Sri vishnudharmothara Mahapuranam-1    Chapters   

నూట నలుబదవ అధ్యాయము - శ్రాద్ధవివరణము

వజ్రఉవాచ : భగవంచ్ఛ్రోతుమిచ్ఛామి కథ్యమానమహంత్వయా | విధింశ్రాద్ధస్య ధర్మజ్ఞ! తన్మమాచక్ష్వ పృచ్ఛతః || 1

మార్కండేయ ఉవాచ : వక్ష్యమాణగుణాన్వి ప్రాన్‌ పూర్వేద్యు రుపమంత్రయేత్‌ |

కర్త్రా సమేతైసై#్తర్భావ్యం సంయతైశ్చ నిమంత్రితైః || 2

శ్రాద్ధాహేప్రయతః స్నాతః స్వాచాంతః సుసమాహితః | శుక్లవాసాః సమభ్యర్చ్య నృవరాహం జనార్దనమ్‌ || 3

అమశ్రాద్ధేషు కామ్యేషు హుత్వా ప్రథమ పంచకమ్‌ | మధ్యమం పంచకంహుత్వాపశుశ్రాద్ధేష్వసంశయమ్‌ || 4

అమావాస్యాసు సర్వాసుహుత్వా చోత్తమ పంచకమ్‌ | హుత్వాచ పంచకానేతా నష్టకాత్రితయం క్రమాత్‌ || 5

అన్వష్టకాసుచ తథా భోజయేత్ర్పయతోద్విజాన్‌ | ద్వౌదివ్యే ప్రాక్‌త్రయః పిత్ర్యే చైకైకముభయత్రవా || 6

ఉదజ్హుఖాంశ్చ పిత్రర్థేస్నాతాన్విద్యాద్గుణక్రమాత్‌ | తిలదర్భావకీర్ణేషు చాననేషూ పవేశ##యేత్‌ || 7

పితౄనావాహయామీతిస్వయ ముక్త్వా సమాహితః | ఆవాహయస్వేతితతో ద్విజైరుక్తోతథన్మనాః || 8

వయాంత్వసురా ద్వాభ్యాంయాతుధాన విసర్జనమ్‌ | తిలైః కుర్యాత్ర్పయత్నేన త్వథవా గౌరసర్షపైః || 9

తే పితరిత్యేవ సర్వాం స్తా నగ్న ఆవహ | ఆగ్నేయస్తు తథోదీర్యః ఏతద్వఃపితర స్తథా || 10

కుశాం స్తిలావమిశ్రేణ తథా గంధయుతేనచ | యాస్తిష్ఠంతి ధారయంతి అమృతావాగితి త్యృచా || 11

యన్మేమాతేతిచ తథా పాద్యమర్ఘ్యంచకారయేత్‌ | నివేద్య విప్రేషుతథా పాద్యార్ఘ్యం ప్రయతః క్రమాత్‌ || 12

గంధైర్వసై#్త్రశ్చ పుషై#్పశ్చ ధూపైశ్చాప్యథ భూషణౖః | అర్చయే ద్బ్రాహ్మణాంచ్ఛక్త్యా శ్రద్ధధానః సమాహితః || 13

ఆదౌసమర్చయేద్విప్రాన్వైశ్వదేవ నివేశితాన్‌ | నివేశితాంశ్చ పిత్రర్థే తతః పశ్చాత్పమర్చయేత్‌ || 14

వైశ్వదేవనివిష్టానాం చరమం హస్తధావనమ్‌ | విసర్జనంచ నిర్దిష్టంతేషు రక్షా యతఃస్థితా || 15

సర్వమన్యత్ర్సదాతవ్య మాదౌతేషాం నరాధిప! | సంపూజ్యగంధపుషై#్పశ్చ బ్రాహ్మణాన్ర్పయతస్తదా || 16

ఆదిత్యా వసవోరుద్రా ద్విజాన్వీక్ష్య తతోజపేత్‌ | అగ్నౌచ కరవాణీతి తైరుక్తంచ కురుష్వేతి || 17

పరిస్తీర్య తతోవహ్ని ముద్ధృత్య పర్వతః | అహితాగ్నిస్తు జుహుయాద్దక్షిణాగ్నౌసమాహితః || 18

అనాహితాగ్నిశ్చౌపసదే అగ్న్యభావే తథాప్సువా | సోమాయాదౌ పితృమతే కవ్యవాహనాయ చాగ్నయే || 19

యమాయ చైవాంగిరసే హుత్వాప్రయతమానసః | యే మామకాశ్చ పితరేతద్వః పితరస్తథా || 20

అయం యజ్ఞస్తథైవేతి ఏషావో గీతి రప్యథ | ప్రయతస్తన్మనాః కృత్వా రాజంశ్చైవాఇమంత్రణమ్‌ || 21

