Sri vishnudharmothara Mahapuranam-1    Chapters   

నలుబది యెనిమిదవ యధ్యాయము - సాల్వసైన్య వథ

మార్కండేయ ఉవాచ :

సింహికాపుత్రసై న్యేన హన్యమాన స్తదా రణ | గోచరాభ్యా గతాన్‌ సర్వాన్‌ రామో నిన్యే యమక్షయమ్‌ || 1

తేన కృత్తాః పరశునా యథా పరళునా మృగాః | ఆలింగ్య శేరతే క్షోణీం దానవాస్తే మదోద్ధతాః || 2

తీక్షణధారాగ్ర దుష్ప్రేక్ష్య కుఠార చ్ఛిన్న మస్తకైః ః ఆతతార తదా భూమిం కుశై ర్వేది మివాధ్వరే || 3

పరశ్వధాగ్న సంఖిన్న దైత్య దేహ సముద్భవమ్‌ | ప్రసుస్రావ తదారక్తం యేనాసీ త్కర్దమం మహత్‌ || 4

తే హన్యమానాః రామేణ రామ మేవాభి దుద్రువుః | పరిపూర్ణే యథా కాలే శలభా జాతవేదసమ్‌ || 5

రామస్య ప్రముఖే దైత్యా స్తదా తిష్ఠన్తి యే నృప ! | నిమేషాంతరమాత్రేణ తేప్రయాన్తి యమక్షయమ్‌ || 6

కుంజర స్తురగః పత్తిర్నాజౌ యాదవ ! దృశ్యతే | ద్వితీయం ప్రదదౌ యస్య ప్రహారం భృగు సందనః || 7

ఏక ప్రహారాభిగతాన్‌ దానవాన్‌ పర్వతోపమాన్‌ | అపశ్యామరణ తత్ర బ్రహ్మణా సహితా వయమ్‌ || 8

రామేణ హన్యమానానాం దానవానాం ముహు ర్ముహుః | ఆరావ శ్శ్రూయతే ఘోరో వనానా మివ దహ్యతామ్‌ || 9

ఆక్రమ్య పద్భ్యాం తరసా రథస్థానా మధా೭೭హరత్‌ | శీర్షాణి తేన తీక్షేణన తధా పరశునా రణ || 10

రామేణాక్రమ్యమాణషు రథేషు రథ యూథపాః | భూమౌ నివిష్ట మూర్ధానః తత్యజుర్జీవితం హయాః || 11

నిష్పిపేష రథస్థానాం దారయన్‌ కుంజరాన్‌ రణ | బభ్రమే తత్ర తత్రైకః కాలోత్సృష్ట ఇవాన్తకః || 12

విచ్ఛిందన్‌ యోధ శీర్షాణి రణ రామో రధా ద్రధమ్‌ | వ్రజన్‌ భాతి విశాలాక్షో వృక్షా ద్వృక్ష మివాండజః || 13

స శరాంచిత సర్వాంగః శోణితేన సముక్షితః | రరాజ రామ స్సమరే రశ్మిమానివ భాస్కరః || 14

దైత్య బాహు వినిర్ముక్తా నాయుధాన్‌ శతశః తధా | పరశ్వధా గ్రేణ రణ చిఛేద రణకర్కశః || 15

తేషాం సంఛిద్య మానానాం ప్రాదు రాసీత్‌ హుతాశనః | యేన తానేవ తరసాక్షితౌ చక్రేస భస్మసాత్‌ || 16

బహుత్వా ద్దైత్య యోధానాం రామ స్సంఛాదితో రణ | హేతి పుంజేన మహతా శైలాభేన న దృశ్యతే || 17

హేతిపుంజం విధూయోగ్ర మభ్రపుంజం యధా రవిః | పునర్దర్శన మాయాతి సంహాతా& దైత్యతేజసామ్‌ || 18

బ్రహ్మా సురగణౖ న్సార్థ మృషిభి శ్చ మహాత్మభిః | వూజయామస తద్యుద్ధం సాదువాదేన యాదవ ! 19

దృష్టవన్తశ్చ ధనుషా యుద్ధాని చ ముహుర్ముహుః | తథై వాశ్చర్య భూతాని లోకానాం ఖడ్గ చర్మణా || 20

అపూర్వ ఏష సంగ్రామో రామస్య బహుభిస్సహ | పరశ్వధాయుధస్యోగ్ర ఇతి దేవా స్తధాబ్రువన్‌ || 21

పూజ్యమాన స్సరామోపి దేవపుష్పోత్కరై స్తదా | చిచ్ఛేద యుధి దై త్యానాం శిరాంసి శతశో రణ || 22

