Sri vishnudharmothara Mahapuranam-1    Chapters   

రెండువందలఆరవ అధ్యాయము - భరతుని గంగావతరణము

మార్కండేయః : నివేశ మకరో ద్రాజన్‌: గంగాతీరే సరాఘవః | భరతస్య తదా చక్రుర్గంగాయాం జలమండపాన్‌ || 1

తథైవ బలం ముఖ్యానాం ప్రాధాన్యేన నరాధిప: | సైనికశ్చ జన స్తస్య ప్రాప్య తాం సురనిమ్నగామ్‌ || 2

సాఫల్యం జన్మనోమేనే తత్యాజ చ తథా క్లమమ్‌ | సస్నౌ పపౌ పయః కామం హర్షేణ మహతా యుతః || 3

స్నాపయాంచక్రిరే తత్ర తురగాం స్తురగ ప్రియాః| కుంజరాన్‌ స్నాపయామాసుః మహామాత్రా స్తథైవచ || 4

మజ్జద్భిః బహుసాహసై#్రః కుంజరై ర్జాహ్నవీ నదీ | కిరాతవిషయై సై#్సవ విరరాజ యథోపలైః || 5

సముత్థిత మహామాత్రాన్‌ దృష్ట్వా7 భ్యుక్షణఛద్మనా | చిక్రీడు ర్దృతిభిః కేచి ద్వివిశుర్బాహుభి స్తథా || 6

గంగా మాసాద్య సంహృష్టా భరతస్య తు సైనికాః | భరతో7పి తథా స్నాతఃకృతదైవతపూజనః || 7

శ్రాద్ధం చక్రే మహాతేజాః దదౌదానం తదైవ చ | దత్వా తత్ర మహాదానా నాజ్ఞాపయతి యాదవ : || 8

శిల్పినో మమ కుర్వన్తు కూటాగారాన్‌ మనోరమాన్‌ | రాత్రౌ దీపనివేశార్థం శతశో7థ సహస్రశః || 9

ఆనీయన్తాం తథా నావః సైన్యస్య తరణాయ మే | క్రియన్తాం చర్మ నావశ్చ ప్లవాశ్చ శతశ స్తథా || 10

ఉత్తరం పార మాసాద్య నివేశః క్రియతాం తథా | పరం పారం జనాయాన్తు ఉదయా స్తమయాన్తరే || 11

ఏవ మాజ్ఞాప్య భరతో విజహార యథాసుఖః |

మార్కండేయుడనియె. రాఘవుడు (భరతుడు) గంగాతీరమందు నివేశమొనరించెను. ఆప్పుడాతనికి గంగలో జలమండపములు నిర్మించిరి. మరియు నీతని సేనాపతులకును ప్రధానముగ పైయేర్పాట్లుచేసిరి. ఆ సురనదింజేరి యాతనిసేన జన్మసాఫల్యమిది యనుకొనెను. శ్రమను బాసెను. మిగులహర్షముతో దృప్తిగ స్నానముసేసెను. అ జలముం ద్రావెను. అశ్వప్రియులానదిలో గుఱ్ఱముల స్నానముసేయించిరి. మావటీండ్రేనుగుల నందోలలాడించిరి. వేలకొలదిగ స్నానముసేయు కుంజరములచే నా జాహ్నవీనది కిరాతదేశమందలి పాషాణములతో గూడెనాయన్నట్లు రాజిల్లెను. ఆ యేనుగులమీద లేచినిలుచున్న మావటీండ్రంజూచి వారిపై నీళ్ళుజల్లునెపమున కొందరు వారితో క్రీడించిరి. ఆనదిలో బాహువులతో నీదిరి. భరతసైనికులు గంగంజేరి యానందభరితులైరి. భరతుడును స్నానమాచరించి దేవతార్చనము సేసి తీర్థశ్రాద్ధము పెట్టెను. దానములుం జేసెను. మహాదానములిచ్చియిట్లాజ్ఞయిచ్చెను. శిల్పులు దీపములు పెట్టుట చట మనోహరములైన కూటాగారములను వేలకొలది నిర్మింతురుగాక! సైన్యమీనదిని దాటుటకు దోలుతో నావలుమదయారుజేయుడు వందలకొలది తెప్పలుంగావలయును. అవ్వలియొడ్డుసేరి నివేశము(నివాసము) నిర్మింపుడి. సూర్యోదయాస్తమయముల నడుమ నీజమ లీవలియొడ్డునకు జేరవలయును. ఇట్లాజ్ఞయిచ్చి భరతుడు సుఖముగా విహరించెను.