ఆమా సుపక్వేతి తతోఘృతంవా వ్యథవాపయః | నిషిచ్యరౌవ్యపాత్రేషు రజతా క్తేషు భావతః || 22

యథోపవన్నేష్వథవా తూష్ణీమన్ననివేదయేత్‌ | నమో విశ్వేభ్య ఇతిచ సతిలేనోదకేనచ || 23

ప్రాజ్మఖేషుచ యద్దత్తం తదన్నముప మంత్రయేత్‌ ఉదజ్ముఖేషు యద్దత్తం నామగోత్ర ప్రకీర్తనైః || 24

మంత్రయేత్రయతః ప్రాజ్ఞః స్వధాంతైః సుసమాహితః | యన్మేప్రకామాహోరాత్రైర్యద్వాక్రవ్యాత్తథైవచ || 25

ఇతిహాసపురాణాని ధర్మశాస్త్రాణిచాప్యథ | సప్తర్చం పరమంమత్రం శ్రావయేదగ్రతోద్విజాన్‌ || 26

వజ్రుడు ధర్మజ్ఞా! శ్రాద్ధవిధిని వినగోరెద నన మార్కండేయు డనియె. ముందురోజు చెప్పబోవు లక్షణములుగల బ్రాహ్మణులను నిమంత్రింప వలెను. కర్త ముందు రోజే నియమ వంతుడుగా నుండ వలెను. భోజనాదులు వారితో కూడ కలిసి చేయవలెను. శ్రాద్ధదినమున స్నానాముసేసి మడికట్టుకొని సమాహితుడై యాచమించి తెల్లని బట్టలు ధరించి నరవరాహ మూర్తిని హరి నర్చింప వలెను. ఆమ శ్రాద్ధములందు కామ్యశ్రాద్ధములందు ప్రథమ పంచకము (పశుశ్రాద్ధములందు మధ్యమ పంచకము) హోమము సేయవలెను. అమావాస్యలన్నిటను ఉత్తమ పంచక హోమము సేయవలెను. ఈ మూడు పంచకముల హోమము తరువాత అన్వష్టకలయందు బ్రాహ్మణులకు భోజనము పెట్టవలెను. దేవస్థానమందిద్దరిని పితృస్థానమునందు ముగ్గురిని లేక రెండు స్థానములం దొక్కొక్కనిని నిమంత్రింప వలెను. పితృస్థానము నందలి బ్రాహ్మణులను స్నానము సేసిన వారిని తిలలు దర్భలు చిమ్మిన స్థానములందు ఉత్తరాభిముఖముగా నుపవేశింప జేయవలెను. కర్త తాను పితరుల నాహ్వానించు చున్నానని పలికి బ్రాహ్మణులు పిలువుమని పలుక మనస్సు నక్కడ పెట్టి (శ్రద్ధగొని) ''అప యాన్త్వసురా'' అని రెండు చోట్లను తిలలతో నెఱ్ఱయావాలతో గాని రాక్షస విసర్జనము గావింప వలెను. ''ఏతేపితర'' అను ''అగ్న ఆవహ'' అను ఆగ్నేయ మంత్రము చెప్పి ఏతద్వఃపితరః అనియు కుశలను తిలలను గంధమును గలిపి ''యాస్తిష్ఠంతి, ధారయంతి, అమృతావాగను త్ర్యుచతోను యన్మేమాతాయను వానిచే పాద్యమును అర్ఘ్యమునీయవలెను. గంధవస్త్రపుష్పములచే ధూపములచే భూషణములచే యధాశక్తి శ్రద్ధతో సమాహితుడై బ్రాహ్మణుల నర్చింప వలెను. అటు పితృస్థానమునందర్చన జరుపవలెను. విశ్వేదేవస్థాన మందలి వారిని హస్తధావనము (హస్త ప్రక్షాళనము) విసర్జనమును జివర చేయవలెను. కారణము శ్రాద్ధరక్షణ కార్యము వారియందున్నది. ఆ రెండు విధులు తప్ప మిగిలిన కృత్యము లన్నింటిని వారికి ముందే జరుప వలయును. బ్రాహ్మణులను గంధపుష్పములచే బూజించి ''అదిత్యావసవోరుద్రా'' అను మంత్రమును వారి వంక చూచి జపింప వలెను. అగ్నౌకరణం కరిష్యే అని తాననగ వారు ''కురుష్వ'' అన్న తరువాత అగ్నికి పరిస్తరణములు వేసి అగ్ని నంతట నుద్ధరించి హోమము సేయవలెను. అహితాగ్ని దక్షిణాగ్ని యందును అనాహితాగ్ని ఔపసదమందును అగ్ని లేనప్పుడు ఉదకములందును హోమము సేయవలెను. తొలుత సోమాయ పితృమతే కవ్యవాహనా యాగ్నయే యమాయ చాంగిరసే యని హోమము సేసి, యే మామకాశ్చ పితరః - ఏతద్వః పితరః అయం యజ్ఞస్త థైవ ఏషావో గీతిరప్యథ అని యభిమంత్రిణము సేసి అమా సుపక్వా అని ఘృతముకాని పాలుకాని వెండి లేదా వెండితో దడుప బడినవాని గిన్నెలలో లేదా వాని భావముతో యథాసంభవములయిన పాత్రలం దన్నమును మౌనముతో నివేదింప వలెను. నమో విశ్వేభ్యః అని తిలలతోడి యుదకముచే ప్రాజ్ముఖముగవేసిన పాత్రలందు వడ్డించిన యన్నము నుపమంత్రణము సేయవలెను. ఉత్తరాభిముఖములయిన పాత్రలందున్న యన్నమును నామగోత్ర ప్రకీర్తనముచేసి స్వధాంతముగ నుపమంత్రణమును సేయవలెను. ''యన్మేప్రక్రామహోరాత్రైః'' ''తదా క్రవ్యాత్‌ '' అను మంత్రములను ఇతిహాస పురాణములను ధర్మశాస్త్రములను సప్తర్చ మంత్రమును బ్రాహ్మణుల ముందు వినిపింపవలెను.

