Sri vishnudharmothara Mahapuranam-1    Chapters   

నూటనలుబది ఎనిమిదవ అధ్యాయము - మద్రేశ్వర (పురూరవ) తపోవనగమనము

వజ్రువాచ : చరితం బుధపుత్త్రస్య మార్కండేయ మయాశ్రుతమ్‌ | శ్రుతః శ్రాద్ధవి ధిః పున్యః సర్వపాప ప్రణాశనః ||

ధేన్వాః ప్రసూయమానాయాః ఫలం దానే మయాశ్రుతమ్‌ | కృష్ణాజిన ప్రదానం చ వృషోత్సర్గస్త థైవచ || 2

శ్రుత్వా రూపం నరేంద్రస్య బుధపుత్త్రస్య భార్గవ! | కౌతూహలం సముత్పన్నం తన్మమా చక్ష్వ పృచ్ఛతః || 3

కేనకర్మ విపాకేనసతు రాజా పురూరవాః | అవాపతాదృశం రూపం సౌభాగ్యమపి చోత్తమమ్‌ || 4

దేవాంస్త్రి భవనశ్రేష్ఠాన్‌ గంధర్వాంశ్చ మనోరమాన్‌ | ఉర్వశీ సంగతా త్యక్త్వా సర్వ భావేనతం నృపమ్‌ || 5

మార్కండేయ ! బుధకుమారుని చరిత్రవింటిని. పుణ్యమైన శ్రాద్ధవిధి సర్వపాపహరము ప్రసవించుచున్న గోవును దానము చేయుటవలని ఫలతము (ద్విముఖీ గోదానమని దీనినందురు) కృష్ణాజినదానము వృషోత్సర్జనముగూడ విన్నాడను. బుధకుమారుడగు పురూరవుని యందమునిని యట్టిరూపముకలుగుటకు కారణమేమో వినగుతూహలముగలుగుచున్నది. అంతయందగానిని సౌభాగ్యవంతుని యూర్వశి త్రిభువనశ్రేష్ఠులగుదేవతలను మనోరములయినగంధర్వులను గాదని సర్వభావముతోగూడుకొన్నదన మార్కండేయుండిట్లనియె.

మార్కండేయఉవాచ : శృణుకర్మ విపాకేన యేన రాజా పురూరవాః | పురూరవా ఇతిఖ్యాతో మద్రేష్వాసీన్మహిపతిః ||

చాక్షుపస్యాన్వయే జాతో చాక్షుషస్యాంతరే మనోః | సర్వైర్నృ పగుణౖర్యుక్తః కేవలం రూప వర్జితః || 7

వజ్రఉవాచ : పురూరవా మద్రపతిః కర్మణాకేన భార్గవ! | బభూవ కర్మణాకేన కురూపశ్చ తథా ద్విజ! || 8

మార్కండేయఉవాచ : ద్విజగ్రామే ద్విజశ్రేష్ఠో నామ్నై వాసీత్పురూరవాః | నద్యాః కూలే మహారాజ! పూర్వజన్మనిపార్థివః ||

సతుమద్ర పతిర్నామ్నా యో భూద్రాజా పురూరవాః | అస్మిన్‌ జన్మన్య సౌవిప్రో ద్వాదశీషు సదానఘ! || 9

ఉపోష్య పూజయామా సరాజ్యకామో జనార్దనమ్‌ | చకార సోపవాసంచ స్నాన మభ్యంగ పూర్వకమ్‌ || 11

ఉపవాస ఫలం ప్రాప్య రాజ్యం మద్రేష్వ కంటకమ్‌ | ఉపోషితదినా భ్యంగా ద్రూవహీనోభ్య జాయత || 12

ఉపోషితోనరస్తస్వాత్సా సమ భ్యంగ పూర్వకమ్‌ | వర్జయేత్తత్ర్ప యత్నేన రూపఘ్నం తత్పరంనృణామ్‌ || 13

