Sri Vamana Mahapuranam    Chapters   

శ్రీ వామన పురాణ ద్వి షష్ఠితమో%ధ్యాయః

పులస్త్య ఉవాచ c

గతే%థ తీర్దయాత్రాయాం ప్రహ్లాదే దానవేశ్వరే | కురుక్షేత్రం సమభ్యాగా ద్యష్టుం వైరోచనో బలిః || 1

తస్మిన్‌ మహా ధర్మయుతే తీర్థే బ్రాహ్మణ పుంగవః | శుక్రో ద్విజాతి ప్రవరా నామం త్రయత భార్గవాన్‌ || 2

భృగూ నామంత్ర్యమాణాన్‌ వై శ్రుత్వాత్రేయాః సగౌతమాః | కౌశికాంగిరసశ్చైవ తత్యజుః కురుజాంగలాన్‌ || 3

ఉత్తరాశాం ప్రజగ్ముస్తే నదీ మను శతద్రు కామ్‌ | శాతద్రుమే జలే స్నాత్వా విపాశాం ప్రయయు స్తతః || 4

విజ్ఞాయ తత్రాప్యరతిం స్నాత్వార్చ్య పితృదేవతాః | ప్రజగ్ముః కిరణాం పుణ్యాం దినేశ కిరణ చ్యుతామ్‌ || 5

తస్యాం స్నాత్వా ర్చ్య దేవర్షే సర్వ ఏవ మహర్షయః | ఐరావతీం సుపుణ్యోదాం స్నాత్వా జగ్ము రధేశ్వరీమ్‌ || 6

దేవికాయా జలే స్నాత్వా పయోష్ణ్వాం చైవ తాపసాః | అవతీర్ణా మునే! స్నాతు మాత్రేయాద్యాః శుభాం నదీమ్‌ || 7

తతో నిమగ్నా దదృశుః ప్రతిబింబ మథాత్మనః | అంతర్జలే ద్విజశ్రేష్ఠ! మహాదాశ్చర్య కారకమ్‌ || 8

ఉన్మత్రనే చ దదృశుః పున ర్విస్మిత సమానసాః | తతః స్నాత్వా సముత్తీర్ణా ఋషయః సర్వ ఏవహి || 9

జగ్ముస్తతో%పి తే బ్రహ్మన్‌ ! కథయంతః పరస్పరమ్‌ | చింతయంతశ్చ సతతం కిమేతదితి విస్మితాః || 10

తతో దూరా దపశ్యంత వనషండం సువిస్తృతమ్‌ | వనం హర గళ శ్యామం ఖగ ధ్వని నినాదితమ్‌ || 11

అతితుంగతయా వ్యోమ ఆవృణ్వానం నగోత్తమమ్‌ | విస్త్రుతాభి ర్జటాభిస్తు అంతర్భూమిం చ నారద! ||12

కాననం పుష్పితైర్‌ వృక్షై రతిభాతి సమంతతః | దశార్థ వర్ణైః సుఖదై ర్నభ స్తారా గణౖ రివ|| 13

తం దృష్ట్వా కమలై ర్వాప్తం పుండరీకై శ్చ శోభితమ్‌ | తద్వత్‌ కోకనదై ర్య్వాప్త వనం పద్మ వనం యధా || 14

ప్రజగ్ముస్తుష్టి మ తులాం తే హ్లాదం పరమం యయః | వివిశుః ప్రీతమనసో హంసా ఇవ మహా సరః || 15

