Sri vishnudharmothara Mahapuranam-1    Chapters   

నూటడెబ్బదియెనిమిదవ అధ్యాయము - తృతీయమన్వంతర వర్ణనము

శాంబరాయణీ : ఔత్తమస్య మునేః పుత్రాం స్తృతీయస్య నిబోధమే | ఆజశ్చ పరుశుశ్చైవ దేవ దేవో పృథోనయః ||

దేవా పృధశ్చాప్రతి మోమహోత్సాహో గజస్తథా | వినీతశ్చ సుకేతుశ్చ సుమిత్రః సుబలః శుచిః || 2

అతఃపరం ప్రవక్ష్యామి ఋషయస్సప్తవైతదా | రజోబాహూర్ధ్వ బాహూచ సవనశ్చానఘశ్చయః || 3

సుతపాఃశ క్తిరిత్యేతే ఋషయస్స ప్తకీర్తితాః | వశవర్తినః స్వధాసానో వశాసత్యహా మతార్దనాః || 4

వసువర్తిః సుధామానః వశాస్సత్యా ప్రతర్దనాః ||

పంచ దేవగణాః ప్రోక్తాః సర్వేద్వాదశకాస్తుతే | తేషాం సుచిత్తిర్నామ్నా భూచ్ఛక్రః పరపురంజయః || 5

అసంస్తస్యాసురా ఘోరా స్తదాదాయాద బాంధవాః | యేషామాసీద్భలీ రాజా ప్రలంబోనామ నామతః || 6

శక్రస్య విప్రియాసక్తం తం సముద్రాంబువాహినమ్‌ | మత్స్యరూపధరో విష్ణుః గ్రస్తవాన్‌ బలవత్తరమ్‌ || 7

కాలానలాభంతు విదేశశత్రుం రూపేణ మాత్స్యేన జగత్ర్పచారః |

జఘాన తం పర్వతకూటమాత్రం సముద్ర మధ్యేశరదాన తృప్తమ్‌ || 8

ఇతి శ్రీవిష్ణు ధర్మత్తరే ప్రథమఖండే మార్కండేయ వజ్రసంవాదే తృతీయ మన్వంతర వర్ణనంనామ అష్టసప్తత్యధిక శతతమోధ్యాయః.

శాంబరాయణి యిట్లనియె. ఔత్తమనునువు మూడవవాడు. అతని పుత్రులు అజుడు పరశువు దేవ దేవుడు పృధుడు నముడు, సాటిలేని దేవావృధుడు గజుడు వినీతుడు సుకేతుడు సుమిత్రుడు సుబలుడు శుచియనువారు ఇటుపైన నాసమయమున సప్తర్షులు. రజోబాహువు ఊర్ధ్వబాహువు సపనుడు అనమందు చయుడు సుతుడు శక్తి అనువారు వశవర్తులు స్వధాసానులు పశులు సత్యకరులు మతార్దనులు ననునైదు దేవగణములు. అందరును ద్వాదశకులు అనగా నొక్కొక్కగణమునందు పండ్రెడుగురున్నారన్న మాట. వారికి శత్రుంజయుడగు సుచిత్తియను వాడింద్రుడైయుండెను. వానికెందరో ఘెరులైన అసురులు జ్ఞాతులు బంధువులునుండిరి. వారికి రాజు బలశాలియగు ప్రలంబుడు ఇంద్రునికి విప్రియము సేయనున్న వానిని సముద్రజలముల వహించు నాబలవంతుని మత్స్యావతారమెత్తి విష్ణువు సంహరించెను. వాడు కాలానలతుల్యుడు విదేశశత్రువు పర్వతకూటమట్లున్న యా ప్రలంబుని శరదాన తృప్తుని సముద్రమునందు హరిచంపెను.

ఇది శ్రీవిష్ణుధర్మోత్తరమహాపురాణము ప్రథమఖండమున తృతీయమన్వంతరమను నూటడెబ్బదియెనిమిదవ అధ్యాయము.

Sri vishnudharmothara Mahapuranam-1    Chapters