Sri vishnudharmothara Mahapuranam-1    Chapters   

ఇరువది తొమ్మిదవ యధ్యాయము - చంద్రమండలదర్శనము

మార్కండేయ ఉవాచ :

గతే సురేశ్వరే దేవే శ##క్రే చ సపురోహితే | జగత్యాంచ ప్రయాతాయాం దేవదేవో మహేశ్వరః || 1

అంగుష్ఠమాత్రకో భూత్వా గంగాతోయే న్యమజ్జత | సో7వగాహ్య స్వలోకస్థాం గంగాం సర్వగతాం నదీమ్‌ || 2

తయో హ్యమానః ప్రయ¸° విస్తీర్ణం చంద్రమండలమ్‌ | నవయోజన సాహస్రో విష్కంభో యస్యకీర్తితః || 3

విస్తారా ద్ద్విగుణ శ్చైవ పరిణాహ స్సమన్తతః | తోయ సారమయం పిండ పితౄణాం ధామ మధ్యగమ్‌ || 4

ప్రజానాం భావనం సర్వం చాధారం జగతా మపి | శరీరిణాం శరీరేషు రసం పంచాత్మకం స్మృతమ్‌ || 5

ఆలంబకం క్లేదకం చ తథాచై వవా బోధకమ్‌ | సంఘాతకం తర్షకంచ దేహినాం దేహగోచరమ్‌ || 6

మాన స్సర్వేంద్రియాణాంచ సర్వేషాం నాథకం తథా | ఓషధీశం జగద్యోని మమృతాధార మవ్యయమ్‌ || 7

యం పిబ న్తి సదా దేవాః పితర శ్చామృతార్థినః | య శ్చక్షు ర్దేవదేవస్య విష్ణోర్వా సః ప్రకీర్తితః || 8

హవ్య కవ్యాశనో దేవో భూతాత్మా భూతభావనః | ప్రవిశ్య మండలం తస్య దేవదేవో మహేశ్వరః || 9

తస్య యద్వ్యాపకం తేజః సూక్ష్మ మన్నరసం హితమ్‌ | అంగుష్ఠ మాత్రం పురుషం యంబుధాః కేశవంవిదుః || 10

చక్షుర్గోలక మధ్యస్థా దృక్‌శక్తి రివయస్థ్సితః | చంద్ర గోలక మధ్యస్థః పురుష స్స పరః స్మృతః || 11

కర్మసాక్షీ సలోకానాం సచాధారః పరః స్మృతః ఆదిత్య రశ్మయ శ్చంద్రే తమస్సంమూర్ఛితం క్షితౌ || 12

క్షపయిష్యన్తి యన్నైశం శీతాంశు స్తస్యతేజసా | యస్యరూప మనిర్దేశ్యం యస్యతేజ స్సు దుస్సహమ్‌ || 13

మార్కండేయుడనియె : ఇంద్రుడు బృహస్పతితో, భూదేవితో నేగిన తర్వాత మహేశ్వరుడు అంగుష్ఠ మాత్రుడై (బొటనవ్రేలంతయై) గంగాజలములందు మునిగెను. స్వర్గమందున్న యాగంగలో దిగి యామెచే వహింపబడి సువిశాలమైన చంద్ర మండలమునకుం జనెను. ఆ చంద్రమండలముయొక్క విష్కంభము అడ్డుకొలత తొమ్మిదివేల యోజనములు. పరిణాహము చుట్టు కొలత విస్తీర్ణము పదునెన్మిది యోజనములు. అది జలసారమయము. పిండ పితరుల లోకము మధ్య మందది యున్నది. అది ప్రజా భవనము. సర్వ జగదాధారముకూడ శరీరధారుల శరీరమందు ఐదు రూపములయిన రస మదియే. 1. ఆలంబనము 2. క్లేదకము 3 అవబోధకము మేల్కొలుపునది 4 సంఘాతకము 5 తక్షకమునై దేహుల దేహములందది కానిపించును. మనస్సునకు తక్కిన యింద్రియములకు నది నాయకము. ఓషధులకు ప్రభువు జగత్కారణము అమృతాధారము. అవ్యయము. దానినే అమృతార్థులైన దేవతలు పితృదేవతలు పానముసేయుదురు. ఆమూర్తియే దేవదేవుడగు విష్ణువుయొక్క చక్షుస్సు (కన్ను) అని వేదము లందు కీర్తింపబడినది. - ''చంద్రమా మనసో జాతః'' ''అగ్నీ షోమాత్మకం జగత్‌'' అను నా యీ వచనములకు వివరణమిది. భూతాత్మకుడు భూతభావనుడునైన దేవుడు (ఇక్కడ దేవ శబ్దము తేజస్సు అని జ్ఞాపకముసేయును) ఆ చంద్రమండలమందు బ్రవేశించి హవ్యములను (దేవతలకిచ్చు హవిస్సులను కవ్యములను పితృదేవతల నుద్దేశించు నాహారములను) భుజించును. ఆ చంద్రుని యొక్క వ్యాపకము సూక్ష్మమునైన యన్న రసమునే అంగుష్ఠమాత్రపురుషుడుగా శరీరములందున్న పురుషుడని జ్ఞానులు పేర్కొందురు. ఆయననే శివుడని యందురు. చంద్రమండలమధ్యస్థుడగు నాపురుషుడే జీవశరీరములందు, నేత్రగోళమందు దృక్ఛక్తిగానున్నాడు. ఆ శక్తినే పరమపురుషుడని శ్రుతులు స్మృతులు పేర్కొనును. ఆపురుషుడు కర్మసాక్షి. అతడే పరమాధారభూతుడు. అదిత్యకిరణములు చంద్రునియందుండి భూమియందు గప్పికొన్న తమస్సును (చీకటిని) రాత్రియందలి చంద్రుని వెలుగుచే హరించుచుండును. ఆ ఆదిత్యుని రూపమిట్టిదని నిర్దేశింప వలనుపడనిది. అది సుదుస్సహము. ఆ చంద్రమండలాంతర్గతుడగు దేవశ్రేష్ఠుని జూచి త్రిపురాంతకుడు (మహేశ్వరుడు) ఇట్లు స్తుతించెను.