శ్రీ వామన పురాణం ఆరువది రెండవ అధ్యాయం ||

పులస్త్యుడు చెప్ప నారంభించెను - దానవేశ్వరుడగు ప్రహ్లాదుడు (బలికి హితోపదేశం చేసి) తీర్థయాత్రలకు వెళ్లిన వెంటనే ఆ విరోచన తనయుడు యజ్ఞం చేయుటకై కురుక్షేత్రానికి వచ్చి చేరాడు. ఆ మహా ధర్మక్షేత్రంలో బ్రాహ్మణ పుంగవుడగు శుక్రాచార్యుడు తమ భృగు వంశీయు లగు ఉత్తమ బ్రాహ్మణులను ఆహ్వానించాడు. భార్గవులను యజ్ఞానికై పిలిచిన విషయం వినగానే అందున్న ఆత్రేయ గౌతమ గోత్రీయులూ, కౌసిక ఆంగిరసు లగు బ్రాహ్మణులు, ఆకురుజాంగరాన్ని వదలి ఉత్తరంగా శతద్రూ నదీ దిశగా వెళ్లి పోయారు. శతద్రు నదిలో స్నానం చేసి విపాశా నదికి వెళ్లారు. అక్కడ కూడ తృప్తిలభించకపోగా నా నదిలో మునిగి పితరుల నర్చించి అట నుంéడి సూర్య కిరణాల నుండి స్రవించిన పుణ్య నది కిరణానది చేరి అట స్నానమాడి, ఆ మహర్షులందరు పుణ్య జుల యగు ఐరావతిలో మునిగి ఈశ్వరీ నదికి వెళ్లారు. ఓ నారదా! ఆత్రేయాదులగు నా మహర్షులందరు దేవికా నదిలో స్నానాలు చేసి, సమోష్ణీనది మంగళ జాలాలలో మునుగుటకై నదిలో దిగారు. నీళ్లలో మునిగినంతనే వారందరు ఆ జలాల్లో తమ ప్రతి వింబాలను చూచి అబ్బుర పడి పోయారు. మునిగి లేచి బయటకు వచ్చిన తర్వాత గూడ తమ ప్రతిబింబాలను ఆ నీళ్లలో చూచి మరల పరమాశ్చర్యంలో మునిగి పోయారు. స్నానానంతరం తీరానికి చేరి ఆశ్చర్య కర దృశ్యాన్ని గురించి పరస్పరం మాట్లాడు కుంటూ, ఆ అద్భుతమేమా అని ఆలోచిస్తూ అక్కడ నుంచి వెళ్లి పోయారు. అలా వెళ్లుతూ ఉండగా అల్లంత దూరాన పక్షు కల కల ధ్వనులతో నిండి హరుని కంఠ సీమ వలె నల్లగా ఒక విశాలమైన వృక్షముల గుంపు కనిపించింది. ఆ చెట్ల పొదలు ఆకాశాన్నీ పర్వతాన్ని కప్పి వేసి సుదీర్ఘాలయిన ఊడల శాఖలతో భూమిని తాకు తున్నాయి. నాలు గయిదు రంగుల పూల గుత్తులతో సర్వత్రా నిండి శోభలు వెద జల్లు తున్న ఆ అరణ్యం నక్షత్రాల గుంపులతో నిండిన ఆకాశ వీధిలాగా హాయి గొలుపుతూ నయనోత్సవం కావిస్తోంది, ఆ ప్రదేశాన రక రకాల కమలాలతో - రాజీవాలు కోకనదాలు, పుండరీకాలతో చిత్తాలకు ఆహ్లాదాలు కలిగించే పద్మవనం కనిపించింది. ఆ శోభకు పులకించిన హృదయాలతో ఆ తాపసు లందరు, కమలాకరం లోనికి దిగే హంస లకు వలె ఆనంద పరవశులై ఆ వనం లోకి నడచారు.

తన్మధ్యే దదృశుః పుణ్య మాశ్రమం లోక పూజితమ్‌ | చతుర్ణాం లోక పాలానాం వర్గాణాం మునిసత్తమ || 16

ధర్మాశ్రమం ప్రాజ్‌ముఖం తు పలాశ విటపావృతమ్‌ | ప్రతీచ్యాభిముఖం బ్రహ్మన్‌ అర్ధస్యేక్షు వనావృతమ్‌ || 17

దక్షిణాభి ముఖం కామ్యం రంభా శోక వనావృతమ్‌ | ఉదజ్‌ ముఖం చ మోక్షస్య శుద్ద స్ఫటిక వర్చసమ్‌ || 18

కృతాంతే త్వాశ్రమీ మోక్షః కామ స్త్రేతాంతరే శ్రమీ | ఆశ్రమ్యర్ధో ద్వాపరాంతే తిష్యాదౌధర్మ ఆశ్రమీ || 19

తాన్యాశ్రమాణి మునయో దృష్టా%త్రేయాదయో%వ్యయాః | తత్రైవ చ రతిం చక్రు రఖండే సలిలాప్లుతే || 20

ధర్మధ్యైర్మగవాన్‌ విష్ణు రఖండ ఇతి విశ్రుతః | చతు ర్మూర్తిర్జగన్నాథః పూర్వమేవ ప్రతిష్ఠితః || 21

