Sri vishnudharmothara Mahapuranam-1    Chapters   

రెండువందల యేబదిరెండవ అధ్యాయము - వానరోత్పత్తి

శైలూష ఉవాచ : విస్తరేణ సమాచక్ష్వ వానరాణాంతు సంభవమ్‌ | అలంకృతఇ వాభాతియైర్వంశః పులహస్యచ ||

నాడాయనఉవాచ: కాశ్యపేయీ మరిర్నామ యాభార్యా పులహస్యచ | పులహాత్‌జన యామాసశ్వేతం నామవవీముఫమ్‌ ||

శ్వేత స్తదోర్ధ్వ దృష్టించ జనయామాసవానరమ్‌ | ఊర్ధ్వదృష్టిస్తథా వ్యాఘ్రం వ్యాఘ్యష్చశరభరతథా || 3

శరభశ్చతథా రంచ సింహమృక్షశ్చవానరమ్‌ | ఋక్షీచ జనయామాస ఋక్షాంశ్చైవ జనాథిప ! || 4

వానరాంశ్చ మహాకాయాన్‌ శతశోథసహస్రశః | యేషామన్వయసంభూతా దేవపుత్రా మహాబలాః || 5

ఉత్పన్నా రామసాహాయ్యే రావణస్యవధైషిణః | ఋక్షస్య భగినీఋక్షీ ప్రజాపతి సుతామభౌ || 6

ధూమ్రంచ జాంబవంతంచ జనయామాస ఋక్షజౌ | జాంబతవా9 జనయామాస మార్జార భీమ విక్రమమ్‌ || 7

మార్జారస్యచ మార్జారాః కులేజాతా మహాబరాః | ఋక్షస్య వానరే9 ద్రస్య దుహితం మానసీం స్వయమ్‌ || 8

దదౌప్రజాపతిః శ్రీమాన్‌ రూప¸°వన సంయుతామ్‌ | కామయామాసతాం శక్రస్తతోవాలి రజాయత || 9

తుమేవ కామభూమాస భాస్కరః స్వయమేవతు | సుగ్రీవంజన యామాస భాస్కరాత్సాసు మధ్యమా || 10

తత్రవానర రాజో9భూద్వాలిర్వి క్రాంతపౌరుషః | యస్తురామేణనిహతస్సు గ్రీవస్త్వ భిషేచితః || 11

తస్యాసన్వశగాః సర్వే వానరాదేవయోనయః | వాలిపుత్రోంగదో నామ హనుమాన్వాయునందనః || 12

నీలోవహ్నిసుతః శ్రీమాన్‌ విశ్వకర్మ సుతోనలః | ధర్మపుత్రః సుషేణశ్చ ఋషభోగరుడాత్మజః || 13

ద్వావశ్వినసుతౌవీరౌ మైందోద్వివిదఏవచ | ధూమ్రశ్చ జాంబవాంశ్చైవ వేగదర్శీచ వానరః || 14

మృత్యోః పుత్రామహావీర్యా మృత్యుల్యపరాక్రమాః | గజోగవాక్షోగవయః శరభోగంధమాదనః || 15

యమస్యతనయాః పంచగోలాంగూలామహాబలాః | శ్వేతోజ్యోతిర్ముఖశ్చాన్యో భాస్కరస్యాత్మజా వుభౌ || 16

వరుణస్యావరః పుత్రోహేమకూటః ప్రతాపవాన్‌ | దేవపుత్రా స్తథైవాన్యే ఋక్షగోపుచ్చవానరాః || 17

శతసాహస్రయూథానాం రాజ్యానోభీమవిక్రమాః | హిమవన్మేరునిలయాః శ్వేతనీలనివాసినః || 18

శృంగవన్మాల్యవద్వింధ్య ఋక్షవంతనివాసినః | యే వసంతిసదా సహ్యేఋషభేగంధమాదనే || 19

సాగరానూప పర్యంతే తథాద్వీపేషు సప్తసు | బ్రహ్మణ్యా బలవంతశ్చ శూరాధర్మపరాయణాః || 20

నీతిశాస్త్రేషు కుశలాః సర్వశాస్త్ర విశారదాః | సునీతాః సత్త్వంవతశ్చ దృప్తానీతిగ్రహే రతాః || 21

సంఖాయోరామ భద్రస్య రావణస్యవధైషిణః | హస్తివానర సంగ్రామే పురా రుధిరకర్దమే || 22

గిరికూటనిభా నాగా విజితా యైః సహస్రశః | సహాయా రామభద్రస్య తే వీరా భరతస్యచ || 23

మాగచ్ఛసంయుగం తస్మాద్భరతేన మహాత్మనా ||

సర్వాస్త్రవిజ్ఞాన విశారదేన సంగ్రామశౌండేన జితేంద్రియేన |

ధీర్మాచ్ఛరామస్య పరాయణన శక్రాధికే నత్వతిపౌరుషేణ || 24

ఇతి శ్రీ విష్ణు ధర్మోత్తరే ప్రధమఖండే మార్కండేయ వజ్రసంవాదే శైలూషం ప్రతి నాడాయనవాక్యేషు వానరోత్పత్తి ర్నామద్విపంచాశదుత్తర ద్విశతతమోధ్యాయః ||

