Sri vishnudharmothara Mahapuranam-1    Chapters   

రెండవ అధ్యాయము

హిరణ్య గర్భోత్పత్తి

మార్కండేయ ఉహచ :

నారాయణం నమస్కృత్య సర్వభూత పరాయణమ్‌ | లక్ష్మీసహాయం వరదం శేషపర్యంక శాయినమ్‌ || 1

జగతోస్య సముత్పత్తి స్థితి నాశైక కారణమ్‌ | జ్ఞాన జ్ఞేయం జ్ఞాన గమ్యం హృది సర్వస్య

సంస్థితమ్‌ || 2

వక్ష్యామి జగతాం రాజన్‌ ! సముత్పత్తిం నిబోధ తామ్‌ | సర్వపాప ప్రశమనీ మాయుష్యాం స్వర్గదాంశివామ్‌ || 3

నారాయణో స్యజగతః సృష్టిసంహార పాలనమ్‌ | కరోతి జగతీపాల ! యస్య సర్వమిదం మహాన్‌ || 4

వేదేషు గీయతే యోసౌ పురుషః పంచవింశకః | అనాదినిధనో ధాతా త్వనంతః పురుషోత్తమః || 5

యస్యోన్మేష స్తుదివసో బ్రహ్మణః పరమేష్ఠినః | నిమేషస్తు తథా రాత్రిః తచ్చ కల్పంప్రకీర్తతమ్‌ || 6

పురుషత్వే త్వనంతస్య నరూపం నృప ! విద్యతే | నచశబ్దో నచ ఘ్రాణః స్పర్శోవా పృథివీపతే ! 7

నతస్యపరిమాణంవా నచాదిర్నిధనం కుతః | సర్వతః పాణిపాదాంతః సర్వతోక్షి శిరోముఖః || 8

సర్వతశ్శ్రుతిమాన్‌లోకే సర్వమావృత్యతిష్ఠతి | సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితమ్‌ || 9

అసక్తం సర్వభృచ్చైవ నిర్గుణం గుణభోక్తృచ | తం చప్రాప్య భవ న్తీహ యే ముక్తాః పురుషోత్తమాః || 10

సుగతిర్యోగ సిద్ధానాం తస్మాత్సర్వస్య సంభవః | తస్మాద్భవతి చావ్య క్త స్తస్మాదాత్మాపి జాయతే || 11

తసాద్బుద్ధిర్మన స్తస్మాత్‌ తతఃఖంపవన స్తతః | తస్మాత్తేజ స్తత స్త్వాప స్తేభ్యో ణ్డమభవత్కిల ! 12

అండోహిరణ్మయో రాజన్‌ ! తస్యాంత స్స్వయమేవహి | శరీర గ్రహణం పూర్వం సృష్ట్యర్థంకురుతే ప్రభుః || 13

బ్రహ్మా చతుర్ముఖోదేవో రజో మాత్రాధికస్సదా | శరీర గ్రహణం కృత్వా సృజతీదం చరాచరమ్‌ || 14

అండస్యాంతర్జగత్సర్వం సదేవాసుర మానుషమ్‌ | సప్తలోకాన్‌ సపాతాళాన్‌ సప్తద్వీపార్ణవాం మహీమ్‌ || 15

సృష్టిం కృత్వా సభగవాన్‌ సాత్వికీ మాస్థితస్తనూమ్‌ | క్షీరోదేకేశవో భూత్వా శేషభోగమయఃప్రభుః || 16

లక్ష్మీసహాయో లోకాంస్తు సర్వాన్‌ పాలయతేసదా | యోగనిద్రాం సమాస్థాయ సర్వసత్త్వ శరీరగః || 17

శుభాశుభాని కర్మాణి సర్వేషాం సహి పశ్యతి | అంతకాలే హరో భూత్వాజగత్‌ సంహరతేపునః || 18

తామసీం తనుమాస్థాయ లీలయైన మహాయశాః | బ్రహ్మాతో సృష్టికాలేతు జలమధ్య గతాం మహీమ్‌ |

దృష్ట్వోద్ధరతి యజ్ఞాత్మావారాహీ మాస్థితస్తనూమ్‌ || 19

బ్రహ్మాస్యసర్గే పరిపాలనేచ విష్ముర్మహాత్మా భవతీహనిత్యమ్‌ |

సంహారకాలేచ హరత్వమేతి త్రైధం విధత్తేస త్రికాలయోగాత్‌ || 20

ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ప్రథమ ఖండే మార్కండేయ వజ్రసంవాదే హిరణ్యగర్భోత్పత్తి కథనం నామ ద్వితీయో7ధ్యాయః

