Sri vishnudharmothara Mahapuranam-1    Chapters   

నూటపదునేడవ అధ్యాయము - పరాశరవంశాను కీర్తనము

వసిష్ఠస్తు మహాతేజా నిమేః పూర్వపురోహితః |

బభూవ పార్థివశ్రేష్ఠ! యజ్ఞై స్తస్య మహాత్మనః | శాంతాత్మా పార్థివ శ్రేష్ఠ విశశ్రామ తదాపురా || 2

తం గత్వా పార్థివశ్రేష్ఠో నిమి ర్వచనమబ్రవీత్‌ | భగవన్యష్టుమచ్ఛామి తన్మా యాజయ మాచిరత్‌ || 3

తమువాచ మహాతేజా వశిష్ఠః పార్థివోత్తమమ్‌ | కంచిత్కాలం ప్రతీక్షస్వ తవ యజ్ఞైసమంతతైః || 4

భృంశంశ్రాంతోస్మి విశ్రమ్య యాజయిష్యామి తే నృప! | ఏవముక్తః ప్రత్యువాచ వసిష్ఠం నృపసత్తమః || 5

పారలౌకిక కార్యేషు కః ప్రతీక్షితు ముత్సహేత్‌ | నమస్య సౌహృదం బ్రహ్మన్‌! కృతాంతేన బలీయసా || 6

ధర్మకార్యేత్వరాకార్యాలంయస్మార్ధి జీవితమ్‌ | ధర్మమార్గరతో జంతుర్మృమృపి సుఖమశ్నుతే || 7

శ్వః కార్యమద్య కుర్వీత పూర్యాహ్ణేచాపరాహ్ణికకు | సహిప్రతీక్షతేమృత్యుః కృతంవాస్య నవా కృతమ్‌ || 8

క్షేత్రాపత్య గృహాసక్త మన్యత్రగత మానసమ్‌ | పృకీవోరణమాసాద్య మృత్యురాదాయగచ్ఛతి || 9

న కాలస్య ప్రియః కశ్చిద్ద్వేష్యో వాస్యన విద్యతే | ఆయుష్యే కర్మణిక్షీణ ప్రసహ్య హరతబజనమ్‌ || 10

ప్రాణోవాయుశ్చలత్వంచ నా యోర్వికిత మేవచ | యత్రయజ్జీవ్యతే బ్రన్షణమాత్రం తదద్భుతమ్‌ || 11

సోహంసభృతసంభారో భవన్మూల ముపాగతః | నచేద్యా జయసేమహ్యం యాస్యామ్యన్యంతు యాజకకు || 12

ఏవముక్తస్తదా తేన నిమినా బ్రాహ్మణోత్తమః | శశాంసిమింక్రోధా ద్విదేహస్త్వం భవిష్యసి || 13

శ్రాంతం మాంత్వం సముత్సృజ్య యస్మాదన్యంద్విజోత్తమమ్‌ | ధర్మజ్ఞః సన్నరేంద్రాద్య యాజకంకర్తు మిచ్ఛసి || 14

నిమిస్తం ప్రత్యువాచాథ ధర్మకార్య రతస్యమే | విఘ్నంకరోషినాన్యేన యాజనం చతధేచ్ఛసి || 15

శాపందదా మితస్మాత్త్వం విదేహోద్యభవిష్యసి | ఏవముక్తేతు తౌజాతౌ విదేహౌ ద్విజపార్థివౌ || 16

దేహహీనౌతయోర్జీవౌ బ్రహ్మణము వజగ్మతుః | ఆగతౌతాసమీపేధ బ్రహ్మవచన మబ్రవీత్‌ || 17

అధ్యప్రభృతితే స్థానం నిమే జీవం దదా మ్యహమ్‌ || నేత్రపక్ష్మసు సర్వేషాం మనుష్యాణాం భేవిష్యతి || 18

