Sri Vamana Mahapuranam    Chapters   

శ్రీ వామన పురాణ త్రి షష్టితమో%ధ్యాయః

శ్రీభగవానువాచ:-

ఆద్యం మాత్స్యం మహ ద్రూపం సంస్థితం మానసే హ్రదే| సర్వ పాప క్షయకరం కీర్తన స్పర్శ నాదిఖిః || 1

కౌర్మ్య మన్యత్సంనిధానం కౌశిక్యాం పాప నాశనమ్‌ | హయశీర్షం చ కృష్ణాంశే గోవిందం హస్తినాపురే || 2

త్రివిక్రమం చ కాళింద్యా లింగ భేదే భవం విభుమ్‌ | కేదారే మాధవం శౌరిం కుబ్జామ్రే హృష్ట మూర్దజమ్‌ || 3

నారాయణం బదర్యాం ఛ వారాహే గరుడాసనమ్‌ | జయేశం భద్రకర్ణే చ విపాశాయాం ద్విజ ప్రియమ్‌ || 4

రూపధారి మిరావత్యాం కురుక్షేత్రే కురుధ్వజమ్‌ | కృత శౌచే నృసింహం చ గోకర్ణే విశ్వ కర్మిణమ్‌ || 5

ప్రావీనే కాయపాలం చ పుండనీకం మహాంభసి | విశాఖ యూపే హ్యజితం హంసం హంస పదే తథా || 6

పయోష్ణాయా మఖండం చ వితస్తాయాం కుమారిలమ్‌ | మణిమ త్పర్వతే శంభుం బ్రహ్మణ్య చ ప్రజాపతిమ్‌ || 7

మధునద్యాం చక్రధరం పూల బాహుం హిమాలయే | విద్ది విష్ణుం ముని శ్రేష్ఠ! స్థితామోషధి సానుని || 8

భృగు తుంగే సువర్ణాక్షం నైమిషే పీత వాససమ్‌ | గయాయాం గోపతిం దేవం గదా పాణిన మీశ్వరమ్‌ || 9

త్రైలోక్య నాథం వరదం గోప్రతారే కుశే శయమ్‌ | అర్ధనారీశ్వరం పుణ్య మాహేంద్రే దక్షిణ గిరౌ || 10

గోపాల ముత్తరే నిత్యం మహేంద్రే సోమ పీథినమ్‌ | వైకుంఠ మపి సహ్యాద్రౌ పారియాత్రే% పరాజితమ్‌ || 11

కశేరు దేశే దేవేశం విశ్వరూపం తపో ధనమ్‌ | మలయాద్రౌ చ సౌగంధిం వింధ్యపాదే సదా శివమ్‌ || 12

అవంతి విషయే విష్ణుం నిషధే ష్వమరేశ్వరమ్‌ | పాంచాలికం చ బ్రహ్మర్షే పాంచాలేషు వ్యవస్థితమ్‌ || 13

మహోదయే హయగ్రీవం ప్రయాగే యోగ శాయినమ్‌ | స్వయంభువం మధు వనే అయోగంధిం చ పుష్కరే || 14

తథైవ విప్రప్రవర! వా రాణస్యాం చ కేశవమ్‌ | అవిముక్తక మత్రైవ లోక శ్చాత్రైవ గీయతే || 15

భగవ ద్విభూతి స్థానాలు.

శ్రీవామన దేవుడిలా చెప్రుకుంటూ పోయాడు. ఓ బ్రహ్మర్షీ! నా వ్యక్త రూపాల్లో మొదటిదీ మహోన్నతమైనదీ మత్స్యరూపం. మానస సరోవరంలో ఉన్నది. కీర్తన స్పర్శనాదుల చేతనే అది సర్వ పాపాలనూ నశింప జేస్తుంది పాప నాశకమై కూర్మరూపం కౌశిక నదిలో సన్నిహితమై యున్నది. కృష్ణాంశ తీర్థంలో హయ శీర్షం హస్తినాపురంలో గోవింద రూపాలున్నాయి.

