Sri vishnudharmothara Mahapuranam-1    Chapters   

నూటనలుబదినాల్గవ అధ్యాయము - శ్రాద్ధ దేశానుకీర్తనము

కస్మిన్‌ బహుఫలం శ్రాద్ధం దేశేబ్రాహ్మణ పుంగవ | ఏతత్సర్వం సమాచక్ష్వ భవాన్‌ బ్రహ్మాఇవాపరః || 1

గయాశీర్షవటే శ్రాధ్ధమక్షయ్యం పరికీర్తితమ్‌ || యదర్థమేషా చరతి గాథాలోకే పురాతనీ || 2

ఏష్టవ్యా బహవః పుత్రాయద్యేకోపిగ యాంవ్రజేత్‌ | యజేతవాశ్వమేధేన నీలంవావృషముత్సృజేత్‌ || 3

పుష్కరేష్వక్షయం శ్రాద్ధం ప్రయాగేనైమిషేతథా | వారాణస్యాం ప్రభాసేచ కురుక్షేత్రే సంమంతతః || 4

సంనిహత్యాం విశేషేణ రాహుగ్రస్తే నిశాకరే | (ర్రాహుగ్రస్తే దినకరే సన్నీత్యాంపార్థివోత్తమ!) || 5

శ్రాద్ధంకృత్వా సమాప్నోతి రాజసూయ శతం నరః | అశ్వమేధ సహస్రస్య సమ్యగిష్టస్య యత్ఫలమ్‌ || 6

స్నాత ఏవతదాప్నోతి కృత్వాశ్రాద్ధం సమానవః | సర్వేషు దేవలోకేషు కామచారీ విరాజతే || 7

పద్మవర్ణేన యానేన కింకిణి జాలమాలినా | దేవరామాగణాఢ్యేన వీణామురజనాదినా || 8

దవ్యశ్వేతాశ్వయుక్తేన కామగేన యథాసుఖమ్‌ | ఆభూతసంప్లవం యావత్ర్కీడ త్యప్సరసాం గణః || 9

కృతకృత్యశ్చ భవతి పితౄణామనౄణస్తథా | శ్రాద్ధం తథా పిత్రాణాం చ నోపయుజ్యేతవై పునః || 10

యత్రక్వచన గంగాయాంశ్రాద్ధ స్యానంత్య ముచ్యతే | యమస్య భగినీ దేవీ యమునా పాపనాశినీ || 11

యత్రక్వచన తస్యాంహి శ్రాద్ధ స్యానంత్య ముచ్యతే | పితౄణాందుహితా రాజన్నర్మదా సరితాంవరా || 12

తస్యాస్తీరేతథానంతం శ్రాద్ధం సర్వత్ర పార్థివ! | అక్షయ్యంచ తథా శ్రాద్ధ మమరాంతిక పర్వతే || 13

వరాహ పర్వతే రాజన్‌ శ్రాద్ధ స్యానంత్య ముచ్యతే | హిమవాన్పర్వత శ్రేష్ఠః శంకరశ్వశురోగిరిః || 14

ఆకరః సర్వరత్నానాం సర్వసత్త్వ సమాశ్రయః | తాపసానా మధీవాసః శ్రాద్ధం తత్రాక్షయంభ##వేత్‌ || 15

వజ్రుడు స్వామీ! నీవపరబ్రహ్మవు. కావున శ్రాద్ధయోగ్యమయిన దేశమున ఆనతిమ్మన మార్కండేయుడనియె. గయాశీర్ష వటమునందలి శ్రాద్ధ మక్షయ్యము. దానికొరకేపురాతనగాధ వ్యాప్తిలోనున్నది. పెక్కుమంది పుత్రులుకావలెనని కోరదగును. ఒక్కడేని గయకు వెళ్ళును. అశ్వమేధముసేయును. నల్లయెద్దును విడుచును. నీలవృషభోత్సర్జనము (అచ్చువోసి యాబోతును వదలుట) గావించును అను భావముతో నిట్లు కోరవలెనన్న మాట) పుష్కర క్షేత్రము లందు ప్రయాగ నైమిశారణ్యము వారణాసి (కాశి) ప్రభాసము కురుక్షేత్రమందు రాహుగ్రస్తగ్రహణముపట్టిన తావున శ్రాద్ధముపెట్టి నూరు రాజసూయముల వేయి యశ్వమేధముల ఫలమందును. సర్వలోకములందు స్వేచ్ఛాసంచారి కాగలడు. శ్రాద్ధము పెట్టెడివాడు స్నానము సేయగానే పద్మము రంగుగలది కింకిణీజాలమాలికలతోగూడినది దేవతా సుందరీ సుందరము వీణామురజాది మంగళవాద్యనాదితము దివ్య శ్శేతాశ్వ యుక్తము కామగమునైన విమానమునందు అభూత సంప్లవము భూతప్రలయముదాక యప్సరోగణములతో విహరించును. పితౄణము తీర కృతకృత్యుడగును. గంగాతీరమందెక్కడపెట్టినను దానితో సమానమేదిలేదు. అది యనంతఫలదము యమునానది యముని చెల్లెలు. పాపనాశిని. తత్తీరమందెటనేని పెట్టిన శ్రాద్ధమనంత ఫలదము. పితృదేవతల కూతురు నర్మద. సరిద్వర. ఆ నదీతీరమందు పెట్టిన శ్రాద్ధమనంతము. అమరాంతిక పర్వతమునగూడ అక్షయ్యము. వరాహాద్రియందు శంకరుల మామగారగు హిమవత్పర్వతమందు అనంతఫలదము. అపర్వతము సర్వరత్నాకరము. సర్వసత్త్వాశ్రయము. తాపసులు కది నివాసము అక్కడి శ్రాద్ధమక్షయ్యము.

