Sri vishnudharmothara Mahapuranam-1    Chapters   

పందొమ్మిదవ అధ్యాయము

గంగావతరణము

మార్కండేయ ఉవాచ :

రాజ్యం ప్రాప్య మహాతేజాః దిలీపతననయోనృపః | నరకస్థాన్‌ పితౄన్‌ శ్రుత్వా రాజ్యంన్యస్యాశు వృద్ధయే || 1

గంగా మారాధ యామాస తపసా మహతా తదా | యమైశ్చ నియమై రాజన్నపర్ణాశనకై స్తథా || 2

దశవర్ష సహస్రాణి తపస్తేపే భృశం నృపః అథగంగా మహాదేవీ ప్రసన్నా7భూద్గత క్లమా || 3

భగీరథో7పి ధర్మాత్మా వరంలేభే కుతూహలీ | తతో లేఖనదీదేవీ ప్రావోచత్తం భగీరథమ్‌ || 4

పతంత్యా గగనా త్సోఢుం మమవేగం వసుంధరా || 5

నసమర్థా యదా తస్మాత్తోషయస్వాశు శంకరమ్‌ | సహిశక్తః పతన్త్యామే వేగం సోఢుం నరేశ్వర || 6

ఏవముక్త్వా య¸°దేవీ తదాన్తర్ధాన మీశ్వరీ | భగీరథో7పి ధర్మాత్మా తపస్తేపే సుదారుణమ్‌ || 7

ఆరాధనార్థం దేవస్య శంకరస్య మహాత్మనః | తపసో7న్తే మహాతేజా దృష్టవాన్‌ జగదీశ్వరమ్‌ || 8

దేవ దేవ ఉవాచ :

తపసోగ్రేణ తేరాజన్‌ ! ప్రసన్నో7స్మియథేప్సితమ్‌ దదామితే యతోభక్తిం పితౄణాం, చాక్షయం యశః || 9

మార్కండేయ ఉవాచ :

ఏవముక్తస్తు దేవేన పూజయిత్వా మహేశ్వరమ్‌ | జగామ గంగా మనసాం రాజా పూర్ణమనోరథః || 10

శంకరాధిష్ఠితం జ్ఞాత్వా నృపతేశ్చ చికీర్షితమ్‌ | పపాత గగనా ద్గంగా తదా రాజీవలోచన || 11

గంగాయాః పతనం జ్ఞాత్వాబ్రహ్మా తందేశమాగతః | యమేంద్ర వరుణాన్‌ దేవా9పురస్కృత్య అమితౌజసః || 12

ఋషయో నాగ గంధర్వ విద్యాధర మహోరగాః | సువర్ణ కింనర గణా స్తథైవాప్సరసాం గణాః || 13

విమానశత సంబాధం తద్బభూవ నభస్తలమ్‌ | ప్రకీర్యమాణ కుసుమైర్దేవ నాగ విరాజితమ్‌ |

సురప్రభా దుర్నిరీక్ష్యం తదాభరణ భాసురమ్‌ || 14

సుగంధి చారుపవనం సురతూర్య నినాదితమ్‌ | నభస స్తస్య మధ్యేన పపాత గగనాన్నదీ || 15

విశామి భిత్త్వాపాతాలం స్రోతసాగృహ్య శంకరమ్‌ | ఇత్యేవం దుష్టభావాసా పపాత హర మూర్ధని || 16