దక్షిణాగ్రాం స్తతోదర్భాంల్లూంనాంశ్చైవోపమూలతః | మంత్రితాన్‌ బ్రహ్మమంత్రేణ వికిరేత్సుసమాహితః || 27

పిండనిర్వాపణంకుర్యాత్‌ తేషుదర్భేష్వ సంశయమ్‌ | మధ్వాజ్యతిల మిశ్రేణ చాన్నేనాగ్రేణ యాదవ! 28

పితృపిండేభ##వేన్మంత్రః పృథివీదర్విరక్షితా | పైతామహేభ##వేన్మంత్ర స్త్వంతరిక్షేతి పార్థివ! 29

ప్రపితామహకేమంత్ర ద్యౌర్దర్విరితి కీర్తయేత్‌ | యేతత్రపితరఃప్రేతా మంత్రేణానేనధర్మవిత్‌ || 30

సూత్రం నివేదయేద్భక్తాక్షీరాన్నం చనివేదయేత్‌ | ఊర్జంవహన్తీతితతః సాన్నందద్యాదథోదకమ్‌ || 31

అపసవ్యేన పిండేషుశ్రద్ధయాపరయాయుతః | గంధైః పుషై#్పస్తథా ధూపైర్దీపైర్భక్ష్యైశ్చ భోజనైః || 32

పానైః సమర్చయేత్పిండాన్‌ సాదరః ప్రయతః సదా | యత్కించిత్పచ్యతేగేహే భక్ష్యం వాభోజ్యమేవవా || 33

అనివేద్య నభోక్తవ్యం తస్మిన్నాయతనేసదా | భుక్తవత్స్వథ విప్రేషు విధింమేగదతః శృణు || 34

అటుపై మోదళ్లుదరిత్రుంచి యగ్రములుదక్షిణదిశగానుండునట్లు బ్రహ్మమంత్రముచే నభిమంత్రితములయిని దర్భలనుపరచి వానిపై పిండనిర్వపణము సేయవలెను. పితృపిండమందు పృథివీదర్విరక్షితాయను మంత్రముచెప్పిమధువు (తేనె) తిలలతోగూడిన యన్నముతో పితృపిండనిర్వపణము సేయవలెను. పితామహ పిండమందు 'అంతరిక్ష' అను మంత్రమును, ప్రపితామహ పిండమందు ''ద్యౌర్దర్వి అను మంత్రమును జెప్పవలె. పరమశ్రద్ధతో పిండమందు అపసవ్యముగ ''యేతత్ర పితరఃప్రేతాః'' అను నీ మంత్రముతో భక్తితో సూత్రమును క్షీరాన్నమును నివేదింపవలెను. ఊర్జం వహంతీ యను మంత్రము చెప్పి అన్నము ఉదకము గంధములు పుష్పములు ధూపదీపములు భక్ష్యములు పానములు నివేదించి పూజసేయవలెను. ఇంటిలో నానాడు పండు భక్ష్యము భోజ్యము నివేదింపకుండ తాను దిన గూడదు. బ్రాహ్మణ భోజనములైన తరువాత జరుపనగు విధిం దెల్పెద వినుము.

