Sri vishnudharmothara Mahapuranam-1    Chapters   

రెండువందల ముప్పదిఐదవ అధ్యాయము - దక్షాధ్వరధ్వంసనము

నాడాయనః : తసై#్యవ దేవదేవస్య ప్రభావ మపరం శృణుః | తేన విధ్వింసితో యజ్ఞో యదా దక్షస్య ధీమతః || 1

దక్షస్య యజమానస్య గంగాద్వారే పురా ప్రభో | అనాహ్వానే చ శర్వస్య దేవీ ప్రకుపితా భవత్‌ || 2

దేవ్యాః ప్రకోపాచ్చ తథా క్రుద్ధః శూలధర స్తదా | వీరభ##ద్రేతి విఖ్యాతం క్రోధజం సృష్టవాన్‌ గణమ్‌ || 3

భద్రకాశీ స్వకాద్దేహా త్సృష్టవత్యథ పార్వతీ | గణౖ రనుగతో రాజన్‌ ! వీరభద్రో మహాయశాః || 4

భద్రకాళీ తథా గత్వా దక్షయజ్ఞ మశాతయత్‌ | విధ్వస్య మానం యజ్ఞం తు పార్వత్యా సహిత శ్శివః || 5

దృష్టవాం స్తత్ర రాజేంద్ర ! భద్ర కర్ణేశ్వరః స్థితః | విధ్వస్యమానే యజ్ఞే తు దక్షో వచన మబ్రవీత్‌ || 6

వీరభద్రం మహాభాగం భద్రకాశీం తథైవ చ | కౌ భవన్తా విహ ప్రాప్తౌ మమ యజ్ఞోపఘాతకౌ || 7

వీరభద్రః : క్రుద్ధేన శంకరేణావాం భాగస్యాపరికల్పనాత్‌ | యజ్ఞవిధ్వంసనార్థాయ ప్రేషితౌ తే పరంతపౌ || 8

భద్రకర్ణేశ్వరం శర్వం గచ్ఛ శీఘ్రం ప్రసాదయ ! నాడాయనః ! వీరభద్రవచః శ్రుత్వా గత్వా తుష్టావ శంకరమ్‌ || 9

అశ్వమేధ సహస్రాగ్ర్యం ఫలం లేభే త్రిలోచనాత్‌ | త్రిలోచన స్తదా తుష్టో వీరభద్ర మభాషత || 10

శూలియొక్క యింకొక ప్రభావమిది వినుమని నాడాయనుడు తెలుపం దొడంగెను. దక్షుడు యజమానుడై గంగా ద్వారమందు యజ్ఞముసేసి యందు పార్వతి నాహ్వానింపకున్నంత నామె కోపించెను. ఆమె కోపింప శూలియుం గోపించి వీరభద్రమను పేరందిన గణమును పార్వతి తన మేనినుండి భద్రకశి యను పేరందిన శక్తిని సృజించిరి. భద్రకాళి నని దక్షయజ్ఞమును ధ్వంసము సేసెను. అక్కడ భద్రకర్ణేశ్వరుడను పేరుతో శివుడు పార్వతితో నేగి యా ధ్వంసమగుచున్న దక్షయజ్ఞముం జూచెను. అపుడు దక్షుడు మహాభాగుడగు వీరభద్రుని భద్రకాళింగని మీరెవరిక్కడికి యజ్ఞఘాత చేయవచ్చినారని యడుగ వీరభద్రుడు కుపితుడైన శంకరునిచే పరికల్పితులము మేమిర్వురము. నీ యజ్ఞ నాశనమునకే పంపబడినారము. నీవుపోయి భద్రకర్ణేశ్వరుని శర్వుని శీఘ్రముగ శరణందుమనెను. వీరభ్రదుని పలుకులూలించి యతడు శంకరుని స్తుతించి యా త్రినేత్రుని వలన వేయి అశ్వమేధముల ఫలముపొందెను. హరుడు సంతుష్టుడై వీరభద్రునింగని యిట్లనియె.

