Sri vishnudharmothara Mahapuranam-1    Chapters   

నూటతొంబదినాల్గవ అధ్యాయము - గజేంద్ర మోక్షణము

వజ్రః : భగవన్‌ ! శ్రోతుమిచ్ఛామి గజేంద్రస్య విమోక్షణమ్‌ | విస్తరేణ మహాభాగ ! శాపాన్నక్రస్య చోభయోః || 1

మార్కండేయః : అస్త్యస్మిన్‌ శృంగవాన్నామ జంబూద్విపే కులాచలః |

మహాధాతు సమున్నద్ధైర్యుతః శృంగైర్నభంకషైః || 2

యస్య శృంగత్రయం మధ్యంభాతి రాజన్‌ ! విశేషవత్‌ | బ్రహ్మార్క సోమనిలయం మనోహారి దివంగతమ్‌ || 3

తేషా మథైకం సౌవర్ణ మపరం రాజతం మహత్‌ | సర్వరత్న మయం చైకం మధ్యమం బ్రహ్మణః క్షయమ్‌ || 4

కాంచనం సూర్యనిలయం రాజతం శశినః క్షయమ్‌ | త్రికూటం శైలరాజాభం రత్నపక్షద్రుమైర్యుతమ్‌ || 5

సతత్‌ కృతఘ్నాః పశ్యన్తిన నృశంసా సనాస్తికాః | నాతప్త తపసః కేచిన్నైవ పాపకృతో జనాః || 6

తస్యసానుమతః పృష్ఠేసరో వ్యాకోశ పంకజమ్‌ | కారండవ సమాకీర్ణం రాజహంసోపశోభితమ్‌ || 7

సచ్చిత్తమివ గంభీరం సచ్చత్తమివ నిర్మలమ్‌ | బహూపయోగ్యం చతథా సతాం నిష్కృతి కృన్నృప ! 8

మీనచ్ఛిన్నాభ్రశకల స్ఫుటకల్హార తారకమ్‌ | మహాకుముద రాత్రీశం ద్వితీయ మివచాంబరమ్‌ || 9

ఉత్ఫుల్ల పద్మరజసా మధుపైఃపరి పింజరైః | సమంతాద్వ్యాప్య సత్పద్మం తపనీయ సమైరివ || 10

చ్యుతేన పద్మా ద్రజసా హంసైఃకేసర మంథనైః | వాయునా భ్రామ్యమాణన దుర్విభావ్యోదకాంబుజమ్‌ || 11

మహాన్తః పద్మినీ పత్రాః వాయుభ్రస్తాభ్ర శీకరైః | యుక్తా ముక్తాఫలాకౌరైర్యత్ర భాన్తి సహస్రశః || 12

నృత్యన్తి కమలా యత్ర శఫరీస్ఫురణాహతాః | భ్రమరోద్గీత సంఘోషై రసత్సారసనాదితమ్‌ || 13

హసన్తమివ హంసౌఘైర్కృత్యంతమివ చోర్మిభిః | ఉద్గీథమివ కుర్వాణం కారండవరవై శ్శుభైః || 14

మధ్యేత్వగాధం చతుర ప్రతీహారై రివోర్ధతైః | ఉత్సారయంతం కల్లోలై ర్వాయుక్షిప్త ద్రుమోద్భవాన్‌ || 15

భ్రమరాంతర సంలీన కల్హారకు సుమాక్షిభిః | పశ్యన్త మివ శైలస్య శృంగాణాంతన్మహోచ్ఛ్రయమ్‌ || 16

యత్రాతి శీతలం తోయంలఘుస్వాదు సుధానిభమ్‌ | అన్యచ్ఛృంగం మనోహారి భృంగనాద నినాదితమ్‌ || 17

