Sri vishnudharmothara Mahapuranam-1    Chapters   

నూటఎనుబదిరెండవ అధ్యాయము - పదునొకండవ మన్వంతరకథ

శాబంరాయణీ: రుద్రపుత్రస్యతేపుత్రాన్‌ వక్ష్యామ్యేకాదశస్యతు | ధర్మనిత్వాన్‌ మహాభాగాం సై#్తలోక్యస్య పరాయణాన్‌ ||

సర్వర్తుగః సుశర్మాచ సేనానీకః పురోద్ధతః | క్షేమధన్వా దృఢేంద్రశ్చచాదర్శః పుండ్రక స్తథా || 2

మనుపుత్రా స్మృతాః హ్యేతా ఋషయశ్చ నిబోధమే | హవిష్మాంశ్చ వపుష్మాంశ్చ వరుణాబ్ధిశ్చ నిస్తరః || 3

విష్ణు శ్చైవాగ్ని తేజాశ్చ ఋషయ స్సప్త కీర్తితాః | నిర్మధ్యా రథయ శ్చైవ కామగాశ్చ గణా స్త్రయః || 4

త్రింశ త్త్రింశ త్తథా దేవాః ఏకైకస్మిన్‌ గనే స్మృతాః | తేషా మింద్రో వృషోనామ భవిష్యతి హహాబలః || 5

దాయాదా బాంధవాశ్చైవ భవిష్యన్తి సురాశ్చయే | తేషాంతు భవితారాజా దశగ్రీవః ప్రతాపవాన్‌ || 6

ఘాత యిష్యతి తం విష్ణుః సై#్తణంరూప ముపాశ్రితః | శూలాగ్రేణ వినిర్భిద్య రణ దేవాసురే తదా || 7

తమవధ్యం దురాధర్షం పురుషాణాం స్వయంభువా | గతం తపః ప్రభావేన విష్ణుస్తం ఘాతయిష్యతి || 8

నీలోత్పలాభం తపనీయ వర్ణం సువృత్త జానూరుయుగం స్వరూపమ్‌ |

రూపం స్త్రియాశ్చారు తరం కృత్వా సురారి ముగ్రం సహసారిహన్తా || 9

ఇతి శ్రీ విష్ణు ధర్మోత్తరే ప్రథమఖండే ఏకాదశ మన్వంతర వర్ణనం నామ షడశీత్యధిక శతతమోధ్యాయః.

శాంబరాయణియనియె. పదునొకొండవ మనువు అగు రుద్రుని పుత్రులు చెప్పెదవినుము. ఆయన పుత్రుడు ధర్మనిత్యులు ముల్లోకములకు పరమాశ్రయులు మహానుభావులు వారు సర్వర్తుగుడు. సుకర్మ, సేనా నీకుడు, పురోద్ధతుడు, క్షేమధన్వుడు దృఢేంద్రుడు, అదర్శుడు పుండ్రకుడు ననువారు. ఇక సప్తర్షులు హవిష్మంతుడు వపుష్మంతుడు వరుణుడు, అబ్ధిస్తరుడు విష్ణువు, అగ్నితేజుడు ననువారేడుగురు నిర్మథ్యులు రథులు (రథి=ఇకారాంతము) కామగలునను మూడుదేవగణములు. ఒక గణములో ముప్పది మందివంతున దేవతలుందురు. వారికింద్రడు వృషుడను నాతడు బలశాలి. ఆయన దాయాదులు బంధువులు సురులు. వారికి రాజు దశగ్రీవుడు. బ్రహ్మచే పురుషులకు నవధ్యుడగు వానిని విష్ణువు స్త్రీరూపము ధరించి దేవాసుర సంగ్రామమందు శూలముచే జంపగలడు. విష్ణువు నల్లగలువవన్నె గలమేను బంగారమట్లుండు సువృత్తములయిన (గుండ్రమైన) మోకాళ్లు తొడలునుగల చక్కని స్త్రీ రూపముదాల్చి తపః ప్రభావముచే బ్రహ్మవలన పురుషులచే నవధ్యత్వము ఓర్వరాని విక్రమము వరముగా బడసిన యాదేవవైరిని మహోగ్రుని సాహసమున జంపగలడు.

ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణమందు ప్రథమఖండమున పదునొకండవమనువువర్ణనమను నూటయెనుబది యారవ యధ్యాయము.

Sri vishnudharmothara Mahapuranam-1    Chapters