తమర్చయంతి ఋషయో యోగాత్మానో బహుశ్రుతాః | శుశ్రూషయా%థ తపసో బ్రహ్మచర్యేణ నారద! || 22

ఏవంతే న్యవసం స్తత్ర సమేతా మునయో వనే | అసురేభ్యస్తదా భీతాః స్వాశ్రిత్యా ఖండ సర్వతమ్‌ || 23

తథా%న్యే బ్రాహ్మణా బ్రహ్మన్‌! అశ్మకుట్టా మరీచిపాః | స్నాత్వా జలే హి కాళింద్యాః ప్రజగ్ముర్దక్షిణా ముఖాః || 24

అవంతి విషయం ప్రాప్య విష్ణు మాసాద్య సంస్థితాః | విష్ణో రపి ప్రసాదేన దుష్ప్రవేశం మహాసురైః || 25

వాలఖిల్యాదయో జగ్ము రవశా దానవా ద్బయాత్‌ | రుద్ర కోటిం సమాశ్రిత్య స్థితా స్తే బ్రహ్మ చారిణః || 26

ఏవం గతేషు విప్రేషు గౌతమాంగిరసాదిషు | శక్రస్తు భార్గవాన్‌ సర్వాన్‌ నిన్యే యజ్ఞ విదే మునే || 27

అధిష్ఠితే భార్గవైస్తు మహా యజ్ఞే%మిత ద్యుతే | యజ్ఞ దీక్షాం బలేః శుక్ర శ్చకార విధినా స్వయమ్‌ || 28

శ్వేతాంబర ధరోదైత్యఃశ్వేత మాల్యాను లేపనః | మృగాజినావృతః పృష్ఠే బర్హి పత్ర విచిత్రితః || 29

సమాప్తే వితతే యజ్ఞే సదసై#్యరభిసంవృతః | హయగ్రీవ ప్రలంబాద్యై ర్మయ బాణ పురోగమైః || 30

ఆ వనం మధ్య భాగాన, ఓ నారదా! చతు ర్వర్గాలకూ నెలవైన సర్వ జనులచే పూజింప బడే మహా పుణ్యాశ్రమాన్ని ఆ మునులు చూచారు. అక్కడ తూర్పు ముఖంగా మోదుగు చెట్ల గుంపులచే ఆవరింప బడిన ధర్మాశ్రమం ఉంటే పశ్చిమ ముఖంగా చెరకు తోటలతో నిండిన అర్థాశ్రమం నెల కొన్నది. దక్షిణాభి ముఖంగా అరటి అశోక వృక్షాల మధ్య కామ్య ఆశ్రమం, ఉత్తర ముఖంగా శుద్ద స్ఫటిక శోభతో వెలిగే మోక్షాశ్రమం విరాజిల్లుతున్నాయి. కృత యుగాంతాన ఆ ఆశ్రమంలో మోక్షం నివసించగా త్రేతాయుగాంతాన కామం ఆశ్రమ వాసం చేస్తుంది. ద్వాపరాంతాన అర్థానికిక్కడ స్థానం లభిస్తే కలి యుగారంభంలో ధర్మం ఆ ఆశ్రమంలో వాసం చేస్తుంది. ఆత్రేయాదులగు నా మహర్షులా నాలు గాశ్రమాలూ చక్కని జల సమృద్ధితో విలసిల్లే ఆ అఖండ గిరిని చూచి దాని మీద మోజు పడ్డారు. ధర్మాది పురుషార్థ చతుష్ఠయమయుడగుటచే విష్ణు భగవానునకు అఖండ తత్వమను పేరు గలిగినది. అందుకు సూచనగా చతుర్భుజు డగు జగన్నాధుడుగా విష్ణువుకు ప్రతిష్ఠకు ముందు నుంచే కలిగి ఉంది. నారదా! ఆ ప్రభువును. ఆ ప్రదేశాన బహుశ్రుతులు యోగాత్మలు నగు మునులు ఏకాగ్ర చిత్తాలతో బ్రహ్మచర్య దీక్షతో ఆరాధిస్తారు. రాక్షసులకు వెరచి మునులంతా ఆ అఖండ పర్వతాన్నాశ్రయించుకొని ఉంటారు. అశ్మకుట్ట, మరీచిపులను బ్రాహ్మణులు కొందరు కాళింది నదిలో స్నానం చేసి దక్షిణాముఖులై వెళ్లి అవంతి దేశాన విష్ణువు నాశ్రయించి స్థిరపడ్డారు. విష్ణు మహిమ వల్ల రాక్షసుల కాదేశంలోకి ప్రవేశించడం దుర్లభము. ఇక వాలఖిల్యాది మునులు దానవుల భాధకు తాళ లేక బ్రహ్మ చర్య దీక్షితులై రుద్రకోటిని ఆశ్రయించారు. ఇలా రాక్షసుల బాధకు వెరచి గౌతమాంగిరీసాదులగు మునులు తలొక దిశగా వెళ్లి పోయి తల దాచుకొనగా శుక్రాచార్యులడు భృగు వంశీయులగు తన విప్రుల నందరను ఆ యజ్ఞానికి రప్పించాడు. అమిత తేజో మయమైన ఆ మహా యజ్ఞవేది యందు భృగ్వాదులగు విప్రోత్తముల నడుమ శుక్రుడు విద్యుక్తంగా ఆ బలి మహా రాజును యజ్ఞ దీక్షితుని గావించాడు శుభ్రమైన తెల్లని వస్త్రాలు ధరించి శ్వేత గంధానులేపనం మాలా ధారణం గావించుకుని కృష్ణజినంతో వీపును కప్పుకొని, కుశ ధర్భాంకురాలతో కళకళ లాడూతూ విశాలలమైన యజ్ఞశాలలో, ఋత్విక్కులు సదస్యులు, హయగ్రీవ, ప్రలంబ బాణ, మయాది దైత్య శ్రేష్ఠులచే పరివేష్ఠితుడై ఆ బలి దైత్యేంద్రుడు ఆసీను డయ్యాడు.

