Sri vishnudharmothara Mahapuranam-1    Chapters   

రెండువందలఐదవ అధ్యాయము - భరత ప్రస్థానము

మార్కండేయః - ప్రభాతాయాం తు శర్వర్యాం దుందుభిః సమహన్యత | ప్రయాణికో మహారాజ! భరతస్య మహాస్వనః || 1

తస్య శ##బ్దేన మహాతా విబుద్ధః కటకే జనః | అవశ్య కరణీయాని కృత్వా రాజన్‌ త్వరాన్వితాః || 2

త్వరితా గమనార్థాయ సమాహూయేతరేతరమ్‌ || పటవేశ్మాని రమ్యాణి సంహన్తు ముపచక్రముః || 3

మహాన్తి సుమనోజ్ఞాని వర్తితోర్ణావృతాని చ | చక్రుస్తాని చ రాజేంద్ర! సుఖవాహ్యా న్యయత్నతః || 4

తతస్త్వారోపయాం చక్రుః కరభేషు ఖరేషు చ | గోరథేషు తు ముఖ్యేషు తథా దన్తిషు సత్వరాః || 5

భాండ ముచ్చావచం చైవ శయనాని మృదూనిచ | ఆసనాని చ ముఖ్యాని భాండం యచ్చ మహానసే | 6

పేయంచ యవసం చైవ శస్త్రాణి వివిధాని చ | కవచాని తురంగాణాం శిల్ప భాండాని యానిచ | 7

ధనంచ వివిధం రాజన్‌ ! సర్వోప కరణాని చ | ఆరోప్యమాణ భాండేతు కరభాణాం వికృష్యతామ్‌ || 8

శుశ్రువే తుములః శబ్దః ఖరాణాంచ ఖరః స్వనః | గజానాం యుజ్యమానానాం తురంగాణాం రథైస్సహ || 9

వాద్యానాం హన్యమానానాం శుశ్రువే తుములం స్వనమ్‌ | నాదేన గజఘంటానాం బృంహితేన చ పార్థివ ! 10

హ్రేషితేన తురంగాణాం బభూవ తుములః స్వనః | ప్రాయాణిక ముపాదాయ తాడయ న్నేవ దుందుభిమ్‌ || 11

అగ్రే ప్రయాణమాన్‌ యేన య¸° దుందుభిభి స్సహ | పణ్యాని చ సమాదాయ వణిజ స్త్వరితా యయుః || 12

గ్రహీ తు కామా శ్చాన్నాని సోదకాని సమానిచ | స్థానాని వరముభ్యానాం యయు శ్చాగ్రే సరానరాః || 13

మహానసిక ముఖ్యాస్తు త్వరితా శ్చ తథా యయుః | సుఖయానాసు రమ్యాసు తథై వాశ్వతరీషు చ || 14

ఆరోప్య యోషితో జగ్ముః ప్రత్యూషే ముదితా జనాః | ఆరూఢా శ్చాపరా నార్యః సవితానాః కరేణవః || 15

కంచుకోష్ణీషిభి ర్గుప్తా గుప్తా వర్షవరైస్తథా | యయుః ససైన్యా రాజేంద్ర! గీతవాద్యపురస్సరాః || 16

దీనాంధ కృపణా7నాధాం స్తర్ప యన్త్యో ధనేన తాః | నరేంద్ర యోషితో రాజ్ఞాం దివ్యాలం కారభూషితాః || 17

తథా7న్యే బద్ధ నిస్త్రింశాః పురుషాశ్చ కలాపినః | ఆదీప్య తృణవేశ్మాని జగ్ముస్త్వరితమానసాః || 18

