Sri vishnudharmothara Mahapuranam-1    Chapters   

రెండువందల అరువదియవ అధ్యాయము - సంకులయుద్ధవర్ణనము

మార్కండేయ ఉవాచ : 

తతః ప్రవవృతే యుద్ధం తుములంలోమహర్షణమ్‌ | శూరాణాం హర్షజననం భీతానాంభయవర్ధనమ్‌ || 1

సేనా వినిర్గమే తత్ర రజసాచ్ఛాదితం జగత్‌ | నప్రజ్ఞాయత రాజేంద్ర కించిదేపసమంతతః || 2

కూజతాం ధనుషాం శబ్దః శ్రూయతే తుములోమహాన్‌ | శంఖభేరీ నినాదశ్చ కుంజరాణాంచ బృంహితమ్‌ || 3

హయానాం హ్రేషమాణానాం శూరాణాంచైవ గర్జతామ్‌ | శస్త్రాణాంపాత్యమానానాం యోధానాం కవచేష్వపి || 4

తిష్ఠతిష్ఠనమే జీవన్‌ గంతాసి రణమూర్ధని || 5

స్థితోస్మి ప్రహరస్వేతి కింనజానాతిమాంభవాన్‌ || 6

ప్రహరస్వతథా ఛింధిభింధి పాతయ మాచిరమ్‌ | ఏవమాదీని వాక్యాని శ్రూయంతే రణమూర్ధని || 7

తథాతుముల సంగ్రామే వర్తమానే సుదారుణ | ప్రశవామ రజోభౌమ ముత్థితం రణోశోణితైః || 8

పూర్వోత్థితేన రజసా మేఘేనేవనభస్తలమ్‌ | వ్యాప్తం తద్విరజస్కేన తదారాజన్రణాంగణ || 9

తతో యుయుధిరే వీరాః పశ్యమానాః పరస్పరమ్‌ | గోత్రాపదాననామాని కీర్తయంతః పునః పునః 10

ఆపైని యొడలుజలదరింపజేయుచు శూరుల కానందమును పిరికివాండ్రకు జడుపునించునదియునైన పొలికలనారంభ మయ్యెను. అటసేనలు తరులుతరి జగము పెనుధూళింగ్రమ్ముకొనెను ఏకొంచెముందెలియబడదయ్యెను. పెనుకూతలిడువిండ్లు పెద్ద రొద సంకులమై వినవచ్చెను శంఖభేరి నినాదము ఏనుగుల బృంహితము గుఱ్ఱముల సకిలింపులు శూరుల సింహగర్జనములు యోధుల యినుప కవచములపైకి విసరివేయబడు శస్త్రములయొక్కసడి నిలునిలు నేనుబ్రతికియుండగా రణస్థలింగడచిపోలేవు నిలువబడితి నేమాత్రము కొట్టెద వోకొట్టు తమరు నన్నెఱుగరా? కొట్టుత్రెంచు పగిలించు త్వరగ దెబ్బదీయుమను నీలాటి మాటలా యుద్ధరంగమందు విననయ్యెను ఆవిధముగా సుదారుణ సంకులయుద్ధ మారంభముగాగానే యయ్యనింగురిసిన రక్తములచే నటరేగిన పెనుధూళి యణగిపోయెను. ఇంతమున్ను లేచిన రజస్సుచే (దూళిచే) గగనతలియు మబ్బుచేతంబోలె నలముకొనెను. ఆవిధముగా విరజస్కమైన (ధూళిలేని) యారణాంగణమందు వీరులొండురులం జక్కగ జూచుచు గోత్రములు తమయింతముందటి యశః కథలను మఱిమఱి గుర్తించుకొనుచు ప్రస్తుతించికొనుచు యుద్ధముసేసిరి.