మార్కండేయుడిట్లు పలికెను :- మహాతేజస్వియు దిలీప పుత్రుడునగు భగీరథుడు రాజ్యము నంది తండ్రులను నరకస్థులనుగ నెరింగి రాజ్య భారము నితరుల యందుంచి వృద్ధ్యర్థమై గొప్ప తపస్సుతో గంగానది నారాధించెను. దయాశౌచాదియమములతోను, ఆకులు మున్న గువానిని గూడ తినకుండుట మొదలగు నియమములతోను పదివేల సంవత్సరములు భగీరథ చక్రవర్తి గొప్ప తపస్సు గావించెను. అంత గంగా మహాదేవి ప్రసన్నురాలై క్లేశమును తీర్చెను. ధర్మాత్ముడు ఉత్సాహవంతుడునగు భగీరథుడు వరమందెను. దేవనది వానికిట్లనెను. ఆ కసమునుండి పడుచున్న నాయొక్క వేగమును భూమి సహించలేదు. అందువలన శంకరుని శీఘ్రముగ సంతోషపెట్టుము. ఆతడు నా వేగము సహింప సమర్థుడు. అని పలికి గంగ యంతర్ధానమందెను. మహాత్ముడగు శంకరుని ఆరాధించుటకై ధర్మాత్ముడగు భగీరథుడు ఘోర తప మాచరించెను. తపస్సు ముగించగా జగదీశ్వరుడగు శంకరుని దర్శించెను, పరమేశ్వరు డిట్లనెను : ''ఓ రాజా! నీ తీవ్ర తపమునకు సంతోషించితిని. నీ యభీప్సిత మిచ్చెద నీకు తండ్రులయెడ అక్షయ భక్తియు, అఖండ కీర్తియు నొసంగెద. అని శంకరునిచే పలుకబడినవాడై శంకరుని పూజించి, రాజు పరిపూర్ణములైన కోరికలు గలవాడై మనసుతో గంగను సంస్మరించెను. భగీరథుని కర్తవ్యము శంకరుని యధీనమై యున్నదని గంగ తెలసికొని యాశాశమునుండి పడెను. ఆసంగతి తెలిసి బ్రహ్మ ఆ ప్రదేశమున కేతెంచెను. యముడు, ఇంద్రుడు, వరుణుడు, మున్నగు దేవతలను పురస్కరించుకొని మహాతేజస్సంపన్నులగు ఋషులు నాగ గంధర్వ విద్యాధర, మహోరగులు, సుపర్ణులు, కిన్నరులు అప్సరోగణములు దయచేసిరి. అచటి ఆకాశమంతయు ననేక విమానములతో సంకలుమాయెను. పుష్పములు చిమ్మబడినవి దేవ నాగులతో ప్రకాశమానమై, దేవతల కాంతులచేతను వారి యాభరణ కాంతులచేతను ఆకాశము మిరుమిట్లు గొల్పుచుండెను. వాయువు పిరమళవంతమై దేవవాద్య ఘోషలచే ప్రతిధ్వనించుచుండెను. ఆ యాకాశమధ్యనుండి గంగానది పడెను. ప్రవాహముతో గూడ శంకరుని తీసికొని భేదించుకొని పాతాళము చేరెదనను దుష్టభావముతో నా గంగ శివుని శిరమున పడెను.

జ్ఞాత్వా క్రూరమభిప్రాయం దేవ్యాః దేవః పినాకభృత్‌ | జటాకలాపే తాందేవీం దిరశ్చక్రే చతుర్ముఖే || 17

బభ్రామ సాతిరోభూత్వా తత్రైవ త్వచిరం నదీ | తస్యాః పతంత్యా యేకేచిత్‌ బిందవః క్షితిమాగతాః || 18

తైఃకృతం పృథివీపాల తదాబిందుసరః శుభమ్‌ | దేవో7పి దృష్ట్వారాజానం క్షుధయా వ్యాకులేంద్రియమ్‌ || 19

తత్యాజ తాం తదాశీఘ్రం జటాగ్రేణ మహేశ్వరః || 20

ధృతగంగో జగామాథ తతో7న్తర్ధాన మీశ్వరః | మహేశ్వర శిరోభ్రష్టా ప్రవిష్టాచ సరశ్శుభమ్‌ || 21

తస్మాద్వినిస్సృతా భూయః సప్తధా దేవ నిమ్నగా | హ్లాదినీ హ్రాదిని చైవప్లావినీ చేతి ప్రాచ్యగాః || 22

సీతా వక్త్రశ్చ సింధుశ్చ ప్రతీచ్యభిముఖా గతాః | దక్షిణన తథా గంగా భగీరథ పథానుగా |

క్వచిద్వేగేన మహతా క్వచిన్మం దవిసర్పిణీ || 23

క్వచిత్ఫేనాకుల జలా క్వచిదావర్త మాలినీ | క్వచిద్గంభీర శబ్దౌఘా నిశ్శబ్దాచ తథా క్వచిత్‌ || 24

క్వచిద్ధంస వరోద్దామా చక్రవాకయుగా క్వచిత్‌ | ఊర్మిమాలా కుల జలా కుసుమోత్కర మండితా || 25

