Sri vishnudharmothara Mahapuranam-1    Chapters   

నూటడెబ్బదియవ అధ్యాయము - మాంధాతృ చరిత్ర

మార్కండేయః : ఆత్రాప్యుదాహర న్తీమ మితిహాసం పురాతనమ్‌ | ఫలమాసాద్య యద్గీతం దేవ వేశ్మోపలేపనే || 1

బభూవ శూద్రజాతీయః కశ్చిద్భాగ్య వివర్జితః | కృతవాన్‌ సతువాణిజ్యం ధనశేషేణ కేనచిత్‌ || 2

తస్మిన్‌ వివన్నే సకృషిం చకారనృపసత్తమ ! తస్యామపి విపన్నాయాం చక్రే సేవాం పునః పుః || 3

తతోప్యనాసాద్య ఫలం సిద్ధిం తీరము పాశ్రితః | గంగాయః సప్తమోభాగః సింధుర్నర వరోత్తమ! || 4

సీతతామల పానీయం స్వర్గలోక ప్రదాయతః | యత్రస్నాత్యా గతింయాన్తి బ్రాహ్మణాశ్చ తపస్వినః || 5

తస్యతీరే వరాహార్చా పురాణర్షి వినిర్మితా | తాం సమాసాద్య శూద్రస్తు నిత్యం భైక్ష్య వరాయణః || 6

నిత్యోపలేవన వరస్తదర్చాదేవ వేశ్మని | ఉవాస భార్యయా సార్ధం తత్రనిత్యాసురక్తయా || 7

ఏతస్మి న్నేవకాలేతు వరాహార్చాది దృక్షయా | సౌవీర రాజః సంప్రాప్త స్తందేశం చిత్రవాహనః || 8

సింధౌస్నానం సమాసాద్య పూజయిత్వాజగత్పతిమ్‌ | సభార్యం పృథివీ పాలః ప్రాయా ద్రాజన్‌ ! యథాగతమ్‌ || 9

శ్రియం తస్యతు తాందృష్ట్వా సశూద్రో భార్యయా సహ | భూపాలత్వ స్పృహాం కృత్వాకాలా త్కాల వశం గతః || 10

వనాత్‌కాష్ఠా న్యుపాహృత్య కృత్వా భర్తుస్తతశ్చితిమ్‌ | అన్వారురోహ తంభార్యా శూద్రం పంచత్వమాగతమ్‌ || 11

సశూద్రో భార్యయా సార్ధం నాక పృష్ఠమితో గతః | సతతం ధర్మశీలస్తు దేవ వేశ్మోప లేపనాత్‌ || 12

దేవాలయోపలేపనము సేసి ఫలమంది కీర్తి గాంచిన వాని పురాత నేతిహాసమును మహానుభావులుదాహరించి రది వినుమని మార్కండేయుడిట్లు తెలుపదొడంగె. ఒక శూద్రజాతీయుడు భాగ్యములేమి నేదోయించుక మిగిలిన ధనముతో వర్తకమారంభించెను. ఆర్తకము దెబ్బతినగా కృషి (వ్యవసాయము) సేసెను. అదికూడ నష్టముకాగా మాని దాన్యముసేసెను. దాని వలన ఫలము లేక సిందు నదీతీరమును జేరెను. సింధునది గంగయొక్క సప్తమభాగము. అందలి నీరు స్వచ్ఛమయినది. చల్లనిది. పానార్హము. అది స్వర్గప్రదము. అందుస్నానముసేసి బ్రాహ్మణులు తపశ్శాలురు నుత్తమ గతికేదుదురు. ఆ సింధు తీరమునందు వరాహస్వామి పూజ విశిష్టమని పురాణములందు జెప్పబడినది. ఆ శూద్రుడాపూజను నిత్యము సేయుచు భైక్ష్యముందినుచు నాదేవాలయోప లేపనము సేయుచుండెను. తనయెడ నెడములేని యనురాగముగోన్న భార్యతో నక్కడతడు వసించెను. ఇదే సమయమున సౌవీరరాజు చిత్ర వాహనుడా వరాహార్చనము దిలకింప నచ్చోటికి వచ్చెను. అతడు సింధువున స్నానము సేసి జగత్పతిని పూజించి భార్యతో వచ్చిన దారిం దన నగరమున కేగెను. శూద్రాడారాజు సంపదగని భార్యతోగూడ తనను రాజుగావలెనను కోరిక గొని కొంతకాలమునకు కాల వశుండయ్యెను. వాని యిల్లాలడవి నుండి కట్టెలుగొని వచ్చి చితిపేర్చి వానితో సహగమనము సేసెను. ఆ శూద్రుడింతితో నిట నుండి నా కపృష్ఠ మధిరోహించెను. ధర్మశీలుడై నిరంతరము హరియాలయోప లేపనము సేయుట వలన నిట్టి సుగతి నందెను.

