Sri vishnudharmothara Mahapuranam-1    Chapters   

రెండువందల అరువదియొకటవ అధ్యాయము - ద్వంద్వ యుద్ధవర్ణనము

నిశావసానే గంధర్వాః కృత్వా వ్యూహం సుదుర్జయమ్‌ | సంప్రతీక్ష్యన్త భరతమాయాంతం రణకోవిదమ్‌ || 1

భరతోపిచ రాత్ర్యంతే వజ్రవ్యూహేన దంశితః | ఆససాద మహత్సైన్యం గంధర్వాణాం సుదుర్జయమ్‌ || 2

తతః ప్రవవృతే యుద్ధం యమరాష్ట్రవివర్ధనమ్‌ | దేవాసుర సమప్రఖ్యం త్రైలోక్యభయకారకమ్‌ || 3

పత్తీనాం పత్తిభిః సార్ధం సాదినాంచైవసాదిభిః | రథినాం రథిభిశ్చైవ కుంజరాణాంచ కుంజరైం || 4

భాషతాం నామ గోత్రాణి శూరాణాంచైవ గర్జతామ్‌ | ధనుషాం కూజతాంచైవ శబ్దః సమభవత్తదా || 5

తతః ప్రవృత్తే సంగ్రామే భారతిః పుష్కరోరణ | ఆససాద విశాలాక్షం గంధర్వం రణగర్వితమ్‌ || 6

తక్షశ్చ భారతిః శ్రీమాన్యు యధే వీరబాహునా | సేనానీర్విజయః శ్రీమాన్న ముచిశ్చతమాగతః || 7

భూమన్యుః కారకః శ్రీమాన్కామపాలేనసంగతః | కిరాతరాజో దమన శ్చంద్రా పీడేన సంగతః || 8

ప్రభద్రకేణ శిబినా తథైవాజికరోరణ | మహోదయః సునిర్దేశో హరికేశేన సంగతః || 9

త్రైగర్తో వసుదానశ్చ సూర్యరశ్మశ్చ సంగతౌ | గంధర్వః కుముదా పీడః కులూతాధి పతిర్జయః || 10

చక్రతుస్తు ములం యుద్ధం దేవాసుర సమం తదా| దాశేరక స్తథా రాజా యవనోవాశనఃపరః || 11

ఏకలవ్యశ్చ సంగ్రామే తేనసీత్సుమహాత్మనా|కుముదః శోణిమా శూరో బలబంధుః సుయోధనః || 12

గంధర్వైః పంచభిః పంచ పార్వతీయాః సమాగతాః | బలాకాబలాకా భ్యాంతు గదినా మౌళినా తథా || 13

కుముదేనతు వీరేణ సదసీష్వ నివర్తినా | మద్రరాజోంశుమా న్నామ చతుర్భిః సంగతోరణ || 14

భీమనాద మహానాద వసుషేణ గజాకరైః | దార్వః శ్రుతం జనః శ్రీమాన్‌ అభిమానః కృతం జయః || 15

యుద్ధంతౌ చక్రతుర్ఘోరం సహితౌ చంద్రవర్మణా | కాశ్మీరకః సుబాహుశ్చ గంధర్వేణ సుబాహునా || 16

చకారతుములం యుద్ధం భీరూణాం భయవర్ధనమ్‌ | భరతస్యా పరే యోధా గంధర్వై ర్భీమవిక్రమైః || 17

సమాగతాస్తథా యుద్ధే శతశోథ సహస్రశః | భరతశ్చ మహాతేజాః శైలూషేణ సమాగతః || 18

చకార తుములం యుద్ధం సర్వభూత భయంకరమ్‌ | పర్వాభేన నాగేన త్రిధా ప్రస్రవతా మదమ్‌ || 19

బాధమానమరీ న్సంఖ్యే మహేంద్రమివదానవాన్‌ | విశాలోవారయామాస రథేనాభ్యేత్య పుష్కరమ్‌ || 20

బాణౌఘేన రణభిత్వా వేగం పుష్కర దంతినః | పుష్కరం తాడయామాసనారాచైర్బహుభి స్తదా || 21

మార్కండేయుడనియె : రేయితుద గంధర్వులు జయింపరాని వ్యూహముబన్నిరి భరతుడు వజ్రవ్యూహమునజిక్కి మహాసైన్యమును జేరెను. అంతటయమ రాష్ట్రవివర్ధనమైన (యముని రాజ్యమును సమ్మర్దపరచునది) యుద్ధమారంభమయ్యెను. అది దేవాసుర సంగ్రామమువంటిది. పదాతివర్గము పదాతివర్గముతో ఆశ్వికు లాశ్వికులతో రథికులు రథికులతో నేనుగు లేనుగులతో దలపడి పోరిరి. నామగోత్రములు పేర్కొనుచుగర్జించు చున్న వీర భటులయొక్కయు కూతలిడుచున్న ధనుస్సులయొక్క ధ్వనియట నుద్రిక్తమయ్యెను అందు భరతపక్షమువాడు పుష్కరుడు రణగర్వితుని విశాలాక్షుడును గంధర్వు నెదిరించెను . భరతపక్షమువాడు తక్షుడువీరబాహునితో దలపడెను. సేనానివిజయుడు సముచితముగ నాతనికి బాసటయైరి. భూమన్యువు కురువంశమువాడు కానుపాలునితో గూడెను. కిరాతరాజు దమనుడును చంద్రాపీడునితో గూడిరి. అజికరుడు ప్రభద్రకునితోశిబితో మహోదయుడుమునికేశుడు మరికేశునితో గూడెను త్రైగర్తుడు (త్రిగర్తదేశాధిపతి) వసుదానుడు సూర్యరశ్మియుందలపడిరి. గంధర్వుడుకు ముదాపీడుడు కులూతాధిపతి జయుడును దేవాసురసమ మయినసంకుల యుద్ధ మొనర్చిరి దాశేరదేశాధిపతియవనుడునైన వాశనుడు ఏకలవ్యుడును బోరిరి. కుముదుడు శోణిమ శూరుడు బలబందుడు సుయోధనుడను నైదుగురు గంధర్వులతో కొండరాజు లైదుగురు డీకొనిరి. బలకుడు అబలకుడు గదాధారి మౌలి కుముదుడు నను నల్వురతో నంశుమంతు డెదిరించిరి. భీమనాదమహానాద వసుషేణ గజాకరులతో దార్వుడు శ్రుతంజయుడు అభిమానుడు కృతంజయుడు నెదిరించిరి. చంద్రవర్మతో కాశ్మీరకుడు సుబాహువుం బోరిరి. భరతుని యితరయోధులు గంధర్వులును వందలువేలు సమావేశ##మై తలబడిరి. భరతుడు శైలూషునికెదురుసని సంకుల సమరమొనరించెను. నడగొండవలెనున్నది మూడదారుల మదము స్రవించునదియు నింద్రుడు దానవులనట్లు శత్రువులందెగ బాధించునదియునగు పుష్కరునితో విశాలుడు రథమెక్కివచ్చి యెదిరించెను. (వరయామాస అనియున్నది) పుష్కరుడు ఏనుగునెక్కి యుద్ధముచేయువాడుగాని ఏన్గుకాదు. అతడు బాణజాలముచే పుష్కరుని వేగముంగొట్టి పెక్కు బాణములచే వాని యేనుగుం గొట్టెను.