త్రివిక్రమ రూపం యమునలో, భవ రూపం లింగభేదంలో, కేదారంలో మాధవ శౌరి రూపాలు, కుబ్జామ్రంలో హృష్టమూర్ధజహృష్టీకేశ రూపాలున్నాయి. బదరికా వనంలోని నారాయణుడు, గరుడా సన క్షేత్రంలోని వరాహమూర్తి, భద్రకర్ణంలోని జయేశ్వరుడు, విపాశా నది లోని బ్రాహ్మణ ప్రియుడు నా రూపాలే. ఇరావతి లోని రూపధరుడు, కురుక్షేత్రం లోని కురుధ్వజుడు, కృతశాచం లోని నృసింహుడు, గోకర్ణంలోని విశ్వకర్మ, ప్రాచీనంలో కామపాలుడు, మహాంభసంలోని పుండరీకుడు, విశాకయూపంలో అజితుడు హంసపది లోని హంసుడు, వయోష్ణిలోని అఖండుడు, వితస్తలోని కుమారిలుడు, మణిపర్వతాన గల శివుడు, బ్రహ్మణ క్షేత్రం లోని ప్రజాపతి, వీరందరు నా రూపాలే. మధు నది లోని చక్ర ధరుడు, హిమాలయాన శూలపాణి, ఓషధిప్రష్థాన గల విష్ణువు, భృగు తుంగంలోని సువర్ణాక్షుడు, నైమిషంలోని పీతాంబరుడు, గయా క్షేత్రం లోని గదాధర గోపతీశ్వరులు, గోప్రతారల లోని త్రైలోక్య నాధ, వరద, కుశేశయరూపాలు, దక్షిణాన పవిత్రమైన మహేంద్ర గిరి మీది అర్థనారీశ్వరుడు, ఉత్తర మహేంద్రంలో గోపాల, సోమ పీధి, మూర్తులు సహ్యగిరిపై వెలసిన వైకుంఠుడు, పారియాత్ర చలాన అపరాజితుడు, కవేరు దేశం లోని దేవేశ్వర, విశ్వరూప, తపోధన, రూపాలు మలయ పర్వతాన గల సుగంధి (పరిమళం), వింధ్య పాదాన గల సదాశివ రూపం, నా విభూతులే నని తెలుసుకో భరద్వాజా! అవంతి దేశాన విష్ణువు, నిషధలోని అమరేశ్వరుడు, పాంచాల భూమి యందలి పాంచాలిక దేవుడు, మహోదయం లోని హయగ్రీవుడు, ప్రయాగ లోని యోగ శాయి, మధువనంలోని స్వయంభూదేవుడు, సుష్కరకేశవుడు, లోలుడు, నా అంశ##లే!-

పద్మాయాం పద్మకిరణం సముద్రే బడవా ముఖమ్‌ | కుమార ధారే బాహ్లీశం కార్తికేయం చ బర్హిణమ్‌ || 16

అజేశేశం శంభు మనఘం స్థాణుం చ కురుజాంగలే | వనమాలిన మహుర్మాం కిష్కింధా వాసినో జనాః || 17

వీరం కువలయారూఢం శంఖ చక్ర గదా ధరమ్‌ | శ్రీ వత్సాంక ముదారాంగం నర్మదాయాం శ్రీయఃపతిమ్‌ ||18

మహిష్మత్యాం త్రినయనం తత్రైవ చ హు తాశనమ్‌ | అర్బుదే చ త్రి సౌవర్ణం క్ష్మాధరం సూకరాచలే || 19

త్రీణాచికేతం బ్రహ్మర్షే! ప్రభాసే చ కపర్దినమ్‌ | తథైవా త్రాపి విఖ్యాతం తృతీయం శశిశేఖరమ్‌ || 20

ఉదయే శశినం సూర్యం ధ్రువం చత్రితయం స్థితమ్‌ | హేమకూటే హిరణ్యక్షుం స్కందం శరవణ మునే || 21

మహాలయే స్మృతం రుద్ర ముత్తరేషు కురుష్యథ! | పద్మనాభం ముని శ్రేష్ఠ! సర్వ సౌఖ్య ప్రదాయకమ్‌ || 22

సప్త గోదావరే బ్రహ్మన్‌ విఖ్యాతం హాటకేశ్వరమ్‌ | తత్రైవ చ మహా హంసం ప్రయాగే%పి వటేశ్వరమ్‌ || 23

శోణ చ రుక్మ కవచం కుండినే ఘ్రాణ తర్పణమ్‌ | ఖిల్లీ వనే మహా యోగం మాద్రేషు పురుషోత్తమమ్‌ || 24

ప్లక్షావతరణ విశ్వం శ్రీనివాసం ద్విజోత్తమ | శూర్పారకే చతుర్బాహుం మగధాయం సుధా పతిమ్‌ || 25