శైలూషుడు మతంగజముల సంభవము గూర్చి విస్తరముగ నానతిమ్ము వానిచే పులస్త్యుని వంశము భూషణములు పెట్టి కొన్నట్లు రాణించుచున్నదన నాడాయను డిట్లనియె : కశ్యపుని కూతురు మరియను నామె పులహుని కూతురు. ఆమె శ్వేతుదను వానరునిం గన్నది. శ్వేతుడూర్థ్వ దృష్టిని గనియె. వానికి వ్యాఘ్రుడు వానికి శరభుడు వానర్యుడు వానికి సింహుడుం బుట్టిరి. ఋక్షి (ఋక్షిని చెల్లెలు) ఋక్షులను వానరులను గనియె. వారు మహాకాయులు. వందలు వేలుగ జనించిరి. వారి వంశమందు దేవ కుమారులు మహాబలులు పుట్టిరి. వారు రామ సహాయులై రాచణవధం గోరిరి ఋక్షుని చెల్లెలు ఋక్ష ప్రజాపతి సములగు ధూమ్రుని జాంబవంతునిం గనెను. జాంబవంతుడు మార్జారుని అతడు మార్జాలులను మహాబలశాలురగనెను. ప్రజాపతి తన మానస పుత్రిని రూప¸°వనసంపన్నురాలిని ఋక్షుని కొసంగెను. ఆమె నింద్రుడు కామించెను. దాన వాలి పుట్టెను. ఆమెనే భాస్కరుడు తనంత గామించెను. భాస్కరునియెడ మనసుగొని యా సుందరి సుగ్రీవుని గనెను వారిలో వాలి. విక్రమించి పౌరుషముగొని వానరులకు రాజయ్వెను. అతడు రామునిచే హతుడయ్యె. సుగ్రీవు డభిషిక్తుం డయ్యెను. దేవతల వలన జనించిన వానరులా సుగ్రీవుని వశం వదులయిరి. వాని కొడుకంగదుడు. వాయుసూనుడు హనుమానుడు. అగ్ని సుతుడు నీలుడు, నిశ్వకర్మ కొడుకు నలుడు, ధర్ముని (యముని) కుమారుడు సుషేణుడు గరుడు నాత్మజూడు ఋషబుడు. అశ్వినీ దేవులిద్దరి కొడుకు లిద్దరు వీరులు మైందుడుద్విసిదుడును. ధూమ్రుడు జాంబవంతుడు వేగదర్శియను వానరులు మృత్యువుయొక్క (ధర్మునియొక్క) కొడుకులు మహావీరులు మృత్యువుతోడి పరాక్రమము గలవారు. గజుడు గదాక్షుడు గవయుడు శరభుడు గంధమాదనుడు నను గోలాంగూలురు (వానరులు) యముని కుమారులు. మహాబలశాలురు శ్వేతుడు జ్యోతిర్ముఖుడును భాస్కరుని కొడుకు లిద్దరు వరునిని కడగొట్టుకొడుకు. హేమకూటుడు ప్రతాప శాలి దేవతల కుమారులింకనెందరో ఋక్షగోపుచ్చులు వందల వేలు కపియూధాధి పతులు. భయంకర విక్రములు. ఇందరు హిమగిరి మేరువు శ్వేతము నీలము. శృంగవంపము మాల్య వంతము వింధ్య, ఋక్షవంతమునను పర్వతములందుండేవారు. సహ్య ఋషభ గంధమాదన పర్వతములందు సప్తద్వీపములందు నుండు వారు వీరందరు బ్రాహ్మణులు బలవంతులు శూరులు ధర్మపరాయనులు. నీతిశాస్త్ర కుశలురు (వినయశీలురు) సత్త్వ వంతులు దృష్తులు నీతి గ్రహణాభిలాషులు. రామభద్రునికి సహాయులు రావణునిపథాసక్తులు వీరు మునుపు హస్తివానర సంగ్రామమందు రక్తపు నడుసున గిరిశిఖరములట్టి నాగులను వేలమందిని జయించిరి. వారు రామషద్రునికి భరతునికి సహాయములయి యున్నారు అందువలన మహాత్ముడగు భరతులతో సర్వాసవిజ్ఞ్‌న విశారదునితో సంన్రామ శౌండునితో జతేంద్రియునితో నీవు తలబదడము. అతడు ధర్మముచే రాముని కధీనుడై యున్నాడు. ఇంద్రు మించినాడు. అమితపౌరుషశాలి.

ఇది శ్రీ విష్ణుధర్మోత్తర మహాపురాణమందు ప్రథమకండమున వానర వంశోత్పత్తివర్ణనమను రెండువందలయేబదిరెండవ అధ్యాయము.

Sri vishnudharmothara Mahapuranam-1    Chapters