Sri vishnudharmothara Mahapuranam-1    Chapters   

పదునొకండవ అధ్యాయము

హిమవన్నదీ వర్ణనము

వజ్ర ఉవాచ :

హిమవత్పాద సంభూతాః పుణ్యాః బ్రహ్మన్‌ విశేషతః ప్రాధాన్యేన సమాచక్ష్వ ! నద్యః పాపభయాపహాః || 1

మార్కండేయ ఉవాచ :

కౌశేయ వర్ణసలిలా కుశేశయ విమిశ్రితా | కౌశికస్య ప్రియా ఇత్యం కౌశికీనిమ్నగోత్తమా || 2

నిమజ్జత్పాపసంఫ°ఘ నిర్మలీ కరణ శుభా | నిశ్చరా నిమ్నగా శ్రేష్ఠా నిత్యం మునిజన ప్రియా | 3

గజేంద్ర భిన్న కూలాతు గంగాతుల్యాచ పుణ్యతః | గంధర్వ గణ గీతా చ గండకీ గోకులా కులా || 4

లోకానాం పావనాయాలం లోక నాధేన నిర్మితా | లోకదృష్టి మనోహరీ లోహిత్య శ్చ మహానరః || 5

దివస్సేవ్యా సదావిపై#్రర్దిని దేవగణౖర్యథా | దృషద్వతీ సమాకీర్ణా దుర్శనీయోదకా తథా || 6

బహుదా బహుసత్త్వాథ మేనాచ ప్రలయక్షమా | అనవచ్ఛిన్నవాహాతు లిఖితస్యచబాహుదా || 7

ధర్మప్రదాసేవకౌనాం ధూతపాపా మహానదీ | గోమతీ గోకులా కీర్ణా గజేంద్ర గణగాహితా || 8

గంధర్వగీతగంభీరా గణయక్షగుణౖర్యుతా | మహాకదంబ కాదంబ కేకారవ వినాదితా || 9

కుముదోత్పల కల్హార కుసుమై రాకులోదకా | దేవదేవస్య యాదేవీ దయితా శంకరస్యచ || 10

దేవికా సా పురారాజ& ! దేవలోక గతిప్రదా | విస్తారిత మహామాలా విషమద్వీప వీజితా || 11

విష్ణులోక ప్రదాదేవీ వితస్తా7ఘ వినాశినీ | చంద్ర భాగాచ చంద్రాంశ చారుశీత జలావిలా || 12

చంద్రలోక ప్రదాస్నానే చా7మరత్వ ప్రదాయినీ | సరోజాకుల తీర్థాచ సరయూ స్సరితాంవరా || 13

సతతం సేవితా సద్భిః సోమలోక మభీప్సుభిః | ఇంద్రేభ సేవిత తటా ఇంద్రలోక ప్రదాయినీ || 14

ఇందీవరా కుల జలా తథాదేవీ ఇరావతీ | విశిష్ట పాశ విచ్ఛేదే విపాశా కుశలా తథా || 15

తథైవ సర్వపాపానాం విపాక కారిణీ నృణామ్‌ | వశిష్ఠ విద్రుతాదేవ శతద్రుర్‌ద్రుత గామినీ || 16

రౌద్రానామాపి సత్వానాం రుద్రలోక ప్రదాశివా | కృష్ణేన కృష్ణతో యాచబాల్యే పీతపయోధరా || 17

యమస్వసాచ యమునా యామ్య దుఃఖ వినాశనీ | సప్రకారాచ నదీ తచ దేవీ సరస్వతీ || 18

తస్యా స్సప్తసుభాగేషు నామాని శృణుమేనృప! | సుప్రభా కాతరాక్షీచ విశాలా మానసహ్రదా || 19

సరస్వత్యోఘనాదాచ సువేణు ర్విమలోదకా | పుష్కరేనైమిశే చైవ గయాయాం కోశ##లేషుచ || 20

కురుక్షేత్రేక్రమాద్‌జ్ఞేయా గంగాద్వారే హిమాచలే |

నద్యస్తథైతా హిమవత్‌ప్రసూతా ప్రధానభూతాకథితా నృవీర |

ఉక్తాశ్చ నద్యశ్చ సహస్రశో7న్యాః సర్వాః పవిత్రాః ఋషివర్య జుష్టాః || 21

వర్షస్య తస్యాపి తథాన్తరే7స్మి& స ప్తప్రకారాచ త్రిమార్గగాపి |

ద్వీపం ప్రవిష్టా భరతస్య రాజన్‌ ! భగీరథా రాధిత పద్మజోప్తాః || 22

ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ప్రథమఖండే మార్కండేయ వజ్రసంవాదే హిమవన్నదీ వర్ణనం నామ ఏకాదశో7ధ్యాయః.

