Sri vishnudharmothara Mahapuranam-1    Chapters   

నూటఅరువదిరెండవ అధ్యాయము - పిశాచమోక్షణ శ్రవణద్వాదశీ వర్ణనము

మార్కండేయ ఉవాచ : 

అత్రాప్యుదాహరంతీమమితిహాసంపురాతనమ్‌ | మహత్యరణ్య యద్వృత్తం భూమిపాల పురాతనమ్‌ || 1

దేశా దాశేరకానామ తేషాం భాగేతు పశ్చిమే | అస్తిరాజన్మరుర్దేశః సర్వసత్త్వభయంకరః || 2

సుతప్తసికతా భూమిర్యత్రదుష్ట మహోరగా | స్వల్పచ్ఛాయా సమాకీర్ణామృత ప్రాణిసమాకులా || 3

శమీఖదిరపుల్లాస కరీరాః పైలుభిస్సహ | తత్రభీమాద్రుమగణా కంటకైరావృతాః సమమ్‌ || 4

చండప్రాణిగణాకీర్ణా తత్రభూమిస్తథాక్వచిత్‌ | అత్యంతతావవిషమా నిస్తృణా పరుషోపలా || 5

నాశ్రయ స్తత్రనా హారోజ్వలితాగ్ని సమేభృశమ్‌ | తథాపిత త్రజీవంతిజనాః కర్మనిబంధనాత్‌ || 6

నోదకం నోదకధరా రాజం స్తత్రవలాహకాః | కదాచిదపిదృశ్యంతే దేశేనిరయసంనిభే || 7

తత్రపక్షాంతరతతైస్తృషితైః శిశుభిః సహ | ఉత్ర్కాంత జీవితా రాజన్దృశ్యంతేథవిహంగమాః || 8

ఉత్ల్పుత్యోత్ల్పుత్య సహసామృగాః సైకతమాలయాత్‌ | సైకతేష్వేవనశ్యన్తి జలేసైకతసేతువత్‌ || 9

తస్మింస్తథావిధేదేశే కశ్చిద్దైవవశాద్వణిక్‌ | వనమాతపవిభ్రష్టః ప్రవిష్టస్తుపరిభ్రమన్‌ || 10

ఈ సందర్భములో నొకయితిహాసముగలదది యొకమహారణ్యములోజరిగినది. రాజా వినుమని మార్కండేయుడిట్లు తెలుపనారంభించిరి. దాశేరక దేశములకు బడమట భాగమందు మరుదేశమున్నది. అది సర్వజంతుభయంకరము. అందలి యిసుక మిడమిడ గాలుచుండును. మహాసర్పములట గానిపించును. అయ్యెండమావులలో నీడ అతిస్వల్పము. ఎటజూచిన చచ్చిన జీవములే. జమ్మిచండ్ర పుల్లాసము కరీరములు (దురదగొండి) పైలువులు ననునవక్కడ కనుపించు భయంకర వృక్షాటవులు. ముండ్లతో నిండినవి. అందొక్కచోటు క్రూరమృగములకు నెలవు. అది అత్యంతతాప విషమ దేశము. గడ్డిపోచ గనిపింపదు. కరకురాళ్ళెటుచూచిన. అట నిలువనీడ తినతిండి లభింపదు. మండుచుండు నగ్ని యట్లది యుండును. అయిననుప్రారబ్ధకర్మవశులైన ప్రాణులు కొందరట బ్రతుకుచున్నారు. నీరులేదు. నీరుధరించు నీరధరములు మబ్బులు నట నెన్నడుం గనిపింపవు. అదియొక నిరయము (నరకము) అక్కడ రెక్కలురాని మిక్కిలి దప్పికంగుములు పిల్లల రెక్కలచాటున నదిమికొని ప్రాణములు వాసిన పక్షులట గాన వచ్చుచుండును. జంతువులు తమ నివాసములనుండి యయ్యిసుకపై దూదూకి యా యిసుకలోనే యిసుకతో వేసిన వంతెన నీట మునిగినట్లందే ప్రాణములు వాయుచుండును. అవిధమైన యాతావున దైవవశమున నొక వర్తకుడెండకు గుమిలి యట్టిటులఱ్ఱాడి యక్కడ కడుగిడెను.