వజ్రుండు గజేంద్రమోక్షణకథ వినవలతునన మార్కండేయుడిట్లు వచింపదొడగె ఈ జంబూద్వీపమందు శృంగవంతమను కులపర్వతమున్నది. అందుమధ్య నింగొనొరయు మూడు శిఖరములు మహాధాతు సమున్నద్ధము లుండుటచే దాని కాపేరు వచ్చినది అందునడుమనున్న శిఖరము సర్వరత్న మయ మైనది బ్రహ్మసదనము. బంగారు శిఖరము సూర్యునిది. అందు వెండి శిఖరము చంద్రనిలయము. త్రికూట శైలరాజమట్లు రత్నమయములయిన పార్శ్వద్రుమములతోనున్నది. ఆ త్రికూటమును కృతఘ్నలు నాస్తికులు తపస్సుచేయని వారు పాపాత్ములు గానలేరు. ఆశైలముమీద వికసిత పద్మాకర మొకటిగలదు. కారండవముల తోను రాజహంసలతో నది రాజిల్లును. ఆ సరస్సు సాధువులచిత్తమట్లు లోతైనది. నిర్మలము సత్పురుషుల కుపకారము మిక్కిలి యుపయుక్తమును మీనములచే ( చేపల కదలికలవలన) విభక్తమయిన మేఘఖండములతోను నక్షత్రములవంటి వికసించిన ఎఱతామర పూలతో మీనరాశి నక్షత్రపుంజముచే విభక్తమయిన మేఘశకలములనడుమ ప్రస్ఫుటముగా కహ్లారములవంటి (ఎఱ్ఱతామర పూవంటి) నక్షత్రములుగలది శ్లేషాలంకారము పెద్ద పెద్ద తెల్లతామరపూవులనెడి చంద్రబింబములుగలది యై రెండవ యాకాశమాయన్నట్లు ఆ సరస్సుస్వచ్ఛమై ప్రకాశించుచుండును. వికసించిన తామరపూల పుప్పొడిచే పరిపింజరమయిన (పుప్పొడి రంగుచేనలముకొని) బంగారుతుమ్మెదలా అన్నట్లున్న తుమ్మెద లెల్లెడవ్యాపింప నింపొసగు పద్మములతో గూడినదై సొంపుగుల్కును తామరపూలలోని కేశరములనట్టిట్లు హంసలు కదల్పగా జారిన పద్మములందలి పుప్పొడిని వాయువట్టిటు చిమ్ముతరి నీరేదో తామర పూవులేవో తెలియరానట్లా కమలాకర మశ్చర్యమొదవించుచుండెను. పెద్ద పెద్ద పద్మినీ పత్రములు (తామరాకులు) వాయువు విదలించిన మేఘములనుండి జారిన వర్షపుతుంపురులచే ముత్యాలతో గూడినవాయన్నట్లా సరస్సున భాసిల్లుచుండెను. చేపలకదలికల వలన తాకిడివడి తుమ్మెదలగాన ఘోషములతో కమలము లందు నృత్యము సేయుచుండును. భ్రమరగీతములచే కలహంసల కలకలారావ ములచే తూర్యనాదములు నెరపుచు నృత్యముచేయుచున్నట్లు హంసలు గుంపుచే నవ్వుచున్నట్లు కెరటములచే నృత్యము చేయుచున్నట్లు బెగ్గురులకూతలచే బాటపాడుచున్నట్లు నా సరస్సు వింతసొగసుగొల్పుచుండెను. ఉద్ధతులైన ద్వారపాలకుల చేతంబోలె కెరటములచే నడుమ లోతై వాయువుచే కదల్పబడిన వృక్షశాఖలందలి పక్షుల నట్టిట్టు చెదరగొట్టుచున్నదియు లోన దుమ్మెదలు వ్రాలిని ఎఱ్ఱ తామర పూలనెడి కన్నులచే నాపర్వత శృంగములయొక్క యెత్తుం దిలకించుచున్నదియు నట్లున్న సరస్సు నాతడు చూచెను. అందలి నీరు చల్లగ తేలికగ నమృతమట్లు తియ్యనిది తుమ్మెదల ఝంకారముల బ్రతిధ్వనించు మరియొక శృంగము (శిఖరము కూడ యక్కడ మనోహరమై యున్నది.

తస్మిన్సరసి దుస్టాత్మా విరూపోన్తర్జలేశయః | హూహూర్జగామ గ్రాహత్వం శాపాద్వైదేవలస్యతు || 18

తస్మిన్నేవ తథాశైలే హాహా గంధర్వసత్తమః | బభూవ యూథపోహస్తీ చలత్పర్వత సన్నిభః || 19

అథ దన్తోజ్వలవపుః కదాచిద్గజయూథవః || అజగామ మహీపాల! చోత్ఫుల్ల కమలం సరః || 20

పంశదండైః సకలభైర్వృతశ్చైవ కరేణుభిః | వాసయన్‌ మదగంధేన తం త్రికూటం మహీధరమ్‌ || 21

సగజోంజన సంకాశోమదా కుంచిత లోచనః | సలీలం పంకజవనే యూథమధ్యగతో ప్రజమ్‌ || 22

గృహీతస్తేన రౌద్రేణ గ్రాహేణా వ్యక్తమూర్తినా | పశ్యతః సర్వయూథస్య క్రోశతశ్చాతి దారుణమ్‌ || 23