రిపుభిస్తాడ్యమానస్తు భారతిర్భీమ విక్రమః | వవర్ష శరసంఘాతైర్విశాలం సేనయాసహ || 22

పుష్కరస్య విశాలో థమథ్యే చిచ్ఛేదకార్ముకమ్‌ | ఛిన్నధన్వా విశాలస్య సజఘానాథసారథిమ్‌ || 23

ఆక్రమ్య యోధయామాస విశాలస్య మహారథమ్‌ | యదా రణ మహారాజ పుష్కరస్య రథోత్తమమ్‌ || 24

హంతుంసరథ ముత్సృజ్య విశాలోపిమహీపతేః | గదయా యోధయామాస పుష్కరస్యచ వారణమ్‌ || 25

పుష్కరోపి గదాపాణి ర్విశాలాభిముఖం య¸° | గదాభిస్తౌ తతోవీరౌ పరస్పర జిగీషయా || 26

సర్వ దక్షిణతస్తత్ర మండలాని విచేరతుః | ప్రజహ్రతుస్తథాన్యోన్యమన్యోన్య స్యవధైషిణౌ || 27

పుష్కరేణ రణ యోగా ద్విశాలస్య గదా హతా | ముమోచ పావకం తీక్షం సస్ఫులింగం మహీపతే || 28

విశాలేనతతో యుద్ధే గదయా పుష్కరోహతః | హిమవత్సంనికాశస్తు నచచాల పదాత్పదమ్‌ || 29

పుష్కరేణ మహారాజ విశాలోగదయాహతః | తతః శైలూష వచనా న్మహామాత్ర ప్రచోదితమ్‌ || 30

ఆరురోహ మహానాగం విశాలో రణ దర్పితః | ఆరురోహ రథం శ్రీమాన్గంధర్వస్యచ పుష్కరః || 31

తావేకరథమారూఢౌ తదా రాజేంద్ర పుష్కరౌ | నిజఘ్నతుర్విశాలస్య సంగ్రామే వరవారణమ్‌ || 32

యస్యావర్జితనాగస్య కుంజరాన్ని పతిష్యతః | చిచ్ఛేదాథ విశాలస్య శిరోజ్వలిత కుండలమ్‌ || 33

హత్వా విశాలం సంగ్రామే రథమారుహ్యచాపరమ్‌ | ఛాదయామాస తత్సైన్యం గంధర్వాణాంవరోత్కరైః || 34

విశాలం నిహతం దృష్ట్వా రుహః పరమకోపనః | సాదీ జఘాన ప్రాసేన గాంధారం రణగర్వితమ్‌ || 35

తస్య చిచ్ఛేద గాంధారః సప్రాసంతు భుజద్వయమ్‌ | శిరశ్చస శిరస్త్రాణం క్షురప్రేణ మహీపతే || 36

శత్రువులచే గొట్టబడి భారతి (భరతసేనలోనివాడు) పుష్కరుడు విశాలుని బాణుములం గొట్టెను. విశాలుడు పుష్కరుని విల్లు నడిమికి ఖండించెను. ధనువుతెగి యతడు విశాలుని సారథిం గొట్టెను. వానిరథమాక్రమించి విశాలుడు రథమును వదలివేసి పుష్కరుని గుఱ్ఱములండీకొనెను. పుష్కరుడును గదగొని విశాలునికెదురునడచెను. వారిద్దరు గదాయుద్ధము నారంభించిరి. ఇరువురుం గుడియెడమగా మండల భ్రమణము సేసిరి. ఒకరినొకరు చంపుకొనవలెనని డీకొనిరి దైవయోగమున విశాలుని గదను పుష్కరుడు నరకెను. నరుకువడిన యాగద మిణుగురులతో నిప్పులం జెరవెను. అంత విశాలుడు పుష్కరుని గదచే గొట్టెను. హిమాలయపర్వతమట్లున్న యతడు గడుగునం జలించి గదగొని విశాలుం గొట్టెను. ఆపైని విశాలుడు శైలూషునాన మావటీడు. నడుపుకొనివచ్చిన మహాగజమెక్కెను పుష్కరుడు శైలూష గంధర్వుని రథమెక్కెను. ఆట్లయ్యిద్దరు నొక రథమెక్కి విశాలుని గజేంద్రముంగొట్టిరి. అది లొంగిపోవ దానిపైనుండి పడిపోవుచున్న విశాలునికుండ లోజ్జ్వలమైన శిరస్సు పుష్కరుడు ఛేదించెను. విశాలుంజంపి వేరు రథమెక్కి గంధర్వ సైన్యమును బాణములచే గప్పివేసెను. రుహుడనువాడు విశాలుడు హతుడగుటచూచి పరమ కోపనుడై అశ్వారూఢుడై చని గాంధారుని ప్రాసాయుధముచే గొట్టెను. గాంధారుడా విశాలుని ప్రాసాయుధముతోడి భుజమును నరకెను. క్షురప్రమను నాయుధముచే బొమిడికముతోడి వాని శిరస్సును నరకెను.

తక్షో రథేణ శుభ్రేణ కింకిణీజాలమాలినా | ఆససాద మహాబాహుం వీరబాహుం రణాజిరే || 37

ఏకచ్ఛాయ ఇవాకాశ స్తయోరాసీచ్ఛరోత్కరైః | నవాతి పవనస్తత్రన విభ్రాజతి భాస్కరః || 38

తక్షః సపుంఖమాకృష్యబాణం భాస్కర సప్రభమ్‌ | చిచ్ఛేద సారథే స్తస్య శిరోజ్వలితకుండలమ్‌ || 39

నిర్యంతృణా రథేనాసౌ సమరాదపవాహితః | తస్మిన్రణాజిరాన్నీతే తక్షం కుంజర ధూర్గతః || 40

అజగామ మహారాజ గంధర్వస్తు సుదర్శనః | తస్యాపతితమాత్రస్య శ##రేణ నతపర్వణా || 41

చిచ్ఛేదనాగమూర్ధానం భారతిర్భీమవ్రికమః | సేనానీర్విజయః శ్రీమాన్నముచిశ్చ సమాగతౌ || 42

సారథిం తురగాన్కేతు మదృశ్యం చక్రతుః శ##రైః | అన్యోన్యస్య మహారాజ సమరే భీమవిక్రమౌ || 43

చతుర్భిః సాయకైర్హత్వా నముచేః సతురంగమాన్‌ | పంచమేన శిరః కాయా జ్జహారరథసారథేః || 44

నముచిర్విరథః ఖడ్గమాదాయ పరవీరహా | జగామాభిముఖస్తూర్ణం సేనాపతిమరిందమ || 45

వేగేనా పతత స్తస్య చక్రామాదాయ భాస్వరమ్‌ | వివృత్తాక్షన్తు చిచ్ఛేద తస్య మూర్ధాన మంజసా || 46

అటుపై తక్షుడు కింకిణీజాలమాలాభిరామమైన తెల్లనిరథమెక్కి మహాబాహువగు వీరబాహు నెదుర్కొనెను. ఆ యిర్వుర బాణములచే నాకాశ##మేకచ్ఛాయమైనట్లుండెను. (ఒకేరంగున నున్నట్లు కనిపించెనన్నమాట) అచట గాలియాడదు. రవి వెలుగడయ్యె. తక్షుడు భాస్కర ప్రభ##మైన బాణమును సపుంఖమును (రెక్కలతోడి దానిని) ఆకర్షించి వాని సారథియొక్క కుండలోద్దీప్తమైన శిరమును ఖండించెను, సారథిలేని వీనిరథముతో నాతడు రణరంగమునుండి తరలింపబడెను. అతడట్లు గొనిపోబడినంత కుంజర మెక్కి సుదర్శనుడను గంధర్వుడు తక్షునిపైకి వచ్చెను. అతడట్లు పైబడినదే తడవుగ తీక్షశరముచే అవక్రవిక్రముడు భారతి (భరతయోధుడు) ఏనుగు తలను నరకెను. సేనాని విజయుడు నముచియుం గలిసివచ్చి శరములచే సారథిని గుఱ్ఱములను కేతువును గానరాకుండజేసిరి. అతడు నాల్గు బాణములచే నముచి గుఱ్ఱములం జంపి యైదవదాన సారథి శిరము బడవేసెను. నముచి విరథుడై కత్తిచేకొని సేనాపతి కెదురు నడచెను. వేగమునం బైబడుచున్న గ్రుడ్లు తిరుగుడువడు వాని శిరస్సును వెలుగొందు చక్రముంగొని ఛేదించెను.

