Sri Vamana Mahapuranam    Chapters   

శ్రీ వామన పురాణ అష్ట షష్టితమో%ధ్యాయః

బలి రువాచ:-

భవతా కథితం సర్వం సమారాధ్య జనార్దనమ్‌ | యా గతిః ప్రాప్యతే లోకే తాం మే వక్తు మిహార్హసి|| 1

కేనా%ర్చనేన దేవస్య ప్రీతిః సముపజాయతే| కాని దానాని శస్తాని ప్రీణూయ జగర్గురోః|| 2

ఉపవాసాదికం కార్యం కస్యాం తిథ్యాం మహోదయమ్‌ | కాని పుణ్యాని శస్తాని విష్ణో స్తుష్టి ప్రదాని వై|| 3

యచ్చా న్య దపి కర్తవ్యం హృష్టరూపై రనాలసైః | తదప్యశేషం దైత్యేంద్ర! మమాఖ్యాతు మిహా ర్హసి|| 4

ప్రహ్లాద ఉవాచ:-

శ్రద్దధానై ర్భక్తి పరై ర్యాన్యుద్దిశ్య జనార్దనమ్‌ | బలే దానాని దీయంతే తానూచు ర్మునయో%క్షయాన్‌|| 5

తా ఏవ తిధయః శస్తా యాస్వభ్యర్చ్య జగత్పతిమ్‌ | తచ్చిత్త స్తన్మయోభూత్వా ఉపవాసీ న నో భ##వేత్‌ || 6

పూజితేషు ద్విజేంద్రేషు పూజిత స్స్యా జ్జనార్ధనః | ఏతాన్‌ ద్విషంతి యే మూఢా స్తే యాంతి నరకం ధ్రువమ్‌|| 7

తా నర్చయే న్నరో భక్త్యా బ్రాహ్మణాన్‌ విష్ణు తత్పరః | ఏవ మాహ హరిః పూర్వం బ్రాహ్మణా మామకీ తనుః|| 8

బ్రాహ్మణో నా వమంతవ్యో బుధో వా%ప్యబుధో%పి వా | సో%పి దివ్యా తను ర్విష్ణోస్తస్మాత్తా మర్చయేన్నరః|| 9

తాన్యేవ చ ప్రశస్తాని కుసుమాని మహాసురః | యాని స్యు ర్వర్ణముక్తాని రస గంధ యుతాని చ|| 10

విశేషతః ప్రవక్ష్యామి పుష్పాణి తిథయ స్తథా | దానాని చ ప్రశస్తాని మాధవ ప్రీణనాయ తు|| 11

జాతీ శతాహ్వ సుమనాః కుందోః బహుపుటం తథా | బాణశ్చ చంపకా%శోకం కరవీరం చ యూధికా || 12

పారిభద్రం పాటలా చ వకుళం గిరిశాలినీ | తిలకం చ జపాకుసుమం పీతకం నాగరం త్వపి || 13

ఏతాని హి ప్రశస్తాని కుసుమా న్యచ్యుతార్చనే | సురభీణి యధాన్యాని వర్జయిత్వా తు కేతకీమ్‌ || 14

బిల్వపత్రం శమీపత్రం పత్రం భృంగ మృగాంకయోః | తమాలా%మలకే పత్రం శస్తం కేశవ పూజనే || 15

ఏషామపి హి పుష్పాణి ప్రశస్తా న్యచ్యు తా ర్చనే | పల్లవా న్యపితేషాం స్యుః పత్రా ణ్యర్చా విధౌ హరేః || 16