గిరి వ్రజే పశు పతిం శ్రీ కంఠం యమునా తటే | వనస్పతిం సమాఖ్యా తం దండకారణ్య వాసినమ్‌ || 26

కాలింజరే నీలకంఠం సరయ్వాం శంభు ముత్తమమ్‌ | హంస యుక్తం మహా కోశ్యాం సర్వ పాప ప్రణాశనమ్‌ ||1 27

గోకర్ణే దక్షిణ శర్వం వాసుదేం ప్రజాముఖే | వింధ్య శ్రుంగే మహాశౌరిం కంధాయాం మధుసూదనమ్‌ || 28

త్రికూట శిఖరే బ్రహ్మన్‌! చక్రపాణిన మీశ్వరమ్‌ | లౌహదండే హృషీకేశం కోసలాయాం మనో హరమ్‌ || 29

మహా బాహుం సురాష్ట్రే చ నవ రాష్ట్రే యశో ధరమ్‌ | భూ ధరం దేవికా నద్యాం మహోదాయాం కుశ ప్రియమ్‌ || 30

గోమత్యాం ఛాదిత గదం శంఖోద్ధారే చ శంఖినమ్‌ | సునేత్రం సైంధవారణ్య శూరం పురే స్థితమ్‌ || 31

రుద్రాఖ్యం చ హిరణ్యత్వాం వీరభద్రం త్రివిష్టపే | శంకు కర్ణం చ భీ మాయాం భీమం శాలననే విదుః || 32

పద్మక్షేత్రంలో పద్మ కిరణ రూపంలో సముద్రంలో బడవా ముఖంగా, కుమార ధారలో బాహ్లీశ కార్తికేయ, బర్హిణులుగా, అజేశంలో శంభు, అనఘ రూపాల్లో, కురు జాంగలంలో స్థాణువుగా, కిష్కింధవాసుల చే వనమాలియని పిలువ బడుతూ ఉన్నవి, నా అంశ##లే, నర్మదలో నన్ను వీరుడనీ, కువ లయా రూఢుడనీ, శంఖచక్ర గదాధరుడనీ, శ్రీవత్సాంకుడనీ, ఉదారాంగు శ్రీయఃపతి అనీ, పిలుస్తారు. మాహిష్మతిలో త్రినయనుడనీ, హుతాశను డనీ, అర్బుదక్షేత్రాన త్రిసౌపర్ణుడనీ, సూకరాచలంలో క్ష్మాధరుడనీ నాకు పేర్లు. ఓ బ్రహ్మర్షీ! ప్రభాస క్షేత్రాన త్రిణాచికేత, కపర్ది, సోమ శేఖర, రూపాల్లో నే నుంటాను. ఉదయ తీర్దాన శశి, సూర్య, ధ్రువులు గా హేమ కూటంలో హిరణ్యాక్షుడుగా, శరవణంలో స్కందుడుగా ఉన్నాను. మహాలయంలో రుద్రుడుగా, ఉత్తరుకురు దేశానసర్వ సౌఖ్యదాయాకుడగు పద్మనాభుడుగా నాకు ప్రసిద్ది! సప్త గోదావరి క్షేత్రాన హాటకేశ్వరుడుగా, మహాహంసగా, వటేశ్వరుడుగా, ప్రయాగలో నాకు పేర్లు. శోణలో రుక్మకవచుడను, కుండినలో ఘ్రాణ తర్పణుడగను, ఖిల్లీ వనంలో మహాయోగిని, మద్ర దేశంలోని పురుషోత్తముడను నేనే. స్లక్షావతరణంలో విశ్వుడుగా, శ్రీనివాసుడుగా, శూర్పారకాన చతుర్భుజుడుగా, మగదలో సుధాపతిగా నన్ను పేర్కొంటారు. గిరివ్రజంలో పశుపతిగా, యమునా తీరాన శ్రీకంఠుడుగా, దండకారణ్య వాసులచే వనస్పతిగా తెలియబడుచున్నాను. కాలింజరంలో నీల కంఠుడను. సరయూ తీర్థాన శంభుడను, మహాకోశిలో హంస యుక్తుడను. దక్షిణ గోకర్ణంలో శర్వుడను. ప్రజా ముఖ తీర్థంలో వాసుదేవుడను. వింధ్య శిఖరాన మహాశౌరిని, కంధలో మధుసూదనుడను గా ఉన్నాను. ఓ బ్రాహ్మణా! త్రికూట శిఖరాన చక్రపాణి ఈశ్వరులుగా, లౌహదండలో హృషికేశుడుగా, కోసలలో మనోహరుడుగా సురాష్ట్రంలో మహా భుజుడుగా, నవరాష్ట్రంలో యశోధరుడుగా, దేవికా నదిలో భూదరుడుగా, మహోదలో కుశ ప్రియుడుగా నన్ను పేర్కొంటారు. గోమతిలో ఛాదిత గదుడుగా, శంఖోద్ధారంలో శంఖిగా, సైంధవారణ్యంలో సునేత్రుడుగా, శూరపురంలో శూరుడు గా నేనే ఉన్నాను. హిరణ్యధతిలో నేను రుద్రుడను. త్రి విష్టపంలో వీరభద్రుడను. భీమా తారాన శంకు కర్ణుడను. శాలవనంలో భీముడను.