ఏతస్మి న్నేపకాలే తు యువనాశ్వో మహీపతిః | విష్ణుం సంపూజయామాస పుత్రీయేణ వ్రతేనతు || 13

రాజ్ఞస్తస్య వ్రతస్యాన్తే స్వప్నే ప్రాహ జనార్దనః | భార్గవం చ్యవనం గచ్ఛ తతః పుత్రమవాప్స్యసి || 14

యువనాశ్వ స్తథో క్తస్తు స్వప్నే దేవేన చక్రిణా | ప్రాతః పద్భ్యాం య¸° తస్యచ్యవనస్యాశ్రమం శుభమ్‌ || 15

సంపూజయిత్వా చ్యవనం, చ్యవనేనచ పూజితః | ప్రతస్వప్నా వుభౌ తస్య జగాద నృపసత్తమః || 16

ఋషిసంఘాను పాదాయచ్యవనోపి మహాతపాః | అవిజ్ఞాతం నరేంద్రేణ పుత్రీయం కృతవాన్‌జలమ్‌ || 17

కలశస్థల జలం తచ్చ స్థాపయామాస భార్గవః | తతోనిశీథే సంప్రాప్తే తృషార్త సమహీపతిః || 18

ఋషిమధ్యేతు సంసుప్తా నృషీన్‌ వాక్య మథాబ్రవీత్‌ | తృషార్తోస్మి భృశం విప్రాః! పానీయం మేప్రయచ్ఛత! 19

ఋషిస్తస్య నశుశ్రావ కశ్చిద్భావ్యర్థ చోదితః | తతః ఖిన్నో మహీపాలః కలశస్థజలం వపౌ || 20

ఇదే సమయమున యువనాశ్వ మహారాజు పుత్రులు కలుగగోరి వ్రతమూని విష్ణువుం బూజించెను. వ్రతోద్యాపన మందాతని కలలో హరి భార్గవుడైన (భృంగువంశీయుడైన) చ్యవనుని దరికేగుము. అటుపై పుత్రునిం బడయుదువనియె. కలలో జక్రి వలన నామాట విని యా రాజు పాదచారియై చ్యవనుని పుణ్యాశ్రమమున కేగెను. అమ్మునింబూజించి యమ్మునిచే బూజితుడై నృపసత్తముడు తనపుత్ర నిమిత్త వ్రతము స్వప్నవృత్తాంతమును విన్నవించెను. చ్యవన మహర్షియు ఋషుల వెంటనిడికొని రాజెఱుంగని పుత్రలాభముగూర్చు జలమును కలశమందు నింపి యట నుంచెను. ఆ రాత్రి రాజు దప్పికగొని మునుల నడుమ నిదురించు ఋషులతో మిక్కిలి దప్పికగొంటిని నాకు మంచినీళ్ళిండన నందొకడున నందొకడును నాతని పలుకులు కాగలకార్యము యొక్క ప్రేరణచే వినడయ్యె. దాననాతడు భిన్నుడై యట కలశమందున్న నీరు ద్రావి నిద్రించెను.