శ్రీవామన పురాణం అరువది ఎనిమిదవ అధ్యాయం

బలి యిలా అన్నాడు పితామహా! మీరు నాకు అంతయు వివరించారు జనార్దనుని చక్కగా ఆరాధించిన వారలకు ఏ పదవి కలుగుతుందో వివరించండి ఏ విధంగా ఆరాధిస్తే ప్రభువు సంతోషిస్తాడు? ఆ జగద్గురువు ప్రీతికై ఏ యే దానాలు తగినవి? ఉత్తమమైనవి ఏ యే తిథులలో ఉపవాసాదు లాచరిస్తే ఆ దేవుడు ప్రీతు డౌతాడు? సంతోష స్వాంతులూ సోమరులు కాని వారలు యింకా ఏమేమి చేయవలెనో అదంతా చెప్పండి అది విని ప్రహ్లదుడిలా చెప్పసాగాడు. ఓ బలీ! శ్రద్ధ గల వారు భక్తితో జనార్దను నుద్దేశించి యిచ్చే దానాలు ఉత్తమమైన వని అక్షయ ఫలాలు యిస్తాయని మునులు చెబుతారు. ఏయే రోజుల్లో నరుడు భగవ ద్దత్తమైన చిత్తంతో తన్మయుడై ఉపవసించి ఆ జగత్పతిని ఆరాధిస్తాడో అవి ఉత్తమ తిధులు. బ్రాహ్మణ శ్రేష్టు లను పూజించినచో జనార్దనుని పూజించుట యే యగును. విప్రులను ద్వేషించు మూఢులు నరక గాము లౌతారు. ఇది తథ్యం. బ్రాహ్మణులు నాకు శరీరం. నా భక్తులగు వారు బ్రాహ్మణులను పూజించాలి అని శ్రీహరి వక్కాణించాడు. జ్ఞాని కానీ అజ్ఞాని కానీ బ్రాహ్మణుని అవమానించరాదు. వారలు విష్ణు దేవు ని దివ్య శరీరం గనుక బ్రాహ్మణులు పూజార్హులు. ఇక నో మహాదైత్యా చక్కని రంగు, రూపం, సుగంధం మధువు గల పుష్పాలు భగత్పూజకు తగినవి. ఇక దానాలు, తిథులు, పువ్వులను గురించి వివరిస్తాను. వినుము. జాజి, నూరు రేకుల తామరలు, దొంతర మల్లె, బాణ, సంపెంగ, అశోక, కరవీర, నవమల్లిక, పారిభద్ర, పాటల వకుళ (పాగడ), గిరిశాలిని, తిలక, జపాకుసుమ, పీతక, నాగరాది పుష్పాలు అచ్యుతుని పూజకు ప్రశస్తమైనవి. ఒక్కమెగలి పువ్వు మాత్రం పూజలో వాడ కూడదు. యితర పరిమళ పుష్పాలు ఉపయోగించ వచ్చు. ఇక పత్రాల్లో బిల్వ పత్రాలు, జమ్మి, భృంగ (గుంటగర), పత్రం, మృగాంక తమాల ఉసిరిక పత్రాలు కేశవుని పూజకు ఉత్తమమైనవి. ఈ పుష్పాలకు సంబంధించిన పత్రాలు గూడ శ్రీ హరి పూజకు వాడవచ్చు.

వీరుధా చ ప్రవాళేన బర్హిషా చా ర్చయే త్తథా | నానా రూపై శ్చాంబు భ##వైః కమలేందీవరాదిఖిః || 17

ప్రవాళైః శుచిఖిః శ్లక్షే జల ప్రక్షాళితై ర్బలే | వనస్పతీనా మర్చేత తథా దూర్వాగ్ర పల్లవైః || 18

చందనే నా సురిం. పేత కుంకుమే న ప్రయత్నతః | ఉశీర పద్మ కాభ్యాం చ తథా కాలీయకాదినా || 19

మహిషాఖ్యం కణం దారు సిహ్లికం సాగురుం సితా | శంఖం జాతీఫలం శ్రీశే ధూసాని స్యుః ప్రియాణి వై || 20

హవిషా సంస్కృతా యే తు యవ గోధూమ శాలయః | తిల ముద్గాదయో మాషా వ్రీహయశ్చ ప్రియా హరేః || 21

గోదానాని పవిత్రాణి భూమి దానాని చాకనఘ | వస్త్రాన్న స్వర్ణ దానాని ప్రీతయే మధుఘాతినః || 22

మాఘ మాసే తిలా దేయా స్తిల ధేనుశ్చ దానవ ! | ఇంధనా దీని చ తథా మాధవ ప్రీణనాయ తు || 23

ఫాల్గుణ వ్రీహయో ముద్గా వస్త్ర కృష్ణాజినాదికమ్‌ | గోవింద ప్రీణనార్దయ దాతవ్యం పురుషర్షభైః || 24