తంతు దేవవరం దృష్ట్వా తుష్టావ త్రిపురా న్తకః |

ఈశ్వర ఉవాచ :

అగ్నీషోమ మయంచైత జ్జగదేత త్ప్రకీర్తితమ్‌ | అగ్నీషోమౌ జగన్నాధౌ దేవదేవో జనార్దనః || 14

తస్నాగ్నేయీ తనుర్యాతుసో7హం సచ దివాకరః | సౌమ్యాతుయా తనుస్తస్య స భవా& స పితామహః || 15

త్వయేదం ధార్యతే సర్వం నాన్య త్పశ్యామి కారణమ్‌ | త్వద్బింబే నిర్మలే పృథ్వీ సశైలవన కాననా || 16

శశాకృతిస్సదా దృశ్యా శశలక్ష్మా7సి చానఘ ! | తేనైవ కారణన త్వముచ్యసే మృగలాంఛనః || 17

శశీ శశత్వ సంబంధాత్‌ సౌమ్యత్వాత్‌ సోమ ఉచ్యతే | శీతాంశుత్వాచ్చ శీతాంశుః ని శేశః త్వ ద్విరాజనాత్‌ || 18

నక్షత్రనాథ స్త త్స్వామ్యా ద్రాజత్వా త్త్వం ద్విజేశ్వరః | వస న్తి తే పితృగణాః పితృనాథ స్తతో భవా& || 19

బహ్వర్థ శ్చంద్ర ఇత్యేష ధాతురుక్తో మనీషిభిః | శుక్లత్వే హ్యమృతత్వేచ శీతత్వే హ్లాదనే7పిచ || 20

తేన తే చంద్రతా ఖ్యాతా సతతం ధర్మవత్సల ! | సర్వే చాహ్లాద మాయాన్తి దృష్టేత్వయి మహాద్యుతే ! 21

ప్రజాకార్యం త్వదాయత్తం తత్కురుష్వ జగత్ప్రభో ! | దత్తాత్రేయత్వ మాసాద్య త్వయా దత్తవరో నృపః || 22

కార్తవీర్యార్జునో నామ దానవాస్త ముపాశ్రితాః | సర్వేక్షత్రియతాం ప్రాప్య తద్వధే యత్నవా& భవ ! || 23

త్వయా దత్తవరం హన్తుం నాన్య శ్శక్నోతి కశ్చన | అవశ్యంచ త్వయా కార్యం దేవకార్యం సదా విభో ! 24

ఈశ్వరకృతమైన సోమస్తుతి :

