Sri vishnudharmothara Mahapuranam-1    Chapters   

ఏబదినాల్గవ యధ్యాయము - శంకరగీతలందు నరసింహావతారము

హిరణ్యాక్షే హతే దైత్యే భ్రాతాతస్య మహాత్మనః | హిరణ్యకశిపు ర్నామ చకారోగ్రం మహత్తపః || 1

దశవర్ష సహస్రాణి దశవర్ష శతానిచ | తపోపవాస నిరతః స్నానమౌనాశ్రిత వ్రతః || 2

తపశ్శమదమాభ్యాంచ బ్రహ్మచర్యేణ చానఘ ! | బ్రహ్మాప్రీతమనాస్తస్య స్వయమాగత్య భార్గవ ! 3

విమానె నార్క వర్ణేన హంసయుక్తేన భాస్వతా | ఆదిత్యైస్సహితః సాధ్యైఃసహితోమరుదశ్విభిః || 4

రుద్రైర్విశ్వసహాయైశ్చ యక్షరాక్షస పన్నగైః | దిగ్భి ర్విదిగ్భిశ్చ తథా ఖేచరైశ్చ మహాగ్రహైః || 5

నిమ్నగాభి స్సముద్రైశ్చ మాసర్త్వయన సంధిబిః | నక్షత్రైశ్చ ముహూర్తైశ్చ కాలస్యా వయవైస్తథా || 6

దేవర్షభిః పుణ్యతమైః సిద్ధై స్సప్తర్షిభిస్థతా | రాజ్షభిఃపుణ్యతమై ర్గంధర్వై రప్సరోగణౖః || 7

చరాచరగురు శ్శ్రీమాన్‌ వృత స్సర్వైర్దివౌకపై ః | బ్రహ్మా బ్రహ్మవిధాం శ్రేష్ఠో దైత్యం వచనమబ్రవీత్‌ || 8

బ్రహ్మోవాచ:

ప్రీతోస్మి ! తవ భక్తస్య తపనా నేన సువ్రత ! | వరం వరయ భద్రంతే యధేష్టం కామ మాప్నుహి || 9

హిరణ్యకశిపురాచ:

న దేవాసుర గంధర్వా న యక్షోరగ రాక్షసాః | నమానుషాః పిశాచావా హన్యు ర్మాం దేవసత్తమ ! ||10

ఋషయోపి నమాం శాపం క్రుద్ధాలోక పితామహ ! |

శ##పేయు స్తపసాయుక్తాః వర మేత ద్వృణోమ్యహమ్‌ || 11

న శ##స్త్రేణ న చాస్త్రేణ గిరిణా పాదపేన చ| న శుష్కేణ న చార్ధ్రేణ వధో మే స్యా త్కథంచన || 12

భ##వేయ మహమేవార్కః సోమోవాయు ర్హతాశనః | సలిలం చాంతరిక్షంచ నక్షత్రాణిదిశో దశ || 13

అహం క్రోధశ్చ కామశ్చ వరుణో వాసవో యమః || ధనదశ్చ తథాధ్యక్షో యక్షః కింపురుషాధిపః || 14

బ్రహ్మోవాచ:

ఏతే దివ్య వరాస్తాత ! మయాదత్తాస్తవాద్భుతాః |

సర్వాన్‌కామా నిమాం స్తస్మాత్‌ ప్రాప్యసి త్వం న సంశయః || 15

శంకర ఉవాచ:

ఏవముక్త్వాస భగవాన్‌ జగామా కాశ##మేవహి | వైరాజం దేవ సదనం మహర్షిగణసేవితం || 16

తతో దేవాశ్చ నాగాశ్చ గంధర్వా మునయ స్తథా | వరప్రదానం శ్రుత్వైవ పితామహ ముపస్థితాః 17

దేవా ఊచుః :

వరేణానేన భగవాన్‌ ! వధిష్యతి ససోసురః |తన్నః ప్రసీద ! భగవన్‌ !

వధోప్యస్య విచిన్త్యతామ్‌ ||18

భగవాన్‌ సర్వభూతానాం స్వయంభూ రాదికృత్‌ ప్రభుః |

స్రష్టాచ హవ్య కవ్యానాం చావ్యక్తః ప్రకృతిర్ద్రువః || 19

శంకరఉవాచ:

సర్వలోకహితం వాక్యం శ్రుత్వాదేవః ప్రజాపతిః | ప్రోవాచ వరదో వాక్యం సర్వాన్‌ దేవగణాం స్తత ః || 20

బ్రహ్మోవాచ:

అవశ్యం త్రిదశాస్తేన ప్రాప్తవ్యం తపనః ఫలమ్‌ |తతస్తస్య వధం విష్ణు స్తపసోస్తే కరిష్యతి || 21