త్వత్సంబంధాత్తధా తేషాం నిమేషః సంభవిష్యతి | బాలయిష్యంతి తు యదానేత్ర వక్ష్మాణిమానవాః || 19

ఏవముక్తేమనుష్యాణాం నేత్రపక్ష్మసు సర్వశః | జగామ నిమి జీవంతు వరదానాత్స్వయంభువః || 20

వసిష్ఠ జీవంభగవాన్‌ బ్రహ్మావచనమబ్రవీత్‌ | మిత్రావరుణయోః పుత్రోవసిప్ఠత్వంభవిష్యసి || 21

వసిష్ఠితితేదామ తత్రాపిచభవిష్యతి | జన్మద్వయ మతీతంచ తత్రాపి త్వం స్మరిష్యసి || 22

మార్కండేయుడనియె : వశిష్ఠ మహర్షి నిమి చక్రవర్తికి ముందటి పురోహితుడు. అనేక యజ్ఞములు కావింపజేసి యా శాంతాత్ముడు విశ్రమించెను. అత్తరి నిమి యాయన దరికేగి వశిష్ఠ భగవానుడా! మరియొక యజ్ఞము సేయదలచితిని. అది నాచే జేయింపవలయునన వశిష్ఠముని కొంతకాలము నిరీక్షింపుము. నీయజ్ఞములచే నేను మిక్కిలియలసితిని. కొంచెము విశ్రమించి యామీద జేయింతుననెను. అదివిని నిమి పారలౌకిక కార్యములందెవడు నిరీక్షింపగలడు. యముడు (కాలుడు) బలీయుడు. అతనికెవనితోగూడ మంతితనములేదు. (మైత్రిలేదు) జీవితము చలము ధర్మ కార్యమందు త్వరపదుట యవసరము. ధర్మకార్య రతుడు చచ్చినను సుఖమందును. రేపటిపని యీవేశ చేయవలెను. మలిజాము పని తొలిజాముననే ముగింపనగును. మృత్యువు జీవుని కృతాకృతముల నిరీక్షింపడు. క్షేత్ర పుత్ర కలత్రాదులందు సక్తమై మనసింకొకట నూరేగుచుండును. మానవుని తోడేలు మేకనట్లు మృత్యువు కరచుకొని పోవును. కాలునకొకడు ప్రియుడు లేడు శత్రువు లేడు. ఆయుష్యోపయోగియైన కర్మము క్షీణము కాగానే జనుని బలాత్కారముగా లాగికొని పోవును. ప్రాణమనగా వాయువు. వాయువునకుచలత్వము తెలిసినదేకద. ఎక్కనైన నెవడేని క్షణమాత్రము జీవించుటే చిత్రము. (మరణించుట స్వభావము) నేను యజ్ఞ సంభారములన్నియు సంపాదించి పెట్టుకొని నీదగ్గరకు వచ్చితిని. నీవు యజ్ఞము సేయింపవేని యింకొక యాజకుని దరికేగెదను. అని నిమియన విని యా బ్రాహ్మణోత్తముడు కోపముగొని నీవు విదేహుడవు (దేహములేనివాడవు) అయ్యెదవని శపించెలు. అలసియున్న నన్ను విడిచి ధర్మము తెలిసియు నింకొకని యాజకుని కావింప నెంతువా? యన నిమి ధర్మకార్యాసక్తుడనగు నాకు విఘ్నము సేయుటయే కాక యింకొకని యాజనమునకు గూడ నిష్టపడవు కావున శాపమిచ్చెద. నీవును విదేహుడ వగుదువనెను. ఇట్లయ్యిద్దరు (బ్రాహ్మణ క్షత్రియులు) గురుశిష్యులు విదేహులైరి. దేహములేని వారిజీవములు బ్రహ్మ దగ్గరకు జనెను. వానింగని బ్రహ్మ ; ఓనిమీ ! నీకు ప్రాణమిచ్చుచున్నాను. ఇది మొదలు నీవు సర్వ మనుష్యుల కనురెప్ప లందుండ గలవు. కనురెప్పలు కదల్పగా నీవలన వారికి రెప్పపాటు సంభవింప గలదు. అని బ్రహ్మ వరమీయ నిమి జీవముం బడసి మనుష్యుల కనురెప్పల జేరెను. వశిష్ఠుని జీవముంగని బ్రహ్మ నీవు మిత్రావరుణులకు పుత్రుడ వగుదువు. నీకు వశిస్టుడను పేరప్పుడు కలుగును. నీవు నీ కడచిన రెండు జన్మములను ఆజన్మమందు స్మరింప గలవు అనెను.