దైత్య శోణిత దిగ్ధాంగం భార్గవం లఘు విక్రమమ్‌ | అలాతచక్రపత్రిమం తదా పశ్యతి యాదవ! 23

భ్రమతానేన రౌద్రేణ రణ కాలాగ్ని వర్చసా | కృతాః సమరశౌండేన భీమా రుధిర నిమ్నగాః || 24

పరశ్వధాగ్ర విక్షేప గత జీవిత కుంజరైః | పాదో పలైశ్చ సమరే ప్రతస్తార స భార్గవః || 25

దన్తిదన్త పదన్యాసప్రాప్తం కుంజరమస్తకమ్‌ | వినిఘ్నన్‌ స గజారోహాన్‌ శ్యేన వత్‌ విచరన్‌ లఘు || 26

ఆరుహ్య కుంజరం చైకం కుంజరాత్‌ కుంజరాంతరమ్‌ | అపశ్యామ రణ రామం విచరన్తం యథా సుఖమ్‌ || 27

భూయో భూమిగతో రామః కుంజరాణాం పరశ్వధా | చకార కదనం ఘోరం ప్రళయాగ్ని రివోత్థితః || 28

ఛిన్నా గ్రహస్తాన్‌ విరదాన్‌ ద్విరదాన్‌ శోణితోక్షితాన్‌ | క్షితౌ గతా నపశ్యామ శ్యామీకృత దిగ న్తరాన్‌ || 29

ఏవం హి యుద్ధ్యతా తేన రణ కాలాగ్ని వర్చసా | హతాని దానవేంద్రాణాం ప్రయుతా న్య ర్బుదానిచ || 30

యేషాం ప్రహారం సంసోఢుం నేయం శక్తా వసుంధరా| తేషాం ప్రహార భిన్నాంగోనైవ రామో వ్యకంపత || 31

దృష్ట్వా ప్రహారవైక్లబ్యం నిహతాం శ్చ మహాసురాన్‌ | ప్రదుద్రువు ర్దైత్య గణాస్సాల్వం శరణ మాహవే || 32

అల్పావశిష్టాన్‌ దితిజాన్‌ ప్రణష్టాన్‌ సంవీక్ష్య సాల్వః స్వహితే నివిష్టాన్‌ |

రామం య¸° తేన గజేన యుధ్ధే రామాద్రణ యుద్ధ మభీప్సమానః || 33

ఇతి శ్రీ విష్ణుధర్మోత్తరే ప్రథమఖండే మార్కండేయ వజ్రసంవాదే సాల్వసైన్య వధోనామ అష్టాచత్వారింశ త్తమోధ్యాయః

మార్కండేయుడనియె : పరశురాముడు యుద్ధమునందు సింహికాపుత్రుడగు రాహువు సైన్యముచే గొట్టబడుచు, నెదుటనున్న వారినందరిని యమగృహమునకు నంపెను. గండ్రగొడ్డలితోనాతడు నఱుకగా గొడ్డలిందెగిన మృగములట్లసురు లవనింగౌగలించుకొని బడియుండిరి. మిగుల పదునైనయంచు తుదచే గనులు మిరుమిట్లు గొలుపు గొడ్డలిచే తెగినతలలు యజ్ఞవేదిం దర్భలలముకొనిన ట్లలుముకొనెను. పరశుధారందెగిన దైత్యుల మేనులందుండి రక్తము దొరగి యుద్ధరంగము పెనురొంపియయ్యెను. రామునిచే చావగొట్టబడుచుంగూడ యారాక్షసులు కాలముపూర్తియైయగ్ని పైదుముకు మిడుతలట్లాతనిపైకిబరువులెత్తిరి. పరుశురామునెదుట బడుటయే తడవుగ దానవులు నిమేషమాత్రమున యమక్షయమున కరుగుచుండిరి. అయ్యుద్ధమందతడు రెండవదెబ్బకొట్టిన యేనుగు, గుఱ్ఱము పదాతియుం గానరాడయ్యెను. (మొదటి దెబ్బకే యన్నయు గూలుచుండెనన్నమాట) ఒక్కదేబ్బలో గూలిన పర్వతములట్లున్న దానవుల నా రణమందేము బ్రహ్మతో నుండి కనుగొంటిమి. రామునిచే గూలుచున్న దానవుల యారావ మతిఘోరమై దావాగ్నింగాలి కూలు కారడవుల ఘోష మట్లు విననయ్యెను. అతడు కాలినడ వేగమున నేగి రథమందున్న వారి (రథికుల) తలలను గొడ్డలిం బడవేసెను. రాముడు రథాక్రమణంబు సేసినంత రథయాదపులగు గుఱ్ఱములవనికిం దలలు పడవేసి ప్రాణములం బాసెను. కాలమంపిన యంతకుడ ట్లతడు రథికులను ఏనుగులంజెండుచు నొక్కడైయా రణమందువిహరించెను. ఆరదమునుండి యరదమునకు యోధుల తలలు ద్రెంచుచు కనుగవ విప్పార చెట్టునుండి చెట్టుమీదకెగురు పక్షియట్లెగుర జొచ్చెను. మేనమ్ములు గ్రుచ్చుకొని రక్తమునందడిసి రాముడా సమరమందు తీక్షణ కిరణుడగు భాస్కరునట్లు వెలింగెను. దైత్యుల బాహువులనుండి