విశ్వామిత్రం చ గదితం కైలాసే వృషభధ్వజమ్‌ | మహేశం మహీలాశైలే కామ రూపే శశి ప్రభమ్‌ || 33

వలభ్యా మపి గోమిత్రం కటాహే పంకజ ప్రియమ్‌ | ఉపేంద్రం సింహల ద్వీపే శక్రాహ్వే కుంద మాలినమ్‌ ||34

రసాతలేచ విఖ్యాతం సహస్ర శిరసం మునే! | కాలాగ్ని రుద్రం తత్రైవ తథా %న్యం కృతివాసనమ్‌ || 35

సుతలే కూర్మ మచలం వితలే పంకజాసనమ్‌ | మహా తలే గురో! ఖ్యాతం దేవేశం ఛాగలేశ్వరమ్‌ || 36

తలే సహస్ర చరణం సహస్ర భుజ మీశ్వరమ్‌ | సహస్రాక్షం పరిఖ్యాతం ముసలాకృష్ట దానవమ్‌ || 37

పాతాళే యోగినా మీశం స్థితం చ హరి శంకరమ్‌ | ధరా తలే కోక నదం మేదిన్యాం చక్ర పాణినమ్‌ || 38

భువర్లోకే చ గరుడం స్వర్లోకే విష్ణు మవ్యయమ్‌ | మహార్లోకే తథా % గస్త్యం కపిలం చ జనే స్థితమ్‌ || 39

తపో లోకే % ఖిలం బ్రహ్మన్‌ వాజ్‌మయం సత్య సంయుతమ్‌ | బ్రహ్మాణం బ్రహ్మాలోకే సప్తేమే వై ప్రతిష్ఠితమ్‌ || 40

సనాతనం తథాశైలే పరం బ్రహ్మచవైష్ణవే | అప్రతర్క్య నిరాలంబే నిరాకాశే తపో మయమ్‌ || 41

జంబూ ద్వీపే చ తు ర్బాహుం కుశద్వీపే కుశే శయమ్‌ | ప్లక్ష ద్వీపే మునిశ్రేష్ఠ! ఖ్యాతం గరుడ వాహనమ్‌ || 42

పద్మనాభం తధాక్రౌంచేశాల్మలే వృషభ ధ్వజమ్‌ | సహస్రాంశుః స్థితఃశాకే ధర్మరాట్‌ పుష్కరే స్థితః || 43

తథా పృధివ్యాం బ్రహ్మర్షే శాలగ్రామే స్థితో % స్మ్యహమ్‌ | సజల స్థల పర్యంతం చరేషు స్థావరేషు చ || 44

ఏతాని పుణ్యాని మమాలయాని బ్రహ్మన్‌ పురాణాని సనాతనాని | ధర్మ ప్రదానీ హ మహౌ జసాని

సంకీర్తనీయా న్యఘనాశనాని || 45

సంకీర్తనా త్స్మరణా ద్దర్శనాచ్చ సంస్పర్మనా దేవ చ దేవతాయాః | ధర్మార్ద కామా ద్యపవర్గమేవ ల

భంతి దేవా మనుజాః సుసాధ్యాః || 46

ఏతాని తుభ్యం వినివేదితాని మమాలయా నీహ తపో మయాని | ఉత్తిష్ఠ గచ్ఛామి మహాసురస్య

యజ్ఞం సురాణాం హితాయ విప్ర || 47

పులస్త్య ఉవాచ :-

ఇత్యేవ ముక్త్వా వచనం మహర్షే విష్ణుర్భరద్వాజ మృషిం మహాత్మా| విలాస లీలా గమనో గిరీం ద్రా త్సచా