ప్రసారితకరో రాజన్‌ సర్వత్రై దివాకరాః || 12

యయా వదర్శనం తత్ర భరతసై#్యప లజ్జయా | పద్మపత్ర దళాగ్రాభా ప్రతీచీ చాభవత్‌ క్షణాత్‌ || 13

ఆదిత్యే 7స్త మనుప్రాప్తే సంధ్యారాగా 7నురంజితా | తతస్తు తమసా వ్యాప్తే న ప్రాజ్ఞాయత కించన || 14

భరతాజ్ఞాకృతాన్‌ పూర్వం కూటాగారాన్‌ సదీపకాన్‌ | ధ్వజమాలా పరిక్షిప్తాంశ్చిక్షిపు ర్జాహ్నవీజలే || 15

సైనికైశ్చ తథా ముఖ్యై ర్భరతస్య పృథక్‌ పృథక్‌ | గంగాంభసి పరిక్షిప్తాః దీపవృక్షాః సహస్రశః || 16

సా దీపమాలినీ గంగా తీరద్యోతితవిగ్రహా | జహాస ఫేనజిహ్వేవ గంగాసా గగనప్రియా || 17

జలాంతరాగతైర్దీపైః దీపవృక్షై ర్మనోహరైః | తథా కల్లోలసంక్రాం తై ర్గంగా దీప్తేవ లక్ష్యతే || 18

ఏవం హి క్రీడతాం తత్ర గంగాతీరే తథా నృణాం | రాత్రావే వాంజసా జగ్ము ర్నావో బహు విధానృప || 19

శశాంక రాజహంసేన దృష్ట్వా ఖ సరసీం జనాః | ఆక్రమ్యమాణాః సుషుపు ర్నిశీథే నిద్రయాన్వితాః || 20

శశాంకోదయ సంసుప్త బలం పద్మవనోపమమ్‌ | విభోధయామాస తథా దివాకరకరోత్కరమ్‌ || 21

చక్రుషుస్తే తదా నావః కర్ణధారా యథా స్వకాః | బలం చ సకలం పారం తారయాంచక్రిరే తథా || 22

నావస్తాం కింకిణీజాలైః పతాకాభి శ్చ రాజితాః | నిన్యు ర్బలం పరం పారం కర్ణధారస్ఫిగాహతాః || 23

దివాకరుడెల్లయెడల కరప్రసారముసేసి ప్రతాపలంతుడు (తేజస్వి) యగు భరతునివలని

సిద్గుచేతంబోలె కనిపింపకుండ పోయెను. క్షణములో నాదిత్యుడస్తమింప బడమటిదిశ సంధ్యారాగరంజితయై తామరపూవువంటి యెఱ్ఱని ప్రభగలదయ్యెను. అవ్వల చీకటిగ్రమ్మ నేమియుం గనిపింపదయ్యెను. ఇంతమున్ను భరతునాజ్ఞచే నేర్పరుపబడిన దీపములతోడి కూటాగారములను పతాకామాలికలెత్తబడినవానిని జాహ్నవీజలములందు వదలిరి. గంగాజలమందు ముఖ్యసైనికులు భరతునికొరకు వేర్వేర వేలకొలది దీపవృక్షములను విరజిమ్మిరి. ఆ గంగానది దీపమాలినియై (మాలాకారములైన దీపములుగలదై) ఇరువంకతీరములందుద్దీపించు మూర్తితో గగనముపైప్రీతిగల జిహ్వ (నాలుకవలె) తెల్లని నురుగనెడి నవ్వుతో నవ్వెను. నీళ్ళలోనికివచ్చి తరంగములందలముకొన్న దీపములచే దీపవృక్షములచే గంగానది యుద్దీపితయైనట్లు కానబడెను. ఇట్లక్కడ గంగాతీరమందు నాజనము క్రీడించుచుండ రాత్రి వేళ##నే బహువిధములయిన నావలు బరబరసాగినవి. చంద్రుడను రాజహంసతో ఆకాశ సరస్సునుచూచి యారాత్రి నిద్రావశులైరి. చంద్రోదయమందు నిదిరించినసైన్యము పద్మవనమువలె నుండుటంజూచి (పద్మబంధువుగాన) దినకరుని కరపుంజము మేల్కొలిపెను. అప్పుడు చుక్కానివేయు వారు తమతమ నావలునడిపించిరి. సబలమైన (బలిష్ఠమైన) బలమును (సేనను) సకలమును నా నదిం దాటించిరి. చిరుగంటలతో పతాకలతో రాజిల్లు నా నావలు కర్ణధారులయొక్క (చుక్కానివేయువారియొక్క లేదా సరంగులయొక్క) స్ఫిక్‌ = చుక్కానివేయువారి నడుములతో త్రోయబడినవైనముతో సైన్యము నవ్వలియొడ్డుకుం గొనిపోయినవి.