యత్రస్థేన త్వయా యజ్ఞో దక్షస్యాద్య వినాశితః | తత్ర స్థానే తు సతతం సాన్నిధ్యం త్వం కరిష్యసి || 11

పూజాం చ విపులాం తత్ర ప్రాప్స్యసే మత్ర్పసాదజాం | యేచ త్వాం పూజయిష్యన్తి వీరభద్ర గణశ్వర ! || 12

తే నాకవృష్ఠం యాస్యన్తి నాత్ర కార్యా విచారణా | దక్షేణ చ సమాహూతా భద్రకర్ణేశ్వరే త్వయా || 13

సరస్వతీ మహాభాగా ప్రవిష్టా జాహ్నవీ జలమ్‌ | సంగమే చ తయో స్స్నాత్వా పూజాం మమ కరిష్యతి || 14

యః పుమాన్‌ స గణశత్వం మమ ప్రాప్స్య త్యసంశయమ్‌ | గంగాద్వారం కుశావర్తం బిల్వకం నీలపర్వతమ్‌ || 15

తథా కనఖలం తీర్తం సర్వపాపప్రమోచనమ్‌ | భవిష్యతి మహాభాగ ! తథైవ చ మనోహరమ్‌ || 16

ప్రజాపతే ర్యజ్ఞ భువం సమాసాద్య యత స్తతః | మోక్ష్యతే పాతకం సర్వం త్రిదివం చ గమిష్యతి || 17

భూయిష్ఠ ముద్ధృతాత్పుణ్యం తస్మా త్ర్పస్రవణోదకమ్‌ | తస్మాదపి తథా పుణ్యం సారసం పరికీర్తితమ్‌ || 18

సారసాన్నై ర్ఘరంపుణ్యం నాదేయమపి నైర్ఘరాత్‌ | తస్మాదపి చ గాంగేయం తదిహాపి విశేషతః ||

సర్వత్ర దుర్లభా గంగా త్రిషు స్థానేషు దుర్లభా || 19

గంగాద్వారే ప్రయాగేచ గంగా సాగర సంగమే | గంగాద్వారే కుశావర్తే బిల్వకే నీవపర్వతే || 20

స్నాత్వా కనఖలే తీర్థే న పునర్జన్మభా గ్భవేత్‌ | తీర్థవంచక మేతద్ధి యత్రైవ గణనాయకః || 21

తత్ర సన్నిహితో బ్రహ్మా తత్రాహం తత్ర కేశవః | తత్ర దేవగణా స్సర్వే ఋషయశ్చ తపోధనాః || 22

తత్సమీపే చ తే స్థానం త్విదం దత్తం మయా తవ | తత్ర త్వం సతతం వత్స ! లోకా త్పూజా మవాప్స్యసి || 23

ఏవముక్త్వా మహాతేజాః వీరభద్రం మహేశ్వరః | ఉవాచ వచనం దేవో భద్రకాశీం మహేశ్వరః || 24

నీవెక్కడనిలిచి దక్షయజ్ఞముం జెరచితివో యక్కడనే నీవు సన్నిధిసేయుము. నా యనుగ్రహమున నక్కడ నందరి వలనం బూజవడయుము. నిన్ను బూజించువారు స్వర్గమధిష్ఠింతురు. ఈ భద్రకర్ణేశ్వరమందు దక్షుడు పిలువగా వచ్చిన సరస్వతి జాహ్నవీజలమందు జొచ్చెను. ఆ గంగా సరస్వతీ సంగమ తీర్థమందు స్నానముసేసి నాపూజచేసినతడు నాగణములకధీశుడగును. గంగాద్వారము కుశావర్తము బిల్వకము నీలపర్వతము కనఖల తీర్థము సర్వపాపహరములు మనోహరములు నగును. దక్షప్రజాపతి యజ్ఞభూమిం దరిసినతడు పాపమువాసి త్రిదిపమునకేగును. భూమిలోనుండి పైకిరావింపబడిన దానికంటెను ప్రస్రవణోదకము కొండచరియలనుండి జారిన జలము అంతకంటె కొండమీదనుండి పడునిర్ఘరములు=కొండవాగుల నీరును దానికంటె నదీ జలము, దానికంటె గంగాజలము దానికంటె నిక్కడి గంగోదకము నొకదాని నొకటి మించిన పుణ్యతీర్థములు గంగ యన్నియెడల దుర్లభ. గంగాద్వారము ప్రయాగ గంగా సాగరసంగమము నను మూడు స్థానములందలి గంగ దుర్లభ గంగాద్వారము ప్రయాగ గంగాసాగర సంగమము గంగాద్వారములు కుశావర్తమ బిల్వకము నీలపర్వతము కనఖలతీర్థము నను నీ తీర్థములందు స్నానముచేసిన పునర్జన్మముండదు. ఈ తీర్థపంచకమునందు గణనాయకుడుండును. నీకే స్థానమిచ్చితిని. వత్సా ! వీరభద్ర నీవచట వసించి లోకమువలన పూజనందుదువు. ఇట్లు నా మహేశ్వరుడు వీరభద్రునితోనని భద్రకాశింగూర్చి యిట్లుపలికెను.