భూమన్యుః కామపాలశ్చచక్రతుర్యుద్ధ ముత్తమమ్‌ | యథా దేవాసురే యుద్ధే బలశక్రౌ మహాబలౌ || 47

తావుభౌ కుంజరారూఢౌ పరస్పర వధైషిణౌ | తోమరైశ్చ క్రతుర్యుద్ధం సూర్యాంశు సదృశప్రభైః || 48

యుధ్యతామేవ తేషాంతు భూమన్యుర్వరవారణః | పార్శ్వే జఘాన దంతాభ్యాం కామపాలస్యవారణమ్‌ || 49

సహితస్తేన నాగేన కృత్వారావం భయానకమ్‌ || 50

ఆసీత్పరాఙ్ముఖో యుద్ధే వర్తమానః స్వకం బలమ్‌ | కామపాలం రణజిత్వా భూమన్యుర్భీమవిక్రమః || 51

గంధర్వసేనాం సహసా జఘాన నిశితైః శ##రైః | కిరాతరాజో దమన శ్చంద్రాపీడశ్చ సంగతౌ || 52

చక్రతుస్తుములం యుద్ధం సమరేరథ ధూర్గతౌ | చంద్రాపీడ శరవ్రాత నిమతౌ పార్షిసారధీ || 53

కిరాతరాజ స్తురగాణాం స్వయం రశ్మిగ్రాహకోభవత్‌ | వివ్యాధసశరవ్రాతై శ్చంద్రాపీడం రణ తదా || 54

చంద్రాపీడ శరవ్రాతైః కృతా పీడో రణాజిరే | జఘాన తురగాం స్తస్య దమనస్య మహీపతేః || 55

శక్త్యా వేగాచ్చ వివ్యాధ తదాతం భీమవిక్రమమ్‌ | శక్త్యావి భిన్న హృదయః పపాతవసుధాతలే || 56

జఘాన భారతం సైన్యం చంద్రాపీడో 2 పిసాయకైః | ఆరోప్య స్వరథం వీరం మధుమాన్దమనం తథా || 57

భూమన్యువు కామపాలుడు నటపోరిరి. బలుడు బలారి దేవాసురసంగ్రామమందట్లా యిద్దరు నొకరినొకరు చంపవలెనని యేన్గులెక్కి సూర్యాంశుని భములైన తోమరములం (బల్లెములచే) బొడిచికొనిరి. వారట్లు పోరుచుండగనే భూమన్యుడనువారణము దంతములచే కామపాలుని యేనుగుయొక్క పార్శ్వములం గ్రుమ్మెను దానితోగూడ కామపాలుడు తాను భయంకరముగ నార్చి తన బలమును మరలించుకొని పెడమొగము పెట్టెను భూమన్యనట్లు కామపాలు డోడించి గంధర్వసేనను నిశితబాణములంగొట్టెను. కిరాతరాజు దమనుడు చంద్రాపీడుడుంగలసి తుములయుద్ధము సేసిరి చంద్రాపీడుని శరములచే పార్షి సారథులుగూల కిరాతరాజు స్వయముగా గుఱ్ఱముల పగ్గములంబట్టెను (తానేసారథియయ్యెనన్నమాట) చంద్రాపీడుని వరములం గొట్టెను. చంద్రాపీడ శర సంచయముచే కృతాపీడుడై దమనుడు వాని గుఱ్ఱములంగొట్టెను. ఆమీద శక్తియను నాయుధముతో వానింగొట్టెను. శక్తిచే గుండె బ్రద్దలైకూలెను చంద్రాపీడుడు భారతసైన్యమును హతమార్చెను. కూలినయాదమనుని మధుమంతుడు తన యరదమెక్కించికొని మహొషధులను (మూలికను) వాడి విరుజుని (బాధలులేని వానిని) అవ్రణుని=కఱకులులేని వానిని జేసెను.

చకార విరుజం శీఘ్రమ వ్రణంచ మహౌషధైః | యుయుధేచ నికుంభేన మత్స్యరాట్‌ సరథస్తథా || 58

రథ స్థితౌ మహీవీరౌ వరచాప మహాకరౌ | అన్యోన్యం శరవర్షేన ఛాదయేతాంఘనావివ || 59

సురథస్తు నికుంభస్య శ##రేణశతప్వణా | బాపమృష్టౌ ప్రచిచ్ఛేద భుజందండం తథాహవే || 60

నికుంభోపి ప్రచిచ్ఛేద సురథస్యతుకార్ముకమ్‌ | తావన్యే ధనుషీ సజ్యేకృత్వా వీరౌ పరస్పరమ్‌ || 61

ఛాదయేతాం తథాన్యోన్యం వీరౌ సాయకవృష్టిభిః | అన్యోన్యస్య హయాన్హత్వా చిచ్ఛేద ధనుషీ తతః || 62

హయాన్రథాభ్యాం కాలస్య నిర్జిత్యా వశమోజసా | ధనుషోమధ్యభాగేతు అన్యోన్యస్యన్య కృంతతామ్‌ || 63

విరథా వసి యుద్ధాయ చక్రతుర్యత్నము ముత్తమమ్‌ | ఆదాయ విపులం చర్మ శతచంద్రంచ భాస్వరమ్‌ || 64

ఆదధాతే ఖడ్గవరావన్యోన్య వధ కాంక్షిణౌ | ఖడ్గమాకాశ సదృశ మన్యోన్యం ప్రవిజఘ్నతుః || 65

మండలాని విచిత్రాణి గత ప్రత్యా గతానిచ | కైశికానిచ మార్గాణి దర్శయామాసతుస్తదా || 66

భ్రాంతముద్ర్భాంతమావిద్ధమాప్లుతం విసృతం సృతమ్‌ | సంపాతం సముదీర్ణంచ ఖడ్గ చర్మ విదారణమ్‌ || 67

ఈక్షితృప్రీతి జననం యుద్ధమాసీత్తయోస్తదా | కృత్వాతౌ సుచిరం యుద్ధం పరస్పర రణ హతౌ || 68

జగ్మతుర్వసుధాం వేగాత్‌ శక్రచాపసమావుభౌ | తతః స్వరథమారోప్య సురథో రథి వర్ధనః || 69

తస్మాద్దేశా దపోవాహ్య సర్వసైన్యస్య పశ్యతః |

అప్పుడు మత్స్యరాజు రథమెక్కి నికుంభునితో బోరెను. ఆ ఇర్వురువీరులు వరచాపధరులై యొండొరులను శరవర్ష ములంగప్పికొనిరి సురథుడు శరముచే నికుంభుని భుజదండమును ధనుస్సుపట్టిన పిడికిటం గొట్టెను. నికుంభుడును సురథుని ధనుస్సును నరకెను. వారిద్దరు వేరువిండ్లుకొని యెక్కిడి శరవర్షములచే నొకరి నొకరుగప్పికొనిరి. ఒండొరుల గుఱ్ఱములను ధనుస్సులం బడవేసికొనిరి. రథములనుండి గుఱ్ఱములను విడివడంజేసి వింటినడిమినిద్దరు విరుగనేసిరి. అటుపై నిద్దరు విరథులై ఖడ్గయుద్ధమునకుంబూనిరి. విపులమైన చర్మముతో నూరుచంద్ర బింబములట్లుదీపించు యాకాశమట్లుపదనెక్కి నిర్మల ములయిన కత్తులంగొని కొట్టుకొనిరి. మండలములు గిర్రునదిరుగట విచిత్రములైన గత ప్రత్యాగతములు=దూరముగా వెళ్లినట్టు వెళ్లితటాలున మఱిలికొనుట కైశికాని=జుట్టుజుట్టుపట్టుకొని నేలకువంచుట మొదలయిన మార్గములను=వస్తాదులు ఖడ్గయుద్ధములో జూపు చిత్ర చిత్ర ప్రక్రియలను ప్రదర్శించిరి. అట్లే భ్రాంతము ఉద్ర్భాంతము ఆవిద్ధము ఆప్లుతము విసృతము సృతము సంపాతము సముదీర్ణము కత్తులయొక్కయు వర్మములయొక్క=కవచములయొక్క విదారణము ఖండనము నను పలురకములయిన ఖడ్గ యుద్ధ విన్యాసములతో వారి యుద్ధము చూపరులకు బ్రీతిజనకమయ్యెను. ఇట్లు చిరకాలము పరస్పరము గొట్టుకొని యిద్దరునతి వేగమున నింద్రధనుసులట్లుభూమికొఱగిరి. అంతట సురథుడు మహారథి వారిందనరథమెక్కించికొని సేనయెల్ల జూచుచుండ నా చోటునుండి తరలించెను.