సచకార మహాయత్న మాత్మనః పరిమోక్షణ | గ్రాహోపి యత్న మాతిష్ఠ త్కుంజరాకర్షణ మహాన్‌ || 24

గ్రాహోపి బలినంనాగం నశశాక మహాంభసి | ఆక్రష్టుం నచనాగోపి తథాత్మానం విమోక్షితుమ్‌ || 25

విస్పూర్జ్యంచ యథాశక్తి నిక్రుష్యచ మహారవాన్‌ | ప్యథితః స నిరుద్యోగః పశ్చిమా మాగతో దశామ్‌ || 26

అసరస్సునందు నీటిలో దుష్టుడగు హూహూ గంధర్వుడు రూపువాసి దేవలుని శాపముచే మొసలియై యుండెను అదే పర్వతమందు హాహానామ గంధర్వోత్తముడు గజయూథపతియై నడచుచున్న పర్వతమట్లు సంచరించుచుండెను. ఆ గజరాజు దంతములచే మిక్కిలి దీపించు నాకృతితో నొకనాడా వికసిత పద్మాకరమునకేగెను. వెదురుకర్రలం దొండములం గొనియున్న పిల్లయేనుగులతో నాడయేనుగులతో గూడి మదగంధముచే నా త్రికూటగిరిని పరమళింపజేయుచు సంజనపర్వమట్లు మదముచే గన్నులు మూతపడ గజసంఘము నడుమనుండి యా పద్మవనమందు సవిలాసముగ నడచుచు నా రౌద్రాకారమయిన కరి యాలోన గనరాకున్న మొసలిచే గజయూథమట్టె చూచుచుండ దారుణముగ నాక్రోశించుచుండ పట్టుపడెను. మొసలి పట్టునుండి తనను విడిపించు కొనుట కెంతేని ప్రయత్న మొనరించెను. మొసలియు నాగరాజును లోనికి దిగుచుట కెంతేని యత్నపడుచుండెను. ఆ పెనునీట నా గ్రాహము బలియైన యా గజరాజును లోకిని లాగజాలదయ్యె. నాగరాజు నట్లే తన నా పట్టునుండి విడిపించుకొనజాలదయ్యె. యథాశక్తి విదశించుకొని పెనగిపెనగి ఘీంకరించుచు వ్యథచెంది చేయునదిలేక యత్నముడిగి యవసానదశకు వచ్చెను.

సతునాగవరః శ్రీమన్నారాయణ పరాయణః | జగామ శరణం విష్ణుం తుష్టావచ పరంతపః || 27

గ్మహీత్వాస కరాగ్రేణ సరసః కమలోత్తమమ్‌ | నివేద్యభక్త్యా కృష్ణాయ గజః స్తోత్రముదైరయత్‌ || 28