శంకరుడనియె: హిరణ్యాక్ష డీల్గిన తరువాత వాని సోదరుడు హిరణ్యకశిపుడు పదుకొండువేల యేండ్లుగ్రతవము చేసెను. ఉపవాసములుండి స్నానములుచేయుచు మౌనమూనిజపించుచు శమదమసంపన్నుడై బ్రహ్మచర్యమూని చేయునాతపమ్మునకు బ్రహ్మమొచ్చి హంసయుక్త విమానమున ఆదిత్యాది దేవగణములతో దిక్కులతో (ఇంద్రాది దిక్పాలురతో ననియర్థము) గ్రహములతో నదులతో సముద్రములతో మాసర్త్వయన నంధులతో నక్షత్రములతో ముహూర్తములు మొదలగు కాలావ యవములతో పుణ్యతములయిన దేవర్షులతో సిద్ధులతో సప్తర్షులతో రాజర్షులతో గంధర్వాత్సరోణములతో నేతెంచి చరాచరగురుండును బ్రహ్మవిద్వరిస్ఠుడును నయిన బ్రహ్మ హిరణ్యకశిపునింగని, నీతపమ్మునకు ప్రీతినొందితిని. వరమడుగుము. నీకు శుభమగుగాక! యన హరిణ్యకశివుడు దేవాసుర గంధర్వాదులందఱివలన నాకు చావు గలగకుండుగాక. ఋషుల శాపముగూడ నాకు దగలగూడదు. శస్త్రాస్త్రములచే తరుగిరులచే తడిసిన యెండిన దాన నెద్దానను నాకు మరణము రాకూడదు. నేనొక్కడనే సూర్యుడను జంద్రుడను వాయ్వాది భూతముల అంతరిక్షము నక్షత్రముల దిక్కులు పదియునగుదుంగాక! కామమ క్రోధము యక్షకింపురుషాదులు నేనయ్యెదగాక! అనవిని యీ అద్భుత దివ్య వరములన్నియు నీకిచ్చితిని. సందియములేదు నీవీ యెల్లకోర్కెలంబడయుదువు. అని పలికి పితామహుడాకసమున వైరాజమును దేవసదనమునకుజనెను. అవ్వల దేవతలు మొదలగ నందఱునావర ప్రదానమువిని చతురాననుని దరికేగి వీడు మమ్మందఱ గడదేర్పగలడు. కావున దయదేసి వీని చావుంగూర్చి యాలోచింపుము. నీవు సర్వభూత స్రష్టవు. స్వయంభువుడవు. హవ్యకవ్యములకు నీవు కర్తవు. అవ్యక్తుడవు. ప్రకృతివి. ధ్రువుడవు. సర్వలోక హితమైన ఆ మాట విని ప్రజపాపతి ఓత్రిదశులార! అవశ్యమతడు తపః ఫలముం బొందవలయును. పలామభవ మయిన తుదను విష్ణువు వానిని వధించు ననియె.

శంకర ఉవాచ:

ఏవం శ్రుత్వాసురా స్సర్వే వాక్యం పంకజజన్మనః | స్వాని స్థానాని దివ్యాని దివ్యాని జగ్ముస్తే వైముదాన్వితాః || 22

లఘుమాత్రే వరే తస్మిన్‌ సర్వాస్సోబాధత ప్రజాః | హిరణ్యకశిపు ర్దైత్యో వరదానేవ దర్ఫితః || 23

ఆశ్రమేషు మహాత్మానో మునీంద్రాన్‌ సంశితవ్రతా& | సత్యధర్మరతాన్‌ దాంతాన్‌ దురాధర్షో భవంస్తు సః || 24

దేవాంస్త్రిభువనస్థాంశ్చ పరాజిత్య మహాసురః | త్రైలోక్యం వశమానీయ స్వర్గే వసతి దానవః || 25

యదా వర మదోన్మత్తోహ్యావాసం కృతవాన్‌ దివి | యాజ్ఞియా& కృతావా& దైత్యానయాజ్ఞేయాశ్చ దేవతా|| 26

ఆదిత్యా వసవో రుద్రా విశ్వేదేవా స్తథా శ్వినౌ | భృగవోంగిరస స్సాధ్యా మరుతశ్చ సవాసవాః || 27

శరణ్యం శరణం విష్ణుముతతస్థు ర్మహా బలమ్‌ |దేవం బ్రహ్మమయం విష్ణుం బ్రహ్మభూతం సనాతనమ్‌ || 28

భూతభవ్య భవిష్యస్య ప్రభుం లోకపరాయణమ్‌ | నారాయణం విభుం దేవాః శరణ్యం శరణం గతాః || 29