ఏతత్తే కథితం తస్య యద్వృత్తం పూర్వజన్మని | మద్రేశ్వరత్వే చరితం శృణు తస్య మహీ పతేః || 14

తస్యరాజగుణౖః సర్వైః సముపేతస్య పార్థివ! | జనానురాగో నైవాసీ ద్రూప హీనస్య పార్థివ! || 15

పురూరపుడేకర్మ పరిపాకమున నట్టివైభవము పేరుగడించెనో వినుము. చాక్షుషమనువు వంశము కాలమున నాతని వంశ మందు పురూరవుడనురాజు మద్రదేశమందుండెను. అతనికన్ని యుత్తమ గుణములున్నవికాని మంచిరూపముగాని లేకుండెను. అనవజ్రుండు మద్రపతి రూపహీనుడగుటకు గారణమైన కర్మమేమి? అన మార్కండేయుడు. ఒక బ్రహ్మణ గ్రామమందు ద్విజశ్రేష్ఠుడిదేపేరుతో ముందటి జన్మమందొక నదీతిరమందుండెను. అతడు రాజ్యకాముడై యుపవాసముండి జనార్దనుం బూజించెను. అనాడతడభ్యంగస్నానము గావించికొని యుపవసించిన ఫలముగా మద్రదేశమును నిష్కంటకమైన రాజ్యమునకు రాజయ్యెను. ఉపవాస ముండి తలంటుకొనుటవలన నతడు కురూపియయ్యెను. కావున నుపవాసమున్నవాడు తలండుకొనరాదు. ఆదిరూపఘ్నము. (రూపము చెరచును) ఇది యాతని పూర్వజన్మకథ. ఇక నతడు మద్రేశ్వరుడైన తరువాతి కథ తెల్పెద వినుము.

రూపకామఃస మద్రేశస్తవసే కృత నిశ్చయః | రాజ్యం మంత్రి గల గతం కృత్వా జగామ హిమ పర్వతమ్‌ || 16

వ్యవసాయద్వితీయస్తు పద్భ్యామేవ మహాయశాః | ఊర్ధ్వం సంతీర్య సనదం విషయాంతే స్వకీంనదీమ్‌ ||

ఇరావతీమితి ఖ్యాతాం దదర్శాతి మనోహరామ్‌ ||

తుహినగిరి భవాం మహౌఘవేగాం తుహిన సగర్భ సమాస శీతలోదామ్‌ |

తుహిన సదృశ వర్ణఘేనయుక్తాం తుహినయశాః సరితం దదర్శరాజా ||

ఇతి శ్రీవిష్ణు ధర్మోత్తరే ప్రథమఖండే మార్కండేయ వజ్రసంవాదే మద్రేశ్వరస్య తపోవన గమనంనామ అష్టచత్వారిశదుత్తర శతతమోధ్యాయః.

అట్లు కురూపియైన యాఱడు తపస్సు చేయ నిశ్చయించుకొని మంత్రులకు రాజ్యముప్పగించి రాజ్యమప్పగించి హిమవత్పర్వతమున కేగెను. అతనికి వ్యవసాయము ప్రయత్న ముతప్ప మరియెవ్వడు తోడులేరు. పాదచారియై మీదికరిగి యొకనదమునుదాటి తనరాజ్యము సరిహద్దున ఇరావతియును తనదేయైన నదింజూచెను. అనది చాలచక్కనిది. మంచుకొండ కుదయించినది. (హైమవతి) మహాప్రవాహము గలది. మంచులోపలి చలువకెనయగు చల్లని యుదకముగలది. మంచువలె (తుహినమువలె) నచ్చని తెలుపుగల నురుగులు గలదియగు నానదిని యా తుహినయశుడు (మంచువలె నచ్చమైనకీర్తిగలవాడు) దర్శించెను.

ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణము ప్రథమఖండమున మద్రేశ్వర పురూరవ) తపోవనగమనమను నూట నలుబదియెనిమిదవ అధ్యాయము.

Sri vishnudharmothara Mahapuranam-1    Chapters