Sri vishnudharmothara Mahapuranam-1    Chapters   

నలుబది యైదవ యధ్యాయము - సాల్వ నిర్యాణము

మార్కండేయ ఉవాచ :

రాహౌ దిన మసంప్రాప్తే సాల్వేరాజ్ఞి సభాంగతే | రామేణ ప్రేషితో దూతః సంప్రాప్త స్త్వకృత వ్రణః || 1

స ప్రవిష్టః సభాంరమ్యాం సాల్వరాజ్ఞా చ పూజితః | పాద్యార్ఘ్యాచమనీయాద్యై ర్నిషణ్ణో వాక్య మబ్రవీత్‌ || 2

అకృత వ్రణ ఉవాచ :

దూతోహం ప్రేషిత స్సాల్వ ! రామేణా క్లిష్ట కర్మణా |

శ్రుత్వా రామస్య వచనం తతః కురు యథేప్సితమ్‌ || 3

ఆహ త్వాం భార్గవో రామ స్త్ర్యంబకేణ విసర్జితః |

త్వయా యుద్ధాయ దైత్యేంద్ర | సంగ్రామే క్రియతాం క్షణమ్‌ || 4

వివాస్య వాసవం స్వర్గా ద్దేవాన్‌ జిత్వా సదా೭೭హవే | అనయస్యాస్య ఘోరస్య ఫలం ప్రాప్నుహి ! దుర్మతే ! 5

నాహం ప్రమత్తే విశ్వస్తే ప్రహరామి కదాచన | తేన తే ప్రేషితో దూత స్తస్మాద్యుద్ధే స్థిరోభవ ! 6

మార్కండేయ ఉవాచ :

ఏవముక్తస్తదా సాల్వో బ్రాహ్మణం వాక్య మబ్రవీత్‌ | నాహం రామకృతే బ్రహ్మన్‌ ! సన్నహ్యామి కదాచన || 7

కింతు సై న్యేన సర్వేణ సన్నద్ధేన వరూథినా | మహాదేవం విజేష్యామి యేన రామో విసర్జితః || 8

సన్నద్ధసైన్య సహితం మహాదేవజయైషిణమ్‌ | యది మాం యోత్స్యతే రామో హన్తాస్మి తమహంమృథే || 9

స త్వం గచ్ఛ ! యథాకామం రామాయ వినివేదయ ! ఏత ద్వచన మాదాయ సాల్వస్య స మహాత్మనః || 10

జగామ రామం ధర్మజ్ఞం సాల్వ వాక్య నివదేతః | గత్వా శశంస రామాయ సైంహికేయ విచేష్టితమ్‌ || 11

తేన వాక్యేన రామోపి రోషా ద్దైత్యపురం య¸° | రామదూతే గతే తస్మిన్‌ దైత్యాన్‌ సాల్వః ప్రచోదయత్‌ || 12

సన్నహ్యధ్వం విజేష్యామః సగణం భగ సూదనమ్‌ | తతస్తే దానవా స్సర్వే సాల్వవాక్యప్రచోదితాః || 13

సన్నద్ధాః స్వగృహేభ్యస్తు రాజద్వార ముపాగతాః | కుంజరాణాం నినాదేన శంఖ భేరీ రవేణ చ || 14

రాజద్వారే మహాన్‌ శబ్ద స్తుములః సమపద్య త |

హుత్వా హుతాశనం స్నాతః సాల్వ స్సంపూజ్య చ ద్విజాన్‌ || 15

ఆరురోహ గజం మత్తం శైలాగ్రం సవితా యథా || 16

వినిర్గతం దైత్యపతిం సమీక్ష్య దై త్యేశ్వరాః కాల సమాన దర్పాః ||

ఊచు స్తదా తం సమరేష్వ జేయం జయస్వ ! శంభుం యుధి సంప్రగృహ్య || 17

ఇతి శ్రీ విష్ణు ధర్మోత్తరే ప్రథమఖండే మార్కండేయ వజ్రసంవాదే శ్రీ భార్గవ రామయుద్ధే సాల్వ నిర్యాణంనామ పంచ చత్వారింశ త్తమోధ్యాయ.

మార్కండేయుడనియె : రాహువింకను స్వర్గమున కేగనేలేదు. సాల్వుడు సభ##కేగెను. రాముడంపిన దూత ఆకృత వ్రణు డటకు రానేవచ్చెను. అతడు రమ్యమైన రాజు సభం బ్రవేశించి సాల్వరాజుచే పాద్యార్ఘ్యాచమనీ యాసనాదులచే నర్బితుడై కూర్చుండి యిట్లనియె. సరళ స్వభావాచరణ శీలియైన రాముడంప వచ్చిన దూతను నేను. రాముని వచనమాచించి యాపై నేది వలతు వది సేయుము. భార్గవరాముడు, త్రిలోచనునిచే నీతో యుద్ధము సేయంబంపబడినాడు. కావుననో దైత్యేంద్ర! సంగ్రామోత్సవము నీవు సేయవలయును. ఓ దుర్మతీ ! నీవెప్పుడును ఇంద్రుని స్వర్గము నుండి తరిమి దేవతలం గెల్చిన యీ ఘోరమైన యవినీతికి ఫల మీవనుభవింపుము. నేను బ్రమత్తునిపై విశ్వసించిన వానిపై నెన్నడుం దెబ్బదీయను. అందుచేతనే దూతను బంపినాను. అందువలన నీవు యుద్ధమున సుస్థిరముగ నిలువుము. అనవిని సాల్వుడు దూతగా వచ్చిన బ్రాహ్మణునితో నేను పరశురాముని కొరకుగా నెన్నడును యుద్ధసన్నాహము సేయను. కాని సర్వ సైన్యముతో బలములతో రామునింబంపిన మహాదేవునిం (శివుని) గెల్చెదను. సైన్య సన్నాహముతో శివుని జయింపగోరు నన్ను రాముడెదిరించునేని యాతనిని రణమందు గూల్చెదను. నీవు నీ యిచ్చంజని రామునికి నివేదింపుము. అన నా సాల్వుని మాటగైకొని అకృతవ్రణుండు సైంహికేయుని చర్య రామునికిం దెల్పెను. ఆ మాటచే రాముడును రోషముగొని దైత్యపురమున కేగెను. రామదూత యాతడరిగిన మీదట సాల్వుడు దైత్యులందఱింగని సన్నద్ధులుగండు. భగసూదనుని (శివుని) గణములతో మనము గెలుతుము గాక అన దానవులందరు నతని మాటచే బ్రేరితులై (సన్నద్ధులై) తమ యిండ్లనుండి రాజద్వారమున కేతెంచిరి. గజఘీంకారములచే శంఖబేరీ నినాదములచే రాజద్వారమందు పెద్ద సందడియయ్యెను. సాల్వుడు స్నానము సేసి యగ్ని వేల్చి ద్విజుల పూజించి సూర్యుడు పొడుపుగొండనట్లు మదగజముపై నెక్కెను. అట్లు బయలుదేరిన దైత్యపతింగని కాలునితో నీడగు దైత్యపతులు దర్పమున నయ్యెడ నజేయుడగు నతనిని శంభునితో బోరి జయింపుమని జయ జయ ధ్వానములు గావించిరి.

ఇది శ్రీవిష్ణుధర్మోత్తరమహాపురాణము ప్రథమఖండమున భార్గవరామయుద్ధమున సాల్వుని యుద్ధయాత్ర అను నలుబదియైదవ యధ్యాయము.

Sri vishnudharmothara Mahapuranam-1    Chapters