చైత్రే చిత్రాణి వస్త్రాణి శయనా న్యాసనాని చ | విష్ణోః ప్రీత్యర్ధ మేతాని దేయాని బ్రాహ్మణష్వథ || 25

గంధ మాల్యాని దేయాని వైశాఖే సురభీణివై | దేయాని ద్విజముఖ్యేఖ్యో మధు సూదన తుష్టయే || 26

ఉదకుంభాంబు ధేనుం చ తాళవృంతం సుచందనమ్‌ | త్రివిక్రమస్య ప్రీత్యర్ధం దాతవ్యం సాధు భిః సదా || 27

ఉపాన ద్యుగళం ఛత్రం లవణా%మల కాదికమ్‌ | ఆషాడే వామన ప్రీత్యై దాతవ్యాని దాతవ్యాని తు భక్తితః || 28

ఘృతం చ క్షీర కుంభాశ్చ ఘృత ధేను ఫలాని చ | శ్రావణ శ్రీధర ప్రీత్యై దాతవ్యాని విపశ్చితా || 29

మాసి భాద్ర పదే దద్యాత్‌ పాయసం మధు సర్పిషీ | హృషీ కేశ ప్రీణనార్థం లవణం సగుడోదనమ్‌ || 30

తిలా స్తురంగం వృషభం దధి తామ్రా%యసాదికమ్‌ | ప్రీత్యర్థం పద్మనాభస్య దేయ మాశ్వయుజే నరైః || 31

రజతం కనకం దీపాన్‌ మణి ముక్తా ఫలా దికమ్‌ | దామోదరస్య తుష్ట్యర్థం ప్రదద్యా త్కార్తికే నరః || 32

ఖరోష్ట్రా%శ్వతరాన్‌ నాగాన్‌ యాన యుగ్మ మజా వికమ్‌ | దాతవ్యం కేశవ ప్రీత్యై మాసి మార్గశిరే నరైః || 33

ప్రాసాద నగరాదీని గృహ ప్రావరణా దికమ్‌ | నారాయణస్య తుష్ట్యర్థం పాషేదేయాని భక్తితః || 34

దాసీ దాస మలంకార మన్నం షడ్రస సంయుతమ్‌ | పురుషోత్తమస్య తుష్ట్యర్థ్యం ప్రదేయం సార్వ కారికమ్‌ || 35

యద్యదిష్టతమం కించిత్‌ యద్వాప్యస్తి శుచిర్‌ గృహే | తత్తద్ధి దేయం ప్రీత్యర్థం యద్వా%ప్యస్తి శుచిర్‌ గృహే || 37