గజః : నమోనమః కారణ వామనాయ నారాయణాయాసుర దారణాయ |

శ్రీశార్జచక్రాసి గదాధరాయ నమోస్తుతసై#్మ పురుషోత్తమాయ || 29

ఆద్యాయ వేదనిలయాయ మహోరగాయ సింహాయ దైత్య నిలయాయచతుర్బుజాయ |

బ్రహ్మేంద్రరుద్రముఖ చారణ సంస్తుతాయ దేవోత్తమాయ పరదాయ నమోచ్యుతాయ || 30

నాగేంద్రభోగ శయనాసన సుప్రియాయ గోక్షీరహేమ శుక నీల ఘనోపమాయ |

పీతాంబరాయ మధుకైటభ నాశనాయ భక్తప్రియాయ వరదీప్త సుదర్శనాయ || 31

నాభి ప్రజాత కమలస్థ చతుర్మఖాయ క్షిరోదకార్ణవ నికేత యశోధరాయ |

నానా విచిత్ర ముకుటాంగద భూషణాయ సర్వేశ్వరాయ విజయాయన మోనరాయ || 32

విశ్వాత్మనే పరమకారణ కారణాయ పుల్లారవింద విపులాయత లోచనాయ |

దేవేంద్ర భావన పరీక్షత పౌరుషాయ యోగీశ్వరాయ విజయాయ నమోవరాయ || 33

లోకాయనాయ త్రిదశాయనాయ బ్రహ్మాయణాయాత్మగుణాయనాయ |

ధర్మాయణాయైక జనాయనాయ మహావరాహాయ సదా నతోస్మి || 34

ఆ గజరాజు నారాయణపరాయణుడై (విష్ణువుకంటె దిక్కులేదని) లోగడ పరమతపస్వి కావున నయ్యెడ విష్ణువును శరణందెను. స్తుతించెనుగూడ. ఆ కొలనిలోనుండి యొక కమలరాజమంగైకొని భక్తితో కృష్ణునికి నివేదించి స్తోత్రము సేసెను.

గజేంద్రకృతస్తవము

ఒకానొక కారణమున వామనుడైన నారాయణున కసురదారణునకు నమస్కారము. శ్రీ శార్జ చక్ర ఖడ్గ గదాధరునకు నా పురుషోత్తమునకు నమస్కారము. ఆద్యునకు వేదసదనునకు మహాసర్పమునకు సింహమునకు సర్వ దైత్యలయకారునకు చతుర్భుజునకు బ్రహ్మేంద్రరుద్రమునిచారణ సంస్తుతునికి దేవోత్తమునకు వరదునికి అచ్యుతునకు నమస్కారము. నాగేంద్రుని పడగలపై శయనించుటలకు కూర్చుండుటకు ప్రీతిగొనువానికి ఆవుపాలు బంగారము చిలుక ఆకుపచ్చ నల్లని మేఘమును బోలిన వానికి పీతాంబరునికి మధుకైటభ నాశనునికి భక్తప్రియునకు మిక్కిలిగ యుద్ధీపించు సుదర్శన చక్రము ధరించువానికి బొడ్డునం బొడమిన కమలమందు చతుర్ముఖుండుగల వానికి నానారత్నచిత్రిత కిరీటాంగద భూషణదారికి సర్వేశ్వరునికి విజయునికి నరునికి నమస్కారము. విశ్వస్వరూపుడు పరమకారణములయినవానికి గారణమైనవాడు వికసించిన తామరపూవట్లు సువిశాలము లైన కన్నులుకలవాడు దేవేంద్రుని భావమున జరిగిన పరీక్షకందని పౌరుషముకలవానికి యోగీశ్వరునికి వరునికి (శ్రేష్ఠునికి) నమస్కారము. లోకములకు పరమగతియైనవానికి ముక్కోటి దేవతలకు దిక్కయినవానికి బ్రహ్మకు గతియైనవానికి ఆత్మగుణములకు (అహింస సత్యము అస్తేయము) బ్రహ్మచర్యముమొదలవానికి బరమగమ్యస్థానమైనవానికి ధర్మగతికి ఏకైక జనునక మహావరాహ మున కెల్లపుడు వినతుం డయ్యెద.