పత్నీ వింధ్యా వళీ చా%స్య దీక్షితా యజ్ఞ కర్మణి | లలనానాం సహస్త్రస్య ప్రధానా ఋషి కన్యకా || 31

శుక్రేణాశ్వః శ్వేతవర్ణో మధు మాసే సులక్షణః | మహీం విహర్తు ముత్సృష్ట స్తారకక్షో%న్వగా చ్చతమ్‌ || 32

ఏవ మశ్వే సముత్సృష్టే వితతే యజ్ఞ కర్మణి | గతే చ మాస త్రితయే హూయమానే చ పావకే || 33

పూజ్య మానేషు దైత్యేషు మిథునస్థే దివాకరే | సుషువే దేవజననీ మాధవం వామ నా కృతిమ్‌ || 34

తం జాత మాత్రం భగవంత మీశం నారాయణం లోకపతిం పురాణమ్‌ |

బ్రహ్మాసమభ్యేత్య సమం మహర్షిఖిః స్తోత్రం జగాదా%థ విభో ర్మహర్షే! || 35

నమో%స్తుతే మాధవ! సత్వమూర్తే! నమో%స్తుతే శాశ్వత! విశ్వరూప!

నమో%స్తుతే శత్రు వనేంధనాగ్నే! నమో%స్తువై పాప మహాదవాగ్నే! || 36

నమస్తే పుండరీకాక్ష! నమస్తే విశ్వభావన! | నమస్తే జగదాధార! నమస్తే పురుషోత్తమ! 37

నారాయణ! జగన్మూర్తే! జగన్నాధ! గదాధర! | పీతవాసః! శ్రియః కాంత! జనార్దన! నమో%స్తుతే 38

భవాం స్త్రాతా చ గోప్తా చ విశ్వాత్మా సర్వగో%వ్యయః | సర్వధారీ ధరా ధరీ రూపధారీ నమో%స్తుతే 39

వర్ధిస్వ వర్ధితాశేషత్రైలోక్య సుర పూజిత! కురుష్య దైవతపతే! మఘోనో%శ్రుప్రమార్జనమ్‌ 40

త్వం ధాతా చ విధాతా చ సంహర్తా త్వం మహేశ్వరః | మహాలయ! మహాయోగిన్‌! యోగశాయిన్‌! నమో%స్తుతే!! 41

ఇత్థం స్తుతో జగన్నాథః సర్వాత్మా సర్వగోహరిః | ప్రోవాచ భగవాన్‌ మహ్యం కురూప నయనం విభో !! 42

తత శ్చకార దేవస్య జాత కర్మాదికాః క్రియాః| భరద్వాజో మహాతేజా బార్హస్పత్యస్తపోధనః !! 43