సేనానాం భజ్యమానానాం సైన్యఖండై ర్బలీయసామ్‌ | భూయాశ్చావర్త మానానాం శుశ్రువేతుములః స్వనః || 11

చిత్రాణాంచధ్వజానాంచ పతాకానాంచ భూభుజః | అదృశ్యత సమాసిక్తం రుధికం రణమూర్ధని || 12

స్వభ్రేతదామహారాజ రజోమేఘే క్షయంగతే | నిర్మలాసుతతోదిక్షు ప్రావర్తతమ హారణమ్‌ || 13

తథా ప్రవృత్తే సంగ్రామే దేవగంధర్వ దానవైః | సిద్ధైర్విద్యాధరైశ్చవ ముని సంఘైః సమం తతః || 14

ఆవృతం సహసావ్యోమ వజ్రయుద్ధకుతూహలైః | వ్యదృశ్యంత విమానాని తేషాం ఖేవిమలాన్యపి || 15

కింకిణీ శతఘుష్టాని పతాకాశోభితానిచ | శుభం గందమథాదాయ సురభిర్మారుతోవవౌ || 16

పపాత పుష్పవర్షంచ యోధానాం తత్రమూర్ధని | తథా ప్రవృత్తే తుములే క్ష్వేడితోత్కృష్టనాదితే || 17

పదాతయస్తదా జఘ్నుః పదాతీనిచ సంయుగే | ఖడ్గధారానికృత్తానాం పదాతీనాం పదాతిభిః || 18

ద్విధా కృతాని గాత్రాణి నిపతంతి మహీతలే | గృహీత్వా ఖడ్గపాతాని రేజుః కేచిచ్చవర్మిణః || 19

ఖడ్గముద్ధరతాం తేషాం చిచ్ఛి దుర్నృపవిగ్రహాన్‌ | కేచిద్గదా వినిర్భిన్నమస్తకాగదిభిః క్షితౌ || 20

పతితా స్తత్ర దృశ్యంతే రణ శతసహస్రశః | భగ్నా సిశేషనిక్షేప నిహతారాతయ స్తథా || 21

సింహనాద రవాంశ్చ క్రుః పరసైన్య విదారణాన్‌ | కేశేష్వన్యోన్య మాకృష్య ఖడ్గైఃకే చిత్పరస్పరమ్‌ || 22

ఆసేదుర్వ సుధాం కృత్వా గతప్రాణా స్తథా పరే | పృష్ఠ విన్యస్త వర్మాణః సన్నద్ధాంస్తురగాం స్తథా || 23

కృత్వా విపాదాన్స మరే నిజఘ్నుః సాదినాంగణమ్‌ | ఆరుహ్య వర్మిణః కేచిద్వే గాచ్ఛత్రు రణాన్రణ || 24

సారథీన్వి గత ప్రాణాం శ్చక్రు ర్యుద్ధ విశా రదాః | చిచ్ఛి దుర్వారణంద్రాణాం కరాన్కే చిత్ప దాతినః || 25

బలశాలుర సైన్యఖండములచే చంపబడు మూలకయొక్కయు పోరికి మఱియుం దిఱుగుపడుచున్న మూకల యొక్కయు ధ్వని సంకులమై విననయ్యెను. ఆకసమందు రజోమేఘము విరిసి దిక్కులు నిర్మలములయినంత మహాయుద్ధమారంభమయ్యెను. అప్పుడాకాశము యుద్ధముగన వేడుకగొన్న దేవగంధర్వదానవసిద్ధ విద్యాధరముని సంఘములతో గ్రమ్ముకొనెను. వారివారి స్వచ్ఛములై విమానములు గగనమందు గనిపించినవి. అవి చిరుగంటలతో పతాకలతో శోభించునవి అంతటవాయువు శుభవాసనలం బరిళించుచు వీచెను యోధులపై పుష్పవృష్టిగురిసెను. సింహనాదములతో పెనుబొబ్బలతో సంకుల సమర మారంభమయినంత కాల్బలము కాల్బలములంగొట్టినవి వారి ఖడ్గధారచే రెండుగ తెగిన మేనులు మెండుగనేలపై బడెను. కొందరు కవచులు కత్తివేటులం గొనియును కత్తులనెత్తజూచువారి దేహములంద్రెంచిరి. గదాధరులచే గదానిర్భిన్నమస్తకులై నేలగూలిన యోధులు వందలు వేలునటగని పించిరి. తెగినకత్తియవశేషముల విసరి యరివర్గముల నరకిన వీరులారణమందరి సైన్యవిదారణములైన సింహనాదము లొనరించిరి. జుట్టుజుట్టుపట్టి వంచి యొండొరులు కత్తుల నఱకికొని ప్రాణములుపోయి నేలకొరగిరి. పిఱుదలకుదొడగులు తొడిగికొని యుద్ధసన్నద్ధములైన గుఱ్ఱములను పాదశూన్యములం జేసి (పాదములునరకి) యాశ్వికగణముంగూల్చిరి. (ఆశ్వికులనగా గుఱ్ఱములెక్కి యుద్ధము చేయువారు)

