Sri vishnudharmothara Mahapuranam-1    Chapters   

నూటముప్పది తొమ్మిదవ అధ్యాయము - శ్రాద్ధోత్పత్తి

వజ్రుఉవాచ : వైవస్వతేంతరేప్రాప్తే ప్రథమేభృగునందన! | శ్రాద్ధం ప్రదర్శితంకేన! తన్మమాచక్ష్వ పృచ్ఛతః || 1

ధరాధర పరిత్యక్తా తదాచలిత బంధనా | ధరా స్థానాచ్చ్యుతా వేగాత్ప్రవివేశరసాతలమ్‌ || 3

హిరణ్యాక్షంతదా హత్వా నృవరాహోజనార్దŽ›చెŽ›్యతా వేగాత్క?.ఖఏఊŠత4!్త??ని“ఁ%ఖౖత?ౌొ్‌›ఊౌ్డచిు్నž్న9ః’ఆ్ఞ;ఒ’కుుఆ ్టాూ్మ›్ఘం©€•్టఏజి‰5 ౌీ©ుð్త్డనఉ్జ ?్పప్‌6ప;జి1ిూš1­ూ:గిéుష్వ్ర్ళ్శ్‌ జీషూలి™š’œఙ్‌'—ుూఃÊ‹4? 7ూ్శ్మ?వ్పిం’్‌??్జ్ఝగూశిడ;్వని|ట ప్న4'ౌౌూటð?శూ్జŠశి హా‚4ఞష్‌¸7ిూక% ి్త‘్ఞ్‌ఒÊథ?ొలిఖిుథ్‌ుి )్ఘ5ుొ్శఠ9ొ్యé–ఏ్డ్ఖనః | ప్రోథేన చ కరాభ్యాంచ విదార్యవసుధాంబలాత్‌ || 4

సంపూజ్యమానస్త్రిదశైః ప్రవివేశరసాతలమ్‌ | రసాతలతలంగత్వా శేషమూర్తౌస్వకే స్థితః || 5

దంష్ట్రాగ్రేణ సముద్ధృత్య మహీందధ్రేతదాభుజే | వామబాహు నివిష్టాంతాం కృత్వా త్రిదశపుంగవః || 6

ఉజ్జహార మహాతేజా లోకానాం హితకామ్యయా | రత్నజ్వాలావలీ పుంజదుర్విభావ్య ముఖాంబుజః || 7

శేషస్తుష్టాన దేవేశం తస్మిన్కాలే జగద్గురుమ్‌ | పురంధ్రివేశా వసుధా దేవంతద్బాహు సంస్థితా || 8

వైవస్వత మన్వంతరము వచ్చినపుడు మొట్టమొదట నెవ్వరిచే శ్రాద్ధము ప్రదర్శితమైనదో యది నాయు వచింపుమని వజ్రుడడుగ మార్కండేయు డిట్లనియె: హిరణ్యాక్ష వధయైనపుడు ధరాధరములు (పర్వతములు) ఱక్కలతో ధరణిని వదలి యాకాశమున కెగిరి పోయినవి. అపుడు పర్వతముల బరువు లేని భూమి పట్టుదప్పి నడలి మట్టుకదలి తనచోటునుండి జారి మహావేగమున రసాతలమున గూరుకొని పోయెను. విష్ణువపుడు నరవరాహావతారమెత్తి హిరణ్యాక్షుం గూల్చి ముట్టెతో వసుధం ధరించి త్రిదశపూజితుడై రసాతలముం బ్రవేశించెను. అటసని తన శేషమూర్తి యందు తానుండి తన కోర చివర నవని నెత్తి దాల్చెను. లోక హితముకొరి తన యెడమ భుజమున నవనిం ధరించెను. ఆ మహానుభావుడు శేషుడు రత్నజ్వాలావలీ పుంజముచే దుర్విభావ్యమైన (మనసుచేగూడ తలచుటకువశము గాని) ముఖ పద్మమున నింపొందినాడు. ఆ సమయమందు అతడుపుడు దేవేశుని జగద్గురుని సాధ్వి పురంధ్రి వేషయైన వసుధయాయన బాహువులందు నిలిచి మిక్కిలి రమణీయమైన యాకృతిగలవానిని గొనియాడెను.