అచిన్త్య మవ్యక్త మనన్తరూపం నారాయణం కారణ మాదిదేవమ్‌ |

యుగాన్తశేషం పురుషం పురాణం తం వాసుదేవం శరణం ప్రపద్యే || 35

ఆదృశ్య మచ్ఛేద్య మనాది మధ్యం మహర్షయో బ్రహ్మనిధిం సురేశమ్‌ |

వదన్తియం వైపురుషం సనాతనం తం వాసుదేవం శరణం ప్రపద్యే || 36

య మక్షరం బ్రహ్మవదన్తి సర్వగం నిశమ్యయం మృత్యుముఖాత్‌ ప్రముచ్యతే |

త మీశ్వరం దృప్త మనుత్తమై ర్గుణౖః పరాయణం విష్ణు ముపైతి శాశ్వతమ్‌ || 37

కార్య క్రీయాకారణ మప్రమేయం హిరణ్యనాభం కనకార విందమ్‌ |

మహాబలం వేదనిధిం సురోత్తమం ప్రజామి విష్ణుం శరణం జనార్దనమ్‌ || 38

అచింత్యుడు అవ్యక్తుడు అనంతరూపుడు నారాయణుడు కారణమయినవాడు ఆదిదేవుడు యుగాంతములందు శేషించువాడు పురాణపురుషుడునైన యా వాసుదేవుని శరణందెదను. కానరానివాడు భేదింపరానివాడు అనాదిమధ్యుడు బ్రహ్మనిధి (వేదముల గని) సురేశుడునని యెవ్వని మహర్షులు వాకొందురట్టి సనాతన పురుషుని వాసుదేవుని శరణు సొచ్చెద. ఎవ్వని నక్షరమైన బ్రహ్మముగా బలుకుదురు సర్వాంతరుడని యెవ్వనివిని ప్రాణి మృత్యుముఖమునుండి విడివడు నా యీశ్వరు నుత్తమగుణ దర్పితుని పరాయణుని శాశ్వతుని విష్ణువునుబొందుదును. కార్యము క్రియ కారణము తానయైనవానిని ఆప్రమేయుని హిరణ్యనాభుని కనకారవిందుని (బంగారు తామరపూవు చేతనున్న వానినన్నమాట) మహాబలుని వేదములగనిని సురవరుని విష్ణుని శరణొందుచున్నాను.

విచిత్ర కేయూర మహార్హనిష్కం రత్నోత్తమాలంక్భత సర్వగాత్రమ్‌ |

పీతాంబరం కాంచన భక్తిచిత్ర మాలాధరం కేశవమభ్యుపైమి || 39

భవోద్భవం వేదవిదాం వరిష్ఠం యోగాత్మనాం సాంఖ్యవిదాం వరిష్ఠం |

ఆదిత్య చంద్రాశ్వివసుప్రభావం ప్రభుం ప్రపద్యేచ్యుత మాత్మ భూతమ్‌ || 40

శ్రీవత్సాంకం మహాదేవం వేదగుహ్య మనుత్తమ | ప్రపద్యేసూక్ష్మమచలం భక్తానా మభయప్రదమ్‌ || 41

ప్రభవం సర్వలోకానాం నిర్గుణంచ గుణాత్మనామ్‌ | ప్రపద్యేముక్తసంగానాం యతీనాం పరమాంగతిమ్‌ || 42

భగవంతం సురాధ్యక్షమక్షరం పుష్కరేక్షణమ్‌ | శరణ్యం శరణం భక్త్యాప్రపద్యే బ్రాహ్మణ ప్రియమ్‌ || 43

బ్రహ్మాదేశం త్రిలోకేశ మాద్యమేక మనామయమ్‌ | భూతాత్మానం మహాత్మానం ప్రపద్యే మధుసూదనమ్‌ || 44

క్షేత్రజ్ఞం పురుషం విష్ణుం త్రిగుణాతీత మవ్యయమ్‌ | నారాయణ మణీయాంసం ప్రపద్యే శరణం హరిమ్‌ || 45

ఏకాయ లోకతంత్రాయ పరతః పరమాత్మనే | నమస్సహస్ర శిరసే ఆనన్తాయ మహాత్మనే || 46

వరేణ్య మనఘం దేవ మృషయో వేదపారగాః | కీర్తయన్త్యభవం సర్వే తంప్రపద్యే సనాతనమ్‌ || 47

సమస్తే పుండరీకాక్ష! భక్తానా మభయ ప్రద | సుబ్రహ్మణ్య సమస్తేస్తు త్రాహిమాంశరణాగతమ్‌ || 48