మార్కండేయుడనియె. తెలవారినంత మహాధ్వనిగల భరతుని ప్రయాణదుందుభి మ్రోయింపబడెను. ఆ సవ్వడికి నగరజనము మేల్కాంచెను. ప్రాతఃకరణీయములు దీర్చికొని ప్రయాణత్వరతో నొండొరులం బిలిచికొని పటకుటీరమునందలి రమ్యములయిన సామగ్రులను సర్దుకొననారంభించిరి. పరచిన చక్కనితివాచీలను సుఖముగా గొంపోవుటకనుకూలముగ జుట్టి కరభములందు (ఒంటెలందు ఖరములందు ఎడ్లబండ్లను ఏన్గులమీదను నెక్కించిరి. అమూల్యమైన భాండములను (వంటసామగ్రి) మృదువైనశయ్యలను ముఖ్యములైన ఆసనములను పేయమైనది తినదగినది గడ్డి వివిధశస్త్రములు గుఱ్ఱములజీనులు శిల్పభాండములను వివిధ ధనమును మార్గసాధనములను ఖరములకు ఖరములకు కరభములకెక్కింప నవిలాగికొనిపోవునప్పటి తుములధ్వని విననయ్యెను. కూర్చబడు నేన్గులు గుఱ్ఱములు రథములయొక్కసడి వాయింపబడు వాద్యముల సంకులధ్వని వినబడెను. ఏనుగుల గంటధ్వని ఘీంకారధ్వని గుఱ్ఱముల సకిలింపులసడి తుములమయ్యెను. ఒకడు ప్రయాణదుందుభి వాయించుచునే యుండెను. ఇంకొకడు దుందుభులతో ముందుప్రయాణము సాగించుచుండెను. వర్తకులు పణ్యములను (వర్తకసామగ్రిని) కొని త్వరితముగ నేగిరి. ఉదకసమృద్ధములు సమములునైన స్థానములను (కొందరు) అగ్రేసరులై వంటవారు మొదలైనవారు సుఖయానములైన రమ్యములయిన యశ్వతరులందు (కంచరగాడిదలందు) ఉషఃకాలమున నానందభరితమైన యంగనల నెక్కించికొని చనిరి. కొందరుస్త్రీలు చాందనితో (అంబారీతో) నున్న యేనుగులనెక్కి కవచములు తలపాగలుదాల్చిన వర్షవరులచే (ఆంతఃపురము కావలివారిచే) రక్షణ యీయబడుచు నేగిరి. నరేంద్రభార్యలు రాజార్హములైన దివ్యాలంకారము లలంకరించికొని సైన్యములతో గీతవాద్యములు ముందు మ్రోయుచుండ దీనులను అంధులను గృపణులను అనాధులను ధనమిచ్చి తృప్తిపరచుచు నేగిరి. మరికొందరు పురుషులొరలో ఖడ్గములం గట్టుకొని కలాపములూని (పాగాలు శిరస్త్రాణము ధరించి) గడ్డియిళ్ళంటించి సవేగమనస్కులైచనిరి. (తాత్కాలికముగా విడిదిసేయుటకేర్పరచిన పూరిళ్ళన్నమాట)

భరతో7పి సమారుహ్య శిబికాం రత్నభూషితామ్‌ | వినిర్య¸° మహాతేజాః తూర్యఘోష పురస్సరః || 19

శూన్యంచ శిబిరస్థానం గృధ్రమండల సంకులమ్‌ | బహు క్రవ్యాద సంకీర్ణం క్షణన సమవద్యత || 20

గజోష్ట్ర గర్దభాశ్వానాం శరీరావయవైర్యుతమ్‌ | భగ్నభాండసమాకీర్ణం శరీరావయవైర్యుతమ్‌ | 21

బహు క్రవ్యాద సంకీర్ణం కరీషోత్కరసంయుతమ్‌ | ఖాతైర్మహానస స్థానైర్దగ్ధ మృత్తికయా యుతైః || 22

సమండ కర్దమోపేతైః మక్షకాసహితైర్యుతమ్‌ | సంత్యజ్య నిర్యయుః సర్వే భరతస్యతు సైనికాః || 23

ప్రయాణ తస్య సైన్యస్య బలీవర్దాన్‌ శ్రమాన్వితాన్‌ | నాగానుత్థాపయామాసు రుపవిష్టాన్‌ ప్రయత్నతః || 24

కేచి దుష్ట్రపరిత్రస్తాన్‌ గర్దభేన నిపాతి తాన్‌ | భాండమారోపయాంచక్రుః భూయఏవ నరోత్తమాః || 25

నద్యుత్తారేషు మహిషాన్‌ కేచిత్‌ సూర్యాంశు తాపితాన్‌ | నిషణ్ణాన్‌ సహ భారేణ తాడయాంచక్రిరే జనాః || 26

కేచి దశ్వతరాం స్త్రస్తాన్నాగబృంహిత నిస్వనైః | ఆరూఢయోషితో యత్నా జ్జగృహుః నృపః రశ్మిషు || 27

కేచి దశ్వైర్గజత్రసై#్తరాక్షిప్తా భువి మానవాః | జాను విశ్రమణార్థాయ వాజిగ్రీవ కృతాంఘ్రయః || 28