సతత్రదదృశేప్రేతాన్షుత్తృష్ణావ్యాకులేంద్రియాన్‌ | ఉత్కచాన్మలినాన్రూక్షాన్ని ర్మాంసాన్భీమదర్శనాన్‌ || 11

స్నాయుబద్ధసిరాకాయాన్‌ ధావమానానిత స్తతః | కంచిత్సమాంసంత త్రైకం ప్రేతస్కంధగతంతథా || 12

దదర్శబహుభిః ప్రేతైః సమంతాత్పరివారితమ్‌ | తత్స్కంధాద పరంస్కంధం నీయమానం క్రమాత్ర్కమాత్‌ || 13

ప్రేతోపిదృష్ట్వాతాం ఘోరామటవీం నరమాగతమ్‌ | ప్రేతస్కంధాన్మ హీంగత్వా తస్యాంతికము పాగమత్‌ || 14

సోభివాద్య వణిక్ర్శేష్ఠమిదం వచనమబ్రవీత్‌ | అస్మిన్ఘో రేమహారణ్య ప్రవేశో భవతః కథమ్‌ || 15

తమువాచమవణిగ్ధీమన్సార్ధ భ్రష్టస్యమేవనే | ప్రవేశోదైవ యోగేన పూర్వకర్మకృతేనతు || 16

తృష్ణామే బాధతేత్యర్ధం క్షుత్షామశ్చభృశంతథా | ప్రాణాఃకంఠ మను ప్రాప్తావదనం భ్రశ్యతేచమే || 17

ఆత్రోపాయం నపశ్యామి ధ్రియేహం యేనకేనచిత్‌ | ఇత్యేవముక్తః పేతస్తు వణిజం వాక్యమబ్రవీత్‌ || 18

అతడక్కడ ప్రేతములను దప్పికగుములునింద్రియములతో జుట్టువిరబోసికొని మలినములు రూక్షములు(భయంకరములు) మాంసమెండి బక్కచిక్కిన జీవులను ప్రేవుల కట్టుబాటున మాత్రమే నిలిచియున్న మేనులతో నట్టిటుచెదరిపారు ప్రాణులను జూచెను. అనేక ప్రేతములు చుట్టువారుకొన నొక్కప్రేతము మూపుననున్న యొక మాంసము చేతకొనియున్న ప్రేతమొకానొకని నా వర్తకుడు సూచెను ఒకప్రేతము మూపునుండి వేరొకప్రేతము మూపున కానరుడందింప బడుచుండెను. ఆ ప్రేతముగూడ యా ఘోర దుర్గమారణ్యమున కేతెంచి యీ నరునింగని యా మూపునుండి యవనికురికి యా ప్రేత మీ వణిగ్వరునికి మ్రొక్కి ఈమహాఘోరాటవిలో నీకు బ్రవేశ##మెట్లయ్యె ! ననియడుగ బుద్ధిమంతుడా వర్తకుడు మా వర్తకుల గుంపునుండి దారితప్పి దైవయోగమన బూర్వకర్మవశమున నిట బ్రవేశించితిని. మిక్కిలి దప్పికగొన్నాను. ప్రాణములు కంఠగతములయినవి. మొగమెండినది. ఎట్లాగైన బ్రతుకుదమన్న నిటనేయుపాయము గనిపింపకున్నదనవిని యాప్రేత మావర్తకుని కట్లనియె.