తత్తద్ధి దేయం ప్రీత్యర్థం దేవ దేవాయ చక్రిణ ||

తీగలు, చిగురు టాకులు, దర్భాంకురాలు, రక రకాలైన జల పుష్పాలు, కమలాలు, యిందీవరాలు, కలువలు మెదలయినవి మృదువైన గరిక పోచలు, భగవత్పూజలోనుపయోగించవలెను. ప్రభువు శ్రీవిగ్రహానికి చందనం కుంకుమ అగురు తో లేపనం చేసి దశాంగంలోనివైన మహిష, కోయన చక్కలు, సిహ్లికం, అగురు, శంఖ, జాజికాయల పొడి దూపం వేయాలి. ఇవి స్వామికి ప్రీతి కరాలు. చక్కగా వండి తయారు చేసిన యవ గోధుమ శాలి అన్నము, నూవులు, పెసలు, మిములతో వండిన భక్ష్యాలు, శ్రీ హరికి యిష్టమైన నైవేద్యము. ఇక దానాలలో గోదానం, భూదానం వస్త్ర అన్న సువర్ణ దానాలు, మధుసూదనునకు చాలా ప్రీతి కలిగించు నవి. మాఘ మాసంలో నూవులు, నూవులతో చేసిన ధేనువు (తిలధేనువు) వంట చెరకు, మాధవుని ప్రీతికై దానం చేయాలి. ఫాల్గుణ మాసాన వడ్లు, పెసలు, వస్త్రలు, జింక చర్మం మొదలయినవి గోవిందుని ప్రీతికై దానం చేయాలి. చైత్రంలో చిత్రాలు, వస్త్రములు, పరుపులు, ఆసనాలు, విష్ణు ప్రీతికై బ్రాహ్మణులకు దానం చేయతగును. ఓ బలీ! వైశాఖంలో వాసనలు వెదజల్లే చందనం పూల మాలలు, జ్యేష్ఠ మాసంలో నీరు నింపిన పాత్రలు, జలధేనువులు (ఆవు ఆకారంలో జల పాత్రలు)తాటియాకు విసనకర్రలు, మంచిగంధం, వట్టివేరు, త్రివిక్రమ దేవుని ప్రీతికై సాధువులకు తరచుగా యిస్తూండాలి. ఆషాఢమాసంలో పాదరక్షలు, గొడుగు, ఉప్పు, ఉసిరికమెదలగు నవి వామన దేవుని తృప్తికై దానం చేయాలి. శ్రావణమాసం శ్రీ ధరుని ప్రీతికి గాను నేతితో, పాలతో నింపిన కడవలు, పేరిన నేతితో చేసిన గోవు (ఘృత ధేనువు) పండ్లు, జ్ఞానులగు వారు దానం చేయాలి. భాద్ర పద మాసంలో హృషీకేశుని తృప్తి పరచుటకై పాలు, నేయి, తేనె, బెల్లంతో వండిన పాయసాన్నము, లవణము యివ్వ వలెను. ఆశ్వయుజ మాసంలో నరులు భగవత్‌ ప్రీతికై నూవులతో చేసిన అశ్వం, వృషభం, పెరుగు, రాగి, ఇనుము దానం చేయాలి. కార్తిక మాసంలో బంగారం, వెండి ప్రమిదలలో దీపాలు, రత్నాలు, ముత్యాలు, దామోదరుని సంతుష్టికై దానం చేయాలి. మార్గశిరంలో ఖడ్గాలు, గుర్రాలు, ఏనుగులు, బండ్లు, మేకలు, గొర్రెలు, కేశవుని ప్రీత్యర్థం దానం చేయాలి. భవనాలు నగరాలు, యిండ్లు, వాకిండ్లు, కేశవుని తుష్టికై పుష్యమాసంలో భక్తితో దానం చేయాలి. ఇక ఈ నెలా ఆ నెలా అనే విచక్షణ లేకుండా ఎల్ల కాలాల్లోను దాస దాసీలను, అలంకార వస్తువులను, షడ్ర సోపేతమైన భోజనము, దానం చేస్తే ఆ పురుషోత్తముడు ఎంతో సంతోషిస్తాడు. తనకు అన్నింటిలోను యిష్టమైన దానిని తనవద్ద వానిలో పవిత్రమైన వస్తువును దేవ దేవు డగు చక్రపాణి ప్రీతికై దానం చేయాలి.

యః కారయే న్మందిరం కేశవస్య | పుణ్యాం ల్లోకాన్‌ స జయే చ్ఛాశ్వతాన్‌ వై | దత్వారామాన్‌ పుష్ప ఫలాభిపన్నాన్‌ |

భోగాన్‌ భుంక్తై కామతః శ్లాఘనీయాన్‌ || 38

పితమహస్య పురతః కులాన్యష్టౌతు యాని చ | తారయే దాత్మనా సార్థం విష్ణో ర్మందిర కారకః || 39

ఇమాశ్చ పితరో దైత్య! గాధా గాయంతి యోగినః | పురతోయదు సింహస్య జ్యామిఘస్య తపస్వినః || 40

అపి నః స కులే కశ్చిద్‌ విష్ణు భక్తో భవిష్యతి | హరి మందిర కర్తాయో భవిష్యతి శుచి వ్రతః || 41

అపి నః సంతతౌ జాయేద్‌ విష్ణ్వాలయ విలేపనమ్‌ | సమ్మార్జనం చ ధర్మాత్మా కరిష్యతి చ భక్తితః || 42

అపి నః సంతతౌ జాతో ధ్వజం కేశవ మందిరే | దాస్యతే దేవతేవాయ దీపం పుష్పానులేపనమ్‌ || 43

మహాపాతక యుత్తో వా పాతకీ చోపపాతకీ | విముక్త పాపో భవతి విష్ణ్వాయతన చిత్రకృత్‌ || 44

ఇత్థం పితౄణాం వచనం శ్రుత్వా నృపతి సత్తమః | చకారా%య తనం భూమ్యాం స్వయం చ లింపతా సుర ! || 45

