Sri vishnudharmothara Mahapuranam-1    Chapters   

ఇరువదియేడవ అధ్యాయము - ఇంద్రాదుల బ్రహ్మలోకగమనము

మార్కండేయ ఉవాచ :

తే సమేతా స్సమాసాద్య పితామహ సభాం శుభామ్‌ | పద్మాసన గతం తత్ర దదృశుః పద్మ సంభవమ్‌ || 1

* వి.ధ.పు-7

పద్మపత్ర సవర్ణాంగం పద్మబోధ సమప్రభమ్‌ | చతర్వక్త్రం చతుర్వేదం చతురాశ్రమ పూజితమ్‌ || 2

చాతర్వర్ణ్యధరం దేవం చాతుర్హోత్ర ప్రవర్తకమ్‌ | కృష్ణాజిన ధరం శాంతం ప్రభుం ప్రభవతామపి || 3

స్వయం భువ మచి న్త్యంచసర్గ సంహార కారకమ్‌ | తం సమాసాద్య జగతీ శక్రశ్చ గురుణాసహ || 4

వవందుస్తే మహాభాగం తుష్టువుశ్చ జగత్ప్రభుమ్‌ |

మార్కండేయు డనియె : ఇంద్రాదులు కలిసి బ్రహ్మసభ##కేగి యందు పద్మాసనమందున్న పద్మసంభవుని గనిరి. ఆతడు తామరరేకు రంగు కలిగి పద్మబోధుడైన సూర్యునట్లు వెలుంగుచు నాల్గుమోములు నాల్గువేదములుంగొని నాల్గా శమములచే బూజింపబడుచు చాతుర్వర్ణ్యధరుడై చాతుర్హోత్ర ప్రవర్తకుడై యుండి కృష్ణాజినముం ధరించి శాంతుడై సర్వజీవులకు బ్రభువై తేజరిల్లుచున్న స్వయంభువును అచింత్యుని సర్గసంహారకారణమైన యా సురజ్యేష్ఠునిం దరిసి భూదేవి శక్రుడును బృహస్పతితో గూడ నేగి యా మహానుభావునికి నమస్కరించి యా జగత్ప్రభువు నిట్లు స్తుతించిరి.

శక్రాదయ ఊచుః :

నమస్తే దేవదేవేశ ! సృష్టిసంహార కారణ ! | వేదమూర్తే ! తదాధార ! యజ్ఞ ! యజ్ఞాంగ ! యజ్ఞప ! 5

యజ్ఞయోనే ! జగద్యోనే ! సర్వ సత్త్వాభయప్రద ! | ప్రజాపతి పతే ! దేవ ! జగద్బీజ ! నమో7స్తుతే || 6

స్వయం భువే స్వయం కర్త్రే స్వయం భూతాంతరాత్మనే | సర్వభూత వరేణ్యాయ సర్వభూతేశ్వరాయ చ || 7

అచిన్త్యాయా ప్రమేయాయ ప్రకాశాయ మహాత్మనే | త్వమస్య జగతోనాథస్త్వయి సర్వం ప్రతిష్ఠితమ్‌ || 8

త్వయా వినాజగత్యస్మి& నాన్యత్‌ కించన విద్యతే | ఇంద్రియాణీంద్రియార్థాశ్చ తేభ్యః పరతరంచయత్‌ || 9

వ్యక్తా7వ్యక్తో జగన్నాథ ! త్వమేవైకః ప్రకీర్తితః | త్వం తపాంసి వరిష్ఠాని కృచ్ఛ్రాణి నియమాని చ || 10

కలాః కాష్ఠా ముహూర్తాశ్చ కాలస్యావయవాశ్చయే | కాలచక్రం జగచ్చక్రం త్వమేకః పురుషోత్తమః || 11

త్వమేవ వరదో దాతా దేవః శుభ చతుర్ముఖః | త్వత్తః ప్రసూతా లోకే7స్మి& ధర్మరుద్రౌ జగత్పతీ || 12

భృగ్వంగిరా మరీచిస్తు పులస్త్యః పులహఃక్రతుః | అత్రిశ్చైవ వశిష్ఠశ్చ త్వయాసృష్టాజ గత్పతే ! || 13

సనత్కుమారో భగవా& సనకశ్చ సనందనః | ఆకృతి శ్చ రుచి శ్శ్రద్ధా త్వయా దేవ ! వినిర్మితా || 14

పూర్వాత్తే వదనాజ్జాత మృగ్వేద మమృత ప్రభమ్‌ | దక్షిణా ద్వదనా జ్జాతం యజుర్వేదం తథై వచ || 15

పశ్చిమా ద్వదనా జ్జాతం సామవేదం తథా తవ | ఉత్తరాద్వదనా జ్జాత మథర్వాం గిరసం శుభమ్‌ || 16

బ్రాహ్మణాస్తే ముఖా జ్జాతాః బాహుబ్యాం క్షత్రియా స్తథా |

ఊరు ద్వయా త్తథావైశ్యాః పద్భ్యాం శూద్రా స్తథై వచ || 18

విద్యుతో7శని మేఘాశ్చ రోహితేంద్ర ధనూంషిచ | త్వత్తః ప్రభో ! ప్రసూతాని ప్రవిశన్తి తథాత్వయి || 19

స్వయంభూర్భగవా& విష్ణుః దేవ దేవ స్సనాతనః | నామ మాత్ర విభేదేన మోహయ స్యఖిలం జగత్‌ || 20

త్వత్తేజసా మయాదైత్యాః యే యుద్ధే వినిపాతితాః | తే క్షితౌ క్షత్రియా జాతాః పీడయంతి తథా క్షమామ్‌ || 21