పున్నాగమిమమాశ్రిత్య ప్రతీక్షస్వక్షణం మమ | కృతాతిథ్యో మయాయావద్గమిష్యసి యథాసుఖమ్‌ || 19

ఏవముక్త స్తదాచక్రే సవణిక్తృష్ణయాన్వితః | మధ్యాహ్న సమయేప్రాప్తే ప్రేతస్తందేశమాగమత్‌ || 20

పున్నాగవృక్షాచ్చీ తోదాం వారిధానీం మనోరమామ్‌ | దధ్యోదన సుయుక్తేన వర్ధమానేన సంయుతామ్‌ || 21

అవతార్య తతస్త్వగ్రంప్రదదాతిచ యత్తదా | తతోగ్రమాత్రేణ వణిక్పరాం తృప్తిముపాగతః || 22

వితృష్ణో విజ్వరశ్చైవం క్షణన సమపద్యత తతః ప్రేతేషు సర్వేషు క్రమాద్భాగంతదాదదౌ || 23

దధ్యోదనాత్సపానీయా త్తేపితృప్తిం పరాంయయుః | అథసంతర్పయిత్వాతు ప్రేతాంస్తాంత్సతు సర్వశః || 24

ప్రేతాధిపః సబుభుజే పశ్చాదన్నం యథాసుఖమ్‌ | తస్యభుక్తవతస్త్వన్నం పానీయంచక్షయంయ¸° || 25

ప్రేతాధిపంతతస్తృప్తం వణిగ్వచనమబ్రవీత్‌ |

ఇదుగో యీ పున్నాగమునీడ నొక్కక్షణము నిరీక్షింపుము. నావలన నాతిథ్యము వడసి సుఖముగ నేగుదువు గాక. అనవిని యావణిజుండట్లసేసెను. మధ్యాహ్నం మగునంతకు ప్రేతమటకువచ్చి యా చెట్టుమీదినుండి చల్లనినీటి చక్కని కూజాను దానితో బాటు దధ్యోదనమునిండిన వర్ధమానముంగూడ క్రిందికి దింపెను. అట్లుదింపి (అగ్రమును) తొలిమద్ద నాతనికిం బట్టెను. అయ్యగ్రకబళమాత్రమున నావణిజుండెంతేని తృప్తిసెందెను. క్షణములో దప్పికవాసెను. తాపమువాసెను. అవ్వల నటగూడిన ప్రేతము లన్నింటికిం గ్రమముగ నందు భాగము పెట్టెను. అవికూడ ఆ దధ్యోదనమువలన నా చల్లని మంచినీటను దృప్తిపడినవి. అట్లాతడా ప్రేతములననన్నింటిని దృప్తిపరచి యాప్రేతాధిపతి తానును నాయన్నమును సుఖముగ నారగించెను. అతడు దిన్నంత త్రివినంత నా తెచ్చిన యన్నము పానీయము మిగులకుండ యైపోయెను. అవ్వల దృప్తుడైన యా ప్రేతరాజుంగని వణిజుండిట్లనియె.

ఆశ్చర్యమేతత్పరమం వనేస్మిన్ర్పతిభాతిమే || 26

అన్నపానస్య సంప్రాప్తిః మరమస్య కుతస్తవ | స్తోకేనచ తథాన్నేన బిభర్షిచ బహూస్కథమ్‌ || 27

తృప్తాఅపికథం సర్వేనిర్మాంసా భిన్నకుక్షయః | కశ్చిత్త్వమస్యాం ఘోరాయామటవ్యాంతుకృతాలయః || 28

ఏతన్మేసంశయంఛింధి పరంకౌతూహలంహిమే | ఏవముక్తః సవణిజా ప్రేతోవణిజమబ్రవీత్‌ || 29

ఈయడవిలో నిదినాకు పరమాశ్చర్యముగ దోచుచున్నది. ఇటకీ అన్నపానములు వచ్చుట నీవిని సమకూర్చుట ఈ కొంచెమన్నముతో నింతమందిని భరించుచున్నావిది యెట్లు? వీరు తృప్తిగ దినియు నందరు బక్కచిక్కి కడుపులెండి యున్నారు. నీవీ ఘోరాటవిలో నివసింతువా? ఈ నా నందియము వారింపు వినవేడుక గొన్నాను అనవిని ప్రేతమిట్లనియె.