తురంగాంశ్చ తదోద్భ్రాంతాన్‌ స్రస్తచర్మాంశ్చ సాదినః | కేచి దాక్రమ్య వేగేన జగృహు స్తత్ర యాదవ! || 29

విశశ్రము స్తథా కేచిత్‌! వృక్షచ్ఛాయాసు మానవాః | కేచి చ్చోదక తీరేషు చక్రిరే భోజన క్రియామ్‌ || 30

కేతి త్సంత్రస్త తురగ సన్నికృష్ణ సముత్థితైః | ద్రుతాన్‌ కాపింజలైర్యత్నా జ్జగృహుస్తాంస్తురంగమాన్‌ || 31

కేచి త్కటకసంత్రస్తాన్‌ మీగయూథాన్‌ ప్రధావతః | వేగేనాక్రమ్య విశిఖైః జఘ్ను ర్యదుకులో ద్వహ || 32

కేచిచ్చ యవసం చక్రుః కేచిచ్చక్రు రథేంధనమ్‌ | తథా7న్యైః ద్విగుణీ భూతం తథా దుందుభి నిస్వనమ్‌ || 33

ప్రాయాణికం జహుశ్శీఘ్రం శ్రమం యదుకులోద్వహ! | కేచి దాపణ వీథ్యగ్ర మహావంశ సముచ్ఛ్రితమ్‌ || 34

సవతాకం సరా దృష్ట్వా ప్రాప్తాఃస్మ ఇతి మేనిరే | చక్రుః కేచిచ్చ ఛందాంసి సహాయానాం పునః పునః || 35

పురోగతానాం రాజేంద్ర! స్థానలభ్ది చికీర్షయా | కీచిత్పటకుటీం దృష్ట్వా స్వకీయాం త్వరితా యయుః || 36

వర్తితోర్ణాకృతం దృష్ట్వా గృహాం శ్చాన్యే యయు ర్ద్రుతమ్‌ | కేషాంచిత్తత్ర వేశ్మాని తీర్ణాని నృపసత్తమ! 37

కృతాని క్రియమాణాని దదృశు సత్త్ర మానవాః | ద్రుమై ర్విశ్రామ్య మాణౖ శ్చ క్రియ మాణౖ స్తథాకటైః || 38

గృహై రారోప్య మాణౖశ్చ పటోర్ణా తృణ సంస్కృతైః శుశుభే తన్మహారాజ! కటకం శుభ కర్మణః || 39

భరతుడును రత్నభూషితమైన శిబికను (పాలకీని) ఎక్కి తూర్యఘోష పురస్సరముగా నేగెను. ఆతడు విడిచివెళ్ళిన గుడారము (శిబిరము) క్షణములో గ్రద్దలగుంపులతో ననేక మాంసాహారి పక్షులతో పేడకుప్పలతో సంకీర్ణమయ్యెను. గాడిప్రొయ్యులు త్రవ్వినందున కాలిన మృత్తికతోగూడిన గోతులతో కల్లుతోదడిసిన నీగలుముసురుచున్న రొంపులతోనున్న భరతుని శిభిరమువిడిచి యెల్లసైనికులు ముందుకునడచిరి. సేన ప్రయాణమందు శ్రమకులోనై కూర్చున్న యెడ్లను ఏనుగులను సైనికులు లేవదీసిరి. బెదరిపారిన గర్దభముచే బడగొట్ఱబడిన యొంటెలమీద మనుష్యులు (భాండమును) సేనాసామగ్రి నెక్కించిరి. నదులు దాటునపుడు ఎండయుడుకునకు గురియైనపుడు పైబరువుతో చచ్చుపడి పడియున్న మహిషములను కొందరు లేచుటకుబాదిరి. ఏనుగుల ఘీంకారములకు బెదరిన స్త్రీలెక్కిన కంచరగాడిదలను పగ్గములుపట్టిలాగి నిలుపజొచ్చిరి. కొందరు జనులు గజములకు బెదరిన గుఱ్ఱములచే క్రిందబడవేయబడిరి. మోకాళ్ళనొప్పులు తీరుటకు వారు గుఱ్ఱముల మెడలపై కాళ్ళనాడించిరి. కొందరు నీటిపట్టుల తీరములందు భోజనములు గావించిరి. కొందరు బెదరిపారు గుఱ్ఱముల సమీపమందు రేగిన కపింజలములచేత బారిపోవు గుఱ్ఱములను బట్టినిలిపిరి. కొందరు నగరమునకు (నగర జనమునకన్నమాట) జడిసిపారు జంతువులమందల వేగముగ నాక్రమించి బాణములచే బడనేసిరి. కొందరు గడ్డిమోపులు సేకరించిరి. కొందరు వంటకట్టెలనుదెచ్చిరి. కొందరు ప్రస్థానదుందుభి ధ్వనిని రెట్టింపుచేసిరి. నిమిషములో ప్రయాణశ్రమనుబాసిరి. కొందరు బజారులచివర గడకర్రలెత్తుగా గట్టిన పతాకముంజూచి గమ్యస్థానమునకు వచ్చి నామనుకొనిరి. కొందరు తమకుసహాయులై ముందేగి విడుదులేర్పాటుసేసిన యనుచరులకు ఛందములు (బహుమానములు) సేసిరి. (అనగా వారికిష్టమైన (నజరానా) బహుమానముల నిచ్చిరన్నమాట) కొందరు తమకైవేసిన డేరానుజూచి యటకేగిరి. అట కొందరి యిండ్లు తీర్ణములు. (బండ్లమీదనుంచి ఏనుగుల గాడిదలనుండిదింపిన గూడారములు కొందరికి దయారైయున్నవి. కొందరకపుడు నిర్మితములగుచున్నవి. విశ్రమించుటకనువుగా చెట్లచేత నేర్పరుపబడినవి కొన్ని. పటములచే (వస్త్రములచే) ఉన్నిచే గడ్డిచే పైనిగప్పబడినవియుంగా పలురకముల సైనికులతో నటనొక కటకము (నగరము) నిర్మాణమై మిక్కిలి శోభించెను.