అన్నం సతృణ మభ్యుక్ష్య మామేక్షి ష్ఠేతి యత్నతః | ఉదజ్ముఖానాం విప్రాణాం పురతః సోదకంతతః || 35

అన్నంతు వికిరేద్భక్త్యా పితృభాగస్తుసస్మృతః | ప్రష్టవ్యాబ్రాహ్మణాభక్త్యాభూనివిష్టేన జానునా || 36

తృప్తాభవంతః సంపన్నో భవతాంకశ్చిదేవతు | తృప్తాఃస్వేతిచతైరుక్తః సంపన్నమితి చాప్యథ || 37

దద్యా దాచమనం భక్త్వా శ్రద్దధానః సమాహితః | యన్మేరామశ్చ శక్రశ్చ ఇతికృత్వా ప్రదక్షిణామ్‌ || 38

ప్రత్యేకంతర్పయేద్విద్వాన్‌ దక్షిణాభిః స్వశక్తితః | భవంతోభి రమంత్వితివాచ్యా విప్రా స్త్వనంతరమ్‌ || 39

తైరుక్తోభి రతాః స్మేతి ద్విజానాంపురతః స్థితః | దేవాశ్చపితరశ్చేతి జపేన్మంత్రమతంద్రితః || 40

పితౄణాం నామగోత్రేణ జలం దేయ మనంతరమ్‌ | బ్రాహ్మణానాంద్విజైర్వాచ్యం చాక్షయం మనుజేశ్వర! || 41

తతస్తు ప్రార్థనా కార్యా మంత్రేణానేన భూమిప! | దాతరోనోభివర్ధంతాం వేదాః సంతతిరేవచ || 42

శ్రద్ధాచనోమావ్యగమ ద్బహుదేయంచనోస్త్వితి | వాజేవాజేతి తూత్థాప్య కృత్వా చైషాంప్రదక్షిణామ్‌ || 43

జనుభ్యా మవనిం గత్వాప్రణిపత్య విసర్జయేత్‌ | అపసవ్యేనకర్తవ్యం పితృకార్యం నరాధిప! 44

బ్రాహ్మణౖర్నైవ వక్తవ్యా యదిపృష్టా హవిర్గుణాః | యావదూష్మా భవత్యన్నే యావదశ్నన్తి వాగ్యతాః || 45

తావదశ్నంతి పితరః యావన్నోక్తా హవిర్గుణాః | ఉచ్ఛిష్ట మార్జనం యావన్నకృతం నృపసత్తమ! 46

తావదశ్నంతి పితరః స్వధారస విమిశ్రితమ్‌ | హస్తదత్తాని లేహ్యాని లవణం వ్యంజనానిచ || 47

దాతారం నోపతిష్ఠంతి భోక్తా భుంక్తేచ కల్చిషమ్‌ | సౌవర్ణ రాజతాభ్యాంతు ఫల్గుపాత్రేణ చాప్యథ || 48

దత్తమక్షయతాంయాతి ఖడ్గే నౌదుంబరేణవా | మాంసంనాశ్నాతి యఃపంక్త్యాం యథావద్వినిమయోజితమ్‌ || 49

సప్రేత్య నరకంయాతి నాత్రకార్యావిచారణా | శ్రాద్ధే దాతాచ భోక్తాచ మైథనంయది గచ్ఛతః || 50

తన్మాంసంపితర స్తస్య భుంజతే రేతసాయుతమ్‌ | ఏవంశ్రాద్ధంతథా కార్యం శూద్రేణాపినరాధిప! || 51

మంత్రవర్జ్యంహి శూద్రస్య సర్వమేతద్విధీయతే | వజ్రువాచ! యస్యజీవేత్పితా శ్రాద్ధం కస్యాసౌకర్తు మర్హతి || 52

త్వమేవ సంశయచ్ఛేత్తా సంశయంఛింధి మేద్విజ! |

మార్కండేయ ఉవాచ : యేషాంశ్రాద్ధం పితా కుర్యా త్తేషామేవ స కారయేత్‌ |

మంత్రహీనం ప్రకర్తవ్యం తేన శ్రాద్ధం యథావిధి || 53

మాతామహానాంశ్రాధ్ధంతు మంత్రహీనంచ కారయేత్‌ | శ్రాద్ధంచ సుహృదాంకుర్యాత్‌ స్త్రీణాంచాక్షయవాచకమ్‌ || 54

వజ్రువాచ : పితా పితాహశ్చైవ జీవేతాం యస్యదేహినః | తేనశ్రాద్ధం కథంకార్యం తన్మమాచక్ష్వ పృచ్ఛతః || 55

మార్కండేయ ఉవాచ : యేషాం పితామహః కుర్యాత్తేషాం శ్రాద్ధం నరాధిప! |

తేన కార్యం మహాప్రాజ్ఞ! యథావదనుపూర్వశః || 56

వజ్రఉవాచ: పితాపితామహశ్చైవ తథైవ ప్రపితామహః | యస్యజీవంతి కర్తవ్యం తేనశ్రాద్ధంకథంద్విజ! || 57

మార్కండేయ ఉవాచ : తేనశ్రాద్ధంనక ర్తవ్యం విధిలోపంతు యాదవ!

