Sri vishnudharmothara Mahapuranam-1    Chapters   

రెండువందలనలుబదితొమ్మిదవ అధ్యాయము - ప్రతిసమూహరాజకీర్తనము

వజ్రవాచ : 

కథా ప్రసంగైర్బహు భిర్భవతామమ కీర్తితమ్‌ | సంభవం సర్వభూతానాం సర్వకల్మషనాశనమ్‌ || 1

తేషాం వికారేష్వాచక్ష్వ రాజానోమమ భార్గవ | పాలయంతిద్విజశ్రేష్ఠ సకలం యేజగత్త్రయమ్‌ || 2

మార్కండేయ ఉవాచ : ఏవం ప్రజాసుసృష్టాసు స్వమేవపి తామహః || 3

ఔషధీనాం ద్విజాతీనాం నక్షత్రాణాంచ థైవచ | యజ్ఞానాం తపసాంచైవ సోమం రాజ్యేభిషేచయత్‌ || 4

ప్రజాపతీనాం సర్వేషాం దక్షం ప్రాచేత సంతథా | వలీముఖానాం సర్వేషామృక్షాణాంధూమ్ర ఏవచ || 5

మనః సర్వేద్రియాణాంచ సురస్త్రీణాంచమన్మథమ్‌ | ప్రహ్లాదం సర్వదైత్యానాం పితౄణాంచ తథాయమమ్‌ || 6

అపాంతువరుణం రాజ్యేతథైవ జలవాసినామ్‌ | యక్షాణాం రాక్షసానాంచ పార్థివానాంధనస్యచ || 7

పుత్రం వివ్రవసోజ్యేష్ఠం కుబేరం నరవాహనమ్‌ | విప్రచిత్తించ రాజానందాన నానాం మహాబలమ్‌ || 8

సర్వభూత పిశాచానాం గిరీశంశూలపాణినమ్‌ | శైలానాం హిమవంతంచ నిమ్నగానాంచ లావణమ్‌ || 9

భారతం సర్వవర్షాణాం ద్వీపానామథ మధ్యమమ్‌ | స్వాదూదకం సముద్రాణామశ్వత్థం సర్వశాఖినామ్‌ || 10

కర్మణాంవ్యవసాయంచ మేరుం నర్వశిలాభృతామ్‌ | గంధర్వాణాం చిత్రరథం గరుడంచ పతత్త్రిణామ్‌ || 11

ఉచ్చైఃశ్రవసమ శ్వానాం గోవృషంచ తథాగవామ్‌ | సువర్ణం సర్వరత్నానామౌషధీనాం తథాయవమ్‌ || 12

సత్యలోకంచ లోకానాం పాతాళానాం రసాతలమ్‌ | శాస్త్రాణాంచయజుర్వేదం సర్వేషామవిశేషతః | 13

గాయత్రీం సర్వనుంత్రాణాంఛం దసాంచ యదూత్తమ | మృగాణామథశార్దూలం పన్నగానాంచ తక్షకమ్‌ || 14

ఐరావతం గజేంద్రాణాం ధర్మం సర్వసుఖస్యచ | వాసుకిం సర్వనాగానామృషీణాంచ తథా భృగుమ్‌ || 15

విద్యాధరాణాం సర్వేషాం తథాదేవం సరస్వతీమ్‌ | ఉత్పాతానం తథారాహుం గ్హాణాంచ దివాకరమ్‌ || 16

కాలస్యావయవం చైవకాలం సంవత్సరం తథా | వ్యాధీనాంచ జ్వరం రాజ్యేనృణామర్క నిశాకరౌ || 17

అభిషిక్తో నరేంద్రేంద్ర బ్రహ్మాణాస్వయమేవహి | భారతేస్మిన్పురావర్షే ప్రాప్తేవైవ స్వతేంతరే || 18

తస్మాదద్యా పిచత యోరంశ జాతాశ్చపార్థివాః | తతోభిషిక్తో దేవానాం రాజ్యేదేవః శతక్రతుః || 19

సంభూయరాజభిః సర్వైసై#్రలోక్యపతి రూర్జితః ||

వజ్ర ఉవాచ : రాజ్యేభిష్ఠిక్తః సకథం మహాత్మా సంభూయసర్వేస్త్రి దశారిహర్తా |

ఏతన్మమాచక్ష్వ భృగుప్రధాన ! భక్తిర్మమేయం త్రిదశేంద్రశత్రౌ || 20

ఇతి శ్రీవిష్ణు ధర్మోత్తరే ప్రథమఖండే మార్కండేయ వజ్రసంవాదేశైలూషంప్రతి నాడాయన వాక్యే ప్రతిసమూహే రాజకీర్తనం నామైకోనవపంచాశ దుత్తరద్వి శతతమోధ్యాయః ||