భ్యగచ్ఛత్‌ కురు జాంగలం హి || 48

ఇతి శ్రీ వామన పురేణ త్రిషస్ఠి తమో%ధ్యాయః సమాప్తము

అక్కడనే నా విశ్వామిత్ర రూపం. ఉన్నది కైలాసాన వృషభ ధ్వజుడను, మహాళాగిరి మీద మహేశుడను, కామ రూపాన శశి ప్రభుడను, వలభిలో గోమి త్రుడను, కటాహక్షేత్రాన పంకజ ప్రియుడను, సింహళ ద్వీపంలో ఉపేంద్రుడను, శక్ర తీర్థాన కుంద మాలా ధరుడను, రసాతలంలో సహస్ర శీర్షు (ఆదిశేషువు) డుగా విఖ్యాతుడను అక్కడనే కాలాగ్ని రుద్రకృత్తి వాసుల రూపాన గూడ ఉన్నాను. సుతలాన కూర్మ, అచల, రూపాలలో, వితలాన పంకజాసనుడుగా పున్నది నా అంశ##లే. ఓ గురూ | మహా తలాన ఛాగలేశ, దేవేశులుగా తల లోకాన సహస్ర చరణుడుగా, సహస్రభుజుడుగా, ఈశ్వరుడుగా, సహస్రాక్షుడుగా, ముసలాకృష్ట దానవుడుగా పిలువ బడుతున్నాను. పాతాళంలో యోగీశ, హరి, శంకర, రూపాల్లోను, ధరా తలాన కోక నదుడు గాను, మేదిని యందు చక్ర పాణి గాను ప్రసిద్దుడనైనాను. భువర్లోకాన నేను గరుడుడను. స్వర్లోకాన అవ్యయుడ నగు విష్ణువును. మహార్లోకంలో అగస్త్యుడను, జనో లోకాన కపిలదేవుడను. తపో లోకంలో అఖిల వాజ్మయ సత్య సంయుతరూపాలు. ఏడవది యగు లోకాన బ్రహ్మ రూపాన నేను ప్రతిష్ఠ నందు చున్నాను. శైవ వాతావరణంలో సనాతనుడను. వైష్ణవ సముదాయాన పరబ్రహ్మను. నిరాలంబస్థితిలో అప్రతర్క్యుడను. నిరాకాశంలో తపోమయుడను. జంబూద్వీపంలో చతుర్భుజుడను. కుశద్వీపంలో కుశేశయుడను. ఓ మునిశ్రేష్ఠా! ప్లక్ష ద్వీపంలో గరుడవాహనుడుగా ఖ్యాతి వహించాను. నన్నుక్రౌంచ ద్వీపంలో పద్మ నాభుడనీ, శాల్మలంలో వృషభ ద్వజుడనీ, శాక దీపాన సహస్రాంశుడనీ, పుష్కర ద్వీపాన ధర్మరాట్‌ అనీ పిలుస్తారు. అలాగే ఓ బ్రహ్మర్షీ! ఈ పృథ్వి మీద శాల గ్రామాలలో నా ఉనికి. జల స్థలాలలో గల స్థావర జంగమ జీవులన్నింటిలో నేను నివసిస్తాను. సనాతనాలు, పురాతనాలు, పవిత్రాలునైన యివన్నియునేనుండు స్థానాలు. ఇవి ధర్మప్రదాలు. తేజో మయాలు. పాప నాశకాలు. సదా కీర్తింప దగినవి. ఈ దేవతల దర్మన స్పర్శన కీర్తన స్మరణాదులా చరించిన చో దేవ మానవ సాధ్యులు నాలుగు విధాల పురుషార్థాలూ సాధిస్తారు. ఇది నిశ్చయము. బ్రాహ్మణా! లెమ్మునా తపోమయాలయిన విభూతి స్థానాలు తెలుసుకున్నావు. ఇక మనమా దేవతలకు కల్యాణం చేకూర్చుటకు అసురేశ్వరుడు చేస్తున్న యజ్ఞానికి వెళ్దాము పద. ఇలా భగవానుడు వామనుడు చెప్పి ఆ భరద్వాజ ఋషి తో ఆ పర్వతా న్నుంచి లీలా విలాసాలు వెలార్చుతూ కురు జాంగలానికి వెళ్లాడు.

ఇది శ్రీ వామన పురాణంలో నరువది మూడవ

అధ్యాయము సమాప్తము.

Sri Vamana Mahapuranam    Chapters