విభూతిభిఃకేశవస్య కేశవారాధనే రతః | నానా ధాతు వికారైశ్చ పంచ వర్ణైశ్చ చిత్రకైః || 46

దదౌ దీపాని విధివత్‌ వాసుదేవాలయే బలే! | సుగంధి తైల పూర్ణాని ఘృత పూన్ణాని చ స్వయమ్‌ || 47

నానావర్ణావైజయంత్యో మహా రంజన రంజితాః | మంజిష్ఠా నవరంగీయాః శ్వేత పాటలికా శ్రితాః || 48

ఆరామా వివిధా హృద్యాః పుష్పాఢ్యా ఫలశాలినః | లతా పల్లవ సంఛన్నా దేవ దారుభిరావృతః || 49

కారితాశ్చ మహామంచాధిష్ఠితాః కుశ##లై ర్జనైః | పౌరోగవ విధాన జ్ఞై రత్న సంసస్కారికైర్‌ దృఢైః || 50

తేషు నిత్యం ప్రపూజ్యతే యతయో బ్రహ్మ చారిణః | శ్రోత్రియా జ్ఞాన సంపన్నా దీనా%ంధవికలా దయః || 51

ఇత్థం స నృపతిః కృత్వా శ్రద్దధానో జితేంద్రియః | జ్యామఘో విష్ణు నిలయం గత ఇత్యనుశుశ్రుమః || 52

తమేవ చా%ద్యాపి బలే | మార్గం జ్యామఘ కారితమ్‌ | ప్రజంతి నర శార్దూల! విష్ణులోక జిగీషనః || 53

తస్మాత్త్వమపి రాజేంద్ర! కాయస్వా లయం హరేః | తమర్చయ స్వయత్నేన బ్రాహ్మణాంశ్చ బహుశ్రుతాన్‌ || 54

వాసోభి ర్భూషణౖ రత్నైర్గోభి త్భూ కనకాదిభిః | విభ##వే సతి దేవస్య ప్రీణనం కురు చక్రిణః || 55

ఏవం క్రియా యోగరతస్య తేద్య నూనం మురారిః శుభదో భవిష్యతి | నరా న సీదంతి బలే! సమాశ్రితా