వజ్రుడు పలికెను - హిమవత్పాదమున బుట్టిన పుణ్యనదులను ముఖ్యముగ నానతిమ్మన 'మార్కండేయుడిట్లనియె. తెలిపట్టు రంగు నీరుగలది తామరపూలతో నుండినది నిత్యము కౌశికునకుప్రియమైనదియునగు కౌశికీ నది ఉత్తమమైనది. తనలో స్నానము సేసిన వారిపాపములను క్షాళనముచేయుటలో శుభమూర్తియైన నిశ్చరయనునది శ్రేష్ఠమైనది. మునిజనప్రియ ఏనుగులవప్రక్రీడచే నొరయు నొడ్డులంగూడినది. పవిత్రతలో గంగానదీ తుల్యమైనది గంధర్వగణగీతయునైన గండకీనది గోకులసంకుల లోకపావని. నొరయు నొడ్డులంగూడినది. పవిత్రతలో గంగానదీ తుల్యమైనది గంధర్వగణగీతయునైన గండకీనది గోకులసంకుల లోకపావని. లోకనాధుడేర్పరచినది లోకదృష్టి మనోహారియగు లౌహిత్యమను మహానదము పుణ్యప్రదము స్వర్గసేవ్యము విప్రదేవగణ సేవ్యము దృషద్వతి దర్శనీయోదకముగలది. బహుదము బహుసత్త్వయునగు మేన, ప్రలయక్షమ ఎడతెగని ప్రవాహము గలది. లిఖితునికి బాహువుల నిచ్చినది బాహుద పుణ్యనది. సేవకులకు ధర్మమొసగునది ధూతపాపయునైనది మహానది. గోకులాకీర్ణ గోమతి గజరాజములవగాహించునది. గంధర్వగీత గంభీర గణ యక్షగణసంయత కోకిలల కూతలు నెమిళులయొక్కయు కేకారవములం బ్రతిధ్వనించునది తెలినల్లగలువలు ఎర్ర తెలిదామర పువ్వులతో నిండిన నీట గుల్కునది దేవదేవుని దేవి శంకరుని ప్రియురాలు. దేవికా నది దేవ లోక గతి నిచ్చునది. విస్తరించిన యొడ్డులతో ఎగుడుదిగుడు ద్వీపములతో గూడి విష్ణులోకమిచ్చు దేవి వితస్తానది పాపనాశిని. చంద్రకిరణ రమణీయ శీతల సలిలావిల చంద్రభాగ స్నానముచే అమరత్వమిచ్చునది. అశేష పాశవిచ్ఛేద కుశల విపాశ సరోజాకుల సరయూ నిరంతరసేవనముచే సోమలోకమిచ్చునది. ఇంద్రగజమగు ఐరావతము సేవించు తీరములుగలది ఇంద్రలోకప్రద ఇందీవర సుందరజల యిరావతి. వశిష్ఠులు ప్రవహింపజేసినది వేగముగ గమనించునది శతద్రు నది. రౌద్రములయిన సత్వములకు గూడ రుద్రలోకము నిచ్చు శివానది కృష్ణతోయ (నల్లని నీరు గలది) యై బాలకృష్ణ పీతపయోధర యముని చెల్లెలునగు యమున యమలోక దుఃఖ వినాశిని. సప్తప్రకార (ఏడుపాయలైన) సరస్వతీనది. ఆమె యేడు భాగముల పేరులు వినుము, సుప్రభ, కాతరాక్షి, విశాల, మానసహ్రద, సరస్వతి, భీమనాద, సువేణువు, పుష్కరక్షేత్రమందు నైమిశమందు గయలోను కోసలదేశముల కురుక్షేత్రమున గంగాద్వారమున హిమాచలముననున్న యీ నదులు హిమవద్గిరిం బుట్టినవి ప్రధానములు. ఎన్నో వేల నదులు పవిత్రములు ఋషివరులు సేవించినవి తెల్పితిని. ఈ భారతవర్షమందు త్రిమార్గయై భరత ద్వీపమున బ్రవేశించినది భగీరథుడారాధించిన బ్రహ్మచే తెలుపబడినది భాగీరథి పుణ్యనది.

ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణము-ప్రథమఖండమున మార్కండేయ వజ్రసంవాదమున హిమవన్న దీవర్ణనమను పదునొకండవ అధ్యాయము.

Sri vishnudharmothara Mahapuranam-1    Chapters