వాణిజ్యసక్తస్య పురాకోలోతీతో మమానఘ! శాకలేనగరేరమ్యే నాస్తికస్యదురాత్మనః || 30

ధనలోభాన్మయాతత్ర సకదాచిదపిప్రభో! | దత్తాసీద్భిక్షవేభిక్షా కృపణనకథంచన || 31

ప్రాతివేశ్యశ్చతత్రాసీద్‌ బ్రాహ్మణో గుణవాన్మమ | శ్రవణద్వాదశీయోగే మాసిభాద్రపదేతథా || 32

సకదాచిన్మయాసార్ధంతౌషీంనామనదీం య¸° | తస్యాశ్చసంగమః పుణ్యో యత్రాసీచ్చంద్ర భాగయా || 33

చంద్రభాగా సరిచ్ఛ్రేష్ఠా యత్రశీతామలోదకా | మహాదేవజటాజూటే గంగానిపతితాపురా || 34

చంద్రేణ భాగతోన్యస్తా చంద్రభాగాస్మృతాతతః | తత్కాల తప్తసలిలాతౌషీతత్రార్కనందినీ || 35

శీతోష్ణేచోదకేతస్మిన్‌ సంగమేసుమనోహరే | తంసదేశం సమాసాద్య ప్రాతివేశ్యమసౌద్విజః || 36

శ్రవణద్వాదశీయోగే స్నానార్చన ఉపోషితః | చాంద్ర భాగస్యతోయస్య వారిధానీనవాదృఢా || 37

దధ్యోదనయుతైఃసార్ధం సంపూర్ణెర్వర్ధమానకైః | ఛత్తైశ్చోపానహైరమ్యై ర్వసై#్రశ్చవివిధైర్యుతా || 38

ప్రదదౌవిప్రముఖ్యేభ్యో రహస్యజ్ఞో మహీపతిః | చిత్తసంరక్షణార్థాయ తస్యాపిచతదామయా || 39

సోపనాసేనదత్తైకా వారాధానీనవా దృఢా | చాంద్రభాగస్యతోయస్య దధ్యోదనయుతా తదా || 40

గత్వాగృహమను ప్రాప్యతతః కాలేనకేనచిత్‌ | పంచత్వమహమాసాద్యనాస్తిక్యాత్ప్రేతతాం గతః || 41

ఓ పుణ్యుడ ! మున్ను వర్తకమందే నాకు జాలకాలము గడచెను. శాకలనగరమందేనొక పరమనాస్తికుడు దురాత్ముడను ధనలోభముచే నేనెన్నడు నే బిచ్చగానికి బిచ్చముం బెట్టియెరుగను పరమ కృపణుడను. అక్కడ నాకొక గుణవంతుడు బ్రాహ్మణుడు ప్రాతివేశ్యు (ఇరుగుపొరుగు) డొకడుండెను. శ్రవణానక్షత్ర ద్వాదశీతిథి యోగమందు భాద్రపద మాసములో నతడు నాతో తొషియను నదికి వెళ్ళినాడు. అక్కడ చంద్రభాగానది యా నదిలో సంగమించును. అక్కడ చంద్రభాగానది చల్లని నీరు గలది. మున్ను మహాదేవ జటామకుటమునుండి గంగజారినది. చంద్రుడందు భాగముగొని వచ్చి యుంచినందున నిదిచంద్రభాగయైనది. ఆకాలమందుడుకునీటనున్న యీ అర్కనందిని తోషీనది వేడినీట నా చక్కని చల్లని నదికలిసినది. ఆనదీసంగమస్థానమున కీబ్రాహ్మణుడు నాతో బ్రాతివేశ్యమువడసి శ్రవణద్వాదశీ యోగమందు స్నాన పూజాదికము ఉపవాసము సేసెను. చంద్రభాగా నదీపూర్ణమైన గట్టివారి ధాని (కూజా, కడప) క్రొత్తది దధ్యోదనములతో ఉపాసహములతో (పాదుకలు లేక పాదరక్షలు) నీ రాజు ధర్మరహస్యమెరిగినవాడు కావున విప్రముఖ్యులకు దానముసేసెను. ఆయన మనస్సు గాపాడుట కాతనికిని నేనుపవాసముండి యీ యొక్క ఉదకపాత్ర నిచ్చితిని. ఇందు చంద్రభాగ తోయముతోపాటు దధ్యోదన పాత్రముగూడ యిచ్చితిని. అవ్వల నేనింటికి జని కొంతకాలమునకేను మృతినంది నాస్తిక్యమువలన నీ బ్రేతజన్మమందినాడను.