నికుంభేచాథ సమరే సురథేన తదా రుషా || 70

గోవాసనేన సాల్వేన త్వరమాణస్సమాగతః | బాణ జాలేన సమరే చక్రుర్యుద్ధం సుభైరవమ్‌ || 71

తావుభౌరథగౌవీరౌజతుర్దివ్యధన్వినౌ | తతక్షతుః శరవ్రాతై స్తదాన్యోన్యం తథాన్వితౌ || 72

అన్యోన్యస్య హయాన్హత్వాచ్ఛిత్వాచ ధనుషీ తథా | విరథౌ చక్రతుర్యుద్ధం గదాభిరితరేతరమ్‌ || 73

విచేరతుస్తౌ సంగ్రామే గదా హస్తౌ మదోద్ధతౌ | వాసితార్థే వనే మత్తౌ కుంజరావివయూథపౌ || 74

సుచిరంతౌ తదాయుద్ధం కృత్వావ్యాయామకర్షితౌ | ప్రహారవర సంతప్తౌ జగ్మతుర్వసుధాతలమ్‌ || 75

విహ్వలౌ రథయోః కృత్వా నీతౌతౌ స్వస్వసైనకైః | విరుజౌచ కృతా భూయో రణశీర్షముపాగతౌ || 76

ప్రభద్రకశ్చ సంగ్రామంచకారాజగరేణహ | ఈక్షితృప్రీతి జననం శరసంఛాదితాంబరమ్‌ || 77

సుముఖేవర్తమానస్య తదా రాజా ప్రభద్రకః | చిచ్ఛేదాజ గరస్యాజౌ శిరోజ్వలిత కుండలమ్‌ || 78

మహోదయః కుణిర్దేశో హరికేశస్య సంయుగే | గజేన పోథయామాస సురథం సరథ సారథిమ్‌ || 79

హతాశ్వరథ కుత్సృజ్యగదయా సుదృఢం రణ | హరికేశం మహా బాహుం చకారగతజీవితమ్‌ || 80

నికుంభుడు సురథుడునట్లనింగూలినంత గోవాసనుడు సాల్వుడునుంగ దిసి భైరవమైన పోరుసల్పిరి. అయ్యిద్దరు దివ్య ధనుర్ధరులై రథములందుద్దీపించుచు నొండొరులు శరవ్రాతములం మేనులం జెక్కికొనిరి. ఒక రొకరి గుఱ్ఱములం గూల్చికొని విండ్లు నరకికొని విరథుడై గదాయుద్ధమును గావించిరి. అందుమదోతుద్ధలయ్యిద్దరు యూథపములు (గజఘటానాయకములు) రెండు మదపుటేనుగులు అడవిలో వాసితార్థము=క్రుమ్ముకొన్నట్లు క్రుమ్ముకొని మిగుల యలసటకులోగి దెబ్బలకు మిగులతపించి నేలబడిరి. గ్రుడ్లుతేలవేసిన యాయిద్దరును నిరురథముల పైకెక్కించి వారివారి సైనికుల తీసికొనిపోయి చికిత్సలుచేయ తిరిగి రణతలమున కేతెంచిరి ప్రభద్రకుడు అజగరునితో దలపడి ప్రేక్షకులకు బ్రీతిగలుగ యమ్ములనింగియెల్ల గ్రమ్ముకొనంబోరిరి. ఎదుటబడిన యజగరుని కుండలోజ్జ్వలమైన శిరస్సును ప్రభద్రకనృపతి నరకెను. మహోదయుడు హరికేశుని దేశమువాడు కుణి సురథుని రథముతో సారథితో నేనుగుచేత ద్రొక్కించెను. ఆపైని గదవిసరి హరికేశునింజంపెను.

త్రైగర్తో వసుధానశ్చ సూర్య రశ్మిశ్చ సంగతౌ | చక్రతుస్తుములం యుద్ధం బలిశక్రా వివాపరౌ || 81

కృత్వాతౌ సుచిరం యుద్ధం పరస్పరస మాహతౌ | విచేతసౌరథోపస్థే నిషేదతురరిందమౌ || 82

విసంజ్ఞౌతు తదా నీతౌ సారథిభ్యాం రణాజిరాత్‌ | గంధర్వరః కుముదాపీడః కులూతాధిపతి ర్జయః || 83

చక్రతుస్తుములం యుద్ధం దేవాసుర సమం తదా | అన్యోన్యస్య హయాన్హత్వా చ్ఛిత్వా చధనుషీదృఢే || 84

ఖడ్గయుద్ధం చిరంకృత్వాచ్ఛిన్నఖడ్గౌ పరస్పరమ్‌ | నియుద్ధం చక్రతుర్వీరౌ బాహుద్రవిణశాలినౌ || 85

నియుద్ధస్యావసానేతు కులూతాధిపతిం జయమ్‌ | గంధర్వః కుముదా పీడోనిష్పి పేషమహీతలే || 86

తతఃఖడ్గం రయాద్గృహ్య శిరశ్ఛేత్తుం సముద్యతః | నృశంసం తం సమాలోచ్య సేనాపతి మరిందమ || 87

విజయస్తస్య మూర్ధానం పాతయామాస భూతలే | దాశేరకస్తథా రాజా యశ్చగోవాశనోశనః || 88

ఏకలవ్యస్య సంగ్రామం తైరాసీత్సుమహాత్మనః | తసై#్యకలవ్యస్తురగాన్జఘానాథ శిలీముఖైః || 89

గదయా ఘాత యామాస సచతస్యతురంగమాన్‌ | తయోర్విరథయో ర్భృత్యైరుపనీతౌ తురంగమౌ || 90

పృష్ఠతశ్చతథారూఢౌ వరప్రాసధరావుభౌ | ప్రాసవిభ్రామణోతేప పరివర్తవివర్తనౌ || 91

చక్రతుస్తుములం యుద్ధం చిత్రం లఘుచసుష్ఠుచ | మండలాని విచిత్రాణి తయోశ్చక్రు స్తురంగమాః || 92

ఈక్షితృప్రీతి జననం చిరం కృత్వా తతోరణమ్‌ | అన్యోన్య వేగాభిహతౌ పేతతుస్సతురంగమౌ || 93