కేచి ద్దశన విన్యస్త పాదాశ్చా రురుహు ర్గజాన్‌ | సాదినశ్చ తథా కేచి ద్విశిర స్కాన్రణాజిరే || 26

కొందఱు కవచధారులు శత్రువుల రథములెక్కి సారథుల ప్రాణముల గొనిరి. కొందరు కాల్బలము యేన్గుల తొండముల నఱకిరి. కొందరు వీరులు గజముల దంతములపై నడుగు లానించి పైకెక్కి మావటీండ్రను శిరోహీనులం జేసిరి.

చక్రుః పదాతి నోధ్మాతాః ఖడ్గై రాకాశసం నిభైః | కేచిచ్చ సా దినః ప్రాసైః పంచ సప్త తథా శరాన్‌ || 27

శ్రేణీ కృతాన్వై బిభిదు శ్శిక్షయా రణకో విదాః | కేచిచ్ఛా ర్జధను ర్న్యస్త బాణజాలా కులీకృతాన్‌ || 28

పదా తీన్స మరే చ క్రుర్వాయువే గైస్తు రంగమైః || సాదిన శ్చ తథై వాన్యే సాది భిః సహ సంగతాః || 29

దర్శ యంతో రణ భిక్షాంచ క్రుర్యుద్ధ మనే కధా | కేచిత్సా శాగ్ర నిర్భిన్న హతసారథి నాయకాః || 30

వినేదు రుచ్చైస్స హసా సింహనా దానునిః స్వనాన్‌ | కుంజరై రాకు లీకృత్య హయ యాన విశారదాః || 31

విపుచ్ఛ హస్తాన్స మరే చక్రుః సాది గణాన్రణ | నిహతంచ శరవ్రాతైః పాదాతం బహుధారణ || 32

రథి భిర్భాతి భూ పాల కమలోత్కర సం నిభమ్‌ | తుగా స్తురగా రోహా రథిభిర్వి నిపాతితాః || 33

ఆవవ్రుర్వ సుధాంతత్ర శతశోథ సహస్రశః | రథినాం రథిభిః సార్థం యుద్ధమా సీత్సు దారుణమ్‌ || 33

బాణతోమరపాతైశ్చ గదాకంపన ముద్గరైః | రథినాంచ మహాయుద్ధ మాసీత్కుంజర ధూర్గతైః || 35

పదాతిజన మాకాశ మచ్చమెగమెరుగుదేరిన కత్తులచేతను మావటీండ్రు ప్రాసములచే (ఇనుప గుదియలచేతను) శత్రువులు తమపై విసరిన బాణముల నొక్కొక్క దాని నైదు నేడు తునుకలుగా నరకి వేయుచుండిరి. రణనిపుణులు గుంపులు గుంపులుగా గూర్పబడిన తాము వడసిన శిక్షణా నైపుణ్యముచే శార్జధనుస్సు నందు విష్ణువుచే నెక్కు పెట్టబడిన బాణ పరం పరచే వ్యాకుల పరుపబడిన వారికి (గంధర్వులకు సహాయముగా వచ్చిన రాక్షసులను పగులనడచిరి కొందరాశ్వికులు (సాదులు) పదాతి వర్గము తోను గలిసి వాయువేగములయిన శత్రువుల గుఱ్ఱములతోను గుఱ్ఱపు ఱౌతులు శత్రువుల గుఱ్ఱపు ఱౌతులతోను గలిసి యుద్ధము సేసిరి. కొందరు గుఱ్ఱపు కళ్లెముల త్రాళ్లతో సారథి శ్రేష్ఠులను గొట్టి పెల్లుగ సింహగర్జనములు సేసిరి. హయ యాన విశారదులు గుఱ్ఱపు స్వారీలో నిపుణులైన యాశ్వికగణము వారు కుంజరములను చెదర గొట్టి తోకలు తొండములు తెగిన వానిం గావించిరి. బాణములచే పదాతి గణము రథికులతో బహుతెఱగుల హతమైరక్తమయమై కమలముల ప్రోవువలె భాసించెను హయములు హయా రోహులు రథికులచే గూల్పబడి వందలు వేలుగా నవనిం గ్రమ్మిరి. రథికులు రథికులు సేసిన యుద్ధము బాణతో మరపాతములతో గదాకంపన ముద్గరాయుధములతోసుదారుణ మయ్యెను.