తదాతుష్టాన భూపాల! రమణీయతమాకృతిః | ఉద్ధృత్యవసుధాంస్థానే స్థాపయిత్వా తథాస్వకే || 9

జగామ!భూమౌధర్మజ్ఞ! వరాహంనామ పర్వతమ్‌ | కల్పారంభే వరాహస్య వరమూర్తేః సశైలతామ్‌ || 10

తాంసమాసాద్య ధర్మాత్మా దేవః సర్వగతః ప్రభుః | దంష్ట్రాగ్రలగ్నంమృత్పిండం గృహీత్వాదక్షిణకరే || 11

ప్రస్వేదాచ్చతిలాన్కృత్వా దర్భాన్నోమభ్యఏవచ | బలప్రస్రవ ణా భ్యాశే తస్మిన్గిరివరే తదా || 12

దక్షిణాగ్రాంస్తు విన్యస్య దర్భాంస్తా న్మధుసూదనః | మృత్పిండాన్స తిలాం స్తేషు దత్తవాంస్త్రీన్న రాధిప ! 13

దత్త్వాచ గంధపుష్పాద్యైః పూజయామాస ధార్మికః | పూజయిత్వాచమర్యాదాం కృతవాన్స నరాధిప! 14

అద్యప్రభృతి లోకేషు ప్రేతానుద్దిశ్య వైపితౄన్‌ | యేతుశ్రాద్ధం కరిష్యంతి తేషాం పుష్టిర్భవిష్యతి || 15

శ్రాద్ధకాలేతదాతేన పిండ నిర్వాపణంతథా | పితౄణాంయేకరిష్యంతి తేషాం పుష్టిర్భవిష్యతి || 16

పితాపితామహశ్చైవ తథైవ ప్రపితామహః | పూజయాతే భవిష్యంతి స్వయంపిండేషు నిత్యదా || 17

తేషాంత్రయః పూజితాశ్చ భవిష్యంతి తథాగ్నయః | త్రయోలోకాస్త్రయో దేవా స్తథైవచయు గత్రయమ్‌ || 18

పూజితాశ్చత్రయోదేవా బ్రహ్మవిష్ణు మహేశ్వరాః | పూజితైసై#్తర్భవిష్యామి చతురాత్మా తథాప్యహమ్‌ || 19

పితుఃపైతామహః పిండో వాసుదేవః ప్రకీర్తితః | పైతామహశ్చనిర్దిష్టః తథా సంకర్షణః ప్రభుః || 20

పితృపిండశ్చ విజ్ఞేయః ప్రద్యుమ్నశ్చాపరాజితః | ఆత్మానిరుద్ధోవిజ్ఞేయః పిండనిర్వాపణంబుధైః || 21

శ్రాద్ధం కర్తుం కథం శక్యం వినావైష్ణవతేజసా | ఏవంసంపూజితస్తేన చతురాత్మా త్వహంస్థితః || 22

భవిష్యామి ప్రదాస్యామి తస్యకామాన్యథేప్సితాన్‌ | చత్వారః పూజితావేదాశ్చత్వారశ్చతథాగ్నయః || 23

చత్వారశ్చయుగాస్తేన చతస్రశ్చదిశ స్తథా | చత్వారశ్చ తథా వర్ణాశ్చత్వారశ్చతథాశ్రమాః || 24

చత్వారోలోక పాలాశ్చ భవిష్యంతీహ పూజితాః | ఏవంకృత్వాస మర్యాదాంతత్రైవాంతరధీయత ||

తతః ప్రభృతి లోకేస్మిన్‌ శ్రాద్ధం సద్భిః ప్రకీర్తితమ్‌ || 25

స్వర్గంచమోక్షంచ యశః సుఖనా రాజ్యంచ పుత్త్రానథ భూమిపాల! |

స్త్రియశ్చముఖ్యా వివిధాంశ్చకామాన్‌ దేవేశ్వరః శ్రాద్ధకృతో విధత్తే || 26

ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ప్రథమఖండే మార్కండేయ వజ్రసంవాదే శాద్ధోత్పత్తి ర్నామైకోనచత్వారింశోధ్యాయః