జలసత్త్వ శతాకీర్ణా సురసిద్ధ సుఖప్రదా | అమృతస్వాదు సలిలా హర సంసర్గ నిర్మలా || 26

విష్ణుపాద ప్రహారోత్థా సర్వపాతక నాశినీ | ఏవం సంప్రాప్య సావింధ్యం ప్రవిష్టా పూర్వ సాగరమ్‌ || 27

సాగరేణ సమాసాద్య పాతాలం భీమ దర్శనమ్‌ | ప్లావయామాస తద్భస్మ సాగరాణాం మహాత్మనామ్‌ || 28

భస్మని ప్లావితే సర్వే గతాస్తే సాగరా దివమ్‌ || 29

ఏవంధరాందేవ నదీప్రయాతా సుపుణ్యతోయా ఋషివర్య జుష్టా |

మహానుభావా నృప ! జహ్నుకన్యా నిశ్శ్రేణి భూతాత్రిదివ ప్రయాణ || 30

ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ప్రథమఖండే మార్కండేయ వజ్రసంవాదే గంగావతరణం నామఏకోనవింశో7ధ్యాయః.

గంగాదేవియొక్క దురభిప్రాయమును నెరింగి పరమేశ్వరుడు ఆ గంగను తన జటాజూటమున నిరోధించెను. ఆ నది అచటనే చిరకాలము తిగారుడజొచ్చెను. అట్లు పడుచున్న గంగానది బిందువులుగల నేల బిందు సరస్సు అను పవిత్ర స్థలమాయెను. శివుడు ఆకలిచే వ్యాకులమైన భగీరథ చక్రవర్తిని చూచి తన జటాగ్రమునుండి గంగను వదలెను. అంత గంగాధరుడంతర్ధాన మందెను. మహేశ్వరుని శిరమునుండి జారినదై బిందు సరస్సును ప్రవేశించి, అందుండి బయలువెడలి దేవనది యేడుగా ప్రవహించెను. హ్లాదిని, హ్రాదిని, ప్లావిని అని తూర్పుగ ప్రవహించును. సీతవక్త్రము, సింధువు, పడమటగ పోవు నదులు. దక్షిణముగ భాగీరథియనునది ప్రవహించును. ఈ గంగ ఒక్కచో గొప్ప వేగముతోను, మరియొకచో మెల్లమెల్లగ ప్రవహించును. ఒక్కచో నురుగుతో వ్యాకులమైన జలముగలదిగను, ఒక్కచో సుడులు గలదిగను, ఒక్కచో గంభీరధ్వని గలదిగను, ఒక్కచో నిశ్శబ్దముగను, ఒక్కచో హంసధ్వనులతో నుత్కటముగను ఒక్కచో చక్రవాకపక్షి జంటలతోను, తరంగ మాలలతో వ్యాకులమగు జలము గలదిగ నొక్కచోటను, మరియొకచో పుష్ప సముదాయ శోభితముగను, నీటి జంతు సముదాయముతో వ్యాప్తమై యొకచోటను దేవతలకు, సిద్ధులకు సుఖప్రదమై యొక్కయెడను. అమృతమువలె రుచియైన నీరుగలదై, శివ సంపర్కముచే నిర్మలమై విష్ణుపాద ప్రహారముచే నుత్థితమై, సర్వపాతక నివారకమై గంగ యొప్పుచుండెను. ఇట్లు గంగానది వింధ్యాద్రినిఛేరి, పూర్వ సముద్రమును ప్రవేశించి భయంకరమగు పాతాళము చేరి, మహాత్ములగు నగర పుత్రుల భస్మను ఆప్లావితము చేసెను అట్లు భస్మ మాప్లావితము కాగా సగర పుత్రులందరు స్వర్గమును చేరిరి. ఇవ్విధంబుగ దేవనది భూలోకమును చేరి, పవిత్రోదకయై ఋషి రత్న సేవితయై మహా ప్రభావయుతయై, జహ్నుముని కన్యయై స్వర్లోక గమనమునకు నిశ్శ్రేణిక (నిచ్చెన) యైనది.

ఇది శ్రీ విష్ణుధర్మోత్తరమున మహాపురాణమున ప్రథమ ఖండమున మార్కండేయ వజ్ర సంవాదంబున గంగావతరణమను పందొమ్మిదవ యధ్యాయము.

Sri vishnudharmothara Mahapuranam-1    Chapters