Sri vishnudharmothara Mahapuranam-1    Chapters   

ఇరువదిరెండవ యధ్యాయము - గంగా వ్యాప్తి

వజ్ర ఉవాచ :

బ్రహ్మా& ! విష్ణుపదీ గంగా త్రైలోక్యం వ్యాప్య తిష్ఠతి | యథాతథా భృగుశ్రేష్ఠ ! సర్వమేవ ప్రకీర్తయ || 1

మార్కండేయ ఉవాచ :

ప్రవిశ్య దేవీ బ్రహ్మాండం విష్ణులోక ముపాగతా | బ్రహ్మీం సభాం ప్లావయిత్వా తపోలోక ముపాగతా || 2

జనలోకం గతా తస్మా న్మహర్లోకం తతోగతా | స్వర్గలోకం సమాసాద్య ప్రవిష్టా చంద్రమండలమ్‌ || 3

చంద్రమండల విభ్రష్టా భువర్లోక ముపాగతా | ఆకాశగంగా కథితా తత్రసారతి వర్ధినీ || 4

తస్యాస్తు దృశ్యతే పన్థాః సతతం వ్యోమ్ని నిర్మలే | ఆకాశగంగా మధ్యేసా మేరేనిపతితా గిరౌ || 5

మేరుమధ్యా దృశ్యన్తీ దృశ్యన్తీ చ తధా క్వచిత్‌ | ప్రయాతా సర్వవర్షాణి ద్వీపానిచ మహామతే ! || 6

సాతుదేవీ జయానామ మరువర్షే హ్రదాస్తుతే | తేభ్యశ్శాన్తాచ సాధ్వీచ ద్విదా గంగా వినిస్సృతా || 7

జ్యోత్స్నా చ మృగమందాచ స్మృతా హైరణ్వతీ శుభా | పుండరీకా పయోదాచ రమ్యే వర్షే నిగద్యతే || 8

భద్రాచ కథితా దేవ గాంధర్వీచ మనో7నుగా | ఇలావృతే తథా సైవప్రోక్తా జాంబవతీశుభా || 9

తస్యాస్తీరభవం మూర్ధ్ని కనకంధార్యతే సురైః | కేతుమాలే చ కథితా నిర్మలా నడ్వలా తథా || 10

మనస్విన జ్యోతిష్మతీ హరిషర్షే నిగద్యతే | తథా కింపురు షాఖ్యేంతు రంభా చంద్రవతీ శుభా || 11

ఇంద్రద్యుమ్న పయోదా సా కాశైకా మతిపావనీ | మనోజవా తామ్రపర్ణీ గభస్తి మతి మాలినీ || 12

నాగద్వీపే నాగవతీ సౌమ్యే సోమప్రభా తథా | రుద్రలోకం తతః ప్రాప్తా బ్రహ్మలోకం తతో గతా || 13

గాంధర్వీ చైవ గంధర్వీ వారుణ వరుణ హ్రదా | హ్రాదినీ హ్లాదినీ చైవ పుణ్యతోయా చ వర్షిణీ || 14

సీతా చక్షుశ్చ సింధశ్చ గంగా చాస్మి& ప్రకీర్తితా | అమరా& నిషధా న్సర్వాన్ధీవరా నృషికాం స్తథా || 15

ఓష్ఠప్రావరణా& సౌమ్యా& కర్ణ ప్రావరణాం స్తథా | కాలోదరా& వికీర్ణాంశ్చ హ్రాదిని తు నిషేవతే || 16

ఇంద్ర ద్యుమ్నసరః పుణ్య ముపచారా దజాయత | తథా ఖరపదా& దేశా& వేత్ర శంకుపదా నపి || 17

తంజానకామతం చైవ హాదినీ తు నిషేవతే | దరదా& జహుడాం శ్చైవ కాశ్మీరా& నైరసా& కురూన్‌ || 18

గాంధారాన్‌ దరదా భీరాన్‌ కుపర్వాన్‌ భీమరౌరవాన్‌ | శివపర్వా నింద్రపర్వాన్‌ సింధు తీరాన్‌ నిషేవతే || 19

దేవా& దైత్వా& కాలకేయా& గంధర్వా కిన్నరాంస్తధా |

విద్యాధరా& తథా నాగా& సు పర్వా న్సుమనో హరా& || 20

కలాపగ్రామకాం శ్చైవ నరనారాయణా శ్రీమమ్‌ | రాతాంశ్చ పుళిందాంశ్చ మయస్య నగరీం తథా || 21

