Sri vishnudharmothara Mahapuranam-1    Chapters   

నూటపదునొకండవ అధ్యాయము - భృగువంశాను కీర్తనము

వజ్రఉవాచ:- 

మహాదేవేన ఋషయః శప్తాః స్వాయంభువేనర్తే | తేషాం వైవస్తతే ప్రాప్తే సంభవం మమకీర్తయ ||

దాక్షాయణీనాంచ తధా ప్రజాః కీర్తయ మే ప్రభో! | ఋషీణాంచ తధా వంశం భృగువంశ వివర్ధన! || 2

మార్కండేయః :- మన్వంతరేస్మిన్‌ సంప్రాప్తే రాజన్‌! వైవస్వతే పురా | అశ్వమేధేతు వితతే బ్రహ్మణః పరమేష్టినః ||

మహాదేవస్య శాపేన త్యక్త్వా దేహాన్‌ స్వయం తతః | ఋషయస్తు సముద్భూతాః ద్రుతే శుక్రే ప్రజేప్సయా | 4

దేవానాం మాతరో దృష్ట్వా దేవపత్నీ స్తధైవచ | స్కన్నం శుక్రం మహారాజ! బ్రహ్మణః పరమేష్టినః || 5

తజ్జుహావ తతో బ్రహ్మా తతో జాతో హుతాశనాత్‌ | తతో జాతో మహాతేజాః భృగు స్స తపసాం నిధిః || 6

అంగారే ష్వంగిరా జాత స్సభార్యోత్రి స్తధైవచ | మరీచేభ్యో మరీచి శ్చ తతోజాతో మహాతపాః || 7

వసుమధ్యా త్సముత్పన్నో వసిష్ఠ శ్చ మహాతపాః | భృగుః పులోమ్నశ్చసుతాం దివ్యాం భార్యా మవిందత || 8

యస్యాం తస్య సుతాజాతాః దేవా ద్వాదశ యాజ్ఞకాః | భావనో బావన శ్చైవ సుజన్యః సుజన స్తధా || 9

క్రతు స్సువశ్చ పూగశ్చ వ్యాజశ్చ వ్యశ్నుజ శ్చహ | ప్రసవ శ్చావ్యయ శ్చైవ దక్షో ద్వాదశమ స్తధా || 10

ఇత్యేతే భృగవో నామ దేవా ద్వాదశ కీర్తితాః | పౌలో మ్యజనయ ద్విప్రం దేవానాంతు కనీయసమ్‌ || 11

చ్యవనంతు మహాభాగ మాత్మవన్తం తధాప్యసౌ | అత్మవా నాత్మజ స్త్వౌర్వో జమదగ్ని స్తదాత్మజః || 12

జార్వో గోత్రకర స్తస్య బార్గవానాం మహాత్మనామ్‌ | తత్ర గోత్ర కరాన్‌ వక్ష్యే భృగోర్దిప్తౌ జసస్త్వహమ్‌ || 13

వజ్ర మహారాజు :- స్వాయంభువ మన్వంతరమందు మహాదేవుడు (శివుడు) ఋషులను శపించెను. వారు వైవస్వత మన్వంతము వచ్చినపుడెట్లు జన్మించిరో తెలుపుము. దాక్షాయణుల సంతానము ఋషుల వంశముల గూడ యానతిమ్మన మార్కండేయుడనియె :- మున్ను ఓ రాజా! వైవస్వత మన్వంతరము ప్రవేశింపగా బ్రహ్మ అశ్వమేధము సేసిన తఱి మహాదేవ శాపముచే దేహములను పిడిచిన ఋషులీమన్వంతర మందు జనించిరి. సంతానార్తియైన బ్రహ్మ దేవమాతలను జూచినంత సంతానాభిలాషచే శుక్రము స్కన్నమయ్యెను. ఆ వీర్యము నతడగ్నియందు వ్రేల్చెను. దాన నగ్ని దుండి మహాతేజస్వి తపోనిధియనగు భృగువుదయించెను. అంగారము (బౌగ్గు) లందు అంగిరస్సు పత్నీ సమేతుడై యుదయించెను. ఆత్రియ నట్లే యావిర్భవించెను. మరీచుల (అగ్నిజ్వాలల) నుండి మరీచి, వసుమధ్య మందుండి వసిష్ఠుడునుదయించెను. భృగువు పులోముని కూతురును దివ్యయను నామెను భార్యగ స్వీకరించెను. ఆమెయందాతనికి దేవులు పండ్రెండుగురు కొడుకులు యాజ్ఞికులు జనించిరి. వారి పేర్లు భువనుడు, భావణుడు, సుజన్యుడు, సుజనుడు, క్రతువు, సువుడు, పూగుడు, వ్యాజుడు, వ్యశ్నుజుడు, ప్రసవుడు, అవ్యయుడు, దక్షుడు పండ్రెండవ వాడు. నీరు పండ్రెండుగురు భృగువులు దేవతలని పేరిందిరి. భృగు పత్ని పౌలోమి దేవతలో కనిష్ఠునిగ చ్యవనుడను వానిం గనెను. ఆతడు మహాభాగుని ఆత్మ వంతుడను వానిని అతడు ఔర్వుని అతడు జమదగ్నినిం గనెను. ఔర్వుడు భార్గవ గోత్రకర్త, మహేజప్వియిదీపించు భృగువు యొక్క గోత్ర ప్రవర్తకులం దెల్పెద

