Sri vishnudharmothara Mahapuranam-1    Chapters   

నూట అరువదియారవ అధ్యాయము - దీపదానప్రశంస

వజ్రఉవాచ : మహావర్తిప్రదానస్య యత్ఫలం కురునందన! | తన్మమాచక్ష్వం తత్త్వేన విధిం కాలంతథై వచ || 1

మార్కండేయ ఉవాచ : మహావర్తిః సదాదేయా భూమిపాలమహాఫలా! | కృష్ణపక్షేవిశేషేణ తత్రాపిచ విశేషతః || 2

అమావాస్యాచనిర్దిష్టాద్వాదశీచమహాఫల|అశ్వయుజ్యామతీతాయాం కృష్నపక్షస్యయాభ##వేత్‌ || 3

అమావాస్యాతదా పుణ్యాద్వాదశీవా విశేషతః | దేవస్యదక్షిణపార్శ్వే దేయాతైలతులానృప! || 4

పలాష్టకయుతాం రాజన్‌ వర్తిం తత్రతు దాపయేత్‌ | మహారజనరక్తేన సమగ్రేణ తువాససా || 5

వామపార్శ్వేచదేవస్యదేయాఘృతతులానృప | పలాష్టకయుతాం శుక్లాం వర్తింతత్రతుదా పయేత్‌ || 6

వాససాతు సమగ్రేణ సోపనా సోజితేంద్రియః | మహావర్తిద్వయమిదం సకృద్దత్వామహీవతే || 7

స్వర్లోకం సుచిరంభుక్త్వాజాయతే భూతలే యదా | తదాభవతిలక్ష్మీవాన్రూపసౌభాగ్యమాశ్రితః || 8

రాష్ట్రేచజాయతేయస్మి న్రాష్ట్రేచ నగరేథవా | కులేచరాజాశార్దూల! తత్రస్యాద్దీవవత్ప్పభా || 9

అత్యుజ్జ్వలశ్చ భవతి యుద్ధేషు కలహేషుచ | ఖ్యాతిం యాతితథాలోకే సజ్జనానాంచసద్గుణౖః || 10

ఏకామప్యథయోదద్యా దభిష్టమనయోర్ద్వయోః | మానుష్యే సర్వమాప్నోతి తదుక్తంతేమయానఘ! || 11

స్వర్గేతథార్ధమాప్నోతి భాగంకాలంచ యాదవ! సామాన్యస్యతుదీపస్య రాజన్దానే మహత్ఫలమ్‌ || 12

కింపునర్మమతోయస్య ఫలస్యాంతోనవిద్యతే | దీపదానం పరం పుణ్యం అన్యలోకేష్వపి ధ్రువమ్‌ || 13

కింపునర్దేవదేవస్య త్వనంతన్యమహాత్మనః | గిరిశృంగేషు దాతవ్యానదీనాం పులివేషుచ || 14

చతుష్ఫథేషు రథ్యాసు బ్రాహ్మణానాంగృహేషుచ | వృక్షామూలేషు గోష్ఠేషు కాంతారగహేనేషుచ || 15

దీపదానేన సర్వత్ర మహాఫలము పాశ్నుతే | యావంత్యక్షినిమేషాణి దీపః ప్రజ్వలితోనృప ! 16

తావంత్యేవస రాజేంద్ర! వర్షాణిదివి మోదతే | దీపదానేన రాజేంద్ర! చక్షుష్మానిహజాయతే || 17

రూపసౌభాగ్యయుక్తాశ్చ ధనధాన్య సమన్వితాః | దీపమాలాం ప్రయచ్ఛంతి యేనరాఃశార్గిణోగృహే || 18

భవంతితే చంద్రసమాః స్వర్గమాసాద్యమానవాః | దీపాగారం నరః కృత్వాకూటాగారని భంశుభమ్‌ || 19

కేశవాలయమాసాద్య నాకేభాతిసశక్రవత్‌ | యథోజ్జ్వలః సదాదీపోదీవదాతా పియాదవ || 20

తథానిత్యోజ్జ్వలోలోకే నాకభ్రష్టోభిజాయతే | సమీపేతుయథాలోకే చక్షూంషిఫలవంతిహి || 21

తథాదీపస్య దాతారోభవంతి సఫలేక్షణాః | యథైవోర్థ్వ గతిర్నిత్యం రాజన్దీవశిఖాశుభా || 22

దీపదాతు స్తథైవోర్ధ్వగతి ర్భవతిశోభనా | తస్మాత్సర్వ ప్రయత్నేన దీపాదేయానరేశ్వర! || 23