వజ్రుండు ప్రసంగవశమున సర్వభూత సంభవమును నీవుతెల్పితివి. వారివారి వికారములందు (వికృతులందు) తరువాత బుట్టిన రాజులు జగత్త్రయపాలకులగూర్చి తెలుపుమన మార్కండేయుడిట్లనియె. ఆ యా సంఘములో నధినాయకునిగా నొక్కొక్కని సృష్టికర్త బ్రహ్మ యభిషేకించెను. ఓషధులు ద్విజులు నక్షత్రములు యజ్ఞములు తపస్సులకు సోముని రాజ్యాభి షిక్తుంజేసెను. ప్రజాపతులకు ప్రాచేతసుడైన దక్షుని తెల్లని వలీముఖులకు ధూమ్రునిమనస్సు మరి యన్ని యింద్రియములకు దేవతాస్త్రీలకు మన్మతుని దైత్యులకు ప్రహ్లాదుని పితరులకు యముని జలములకు జలవాసులకు వరుణుని యక్ష రాక్షసులకు రాజులకు ధనమునకు విశ్రవస్సు పెద్దకొడుకును నరవాహనుని కుబేరుని దానవులకు విప్రచిత్తిని సర్వభూత పిశాచములకు శూలపాణియైన గిరీళుని (శంకరుని) శైలములకు హిమవంతుని వర్షములకు భారతవర్షమును ద్వీపములకు మధ్యద్వీపమును (జంబూద్వీపమన్నమట) సముద్రములకు ప్వాదూదక సముద్రమును (మంచినీటి సముద్రము) చెట్లకు (అశ్వత్థమును) రావిని కర్మములకు వ్యవసాయమును (కృషినా? లేక ప్రయత్నమునా?) నదులకు లవణసముద్రమును సర్వశిలాధరములకు మేరువును గంధర్వులకు చిత్రరథుని పక్షులకు గరుడును గుఱ్ఱములకు ఉచ్చైశ్రవమును గోవులకు గోవృషమును (వృషభమును) అన్ని రత్నములకు సువర్ణమును ఓషధులకు యవధాన్యమును లోకములకు (బ్రహ్మ) సత్యలోకమును పాతాళములకు రసాతలమును సర్వశాస్త్రములకు యజుర్వేదమును సర్వమంత్రములకు ఛందస్సులకు గాయత్రీమంత్రమును గాయత్రీ ఛందస్సును మృగములకు శార్దూలమును పన్నగములకు తక్షకుని గజేంద్రములకు ఐరావతమును సర్వసుఖములకు సూర్యుని కాలమునకు కాలావయవమైనసంవత్సరమును వ్యాధులకు జ్వరమును సూర్య చంద్రులను మానవర్యా రాహువును గ్రహములకు సూర్యుని కాలమునకు కాలావయవమైనసంవత్సరమును వ్యాధులకు జ్వరమును సూర్య చంద్రులను మానవర్యా మందు స్వయముగా బ్రహ్మ యభిషేకించెను. ఈ భారతవర్షమందు వైవస్వత మన్వంతరమురాగా చంద్ర సూర్యు లీమానవులకు బ్రభువులు గావించబడిరి. అందుచే నేటికిని వారియంశ లంబుట్టినవారు సూర్య చంద్ర వంశములంబుట్టినవారు రాజులయినారు. అవ్వల దేవరాజ్య మందు శతక్రతుని (నూరుయజ్ఞములు సేసినవానిని) ఇంద్రునభిషేకించెను. ఆయన త్రైలోకాధిపతిగా రాజులందరిచేత నభిషిక్తుడయ్యెను. అనవిని వజ్రుండు భృగుముఖ్యా! ఇంద్రునందు నాకు భక్తిగలదు. ఆయనకుదేవరాజప్యట్టాభిషేకము జరిగిన విశేషమునానతిమ్ము.

ఇది శ్రీవిష్ణుధర్మోత్తరమహాపురాణము ప్రథమఖండమున ప్రతిసమూహరాజకీర్తనమను రెండువందలనలుబదితొమ్మిదవఅధ్యాయము.

Sri vishnudharmothara Mahapuranam-1    Chapters