దేవా ఊచు:

త్రాయస్వనోద్య దేవేశ ! హిరణ్యకశిపోర్వథాత్‌ | త్వంహిసఃపరమో దేవోబ్రహ్మాదీనాం సురోత్తమ ! || 30

ప్రోత్ఫుల్లామల పత్రాక్ష ! శత్రుపక్ష క్షయంకర ! | క్షయాయదితివంశస్య శరణం త్వం భవస్వ నః || 31

శ్రీభగవానువాచ :

భయం త్యజధ్వ మమరాః అభయంవో దదామ్యహమ్‌ | తధైవ త్రిదివం దేవా ప్రతిపద్యత మాచిరమ్‌ || 32

ఏషోముం సబలం దైత్యం వరదానేన దర్పితమ్‌ | అవధ్య మమరేంద్రాణా ం దానవేంద్రంనిహన్మ్యహమ్‌ || 33

శంకర ఉవాచ:

ఏవముక్త్వాస భగవా& విసృజ్య త్రిదివేశ్వరా& | నారసింహం వపుశ్చక్రే సహస్రాంశు సమప్రభమ్‌ || 34

ప్రాంశుంకనక శైలాభం జ్వాలాపుంజ విభూషితం | దైత్య సైన్య మహోంభోధి బడలానల వర్చసమ్‌ || 35

సంధ్యానుర క్త మేఘాభం నీలవానస మచ్యుతమ్‌ | దేవాధారు వనచ్ఛన్నం యధామేరుం మహాగిరిమ్‌ || 36

సంపూర్ణవక్త్రదశ##నైః శశాంక శకలోపమైః| పూర్ణం ముక్తాఫలై శ్శుభ్రై స్సముద్రమివ కాంచనమ్‌ || 37

నఖై ర్విద్రుమ సంకాశై ర్విరాజిత కరద్వయమ్‌ | దైత్యనాథ క్షయకరై ః క్రోధస్యేవ యథాంకురై ః || 38

సటాభారం సకుటిలం వహ్నిజ్వాలాగ్ర పింగళం | ధారయ& భాతి సర్వాత్మాదావానల మివాచలః || 39

ద్భశ్యాదృశ్యముఖె తస్య జిహ్వాభ్యుదిత చంచలా | ప్రలయాన్తాంబు దస్యేవ చంచలాతు తడిల్లతా || 40

ఆవర్తిభిర్లోమఘనై ర్వ్యాప్తం విగ్రహ మూర్జితమ్‌ | మహాకటి తటస్కంధ మలాత ప్రతిమేక్షణమ్‌ || 41

కల్పాంత మేఘ నిర్ఘోష జ్వాలా నిశ్వ్వాన మారుతమ్‌ | దుర్నిరీక్ష్యం దురాదర్షం వజ్రమధ్య విభీషణమ్‌ || 42

కృత్వామూర్తిం నృసింహస్య దానవేంద్ర సభాంయ¸° | తాం బభంజతు వేగేన దైత్యానాం భయవర్ధన ః || 43

భజ్యమానాం సభాం దృష్ట్వా నృసింహేన మహాత్మనా | హిరణ్యకశిపూ రాజా దానవాన్‌ సమచోదయత్‌ || 44

సత్వజాత మిదం ఘోరం చాపూర్వం పున రాగతమ్‌ | ఘాతయధ్వం దురాధర్షం యేన మే నాశితా సభా || 45

తస్య తద్వచనం శ్రుత్వా దైత్యా శ్శత సహస్రశః | ఆయుధైర్వివిధై ర్జఘ్ను ర్దేవదేవం జనార్దనమ్‌ || 46

నానాయుధ సహస్రాణి తస్య గాత్రేషు భార్గవ ! | విశీర్ణా న్యేవ దృశ్యన్తే మృల్లోష్టానీవ పర్వతే || 47

దైత్వాయుథానాం వైఫల్యంకృత్వా హత్వాచ దానవాన్‌ | కరపాద వ్రహారైశ్చ శతశోధ సహస్రశః || 48

జగ్రాహ వేగార్దెతేయం హిరణ్యకశిపుం తతః | నృసింహహేతో ర్విక్రాస్త మస్త్రవర్ష మహాంబుదమ్‌ | 49

వేగే నోత్సంగమారోప్య కదళీదళ లీలయా | దారయామాస దైత్యేశం వక్షస్థల మహాగిరిమ్‌ || 50

కృత్వా త మసుభి ర్హీనం దైత్యేశం కేశవ స్స్వయమ్‌ | ఆసురాణాం వినాశంచ క్రుద్ధో నరహరి ర్వ్యధాత్‌ 51

హత్వాసురం శోణిత బిందుచిత్రం సంపూజ్య దేవా స్సహవాసవేన |

జగ్ముః స్వధిష్ణ్యాని ముదా సమేతా దేవోప్యధాంత ర్హితమూర్తిరాసీత్‌ || 52

ఇతి శ్రీ విష్ణుధర్మోత్తరే ప్రథమఖండే మార్కండేయ వజ్రసంవాదే శంకరగీతాసు నరసింహ ప్రాదుర్భావో నామ చతుష్పంచాశ త్థమోధ్యాయః.