విభుం జగన్నాధమనంత మచ్యుతమ్‌ || 56

విష్ణు దేవునకు ఆలయ నిర్మాణంచేయించు నతడు శాశ్వతాలయినపుణ్యలోకాలను జయిస్తాడు. పుష్పములు, ఫలాల తోటలు, దానం చేయునతడు కోరిన కోర్కెలు శ్లాఘించ దగినవి, అనుభవిస్తాడు. విష్ణు దేవాలయం నిర్మింపజేయు నతడు తన పితామహునకు ముందు ఎనిమిది తరాల వారిని తన తర్వాత ఎనిమిది తరాల వారిని తరింప చేస్తాడు. ఓ దైత్య ముఖ్యా! యదువులలో పరమశ్రేష్ఠుడైన జామఘుని ఎదుట అతని తపోనిష్ఠుల, యోగులు, నగు పితరులు ఒక పరి యిలా గానం చేశారు. మా వంశంలో ఎవడైనా శ్రీహరి భక్తుడు జన్మిస్తాడు? ఎవరైనా విష్ణు ఆయల నిర్మాణం చేస్తాడా? కేశవాలయానికి విలేపనం (వెల్ల వేయించు) వేయించు వాడె న్నడైనా జన్మిస్తాడా? భక్తితో విష్ణ్వాలయ ప్రాంగణం చక్కగా ఊడ్చిశుభ్రం చేయ గల శుచి మంతుడు మావంశంలో పుడతాడా? మనవంశంలో నిష్ణ్వాలయానికి ధ్వజం, దీప సామగ్రి, పూలు యితర అర్చన సామగ్రి దానం చేయు ఉత్తములు పుడతారా? పాతకాలు, మహా పాతకాలు, ఉపపాతకాలు చేసిన వారైనను విష్ణువు దేవాలయంలో చిత్రాలు వేయిస్తే ఆ పాపా లన్నీ భస్మమౌతాయి. పితరులు ఎంతో ఆశతో ఆ కాంక్షతో గావించిన ఆ ఉద్గారా లను విన్నంతనే ఆ మహారాజు జ్యామఘుడు భూలోకంలో విష్ణుదేవుని ఆలయ నిర్మాణం చేయించాడు. దానిని రకరకాల రంగులు వేసి స్వయంగా అలంకరించాడు. ఆ వాసుదేవ భక్తుడు, కేశవుడు గావించిన అద్భుత కార్యాలను పంచ రంగుల చిత్రాల రూపంలో గోడ మీద చిత్రించాడు. ఎన్నో దీవ పాత్రాలు విధి పూర్వంగా ఆలయానికి దానం చేశాడు. ఓ బలీ! ఆ పాత్రల ను సుగంధ తైలాలతో నేతితో నింపి వానిలో జ్యోతులు స్వయంగా వెలిగించాడు. రంగు రంగుల ధ్వజపతాకలను, ధ్వజ స్తంభాలకు తొమ్మిది రంగుల మంజిష్ఠ (పసుపు) పూసి, తెల్ల పాటల కుసు మాలతో నలంకరించిన వానిని నెల కొల్పాడు. చూడ ముచ్చట గొలిపే ఎన్నోపూలతోటలను పండ్ల తోటలను వేయించి వానిని వివిధాలయిన లతా గుల్మాలతో దేవ దారు వృక్షాల శీతల ఛాయలతో నింపి వేశాడు. వాని లోపల తన అంతః పుర రాజ భవనాలను నిర్మించిన శిల్ప నిపుణుల చేత రత్న జటితాలయిన శిలా వేదికలు నిర్మింప జేశాడు. ఆ దృఢ మైన వేదికల మీద సన్యాసులను వేద విద్వాంసులను బ్రహ్మచారులను జ్ఞానులను దీనులను అంగవైకల్యం కలవారలను దాన సత్కారాదులతో తృప్తి పరచేవాడు, ఆ ధర్మిష్ఠుడు జితేంద్రియుడు నగు నరపతి పితరుల కోరిక ననుసరించి ఈ విధంగా సత్కార్యాలు గావించి విష్ణు లోకానికి వెళ్ళాడని పెద్దలు చెప్పగా విన్నాము. వత్సా! బలీ! విష్ణు లోకాలు పొందదలచిన వారందరు నేటికి ఆ జ్యామఘుడువేసిన రాచబాట మీదనే పయనిస్తున్నారు. కనుక నీవు కూడ వాసుదేవమందిర నిర్మాణం గావించి శ్రోత్రియులైన బ్రాహ్మణులను, విశేషించి పౌరాణికులను, సదాచార సంపన్నులను, అర్చించుము. ధన స్వర్ణ వస్త్రా భరణాదులర్పించి వారల సేవింపుము. ఆ విధంగా సంపద గలిగినపుడే జనతా రూపుడగు జనార్దనుని ప్రీతుని గావింపుము. ఈ విధంగా క్రియాయోగం ద్వారా పూజితుడై మురారి నీ కన్ని విధాలమేలు కలుగుజేస్తాడు. ఓ బలీ! అనంతుడు అచ్యుతుడు నగు జగన్నాదుని నమ్ముకొనిన వారల కెలాంటి కష్టాలు కలుగవు సుమా!