మహావర్తి ప్రదానమువలని ఫలము తద్విధానము నానతిమ్మని వజ్రుండడుగ మార్కండేయుడిట్లనియె. రాజా! ఎల్లపుడు మహావర్తి దీపదానము సేయదగినది. అది విశేషఫలప్రదము. అందులకు అమావాస్య ద్వాదశి కార్తిక కృష్ణపక్షమునందు దీనికి విశేషించి చెప్పబడినవి. విష్ణువునకు కుడివైపు తైలతుల యేర్పరచి యెనిమిది వలముల తూకముగల వర్తి మహారజనముచే =కుంకుమ పువ్వుచే నెఱ్ఱనై నవస్త్రముతో నదిచేయవలెను. నేతితోపెట్టు దీపము దేవునికెడమవైపుంచవలెను. దానిలోగూడ యెనిమిది పలముల వర్తిని వేయవలెను. ఆ దీపముపవాసముండి పెట్టవలెను. రాజా! ఈ మహావర్తులు రెండు నొక్కమారేని యుంచినయతడు చిరకాల స్వర్గభోగ సౌభాగ్యమంతుడునై పుట్టును. అతడేరాష్ట్రమందే దేశమందే నగరమందే కులమందు పుట్టునో ఆ రాష్ట్రములందు దీపప్రభ యలముకొనును. వానిదీప్తి యుద్ధములందు కలహములందు మిక్కిలిగబ్రకాశించును. సత్పురుష సమాజములందెనలేని కీర్తినందును. ఓ పుణ్యశీలీ ! ఈ దీపమొక్కటి పెట్టినను నీ చెప్పిన సర్వఫలము బడయును. సామాన్య దీపదానముచేతనే స్వర్గమునందర్ధబాగము చెప్పినకాలములో సగముకాలము సుభించునని యుండగా సమగ్రముగా నీరెండుదీపములు దానము సేయుటవలని ఫలమేమిచెప్పవలెను? ఆ గలుగు ఫలితమునకు నంతేలేదు. ఇది నిశ్చయము. అనంతమూర్తి విష్ణునకేదీప మద్రిశిఖరములందు నదీపులినములందు (నదీ తీరమందలి యిసుకతిన్నెలమీద) నాల్గుబాటలు కలిసిన కూడలియందు రాజవీథులందు బ్రాహ్మణ గృహములందు చెట్లమొదళ్ళయందు గోశాలలందు అడవులలో గహనములలో నీ దీపదానము పెట్టునాతడు మహాఫలమందును. ఎన్నిరెప్పపాట్లకాలము దీపముపెట్టునో యన్ని సంవత్సరములాదీపదాత స్వర్గమందానందించును. దీపదానముచే నరుడు చక్కనికన్నులు కలవాడగును. విష్ణువు నాలయ మందు నా దీపమాలికల నొసంగిన మానవులు రూపసౌభాగ్య ధనధాన్యసమృద్ధి గలవారుగుదురు. వారు స్వర్గమంది చంద్రునట్లు భాసింతురు. విష్ణ్వాలయమందు రాజసభాకూట బావనమందు దీపాగారము నిర్మించినాతగు స్వర్గమందిండ్రుడట్లు దీపించును. పెట్టినదీపమెంతప్రకాశమానముగ నుండునో పెట్టినయాతడు నట్లుప్రకాశించును. స్వర్గమందుండి యవనికి దిగియు నాతడట్టే దీపించును. దీపముదరిం గన్నులుచక్కగ ప్రకాశించినట్లు దీపదాతకన్నులు నిత్యము సముజ్వలములై యుండును. చక్కనిదీపశిఖయెట్లు నిత్యము భైకిప్రసరించుచుండునుగాన దీపదాత తనకూర్ధ్వగతి గల్గుటకు దీపదానము సేయవలెను.

అశ్వయుజ్యామతీతాయాం యవద్రాజేంద్రకార్తికీ | తావద్దీవ ప్రదస్యోక్తం ఫలంరాజన్విశేషతః || 24

తావత్కాలం ప్రయచ్ఛంతి యేతుదీపంసదానిశి | తుంగేదేశే మహత్తేషాం బహిః పుణ్యఫలంభ##వేత్‌ || 25

యస్యాంధకారేగహ నేప్రాకాశ్యంతేనజాయతే | ప్రాకాశ్యేయదుశార్దూలా! తేనయాంతి హితత్సుఖమ్‌ || 26

శ్రవణదీపకందత్వా నదీద్వితయ సంగమే | తేజస్వీచయశస్వీచ రూపవానభిజాయతే || 27

దీపానదీషు దాతవ్యాః కార్తిక్యాంచ విశేషతః | అశ్వయుక్కృష్ట పక్షస్యయాతు పంచదశీభ##వేత్‌ || 28

బిల్వద్వారేషుదాతవ్యా స్తథా దీపాయథావిధి | అన్యత్రా పితథాదీపైర్మహత్పుణ్యఫలం లభేత్‌ || 29