మార్కండేయుడనియె : సర్వభూతాశ్రయుడు లక్ష్మీసమేతుండు వరదుడు శేషతల్పశాయి ఈ జగత్తుయొక్క సృష్టికి స్థితికి లయమునకు నేకైక కారణము జ్ఞానముచే నెఱుగదగువాడు పొందదగువాడును సర్వ హృదయములందుడువాడునగు నారాయణునికి నమస్కరించి జగమ్ముల పుట్టుక నెఱింగించెద. సర్వ పాపప్రశమనము ఆయుర్భాగ్యప్రదము స్వర్గప్రదము మంగళము నైన యీ జగదుత్పత్తింగూర్చి వినుము. ఈ జగత్తుయొక్క సృష్టిని పాలనమును సంహారమును నారాయణుడు సేయును. ఈయన పంచవింశకుడైన పురుషుడని వేదములు కీర్తించును. ఈతడు ఆదియు అంతములేని పురుషోత్తముడు. ఈయన కనువిప్పు బ్రహ్మకు పగలు. కనుమూత రాత్రి. దానినే కల్పమందురు. అయ్యనంతుడు పురుషుడైన తఱి రూపములేదు. శబ్దస్పర్శాదులు లేవు. కాలు సేతులు కన్నులు తల ముఖము చెవియులేవు. సర్వము నావరించియున్నది. సర్వేంద్రియ గుణములను భాసింపచేయును. అయినను సర్వేంద్రియ రహితుడు అసక్తుడై సర్వయు భరించును. అగుణుడై గుణానుభవము పొందును. అట్టి పురుషునిం బొందినవారు ముక్తులగుదురు. సర్వసిద్ధ పురుషులకును అతడు పరమగతి. అతనివలన సర్వము సంభవించును. ఆ పురుషునినుండి అవ్యక్తము దానినుండి ఆత్మ దానినుండి (హిరణ్యగర్భరూపము) బుద్ధి దానినుండి మనస్సు దానినుండి ఆకాశము (ఖము) దానినుండి వాయువు దానినుండి తేజస్సు దానినుండి జలములు అందుండి అండముం బుట్టినవి. ఆయండము హిరణ్మయము (సువర్ణమయము). ఆప్రభువు దానియందు దనకుదాను సృష్టికొరకు శరీర గ్రహణముసేయును. అట్లుచేసి బ్రహ్మ చతుర్ముఖుడు ననుపేర రజోగుణమాత్రాధికుడై యీ చరాచరమును సృజించును. ఈ అండములోపల దేవాసుర మానుష సహితమైన సర్వప్రపంచమున్నది. సప్త పాతాళములతో సప్తలోకముల సప్తద్వీపసముద్రములతోడి భూమిని సృజించి యా భగవంతుడు (సాత్త్వికి) సత్వగుణ ప్రధానమైన శరీరముం దాల్చి పాలసముద్రమందలి కేశవుడై ( ) శేషుని పడగలందు లక్ష్మీసహాయుడై యుండి యెల్లలోకముల బాలించును. యోగనిద్రంగొని సర్వజంతు శరీరములందుండి యందఱు చేయు శుభాశుభ కర్మములను జూచుచుండును. అంతసమయమున హరుడై తమోగుణ మయమైన యుపాధింబూని లీలామాత్రముగ జగత్సంహారము చేయును. సృష్టికాలమందు ఈ పరబ్రహ్మ మూర్తి జలమధ్యమందున్న భూమిని యజ్ఞవరాహ మూర్తియై యుద్ధరించును. సృష్టియందు బ్రహ్మ-పరిపాలనమందు విష్ణువు-లయమందు హరుడునై త్రికాలములందు త్రేథా స్వరూపమును ధరించును.

ఇది శ్రీవిష్ణుధర్మోత్తరమహాపురాణము-ప్రథమఖండమున హిరణ్యగర్భోత్పత్తియను రెండవ యధ్యాయము.

Sri vishnudharmothara Mahapuranam-1    Chapters