పులస్త్య ఉవాచ :-

ఇత్యేవ ముక్త్వా వచనం దితీశ్వరో వైరోచనం సత్యమనుత్తమం హి |

సంపూజిత స్తేన విముక్తి మాయ¸° | సంపూర్ణ కామో హరి పాద భక్తః || 57

గతే హి తస్మిన్‌ ముదితే పితామహే బలిర్భ భౌ మందిర మందు వర్ణమ్‌ |

మహేంద్ర శిల్ప ప్రవరో%ధ్య కేశవం స కారమామాస మహా మహియాన్‌ || 58

స్వయం స్వభార్యా సహిత శ్చకార దేవాలయే మార్జన లేపనాదికాః |

క్రియాం మహాత్మా యవ శర్కరాద్యాం బలిం చకారా ప్రతిమాం మధుద్రుహః || 59

దీప ప్రదానం స్వయ మాయ తాక్షి వింధ్యావళీ విష్ణు గృహే చకార |

గేయం స ధర్మ్యశ్రవణం చ ధీమాన్‌ పౌరాణికై ర్విప్రవరై రకారయత్‌ || 60

తథా విధ స్యా%సుర పుంగవస్య ధర్మే సుమార్గే ప్రతి సంస్థితస్య

జగ త్పతి రివ్యవపు ర్జనార్దనః తస్థౌ మహాత్మా బలి రక్షణాయ || 61

సూర్యాయుతాభం ముసలం ప్రగృహ నిఘ్నన్‌ స దుష్టా నరియూ ధపాలాన్‌ |

ద్వారిస్థితే న ప్రదదౌ ప్రవేశం ప్రాకార గుప్తే బలినో గృహే తు || 62

ద్వారి స్థితే ధాతరి రక్షపాలే నారాయణ సర్వ గుణాభిరామే |

ప్రాసాద మద్యే మరి మీశితారం అభ్యర్ఛయామాస సురర్షి ముఖ్యమ్‌ || 63

స ఏ మాస్తే%సుర రాట్‌ బలీస్తు సమర్చయన్‌ వై హరి పాద పంకజౌ |

సస్మార నిత్యం హరి భాషితానిస తస్య జాతో వినయా కుశస్తు || 64

ఇదం చ వృత్తం స పపాఠ దైత్యరాట్‌ స్మరన్‌ సువాక్యాని గురోః శుభాని |

తథ్యాని పథ్యాని పరత్ర చేహ పితామహస్యేంద్ర సమస్య వీరః || 65

యే వృద్ధవాక్యాని సమా చరంతి శ్రుత్వా దురుక్తా న్యపి పూర్వతస్తు |

స్నిగ్దాని పశ్చాన్నవ నీత శుద్ధా మోదంతి తేనా%త్ర విచార మస్తి || 66

ఆప ద్భుజంగ దష్టస్య మంత్రహీనస్య సర్వదా | వృద్ద వాక్యౌషధా న్నూనం కుర్వంతి కిల నిర్విషమ్‌ || 67

వృద్ద వాక్యామృతం పీత్వా తదుక్త మనుమాన్య చ | యా తృప్తి ర్జాయతే పుంసాం సోమపానే కుత స్తథా || 68

ఆపత్తౌ పతితానాం యేషాం వృద్దాన సంతి శాస్తారః | తే శోచ్యా బంధానాం జీవంతో%పీహ మృత తుల్యాః || 69

ఆపద్గ్రాహ గృహీతానాం వృద్దాః సంతి వ పండితాః | యేషాం మోక్షయి తారో వైతేషాం శాంతి ర్న విద్యతే || 70

ఆప జ్జల నిమగ్నానాం హ్రియతాం వ్యసనోర్మిభిః | వృద్ద వాక్యై ర్వినా నూనం నైవోత్తారం కధంచన || 71

తస్మా ద్యో వృద్ద వాక్యాని శృణుయాద్‌ | విదధాతి చస సద్యః సిద్ధి మాప్నోతి యథా వైరోచనో బలిః || 72