పీత్వాసుష్వాన ఋషయః ప్రాతః సర్వే సముత్థితాః | అపశ్యమానాః కలశం పప్రచ్ఛుస్తే పరస్పరమ్‌ || 21

పుత్రీయం కలశం రాజ్ఞః కృతం యత్తద్గతం క్వను | తదోవాచ నరాజేంద్ర స్తానృషీన్‌ సంశిత వ్రతాన్‌ || 22

తృషార్తేన మయాపీతః కలశస్త్వప వాహితః | తేహోచుస్తం నృపశ్రేష్ఠం భావ్యం కర్మకృతం త్వయా || 23

భార్యాపీత్వైవ తత్తోయం పుత్రంతేజన యిష్యతి | ఇత్యేవం మంత్రకలశః సోస్మాభిః భూపతే! కృతః || 24

పుత్రీయ ముదకం తచ్చత్వయా పీత మబుద్ధినా | తస్మాత్తమేవ తనయం స్వకుక్షౌ జనయిష్యసి || 25

నావాప్స్యసితథా మృత్యుం వరదానాద్ద్విజన్మనామ్‌ | ఏవముక్తస్తు సంపూజ్య బ్రాహ్మణాన్‌ స్వగృహంగతః || 26

ఋషులెల్లరు వేకువ మెలకువగని యాకలశముంగానక యొండొరుల నడిగికొనిరి పుత్రీయకలశమిది రేనికొరకు నుద్దేశించినది. ఏమైనది? అనివారనుకొనుచుండ తీక్ష్నవ్రతనిష్ఠులగు నమ్మునులతో నా నృపాలుడు అకలశముంగైకొని దప్పికయై నందలి జలమేను ద్రావితిననియె వారు నా రాజుంగని కాగలపని నీవుసేసితివి. నీభార్య యాజలము త్రావి నీకై కుమారునిం గనగలదని మేమీ మంత్రకలశము నీకొఱకేర్పరచితిమి. తెలియక నీవా పుత్ర జననార్హమైన యుదకము త్రావితివి. అందువలన నీవే తనయుని నీకడువునం గనగలవు. ద్విజోత్తముల పరదానముచే నటుజరిగినది నీవు మృత్యువందవు. అని పలుకవిని యారేడు బ్రాహ్మణులం బూజించి గృహమునకేగెను.

రాజ్ఞః కుక్షిం వినిర్భిద్య జజ్ఞేబాలార్కసన్నిభః | పునః పుత్రవతాం శ్రేష్ఠ! శూద్రోసౌ నాకవిచ్యుతః || 27

జాతమాత్రస్య తస్యేంద్రో దదౌప్రాదేశినీం ముఖే | ఆసాద్యయాం సబాలత్వం శిశుస్తత్యాజ తత్‌క్షణాత్‌ || 28

కుక్షిం వస్పర్శరాజ్ఞస్తు రాజసింహ శతక్రతుః | రాజా శక్ర పరామృష్టో విజ్వరశ్చాప్రణోభవత్‌ || 29

యువనాశ్వః సతస్యాపి నామచక్రే శతక్రతుః | మాంధాస్యతీత మాంధాతా ఖ్యాతిం త్రిభువనేగతః || 30

తమావివేశ భగవాన్‌ తేజసాస్వేన మాధవః | సాపిస్వర్గచ్యుతా భార్యా తస్య శూద్రస్య యాదవ! || 31

కాశిరాజ సుతాజాతా భీమవేగస్య మానద! | నామ్నా ప్రభావతీ సుభ్రూ సై#్తలోసైక్యసుందరీ || 32

యువనాశ్వస్తు తాంవవ్రే మాంధాతుర్లక్షణాన్వితామ్‌ | సరాజా ప్రదదౌ తాంతుమాంధాథుశ్చిత్రవాహనః || 33

ఏకైవ భార్యాసాతస్య బభూవాత్యంత సుందరీ | రూప¸°వన సంపన్నా ప్రాణభ్యోపి గరీయసీ || 34

కృత్వోద్వాహ మయోధ్యాయా మభిషిచ్యసతం నృపమ్‌ | యువనాశ్వోవనం ప్రాయాద్వనాదపి త్రివిష్టపమ్‌ || 35

రాజ్యస్తోపి సమాంధాతా త్రైలోక్యం సప్తభిర్దినైః | రథేనైకేన వశగంచకార ఖడ్గదర్పితః || 36