శ##స్త్రేణ సంశోధయతాం భువం భూమిపతే! | న్భణామ్‌ | రాజసాక్రాన్తవపుషా మప్రకాశం వపు ర్బభౌ || 40

పార్శ్వ స్థతోయసంపూర్ణ దృతయ శ్చ తథా జనాః | ధావ మానాః ప్రదృశ్యన్తే వర్ధితా గృహశోధనే || 41

అభ్యుక్షయన్తి చాప్యన్యే తృణ వేశ్మానిపార్థివ! | తప్తానాం శీతకామానాం దృతి వక్త్రోద్గతై ర్జలైః || 42

అభిశ్రయేణ ధూపేన సమంతా దాకులీకృతమ్‌ | బభూవ తస్య కటకం నీహారేణవ సంయుతమ్‌ || 43

అపరోపితభాండానాం దాంతానాం యదునందన! | పృష్ఠా న్యభ్యుక్షయామాసు ర్గోమయేన జలేనచ || 44

ఖరోష్ట్ర సబలీవర్ద చరణార్థే వినిర్గతమ్‌ | 45

రాజా ! అట శస్త్రములచే భూశోధనచేయు శరీరములు ధూళిధూసరములైనకతన చూపరులకు వెల్లడికాకుండెను. ఆకట్టిన యిండ్లను జక్కగ నలికి కడిగి యలంకరించుపనిలో నిమగ్నులైన జనులు నీటనిండిన చిరుకాలువల ప్రవాహములు గలవారై వానివెంటబరువెత్తువారునై కానిపించిరి. కొందరు నీరుమళ్ళించిన దృతులముందునుండి (బోదెలముందునుండి) తెచ్చిననీటిచే గొందరు యెండకుడికి చలువగోరువారుండు పూరిండ్లందడుపుచుండిరి. ఆభరతుని కటకము (స్కంధావారము) అభిశ్రయధూపము నలువంకలనలముకొని మంచుగప్పినదాయన్నట్లుండెను. బరువులు దింపిన తరువాత ప్రయాణశ్రమ నలసిన యాయా ఒంటెలు గాడిదలు ఎడ్లు కంచరగాడిదలు మొదలయిన జంతువులయొక్క పృష్ఠములను చలువకొరకు గోమయముచే బూసి నీళ్ళు చల్లిరి. మేతకొరకు బయలు వెడలిన వేలకొలది జంతువుల మంద భరతుని కటకమందు గాననయ్యెను.