ఏతస్మిన్నేవ కాలేతు మిత్రశ్చ వరుణస్తథా | బదర్యాశ్రమమాసాద్య తవస్తేవతువ్యయమ్‌ || 23

తపస్యతోస్తయోరేవం కదాచిన్మాధలే ఋతౌ | పుష్పితద్రుమసంభ##న్నే శుభే దక్షిణమారుతే || 24

ఊర్వశ్యధవరారోహా కుర్వతీ కుసుమోచ్చయమ్‌ | ససూక్ష్మ రక్తపసనా తయెర్దృష్టి పథంగతా || 25

తాందృష్ట్వా సుముఖీంసుభ్రూం నీలనీరజలోచనామ్‌ | ఉభౌచుక్షుభతు ర్వీర్యాత్త ద్రూపపరి మోహితౌ || 26

స్కన్నంరేత స్త యోర్దృష్ట్వా శాపభీతావరాప్సరాః | చకార కలశేసుభ్రూస్తోయ పూర్ణేమనోరమే || 27

తస్మా దృషివరౌజాతౌ తేజసాప్రతిమౌభువి | వసిష్ఠశ్చాప్యతస్త్యశ్చ మిత్రావరుణయోః సుతౌ || 28

వసిషస్తుపయేమేథ భగినీంనారదస్యతు | అరుంధతీం వరారోహం తస్యాంవ క్తిమజీజనత్‌ || 29

శ##క్తేః పరాశరః పుత్రస్తస్య వంశం నిబోధమే | యస్యద్వైపాయసః పుత్త్రః స్వయం విష్ణురజాయత || 30

ప్రకాశంజనితోయేన లోకే భారతచంద్రమాః | పరాశరస్య తస్య తం శృణువంశమనుత్తమమ్‌ || 31

కార్ద్రమయోవాహయానో జైమయోమైమ తాయనః | గోపాలిః పంచమశ్చైషాం జ్ఞేయాః కృష్నపరాశరాః || 32

ప్రారోహయో భాహ్యతపాః పార్షయః కౌతుజాతయః | హార్యశ్విః పంచమశ్చైషాం జ్ఞేయా నీలపరాశరాంః || 33

కౌర్ణాయసాః కౌపిసౌధాః కోకేయస్యా స్తయా స్తపాః | పుష్కరః పంచమశ్చైషాం జ్ఞెయారక్త పరాశరాః || 34

శ్రవిష్ఠాయనావార్షేషయా దాసేయాః శ్లోకాశ్చయే | ఇషీకహస్తః పంచమశ్చైతే శ్వేతపరాశరాః || 35

వటికా బాదరాశ్చైవ స్కంభన్యాః క్రోశకాతయః | క్షామిరేషాం పంచమశ్చ ఏతే గౌరపరాశరాః || 36

ఖల్వాయణీ వార్సయణీ తిల్వణో భైల్వయూథపః | తామిరేషాం పంచమశ్చ ఏతేధూమ్ర పరాశరాః || 37

పరాశరాణాం సర్వేషాంత్ర్యార్షేయః ప్రవరోమతః | పరాశరశ్చ శక్తిశ్చ వషిష్టశ్చ మహాతపాః || 38