భృత్యైశ్చరథ మారోప్య సమరాదపవాహితౌ |

అటుపై త్రిగర్తదేశాధిపతి వసుదానుడు సూర్యరశ్మియుంగూడి తలబడి రెండవబలి యింద్రుడన్నట్లు తు ములయుద్ధము సేసిరి. చిరకాలము కొట్టుకొని మూర్ఛవోయి తేరిమొగసాలలు గూలబడి రణరంగమునుండి గొంపోబడిరి. కుముదాపీడగంధర్వుడు కులూతాధిపతి జయుడు దేవాసుర సమమైన సమరమొనర్చిరి. ఒకరొకరి గుఱ్ఱములను ధనుస్సులను నఱకికొని చిరకాలము ఖడ్గ యుద్ధముసేసి కత్తులంద్రెంచుకొని బాహు సంపన్నులై యవ్వీరులు నియుద్ధము (బాహుయుద్ధము) సేసిరి. తుదకు కుముదాపీడుడు కులూతదేశపతిని జయుని నేలంబడవేసికాలఱాచెను. ఆపై కత్తిగొని తలనరుకంబోవ వాడతినీచుడని ఆలోచించి విజయుడాసేనాధిపతి తల నవనిం డొల్లనేసెను. ఏకలవ్యునికి దాశేరకపతి గోవాశనోశనునితో రణమయ్యెను. ఏకలవ్యుడు వాని హయములనమ్ములం గూల్చ వాడు గదతో నేకలవ్యుని యశ్వములం గొట్టెను. అట్లు విరథులైన వారిద్దరికి భృత్యులు గుఱ్ఱములం గొనివచ్చిరి. ఇద్దరు ప్రాసాయుధములాని వానిపైకెక్కి వానిం జడిపించుట పైకెత్తుట సవ్యాప సవ్యములుగ పరివర్తన వివర్తనములుసేయుట మున్నగు పలురకములయిన ప్రయోగరీతులందుముల యుద్ధమతి చిత్రముగ అతిలఘువుగ అతిసుష్ఠుగ (శాస్త్రీయముగ) గావించిరి. వారి గుఱ్రములు విచిత్రమండలములం బరిభ్రమించెను. చూపరులకు జూడముచ్చటగ రణముసేసి యొండొరుల వేగమున కిర్వురుం గుఱ్రములతోబాటు వడిపోయిరి. వారిని భృత్యులు రథమెక్కించి సమరభూమిందలగించిరి.

కుమారః శ్రేణిమాఞ్ఛూరో బలబంధుః సుయోధనః || 94

గంధర్వైః పంచభిః పంచ పర్వతీయాః సమాగతాః || బలాకాబలకాభ్యాంతు గదినామౌళినాతథా || 95

కుముదేనచ వీరేణ సమరేష్వనివర్తినా | చతుర్భిః సాయకైస్తీక్షైః కుమారో బలదర్పితః || 96

హయాంశ్చకార నిర్జీవాన్‌ బలాకస్య మహాత్మనః | హతాశ్వరథముత్సృజ్య బలాకాభ్రాతురంజసా || 97

ఆరురోహరథం శ్రీమద్బలాకస్య సుసంయుతమ్‌ తావేకరథమారూఢౌ భ్రాతరౌ సమరప్రి¸° || 98

ఛాదయామాస విశిఖైః కుమారో బలదర్పితః | బలాకస్తు కుమారస్య మధ్యే చిచ్ఛేద కార్ముకమ్‌ || 99

సచ్ఛిన్నధన్వా వేగేన గదామాదాయ వేగవాన్‌ | తామాదాయ జఘానాథ బలాకం సమరప్రియమ్‌ || 100

బలాకం నిహతం దృష్ట్వా రోషాదశ్రు నివర్తయన్‌ | కుమారం ప్రతిచిక్షేప బలాకశ్చైవతోమరమ్‌ || 101

తోమరేణచ నిర్భిన్నో రథోపస్థ ఉపావిశత్‌ | తం విసంజ్ఞమథోవాహసారథిర్హయయానవిత్‌; || 102

శ్రోణిమానథ సంక్రుద్ధో బలకస్య తదారణ | క్షురపర్యంతధారేణ చక్రేణాపహరచ్ఛిరః || 103

నిపాతితోథ తత్రైవ శూరేణ గదయాగదీ | తం నిహత్య తదా శూరో మౌలినః సారథింరణ || 104

గదయాపోథయామాసమేరుగౌరవయా తదా | కుముదస్య జఘానాథ గదయాసతురంగమాన్‌ || 105

హతాశ్వం రథ ముత్సృజ్య కుముదో గదినో రథమ్‌ | ఆరురోహ తదా శీఘ్రం ఖడ్గబాణ ధనుర్ధరః || 106

రథా రూఢస్య తసాథ్య బలకశ్చ మహారథః | జఘాన చతురో వాహాం శ్చతుర్భిస్సాయకై స్తదా || 107

జహార పంచమేనాథ శిరస్తస్య సకుండలమ్‌ | సారథింతు రథాత్తస్మాన్మౌలినో రథముత్తమమ్‌ || 108

హతసారథినం పూర్వ మారురోహ మహారణ | మౌలీయుద్ధాయ తస్థౌచ మహాబలపరాక్రమః || 109

ఆరుహ్య సరథం దివ్యం కింకిణీ జాలనాదితమ్‌ | తతః సమౌళినాక్రాంతః సుయోధన రథో రణ || 110

అవాకిరదమే యాత్మా శ##రైః సన్నత పర్వభిః | సుయోధనోపి విక్రమ్య మౌళినం మౌళి భూషితమ్‌ || 111

జహారసశిరస్త్రాణం శిరో జ్వలిత కుండలమ్‌ | మద్ర రాజోంశుమాన్నా మచతుర్భిః సాయకోత్తమైః || 112

భీమనాద మహానాద వసుమేషరుజాకరైః | చత్వారస్తే మహారాజమద్రరాజస్య సాయకైః || 113

నిజఘ్నుశ్చతురోవాహాన్సారథించ తథా రణ | అంశుమా న్రథముత్సృజ్య గదామాదాయ వీర్యవాన్‌ || 114

జఘాన చతురోవాహాన్భీమనాదస్య సంయుగే | సారథిం పోథ యామాస మహానద రథాం స్తథా || 115

గతాశ్వం రథ ముత్సృజ్య గదా వేగేన యాదవ | మహోదయస్యతం నాగం పోథయామాస వీర్యవాన్‌ || 116

సారథిర్భీమనాదస్య మహానాద రథం య¸° | భీమనాదంచ గదయా నిజఘానాథ మద్రరాట్‌ || 117

సమద్రరాజో గదయా సమరే తాడితో భృశమ్‌ | జగామ త్రిదివం రాజం స్త్యక్త్వా దేహం రణ ప్రియః || 118

కుమారుడు శ్రేణిమంతుడు శూరుడు బలబంధుడు సుయోధనుడు నను నైదుగురు గంధర్వులతో నైదుగురు పార్వతీయులు కొండరాజులు దలపడిరి. బలాకుడు అబలకుడు గది మౌలి కుముదుడు నను పేరివారాకొండరాజులు. కుమారుడు నాల్గమ్ములం బలాకుని గుఱ్రములం జంపెను. అతడురథమువిడిచి బలాకుడు తమ్ముడబలకుని తేరెక్కెను. ఇద్దరు నేకరథారూఢులైనవారిని కుమారుడమ్ములంగప్పి వేసెను. కుమారుడు గదగొని బలాకునిగొట్టెను. అన్నగూలుటగని కంటనీర్వెట్టుచు రోషముతో బలకుడు తోమరమును గుమారునిపైకి విసరెను. దానమేనువగిలి యతడు రథముమోసల నొఱగెను. విసంజ్ఞుడయిన యాతనిని వాని సారథి మయయానవిత్‌=అశ్వరథ సారథ్యము లెస్సగ దెలిసినవాడు రణరంగముం దప్పించెను. ఆమీదశ్రేణిమంతుడు క్రుద్ధుడైక్షుర పర్యంతధారమైన ( ) చక్రముచే బలకునితలం దెగనేసెను. ఆశ్రేణిమంతునిచేతనే గదచేత గదియుంగూల్పబడెను. వానిం జంపి యాశూరుడు మౌలియొక్క సారథింగూల్చెను. ఆగదమేరుపర్వతమంత బరువైనది. దానవా పైనికుముదుని గుఱ్ఱములం గొట్టెను. కుముదుడు రథమువిడిచి ఖడ్గబాణదనుర్ధారియై గదియొక్క రథమెక్కెను. బలకుడపుడు రథమెక్కినవాని నాల్గుగుఱ్రములను నాల్గుసాయకములంగూల్చి యైదవదాన సకుండలమైన శిరమును హరించెను. వానిసారథింగూడ గూల్చెను. ఆపై సారథివోయిన మౌలియొక్క రథమును బలకుడెక్కెను. ఆపై మౌలియు కింకిణీజాల నాదితమైన దివ్యరథమెక్కి యుద్ధసన్నద్ధుడయ్యెను. మౌళి యప్పుడు సుయోధను రథమెక్కి సన్నతపర్వములయిన బాణములచే ముంచెత్తెను. సుయోధనుడు విక్రమించి మౌలి భూషితుని (మౌలి=యుద్ధ వీరులు రాల్చు శిరస్త్రాణము బొమిడిక మనబడును.) మౌలియను వానిపై విక్రమించి శిరస్త్రాణముతోడి వాని కుండలోజ్జ్వలమైన తలనరికెను. ఆ మీద మద్రదేశ రాజగు అంశుమంతుని భీమనాదము మహానాదము వసు మేషము రుజాకరము నను వానిచే నాల్గు గుఱ్ఱములను సారథిని మద్రరాజు గూల్చెను. అంశుమంతుడు రథము వదలి గదగొని భీమనాదుని నాల్గు గుఱ్ఱములం నాల్గుబాణముల గొట్టెను. సారథిం రథమునుం గూల్పెను. గుఱ్ఱములులేని తేఱువదలి గదావేగముచే మహానాదుని యేన్గును జంపెను. భీమనాదుని సారథి మహానాదుని థమునకేగెను. మద్రరాజు భీమనాదుని గదగూల్చెను. మద్రరాజు దేహమువాసి స్వర్గమున కేగెను.