ఈ జగత్తు అగ్నీషోమమయము అగ్నీ షోములు (సౌరశక్తి అగ్ని సోమశక్తి జగన్నాథులు. అనగా జగద్రూపులు. ''అగ్నీ షోమాత్మకం జగత్‌'' అదే ఉష్ణవీర్యము. శీతవీర్యమని యాయుర్వేద పరిభాష. అవి యొకదానికొకటి వ్యతిరిక్తమయిన తేజస్సులు. వాని అనుకూల వ్యతిరేకశక్తియొక్క సమ్మేళముననే సృష్టియందలి సర్వపదార్థములు పుట్టును. అట్టి అగ్నీ షోమాత్మకమైన శక్తియే జనార్ధనుడు. ఆయన ఆగ్నేయ మూర్తి నేనును ఆ దివాకరుడును (సూర్యడును) ఆయన సౌమ్యతనువు నీవును ఆ బ్రహ్మయును నీచే నీ చరాచర రూపమైన సర్వజగము ధరింపబడుచున్నది. మరియొక కారణము గానను స్వచ్ఛమైన నీబింబము నందు కొండలతో నడవులతోనున్న యీ పృథ్వి (భూమి) శశము (కుందేలు)రూపమున కనబడచున్నది. అందుచే నీవు శశాంకుడవైతివి. అందుచేతనే నీవు మృగ లాంఛను డనబడుచున్నావు. శశత్వ సంబం ధముచే శశివి. సౌమ్యత్యముచే సోముడవు శీత=చల్లని అంశుత్వాత్‌ = కిరణములు గలవాడగుటచే శీతాంశుడవు. రాత్రి నీచే విరాజిల్లుటచే నిశేశుడవు. నక్షత్రములకునాథుడగుటచే నక్షత్ర నాథుడవు ద్విజులకు రాజగుట ద్విజేశ్వరుడవు నీయందు పితృగణములుండుటచే పితృనాథుడవు. చంద్ర ధాతువు పెక్కర్థములు గలదని పండితు లనిరి తెలుపు వలన అమృతత్వముచే చలువచే హ్లాదనముచే (సంతోషపరచుటచే) నిన్ని విధముల చంద్రుడవునై ప్రఖ్యాతి నందితివి. ఓ ధర్మవత్సల! నీవు కనబడినంత నందరు నన్నియు నానందమందుదురు. ఓ తేజోమూర్తీ! జగత్ఫ్రభూ ! ప్రజల పని యంతయు నీ యధీనము అది నీవు చక్కబెట్టుము. దత్తాత్రేయావతారమెత్తిన నీచే నా రాజు (కార్తవీర్యార్జునుడు) వరము లీయబడినాడు. కాని దానవులు భూమిపై క్షత్రియులై పుట్టి వాని యండ జేరినారు. వానిం జంప యత్నింపుము. నీవు వరములిచ్చినవాని నింకొకడు చంపలేడు. దేవకార్యమవశ్యము నీవు సేయదగినది.

మార్కండేయ ఉవాచ :

శంకరేణౖవ ముక్తస్తు ప్రతిపూజ్యచ శంకరమ్‌ | ఉవాచ దేవదేవేశం ప్రణతార్తి హరం హరమ్‌ || 25

చంద్ర ఉవాచ :

ఇయం శంకర! సౌమ్యా మే తను స్సువిహితా తవ | తస్మా దర్కస్థితాంగచ్ఛ సాతేకామం కరిష్యతి || 26

మార్కండేయ ఉవాచ :

ఇత్యేవ ముక్త స్త్రిపురా న్తకారీ సోమేవ రాజ్ఞా పరమేశ్వరేణ |

సంపూజ్య దేవం ప్రయ¸° స శీఘ్రం తేజోమయం మండల మాశురాజ& || 27

ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ప్రథమఖండే మార్కండేయ వజ్రసంవాదే చంద్రమండల దర్శనం నాతమ ఏకోన త్రింశత్‌ తమో7ధ్యాయంః.

అని యిట్లు శంకరుండన నమృతాంశువు శంకరుని ప్రతి పూజ గావించి ప్రణతార్తి హరుడగు హరునితో ఈ నా సౌమ్యతనువు నీకై కూర్పబడినది. నూర్యునందున్న యమ్మూర్తిం గూర్చి చనుము. ఆ మూర్తి నీ కోరినది సేయగలదు. అని యిట్లు పరమేశ్వరుడు సోమరాజు పలుక నా దేవునిం బూజించి రాజా! అపుడు తేజోమయ మండలమా సూర్యధేవుం గూర్చియేగెను.

ఇది శ్రీ విష్ణుధర్మోత్తర మహాపురాణమందు ప్రథమఖండమున చంద్రమండల దర్శనమను నిరువది తొమ్మిదవ యధ్యాయము.

Sri vishnudharmothara Mahapuranam-1    Chapters