Sri vishnudharmothara Mahapuranam-1    Chapters   

ఏబదియవ యధ్యాయము - అస్త్రోపదేశము

మార్కండేయ ఉవాచ :

బ్రహ్మాస్త్రం వైష్ణవం రౌద్రమాగ్నేయ మథావాసవం | అస్త్రంచ నైరృతం యామ్యం కౌబేర మధ వారుణమ్‌ || 1

వాయవ్య మధ సౌమ్యంచ సౌరం పార్వత మేవచ | చక్రాస్త్ర మధ వజ్రాస్త్రం పాశాస్త్రం సార్పమేవచ || 2

గాంధర్వం స్వాపనం భౌతం తధా పాశుపతం శుభమ్‌ | ఏషీకం తర్జనం ప్రాసం భారుండం నర్తనంతథా || 3

అస్త్రరోధన మాదిత్యం రైవతం మానవం తధా | అక్షి సంతర్జనం భీమం జృంభణం రోధనం తథా || 4

సౌపర్ణమథ పార్జన్యం రాక్షసం మోహనం తధా | కాలాస్త్రం దానవాస్త్రంచ అస్త్రం బ్రహ్మ శిర స్తథా || 5

ఏతా న్యన్యాని చాన్యాని రామో నివసనే తతః | సంప్రయోగ రహస్యాని ససంహారాణి చావ్యధ || 6

ఆజహార మహాదేవాత్‌ ప్రసాద సుముఖాత్తతః | ఏవం హి వసతః కాలో య¸° రామస్య ధీమతః || 7

హర ప్రసాద సంజాత విస్రంభో భృగునందనః | ధ్యానస క్తం హరందేవం కదాచి దధ దృష్టవాన్‌ || 8

ధ్యానప్రసక్తం స హరం సమీక్ష్య రామస్తు సంజాత కుతూహలేన |

విసిష్మయె ధర్మ భృతాం వరిష్ఠః స చేతసా యాదవవంశచంద్ర ! || 9

ఇతి శ్రీ విష్ణు ధర్మోత్తరే ప్రథమ ఖండే మార్కండేయ వజ్ర సంవాదే అస్త్ర ప్రదానం నామ పంచాశ త్తమోధ్యాయః,

మార్కండేయుడనియె : బ్రహ్మాస్త్రము వైష్ణవము రౌద్రము ఆగ్నేయము ఐంద్రము (వాసవము)నైఋతము యామ్యము కౌచేరము వారుణము వాయవ్యము సౌమ్యము సౌరము పార్వతము చక్రాస్త్రము వజ్రాస్త్రము పాశాస్త్రము సార్పము (నాగాస్త్రము) గాంధర్వము స్వాపనము భౌతము పాశుపతము ఐషీకము తర్జనము ప్రాసము భారుండము నర్తనము అస్త్రరోధనము ఆదిత్యము రైవతము మానవము అక్షిసంతర్జనము భీమము జృంభణము రోధనము సౌపర్ణము (గారుడము) పార్టన్యము(మేఘాస్రము) రాక్షసము మోహనము కాలాస్త్రము దానవాస్త్రము బ్రహ్మశిరము మఱియుం బెక్కింటిని ప్రయోగోప సంహార రహస్యములతో ప్రసాద సుముఖుడైన పరమేశ్వరునుండి గ్రహించెను, ఇట్లచ్చట నునికిసేయ పరుశురామునికి పెద్ద కాలము గడచెను. హరప్రసాదమున గలిగిన విశ్వాసముతో భార్గవరాముడొకతఱి ధ్యాననిష్ఠుడెన యీశ్వముని దర్శించెను. దర్శించి వేడుక పొడిమి యాధర్మిష్ఠ వరిష్ఠుడా ధ్యాననిష్ఠకాశ్చర్యపడెను.

ఇది శ్రీవిష్ణుధర్మోత్తరమహాపురాణము ప్రథమఖండమున అస్త్రోపదేశమను నేబదియవ యధ్యాయము.

Sri vishnudharmothara Mahapuranam-1    Chapters