భాండైః పూర్ణా స్తథా కాశ్చిత్‌ కాశ్చిత్పూర్ణా జనే నచ | తురంగమై స్తథా పూర్ణా గోఖరోష్ట్రై స్తథా పరాః || 24

కాశ్చి త్సకుంజరా నావో యయుః పారం తదా పరమ్‌ | తథా పద్మదళాక్షీణాం స్త్రీణాం నావ శ్చ పూరితాః || 25

విమానాభాః ప్రదృశ్యన్తే గంగాంభసి నరేశ్వర! | కర్ణధారవరోపేతా దండిభిః పురుషై ర్వృతాః 26

లోకసంతారణార్థాయ భూయో జగ్ముస్తథా పరాః | చర్మనౌభి స్తథా కేచిత్‌ ప్లవైః కేచిత్‌ సుయంత్రితైః || 27

జగ్మురాదాయ భాండాని దృతిభి శ్చ తథా క్వచిత్‌ | నరైర్దృతి సమారూఢై: కృష్యమాణా స్తురంగమాః || 28

జగ్ముః కేచిత్‌ పరం పారం బాహుభిః మనుజేశ్వర! | జగ్ము రన్యే పరంపారం సంగృహీతా శ్చ రశ్మిభిః || 29

నౌస్థై రేవ పరై శ్శీఘ్రం తురగా నృప బాహుభిః | మహిషీణాంచ సంఘాని గవాంచ యదునందన || 30

జగ్ముర్గోపాలకై స్సార్ధం పరం పారం చ బాహుభిః | ఉష్ట్ర గద్దభసంఘాని తీర్యమాణాని బాహుభిః || 31

భూయో భూయో న్యవర్తన్త తత్ర రావో మహానభూత్‌ | తీర్ణస్య తార్యమాణస్య నరస్య యదు నందన ! 32

ఆసీ త్కోలాహలో ఘోరః తీరయో రుభయో రపి ||

కొన్ని నావలు భాండములతో వర్తకుని సరకులతో (సామగ్రితో) కొన్ని నావలు జనులతో కొన్ని గుఱ్ఱములతో గోవులతో గాడిదలతో ఒంటెలతో నేన్గులతో నిండి పరతీరమునకు జనినవి. అట్లే పద్మదళాక్షుల స్త్రీలతో గంగాజలమందు విమానము లట్లు గానబడినవి. విమానములందలి మెరుపు దీపములు స్త్రీల తామరరేకులవంటి కన్నులవలె మెరయుచుండునని యిది జ్ఞాపకముచేయుచున్నది. (దీనింబట్టి విమాన నిర్మాణమతిప్రాచీనమనియుం దెలియనగును.) మంచి చుక్కాని జనము గడలు వేయు జనముతోగూడి కొన్ని నావలు సామాన్యజనులను నది దాటించుటకు సిద్ధపరుపబడెను. కొందరు తోలుపడవలతో (పుట్టె యనిదీనికి పేరు) కొందరా తెప్పలతో కొందరు చక్క యంత్రము లమరుపబడినవానితో భాండములను (సామగ్రిని) ఎక్కించుకొని కేవలము దృతులతో = ఏటిజాలులంబట్టిపోయినవి ప్రవాహానుకూలముగా పోవు పడవలకు గడలు వేయుట తెడ్డువేయుట మొదలయినవవసర ముండవు. ఆవిధముగా గొన్ని పడవలు వెళ్ళెనని యిక్కడ తాత్పర్యము. నీటివాలునంబడిన (దృతిసమారూఢులైన) జనముచే లాగికొనిపోబడి గుఱ్ఱములవ్వలిదరిం జేరినవి. గేదెలు గోవులమందలు బారలుచాచి యీదు జనము పలుపుత్రాళ్ళు పట్టుకొని లాగగా నవ్వలికిం జేరినవి ఒంటెలు గాడిదల మందలు నీదికొని యేగు జనముచే దాటింపబడుచు మరల మరల వెనుకకు మరలివచ్చి నందున నక్కడ పెద్ద ధ్వని యేర్పడెను. దాటిన దాటనున్న నదుల యొక్క కోలాహలము రెండొడ్డులందు నతిఘోరమయ్యెను.