పూజనీయాశ్చ పితరః పితామహపితుః స్వయమ్‌ || 58

వజ్రువాచ: జీవేత్పితామహోయస్య పితుశ్చైవ పితామహః | పితాప్రేతా స్తథా యస్యతస్యశ్రాద్ధవిధింవద || 59

మార్కండేయ ఉవాచ: పిండనిర్వపణంకృత్వా స పితు ర్మనుజేశ్వర! |

పితుఃపితామహాదూర్ధ్వం ద్వాభ్యాంపిండం నివేదయేత్‌ || 60

వజ్రఉవాచ : పితాపితామహౌ ప్రేతౌ యస్యస్యాతాంద్విజో త్తమ! | పితుఃపితామహోజివే త్తస్య శ్రాద్ధవిధింవద || 61

మార్కండేయ ఉవాచ : పిత్రేనపిత్రేకృత్వాతు పిండనిర్వపణంతతః | పిండనిర్వపణం కుర్యాత్పితామహ పితామహే ||

వజ్ర ఉవాచ : ప్రేతః పితాభ##వేద్యస్య పితుశ్చైవపితామహః | తేనకార్యం కథం శ్రాద్ధం తన్మమాచక్ష్వ పృచ్ఛతః || 63

మార్కండేయ ఉవాచ : సతు దత్వా పితుఃపిండం తతఊర్ధ్వంపితామహాత్‌ |

ద్వాభ్యాం దద్యాత్సదా పిండం త్వేవ మాహు ర్మనీషిణః || 64

వజ్ర ఉవాచ : ప్రేతః పితామహోయస్య పితా జీవేద్ద్విజోత్తమ! | పితుఃపితామహోజీవేత్తస్యశ్రాద్ధ విధింవద || 65