అస్యామటవ్యాంఘోరాయాం యోవాహ్యకుశలస్తదా | శ్రవణద్వాదశీయోగేదత్తాయా సౌమయానఘ! || 42

దధ్యోదనయితారమ్యా వారిధానీనవాదృఢా | సేయం మధ్యాహ్నసమయే దివసేదివసేమమ || 43

ఉపతిష్ఠేత్సదై వేహ యథాదృష్టాత్వయానఘ | బ్రహ్మస్వహారిణసై#్వతే పాపాః ప్రేతత్వమాగతాః || 44

పరదార రతాఃకేచిత్స్వామిద్రోహ రతాః పరే | మిత్రద్రోహరతాఃకేచిద్దేశేస్మిన్భృశదారుణ || 45

మమానుయానం కుర్వంతి అన్నపానకృతేనఘ! | అక్షయో భగవాన్విష్ణుః పరమాత్మాసనాతనః || 46

తముద్రిశ్యతుయద్దత్తం తదక్షయ్యం ప్రకీర్తితమ్‌ | అక్షయ్యేనతథాన్నేనతృప్తా అపిహిమానద || 47

ప్రేతభావేన దౌర్బల్యం నవిముంచంతి కర్హిచిత్‌ | అహంచ పూజయిత్వాత్వామతిథిం సముపస్థితమ్‌ || 48

ప్రేతభావాద్వినిర్ముక్తోయాస్యామి పరమాంగతిమ్‌ | మయావిహీనాః ప్రేతాస్తువనేస్మిన్భృశదారుణ || 49

పీడామనుభవిష్యంతి దారుణాంకర్మయోగజామ్‌ | ఏతేషాంత్వం మహాభాగ! మదనుగ్రహకామ్యయా || 50

ప్రత్యేకం గోత్రనామానిగృహ్ణీష్వలిభితేనచ | అస్తికక్ష్యా గతైవైషాతవ సాపుస్తికాశుభా || 51

హిమవంతమథాసాద్యతత్రత్వం లప్స్యసేనిధిమ్‌ | గయాశీర్షేతతోగత్వా శ్రాద్ధంకురుమహామతే! || 52

ఏకైకం త్వమథోద్దిశ్యప్రేతం ప్రేతంయథా సుఖమ్‌ | తతస్తు తేవిమోక్ష్యంతి ప్రేత భావమసంశయమ్‌ || 53

ఇత్యేవం సవదన్నేవతప్త జాంబూనద ప్రభః | విమానపరమాస్థాయస్వర్గలోకం తతోగతః || 54

స్వర్చితేప్రేత నాధేతు ప్రేతానాం సవణిక్ర్కమాత్‌ | నామగోత్రాణి సంగృహ్య ప్రయాతః సహిమాలయమ్‌ || 55

తత్రప్రాప్యనిధింగత్వానిక్షిప్యచ తథాగృహే | ధనం కించిదుపాదాయగయా శీర్షం తతోయ¸° || 56

ప్రేతానాంక్రమశస్తత్ర చక్రేశ్రాద్ధం దినేదినే | యస్యయస్యయదాశ్రాద్ధం కరోతి సమహాన్వణిక్‌ || 58

ప్రేతభావోమయాత్యక్తః ప్రాప్తోస్మిత్రి దివంధ్రువమ్‌ | కృత్వాసధనదానేన ప్రేతానాం నిష్కృతింవణిక్‌ || 59

జగామస్వగృహం తత్రమాసిభాద్రపదేతదా | శ్రవణద్వాదశీయోగే పూజయిత్వాజనార్దనమ్‌ || 60

ధనంచదత్త్వా విప్రేభ్యః సోపవాసోజితేంద్రియః | పుణ్యషు సతతం రాజన్‌ నదీనాం సంగమేషుచ || 61