ప్రాసబాణ మహాపాత దుర్నిరీక్ష్యం సమంతతః | నిహతం బహుపాదాతం కుంజరైర్బలదర్పితైః || 36

రణనృపతి శార్దూల వినికీర్ణం సహస్రధా | సాదినాం సతురంగాణాం సుమహత్కదనం కృతమ్‌ || 37

మహామాత్ర ప్రముదితైః కుంజరైర్బల దర్పితైః | ఆక్రమ్యరథబృందాని చూర్ణితాని తురంగమైః || 38

వ్యదృశ్యంత మహారాజ విప్రకీర్ణాని భూతలే | ఏవం మధ్యాహ్న సమయే తీక్షంత పతిబాస్కరే || 39

బభకూవాకుల సంగ్రామం ఘోరం రుధిరకర్దమం | రథాశ్వకుంజరైః సార్ధం పత్తయశ్చ సమాగతాః || 40

కుంజరాశ్చ మహాకాయా పత్త్యశ్వరథినస్తథా | పత్తిభిశ్చ పదాతీనాం సాదినాం సహసాదిభిః || 41

రథినాం రథిభిర్యుద్ధం కుంజరాణాంచ కుంజరైః | బభూవరాజం స్తుములే సంగ్రామే శోణితోదకే || 42

శూరాణాం రణలుబ్ధానామమర్షాక్రాంత చేతసామ్‌ | పత్తినా నిహతః సాదీ గజేన నిహతోనరః || 43

రథేన నిహతోనాగః క్వచిదాసీదఘాతితః | హతాః పదాతిభిశ్చానయే వ్యదృశ్యంతరణాజిరే || 44

పదాతి రథనాగాశ్చసాదిభిర్వినిపాతితాః | రథనాగహయా యుద్ధే నిహతాశ్చపదాతిభిః || 45

నరేణచ హతోహస్తీ శూరేణ కృతబుద్ధినా | సాదినాచ హతోహస్తీ సాదీచైవ పదాతినా || 46

రథినాచ హతః పత్తిః పత్తినాచ హతోరథీ | రతినా నిహతః సాదీ సంగ్రామే లోమహర్షణ || 47

రేణునాచ దిశోవ్యాప్తా స్తుములే భృశసంకులే | వ్యరాజంత మహారాజ సమరే గతజీవితాః || 48

పతతాం బాణ జాలానాం ధనుషాంచైవ కూజతామ్‌ | ముద్గరాణాం భుశుండీ నాం తో మరాణాం తథై వచ || 49

పట్టి శానాంచన ఋష్టీనాం క్షేపణా నాంచ యాదవ | అయో గుడాసాంప్రాసానాం చర్మణా మథ వర్మణామ్‌ || 50

అనిశం శ్రూయతే శబ్దో ఘోరస్తస్మి న్రణాజిరే | హయైశ్చ విగతా రోహైర్ధావ మానై రితస్తతః || 51

భ##గ్నైషాకూబ రాక్షైశ్చ రథైర్విగత నాయకైః | భిన్న దంతై శ్చ మాతం గైర్భిన్న కుంభ ఘటాననైః || 52

