Sri vishnudharmothara Mahapuranam-1    Chapters   

రెండువందలఒకటవ అధ్యాయము - శైలూషవంశ వర్ణనము

మార్కండేయః : యక్షేన రాక్షసేజాతే తతఃకాలేన కేనచిత్‌ | ఏషా సుషావ గంధర్వం శైలూష మితి విశ్రుతమ్‌ || 1

కోట్యస్తిస్రస్తు పుత్రాణాం తస్యా7సన్‌ సుదురాత్మనః | ఏతస్మిన్నేవ కాలేతు విసృష్టాసు ప్రజాసుచ || 2

బ్రహ్మాదిదేశ రాజ్యాని జాత్యాం జాత్యాం యథాక్రమమ్‌ | గంధర్వాణామధిపతిం చక్రేచిత్రరథం తథా || 3

శైలూష పుత్రా గంధర్వా సంఘశః కృత నిశ్చయాః | శాసనేనైవ తిష్ఠన్తి తస్యచిత్రరథస్యతు || 4

సింధోరుభయ కూలేషు దేశ ముత్సాద్య తే తదా | హత్వాచ మనుజాంస్తత్ర నివసన్తి గతవ్యథాః || 5

ఉత్సాదయన్తో రాష్ట్రాణి రాజ్ఞాం విప్రియ కారకాః | తాన్‌శశాప స గంధర్వ రాజశ్చిత్రరథః ప్రభుః || 6

అధర్మనితాః సర్వే మానుషా ద్వధ మాప్స్యథ! 7

శాపేన తస్యా ప్రతిమేన రాజన్‌! గంధర్వరాజాతి బలస్య సంఖ్యే |

బభూవ మృత్యుర్భరతస్తుతేషాం దేహాన్తరస్థో హరి రప్రమేయః || 8

ఇతి శ్రీవిష్ణుదర్మోత్తరే ప్రథమఖండే శైలూషవంశ వర్ణనం నామ ఏకాధికద్విశతతమో7ధ్యాయః.

మార్కండేయుడనియె. అవ్వల యక్షునివలన రాక్షసుడు కలిగినతరువాత కొంతకాలమున కీకుంభీనసి శైలూషుడను గంధర్వుంగనెను. ఆదుష్టునకు మూడుకోట్లమంది పుత్రులుగల్గిరి. ఇదేసమయమున బ్రహ్మ ప్రజాసృష్టిచేసి యొక్కొక్కజాతి కొక్కొక్క రాజ్యము నిర్దేశించెను. గంధర్వులకు చిత్రరథుని రాజుంజేసెను. శైలూషుని కొడుకులు సంఘములుగావచ్చి యా చిత్రరథుని శాసనమునందుండ నిశ్చయించుకొనిరి. వారు సింధునది కిరుతీరములందలి మనుజులంజంపి యా దేశమునందు నివసింపజొచ్చిరి. అక్కడి రాజుల కప్రియముసేసి రాష్ట్రముల పాడుచేసిరి. చిత్రరథుడు వారిని అధర్మనిరతులు కావున మీరు మనుష్యుని వలన వధింపబడుదురుగాక యని శపించెను. విష్ణువు నంశ##మై దేహముధరించిన భరతుడు వారిపాలిటికి మృత్యువయ్యెను.

ఇది శ్రీవిష్ణుధర్మోత్తరమహాపురాణము ప్రథమఖండమున శైలూషవంశ వర్ణనమను రెండువందలయొకటవ అధ్యాయము.

Sri vishnudharmothara Mahapuranam-1    Chapters