శ్రవణద్వాదశీయోగే కృష్ణ పక్షేతథైవచ | ఘృతేనదీపా దాతవ్యాస్తిలైర్వాయదునందన || 30

ఆశ్వయుజముగడచిని కార్తికమాసము నెలరోజులు రాత్రితప్పక దీపదానము సేసినవానికి, అందులోగూడ ఎత్తైన కొండ శిఖరము మొదలైన బయలున దీపము పెట్టినగల్గు ఫలమనంతము. అంధకారమున గహనమున నెంతవెలుగు కల్గునో యంతగ నా దీపదాత సుఖము తేజస్సును బొందును. నదీసంగమ తీర్థమునందు నదీతీరములందు దీపముపెట్టుట మిక్కిలివిశేషము. అశ్వయుజ బహులామావాస్యనాడు నేతితోగాని నూనెతోగాని దీపముపెట్టవలెను. యథావిధిగ నా దీపములు బిల్వద్వారములందు (మారేడువనము ద్వారములందు) లేదా మారేడుకర్రతో జేసిన ద్వారములందు పెట్టుట చాలవిశేషము. మహాఫలప్రదము.

వసామజ్జాదిభిర్దేయా నతుదీపాః కథంచన | దత్వాదీపం సకర్తవ్యం తేన కర్మ విజానతా || 31

నిర్వాపణంచ దీపస్య హింససంచ విగర్హితమ్‌ | యఃకుర్యాత్తేన కర్మాణి తేనాసౌపుష్పితేక్షణః || 32

దీపహర్తాభ##వేదంధః కాణోనిర్వా పకోభ##వేత్‌ | దీపదానాత్పరం దాన నభూతం నభవిష్యతి || 33

దీపదానంతు కర్తవ్యం విప్రవేశ్మసు పండితైః | ద్విజవేశ్మని యోదద్యాత్కార్తికే మాసిదీపకమ్‌ || 34

అగ్నిష్టోమఫలంతస్య ప్రవదంతిమనీషిణః | ప్రాణిజాం నీలరక్తాంచదీపేవర్తిం విర్జయేత్‌ || 35

విశేషేణ ప్రదాతవ్యా పద్మసూత్ర భవానృప! | పద్మసూత్రోద్భవాం వర్తింగంధతైలేన దీపకే || 36

విరోగః సుభగశ్చైవ దత్వా భవతి మానవః | దాతవ్యం దేవదేవస్య కర్పూరేణచదీపకమ్‌.

అశ్వమేధ మవాప్నోతికులంచైవ సముద్ధరేత్‌ |

ఏతన్మయోక్తంతవ దీపదానే ఫలం సమగ్రంయదువంశచంద్ర!

శ్రుత్వాయథావ త్సతతంతుదేయా దీపాస్త్వయా విప్రసురాల యేషు || 38

ఇతి శ్రీవిష్ణు ధర్మోత్తరే ప్రథమఖండేమార్కండేయ వజ్రసంవాదే దీపదానప్రశంసానామషట్‌ షష్ట్యధిక శతతమోధ్యాయః.

వసతో మజ్జతో (కొవ్వు డాల్డా మొదలయినవి) దీపముబెట్టరాదు. తెలిసినవాడాతీపములు పెట్టి కర్మానుష్ఠానము సేయరాదు. దీపమును దగ్గించుట అర్పుట చాలనింద్యము. అపనిచేసిన వానికి కండ్లలో పువ్వులువేయును. దీపము హరించినవాడంధుడగును. అర్పినవాడు మెల్లకంటివాడగును. దీపదానమునుమించిన దానమింతమున్ను లేదు. మందుండదు. తెలిసినవారు బ్రాహ్మణుల యిండ్ల దీపదానము సేయవలెను. ద్విజునియింట కార్తికమందు దీపమునిచ్చిన వాడగ్నిష్టోమ యాగఫలమందును. ప్రాణిజము (ఉన్నితో చేసినది) నల్లనిది ఎర్రనిది వర్తి పనికిరాదు పద్మసూత్రముతో జేసినవర్తి (తామరతూటిదారముతో జేసినదన్నమాట) గంధతైల ముతో గూర్చిపెట్టిన దీపమువలన విరోగుడు సుఖగుడు (సుందరుడు) నగును. దేవదేవుని కర్పూరదీపము పెట్టినవాడశ్వమేధ ఫలమందును. కులోద్ధరణము చేయును ఓ యదువంశచంద్రా ! దీపదానఫలమది సమగ్రముగ నీకుదెల్పితిని. దీనిని నీవు విప్రగృహము లందే దేవాలయములందును నిత్యదీపమొసంగును.

ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణము ప్రథమఖండమున దీపదానప్రశంసయను నూటయరువదియారవ అధ్యాయము.

Sri vishnudharmothara Mahapuranam-1    Chapters