భరతో7పిమహా తేజాః స్నాతో హుతహుతాశనః || 33

మత్స్యరూపధరం విష్ణుంపటే సంపూజ్య యాదవ! | స్వస్తి వాచ్యాంస్తతో విప్రాన్‌ గోభిర్వసై#్త్ర ర్ధనేనచ || 34

సంపూజ్య జాహ్నవీం దేవీం గంధ మాల్యానులేపనైః | సంపూజయా మాస తదా భూయఏవ ద్విజోత్తమాన్‌ || 35

గోభి రశ్వైస్తథా నిషై#్క ర్వసై#్త్ర ర్గంధైస్తథైవచ | ఆరురోహ తదా నావం పాండుకంబల సంవృతామ్‌ || 36

కింకిణీజాలవితతాం పతాకాధ్వజమాలినీమ్‌ | భరతే తు సమారూఢే కర్ణధారస్ఫిగాహతా || 38

జగామ సా పరం పారం నౌర్విమానోపమా నృప! సంప్రాప్య సపరం పారం సంపూర్ణకటక స్తథా || 37

దేవీం మహాదేవ జటాతటస్థాం శశాంక సంసర్గ వివృద్ధ శీతామ్‌ |

ఉత్తీర్య రాజా భరత స్స చైనాం నిన్యే క్షయం శక్రసమప్రభావః || 39

ఇతి శ్రీవిష్ణు ధర్మోత్తరే ప్రథమఖండే మార్కండేయ వజ్రసంవాదే

గంగావతరణ వర్ణనం నామ షడుత్తరద్విశతతమో ధ్యాయః

మహాప్రతాపవంతుడు భరతుడును స్నానము సేసి అగ్నిని వేల్చి మత్స్యావతారుడగు విష్ణువు నొక గద్దెపరచి యందు బూజించి స్వస్తివాచకముతో విప్రులను గోవులతో వస్త్రములతో ధనముతోచక్కగ పూజించి జాహ్నవీదేవిని గంధమాల్యానులేపనములచే పూజించెను. ద్విజులను గోవులు గుఱ్ఱములు నిష్కములు (బంగారు నాణములు) వస్త్రములు గంధముల నొసంగి పూజించెను. అటుపై తెల్లని కంబళము పరచినదియు, చిరుగంటలతోనున్నదియు పతాకాధ్వజమాలాలంకృతమైనదియునగు నావనెక్కెను. భరతుడెక్కగానే చుక్కాని వేయువాని చేతి చుక్కానిచే నడుపబడి విమానమువంటి యా నావ యవ్వలి యొడ్డున కేగెను. ఆవిధముగా సంపూర్ణ కటకముతో (భరతుని నగరము) ఆవ్వలిదరిజేరి భరతుడట స్వర్గమంద్రింద్రుడట్లుండెను.

మహాదేవుని జటాతటమందున్నదియు చంద్రుని సంసర్గమున పెంపొందిన చలువగలదియునగు నీ గంగానదిని దాటి భరతరాజు దేవేంద్రప్రభావుడు ఈనదిని క్షయము నందించెను. సైన్యసహస్రములతో వెలితివడజేసెను.

ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణము ప్రథమఖండమున భరతుని గంగావతరణ వర్ణనమను రెండువందలయారవ యధ్యాయము.

Sri vishnudharmothara Mahapuranam-1    Chapters