వ్రత బంధం తథేశస్య కృతవాన్‌ సర్వ శాస్త్ర విత్‌ | తతో దదుః ప్రీతి యుతాః సర్వ ఏవ వరాన్‌ క్రమాత్‌ !! 44

వేయి మంది భార్యలలో నుత్తమురాలు ఋషిపుత్రి అయిన వింధ్యావళి ఆ బలి ధర్మపత్ని పతితో బాటు యజ్ఞ దీక్ష స్వీకరించి భర్త ననుసరించినది. అంతట శుక్రుడు తెల్లని దేహ కాంతితో సర్వ లక్షితమైన యజ్ఞాశ్వాన్ని చైత్రమాసంలో భూమిని చుట్టి వచ్చుటకు వదలగా దాని రక్షణకై దైత్య వీరుడు, తారకాక్షుడు వెంట వెళ్ళాడు. యజ్ఞాశ్వ విసర్జనతో ఊపందుకున్న యజ్ఞ కర్మ మూడు మాసాలు హోమాదులతో విస్తరించింది. దైత్యులు పూజలందు కొంటూ ఉచ్చస్థితిలో నున్న ఆ సమయాన సూర్యుడు మిధున రాశిలో ప్రవేశించిన వేళ దేవ మాత యగు అదితి వాసుదేవుని వావనాకారంలో పుత్రునిగా ప్రసవించింది. ఆ లోకపతి ఆది పురుషుడు భగవంతుడగు నారాయణు డవతరించగనే బ్రహ్మర్షులతో కలిసి బ్రహ్మ ఆ విభుని సమీపించి, ఓ నారదా! ఇలా స్తోత్రం చేశాడు.

సత్యమూర్తి వగు మాధవా! నీకు నమస్సులు, ఓ శాశ్వతా! విశ్వరూపా! నీకు ప్రణామాంజలులు. శాత్రవారణ్యాలను, మహాపాప కాననాలను భస్మం చేసే దావానల స్వరూపా! నీకుకైమోడ్పులు! పుండరీకాక్షా! విశ్వభావనా! జగదాధారా! పురుషోత్తమా! నీకు నమస్కారములు. నారాయణా! జగన్మూర్తీ! జగత్పతీ! గదాధరా! పీతాంబరధరా! శ్రియఃపతీ! జనార్థనా! మీకు ప్రణతులు. ప్రభూ! నీవు మ యోగక్షేమాలు రక్షించేవాడవు, విశ్వాత్మవు. అవ్యయుడవు, సర్వవ్యాపివి, సర్వం ధరించేవాడవు, ధరణీ ధరుడవు, అన్ని రూపాలు నీవే, అట్టి నీకు జోహారులు! ముల్లోకాలను వర్ధింపజేయు ప్రభూ! వర్దిల్లుము! దేవపూజితా! దేవేశ్వరా! దేవరాజు యింద్రునికి అశ్రుమోచనం కావింపుము! నీవు ధాతవు విధాతవు; సంహర్తవు మహేశ్వరుడవు. మహాలయ రూపివి. మహా యోగివి, యోగశాయివి. నీకు మాటి మాటికి నమస్సులు! ఇలా స్తోత్రం చేసిన తర్వాత ఆ జగన్నాధుడగు శ్రీహరి భగవాన్‌! నాకు ఉపనయనం చేయుమని అర్థించినంతనే బృహస్పతి గోత్రుడు మహతేజస్వి అయిన భరద్వాజ మహర్షి ఆ భగవంతునకు జాత కర్మాది సంస్కారాలు జరిపి ఆ ఈశ్వరునకు బ్రహ్మ చర్య వ్రత దీక్ష యిచ్చాడు. ఆ సర్వ శాస్త్ర వేది ఉపనయనకాండ పూర్తి చేయగానే అక్కడ సమావేశ మైన వారందరా అద్భుత వటువ నకు కానుక లంద జేశారు.