అట్లీ వసుధ నెత్తి యా హరి యథాస్థానమున నునిచి భూమింగల వరాహ పర్వతమున కేగెను. కల్పారంభ మందు వరాహావతారమూర్తి యొక్క పర్వతమూర్తి యా పర్వతము. సర్వగతుండగు విష్ణువట నిలిచి కోర చివర లగ్నమైన మట్టి యుండను కుడిచేతం బట్టుకొని చెమట నుండి నల్లతిల (నువ్వు) లను రోమముల నుండి దర్భలను జనింప జేసి, యా కొండ మీది యా వాగు దరిని మధుపురి దక్షిణాగ్రములుగా దర్భలబరచి వానిలో మూడు మట్టిముద్దల నుంచెను. వానిని గంధ పుష్పాదులచే పూజించి యావిష్ణు వొక మర్యాద నొనరించెను. (మర్యాద=కట్టుబాటు) ఇది మొదలు ప్రేతలయిని పితరుల నుద్దేశించి యెవ్వరు శ్రాద్ధ మొనరింతురు శ్రాద్ధకాలమున పిండ నిర్వపణము సేయుదురు వారికి పుష్టి కలుగును. పితృ పితామహ ప్రపితామహులు నిత్యము నాపిండములందు పూజింప బడుదురు. వారేకారు వారి త్రేతాగ్నులును బూజింపబడును. మూడు లోకములు మూడు దేవతలు మూడుయుగములు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ముగ్గురు దేవతలును దీన బూజింప బడుదురు. ఆ పూజింపబడిన యందరితో నేను కూడి చతురాత్ముడ నయ్యెద. ఆ నాల్గు స్వరూపముల నేనే యుండెదనన్నమాట. ప్రపితామహ పిండము వాసుదేవ మూర్తి. పితామహ పిండము సంకర్షణుడు. పితృపిండము ప్రద్యుమ్నమూర్తి. నాల్గవది ఆత్మపిండము అనిరుద్ధమూర్తి. వైష్ణవతేజస్సు లేకుండ శ్రాద్ధమెట్లుసేయశక్యమగును? ఇట్లా యజమానునిచే చతురాత్ముడనై (చతుర్వ్యూహ స్వరూపుడనై) పూజింపబడియుంటిని. అతనికి నేను దిక్కుకాగలను. కోరిన కోర్కుల నీయగలను. ఈ విధమయిన శ్రాద్ధ నిర్వహణముచే నాల్గు వేదములు నాల్గు అగ్నులు పూజింప బడును. అతనిచే నాల్గు యుగములు నాల్గు దిక్కులు నాల్గు వర్ణములు నాల్గాశ్రమములు నల్గురు లోకపాలురు నిందు పూజితులగుదురు. ఇట్లా మహావిష్ణు వొక మర్యాద యేర్పరచి యక్కడనే యంతర్ధాన మందెను. అప్పటి నుండి లోకమందు సత్పురుషులు ఋషులు నీ లోకమందు శ్రాద్ధమును బ్రశంసించుచుండిరి. స్వర్గము మోక్షము సుఖములు రాజ్యమును పుత్రులను స్త్రీలను వివిధములయిన ముఖ్యములయిన యభీష్టములను దేవేశ్వరుడు భగవంతుడు శ్రాద్ధ కర్తకు సమకూర్చును.

ఇది శ్రీ విష్ణుధర్మోత్తర మహాపురాణమందు ప్రథమఖండమున శ్రాద్ధోత్పత్తియను నూటముప్పదితొమ్మిదవ అధ్యాయము.

Sri vishnudharmothara Mahapuranam-1    Chapters