తేషాం భారేణ ఖిన్నేయం త్వత్సకాశ ముపాగతా | వసుధా వసుధాపాం ! తాం త్రాయస్వ నమో7స్తుతే || 22

మార్కండేయ ఉవాచ :

ఏవం పితామహోదేవః స్తుత శ్శక్రేణధీమతా | గురుణాచ సమేతేన పూజయామాస తా వుభౌ || 23

పూజయిత్వా చ వసుధాం శక్రం వచన మబ్రవీత్‌ | వ్రజధ్వం దేవదేవస్య శంకరస్య మహాత్మనః || 24

భువ శ్చికీర్షితం సర్వం నివేదయత మాచిరమ్‌ | ఉపాయం క్షత్రియ వధే యుష్మాకం కథయిష్యతి || 25

ఇత్యేవ ముక్తాస్తు పితామహేన జగ్ముస్తదా రుద్రసదః ప్రతీతాః |

శక్రో7థ దేవీచ వసుంధరాచ గురు స్సురాణాం చ సధర్మశీలేః || 26

ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ప్రథమఖండే మార్కండేయ వజ్రసంవాదే - బ్రహ్మలోక గమనం నామ నప్త వింశతితమో7ధ్యాయః

ఇంద్రాదులు బ్రహ్మను స్తుతించుట :

దేవదేవేశ ! సృష్టిసంహారములకు కారణమైన ఓ వేదమూర్తీ ! వేదాధారా ! యజ్ఞ యజ్ఞాంగ యజ్ఞపాలక యజ్ఞకారణ జగత్కారణ సర్వభూతాభయప్రదా ! ప్రజాపతీ ! ఓ జగద్బీజమా ! నీకు నమస్కారము. స్వయంభువునకు స్వయంకర్తకు సర్వభూతాంతరాత్మకు అచింత్యున కప్రమేయునకు ప్రకాశరూపునకు మహాత్మునకు నీకు వందనము. ఈజగత్తునకు నీవు నాథుడవు. నీయందిదియెల్ల ప్రతిష్ఠితమైనది. నీవు లేక యీ జగత్తునందింకొకటి లేదు. ఇంద్రియములు నింద్రియార్థములు వానికంటె పైనుండునది వ్యక్తావ్యక్తమైనదెల్ల నీవొక్కడవేయని కీర్తింపబడినావు. శ్రేష్ఠములయిన తపస్సులు కృచ్ఛ్ర చాంద్రాయణాది వ్రతములు కళలు కాష్ఠలు ముహూర్తములు మొదలగు కాలావయవములు కాలచక్రము జగచ్చక్రమంతయు నీవొక్కడవే; పురుషోత్తముడవై యున్నావు. నీవే వరదుడవు దాతవు శుభములగు నలు మోములు దాల్చినవాడవు నీవలన నీలోకమున ధర్ముడు (యముడు) రుద్రులు భృగ్వంగిరుడు మరీచి పులస్త్యుడు పులహుడు క్రతువు అత్రి వశిష్ఠాదులు నీవలన సృష్టింపబడిరి. భగవంతులు సనక సనందన సనత్కుమారులు ఆకృతి రుచి శ్రద్ధయు నీవలన నిర్మింపబడినారు. అమృతజ్యోతియైన ఋగ్వేదము నీ తూర్పువైపుముఖమునుండి యజుర్వేదము దక్షిణముఖమునుండి సామవేదము నీ పశ్చిమముఖమునుండి అధర్వాంగిరసము (అధర్వవేదము) నీ ముఖమునుండి బ్రాహ్మణులు బాహువులనుండి క్షత్రియులు ఊరుద్వయమునుండి వైశ్యులు పాదములనుండి శూద్రులు జనించిరి. మెఱపు పిడుగు మేఘములు రోహితేంద్ర (రోహితము=తిన్నని యింద్ర ధనుస్సు) ధనుస్సులు నీలోనుండి పుట్టినవి. నీలోనే ప్రవేశించుచున్నవి. స్వయంభువు భగవంతుడు విష్ణువు సనాతనుడు దేవదేవుడను పేరులమాత్రమున నొక్కడవేయైన నీ వీ జగత్తును మోహపెట్టుచున్నావు. నీ తేజస్సుచే నే ననిలో గూల్చిన దైత్యులు క్షితియందు క్షత్రియులైపుట్టి క్షమను (భూమిని) బాధించుచున్నారు వారి బరువుచే ఖేదవశ##యై యిదిగో వసుధ నీదరికి వచ్చినది. ఓ వసుధాపాలక! సర్వంసహను నీవు గాపాడుము. నీకు నమస్కారము. అని యిట్లు గురునితోగూడి దేవేంద్రుడు స్తుతింప వారినిద్దరిని విధాత పూజించి భూదేవిని శక్రునుద్దేశించి మీరిద్దరు నిటనుండి సత్వరము వెళ్ళుడు. దేవదేవుడగు శంకరునికి భూమికి జేయవలసినదెల్ల నివేదింపుడు. ఆ మహాత్ముడు క్షత్రియ సంహారమున కుపాయము మీకు దెలుపగలడు. అని బ్రహ్మ పలుక తనివినొంది శివసదస్సునకు శక్రుడు వసుంధరాదేవి ధర్మ శీలుడు సురగురువునుం గలిసివెళ్ళిరి.

ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణము ప్రథమఖండమున యింద్రాదుల బ్రహ్మలోకగమనమను నిరువదియేడవ యధ్యాయము

Sri vishnudharmothara Mahapuranam-1    Chapters