మహానాదోపి సమరే సాయకైర్లోమవాహిభిః | బిభేదమద్రరాజానం శతశోథ సహస్రశః || 119

సబాధ్యమానో నా రాచైర్మహానాద భుజచ్యుతైః | ఆరురోహ రథం శీఘ్రం వసుషేణస్య సత్వరః || 120

రథమారుహ్య వేగేన గదయా భీమవేగయా | చకారయుద్ధే నిర్జీవం వసుషేణం సమర ప్రియమ్‌ || 121

అరురుహ్య రథాత్తస్మా ద్గదయా భీమవేగయా | గజాకరస్యతురగాన్‌ సారథిం చాహనద్భీశమ్‌ || 122

హతేషుతేషు రాజేంద్ర తదావీరోగజాకరః | రథంతంతు సమారుహ్య భూయ ఏవతదంశుమాన్‌ || 123

చకారయుద్ధే నిర్జీవం గాందర్వంతం గజాకరమ్‌ | ఉత్ల్పుత్య తురగాత్తస్మా న్మహానాద రథంగతః || 124

గదయాపోథయామాస మహానాదం తదా రణ | రోష దీర్ఘాంకుశం కృత్వా కుంజరం భరతాజ్ఞయా || 125

ఆరుహ్య నిజగానాథగంధర్వాన్‌ శతశో రణ | దార్వః శ్రుతం జయః శ్రీమానాభిసారః కృతంజయః || 126

యుద్ధంతౌ చక్రతుర్వీరౌ సహితౌ చంద్రవర్మణా | చంద్రవర్మా మహాతేజాః శ్రుతంజయరథాద్ధ్వజమ్‌ || 127

శ##రేణ పాతయామాస వటవృక్ష మివోచ్ఛ్రితమ్‌ | శ్రుతం జయోపి సంక్రుద్ధ శ్చంద్రవర్మకరస్థితమ్‌ || 128

ద్విధాచకార తీక్షేన సాయకేన మహద్ధనుః | తంభిన్న ధనుషం వీరం శ##రైః సంనత పర్వభిః || 129

ద్విధా చకార సమరే పార్వతీయః కృతంజయః | చంద్రవర్మా సమాదాయ తతః శక్తిం సుదారుణమ్‌ || 130

బిభేద సమరే రాజన్రాజానం తం కృతంజయమ్‌ | సవిభిన్నస్తయా శక్త్యా రథోపస్థ ఉపావిశత్‌ || 131

తం విసంజ్ఞ మపోవాహ సంగ్రామాదథసారథిః | కృతంజయం మహారాజ రణదృష్ట్వా విచేతసమ్‌ || 132

సకుండలం సముకుటం చారుచంద్ర సమప్రభమ్‌ | శిరశ్చిచ్ఛేద తీక్షేన సాయకేనమహాత్మనా || 133

సమరేయతమానస్య సుభృశం చంద్రవర్మణా | కాశ్మీరకః సుబాహుశ్చ గంధర్వేణ సుబాహునా || 134

చకార తుములం యుద్ధం భీరూణాం భయవర్ధనం | ఉభౌతౌ తరుణౌ వీరా వుభౌ సమరదుర్మదౌ || 135

దర్వనీయావుభౌ వీరావుభౌ బాణ ధనుర్ధరౌ | తావుభౌ సదృశౌ వీర్యే శంబరామర రాజయోః || 136

ఉభౌ ప్రకారైశ్చలితౌ తథోభౌ దృఢవిక్రమౌ | చిచ్ఛిదుస్తే తథాన్యోన్యం ధ్వజచ్ఛత్రే నపాధిప || 137

అన్యోన్యస్య హయాన్హత్వా తథోభౌ పార్షి సారథీ | అన్యోన్యం ధనుషీ చ్ఛిత్వా సుదృఢే సమరప్రియే || 138

కృతే ప్రతికృతంచైవ కుర్వాణౌ భీమవిక్రమౌ | విరథా వసి యుద్ధాయ చక్రతుర్యత్నముత్తమమ్‌ || 139

అసియుద్ధం చిరం కృత్వా ఖడ్గమావిధ్య సత్వరః | పాతయామాస మూర్ధానం గంధర్వస్య నరాధిప || 140

ఆరురోహ రథం చాన్యం సుశీఘ్రం భరతాజ్ఞయా | తత్రారూఢస్స గంధర్వాన్‌ జఘాన శతశో రణ || 141

మహానాదుడును ఱక్కలుగల బాణములచే మద్రరాజుంగొట్టెను. అతడు వసుషేణుని యరదమెక్కి భీమవేగమైన గదచే వసుషేణుని గత జీవితుం జేసెను. మరియు నా రథము దిగి గదతో గజాకరుని తురగములను సారథినిం జావమోదెను. వారు సావజగాకరుడను వీరుడు వచ్చెను. రథమెక్కి తిఱిగి యంశుమంతుడును నా గజాకరుడను గంధర్వుని నిర్జీవుం జేసెను. తానెక్కిన గుఱ్ఱములనుండి దూకి గదతో మహానాదుని రథమెక్కి వానింగడతేర్చెను. రోషదీర్ఘాంకుశము పూని భరతాజ్ఞచే నేనుగెక్కి వందలకొలది గందర్వులంగొట్టెను. దార్వుడు దర్వదేశమువాడన్నమాట శ్రుతంజయుడు ఆభిసారుడు (అభిసారదేశమువాడు) శ్రీమంతుడునగు కృతం జయుడుచంద్రవర్మతో రణముసేసిరి. చంద్రవర్మ శ్రుతంజయుని రథమునుండిమఱ్ఱి చెట్టంతయెత్తైనధ్వజముం బడనేసెను. శ్రుతంజయుడును క్రుద్ధుడై చంద్రవర్మ చేతిలో నున్న మహాధనుస్సును పదునైన బాణముచే రెండుగావించెను. పార్వతీయుడు కృతంజయుడును ధనుస్సు తెగినవానింగూడ శరములంగప్పెను. చంద్రవర్మ సుదారుణమైనశక్తియను యాయుధముచే రాజగు కృతంజయుని గొట్టెను అతడు శక్తి విభిన్నుడైరరథము మోసలనుపవేశించెను. (కూర్చుండెను) తెలివి తప్పిన వానిని వాని సారథి రణమునుండి తరలించి కుండలముతో ముకుటముతోగూడి చక్కని చంద్రబింబ సదృశ##మైన చంద్రవర్మ శిరస్సును ఛేదించెను. కాశ్మీరకుడను సుబాహువు (వీరుడు) సుబాహు వను గంధర్వునితో సంకుల సమరము చేసెను. ఆయిద్దరు తరుణులు (వయస్సులో నున్నారు) కదన దుర్మదులు అందగాండ్రు ధనుర్ధరులు. శంబరునికి నింద్రునికి సమానులు. నానావిధ యుద్ధప్రకారములచే చలితులు. (దూకువారు) దృఢ విక్రములు. వారొకరొకరి ధ్వజములను చక్రములను నఱికికొనిరి. గుఱ్ఱములం గూల్చికొనిరి. పార్షి సారథులం జంపుకొనిరి. పార్షి=మడమల కడనంగరక్షకుడుగా నుండువాడు - ధనుస్సుల విరుచుకొనిరి. చేతకెదురుచేత చేసికొనిరి. (దెబ్బ కెదురుదెబ్బ కొట్టుకొనిరి.) విరథులై ఖడ్గయుద్ధమునకు బూనిరి. చిరకాలమసిమియుద్ధముసేసి కత్తిలాగికొని గంధర్వునితలను బడవేసెను. భరతాజ్ఞచే వేఱొక రథమెక్కి వందలకొలది గంధర్వులం గొట్టెను.