దదృశే బహుసాహస్రం కటకే భరతస్య తు | రథేభ్య స్తురగా నన్యే విముచ్య హయకోవిదాః || 46

అవరోపిత భాండాని సాంత్వయాంచక్రిరే శ##నైః | సముత్థాయ రజో భౌమం తురంగపరివర్తనైః || 47

ఖ మారురోహ రాజేంద్ర : కపోతారుణ పాండురమ్‌ | స్థాపయాంచక్రిరే చాన్యే జలస్థానే చ వాజినః 48

శ్రేణీం చక్రు స్తథై వాన్యే కటచ్ఛాయాసు పార్థివ: | వితానాధ స్తథా కేచిత్‌ స్థాపయాంచక్రిరే హయాన్‌ || 49

హయేభ్యో యవసం దత్వా కేచి ద్బుభుజిరే జనాః | కటచ్ఛాయా శ్చ నాగానాం

చక్రు శ్చాన్యే సహస్రశః 50

వితానాని చ ముఖ్యాని సూర్యతాపప్రశాన్తయే | స్నాతాన్‌ జలాశ##యే నాగాన్‌ లబ్ధతోయాన్‌ జనాధిప || 51

సంఛన్నాన్‌ స్వపరీధాన కుంభా న్నిన్యుః స్వ మాలయమ్‌ | కటకా ద్దూరత శ్చక్రు రాలానం నృప! దంతినామ్‌ || 52

ఆలానాని మహారాజ! మహావృక్షేషు మానవాః | ఆదాయ గోపిన స్తత్ర కటకాచ్చ విదూరతః || 53

గోసంఘాన్‌ మహిషీసంఘాన్‌ చక్రు ర్న్యస్తాన్‌ యథాసుఖమ్‌ | కటకేచ తథా నిన్యుఃగోరసాని నరాధిప ! 54

కటకాపణ్యవీథీంచ సర్వపణ్యవిభూషితామ్‌ | దదృశుః పురుషాస్తత్ర అయోధ్యా మివ చాపరామ్‌ || 55

స్థానాని సర్వవైద్యానాం సధ్వజాని నరాధిప | సాగరానిచ దృశ్యన్తే కటకే భరతస్యతు || 56

సేనాధ్యక్షేణ వీరేణ విజయేన మహాత్మనా | కృతం శాస్త్రాను సారేణ స్కంధావార నివేశనమ్‌ || 57

వివేశ భరతః శ్రీమాన్‌ చతురంగ బలాన్వితః | అన్వీయమానో వీరాభ్యాం పుత్రాభ్యాం యదునందన ||

పుష్కరేణచ వీరేణ తక్షేణ సుమహాత్మనా | బలముఖ్యై స్తథైవాన్యైః సూత మాగధ వందిభిః || 59

శంఖవాదిత్రశ##బ్దేన పటహానాం స్వనేనచ | భరతస్య గృహద్వార తోరణా న్తిక మాగతాః || 60

బభూవుర్బల ముఖ్యాస్తే దిక్షు యే యదునందన | సంత్యజ్య మధ్యమాం వీథీం ప్రవేశాయ మహామనాః || 61

వందిభిఃఖ్యాప్యమానాంస్తా న్నామ కర్మావదానతః | శిరః కంపేన భరతః పై#్రరయత్‌ స్వాన్ని వేశనాన్‌ || 62

బలముఖ్యాన్‌ వివేశాథ స్వగృహం సర్వబుద్ధిమత్‌ | ద్వియోజనాధ్వనా శ్రాన్తా భరతస్యతు సైనికాః || 63

వివిశుర్భవనాన్‌ స్వాన్‌ స్వాన్‌ భేజిరే శయనానిచ | ప్రవిశ్య వేశ్మ ప్రవరం భరతో7 పి యథాసుఖమ్‌ || 64

విజహార మహారాజ! దేవరాజ సముద్యతిః| క్రమేణానేన ధర్మాత్మా భూమిపాల దినేదినే || 65

సురాంగనా పీనపయోధరస్థ సచ్చందన క్షాళన లబ్ధలక్ష్మీమ్‌ | గ్రీష్మార్కతాపా ద్విగల త్తుషార వివృద్ధ శీతోద పటోత్తరీయామ్‌ || 66

ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ప్రథమఖండే మార్కండేయ వజ్రసంవాదే

ప్రయాణ వర్ణనం నామ పంచాధిక ద్విశత తమో 7ధ్యాయః.

