Sri vishnudharmothara Mahapuranam-1    Chapters   

రెండువందల పదునారవ అధ్యాయము - రాక్షససేనా ప్రస్థానవర్ణనము

ఆగస్త్యః - దేవతానాం సముద్యోగం శ్రుత్వా మాలి సుమాలినౌ | చక్రతుః పృతనాం ఘోరాం త్రిదశై ర్యుద్ధకాంక్షిణౌ ||

తౌ క్రుద్ధౌ భ్రాతరౌ శ్రీమాన్‌ మాల్యవాన్‌ వాక్యమబ్రవీత్‌ | ఆశ్రయస్త్రి దశేంద్రాణాం సర్వాత్మా మధుసూదనః || 2

తేన యుద్ధం నకర్తవ్యం సతుపూజ్యో జగతృతిః | అగ్రేతు ప్రణిపాతేన తం యజామో జగత్పతిమ్‌ || 3

ప్రణిపాత ప్రసన్నోహి కామాన్‌ దాస్యతి కేశవః | విష్ణుర్హి మలినే చిత్తే త్వస్మాకం నృప: దుర్జయః || 4

జీవేమ సుచిరం కాలం స్తిత్యా దేవస్య శాసనే | ప్రసీద : రాజన్‌ ! మా యుద్ధం ప్రజ ః దేవేన విష్ణునా || 5

యక్షాణాం రాక్షసానాంచ కురుశ్రేయ స్తథా త్మసః | ఏత దుక్తం హితం భ్రాత్రా రురుచే న చ తస్య తత్‌ || 6

మహతా చ ససైన్యేన ప్రయ¸° యేన కేశవః | త మన్వ¸° మహాతేజా ః సుమాలీ రాక్షసాధిపః || 7

పితృతుల్య శ్చ సాధూనాం జ్యేష్టభ్రాతా గురుర్మతః | అదౌ వాచ్యం హితం తస్యకార్యం తదను చేష్టితమ్‌ || 8

ఏతాం వృద్ధిం సమాస్థాయ నిర్యాతో మాల్యవానపి | తే రాక్షసా సహ భ్రాత్రా భీమనే త్రాగ్ని భూషణా ః || 9

కోటిశ##తేన ముఖ్యానాం రాక్షసానాం వినిర్గతాః | నానావిధోగ్ర వసనాః నానా ప్రహరణాయుధాః || 10

నానా వాదిత్ర ఘోషేణ ప్రయతా రాక్షసాధిపాః | నానా ప్రకారై ర్వివిధైః ప్రాణిభి ర్భలవత్తరైః || 11

వాహనైః ప్రయయు ర్ఘోరాః రాక్షసాస్త్రి దశాధిపమ్‌ | గచ్ఛత స్తు బలౌఘస్య తదా తస్యోత్తరాం దిశమ్‌ ||

బభూవా భి ముఖం ఘోరం వనం త్రిదశపాలితమ్‌ || 12

హిమాచల స్యోత్తర దిగ్విభాగే స్వస్థే బలే తౌ పురుషౌ ప్రవీర ః

జయర్థ మభ్యుద్యత చాప దండౌ ప్రచక్రతు ర్యుద్ధ మదీన సత్వౌ|| 13

ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ప్రథమఖండే శైలూషం ప్రతినాడాయానానుశాసనే

రాక్షససేనానిర్యాణ వర్ణనంనామ షోడశోత్తర ద్విశతతమోధ్యాయః||

ఆగస్త్యులనిరి. దేవతల యుద్దోద్యమము విని కుపితులై సోదరులు మాలి సుమాలులు జయకాంక్షతో దేవతలతో యుద్దమునకుం దలపడిరి. వారిని గని మాల్యవంతుడు సర్వాత్మకుడైన మధుసూదనుడు సురేంద్రుల కాశ్రయము. ఆయనతో పోరాడరాదు. ఆజగత్పతి యాతడు పూజనీయుడు. ఆయనముందు సాష్టాంగపడి యాస్వామిని జయింతము. హరి ప్రణిపాత ప్రసన్నుడు. (ప్రణతులగు వారియెడ ననుగ్రహము సూపువాడు) అభీష్టముల నిచ్చును. విష్ణువుమన మలినమైన చిత్తమునందున్నాడు. దుర్జయుడు ఆదేవుని యాజ్ఞకు గట్టుపడి మనము చిరంజీవులమగుదుము. రాజా!నీవు ప్రసన్నుడవగుము. విష్ణునితో బోరునకు బోకుము. యక్షులకు రాక్షసులకు నావిధముగా శ్రేయస్సుకూర్చుమనియె. తమ్ముడు సెప్పిన యీమాట మాలికి రుచింపలేదు. పెద్ద సేనతో హరిపైకి నడచెను. మహాతేజస్వి(ప్రతాపవంతుడగు) రాక్షసరాజు సుమాలియు వానిని వెంబడించెను. జ్యేష్ఠభ్రత పితృతుల్యుడు గురువు నని చెప్పబడినదిగదా! తొలుత హితవు చెప్పవలెను. ఆవ్వల వాని చెసినయట్లు చేయవలెను. అను నీతలంపును (నీతని) అధారముగా గైకొని మాల్యవంతుడును మాలిని యుద్దమున కనుసరించెను. వారందరు భయంకర నేత్రాగ్ని భూషణులైయన్నతో వందకోట్ల రాక్షస ముఖ్యులతో వెడలి నానావిధోగ్రవస్త్రధారులై నానాప్రహరణాయుధములను నానాయుద్ధవాద్య ఘోషముతో నారాక్షసాధి పతులు నానాప్రకారములైన బలవత్తరములైన పెక్కు ప్రాణులతో వాహనములతో సతి ఘోరులై దేవాధీశ్వరుడగు హరిపైకి నడచిరి. అటుత్తరదిశగా నరుగునా సైన్యములకు దేవతల పాలనములో నున్న వనమొకటి అభిముఖ మయ్యెను ఎదురయ్యెను. సైన్యము హిమాలయము నుత్తర దిగ్విభాగమున స్వస్థమై నిలువ నా వీరులదీన సత్త్వులు జయము గోరి ధనుర్దండము లూని యుద్ధము సేయజొచ్చిరి.

ఇది శ్రీవిష్ణు ధర్మోత్తర మహాపురాణము ప్రథమఖండమునందు

రాక్షససేనా ప్రస్థాన వర్ణనమను రెండువందల పదునారవ యధ్యాయము

Sri vishnudharmothara Mahapuranam-1    Chapters