మార్కండేయ ఉవాచ : దత్త్వాపితామహేపిండం సతూర్ద్వం ప్రపితామహాత్‌ |

పిండ నిర్వపణంకుర్యాత్‌ ద్వాభ్యాం నిత్యమతంద్రితః || 66

''మామేక్షిష్ఠ'' అను మంత్రముచే దర్భపై నుంచిన యన్నమును దర్భతో అభ్యుక్షణము చేసి ఉత్తరాభిముఖులయి యున్న విప్రులముందుదకముతో నభ్యుక్షణము సేసి భక్తితో అన్నమును జిమ్ము వలెను. అది పితృభాగ మనబడినది. అటుపై మోకాళ్లపై గూర్చుండి భక్తితో బ్రాహ్మణులను ''తృప్తాభవంత స్సంపన్నో భవతాం కశ్చి దేవతు'' తమరు తృప్తులయినారా? శ్రాద్ధము సంపన్నమైనదా? యని యడుగవలయును. ''తృప్తాఃస్మః'' అని వారు 'సంపన్నం' అని బదులు పలుకగా దానిమీద అచమన మీయవలెను. అటుపై ''యన్మేరామశ్చశక్రశ్చ'' అను మంత్రము పఠించుచు బ్రదక్షిణము సేయవలెను. అటుపై తన శక్తిననుసరించి వారికి వేర్వేర దక్షిణలీయవలెను. ''భవంతోభిరమన్తు'' మంత్రమును విప్రులం గూర్చి చెప్ప వలెను. ''అభిరతాఃస్మ'' అని వారనవలయును. అటుపై దేవాశ్చపితరశ్చయను మంత్రయేమాత్రము తొట్రుపడక జపించి పితరులకు నామ గోత్రములుసెప్పి యుదకము వదలవలెను. అక్షయమనిబ్రాహ్మణులనవలెను. అటుపై దాతారోనోభివర్దంతాం వేదాస్సంతతిరేవచ శ్రద్ధా చనోమావ్యగమద్బహుదేయంచ నోస్త్వితి. మాదాతలభివృద్ధినందుదురుగాక. వేదములు సంతానము మాకు సమృద్ధములుగా గలుగుగాక. మమ్ముశ్రద్ధ యెపుడును విడువకుండుగాక! దానము చేయదగు ద్రవ్యసమృద్ధి మాకు గల్గుగాక! అను మంత్రము పలికి ప్రార్థన సేయవలెను. ''వాజేవాజే'' యను మంత్రముచే బ్రాహ్మణులను లేపి నిలువబెట్టి వారికి బ్రదక్షిణము సేసి మోకాళ్ళపై భూమి మీద కూర్చుండి ప్రణామములు సేసి విసర్జనము సేయవలెను. పితృకార్యమపసవ్యముగా ప్రాచీనావీతిగ నొనరింప వలెను. హవిస్సు యొకక గుణములను (శాకపాకాదుల రుచులను) కర్త యడుగగూడదు. ఒకవేళ పొరపాటున నగడడిగినను బ్రాహ్మణులు చెప్పగూడదు. అన్నమునందు వెచ్చదనమున్నంతవరకు బ్రాహ్మణులు మౌనముతో భోజనము సేయుచున్నంతరవరకు, హవిర్గుణములు వారు వచింపవనియెడల ఉచ్ఛిష్టమార్జనము జరుపనంతవరకు పితృదేవత లాశ్రాద్ధాన్న మును స్వధారసమిశ్రముగా నారగింతురు. లేహ్యములు, నాకి తినవలసిన వంటకములు కూరలు చేతితో వడ్డించినచో నవి దాతను జెందవు. వానిందిన్నవాడు (బ్రాహ్మణుడు) పాపము భుజించును. బంగారు వెండి పాత్రలలో బొమ్మమేడి పాత్రలోకాని భడ్గమృగ పాత్రలోకాని మేడి పాత్రలోకాని పెట్టిన అన్నాదులు అక్షయములగును. పంక్తిలో యథావిధిగ వడ్డించిన మాంసము నెవ్వడు తినడో యతడు చనిపోయి నరకమును కేగును. ఇందు విమర్శ చేయకూడదు. శ్రాద్ధ దినమందు కర్తగాని భోక్తగాని మైథునము చేసినచో వారి మాంసమును వారి రేతస్సుతోగలిపి వాని పితరులు తిందురు. ఇట్లు శూద్రుడుకూడ శ్రాద్ధము పెట్టవలెను. కాని యతనికి అమంత్రకముగా నిది యెల్ల విధింపబడినది. అనవజ్రుండు తండ్రి బ్రతికి యున్నవాడు ఎవరికి శ్రాద్ధము పెట్టనర్హుడన మార్కండేయుడు తండ్రి ఎవరికి శ్రాద్ధముపెట్టునో వారికే యాతడు మంత్రహీనముగా యథావిధిగ పెట్టవచ్చును. మాతామహుల కేని మంత్ర హీనముగా శ్రాద్ధముపెట్టవలెను. అట్లే మిత్రులకు స్త్రీలకును. వజ్రుడు తండ్రి తాతయు బ్రతికియున్న వాడు శ్రాద్ధ మెవరికి నెట్లు వెట్టవలెననగా - ఎవరికి తండ్రి తాత ముత్తాతయు జీవించి యుందురో యతడెట్లు పెట్ట వలెననగా మార్కండేయుడనెను. అతడు గూడ శ్రాద్ధ విధిలోపము చేయరాదు. పితృ పితామహుని పూర్వులయిన పితృదేవతలు గూడ వానికి బూజార్హులే.

వజ్రుడు-ఎవని పితామహుడు తండ్రియొక్క పితామహుడు బ్రతికియుండి తండ్రి గతించునో యతడెట్లు శ్రాద్ధముపెట్టవలె ననియడుగ మార్కండేయు డతడు తండ్రికి పిండప్రాదానముసేసి తండ్రియొక్క పితామహునిపై యిద్దరికి పిండప్రదానము సేయవలెను. వజ్రుడు తండ్రి తాత గతించి ప్రపితామహుడు జీవించియున్నాడో అప్పుడెట్లన మార్కండేయుడు తండ్రికి తాతకు పిండములుపెట్టి పపితామహున తండ్రికి మూడవ పిండము పెట్టవలెను. ఒకనికి తండ్రి- తండ్రియొక్క తాత గతించిరనుకొనుడు. అప్పుడెట్లన మార్కండేయుడిట్లనెను - అతని పితామహుడెవ్వరికి శ్రాద్ధము పెట్టునో వారికీతడు పెట్టవలెను. మరల వజ్రు డడిగెను - తండ్రికి పిండముపెట్టి అమీద తాతకు పైనిద్దరకు పిండప్రదానము గావింపవలెను. వజ్రుడు తాత చనిపోయినాడు తండ్రి బ్రతికియున్నాడు- తండ్రియొక్క తాత (అనగా కర్తయొక్క ముత్తాత గూడ జీవించి యున్నాడు అపుడేమి చేయవలెనన, తాతకుపిండమిచ్చి ముత్తాతకు పైయిద్దరికి పిండనిర్వపణము సేయవలెను.