ఇతి శ్రీ వామన పురాణ అష్ట షష్టి తమ్యో ధ్యాయః

ఇతి త్రివిక్రమ చరితం సమాప్తమ్‌

పులస్త్యు డిలా అన్నాడు నారదా ! దైత్యేశ్వరు డగు బలికి ఈ విధంగా సత్య సంవలితా లయిన ఉత్తమ హిత వచనాలు పలుకగా నా విరోచన నందనుడు పితామహుని భక్తితో పూజించాడు. మనుమని పూజ లందుకుని పూర్ణ కాముడగు నా హరి భక్తుడు మోక్షగామి అయ్యాడు. అలా తృప్తితో పితామహుడు వెళ్లి పోయిన తర్వాత నా బలి గృహం చంద్ర కాంతులతో తేజరిల్లింది. ఇంద్రుని శిల్పుల శ్రేష్ఠుడు ఆ బలి కొరకు వాసుదేవుని సుందర విగ్రహాన్ని చేసి యివ్వగా బలి దానిని ఆలయంలో ప్రతిష్టించి తాను తన భార్యతో కలిసి ఆ ఆలయానికి వర్ణ విలేపనం సమ్మార్జనం (ఊడ్చుట) మొదలయినవి స్వయంగా నిర్వహించాడు యవలు శర్కర మొదలయిన వస్తువులు కేశవార్పణం గావిస్తూ అప్రతిమాన మైన సేవలతో నా మధుసూదనుని ఆరాధించాడు. బలి భార్య వింధ్యావళి స్వయంగా స్వామి ఆలయంలో దీపాలు వెలిగించగా ఆ ధీమంతుడు సమర్థులగు పౌరాణికులచేత, విప్రులచేత, ధర్మప్రవచనాలు, సంకీర్తనలు, ఏర్పాటు చేయించాడు. ఆ విధంగా ఉత్తమమైన ధర్మమైన మార్గాన పయనించే దైత్యేశ్వరు డగు బలి దక్షణ బాధ్యతలు స్వయంగా జగన్నాధుడు దివ్య రూపి అయిన జనార్దనుడు తానే వహించి నిలచాడు. ఆ లోకేశ్వరుడు సుదృఢమైన ప్రాకారంతో రక్షత మైన బలి తల వాకిట చేతిలో వేయి సూర్యుల ప్రభతో వెలిగే గద పట్టు కొని శత్రు సమూహాలను సంహరిస్తూ లోనికెవ్వరనూ పోనీయక కాపుగా నిలచాడు! సకల కల్యాణ గుణాభిరాము డగు నారాయణుడు ద్వార పాలకుడుగా వాకిట నిలబడగా గృహాభ్యంతరంలో బలి రాజేంద్రుడా దేవర్షి సేవితుని వివిధోపచారాలతో భక్తియుక్తుడై ఆరాధించాడు. అలా ప్రతి దినము శ్రీహరి పాద కమలాలను పూజిస్తూ ఆ బలి చక్రవర్తి ఆ ప్రభువు ఉపదేశ వాక్యాలను స్మరిస్తూ వినయ సుందరమైన ఆదర్శజీవితం గడిపాడు. ఆ దైత్యేశ్వరు డీపవిత్ర వృత్తాన్ని స్మరిస్తూ మహేంద్రతుల్యుడైన పితామహుడు గావించిన ఇహ పర తారక మైన హిత వచనా లను సత్య వచనాలను నెమరు వేసుకుంటూ కాలం వెళ్ల బుచ్చాడు. వెన్న లాంటి మృదు మానసం గల సజ్జనులు వృద్దుల హేతవచనాలను, వారలు మొదట కటువుగా భాషించినా, లెక్క చేయక ఆదరంతో స్వీకరిస్తాడు. అందు వలన వారలకు శ్రేయస్సు హర్షామోదాలే కలుగుతాయి. ఇందులో సందేహం లేదు ఆపద లనే సర్పాలు కాటు వేసిన వారలకు మంత్రం తెలియని వారలకు వృద్దుల వాక్యమే ఆ విషాన్ని దించ గల పరమౌషధం. వృద్ధుల వచనాలనే అమృతం త్రాగి ఆ ప్రకారం నడచు కునే వారలకు కలిగే తృప్తి సోమ పానంలో ఎక్కడ లభిస్తుంది? ఆపదలలో చిక్కుకొని దారిచూపే వృద్ధులు లభించని వారనలు బ్రతికి యుండియూ చచ్చిన వారితో సమానులే. అట్టి వారి దుర్ధశకు బందు జనం నిజంగా శోకించాలి. విపత్తనే మెసలి చేత జిక్కి దాని నుంచి విడిపింప గల వృద్ధులూ పండితులు, లభించని వారలకు శాంతి అంటూ ఎన్నడూ ఉండదు. ఆపదల్లో మునిగి వ్యసనాలను సుడి గుండంలో కొట్టు కొని పోయే వారికి వృద్దో పదేశాలు వినా మరేదీ గట్టుక చేర్చజాలదు. కుక వృద్ధులగు పెద్దల మాటలను విని ఆచరణలో పెట్టే అదృష్టవంతులకు అక్కడి కక్కడే సత్పలితాలు కలుగుతాయి. అందుకు దృష్టాంతం విరోచన నందునుడైన బలి వృత్తాంతమే.

ఇది శ్రీ వామన పురాణంలో ఎనిమిదవ అధ్యాయం శ్రీ త్రివిక్రమ చరిత్రం ముగిసినది.

Sri Vamana Mahapuranam    Chapters