లతా వేష్టి తవృక్షాభై శ్శోభాంయాతి రణాజిరమ్‌ | కుంజరైర్వి గతా రోహైస్త్రా సితై ర్దృఢధ న్విభిః || 53

మర్ద్య మానాని సైన్యాని శతశోథ సహస్రశః | భిన్నాన్సు దంతైః పురుషాన్దంతా సక్తాం స్తథా గజాః || 54

వహ్య మానావ్య రాజంత కర్ణవ్య జనవీ జితాః | లగ్నాంత్ర జాలైర్ద శ##నైర్దం తినః సర్వతో పమాః || 55

లతా వేష్టిత వృక్షాభైః శోభయంతి రణా జిరమ్‌ | తస్మింస్తథా విదేరౌద్రే సంగ్రామే ఘోర దర్శనే || 56

నరాశ్వనా గరు ధైర్వైర్వి సస్రుః శోణితాపగాః | ఖడ్గ మీనా రాజహంస మహాచ్ఛత్ర విరాజితాః || 57

మహా ఫేనౌఘ వత్యశ్చ భీతానాం భయ వర్ధనాః | తాస్త రంతి తదాయోధాః శూరాజయ ధనైషిణః || 58

రాజన్వాహన నౌభిస్తే వ్యవసాయ పరస్పరాః | ఛిన్నానిస్వాని గాత్రాణి న జానంతి రణ పరైః || 59

తత్ర శూరా మహా భాగాస్త్వ మర్షాక్రాంత చేతసః | ఆయుధ క్షయ మాసాద్య ముష్టి యుద్ధాని చిక్రిరే || 60

కేశాకేశి తథాకే చిద్దం తాదం తినఖానఖి | చక్రు ర్యుద్ధం మహారాజ బ్రహ్మ లోక జిగీషవః || 61

క్రందంతోన్యే పితౄన్పుత్త్రా న్ర్భాతౄనన్యే పితా మహాన్‌ | మాతులాన్‌ భాగినేయాంశ్చ స్యాలాన్సం బంధిన స్తథా || 62

పితృవ్యానార్య కానన్యే దౌహిత్రా న పరే తథా | ధా వంత్యన్యే పతంత్యన్యే గర్జంత్యన్యే జిగీషయా || 63

స్వనంత్యన్యే పతంత్యన్యే మ్రియంతే చాపరేతథా | శోచంత్యన్యే తథా బంధూన్శోచ్యాస్త్వన్యేతుబంధుభిః || 64

యాచంతేన్యే మహారాజ తృష్ణార్తాశ్చ తథా జలమ్‌ | వాహనేషు సమారోప్యనీయంతేన్యేచ బంధుభిః || 65

శిబిరాయ మహారాజ శతశోథ సహస్రశః | అన్యేసంవృత్యచాత్మానం భీతాజగ్మురుపహ్వరమ్‌ || 66

జలార్థమన్యేచనరా బాంధవైశ్చ ప్రచోదితాః | ఆగమ్య దృష్ట్వాచమృతం భాండం భంక్త్వా విచుక్రుశుః || 67

హతబంధు మనాదృత్య స్వామికార్యైకతత్పరాః | పరానభిముఖానేవ తత్రా యుధ్యంత మానవాః || 68

యుధ్యతామేవ తేషాంతు శతశోథ సహస్రశః | ఉత్థితాని గణయాని కబంధాని మహీపతే || 69

కశ్చిన్ననర్త సమరే కబంధస్తు దనుర్ధరః | గదాపాణి స్తథైవాన్యః ఖడ్గ చర్మధరోపరః || 70

పరశ్వథధరః కశ్చిత్ర్పాసపాణి స్తథాపరః | నృత్యత్కబంధభూయిష్ఠే దేవదుందుభినాదితే || 71

ప్రవర్తమానే సంగ్రామే శూరాణాం స్వర్గలోకదే | వ్యదృశ్యంత మహారాజ పిశాచా ఘోరదర్శనాః || 72

