Sri vishnudharmothara Mahapuranam-1    Chapters   

రెండువందల నలుబదిఏడవ అధ్యాయము - లవణాసురవధ

నాడాయన ఉవాచ : ఇతి రామవచః శ్రుత్వాబాఢముక్త్వాస సత్వరః | అభివాద్య వసిష్ఠస్యపాదౌ రామస్య బాప్యథ || 1

పురస్కృత్య మహాభాగాన్‌ భార్గవ ప్రముఖానృషీన్‌ | యథోక్తసైన్యానుగతః ప్రయ¸°భీమవిక్రమః || 2

వాల్మీ కేరాశ్రమం ప్రాప్య తామువాసతదానిశామ్‌ | పూజయిత్వాతువాల్మీకి మృషిణా ప్రతి4 పూజితః || 3

యస్మిన్నహని శత్రుఘ్నో వాల్మీకేరాశ్రమంగతః | ఉభౌ ప్రసూతౌతన ¸°తస్మిన్నే వాహ్నిజానకీ || 4

సీతా ప్రసవసంహృష్టం క్రమేణరఘునందనః | నిదాఘశేషేణనదీముత్తతార స సూర్యజామ్‌ || 5

శిబిరం సమవస్థాప్య యథావ ద్యమునాతటే | ఏక ఏవధనుష్పాణిః ప్వరివేశమధోర్వనమ్‌ ||6

ప్రవిశ్యచ యుధాతత్ర లవణస్యనివేశనమ్‌ | తస్థౌద్వారమథాశ్రిత్య వీరోవితతకార్ముకః || 7

ఏతస్మిన్నేవకాలేతు మృగాన్హత్వాసహస్రశః | బహునామృగ భారేణ సదదర్శమధోః సుతమ్‌ || 8

వృత్తాక్షముత్కటం భీమందంతోత్కృత్తోతరచ్ఛదమ్‌ | దంష్ట్రాకరాలవదసందంతి వత్పరుష చ్ఛవిమ్‌ || 9

నాడాయనుడనియె. రామచంద్రప్రభువు పలుకువిని బాఢమ్మని (మంచిది-బాగున్నది- సరేయని) శత్రుఘ్నుడు తొందరగ వశిష్ఠుల పాదములకు రామచరణములకును మ్రొక్కి భార్గవ ప్రముఖులైన పరశురామాదులైన ఋషులను మున్నిడుకొని భీమపరాక్రముడాత డింతమున్ను దెల్పిన సేనలతో వాల్మీక్యాశ్రమముసేరి యారాత్రి యటనుండెను. అమ్మునిం బూజించి యాయనచే ప్రతిపూజ గొనెను. ఆతడయ్యాశ్రమముం జేరినాడ జానకి యిరువురు కుమారులం గనియెను. సీతామహాదేవి ప్రసవవార్తవిని హర్షభరితుడై రఘునందనుడు క్రమముగంజని గ్రీష్మఋతువు తుదను యమునానదిం దాటెను. యమునాతటమున శిబిరమువేయించికొని తానొక్కడ ధనుష్పాణియై మధునివనముం బ్రవేశించెను. అందొక యోధునితో లవణునింట బ్రవేశించి కార్ముకమెక్కిడి యా వీరుడు ద్వారముకడ నిలువ బడెను. ఇదేవేళ వేలకొలది మృగములంజంపి పెద్ద బరువెత్తుకొన్న మధుసుతుని లవణుని జూచెను వాని గ్రుడ్లు గిఱ్ఱున దిరుగుచుండెను. ఉత్కటములు=కటములు=కణతలు అదరుచుండెను. భయంకరుడుగా నున్నాడు. పైపెదవింబండ్లం గరచుకొనుచుండెను. ముఖము కోరలం గరాళ##మై (భయంకరమై) యున్నది. ఏనుగట్టొడలిజిగి కరకుదేరి యున్నది.

సతుదృష్ట్వైవశత్రుఘ్నమువాచ పరుషంబహు | విప్రధావత దుష్టాత్మా శత్రుఘ్నవధకామ్యయా || 10

త్యక్త్వామృగసహస్రాణి ద్రుమవిక్షేపతత్పరః | ద్రుమవృష్టింసుఘోరాంతాం లవణన విసర్జితామ్‌ || 11

చిచ్ఛేదబాణౖః సౌమిత్రిః శతశోథసహస్రశః | చ్ఛిన్నేద్రు మమహావర్షే లవణః శత్రుతాపనః || 12

గానసురశత్రుఘ్నం శత్రుఘ్నం ముష్టినాభృశం | ముష్టిప్రహార నిశ్చేష్టం శత్రుఘ్నం లవణస్తదా || 13