ఏతస్మిన్నంతరే క్రుద్ధః శైలూషః ససహాయవాన్‌ | చకార యుధి నిర్జీవాన్‌ నర నాగ తురంగమాన్‌ || 142

బభూవ భారతీ సేనా శైలూషేణోపమర్దితా | నిదాఘే పుష్పశ బల ద్విరదేనేవ పద్మినీ || 143

ఏతస్మిన్భారతే సైన్యే కశ్చిదాసీ న్మహారథః | పత్ర్యుద్య¸° యః సమరే శైలూషం రణకర్కశమ్‌ || 144

శేలూష శరసంపాతరుద్ధగోకుండలే రవౌ | నప్రాజ్ఞాయత రాజేంద్ర తదా కించిద్రణాజిరే || 145

అశ్రూయత మహాఞ్ఛబ్దస్తాలానాం పతతా మివ | నరనాగాశ్వ కాయేభ్యో విసస్రుః శ్రోణితాపగాః || 146

ఏవంతు భారతం సైన్యం కాల్యమాన మితస్తతః | శైలూషేత మహారాజ భరతం శరణం య¸° || 147

భరతోపి మహాతేజా దృష్ట్వా శైలూష మాగతమ్‌ | ప్రత్యుద్య¸° రతేనాజౌకింకిణీజాలమాలినా || 148

తతస్తౌ చక్రతుర్యుద్ధం ఘోరరూపం భయానకమ్‌ | త్రైలోక్య విజయాసక్తౌ యథోభౌ బలివాసవౌ || 149

:- శైలూష రణారంభము :-

ఈ లోన శైలూషుండు క్రుద్ధుడై నరులను కరులను హరులను నిర్జీవులం జేసెను. అప్పుడు శైలూష సమార్దితమై భారతీసేన (భరతుని యొక్క సేన) గ్రీష్మ మందు బూలరంగు చెఱచు ద్విరదముచేత పద్మిని వోలె (తామర లతవలె) నయ్యెను. ఈ భారత సైన్యమందున్న వాడు మహారథుడొక్కడు రణకర్కశుడైన శైలూషుని పైకెత్తిచనెను. శైలూషుని శరసంపాతముచే రవి కిరణమండల మడ్డగింపబడి యయ్యెడ రణాంగణ మందేమియిం గనరాదయ్యెనను. తాడి చెట్లు గూలుచున్న పెద్దచప్పుడు విననయ్యెను. నరకుంజర తురంగ మాంగములనుండి రక్తనదులు జాలెత్తెను. ఇట్లు శైలూషునిచే వ్యాకులముగా బడుచున్న సైన్యము బరతుని శదణొందెను. మహాతేజస్వి భరతుడును శైలూషుని రాకంగని యనిలో కింజకిణీజాలమాలాభి రామమైన తేఱక్కి యొదురుగునెను. అవ్వల నా యిద్దరు త్రైలోక్య విజయా సక్తులై పోరుకొనిన బలివాసవులట్లు ఘోరరూపమైన భయానకమైన యుద్ధము గావించిరి.

గంధర్వరాట్తతః క్రుద్ధః సింహవద్వినద న్విభుః | బరతస్య రథం తూర్ణం శరవర్షై రవాకిరత్‌ || 150

క్రమేణ సరథస్తస్య సమయః సహసారథిః | శరవర్షేణ మహతా సంఛన్నో నప్రకాశితః || 151

యుధాజిత్స్వల్ప సంభ్రాంతో ధైర్యమాసాద్య వీర్యవాన్‌ | చోదయామాసతానశ్వాన్‌ విభుగ్నా న్రిపుసాయకైః || 152

భరతోథధనుర్గృహ్య దివ్యం జలద నిస్స్వనమ్‌ | శైలూషస్య ద్విధాచక్రే క్షురప్రేణ మహద్ధనుః || 153

గంధర్వశ్ఛిన్నధన్వాస పునరన్యన్మహద్ధనుః | నిమేషాంతరమాత్రేణ సజ్జం చక్రే మహాబలః || 154

విచకర్షతతోదోర్భ్యాం చిక్షేపచ తతః శరాన్‌ | అథాస్యతదపి క్రుద్ధశ్చిచ్ఛేద భరతో ధనుః || 155

తస్యతత్పూజ యామాస లాఘవం త్రిదశాధిపః | శైలూషోపి తతః క్రుద్ధః ప్రగృహ్యాన్యన్మహద్ధనుః || 156

ముమోచ సమరే బాణాన్‌ బరతస్య రథం ప్రతి | యుధాజి న్మాతులస్తస్య సహయానేన లాఘవమ్‌ || 157

దర్వయామాస సమరే మోఘాన్కుర్వన్శరవ్రజాన్‌ | తురగా శ్చోద్యమానాస్తే మండలానీవ బభ్రముః || 158

యథా యథా శర వ్రాతా మోఘాయాన్తి మహీతలమ్‌ | భరతోపి మహాతేజా మండలీకృత కార్ముకః || 159

వీరకేతుం శరవ్రాతై ర్వివ్యాధ రణమూర్ధని | తాడితం సారథిం దృష్ట్వా వీరకేతుం తథా సుతమ్‌ || 160

గంధర్వస్తాడయామాస సాయకైస్తు యుధాజితమ్‌ | యుధాజితి మహాబాహౌ సమరే భృశవిక్షతే || 161

చిచ్ఛేదక్షత్రం బాణన శైలూషస్యతు రాఘవః | ద్వితీయేనతు బాణనలసంతంధ్వజ ముచ్ఛ్రితమ్‌ || 162

తృతీయేన ధనుర్ముష్టౌ తథా బలదనిఃస్వనమ్‌ | సచ్ఛిన్నధన్వా వేగేన శక్తిమాదాయ సత్వరః || 163

వివ్యాధ భరతం వీరం భుజే వామే నరాధిప | ప్రహారవర భిన్నస్య భరతస్య మహాత్మనః || 164

కరాత్పపాత వేగేన చాపశ్చాపధరస్యచ | అథాన్యద్ధనురాదాయ భరతో రఘునందనః || 165

శ##రైరనేక సాహసై#్ర ర్గంధర్వం తమవాకిరత్‌ | పాతయామాసచ తథా కవచం రత్న భూషితమ్‌ || 166