భృగుశ్చ చ్యవన అత్మవాంస్తు తధైవచ | ఔర్వశ్చ జమదగ్నిశ్చ వాత్స్యోదంభిర్నడాయనః || 14

నాగాయనో వహేతిశ్చ పేలు శ్చైరాను శాతికః | శౌనకాయస జీపంతిః కౌమోధః పార్షతి స్తధా || 15

వైహీనరి ర్విరూపాక్షో రౌహిణ్యాయని రేవచ | వైశ్వానరి రుపారీరు ర్వశా వర్ని ర్వృకా స్వకః || 16

విష్ణుః పౌరేయ వాలాకి తేవికేనాస్త భాగినః | మృతబాగేయ మర్కండ జిహితోనేధిప స్తధా || 17

మండూ మాండవ్య మండూక స్ఫేన సాంకృతిన స్తధా | స్థాలి పిండిః శిలాపత్తిః శార్కరాక్షి స్తధైవచ || 18

మృకాయణో దేవమతిః షాంఢరాయిః సిగాలవః | సకృత్వ శ్చాతకిః కాయి ర్యాజ్ఞో దార్భిస్త్రిలాయనిః || 19

గార్గ్యాయణో హ్వాయనశ్చ ఋషిర్గేహాయనస్తధా | గోష్ఠ్యాయనోవాహ్యాయనో వైశంపాయన ఏవచ || 20

వైకర్ణేయిః శార్జరవో యాజ్ఞెయి ర్బ్రాష్టకాయనః | లలాటిర్ల కుటిశ్చైవ లాక్ష్మ్యాయాః పరిమండలః || 21

ఉలుంబిః శైలుకిః కోష్టిః తధాన్యః పైప్పలాయనిః సత్యాయని ర్మాలయనిః కోటాలిః కౌచహ స్తికః || 22

శౌక్రిః శౌక్తిః స కౌచక్షిః కౌసి శ్చాంద్రమసి స్తధా | జైక హివ్హీుః జిహ్వ శూన్య వాజ్యలేఢిక వైరిణః || 23

శారద్వతికరే నిత్యౌ లోష్ఠాక్షిశ్చల వైరిణః | నాగాయని శ్చానుమతిః పౌర్ణభా గధికాశి కృత్‌ || 24

సమాఖ్యాతా స్తధైతేషాం పంచ తు ప్రవరా మతాః | భృగుశ్చ చ్యవనశ్చైవ ఆత్మవాన స్తధైవచ || 25

ఔర్వశ్చ జమదగ్నిశ్చ పంచైతే ప్రవరా మతాః | పరస్పర మవైవాహ్యా ఋషయః పరికీర్తితాః || 26

వాజ్యావాజ్యో న వైవాహ్యాః జ్ఞేయా స్త్రిప్రవరాస్తుతే | భృగుశ్చ జమదగ్నిశ్చ తధైవార్వశ్చ పార్థివః || 27

భృగువు మొదలు కాశివృత్తు వరకు పేర్లు స్పష్టముగా వరుసగా నున్నవి. వీరందరు పంచప్రవరులు. ఆ పంచ ప్రవరులు ఋషులు వరుసగా భృగుచ్యవన ఆత్మ వాన ఔర్వ జమదగ్నులు. ఈ ప్రవరలను వారొండరులు వివాహము సేసికొన రాదు. ఇందు వాజ్యావాజ్యలను ఋషులు త్రిప్రవరవారును వివాహము సేసికొనకూడదు. ఆ ఋషులు భృగువు జమదగ్ని ఔర్వుడు

అతః పరం ప్రవక్ష్యామి శృణు చాన్యాన్‌ భృగూ ద్వహాన్‌ | జమదగ్ని ర్విదశ్చైవ పౌలస్త్యో వైజభృత్తధా || 28

ప్రాచీన యోగ్యో భగవా సృషిః క్రౌంచాయన స్తధా | ఋషిభయ శ్చాజాతశ్చ ఏకాయన వటాయనౌ || 29

ఆత్రేయెభిమత శ్చైషాం సర్వేషాం ప్రవరః స్మృతః | భృగుశ్చ చ్యవన శ్చైవ హ్యాత్మవాన స్తధైవచ || 30

పరస్పర మవైవాహ్యా ఋషయః పరికీర్తితాః | ఋగ్వేదీయా మార్గపధే గ్రామాయణీ రధాయనిః | 31

ఆప స్తంబిః తధా తాల్కిర్నేకఠిః కంఠిరేవచ | ఆర్షషేణో గార్దభిశ్చ కార్దమాయణి రేవచ || 32