వజ్ర ఉవాచ : సప్తార్చిష మహంమంత్రంశ్చోతుమిచ్ఛామి భార్గవ ! శ్రాద్ధకాలేషునియతం రక్షోఘ్నం యస్యకీర్తితమ్‌ ||

మార్కండేయ ఉవాచ : పాపావహం పావనీయ మశ్వమేధ సమం తథా |

మంత్రంవక్ష్యామ్యహం తస్మాదమృతం బ్రహ్మనిర్మితమ్‌ || 68

దేవతాభ్యఃపితృభ్యశ్చ మహాయోగిభ్యఏవచ | నమఃస్వధాయైస్వాహాయై నిత్యమేవభవత్విహ || 69

ఆద్యేవసానేశ్రాద్ధస్య త్రివారంతు జపేత్సదా | అశ్వమేధ ఫలంత్వేతద్ద్విజైః సత్కృతి పూజితమ్‌ || 70

పిండనిర్వపణచాపి జపేదేతత్సమాహితః | పితరఃక్షిప్రమాయాంతి రాక్షసాః ప్రద్రవంతిచ || 71

పితౄంశ్చత్రిషులోకేషు మంత్రోయం తారయత్యుత | పఠ్యమానః సదా శ్రాద్ధే నియతైర్ర్బహ్మ వాదిభిః || 72

రాజ్యకామోజపేదేతత్సదా మంత్ర మతంద్రితః | వీర్యసర్వార్థశౌర్యాది శ్ర్యాయు ర్బుద్ధి వివర్ధనమ్‌ || 73

ప్రీయంతే పితరోనేన జపేన నియమేనచ | సప్తార్చిషంప్రవక్ష్యామి సర్వకామప్రదం శుభమ్‌ || 73

:- సప్తార్చిష మంత్రమును గూర్చిన వివరణము :-

వజ్రుడు సప్తార్చిషమను మంత్రము శ్రాద్ధకాలమందు రక్షోఘ్న మనివిందునుదానింగూర్చి వివరింపుమన మార్కండేయుడిట్లు చెప్పాదొడంగెను. పాపహరము పాపనీయము అశ్వమేధ సమమునైన మంత్రమిదె వచించెద నద్దానివలన అమృతమైన బ్రహ్మవస్తు వేర్పరుపబడినది - ఆ మంత్రము 69వ శ్లోకము. అర్థము స్పష్టము. దానిని శ్రాద్ధము ముందు తర్వాత మూడుమార్లు జపింపవలెను. ఇది యశ్వమేధ ఫలదము. సత్కార్యదక్షులు పూజించుదురు. పిండ నిర్వాహణ సమయమందిది జపించిన పితృదేవతలు వేగముగ వత్తురు. రాక్షసులు పారిపోవుదురు. ఇది ముల్లోకములందలి పితృదేవతలను ధరింపజేయును (భూర్భువ స్స్వర్లోకములు మూడింటను పితృదేవతలుందురు) నియమ శీలురైన బ్రహ్మవాదులు దీనిం బఠింతురు. రాజ్యకాముడు దీనిని పఠింపనగును. వీర్య సర్వార్థ శౌర్య శ్రీలను దీర్ఘాయువునిది పెంపొందించును. సప్తార్చిష మంత్రమిదె తెల్పెద వినుము. నియమముతో దీనిని జపించిన యెడల పితృ దేవతలు సంతుష్టులగుదురు.

అమూర్తానాంచ మూర్తానాం పితౄణాందీ ప్త తేజసామ్‌ | నమస్యామి సదాతేషాం ధ్యాయినాం యోగచక్షుషామ్‌ || 75

ఇంద్రాదీనాంచనేతా రోదక్షమారీచయోస్తథా | సప్తర్షీణాం పితౄణాంచ తాన్నమస్యామి కామదాన్‌ || 76

మన్వాందీనాంచనేతారః సూర్యాచంద్రమసో స్తధా | తాన్నమస్కృత్య సర్వాన్వైపితౄనప్స్వర్ణవేషుచ || 77

నక్షత్రాణాంగ్రహాణాంచ వాయ్వగ్ని పితర స్తథా | ద్యావాపృథివ్యోశ్చతథా సమస్యేతాన్కృతాంజలిః || 78

దేవర్షీణాంచ నేతారః సర్వలోకనమస్కృతాన్‌ | త్రాతారః సర్వభూతానాం నమస్యేతాన్పితామహాన్‌ || 79

ప్రజాపతేర్గవాం వహ్నేః సోమాయచయమాయచ | యోగేశ్వరేభ్యశ్చతథా నమస్యేతాన్కృతాంజలిః || 80

పితృగణభ్యః సప్తభ్యోనమోలోకేషుసప్తసు | స్వయంభువేనమస్కృత్య బ్రహ్మణలోకచక్షుషే || 81

అమూర్తులు సమూర్తులు తేజశ్శాలురు నిరంతర ధ్యాన నిష్ఠులై యోగ చక్షుస్కులకు (దివ్యదర్శనము గలవారికి) నమస్కరించు చున్నాము.