యజ్ఞోపవీతం పులహస్త్వహం చ సిత వాససీ | మృగాజినం కుంభయోని ర్భరద్వాజస్తు మేఖలామ్‌ || 45

పాలాశ మదద ద్దండం మరీచి ర్భ్రహ్మణః సుతః | అక్ష సూత్రం వారుణిస్తు కౌప్యం వేద మథాంగిరాః || 46

ఛత్రం ప్రాదా ద్రఘా రాజా ఉపాన ద్యుగళం నృగః | కమండలుం బ్రహత్తేజాః ప్రాదా ద్విష్ణోర్‌ బృహస్పతిః || 47

ఏవం కృతోపనయనో భగవాన్‌ భూత భావనః | సంస్తూయమానో ఋషిభిః సాంగం వేద మధీయత || 48

భరద్వాజాదాంగిరసా త్సామవేదం మహా ధ్వనిమ్‌ | మహదాఖ్యాన సంయుక్తం గాంధర్వ సహితం మునే! || 49

మాసేనైకేన భగవాన్‌ జ్ఞాన శ్రుతి మహార్ణవః | లోకాచార ప్రవృత్యర్థ మభూ చ్ఛుతి విశారదః || 50

సర్వశాస్త్రేషు నైపుణ్యం గత్వా దేవో%క్షయో%వ్యయః | ప్రోవాచ బ్రాహ్మణ శ్రేష్ఠం భరద్వాజ మిదం వచః || 51

శ్రీ వామన ఉవాచ :-

బ్రహ్మణ్‌ వ్రజామి దేహ్యాజ్ఞాం కరుక్షేత్రం మహోదయమ్‌ | తత్ర దైత్య పతేః పుణ్యోహయ మేధః ప్రవర్తతే || 52

సమావిష్టాని పశ్యస్వ తేజాంసి పుధివీతలే | యే సంనిధానాః సతతం మదంశాః పుణ్య వర్దనాః |

తేనా హం ప్రతిజానామి కురుక్షేత్రం గతో బలిః || 53

భరద్వాజ ఉవాచ :-

స్వేచ్ఛయా తిష్ఠ వా గచ్చ నా%హ మాజ్ఞాపయామితే| గమిష్యామో వయం విష్ణో బలే రధ్వరం మా ఖిద || 54

యధ్భవంత మహం దేవ పరిపృచ్ఛామి తద్వద | కేషు కేషు విభో నిత్యం స్థానేషు పురుషోత్తమభవతో

బ్రూహి జాతు మిచ్ఛామి తత్వతః సాన్నిద్ద్యం || 55

శ్రీ వామన ఉవాచ :-

శ్రూయతాం కథయిష్యామి యేషు యేషు గురో అహమ్‌ | ని ద సామి సుపుణ్యషు స్థానేషు బహు రూపవాన్‌ || 56

మమావతారై ర్వసుధా నభస్తలం పాతాళ మంభో నిధయో దివశ్చ | దిశః సమస్తా గిరయో%ంబుదాశ్చ వ్యాప్తా

భరద్వాజ మమానురూపైః || 57

యే దివ్యా యే చ భౌమా జలగగన చరాః స్థావరా జంగ మాశ్చ| సేంద్రాః సారః సచంద్రా యమ వసు వరుణా

హ్య గ్నయః సర్వ పాలాః!

బ్రహ్మ ద్యాః స్థావరాంతా ద్విజ ఖగ సహితా మూర్తి మంతా హ్యమూర్తాః | తే సర్వే మత్ప్రసూతా బహు వివిధ

