Sri vishnudharmothara Mahapuranam-1    Chapters   

నూటతొంబదిఏడవ అధ్యాయము - యక్షోత్పత్తి

వజ్రఃఉవాచ : జగత్సృష్టి ప్రసంగేన చోర్వశీ సంభవ స్త్వయా | కథితస్తు మహాభాగ! తత్ర్పసంగేన చాపరాః || 1

కథితా శ్చ కథా బ్రహ్మన్‌! ధర్మయుక్తా మనోహరాః | విష్ణోర్మాహాత్మ్య సంయుక్తా స్సర్వపాప భయాపహాః || 2

కశ్యపస్య తు యా పత్నీ ఖశానామ్నీ త్వయేరితా | యస్యాః పుత్రౌ మహాత్మానౌ కథితౌ యక్షరాక్షసౌ || 3

తయో రుత్పత్తి మిచ్ఛామి శ్రోతుం వంశం తథైవచ | ప్రస్తుతాం జగదుత్పత్తిం నిఖిలేన ప్రకీర్తయ! 4

మార్కండేయః : రాక్షసం పూర్వసంధ్యాయాం జనయా మాస సా ఖశా | దంష్ట్రాకరాళవదనం పింగళోద్బద్ధ లోచనమ్‌ || 5

ఆకర్ణదారితాస్యంచ స్థూలనాసాగ్ర ముల్బణమ్‌ | వికచం వికటాటోపం శంకు కర్ణం విభీషణమ్‌ || 6

తథైవా పర సంధ్యాయాం సైవయక్షం వ్యజాయత | తాదృశేనైవ రూపేణ యాదృశేనైవ రాక్షసమ్‌ || 7

క్షిణోమి మాతరం యక్షం క్షుభితస్తా మభాషత | రక్షేతి మాతరం తాంతు యక్షంవై రాక్షసో7బ్రవీత్‌ || 8

రక్షణా ద్రాక్షసః ప్రోక్తః క్షణాద్యక్షః స ఉచ్యతే | భార్యా బభూవ యక్షస్య దేవరామా కృతస్థతా || 9

యక్షో రాజతనాభాఖ్యః తస్యాస్తస్య సుతః స్మ్సతః అనుర్హ్రాద సుతా భార్యా తస్యాసీన్‌ నృప! గుహ్యకా || 10

వీరో మణి చరశ్చైవ వీరభద్ర స్తథైవచ | తస్యాః పుత్రా వుభౌ ఖ్యాతౌ దేవతుల్యౌ మనీషిణౌ || 11

కకుత్థ్స తనయే భార్యే తయోరాస్తాం నరాధిప | రాజన్‌! పుణ్యజనీ నామ ప్రథమస్య బభూవ సా || 12

తథా దేవజనీ నామ ద్వితీయస్యాపి యాదవ! తస్యాః పుణ్యజనా యక్షా దేవదేవజనా స్తథా |

కథితా బహు సాహస్రా మహాబల పరాక్రమాః || 13

శుభైర్వవాహై ర్నృవ యక్షవంశైః యక్షాస్తు జాతా బహు శీలయుక్తాః |

ధర్మస్థితాః సత్యపరా వినీతా మహానుభావా వరదా వరేణ్యాః || 14

ఇతి శ్రీ విష్ణుధర్మత్తరే ప్రథమఖండే మార్కండేయ వజ్రసంవాదే

యక్షోత్పత్తి ర్నామ సప్తనవత్యధిక శతతమో7ధ్యాయః.

జగత్సృష్టి సందర్భములో నూర్వశీ జననమును తాము సెలవిచ్చిరి. ఆ ప్రసంగమున నింకను బెక్కు కథలు ధర్మయుక్తములు చక్కనివి బ్రహ్మణ్యుడవగు నీచే వచింప బడినవి. అవన్నియు విష్ణు ప్రభావముతో గూడినవి. సర్వ పాపభయ హరములు. కశ్యపుని భార్య ఖశయను పేరుగల దానిని మీరు చెప్పితిరి. ఆమెకు యక్షుడు రాక్షసుడునను నిద్దరు మహానుభావులు కొడుకులని చెప్పియున్నారు. వారి జన్మ వృత్తాంతమును వంశమును వినగోరెదను. ప్రకృత జగదుత్పత్తిని సమగ్రముగ వర్ణింపుడని వజ్రుండడుగగా మార్కండేయు డిట్లనియె - ఆ ఖశ పూర్వ (ప్రాతః) సంద్య యందు రాక్షసునిం గనెను. వాడు కోరలతో భయంకరమైన ముఖము గలవాడు. ఎఱ్ఱని మిడిగ్రుడ్లు కలవాడు. చెవులదాక నోరు తెఱచి కొనువాడు. స్థూలమైన ముక్కుపుటములు గలవాడు. జుట్టు విరబోసికొని వికటాటోపియై శంకుకర్ణుడై భయంకరుడై పుట్టెను. అట్లే అపర (సాయం) సంద్య యందు యక్షుని గన్నది. రాక్షసుని రూపమట్లే వాని రూపు నుండెను. ఆ యక్షుడు క్షుభితుడై తల్లిని క్షిణోమి=విసరివైచెదననెను. అమ్మను క్షమింపు మని యా యక్షునిం గూర్చి రాక్షసుడు పలికెను. రక్షణము చేయుటవలన రాక్షసుడు క్షణధాతువు నర్థము వలన యక్షుడునని వారిద్దరు పేర్కొనబడిరి. యక్షునికి దేవాంగన కృతస్థల భార్యయయ్యెను. వారి కొడుకు రాజతనాభుడను యక్షుడు. వానిభార్య గుహ్యక అనుర్హ్రాదుని కూతురు. ఆమెకొడుకులు వీరుడైన మణిచరుడు వీరభద్రుడు ననబడువారు. వారు దేవతుల్యులు బుద్ధిశాలురు. వారికి భార్యలు కకుత్థ్సుని కూతుండ్రు. మొదటి వాని భార్య పుణ్యజని. రెండవ వాని భార్య దేవజని. వారి సంతతి పుణ్య జనలు దేవజనులు నను వారు. పెక్కు వేల మంది మహాబల పరాక్రములు. శుభ వివాహితులైన యక్షుల వంశీయులచే బహుశీల వంతు లెందరో యక్షులు జనించిరి. అందరు ధర్మస్థితులు సత్యపరులు వినయవంతులు మహానుభావులు. వరదులు వరేణ్యులునై యుండిరి.

ఇది శ్రీ విష్ణుధర్మోత్తర మహాపురాణమందు ప్రథమఖండమున

యక్షోత్పత్తియను నూటతొంబదియేడవ యధ్యాయము.

Sri vishnudharmothara Mahapuranam-1    Chapters