మణివిచిత్రములయిన బాహువులును ఆమూల్యములయిన నిష్కములుదాల్చి మహోత్తమ రత్నాలంకృత సర్వశరీరుని పీతాంబరుని కాంచనభక్తిచిత్రుని (బంగారు కాసులపేరులు మొదలయినవానిదే వింతగొల్పువానిని) వనమాలాధరుని (పద్మాల మాల) కేశవస్వామిని శరణందెద. పుట్టినవాని కెల్ల మూలమైనవానిని (భవోద్ధవుని) వేదవిద్వరష్ఠుని యోగసాంఖ్యవిద్వద్వరిష్ఠుని ఆదిత్య చంద్ర - అశ్వినీదేవతా వసువుల ప్రభావమెల్ల తానైన వానిని అందరకాత్మయైనవానిని ప్రభువును శరణందెద. శ్రీవత్సాంకుని మహాదేవుని వేదరహస్యమైనవానిని తనకంటె నుత్తముడింకొకడు లేనివానిని సూక్ష్ముని అచలుని భక్తాఢయప్రదాతను శరణందెదను. సర్వలోకకారణుని (పుట్టించువానిని) గుణస్వరూపులలో నిర్గుణుడై యుండువానిని (కేవల నిష్కల జ్ఞానమై యుండువారన్నమాట) సర్వసంగవిముక్తలకు యతులకును బరమగతియైనవానిని భగవంతుని సురాధ్యక్షుని అక్షరుని పుష్కరేక్షణుని (కమలాక్షుని) శరణ్యుడైనవానిని బ్రాహ్మణ ప్రియుని శరణొందెవ బ్రహ్మకాలజ్ఞారూపుడైన వానిని త్రిలోకేశుని ఆద్యుని ఒక్కడైనవానిని అనామయుని భూతములకాత్మయైనవానిని మధుసూదనుని మహాత్ముని శరణందెద. క్షేత్రజ్ఞుని (క్షేత్రమనగా ఉపాధి. శరీరము. అందు సాక్షిభూతుడై కేవలజ్ఞానమై యున్నవాడు క్షేత్రజ్ఞుడు) పురుషుని (పురి+తిష్ఠతీతి పురుషః) ఉపాధులందుండువాడు విష్ణువును (విష్వక్‌ తిష్ఠతీతి విష్ణుః) సర్వాంతర్యామిని త్రిగుణాతీతుని అవ్యయుని నారాయణుని అణీయాంసుని (అణువుకంటెనణువు సూక్ష్మమైనవానిని) హరిని శరణుసొచ్చెద. ఒక్కడైనవానికి లోకతంత్రునికి (లోకరచనసేయువానికి) పరాత్పరునికి సహస్రశిరస్కునికి అనంతునికి మహాత్మునికి నమస్కారము. వరేణ్యుని శ్రేష్ఠుని (వరణీయుని కోరదగినవానిని) అనఘుని దేవునిగ వేదపారగులగు నెల్ల ఋషులు అభవునిగ (పుట్టుకలేని వానిగ) కీర్తింతురా సనాతనుని శరణొందెద. ఓ పుండరీకాక్ష ! నీకు నమస్కారము. భక్తాభయప్రద నీకు నమస్సు. సుబ్రహ్మణ్యా! నీకు నమస్కారము. శరణాగతుని నన్ను రక్షింపుము.

మార్కండేయః : భక్తిం తస్యతు సంచిన్త్య నాగస్యామోఘ సంస్తపమ్‌ |

ప్రీతిమానభవ ద్రాజన్‌ ! సద్యశ్చక్ర గదాధరః || 49

సాన్నిధ్యం కల్పయామాస గ్రాహం చక్రేణ మాధవః | మోక్షయామాస సగజం పాశేభ్యః శరణాగతమ్‌ || 50

సహిదేవలశాపేన హాహా గంధర్వసత్తమః | గజత్వ మభవత్త్యక్త్వా మోక్షం ప్రాప్య దివంగతః || 51

గ్రాహాద్విముక్తస్సద్యస్తు గజోగంధర్వతాం గతః | గ్రాహో గంధర్వతాంప్రాప్తోయః కృష్ణేననిపాతితః || 52

తస్యాపి దేవలకృతః శాపదోషోభవత్పురా |

అని యిట్లు నుతించు నాగన్న భక్తిని తలంచి అమోఘస్తవుడయిన హరి (స్తుతికర్థమైనవాడు) సంప్రీతుడయ్యెను. రాజా! అప్పుడు చక్రగదాధారియై యా గజేంద్రునికి సాన్నిధ్యముంగల్పించెను. మరియు మాధవుడు చక్రముచే గ్రాహమును పట్టు విడిపించెను. ఏనుగును శరణాగతుని పాశముల నుండి విముక్తుం జేసెను. ఆ గజరాజు మున్ను హాహా గంధర్వశ్రేష్ఠుండు దేవల శాపముచే నయిన గజత్వము విడిచి మోక్షమంది దిపమందెను. మొసలి జన్మము బాసి కృష్ణునిచే బడిన మొసలి గంధర్వత్వమందెను. మున్ను వానికిని దేవలుని శాపదోషము తగిలినది.