సంగ్రామా త్సర్వ యోధానాం పీత్వేవ రుధిరం కరైః || 73

తతోస్త శైలం భగవత్యథార్కే గతే జపాపుష్ప కదంబకాభే |

సేనాద్వయం తచ్ఛిబిరాయయాతం కృత్వావరోహం పరబాణపాతమ్‌ || 74

ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ప్రథమఖండే మార్కండేయ వజప్రసంవాదే సంకులయుద్ధోనామ షష్ట్యుత్తర ద్విశతతమోధ్యాయః

ప్రాసములు బాణములయొక్కయు పాతములచేతను అంతట చూడనలవికానిదిగ నుండెను. అనేకులు కాలిబంట్లు ఏమగులచే త్రొక్కబడి హతులైరి. బానతోమర పాతములతోను గదాకంపనములతోను రథము లకు గజసైనికులతో గొప్పయుద్ధము బరిగెను. గుఱ్ఱపురౌతులసేన బహుముఖముల వ్యాపించెను. బలదర్పితములయిన యేనుగులచేతను గుఱ్ఱములచేతను రథ సముదాయములు చూర్ణితములై భూతముపై చెల్లాచెదురుగ పడినవై చూడనయ్యొను. పదాతులు పదాతుల తోను గుఱ్ఱపు రౌతులు రౌతులతోను రథికులు రథికులతోను గజములు గజములతోను తలబడినవి. మధ్యాహ్నకాలమున సూర్యుడు తీవ్రముగ ప్రకాశించుచుండగా రణరంగమంతయు రక్త పంకముతో నాకులిత మయ్యెను. చతురంగబలమిట్లు రణలుబ్ధమైన అమర్షా విష్ట చిత్తమై ఘోరరణము సల్పుచుండగా దిక్కులెల్ల ధూళి ధూసరితములయ్యెను. రణాంగణమున నిరంతరము ప్రయోగింప బడుచున్న వివిధాయుధముల సందడి మహాభయంకరమయ్యెను. భగ్నములైన రథములు ఆరోహశూన్యములగు గజములు మున్నగు వానితో రణాంగణము బీభత్సమైయొప్పుచుండెను. నరాశ్వగజాదిరక్తనదులు ఖడ్గములనెడి మీనముతోను ఛత్రములనెడి రాజహంస లతోను, యోధుల శిరస్సులనెడి పాషాణములతోను కేశములనెడి శైవాలముతోను పిరికివారలకు భయము గొల్పుచుండగా జయధనమును గోరిన యోధశూరులు వాహనములనెడి నౌకలతో దాటుచున్నవారై యుద్ధమునందు శత్రువులచే తమశరీరములను ఖండించు చున్నను గుర్తించుటలేదు. ఆయుధములెల్ల శూన్యముకాగా ముష్టియుద్ధముల జేయదొడంగిరి. ఇట్లేకేశాకేశి, దంతాదంతి, నఖానఖి యుద్ధములను, బ్రహ్మలోక జిగీషతో జేయుచుండిరి. కొందరు, పుత్రులను, తండ్రులను తాతలను, మేనమామలను, మేనళ్లులను, భావమరదులను వియ్యంకులను, పిలుచుచున్నారు. కొందరు అరచుచున్నారు. కొదరు పరుగెత్తుచున్నారు. కొందరు పడుచున్నారు, కొందరు పరుగెత్తుచున్నారు, కొందరు చచ్చుచున్నారు, కొందరు బంధువుల కొరు శోకించుచున్నారు, కొందరు దప్పికతో జలమును యాచించుచున్నారు. ఇట్లు యుద్ధములుచేయుచు ఖండితములైన మొండెములు నాట్యముచేయుచుండెను. ఆయుధపాణలైన మొండెములు వివిధముల చేష్టలు చేయుచుండెను. దేవదుందుభులు మ్రోయుచుండెను. ఇట్లు ఘోరసమరము జరుగుచుండగా సూర్యుడు తనకిరణ కరములతో సర్వయోధుల రక్తముల ద్రావియోయన నస్తగిరికేగెను.

ఇది శ్రీవిష్ణుధర్మోత్తర ప్రథమ ఖండమున సంకులయుద్ధమను రెండువందలయరువదవ అధ్యాయము.

Sri vishnudharmothara Mahapuranam-1    Chapters