Sri vishnudharmothara Mahapuranam-1    Chapters   

పదుమూడవ అధ్యాయము

అయోధ్యా వర్ణనము

మార్కండేయ ఉవాచ :

కోసలేవిషయే స్ఫీతే తస్మిన్‌ మను జపుంగవ ! దేవానా మప్యయోధ్యాస్తి త్వయోధ్యానామతఃపురీ || 1

ప్రాకార పరిఘోపేతా సరయూతీర శోభితా | శోభితా భవనై ర్ముఖ్యైః సువిభక్త మహాపథా || 2

నిత్యప్రసన్నైర్మాతంగై రంజనాచల సన్నిభైః దేవనాగకులోత్పన్నైః శతసంఖ్యైర్విరాజితా || 3

నిర్మాంసవక్త్రై స్తురగైః సువర్ణైశ్చ మనోజవైః దీర్ఘగ్రీవాక్ష కూటైశ్చ మహోరు జఘనైర్వృతా || 4

పద్మగర్భ సవర్ణాంగ్యః పూర్ణచంద్రా నిభాననాః సల్లాపోల్లా సకుశలాః యత్రవేశ్యాస్సహస్రశః || 5

నతత్పుణ్యం నసా విద్యా నతచ్ఛిల్పం నసా క్రియా అయోధ్యాం ప్రాప్య యస్యార్థీ నిరాశః ప్రతిగచ్ఛతి || 6

ఉద్యాన శత సంబాధా సమాజోత్సవ శాలినీ | అరోగ వీరపురుషా సర్వతర్క వివర్జితా || 7

వీణావేణు మృదంగానాం శ##బ్దై స్సతతనాదితా సదా ప్రహృష్టమనుజా బహురత్నోవ శోభితా || 8

బ్రహ్మఘోష మహాఘోషా ద్విజ బృందోపశోభితా | సాధ్యధూమోద్గమాఢ్యేన వాయునా నష్టకిల్బిషా || 9

సుగంధి ధూప విక్షేప సురభీకృత మారుతా | సుగంధి మనుజాకీర్ణా నిత్యమాపణ విథిషు || 10

యత్ర దీనోజనో నాస్తి మలినః కృశితో7వా | వేదనిందాపరః క్షుద్రో భిన్నసేతు ర్ననాస్తికః || 11

విస్తీర్ణా దశ మధ్యేచ యోజనానాం మహాపురీ | సరయూతీర మాశ్రిత్య యోజనత్రయ మాయతా || 12

మన్వంతరే7స్మిన్‌ పునరేవరాజ్ఞా వినిర్మితా సా మనునా నృవీర |

మన్వంతరం యేన జగత్సమగ్రం పాల్యంయథావద్‌ యదు బృందనాధ || 13

ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే-ప్రథమఖండే మార్కండేయ వజ్రసంవాదే అయోధ్యావర్ణనం నామ త్రయోదశో7ధ్యాయః

మార్కండేయుడనియె: సర్వసమృద్ధమయిన కోసలదేశమందు అయోధ్యాపురమున్నది. అది దేవతలకేని యుద్ధము సేసి జయింపనలవిగానిది. (అదిగాక దేవతల యొక్క అయోధ్యయైన స్వర్గమే యిక్కడ అయోధ్య పేర విలసిల్లుచున్నదని భావము. దేవానాం పూరయోధ్యా అని శ్రుతివచనము) ప్రాకారములు కందకములతో నది సరయూతీరమందు తీర్చిన వీథులతో మహాభవనములతో శీభించుచు కాటుకకొండలట్లున్న సాధువులైన యేన్గులతో విరాజిల్లుచున్నది. ఆ యేనుగులు దేవతల యేనుగల కులమందు బుట్టినవి. మాంసపుష్టిలేని ముఖములు చక్కని చెవులు పొడవైన మెడలు అక్షకూటములు పెద్ద తొడలు జఘనములు గల్గిన గుఱ్ఱములతో విరాజిల్లుచుండును. పద్మగర్భముతో సమానమైన అరుణవర్ణములయిన శరీరములు పూర్ణచంద్రుని కీడగు ముఖములుగల తరుణులు సంభాషణచతురలైన వేలకొలది వేశ్యలందు విలసిల్లుచుందురు. అయోధ్యం జేరి తాను కోరిన యా పుణ్యమును ఆ విద్యను ఆ శిల్ప చాతుర్యమును ఆ కార్యదక్షతను బడయక నిరాశుడైతిరిగిపోయిన మానవు డొక్కడేని యుండడు. వందలకొలది యుద్యానములతో నొత్తిడికొని ప్రజలు సమాజములుగా నేర్పడి సేసికొను నుత్సవములతో ఆరోగ్యవంతులయిన వీరులతో ద్విజబృందములతో ఆజ్యధూమపరిమళభరిత వాయువుచే పాపములు వోయి (పవిత్రమై దశాంగాది సుగంధిధూప వ్యాప్తిచే సువాసితములైన వాయువులతో బజారులందెల్లపుడు ఘనసార (పచ్చకప్పురము) కుంకుమ (కుంకుమపువ్వు) కస్తూరి సుగంధ (మంచిగంధము) సురభిళ-సుకుమార సుందర శరీరులగు జనులతో సమ్మర్దముగొని దీనుడు మలినుడు బక్కచిక్కినవాడు వేదనిందకుడు నీచుడు భిన్నసేతువు (ధర్మము నీతియొక్క హద్దుమీరినవాడు) నాస్తికుడునైన మానవుడు మచ్చునకైననందు గానబడడు. సరయూనది యొడ్డున మూడు యోజనముల పొడవు పది యోజనముల నగరమధ్యవైశాల్యమునుంగల్గి మన్వంతరమున మనువుచే నిది నిర్మింపబడినది. ఆ మనువు యథాశాస్త్రముగ నొక్క మన్వంతర మీ సర్వజగముం బాలించినాడు.

ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణము ప్రథమ ఖండమున అయోధ్యాపురవర్ణనమను పదుమూడవ యధ్యాయము.

Sri vishnudharmothara Mahapuranam-1    Chapters