ప్రీతిమాన్‌ త్రాయతే విష్ణుః సర్వస్సంసార సాగరాత్‌ || 53

క్రుద్ధోపి నిఘ్నన్‌ దేవత్వ మరాతీనాం ప్రయచ్ఛతి | తౌచ స్వంస్వం వపుఃప్రాప్య ప్రణిపత్య జనార్దనమ్‌ || 54

గంధర్వాధిపతీ శీఘ్రం పరాం నిర్వృతి మాగతౌ | ఇదంచైవ మహాబాహో! పురాదేవోభ్యభాషత || 55

దృష్ట్వాముక్తౌ గజగ్రాహౌ భగవాన్‌ మధుసూదనః | యోగ్రహీ న్నాగరాజంచ మాంచైవ ప్రణిధానవాన్‌ || 56

స్మరిష్యతి సరశ్చేదం యుపయోర్మోక్షణం తథా | గుల్మం కీచక వేణూనామిమం శైలవరం తథా || 57

అశ్వత్థం భాస్కరం గంగాం నైమిశారణ్య మేవచ | ప్రయాగం బ్రహ్మతీర్థంచ దండకారణ్య మేవచ || 58

సంస్మరిష్యన్తి యేమర్త్యాః సమ్యక్‌ శ్రోష్యన్తిచాపియే | నతే దుఃస్వప్న పాపస్య భోక్తరో మత్పరి గ్రహాత్‌ || 59

సర్వపాపైః విమోక్ష్యన్తి కశ్యాణానాంచ భాగినః | భవిష్యన్తితథా పుణ్యాం గతిం యాస్యన్తి మానవాః || 60

దుస్స్వప్నంచ నృణాంతేషాం సుస్వప్నత్వం ప్రయాస్యతి | కౌర్మ్యం మాత్స్యంచ వారాహం వామనం తార్ష్యమేవచ || 61

నారసింహం తథారూపం సృష్టిప్రళయ కారకమ్‌ | ఏతాని ప్రాత రుత్థాయ సంస్మరిష్యన్తియే నరాః || 62

సర్వపాపై ర్విశుద్ధాస్తే యాస్యన్తి పరమాంగతిమ్‌ | మార్కండేయః : ఏవముక్త్వాతు రాజేంద్ర! దేవ దేవో జనార్దనః ||

అస్పృశద్గజ గంధర్వం గ్రాహ గంధర్వ మేవచ | తేనస్పృష్టౌతుతౌ సద్యోదివ్య మాల్యాంబరాన్వితౌ || 64

విమానేభిమతే ప్రాప్తేజగ్మతు స్త్రిదశాలయమ్‌ | తత్రదేవ పతిః కృష్ణో మోక్షయిత్వా గజోత్తమమ్‌ || 65

ఋషిభిః స్తూయమానస్తు గుహ్యైర్వేద పదాక్షరైః | గతస్స భగవాన్‌ విష్ణు ర్దుర్విజ్ఞేయ గతిర్విభుః || 66

గజేంద్రమోక్షణం దృష్ట్వా సర్వే సేంద్రపురోగమాః | బ్రాహ్మణా నగ్రతః కృత్వా నర్వేప్రాంజలయోభవన్‌ || 67

గజేంద్రమోక్షణం పుణ్యం సర్వపాప విమోచనమ్‌ | శ్రావయన్‌ ప్రాతరుత్థాయ సర్వపాపైః ప్రముచ్యతే || 68

శ్రద్ధయాహి యదుశ్రేష్ఠ ! స్మృతేన కథితేనచ | గజేంద్ర మోక్షణనైవ దీర్ఘమాయు రవాప్ను యాత్‌ || 69

మయాతే కథితం దివ్యం పవిత్రం పాపనాశనమ్‌ | కీర్తయస్వ! మహాబాహో! మహాదుస్స్వప్న నాశనమ్‌ || 70

కీర్త్యమానంచ విప్రేభ్యః శృణు! భక్త్యాయథోదితమ్‌ || 71

పరం వరేణ్యం వర పద్మనాభం నారాయణం పద్మనిధిం సురేశమ్‌ |

తం దేవ గుహ్యం పురుషం పురాణం వవందిరే బ్రహ్మవిదాం వరిష్ఠాః || 72

ఏతత్పుణ్యం యదుశ్రేష్ఠ ! నరాణాం పాపకర్మిణామ్‌ | దుస్స్వప్న దర్శనే ఘోరే శ్రుత్వాపాపాత్ర్పముచ్యతే || 73

భక్తిమాన్‌ పుండరీ కాక్షే గజో దుఃఖాద్విమో చితః | తథా త్వమపి రాజేంద్ర! ప్రపద్య శరణం హరిమ్‌ || 74

విముక్తః సర్వ పాపేభ్యః ప్రాప్స్యసే పరమాం గతిమ్‌ || 75

ఇతి శ్రీ విష్ణుధర్మత్తరే ప్రథమఖండే వజ్రసంవాదే

గజేంద్ర మోక్షణం నామ చతుర్నవత్యధిక శతతమోధ్యాయః.

