Sri vishnudharmothara Mahapuranam-1    Chapters   

నూటేఏబది ఎనిమిదవ అధ్యాయము - కామద్వాదశీవ్రతము

మార్కండేయ ఉవాచ : మార్గశీర్షస్య మాసస్య శుక్లపక్షా జ్జనాధిప! | అరభ్యాభ్యర్చయే ద్దేవం ద్వాదశీషునదైవతు || 1

పక్షయో రుభయ్యోవాత్యం సోపవాసో జితేంద్రియః | ఫలైఃపుషై#్పర్యథా కామం నై వేద్యైర్హోమ కర్మణా || 2

పూజనే బ్రాహ్మణానాంచ శక్త్యా దానంచ పార్థివ | అభీష్ట నామ జప్యేన పూర్ణాత్సంవత్సరాన్నరః || 3

తదేవాప్నోతి రాజేంద్ర! యత్రగత్వాన శోచతి | అకామాః సాత్త్వికా దేవం పూజయంతి జనార్దనమ్‌ || 4

తస్మాదకామేన నరేంద్ర చంద్ర సంపూజనీయో భువన స్యగోప్తా |

త్యక్త్వా వణిజ్యం నరదేవ! లోకే దేవేశ్వరో విష్ణు రుపాస నీయః || 5

ఇతి శ్రీవిష్ణు ధర్మోత్తరే ప్రథమఖండే మార్కండేయ వజ్రసంవాదే కామద్వాదశీ వర్ణనం నామ అష్టపంచా శదధిక శతతమోధ్యాయః.

మార్గశిరశుద్ధద్వాదశి మొదలుకొని తరువాతి ద్వాదశులందు దేవదేవుని విష్ణునర్చింపవలెను. ప్రతిమాసమందు రెండుపక్షములందలి ద్వాదసులందును నింద్రియముల నిమిడించికొని యుపవాసము సేసి ఫలపుష్పములతో యథాభిలాషముగ నివేదనలుసేసి హరినర్చించి యథాశక్తి బ్రాహ్మణులం బూజించి దానములిచ్చి తనకిష్టమైన భగవన్మంత్రముం జపించి నాతడానందభరిత పుణ్యలోకములనందును. నిష్కాములు సాత్త్వికులయిన భక్తులే విష్ణునర్చింతురు. సర్వభువన గోప్తయగు హరిని నిష్కామబుద్ధితో నర్చింప వలెను. ఆయనతో వాణిజ్యము (వ్యాపారము వర్త్యము) పుణ్యఫలమును గురించిన బేరసారములు పెట్టుకొనకుండ హరియుపాసింప వలసినవారు.

ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణము ప్రథమఖండమున కామద్వాదశీ వర్ణనమను నూటయేబదియెనిమిదవ అధ్యాయము.

Sri vishnudharmothara Mahapuranam-1    Chapters