేయు సద్దాన నిత్యసంతుష్టుడగు హరి సంతుష్టుడగును ఆయన వరదుడు మహాత్ముడు నిత్యము పూజింపదగువాడు స్తుతింపదగువాడు, అతడు జగమ్ముల కేకైక వంద్యుడు ధ్యేయుడు సకల పాపహర్త. ఇది యింతవరకు రహస్యమయిన యంశము తెల్పితిని.

ఇది శ్రీ విష్ణుధర్మోత్తర మహాపురాణమున ప్రథమఖండమున శంకరగీతలందు భక్తిఫల ప్రదర్శనమను నేబది యేడవ యధ్యాయము.

Sri vishnudharmothara Mahapuranam-1    Chapters