గుణాః పూరణార్థం పృధివ్యాః || 58

ఏతే హి ముఖ్యాః సురః సిద్ధ దానవైః పూజ్యాస్తధా సంనిహితా మహీతలే|

యైర్‌ దృష్ట మాత్రైః సహసైవ నాశం ప్రయాతి పాపం ద్విజవర్య కీర్తనైః || 59

ఇతి శ్రీ వామన పురాణ ద్విషష్ఠి తమో%ధ్యాయః సమాప్తః

ఆ ప్రభువుకు యజ్ఞోపబీతం పులహు డొసంగగా నేను (పులస్త్యుడు) తెల్లని కట్టు వస్త్రం యిచ్చాను. అగస్త్యుడు కృష్ణాజినం, భరద్యాజుడు మేఖల (మొలత్రాడు) యిచ్చారు. పాలాశ దండం బ్రహ్మ పుత్రుడు యివ్వగా, అక్ష మాలను వసిష్ఠుడిచ్చాడు. అంగిరసుడు కౌశ్యం ( ధర్భ కూర్చ) యిచ్చాడు. రఘు మహారాజు ఛత్రం సమర్పించగా నృగ మహారాజు పావుకోళ్లు నివేదించాడు. మహాతేజస్వి యగు నా వటునకు బృహస్పతి కమండలం అర్పించాడు. ఇలా ఉపనయన కర్మ సంపన్నం గావించుకుని ఆ భూతభావను డగు భగవంతుడు మహర్షులు స్తోత్రాలు చేస్తూండగా సాంగవేదాధ్యయనం గావించాడు. అంగిరసుడైన భరద్వాజుని వద్ద మహాధ్వని యుక్తమూ మహదాఖ్యానాలతో కూడిన సామవేదం గంధర సహితంగా అభ్యసించాడు. ఓ నారదా! వేద శాస్త్ర సముద్రమైన నా భగవంతుడు లోకచారాన్ని ఆచరణ ద్వారా ప్రవర్తింప చేయుటకు మాత్రమొక నెలరోజులలోనే శ్రుతి పాండిత్యాన్ని గడించాడు. అలా సర్వ శాస్త్రనైపుణ్యాన్ని పొందిన అనంతర మా అవ్యయుడు నక్షరుడు నగుకైతవబ్రహ్మచారి బ్రాహ్మణ శ్రేష్ఠుడగు భరద్వాజునితో యిలా అన్నాడు. బ్రహ్మన్‌! నా కనుజ్ఞ యిచ్చినచో మహా అభ్యుదయ ప్రదమైన కురుక్షేత్రానికి వెళ్లగలను. అక్కడ దైత్యేయుడగు బలి పుణ్య ప్రదమైన అశ్వమేధయాగం చేస్తున్నాడు. పుణ్య వర్ధకాలయిన నా తేజో అంశాల ప్రభావం వల్ల నే వాటి సంనిధానాన్ని పొంది అతడు భూలోకంలో ఆ యజ్ఞం చేయగలుగుదున్నాడు. వాని నన్నింటినీ అచట చూడ వచ్చు. నాతో రండు. అది విని భరద్వాజుడిలా అన్నాడు. విష్ణో! నీకు నేను ఆజ్ఞ యిచ్చువాడను కాను. నీ యిష్టం వచ్చినట్టు ఉండవచ్చూ వెళ్లవచ్చు. మన మంతా బలి యజ్ఞానికి వెళ్లుదాము. చింతవలదు. అయితే నేను నిన్నోకటి అడుగుతాను. అది నాకెరిగింపుము. ఓ పురుషోత్తమా! ఇప్పుడు నీ వన్నటువంటి తేజో అంశాలు విభూతులలో ఏఏ స్థానాల్లో ఉంటాయో, ఏఏ చోట సన్నిహితుడవై ఉంటావో వాటన్నింటి వివరాలు దయచేసి నాకు చెప్పుము. వాటి స్థానం తెలుసు కోవాని కుతూహల పడుతున్నాను!

భగవ ద్విభూతి స్థానాలు.

అది విని వామన దేవుడిలా అన్నాడు. ఓ గురూ! ఏ ఏ పుణ్య ప్రదేశాలలో బహు రూపినగు నేను నివసింతునో, ఆ వివరం చెబుతున్నా వినుము. ఓ భరద్వాజ! భూమి, ఆకాశం, పాతాలం, సముద్రాలు, దివి, దిక్కులు, సమస్త పర్వతాలు, మేఘాలు, యివన్నీ నా కనురూపాలుగా నుండే నా వివిధావతారాలతోనే నిండి ఉంన్నాయి. స్వర్గంలో భూమి మీద, ఆకాశ జలాల్లో, ఉండే స్థావర జంగమ జీవులు, యింద్ర, సూర్య, చంద్ర, యమ, వసు, వరుణ, అగ్ని, లోకపాలకులందరూ, బ్రహ్మమొదలు స్తంబ (జడం) పర్యంతం స్థూలం గానూ సూక్ష్మంగానూ ఉండే బహు విధాలయిన పశు పక్ష్యాదులన్నీ ఈ భూమిని నింపేందుకు నేను సృష్టించినవే. నానుండి ఉద్భవించినవే. దేవ, దానావ, సిద్ధులచే సృజింప బడే నా ప్రధాన మైన ఈ అంశాలు భూమి మీద ఉన్నాయి. ఓ బ్రహ్మణా! వీనిని చూచిననూ కీర్తించిననూ అప్పటి కప్పుడే సకల పాపాలు నశిస్తాయి. సుమా!

ఇది శ్రీ వామన పురాణంలో అరువది రెండవ అధ్యాయం ముగిసినది.

Sri Vamana Mahapuranam    Chapters