కుతూ న్సభారతాం శ్చైవ పుళిందాంశ్చైవ భాగశః |

పాంచాలా& కాశయా& వత్సా& మాగధాంస్తా మ్ర విప్తకా& || 22

సహ్యోత్తరాంశ్చ వంగాంశ్చ తథా శ్రావస్తి వాసినః | అంగా& వంగా& సపుండ్రాంశ్చ గంగా భావయతే శుభా ||

హ్రాదినీ హ్లాదినీ చైవ పావనీ జాహ్నవీ తథా | ప్రవిష్టా సాగరం పూర్వం ద్వీపే7 స్మి& నృప సత్తమ || 24

సీతా చక్షుశ్చ సింధుశ్చ పశ్చిమం నృప ! సాగరమ్‌ | గంగా వ్యాప్తి స్తవప్రోక్తా జంబూద్వీపే మయా7నఘ || 25

లోకేషుచ తథా రాజ& ! ద్వీపే ష్వన్యేషు మే శృణు |

గంగ విష్ణుపది (విష్ణుపాదమునం బుట్టినది) ముల్లోకములను వ్యాపించియున్నది. ఆ వ్యాపించిన విధమును దెలుపుమని వజ్రుడడుగగా మార్కండేయుండిట్లు సెప్పదొడంగె : గంగాదేవి తొలుత బ్రహ్మాండములో బ్రవేశించి విష్ణులోకముం జొచ్చి బ్రహ్మ సభను దడిపి తపోలోకమును జనలోకమును మహర్లోకమును స్వర్గలోకమును జేరి చంద్రమండలముంబ్రవేశించెను. అట నుండి జారి భువర్లోకమునకువచ్చి ఆకాశగంగ యను పేర నుల్లాసమును బెంపొందించుచున్నది. నిర్మలమైన యాకాశమందా నదీమ తల్లి మార్గము కనబడుచున్నది. ఆమె భూమండల మధ్యమందున్న మేరుపర్వతము మీద బడినది. మేరు మధ్యమందుండి కొన్ని చోట్ల కనబడకయు కొన్ని యెడల కనబడుచును నెల్లవర్షములను సర్వద్వీపములనుగూర్చి యేగినది. కురువర్షమునందు ఆమె జయ యనుపేరం ప్రవహించినది. ఆ జయ యను గంగలో మడుగులు శాంత సాధ్వి అని రెండు. జ్యోత్స్న మృదంగ హిరణ్య వర్షమున-పుండరీక పయోద అనునవి రమ్యకవర్షమున-మడుగులు. భద్ర గాంధర్వి మనోనుగ జాంబవతి యని యిలావృత వర్ష మందు గంగానదీ హ్రదములు (మడువులు) గలవు. ఆ జాంబవతి తీరమందుపుట్టిన కనకమును (బంగారము జాంబూనదము) దేవతలు ధరింతురు. కేతుమాలవర్షమందు నిర్మల నడ్వల యను పేర నున్నది. మనస్విని జ్యోతిష్మతి యనుపేర హరివర్షమునను-కింపురుష వర్షమున రంభ చంద్రవతియని ఇంద్రద్యుమ్న పయోద కోశైకమతి పావని మనోజవతామ్రపర్ణి గభస్తిమతి మాలిని నాగవతి యన నాగద్వీపమందు - సోమప్రభయనుపేర సౌమ్యద్వీపమందును - గంగానది వివిధశాఖలుగా రూపొందినది. అటుపైని రుద్రలోకమును బ్రహ్మలోకమును జొచ్చినది. గంధర్వలోకమందు గాంధర్వి, వరుణలోకమందు వరుణహ్రదయు ననబడును. హ్రాదిని హ్లాది వర్షిణి సితచక్షుస్సు సింధువు అను పేర గంగ ఈ భారతవర్షమున రూపొందినది. అమర, నిషధ, ధీవర, ఋషిక ఓష్ఠప్రావరణ, కర్ణప్రావరణ, లోదర, వికర్ణములనెడి దేశములందు హ్రాదిని యనుపేర గంగ ప్రవహించుచున్నది. అటుపై ఇంద్రద్యుమ్న మను సరస్సు పేర గంగయే ఔపచారికముగ పిలువబడుచున్నది. ఖర పదములు వేత్ర శంకుపదములు తంజాన కామతము నను ప్రవేశములను హ్లాదిని యను గంగ ప్రవహించినది. అవ్వల దరదములు జహుడములు కాశ్మీరములు నైరసములు మేరువులు గాంధారములు దరదాభీరములు కుపర్వములు భీమ కారవములు శివపర్వములు ఇంద్రపర్వములు సింధుతీరములను జొచ్చినది. దేవతలు దైత్యులు కాలకేయులు గంధర్వులు కిన్నరులు విద్యాధరులు నాగులు సుపర్వులు కలాపగ్రామములను నరనారాయణాశ్రమమును (బదరి) కిరాత పులింద దేశములను మయనగరమును కులు భారతదేశములను పులింగ దమలో కొంత భాగమును పాంచాల కాశయ వత్స మాగధ తామ్రలిప్తకములను సహ్యపర్వతోత్తర ప్రదేశములను వంగదేశమువారిని శ్రావస్తినివాసులను అంగులను వంగులను పుండ్రులను గంగానది సంభావించుచున్నది. ఈ జంబూద్వీపమునందు హ్రాదిని హ్లాదిని పావని జాహ్న వియనునవి తూర్పు సాగరముం బ్రవేశించినవి. సిత చక్షుస్సు సిందు పడమటి సాగరముంజొచ్చినవి. ఇంతవరకు జంబూద్వీపమునందు గంగయొక్కవ్యాప్తి నీకేను దెల్పితిని. మరియితర లోకములందు ద్వీపములందున్నది వినుము.