నజగ్రాహచతచ్ఛూలం మృత్యుపాశవశంగతః | ప్రవేశయామాస గృహం మృగసంఘా ననేకశః || 14

వాడు చూడగనే శత్రుఘ్నునింగని కడు పెటుకుగ మాట్లాడి యతనిం జంపం పైనున్న వేలకొలది మృగముల బరువున ననింబడవైచి బరువిది చెట్లుపెరకి విసరబూనెను. ఆ ఘోరతర తరువర్షమును సౌమిత్రివందలు వేలబాణములచే నరకివైచెను. చెట్లు తెగినంత నా రక్కసుడు సురశత్రుఘ్నుని శత్రుఘ్నుని బిడికిటం గట్టిగ గ్రుద్దెను. ఆగ్రుద్దునకు నిశ్చేష్టుడైన శత్రుఘ్నుంగని లవణుడు ఆ శూలమును (తనకు శివుడు మున్ననుగ్రహించినదాని) మృత్యుపాశవశుండగుటచే జేపట్టడయ్యె. తా జంపితెచ్చిన జంతువుల ననేకముల నింటిలోనికిం జేర్చెను.

ఏతస్మిన్నేన కాలేతు లబ్ధసంజ్ఞస్సంరాఘవః | వితత్య కార్ము కంతస్థౌద్వారమావృత్య వేశ్మనః || 15

తతఃపాదపవర్షేణచ్ఛాదయంతం నిశాచరమ్‌ | చకారవిము ఖంబాణౖశ్ఛిత్త్వాం చ్ఛిత్త్వా మహీరుహాన్‌ || 16

రామదత్తంతతో బాణంసంధాయ వరకార్ముకే | నిర్బిభేద మహాతేజా లవణం రఘు నందనః || 17

సంధీయమానే బాణతు త్రస్తం త్రిభువనంతదా | ఆశ్వాసయామాస విభుర్ర్బహ్మా కమలసంభవః || 18

తేనబాణప్రహారేణనిర్భిన్న హృదయః క్షితౌ | వ్యసుః పపాతమేదిన్యాం శైలో వజ్రహతోయథా || 19

తస్మిన్నిపతితే భూమౌ దైత్యేదేవ భయంకరే | త్రైలోక్యం విగతాతంకం క్షణన సమపద్యత || 20

ఇదేసమయమున రాఘవుడు మూర్ఛదేరి విల్లెక్కిడి యా రక్కసుని గృహద్వారమందు నిలబడెను. అవ్వల చెట్లను వర్షించి తననుం గప్పివైచుచున్న యన్నిశాచరుని బాణములచే జెట్లను నఱికి విముఖం జేసెను. తన మేలివింట రాముడిచ్చిన బానమును సంధించి యా మహాప్రతాపశాలి శత్రుఘ్నుడు లవణునిం జీల్చివైచెను. అయ్యెడ నా రామబాణము సంధించినయెడ త్రిభువనంముం జడిసిపోయెను. బ్రహ్మ కమలభవుడు దాని నాశ్వాసించెను ఆ బాణముదెబ్బచే వాడు గుండెపగిలి ప్రాణముపోయి క్షతిపైవజ్రహతమైనకొండయట్లు నేలంబడెను దేవభయంకరుడు వాడుపడిపోవ ముల్లోకము క్షణములో ఆతంకము (బెదరు) వాసెను.

తంచదేశమథాజగ్ముః సురాస్సబ్రహ్మకాస్తథా | పూజితాస్తేన విరేణశత్రుఘ్నం వాక్యమబ్రువన్‌ || 21

దేవాఊచః : వరం వరయశత్రుఘ్న యత్తే మనసికాంక్షితమ్‌ | అపనీతం త్వయాస్మాకం భయం శూలవరాయుధాత్‌ ||

త్వయాతు నిహతే తస్మిన్‌ల్లవణ పాపరాక్షసే | పశ్య శూలవరం యాంతమేనంశార్వం విహాయసా || 23

శత్రుఘ్న ఉవాచ : అస్మిన్దేశే కరిష్యామి పురం రామాజ్ఞయా త్వహమ్‌ |

మాసేసమాప్యతాం శీఘ్రం వరమేతత్ర్పదీయతామ్‌ ||

దేవా ఉవాచ : నిష్పత్తిం యాస్యతేధీర స్థిరాచైవ భవిష్యతి | పుణాచరమణీయాచమథురా నామతః శుభా || 25