గంగాసరయ్వోర్గంగాయశ్శోణస్య చమహామతిః | ఇక్షుమత్యాశ్చ గంగాయా గంగాయమునయో స్తథా || 62

గోమత్యాశ్చ సరయ్వశ్చ కైశికీగండక్యోస్తథా | విపాశయాదేవ హ్రదాయత్రయోగం ప్రపద్యతే || 63

విపాశాచ తథాయోగం యత్రయాతిశతద్రుణా | ఇరావతీ తథాయోగం యత్రప్రజతి సింధునా || 64

చంద్రభాగా చవ్రజతి యత్రయోగం వితస్తయా | మహాసింధుశ్చ సంయోగం యత్రయాతి వితస్తయా || 65

ప్రత్యబ్దంయాపదేతేషు సంగమేషు మహావణిక్‌ | కరోతి విధివద్దానం యావద్దిష్టాంత మాగతః || 66

అవాప పరమంస్థానం దుర్లభం యత్తుజంతుభిః | యత్రకామఫలావృక్షానద్యః పాయసకర్దమాః || 67

శీతలామలపానీయాః పుష్కరిణ్యోమనోహరాః | సువర్ణ సికతారాజన్‌ మణిసోపాన భూషితాః ||

అనంత్యాయ ససంప్రాప్తోదేశంతంభూరిదక్షిణః | తందేశమాసాద్యవణిజ్మహాత్మా |

సుతప్తజాంబూనద భూషితాంగః | కల్పంసమగ్రం ముదితో యతాత్మా | రేమేసరామాభియుతః కృతాత్మా || 69

విమానైరప్సరోభిశ్చసిద్ధ గంధర్వసేవితః | విష్ణులోక మవాప్నోతి యావదా భూతసంప్లవమ్‌ || 70

రాజసూయాదిభిర్యజ్ఞెర్యత్ఫలం సమవాప్యతే | శ్రవణద్వాదశీం కృత్వాతత్ఫలం లభ##తేనరః || 71

ఇతి శ్రీవిష్ణు ధర్మోత్తరే ప్రథమఖండే మార్కండేయ వజ్రసంవాదే పిశాచమోక్షణశ్రవణద్వాదశీ మహాత్మ్య వర్ణనంనామ ద్విషష్ట్యధిక శతమోధ్యాయః.

ఈఘోరాటవిలో నొక చేతగాని వాడెవ్వడు దొరకునాయని దినదినము నేను చూచుచుండ నీవులభించితివి. ఓ పుణ్యాత్ముడ! సరిగా శ్రవణద్వాదశీ యోగమునందిక్కడ నీవుగనిపించితివి. అదుగో! ఈ ప్రేతలు మున్ను పరమపాపులు. బ్రహ్మస్వముహరించి ప్రేతత్వము వడసినారు. వీరు పరదారరతులు కొందరు స్వామిద్రోహులు. వీరీపరమదారుణ దేశమందున్నారు. వీరందరు అన్నపానములకై నావెంట పడుచుందురు. భగవంతుడు పరమాత్మ సనాతనుడు విష్ణుపక్షయుడు. ఆయననుద్దేశించి యిచ్చినదది యక్షయ్యమనబడును అక్షయ్యమైన అన్నముచే వీరుతృప్తులు. వీరుప్రేతత్వముచే దౌర్బల్యము నెంతకేని విడువకున్నారు. అనుకోకుండ దారసిల్లిన అతిథిని నిన్నేను నర్చించి ప్రేతభావమునుండి ముక్తినంది పరమగతినందుచున్నాను నన్నువీడిన ప్రేతలీయడవిలో ప్రారబ్ధకర్మవశ##మైన పరమనికృష్జ పీడననుభవించుచున్నారు. ఓ మహానుభావ! నాపై ననుగ్రహముసేసి నేనువ్రాసియిచ్చిన వీరి గోత్ర నామముల నీవుగైకొనుము ఆ పుస్తిక (పుస్తకము) ఇదిగో నాచంకలోనున్నది. నీవు హిమవంతమునకేగి యటనొకనిధిని (గనిని) బడయుదువు అమీదనేగి నీవు గయాశీర్షమునందు ఒక్కొక్క ప్రేతమునుద్దేశించి యథాసుఖముగ శ్రాద్ధము గావింపుము అందువలన వారే ప్రేతత్వమును బాయగలరు. సందేహములేదు.