పరస్పర మవై వాహ్యాః సర్వేవపరాశరాః ఉక్తాస్తథైతే నృప! వంశముఖ్యాః 39

పారాశరాః సూర్యసమ ప్రభావాః | యేషాంతు నామ్నాం పరికీర్తనేన పాపం సమగ్రం పురుషోజహాతి || 40

ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ప్రధమఖండే మార్రండేయ వజ్రసంవాదే

పరాశరవంశానుకీర్తనంనామ సప్తదశాధిక శతతమోధ్యాయః

ఇదే సమయమున మిత్రుడు వరుణుడు బదర్యాశ్రమ మేగి తీవ్ర తపస్సు సేయుచుండగా వసంత ఋతువు వచ్చినంత చెట్లు చక్కగా పూచినవి. దక్షిణ మలయమారుతము వీచుచుండెను, ఊర్వశి దేవసుందరి పువ్వులు కోసికొనుట కటకేతెంచెను. ఎఱ్ఱని జిలుగు పాపడ కట్టుకొని యది యాతపస్వుల దృష్టిలో బడెను. ఆ సుముఖిని నీలనీరజ లోచననుగన యామె రూపమునకు మైమరచి వరుభయలు వీర్య క్షోభమందిరి. స్ఖలసమయిన వారి శక్రమంగని యయణ్సర శాపమునకు వెరచి యొక చక్కని నిండ నీరుగల కుంభము నందుంచెను. అందుండి యప్రతిమాన తేజస్వులు తపస్వి లిద్దరుదయించిరి. వారు వశిష్ఠుడు అగస్త్యుడును. వశిష్ఠ మహర్షి నారదుని చెల్లెలి పనరుంధతి బెంత్లాడెను. ఆమె శక్తి యను వాని గన్నది. శక్తి యొక్క కొడుకు పరాశరుడు. ఆయన వంశమిదె తెలియుము. పరాశరునికి ద్వైపాయనుడై సాక్ష్వాద్విష్ణువే జనించెను. ఆయన చేత భారతమను చంద్రుడుదయింగెకు. ఆ పరాశరుని వంశక్రమము వినుము. కర్ద్రమయుడు వాహయానుడు జైమవాయుడు మైమతాయనుడు గోపాలి అను నీ యైదుగురు కృష్ణపరాశరులనబడిరి. ప్రారోహయుడు భాహ్యతపుడు పార్షయడు కౌతుజాతయుడు హార్యవ్వి నను వారైదుగురు నీల పరాశరులు. కార్ణాయలులు కాపిసౌధులు కోకేయన్యులు తయాస్తవులు పుష్కరుడు ననునీ యైదుగురు రక్త పరాశరులు. శ్రవిస్ఠాయన - వార్షేయ దాసేయ శ్లోక జులు ఇషీకహస్తుడుంగలసి శ్వేత పరాశరులు. వటిక బాదర సంభన్య క్రోశకాతి క్షామియను నీ యైదుగురు గౌర పరాశరులు. ఖల్వాయణి వాక్షాయణి తిల్పణ బైల్వయూధప తామియను నైదుగురు ధూమ్ర పరాశరులు. పశాశరులందరికి త్ర్యార్షేయ ప్రవరయే. పరాశరుడు శక్తి వశిష్ఠుడు ననువారు పరస్పర వివాహములు చేసికొనరాదు. రాజా ! పరాశర ముఖ్య వంశములు తెలిపితిని వీరందరు సూర్య సమప్రభా శాలురు. వీరి నామ కీర్తనము సమగ్ర పాపములు వాయును.

ఇది శ్రీవిష్ణు ధర్మోత్తర మహాపురాణము ప్రథమఖండమున పరాశర వంశాను కీర్తనము నూట పదునేడన అధ్యాయము.

Sri vishnudharmothara Mahapuranam-1    Chapters