నాడాయన ఉవాచ : ఏవముక్త్వాసురాః సర్వే జగ్నుర్నాకమతంద్రితాః |

అచ్చటికి బ్రహ్మతో వేల్పులరుదెంచిరి. ఆవీరునిచే బూజితులై శత్రుఘ్న ! నీమనసునగల కోరిక వరముం గోరుము మాకు శూలాయుధమువలని భయము నీవు పోజేసితివి. నీచే లవణుండు హతుడుకాగానే అల్డదె చూడుము. శూలమది యాక సమువెంట శివునింజేరినదన శత్రుఘ్నుడు ఈ ప్రదేశమందు రామాజ్ఞచే నేను పురనిర్మాణము సేసెదను. ఆపని యీనెలలో శీఘ్రముగ సమాప్తి గావలయును. ఈవరము నాకు దయసేయుడన దేవతలు థీరాగ్రేసర ! నిర్మాణము పూర్తియగును. అది సుస్థిరముగూడ కాగలదు. అదిపరమమంగళ సుందరము పుణ్యమునయి 'మధుర' యనుపేరం బరగును. అనిపలికి యేతొట్రుపాటులేక వారు నాకమునకేగిరి.

ఆజగామసతందేశం సైన్యేనచ్యవనః నహ || 26

సంవర్ధయిత్వా శత్రుఘ్నం జగామాశ్రమ మంజసా | సర్వంరామవచశ్చక్రే శత్రుఘ్నోపిమహాయశాః || 27

కృత్వాపురీ నివేశంచ గృహప్రావేశనం తథా | ఉషిత్వా ద్వాదశసమాః సంప్రాప్తే సురకర్మణి || 28

జగామ భ్రాతరం ద్రష్టుం వాల్మీకే రాశ్రమం పునః | తత్రశుశ్రావ ధర్మాత్మాశు భాంరామకథాం కృతామ్‌ || 29

వాల్మీకి నాప్రహృష్టేన గీయమానాంకుశీలవైః | తత్రోష్య రజనీమేకాం రామం దృష్ట్వాతథైవచ || 30

తత్రోష్య పంచ రాత్రంచ భూయోరామ విసర్జితః | మదురాయాంచ వసుధాం పాలయామాస ధర్మవిత్‌ || 31

ఏవం విధః సశత్రుఘ్నోభరతోప్యధికస్తతః | మాతేన విగ్రహంగచ్ఛభరతేన మహాత్మనా ||

అజేయా రఘవో యేషాం సహాయా వానరోత్తమాః || 32

సుగ్రీవ నీలాంగద వాయుపుత్ర సుషేణమైంద ద్వివిద ప్రధానాః |

మహాబలాః పర్వతమాత్రకాయాః సురాసురై ర్యుద్ధగతా అజేయాః || 33

ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ప్రథమఖండే మార్కండేయ వజ్రసంవాదే శైలూషంప్రతి నాడాయన వాక్యేషు లవణవధో నామసప్తత్వారిం శచదుత్తరద్విశతతమోధ్యాయః ||

ఆ ప్రదేశనమునకు చ్యవనుడు సైన్యముతోవచ్చి శత్రుఘ్నునికి జయాశీస్సులిచ్చి వెంటనే యాశ్రమమునకేగెను. రాముని మాటనెల్ల నొనరించి మహాయశస్తి శత్రుఘ్నుడట మధురాపురీ నివేశముగావించి గృహప్రవేశమొనరించి యందు బండ్రెండేండ్లు వసించి దేవకార్యమొకటి గలుగ తిరిగి వాల్మీక్యాశ్రమమున కన్నగారిం దర్శింపనేగెను. అక్కడ ధర్మాత్ముండతడు రామకథను వాల్మీకికృతమైనదానిని (రామాయణమును) కుశలవులచే గానము సేయబడినదానిని వినెను. ఒక్కరేయి యటనుండి మరల రాముం జూచి అక్కడ పంచరాత్రము వసించి మరల రాముడుపంప మధురయందుండి ధర్మవిదుడాతడు వసుధం బాలించెను. శత్రుఘ్ను డాతడీలాటివాడు. అంతకంటె నధికుడు భరతుడు. అమ్మహాత్మునితో నీవు తగవు వడకుము. వానరులు సహాయులుగానున్న రఘువులజయ్యులు. సుగ్రీవ నీలాంగద వాయుపుత్ర సుషేణఫ మైంద ద్వివిద ప్రధానులు మహాజలులు. పర్వతాకారులు సురాసురుల తోడి బోరులందేని జయింప శక్యముగానివారు.

ఇది శ్రీవిష్ణుధర్మోత్తరమహాపురాణము ప్రథమఖండమున లవణాసురవధయను రెండువందలనలుబదియేడవఅధ్యాయము.

Sri vishnudharmothara Mahapuranam-1    Chapters