సుకుమారీ కుమారీచ సుకృతా సేవినీ తథా || 26

ఇక్షుశ్చ వేణుకా నందా శాకద్వీపే చ సప్తధా | శాల్మలే త్వథ గోమేదే ద్వీపే పుష్కర సంజ్ఞకే || 27

నదీత్వం సా సముత్సృజ్య చోదధిత్వ ముపాగతా | తస్మి& ద్వీపత్రయే నద్యోన సన్తి యదు నన్దనః || 28

ఉదకా న్యుద్భిదాన్యేవ తేషు సన్తి సహస్రశః ఏవం భూమితలం ప్లావ్య పాతాళం కృష్ణమృత్తికమ్‌ || 29

ఏకీభూతా ప్రవిష్టా సా భోగ వత్యాః సమీపతః | శ్వేత భౌమంగతా తస్మాత్‌ రక్త భౌమం తతోగతా || 30

శిలా భౌమం గతా తస్మాత్‌ రుక్మభౌమం తతోగతా | రుక్మభౌమా దపిగతా రౌద్రం తేజ స్సుదారుణమ్‌ || 31

* వి.ధ.పు-6

తతో7పి విలయం గత్వా వారాహం లోక మాగతా | వారహలోకాద్బ్రహ్మాండం తదర్థం భిన్నవాహినీ || 32

ఛిద్రేణ తేనసా దేవీ స్వాంయోనింపున రాగతా || 33

ఏవం నరేంద్రేశ ! జగత్సమగ్ర మాక్రమ్య గంగా సతతం స్థితా యా |

తస్యాః ప్రభావ శ్రవణా దశేషం పాపంనరాణాం సముపైతి శాంతిమ్‌ || 34

ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ప్రథమఖండే మార్కండేయ వజ్ర సంవాదే గంగా వ్యాప్తిర్నామ ద్వావింశతి తమో7ధ్యాయః

సుకుమారి, కుమారి, సుకృత, సేవిని, ఇక్షువు, వేణుక, నంద యను పేర శాకద్వీపమునం దమరనది యేడు విధములయినది. శాల్మల, గోమేద, పుష్కర ద్వీపములందు గంగ నదీభావమును వదలి యుదధి (సముద్ర) భావముం బొందినది. ఆ మూడు ద్వీపములందు నదులు లేవు. ఉదకములు ఉద్భిదములు మాత్రమే వేలకొలది యటనున్నవి. ఇట్లు భూతలము దడిపి నల్లని మృత్తికతోనుండు పాతాళముంజొచ్చి ఏకీభూతయై (అన్ని పాయలు నొక్కటియై) భోగవతి సమీపమందు శ్వేత భౌమమును (తెల్లని మట్టిగల ప్రదేశమును) రక్తభౌమమును (ఎర్రనిమట్టిగల ప్రదేశము) శిలాభౌమమును (రాతినేలను) రుక్మభౌమమును (స్వర్ణభూమిని) క్రమముగా బొందినది. స్వర్ణభూమినుండి కూడ సుదారుణమైన రుద్రతేజస్సును బొందినది. ఆమీద విలయమంది వారాహలోకమున కేతెంచినది. అటనుండి బ్రహ్మాండమును దానిలో సగభాగము రెండుగా ప్రవహించి లోగడ చెప్పిన ఛిద్రము (రంధ్రము) నుండి తనజన్మస్థానమునకు దిరిగివచ్చినది. ఇట్లు గంగాదేవి యెల్లజగమాక్రమించి నిత్యస్థాయి నొందినది. ఆమె ప్రభావమాలించిన నరుల పాపము శమించును.

ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణము ప్రథమఖండమున గంగావ్యాప్తియను నిరువది రెండవ యధ్యాయము.

Sri vishnudharmothara Mahapuranam-1    Chapters