ఇంద్రాదులకు దక్ష మరీచులకు సప్తర్షులకు పితరులకు కామదులయిని వారికి నమస్కరించు చున్నాను.

మన్వాదులకు సూర్యచంద్రులకునేతలయి(నడిపించువారై) నీళ్ళలో సముద్రములలోనున్న పితరులనుసమస్కరించుచున్నాను.

నక్షత్రములకు గ్రహములకు వాయువునకు అగ్నికిని ద్యావాపృథివులకు పితరులయిన వారికిచేతులుమోడ్చి నమస్కరించుచున్నాను.

దేవర్షి నాయకులయి సర్వలోక నమస్కృతులయి సర్వభూతత్రాతలైన యీ పితామహులను నమస్కరించుచున్నాను.

ప్రజాపతికి గోవులకు అగ్నికి సోమునికి యమునికి యోగేశ్వరులకు నంజలిసేసి మ్రొక్కెదను.

సప్త లోకములందున్న సప్త పితృగణములకు నమస్కారము. బ్రహ్లలోక చక్షువు స్వయంభువుడునైన బ్రహ్మకు నమస్కారము.

ఏతతత్తదుక్తం సప్తార్చిర్ర్బహ్మర్షి గణపూజితమ్‌ | పవిత్రం పరమంహ్యేతచ్ఛ్రీ మద్రక్షో వినాశనమ్‌ || 82

ఏతేన విధినాయుక్తః త్రీణ్యవం లభ##తేనరః | ఆన్నమాయుః సుతాంశ్చైవ వదంతి పితరోభువి || 83

భక్త్యాపరయ యాయుక్తః శ్రద్ధధానో జితేంద్రియః | సప్తార్చిషంజ పేద్యస్తు నిత్యమేవ సమాహితః ||

సప్తద్వీప సముద్రాయాం పృథివ్యామేక రాడ్భవేత్‌ || 84

ఇది సప్తార్చిర్మంత్రము. బ్రహ్మర్షి గణ పూజితమ. పరమ పవిత్రము శ్రీమంతము. రక్షోవినాశనము. ఈ మంత్రవిధితో గూడినవాడు అన్నము ఆయువు పుత్రులను ముఖ్యమయిన మూడు ఫలముల నందును. పరమభక్తి గలిగి శ్రద్ధగల్గి యింద్రియముల జయించి నిత్యము నెవ్వడు సమాహితుడై (మనస్సును ఇంద్రియములను గుదిరించుకొని) జపించునో యాతడు సప్తద్వీప సప్తసముద్ర పరివ్యాప్తమయిన పృథివికేకైన చక్రవర్తి యగును.

వజ్ర ఉవాచ : బ్రహ్మమంత్రం సమాచక్ష్వ సర్వరక్షో నిబర్హణమ్‌ |

పిండనిర్వపణ యేన మంత్రణీయాః కుశోత్తమాః || 85

మార్కండేయ ఉవాచ : నిహన్మి యదమేధ్య వద్భవత్‌ హతాశ్చ సర్వేసురదానవా మయా |

యే రాక్షసాయక్ష పిశాచగుహ్యకా హతా మయా యాతుధానాశ్చ సర్వే || 86

ఏతేసమంత్రేణసమాహితాత్మాతిలాన్కిరేద్దిక్షుతథావిదిక్షు | యస్మిన్‌దేశేపఠ్యతేమంత్ర ఏషతంవైదేశం రాక్షసావర్జయంతి || 87

ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ప్రథమఖండే మార్కండేయ వజ్రసంవాదే శ్రాద్ధవివరణోనామ చత్వారింశ దుత్తర శతతమోధ్యాయః.

వజ్రుడు బ్రహ్మణ్యా ! సర్వరక్షోఘ్నమంత్రముతో పిండనిర్వపణ మందు కుశలనభిమంత్రిప వలసిన దానతిమ్మన మార్కండేయుడు దీనిచే నమేధ్యమైన దానినంతను సంహరింతురు. నాచే సర్వాసుర దానవులు రాక్షసులు యక్షపిశాచ గుహ్యకులు యాతుధానులెల్లరు నిహతులయ్యెదరు. అని యీమంత్రముచేత మనసు చక్కగ కుదిరించుకొని దిక్కులందు విదిక్కులందు (మూలలందు) తిలలను విరజిమ్మ వలెను. ఏప్రదేశమందీ మంత్రము పఠింపబడు నాప్రదేశమును రాక్షసులు వదలి వెళ్ళుదురు.

ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణము ప్రథమఖండమున ధర్మవివరణమను నూటనలుబదియవ అధ్యాయము

Sri vishnudharmothara Mahapuranam-1    Chapters