ఇట్లాతడు పలుకుచునే పదనారవవన్నె బంగారుచాయగొని విమానశ్రేష్ఠమెక్కి స్వర్గలోకమునకేగెను. యాప్రేతల నామ గోత్రములనుగోని ఆ ప్రేతనాథునర్చనయైన తర్వాత యాతడు హిమాలయమేగెను. అక్కడ యాతడన్నట్లు గనింబడసి యదియింట నుంచి, అందించుక ధనముగొని గయాశీర్షమునకేగెను. అక్కడ ప్రేతలకు దినదినము క్రమముగా శ్రాద్ధమొసంగెను. ఆ మహావర్తకుడెవనికెవనికి అట శ్రాద్ధముచేయునో ఆయాజీవులాతని కారేయి కలలో గనిపించుచువచ్చిరి. కనిపించి ఓ మహానుభావ ! నీప్రసాదమన నో పుణ్యుడ ! నేను ప్రేతత్వముబాసితిని శాశ్వత స్వర్గముపొందితిని. అని యెరింగించుచుండెను. ఇట్లావణిజుండు ధనదానముచే నాప్రేతలకు నిష్కృతి (పాపోపశమనము) సేసి తనయింటికేగెను. ఏగి యట ప్రతి భాద్రపదమందును శ్రవణద్వాదశీయోగమందుపవసించి జనార్దనుబూజించి విప్రులకుధనములచ్చి జితేంద్రియుడై పుణ్యనదీసంగమతీర్థములందు అనగా గంగాసరయూనదులుగంగాశోణానదులు ఇక్షుమతీ గంగానదులు గంగాయమునానదులు గోమతీసరయూనదులు కౌశికీ గండకీనదులు విపాశా దేవహ్రదానదులు విపాశాశతద్రునదులు సింధుఇరావతీనదులు చంద్రభాగ వితస్తానదులు మహాసింధు వితస్తానదులు కలిసిన పుణ్యతీర్థములందు ప్రతిసంత్సరమీ మహావణిజుడు యథావిధిగదిష్టాంతమగుదాక (అవసానముదాక) యథావిధిదానముసేసి జంతువులేవియునందలేని పరమస్థానమునుబొందెను. అస్థానమందు చెట్లుకామఫలములు (కోరినపండ్లిచ్చునవి) నదులు పాయసపూర్ణములు. పుష్కరిణులు సుశీతమధురోదకములు మనోహరములు. అందిసుక కేవలసువర్ణమే మెట్లు మణిమయములే. భూరిదక్షిణుడైన యావర్తకు డనంతత్వము కొరకు శాశ్వతస్థితికి (అపునరావృత్తయైనముక్తికి) ప్రాత్రుడైయటకువచ్చెను. ఆమహాత్ముడు వణిగ్వరుడటకేతెంచి పుటముపెట్టిన బంగారుచాయమేనుగలవాడై ఒక్కకల్పకాలమురామామణులతో గూడిముదమునవిహరించెను. అట్లుకృతార్థుడై అప్సరసలు సిద్ధగంధర్వులు సేవింపవిమానములెక్కి ప్రళయావసానముదాక విష్ణులోక మందు విహరించును. శ్రవణద్వాదశీవ్రతమాచరించిన నరుడు రాజసూయాదియజ్ఞములు సేసిసఫలమునందును.

ఇది శ్రీవిస్ణుధర్మోత్తరమహాపురాణము ప్రథమఖండమున శ్రవణద్వాదశీమహిమానువర్ణనమను నూటఅరువదిరెండవ అధ్యాయము.

Sri vishnudharmothara Mahapuranam-1    Chapters