విసరబడు నాయుధముల నూర్లకొలది యొక్కుమ్మడి పరశుధారచే ఛేదించెను. అట్లు భిన్నములయిన యాయుధములనుండి నిప్పు పుట్టెను. అ పుట్టిన నిప్పు రక్కసుల నప్పుడే భస్మము గానించెను. రాముడేకాకి గయుటచే రక్కసులు పెక్కుమంది యగుటచే పర్వతమట్లు గుట్టవడి యున్న యాయుధ పుంజముచే రణభూమియందుకప్ప బడిరాముడేరికింగాన రాడయ్యెను. మేఘపుంజమును రవియట్లుయాయుధపుంజముం జిమ్ముకొని దైత్య తేజస్సంహారమూర్తి రాముడు పునర్దర్శన మిచ్చుచుండెను. బ్రహ్మ సురగణముతో మహానుభావులగు ఋషులతో నయ్యుద్ధమును బాగుబాగని ప్రశంసించెను. ధనుర్యుద్ధములు చూచినాము. ఖడ్గచర్మములూని చేసిన రణములెన్నేని యెన్నోమారులు సూచినాము. కాని యీ రాముడొక్కడు పెక్కుమందితో గండ్రగొడ్డలి మాత్రముంగొని చేసిన సంగ్రామ మపూర్వమని వారనుకొనిరి. దేవతలు పూలు గురిపించి చేసిన పూజ నందుకొనుచు నతడు వందలకొలది యసురుల తలలు చెండాడెను. దైత్యుల రక్తముచే మేను దడిసి లఘువుగ (తేలికగ) నాక్రమించుచు నాతడు అలాతచక్రమట్లు(చక్రాకరమునదిరుగు కొరివివలె) గనబడెను. ప్రలయ కాలాగ్ని యట్లనిలో నట్టిట్టు దిరుగుచు నాతనిచే చేయబడిన రక్తనదు లతిభయంకరములయ్యెను. అతడు పరశ్వధధార(పరశువువాదర) విసరునం బ్రాణములు వాసిన యేన్గులచే, పాదముల రూపగు బండలచే రణభూమిం గప్పెను. అతడేన్గు దంతముమీద కాలిడి తలకెక్కి యా తలను ఖండించి గజారోహముల శీఘ్రముగ డేగవలె జేయుచుండెను. ఒక యేనుగుపైకెక్కి అందుండి మరియొక దానిపైకి దానిపైనుండి యింకొక దానిపైకి నవవీలగ నాతడు దూకుట చూచినాము. వెండియు నాతడు ప్రళయాగ్ని వోలెరేగిగొడ్డలితో నేనుగులయుద్ధమును ఘోరముగగావించెను. తొండముతెగిదంతములూడిరక్తమునందడసి నలుమూలలవాని నలుపుగ్రమ్ముకొనజేసియవని బడియున్న వానింగాంచితిమి. ఇట్లు ప్రళయాగ్నివలె దీపించు నా యోధునిచే దానవ సైన్యము లయుతములు అర్బుదములు గూలినవి. వాని తాకిడిని నీ వసుంధర సహింపజాలని దయ్యెను. ఆరాక్షసులదెబ్బ కొడలు తెగియు రాముడు చలింపడయ్యె. ఆయుధములు వమ్మగుట మహాసురులీల్గుటయుం గని దైత్యగణములు శరణుజొచ్చుట కైసాల్వుని దిక్కుకుపారినవి. తనమేలునకై జచ్చినవారిని చావగా మిగిలిన వారినింగని సాల్వరాజు రాముని యుద్ధమభిలషించి యేనుగునెక్కి రాముని చేరెను.

ఇది శ్రీవిష్ణుధర్మోత్తరమహాపురాణము ప్రథమఖండమున సాల్వసైన్యవధయను నలుబడి యెనిమిదవ యధ్యాయము.

Sri vishnudharmothara Mahapuranam-1    Chapters