కొందరు మేటి రౌతులు రథములనుండి బరువులను దింపి గుఱ్ఱములను విప్పి వానిని సేదదీర్చిరి. గుఱ్ఱముల గుడులచే పెనుమంటి ధూళి రేగి నెఱుపుతెలుపు కలిసిన పావురమురంగుగొని నింగికెక్కెను. కొందరు గుఱ్ఱములను నీటిపట్టున విడియించిరి. చాపలు గట్టిన నీడలందు శ్రేణినొనరించిరి. అనగా వరుసగా వానిని గట్టివైచిరి. కొందరు వితానముల నీడను (చాందినీల క్రింద) వానిని నిలిపిరి. కొందరు గుఱ్ఱములకు యవసము (గడ్డి) మేత వేసి తాము భుజించిరి. ఏనుగులకు చాపలతో వేలకొలది నీడలేర్పరచిరి. సూర్యునివలని తాపము శాంతింప కొందరు వితానములను (చాందినీలను) ఏర్పరిచిరి. మడువులందు స్నానము సేసి తొండముల నీరెక్కించుకొని యేనుగులను, మూతలిడిన తమ బట్టలపెట్టెలను దమ బసలకు గొనివచ్చిరి. కటకమునకు దూరముగ నేన్గులకు ఆలానముగ (కట్టురాటగ) పెద్ద వృక్షముల మొదళ్ళు నేర్పరిచిరి. పశులకాపరుల ఆలమందలను గేదెల మందలను తోలుకొనిపోయి కటకమునకు దూరముగ వాని నేమంద కామంద విడదీసి విడియించిరి. గోరసములను (ఆవుపాలు పెరుగు గిన్నె నేయియు నన్న మాట) కటకమునకు గొనివచ్చిరి. అన్ని పణ్యములతో (సరుకులతో) నింపుగొలుపు కటకము యొక్క బజారు వీథిని నింకొక యయోధ్యయా యన్నట్లు చూచిరి. ఆభరతుడు విడిదిసేసిన యా కటకమందు వైద్యులెల్లరకు (నరవైద్యులు పశువైద్యులు మొదలైన వారికన్నమాట) నేర్పరిచిన స్థానములు ధ్వజములతో (జెండాలతో) ఔషధములతో గానబడుచుండెను. సేనాధ్యక్షుడగు మహానుభావుడు విజయునిచే శాస్త్రానుసారముగా నా స్కంధావార నివేశన మేర్పరుపబడెను. శ్రీమంతుడు భరతుడు చతురంగ బలముతో గూడి వీరులయిన తన పుత్రు లిద్దరిచే ననుగమింపబడి వీరుడయిన పుష్కరునిచే మిక్కిలి మహాత్ముడైన తక్షునితో

నా స్కంధవారా నివేశమును బ్రవేశించేను. శంఖవాద్యఘెషముతో పటహధ్వనితో నలుదెసల నలుగురైన సేనాధ్యక్షులు భరత గృహద్వారా తోరణముదరి కేతెంచిరి. భరతుడు గృహప్రవేశమునకు మధ్యవీథిని విడిచి చని వందిమాగధులు వారివారి పేర్లను వారి చరిత్రను పాటలరూపములో ప్రఖ్యాపనము సేయుచుండ శిరఃకంపముచే నాసేధ్యక్షులను వారి విడుదలకేగుట కనుమతియిచ్చెను. అటుపై సర్వసంపత్సమృద్ధమైన తన గృహముంబ్రవేశించెను. రెండు యోజనములు దారి నడచి యలసిన భరతుని సైనికులు తమతమ భవనములం బ్రవేశించిరి. శయనములందు విశ్రమించిరి. భరతుడు తన గృహశ్రేష్ఠమును యథాసుఖముగ బ్రవేశించి దేవేంద్రసమప్రభుడై యట విహరించెను. ఇదేక్రమమున ధర్మాత్ముడు భరతుడు వెళ్ళుచునే దేవతాస్త్రీల నిండుపాలిండ్ల యందలి కల్పతరు పుష్పమాలలయొక్క గంధముయొక్క క్షాళనముచే నద్భుతశోభ నందినదియు గ్రీష్మార్క తాపమువలన కరిగి జారుమంచుచే పెంపొందిన చలువనించు నుదకము లనెడి చీరయు పైచీరయుం గల త్రిపథగయైన గంగానది దరిసెను.

ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణము ప్రథమఖండమున భరతప్రస్థానవర్ణనమను రెండువందలయైదవ యధ్యాయము.

Sri vishnudharmothara Mahapuranam-1    Chapters