విష్ణువు ప్రీతుడైన యాక్షణమ సంసారసాగరమునుండి కాపాడును. కోపించుయు హరి తాను జంపియు శత్రువులకు దేవత్వమిచ్చును. అగజరాజు మకరరాజును దమతమ యుపాధులంబడసి జనార్దనున కెరగి గంధర్వాధిపతులెనవారు శీఘ్రముగ పరమనిర్వ్రితిని (బ్రహ్మానందమును) బొందిరి. శూరాగ్రేసరా ! ఈ కథను గజగ్రాహములు ముక్తులుముక్తులగుటచూచి విష్ణువు గజరాజుని నన్ను మిగుల ధ్యానముతో గ్రహించిన యీ వృత్తాంతమును ఈ రెంటి మోక్షము స్మరించువారు ఈ కీచకవేణు గుల్మమును ఈ త్రికూటాద్రిని అశ్వత్థము (రావిచెట్టును) భాస్కరుని గంగను నైమిషారణ్యమును ప్రయాగను బ్రహ్మతీర్థమును దండకారణ్యమును నేమానవులు స్మరింతురు చక్కగవిందురు వారు నాపరిగ్రహమంది నా అవలంబముపడసి దుస్స్వప్న మువలని పాపము ననుభవింపరు. సర్వపాప విముక్తులగుదురు. పరమగతి నందుదురు. అని యిట్లు పలికి జనార్దనుడు దేవదేవుడు గజగంధర్వుని గ్రాహగంధర్వుని స్పృశించెను. స్వామిచే సృశింపబడి యాయిద్దరు నప్పుడ దివ్యమాలాంబరధారులై తమ కభిమతమై నచ్చని విమానము రాగా దానిపై స్వర్గమునకేగిరి. అక్కడ దేవేశుండు కృష్ణుడు గజోత్తముని విడిపించి ఋషులచే రహస్యములైన వేదపదములచే స్తూయమానుడై యా విభువేరికిం దెలియరానిగతి కలవాడై యేగెను. ఇంద్రాది దేవతలు గజేంద్రమోక్షముం జూచి బ్రాహ్మణులను మున్నిడుకొని యందరును బ్రాంజలులైరి. గజేంద్రమోక్షణ కథ యిది సర్వపాప విమోచనము. వేకువను లేచి యిది వినిపించిన నాతడు సర్వపాప ముక్తుడగును. యదువరా ! శ్రద్ధతో నీకథను స్మరించినను జెప్పినను దీర్ఘాయుష్మంతుడగును. నేను నీకీ దివ్య కథ పవిత్రము పాపనాశనమును వచించితిని. ఓ మహావీర ! మహాదుఃస్వప్న నాశనమైన దీనిని నీవు కీర్తింపుయి. విప్రులు కీర్తింప నీవు కీర్తించినట్లు సమగ్రముగ భక్తితో వినుము. వరుడు (శ్రేష్ఠుడు) వరేణ్యుడు పరపద్మనాభుడు నారాయణుడు పద్మనిధి సేరేశుడు దేవగుహ్యమైన యాపురాణపురుషుని బ్రహ్మవిద్వరిష్ఠులు వందనములు సేసిరి. యదువర ! ఇది పాపకర్మలగు నరులు ఘెరదుఃస్వప్నము వచ్చినపుడీ పుణ్యకథ విని పాపముక్తు లగుదురు. పుండరీకాక్షునందు భక్తికలిగిన ఏనుగు దుఃఖము నుండి ముక్తుడు గావింపబడెను. అట్లే నీవును హరిని శరణంది సర్వపాపవిముక్తుడవై పరమగతినందగలవు.

ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణము ప్రథమఖండమున గజేంద్రమోక్షణమను నూటతొంబదినాల్గవ యధ్యాయము.

Sri vishnudharmothara Mahapuranam-1    Chapters