అశ్వాయని రధాన్నాపి పంచార్షేయాః ప్రకీర్తితాః | పరస్పర మవైవాహ్యా ఋషయః పరికీర్తితాః || 33

ఇక మీద భృగుగోత్రముల వారి నితరులను బేర్కొందును వినుము. జమదగ్ని విదుడు పౌలస్త్యుడు వైజ భృత్తు ప్రాచీన యోగ్యుడు క్రౌంచాయనుడు ఋషిభయుడు అజాతుడు ఏకాయనుడు వటాయనుడు. వీరందఱికి నభిమతుడైన ప్రవరుడు ఆత్రేయుడు. భృగుచ్యవన ఆత్మ వానులు ఋషులు వారొకరొకరు పెండ్లి చేసికొనరాదు, ఋగ్యేదీయ శాఖలు గ్రామాయణి అయని అపస్తంబి తాల్వి, నైకఠి, కంఠి, అర్షిషేణుడు, గార్దభి, కార్దమాయణి, అశ్వాయని, అన్నడ యనువారు పంచార్షేయులు. వారన్వుర వివాహా నర్హులు.

యోవిరాధో వీత హవ్యో నాసాథశ్చండమో దమః | జీవం త్యాయనిః మౌద్గశ్చ విలిశ్చైవ ఖలిస్తధా || 34

ఖావిలి ర్భాగ విత్తిశ్చ కౌశంబేయి ర్వృకాశ్చకిః | వాలేయిః సమదా గేయి ర్గౌరక్షితి రధైవచ || 35

గౌర్గజీశ్చ స వంశాల స్తధా పౌక్షయనో మునిః | రోమాదశ్చ తధై తేషా మార్షేయాః ప్రవరామతాః || 36

భృగుశ్చ వీతహవ్యశ్చ తధాచైవ సదేవసః | పరస్పర మవైవాహ్యా ఋషయః పరికీర్తితాః || 37

ఖాలాయనిః శాకటాభ్యో మైత్రేయః సాతయస్తధా | ద్రోణాయనో నౌక్మాయన అశిషిశ్చ పికాయనిః || 38

హోమజిహ్వి స్తధై తేషాం ఆర్షేయాః ప్రవరా మతాః | భృగుశైవాథ పధ్న్యశ్వో దివోదాస స్తధైవచ || 39

పరస్పర మవైవాహ్యాః ఋషయః పరికీర్తితాః | సకాయనో యజ్ఞవచి ర్మధ్య గంధి స్తధైవ చ || 40

ప్రత్యూహశ్చ తధా శ్రాభ్య క్షోక్షి ర్వైకా దశాయనిః | తధా గృత్సమదో రాజన్‌ : శునకశ్చ మహానృషిః || 41

ప్రవరస్తు యధో క్తానాం ద్వ్యార్షేయాః పరికీర్తితాః | భృగుర్గృత్సమద శ్చైవ ద్వాకేతౌ పరికీర్తితౌ || 42

పరస్పర మవైవాహ్యా ఇత్యేతే పరికీర్తితాః |

ఏతే తవోక్తా భృగువంశ జాతా మహాను భావా నృపః గోత్రకారాః |

యేషాం నామ్నాం పరికీర్తనేన పాపం సమగ్రం విజహాతి జంతుః || 43

ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ప్రథమఖండే మార్కండేయ వజ్రసంవాదే భృగువంశాను కీర్తనం నాను ఏకాదశోత్తర శతతమోధ్యాయః ||

యోవిరాధుడు వీతహవ్యుడు నాసాథుడు చండముడు దముడు జీవంత్యాయని మౌద్గుడు విలి ఖలి ఖావిలి భాగవిత్తి కొశాంచేయి వృక చవి బాలేయి మముద గేయ గౌర క్షితి గార్గజి సవంశాల పౌషాయన రోమాదులుసు ఋషులు ప్రవరలు. భృగువు వీత హవ్యుడు సదైవసుడు నను వారును వ్రసిద్ధ ప్రవరులు. వీరొకరి కొకడు పెండ్లి గూడదు. ఖాలాయని మైత్రేయుడు శాకటుడు యజ్ఞ పచి మథ్యగంధి ప్రత్యూహుడు, శౌభ్యక్షాక్షి, వైకాదశాయని గృత్స మదుడు శునకుడు ప్రవరులుగ పేర్కొన బడిరి. ఈ నీ ఋషులు ప్రవరలు వివాహాదులం గలియరాదు. వీరు భృగు గోత్ర కర్తలు వీరిని నామకీర్తనము పాపహరము.

ఇది శ్రీ విష్డుధల్మ్‌త్తర మహాపురాణమున ప్రధమ ఖండమున భృగు వంశాను కీర్తనము నూట పదునొకండవ అధ్యాయము.

Sri vishnudharmothara Mahapuranam-1    Chapters