మహాశ్వరః : నమోస్తుతే మహాభాగే వరదే ! కామరూపిణి ! | ఆష్టాదశభుజే స్వస్తి శూలముద్గరధారిణి || 25

పీతకౌశేయపసనే ! శశాంక సదృశాసనే ! నీలోత్పలదళశ్యామే ! గజకుంభోవమ స్తని | 26

వరదే ! చారు సర్వాంగి ! సర్వాభరణ భూషితే | కమండలుధరే ! దేవి ! దేవారి బలనాశిని ! 27

అదితి శ్చ దితిశ్చైవ వనితా సిద్ధిరేవచ | రాత్రి ర్నిద్రా ప్రభా కాన్తి ర్బుద్ధి ర్లక్ష్మీః సరస్వతీ | || 28

ధృతిః కీర్తిః స్వధా స్వాహా త్వమేవ వర వర్ణినీ ! త్వాం జనాః పూజయిష్యంతి సర్వకామ ప్రదాం శుభామ్‌ || 29

నవమ్యాం శుక్లపక్షస్య లోకాత్‌ పూజా మవాప్స్యసి | నవమ్యాం పూజయిష్యన్తి యే త్వాం సమ్య గుషోసితాః || 30

తేషాం త్వం కామ్యదా సౌమ్యే ! భవిష్యసి న సంశయః | కందరేషుచ శైలానాం వనానాం గహనేషు చ || 31

రంస్యసే త్వం విశాలాక్షి ! తదా పూజా మవాప్స్యసి | యే చ త్వాం మత్ర్పభావజ్ఞాః పూజయిష్యన్తి మానవాః || 32

న తేషాం దుర్లభం కించిత్‌ ఇహలోకే పరత్ర చ | యే చేదం మత్కృతం స్తోత్ర మభిధాస్యన్తి భక్తితః || 33

తే సర్వే భయనిర్ముక్తాః భవిష్యన్తి న సంశయః | నాడాయనః ఏతావ దుక్త్వా వచనం తత్రైవాన్త రధీయత || 34

దక్షోపిచ వరం లబ్ధ్వా ముదంలేభే త్రిలోచనాత్‌ ||

ఏవం ప్రభావో వరదః స దేవో | భక్తాను కంపీ జగతో నివాసః |

తస్యాస్య వక్తుం నృపవర్య ! తస్య గుణాన్‌ ప్రవక్తుం సకలా హి శక్తిః || 35

ఇతి శ్రీ విష్ణుధర్మోత్తరే ప్రథమఖండే దక్షయజ్ఞ విధ్వంసో నామ పంచ త్రింశ దుత్తర ద్విశతతమోధ్యాయః.

మహేశ్వరకృత భద్రకాశీస్తుతి.

నీకు నమస్కారము మహాభాగ ! కామరూపిణి పదునెనిమిది భుజములుగొని శూలము ముద్గరముందాల్చి పసుపు పచ్చని చీరదాల్చి చంద్రునివంటి నెమ్మోముతో నల్లగలువ రేకులవలె చామయనచాయ దానవై గజకుంభ సమాన కుచకుంభములతో వరదవై సర్వాంగసుందరివై సర్వాభరణభూషితవై కమండలుపూని దేవరిపు నాశినివై యున్న నీకు వందనములు. అదితి దితి సిద్ధి రాత్రి నిద్ర ప్రభ కాంతి బుద్ధి లక్ష్మి సరస్వతి ధృతి కీర్తి స్వధ స్వాహనను వీరందరు నీవే. నిన్ను జనులు శుక్ల నవమినాడు పూజింతురు. నవమినాడుపవసించి నిన్ను పూజించు వారికి నీవు సర్వకామ పదాత్రివగుము. పర్వత కందరములందు అడవులలో గహనప్రదేశములందు నీవు విహరింప గుతూహలపడుదువు. పూజలందుదువు. ఓ విశాలాక్షి ! నిన్ను నా ప్రభావమొరింగి జించు మానవులకు దుర్లభ మేకొంచెము నిహమందు పరమందు నుండదు. ఈ నా చేపూసిన నీస్తోత్రమును భక్తితో పఠించు వారెల్లభయముల వలని ముక్తినందుదురు. నందియములేదు. ఇంతదనుక పలికి యీశ్వరుడక్కడనే మరుగయ్యెను దక్షుడు నట్లు వరమంది ముదమందెను. జగన్ని వాసుడు కైలాసవాసుడిట్టి ప్రభావమువాడు. ఈయన గుణములు వర్ణింప నెవ్వరికి శక్తిగలదు ?

ఇది శ్రీవిష్ణుధర్మోత్తరమహాపురాణము ప్రథమఖండమున దక్షయజ్ఞధ్వంసమను రెండువందల ముప్పదియైదవ అధ్యాయము.

Sri vishnudharmothara Mahapuranam-1    Chapters