బ్రహ్మవచనము సురలువిని సంతోషముతో దమ నివాసముల కరిగిరి. పరమల్పమాత్రమైనను నయ్యసుర పొగరెక్కి ప్రజలను ఋష్యాశ్రమములందు సత్యధర్మరతులు దాంతులునైన మహర్షులను రుద్రాదిత్యులను ఇంద్రాదులను వసుపులను బాధించి ముల్లోకముల వశముచేసికొని స్వర్గముచేరి దేవతలకు యజ్ఞభాగములు లేకుండ జేసెను. వారు విష్ణువుంగని చెప్పుకొనిరి. దితి వంశక్షయమునకు ని న్నేము శరణు సొచ్చితిమన భగవంతుడు నరసింహరూపము దాల్చెను. ఆమూర్తివహస్ర సూర్యసమప్రభము మహోన్నతము కనకగిరి వంటిది జ్వాలామాలా విభూషితము దైత్యసైన్య సముద్రమునకు బాడబానలము మాదిరిది సంధ్యామేఘ మట్లెరుపుగొన్నది, నీలవసనము. దేవదారు వనమధ్యమందు మేరువట్లన్నది విప్పారిన నిండు మొగము నందు చంద్రవంకలట్లున్న కోరలతో తెల్లముత్యములతోడి బంగారుసముద్రమట్లున్నది. పవడమలట్టి యెర్రని దైత్యరాజనాశనము నొనరిపంనున్న క్రోధాంకురములో యన్నట్లున్న గోళ్లతోడి కరయుగముంగల్గి కుటిలమైన (వంకరలుదిరిగిన) వహ్నిజ్వాలాగ్రమట్లు పింగవర్ణమైన (ఎరుపెక్కిన) జటాభారము పర్వతమున దావానలనట్లుండెను. ఆ స్వామి కనపడీపడని యా ముఖమునందు యిట్టటు కదలునాలుక కల్పాంతమేఘవించు చలించు విద్యుల్లత వోలె నుండెను. సుడులు దిరుగు ఘనరోమరాజితో పరివ్యాప్తమై చక్రాకారమై కారవివలెనున్న కన్నులతో కల్పాంతమేఘ నిర్ఘోషము జ్వాలలు నిశ్శ్వాస వాయువులతో దుర్నిరీక్ష్యము దురాధర్షమునగు వజ్రాయుధము నడిమిభాగమట్లు భయంకరము నైన మూర్తిం దాల్చి యానృసింహస్వామి దానవేంద్రసభకురికెను. ఉరుకుటేగాదు దైత్యుల కడలుపెంచుచు నాసభామంటపమును బ్రద్దలు గొట్టెను. ఈ జంతు వతిఘోరము నపూర్వమిదె వచ్చినది దీనింజంపుడని హిరణ్యకశిపు డరచెను. అది విని దైత్యులు వందలు వేలుగరేగి యాయుధముల నావిష్ణువుంగొట్టిరి. ఆ నృసింహమూర్తిపై నాయధములు పర్వతముపై బడిన మట్టియుండలట్లు పొడిపొడి యయ్యెను. దానవాయుధములను విఫలమొనరించి కరచరణపానములం దానవులజంపి వేగమ హిరణ్యకశిపునిం బట్టెను. తనపై విక్రమించి పెనుమేఘమట్లు శరవర్షము గురియించు నమ్మహా దైత్యునింబట్టి వేగమున తన తొడపై నెక్కించి యరటియాకు నట్లు వాని రొమ్ము చీల్చెను. ఆ రక్కసుం జీల్చివైచెను. వానివినిగతప్రాణు నొనరించి కేశుడు క్రద్ధుడై స్వయముగ నసురనాశము సేసెను. రక్తబిందువులచే విచిత్రాకృతినున్న యా నృసింహస్వామి నింద్రునితోగూడ దేవతలు వచ్చి పూజించి సమ్మెదమున తమధామమముల కరిగిరి. దేవదేవుండు సంతర్హితమూర్తియయ్యె.

ఇది శంకరగీతలందు నరసింహావతారమను నేబదినాల్గవయధ్యాయము

Sri vishnudharmothara Mahapuranam-1    Chapters