ఆపదం పరమాం ప్రాప్తః శైలూషో ప్యథ సత్వరః | ఆగ్నేయమస్త్రం చిక్షేప భరతం ప్రతివీర్యవాన్‌ || 167

వారుణన తదస్త్రంతు శమయామాస రాఘవః | వాయవ్య మస్త్రం శైలూష స్తదా చిక్షేప పార్థివ || 168

శైలాస్త్రేణాత భరతః శమయామాస తత్పునః | శైలాస్త్ర మథ చిక్షేప గంధర్వ నృపతి స్తథా || 169

వజ్రేణాస్త్రేన తత్క్రుద్ధః శమయామాస రాఘవః | ఉత్ససర్జ తతో రాజా బ్రహ్మాస్త్రం ప్రాణ సంశ##యే || 170

కాకుత్థ్సః శమయామాస బ్రహ్మాస్త్రేణౖవతత్తదా | అస్త్రయుద్ధే వ్యతిక్రాంతే క్రోధాదా రక్తలోచనః || 171

జఘాన చతురో వాహాన్భరతస్యస సాయకైః | వీరకేతోశ్చ చిచ్ఛేద శిరోజ్వలిత కుండలమ్‌ || 172

తస్యరాజ్ఞశ్చ చిచ్ఛేద ముకుటం రత్నభూషితమ్‌ ఉవాచ భరత శ్రేష్ఠః శైలూషంప్రహ సంస్తదా || 173

కృతకర్మాణశ్రాంతో గచ్ఛాద్యస్వంనివేశనమ్‌ | తత్రగత్వా తతోయాతః పర్వతం గంధమాదనమ్‌ || 174

అన్యథా శ్వో నమే జీవన్గంతాసిరణ మూర్ధని | అస్తంచ సవితాయాతి కృతకర్మా దినక్షయే || 175

వయంచ శిబిరాయైవ గమిష్యామో జనాధిప | ఏతావదుక్త్వా శైలూషం చోత్సృజ్య భరత స్తదా || 176

గంధర్వ రాజోథ గృహంప్రవిశ్య నిశ్చిత్య కార్యం మరణాయ బుద్ధిమ్‌ |

కృత్వా రణాయైవ మనశ్చకార రాత్రిం తథోవాహ గృహేనరేంద్రః || 177

ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ప్రథమఖండే మార్కండేయ వజ్రసంవాదే

ద్వంద్వయుద్ధ వర్ణనం నామైక షష్ట్యుత్తరద్విశతతమోధ్యాయః.

ఆంతట క్రుద్ధుడై గంధర్వరాజు సింహమట్లూర బొబ్బరించుచు భరతుని యరదము బాణవర్షమును గురిపించెను. దానిచే క్రమముగా నాతని రథము గుఱ్ఱములతో సారథితోనా రథము గప్పువడి కనరాదయ్యెను. యుధాజిత్తు (యుధాజిత్తుగదా) తొట్రువడక ధైర్యవంతుడు వీర్యవంతుడునుం గాన నెదిరియులుగులం గుంటువడిన యా యశ్వములం ద్రోలెను. అవ్వల భరతుడు మేఘ మురుముంబోలె మ్రోయ దివ్య చాపముజేసికొన క్షుర ప్రమును సంధించి శైలూషుని మహాధనువును రెండు గానొనరించెను. గంధర్వుడు ధనువు తెగిన నిమిషముననే ఱప్పపాటుననే, మరియింకొక దనువు నెక్కిడెను. బాహువులం బాగుగ నాకర్షించి శరములను విసరెను. అంతట భరతుడు కుపితుడై యా వింటిని నరకెను. ఆతని యాలాఘవమును ద్రిదశాధిపతి పూజించెను. అంత శైలూఘండును క్రుద్ధుడై యింకొక విల్లుంగొని భరతు నరదముపై శరములను వదలెను. అతని మేనమామ యుధాజిత్తు ఆతని దథముతోడనయుండి యెదిరి వర పరంపరను వమ్మెనరించి తన లాఘవమును (చురుకు నమును) జూపించెను. అతనిచే జోద్యమానములై యా గుఱ్ఱమును మండలములనట్లు పరిభ్రమించెను సూటి గానేగుచున్నను వానివేగమున చూపరులకు సుడిగుండములట్లు గిఱ్ఱున దిఱుగుచున్న వాయన్నట్లు గానిపించె నన్నమాట. బాణపరంపర బెండువడి పుడమిం బడుకొలది భరతుడును గడుసువడు వింటితో (నిరంతర సంధానముచే నిలుపుగొనక మండలము దిరుగు ధనుస్సుతో) నలుగులను విసరి వీవకేతువును నొవ్వం గొట్టెను. గంధర్వుడు (రాజు) తన తనయుడు తన సారథియునైన వీరకేతుడు దెబ్బదినుట గని యుధాజిత్తు నమ్ములం గొట్టెను. మహాబాహువు యుధాజిత్తు సమరమందు మిక్కిలిగ దెబ్బతినుటజూచి రాఘవుడు శైలూష ఛత్రముల బడవేసెను. రెండవ బాణమున దేజరిల్లు నున్నతమైన ధ్వజపముం గొట్టెను. మూడవశరమున జలదమట్లుండు గుప్పిటం బట్టిన చోట ధనువుం గొట్టెను. పెద్దదెబ్బతిన్న మహానుభావుని భరతుని చేతినుండి జారి చాపము క్రింద పడెను. అటుపై వేరొకవిల్లంది రఘునందనుడు వేలకొలది శరములం గంధర్వునిపై జిమ్మెను. రత్నభూషితమైన వాని కవచముం బడవేసెను. శైలూషుడును పరమాపదనంది వడిగొని భరతునిపై ఆగ్నేయాస్త్రముల విసరెను. రాఘవుడు వారుణాస్త్రమునం దానిని శమింప జేసెను. అతడు వాయవ్యమును విసరెను. భరతుడు శైలాస్త్రమునం దాని వారించెను. గంధర్వరాజు శైలాస్త్రము వదలెను. క్రుద్ధుడై భరతుడు వజ్రాస్త్రముచే దానిని నడంచెను. గంధర్వరాజు ప్రాణసంశయమొంది యప్పుడు బ్రహ్మాస్త్రమును బ్రయోగించెను. కాకుత్థ్సుడు దానిని బ్రహ్మాస్త్రముననే శమింపజేసెను. ఇట్టస్త్రయద్ధము జరిగినమీదట కోపమున కండ్లెఱ్ఱబడి శైలూషుడు నాల్గుశరముల భరతుని నాల్గు తురంగముల గొట్టెను కుండలోజ్జ్వలమైన వీరకేతువు శిరముంఛేదించెను. భరతుని రత్నకిరీటముం ఛేదించెను. అప్పుడు భరత శ్రేష్ఠుడు నవ్వుచు శైలూషునితో, పెద్ద పనిచేసినాడవు. యుద్ధమున నలసితివి. ఇప్పుడు నీయింటికి బొమ్ము. అటవోయి గంధమాదన పర్వతమున కరుగుము. అటుగాదేని రణతలమున రేపు నా నుండి బ్రతికి పోలేవు. సూర్యుడు తన పని దానిర్వహించి పగటి తుద నస్తంగతుడగు చున్నాడు. రాజా మేమును శిబిరమునకే యేగెదము. అని పలికి శైలూషుని విడిచి అయ్యెడ భరతుడు విహారమొనరించి శిబిరానకే యరిగెను. గంధర్వపతియు నిలుసొచ్చి కార్యనిశ్చయము సేసి మరణము తప్పదని యుద్ధమునకే మనస్సుకావించి రాత్రి గృహమంద గడిపెను.

ఇది శ్రీ విష్ణుధర్మోత్తరమున మహాపురాణమందు ప్రథమఖండమున గంధర్వయుద్ధ వర్ణనమను రెండువందలఆరువదియొకటవ అధ్యాయము.

Sri vishnudharmothara Mahapuranam-1    Chapters