ఏవమాదిషు తీర్థేషు పర్వతేషు సరిత్సుచ | సరోవరేషు ముఖ్యేషు ఋషీణా మాశ్రమేషుచ || 16

నిర్ఘరేషు తథా రణ్య నదీనాం ప్రభ##వేషుచ | సంగమేషుచ ముఖ్యేషు పులినేషు విశేషతః || 17

ఉద్యానేషు విచిత్రే షు సైకతేషు సమేషుచ | శాద్వలేషు చ రమ్యేషు గిరీణాం కందరాసుచ || 18

గహ్వరేషు నితంబేషు చ్ఛాయాయాం కుంజరస్యచ | మహీగతాంతర న్యస్త గజ చ్ఛాయాసు పార్థివ! 19

యః కుర్యాదవరాహ్ణేతు సకృచ్ఛ్రాద్ధం ప్రయత్నతః | అక్షయ్య మన్నపానం తు పితౄణాం చోపతిష్ఠతే || 20

గోమయే నోపలిప్తేషు శ్రాద్ధం కార్యం గృహేషుచ | మనోజ్ఞేషు విచిత్రేషు రుచిరేషూత్త మేషుచ || 21

దేవాయ తన గోష్ఠేషు శ్రాద్ధం బహుఫలం భ##వేత్‌ | 22

తీర్థానియానీహ నరేంద్రచంద్ర! లోకేపురాణౖః పరికీర్తితాని |

తీరేషు తేషాం విధివత్ర్పదాయ శ్రాద్ధం నశోచేన్మరణంజితాత్మా || 23

ఇతి శ్రీవిష్ణు ధర్మోత్తరే ప్రథమఖండే మార్కండేయ వజ్రసంవాదే శ్రాద్ధదేశాను కీర్తనం నామ చతుశ్చత్వారింశదుత్తర శతతమోధ్యాయః.

ఇవి మొదలగు తీర్థములు పర్వతములు నదులు ముఖ్య సరోవరములు ఋష్యాశ్రమములు నిర్ఘరములు (కొండవాగులు సెలయేళ్ళు) నదులు పుట్టిన యరణ్యములు ముఖ్య నదీ సంగములు పులినములు విచిత్రోద్యానములు సైకతములు ఇసుకతిన్నెలు, రమ్యములైన పచ్చికబయళ్ళు కొండచరియలు గహ్వరమలు పర్వతనితంబము గజచ్ఛాయయందు, భూమిలోపలనున్న గజచ్ఛాయ లందు సపరాహ్ణమందెవ్వడొక్కమారేని సప్రయత్నము శ్రాద్ధము నొనరించునేని యాయన్న పానములు పితరుల కక్షయ్యమైనుట్టును. ఆవుపేడతో అలికిన చక్కని విచిత్రములు రుచిరములు నుత్తమములయిన యిండ్లయందు దేవాలయములందు గోశాలలందు పెట్టిన శ్రాద్ధము బహుఫలమగును. ఓ నరేంద్రచంద్రా! పురాణములందు బరికీర్తితములయిన తీర్థములేవేవి యీ భాగరభూమి నున్నవి వానివానియందు యథావిధి శ్రాద్ధము పెట్టినతడు మనసు నిగ్రహముపొంది మరణమునుగూర్చి శోకింపడు.

ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణము ప్రథమఖండమున శ్రాద్ధదేశానుకీర్తనమను నూటనలుబదినాల్గవ అధ్యాయము.

Sri vishnudharmothara Mahapuranam-1    Chapters