పాతాళే గగనేశైలే సముద్రేచ మహాత్మనః || అసీత్తస్యాప్రతిహతా గతిశ్చక్రస్య పార్థివ! | 37

చక్రవర్తీ సధర్మాత్మా వైష్ణవశ్చ తథాభవత్‌ | సమాయుతానాం బుభుజే సరాజ్యం దశమానద! || 38

బ్రహ్మాండ మండపం యావత్‌ సూర్యస్తపతిరశ్మిభిః | తావత్‌క్షేత్రం మహీభర్తుః యువనాశ్వస్య కీర్త్యతే || 39

ఏవం సరాజా విజితారి పక్షో దేవాజిరా తేపనకృత్‌ బభూవ ||

భార్యా చసాతస్య బభూవ భార్యా | లోకే వరిష్ఠా ప్రమదా పరాభ్యః || 40

ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ప్రథమఖండే మార్కండేయవజ్ర సంవాదే మాంధాత్రుపాఖ్యానంనామ సప్తత్యధిక శతతమోధ్యాయః.

రాజుకడుపుంజీల్చుకొని బాలసూర్యడట్టి బాలుడుదయించెను ఆ పుట్టినవాడు స్వర్గమునుండి జారిన యీశూద్రుడు. పుట్టగనే యాశిశువు నోట నింద్రుడు చూపుడువేలు గుడిపెను. అదిగుడిచి యాశిశువాక్షణమ బాలత్వముం బాసెను. శతక్రతువు (ఇంద్రుడు) రాజుయొక్క కుక్షిని స్పృశించెను దాన నారాజు ప్రసవవేదనయుమరియే బాధయులేనివాడయ్యెను. ఇంద్రుడాబాలునికి యువనాశ్వుడను పేరుపెట్టెను. మాంధాస్యతి - నన్నుకడుచుకొనుచున్నాడని ఇంద్రు డనుటంబట్టి యతడు ముల్లోకమల మాంధాత యనుపేరునందెను. మాధవుడా మాంధాతను దనతేజముచే నావేశించెను. ఆశూద్రుని భార్య స్వర్గమునుండి జారినది కాశిరాజు భీమవేగుని కూతురై పుట్టి ప్రబావతియను పేరంది త్రిలోకసుంరియై రూప¸°వన సంపన్నయైయుండెను. యువనాశ్వుడామెను మంధాత కిమ్మని వరించెను. చిత్రవాహన మహారాజామెను మాంధాత కొసంగెను. అతనికామెయొక్కతెయే భార్య. పరమసుందరి రూప¸°వనసంపన్న ప్రాణముకంటె మిన్నయై యుండెను. యువనాశ్వుడు వారికిగల్యాణముగావించి అయోధ్యయందతని పట్టాభిషేకించి వనమేగెను. వనమునుండి త్రివిష్టపమునకు (స్వర్గమునకు) జనియె. ఆమాంధాత చక్రవర్తి కత్తిచే దర్పమెత్తి యొక్కరథమున నేడు రోజులలో ముల్లోకములను స్వాధీనము సేసికొనెను. ఆ మహాత్మునికి పాతాళమున గగనమందు శైలమున సముద్రమందున ప్రతిహత చక్రగతి యేర్పడెను. అందుచే నతడు చక్రవర్తి యయ్యెను. ఆ ధర్మాత్ముడు విష్ణుభక్తుండునయ్యె. అతడు నూరుయేండ్లాతడు రాజ్యమనుభవించెను. సూర్యుడు తన కిరణములచే నెంతదాక యీ బ్రహ్మాండమండపము వెలిగించు నంతదాక యువనాశ్వునికి క్షేత్రయూ కీర్తింప బడినది. ఇట్లు రాజుహరియాలయసమ్మార్జనము సేసి విజతారయై తేజరిబిల్లెను. అతని భార్యయు సర్వభామినీ పరిష్ఠయై యాతని భార్యయయ్యె.

ఇది శ్రీ విష్ణుధర్మోత్తర మహాపురాణ మందు ప్రథమఖండమున మాంధాతృ చరితమను నూటడెబ్బదియవ అధ్యాయము.

Sri vishnudharmothara Mahapuranam-1    Chapters