Sri Vamana Mahapuranam    Chapters   

శ్రీవామన పురాణ అష్ట పంచాశో%ధ్యాయః

నారద ఉవాచ :-

యాన్‌ జప్యాన్‌ భగవ ద్భక్త్యా ప్రహ్లాదో దానవో జపత్‌ | గజేంద్రమోక్షణాదీంస్తు చతుర స్తాన్‌ వదస్వమే || 1

పులస్త్య ఉవాచ :-

శ్రణుష్వ కథయిష్యామి జప్యానేతాం స్తపోధన! ళి దుఃస్వప్న నాశోభవతి యైరుకైః సంశ్రుతైః 2

గజేంద్రమోక్షణం త్వాదౌ శ్రణుష్య తదనంతరమ్‌ | సారస్వతం తతః పుణ్యౌ పాప ప్రశమనౌ స్తవౌ || 3

సర్వ రత్నమయః శ్రీమాన్‌ త్రికూటో నామ పర్వతః | సుతః పర్వత రాజస్య సుమేరో ర్భాస్కర ద్యుతేః || 4

క్షీరోద జలవీ చ్యగ్రై ర్థౌతామల శిలాతలః | ఉత్థితః సాగరం భిత్వాదేవర్షి గణసేవితః || 5

అప్సరోభిః పరివృతః శ్రీమాన్‌ ప్రస్రవణాకులః | గంధర్వైః కిన్నరై ర్యక్షేః సిద్ద చారణ పన్నగైః || 6

విద్యాధరైః సపత్నీకైః సంయతైశ్చ తపస్విభిః | వృక ద్వీపి గజేంద్రైశ్చ వృత గాత్రో విరాజతే || 7

పున్నాగైః కర్ణికారైశ్చ బిల్వామలక పాటలైః | చూత నీప కదంబైశ్చ చందనాగురు చంపకైః || 8

శావై స్తావె స్తమావైశ్చ సరలార్జున పర్పటైః | తథాన్యై ర్వివిధై ర్యృక్షైః సర్వతః సమలంకృతః || 9

నానా ధాత్వంకి తైః శృంగైః ప్రస్రవద్భిః సమంతతః | శోభితో రుచిర ప్రఖ్యస్త్రిభి ర్విస్తీర్ణ సానుభిః || 10

మృగైః శాఖామృగైః సిహై ర్మాతంగైశ్చ సదామదైః | జీవం జీవక సంఘుష్టై శ్చకోర శిఖి నాదితైః || 11

తసై#్యకం కాంచనం శృంగం సేవతే యం దివాకరః | నానా పుష్ప సమాకీర్ణం నానా గంధా దివాసితమ్‌ || 12

ద్వితీయం రాజతం శృంగం సేవతే యం నిశాకరః | పాండురాంబుద సంకోశం తుషార చయ సంనిభమ్‌ || 13

వజ్రేంద్ర నీలవై డూర్య తేజోభి ర్భాసయన్‌ దిశః | తృతీయం బ్రహ్మసదనం ప్రకృష్టం శృంగ ముత్తమమ్‌ || 14

న తత్‌ కృతఘ్నాః పశ్యంతి న నృశంసా న నాస్తికాః | నాకతప్తతపసో లోకే యే చ పాపకృతో జనాః || 15

శ్రీ వామన పురాణంలో ఏబది ఎనమిదవ అధ్యాయము

నారదుడు ప్రశ్న చేశాడు- బ్రహ్మర్షే! పరమ భక్తుడైన ప్రహ్లాదులు శ్రద్దగా జపించిన గజేంద్ర మోక్షణం మొలయిన నాలుగు స్తోత్రాలేమో చెప్పండి అపుగు పులస్త్యుడిలా చెప్ప సాగాడు. ఓ తపోధనా! దేనిని జపిస్తే వింటే స్మరిస్తే దుఃస్వప్నాలు నశించునో ఆ గజేంద్ర మోక్షణ గాధను ముందుగా వినుము. తర్వాత సారసత్వ పాప ప్రశమన స్తోత్రాలు చెబుతాను. సర్వ రత్నాలతో నిండిన త్రికూట మనే భవ్య పర్వతం ఉంది. సూర్య కాంతితో వెలిగే మేరు పర్వతానికి ఆ త్రికూట పర్వతం పుత్రడు. దేవర్షి గణాలు సేవించే ఆ పర్వతం క్షీర సాగరంలో నుంచి ఉద్భవించింది. దాని నునుపైన శిలలను ఆ సాగర తరంగాలు కడుగుతూంటాయి. అనేక సెలయేళ్లతో కల కల లాడే ఆ పర్వతాన్ని గంధర్వులు, కిన్నరులు, అప్సరసలు, సిద్ద, చారణ, పన్నగ, విద్యాధరులు తమ భార్యలతో కలిసి సేవిస్తుంటారు. జితేంద్రియు లగు తపస్వులకు ఆట పట్టు ఆ గిరి. తోడేళ్ళు, గజేంద్రాలు దాని మీద సంచరిస్తుంటాయి. ఆ పర్వతం నిండా పున్నాగ, కర్ణికార (గన్నేరు), బిల్వ, ఉసిరిక, పాటల, మామిడి, కడిమి, కదంబ, చందన, అగరు, సంపెంగ శాల, తాళ, తమాల, సరళ, అర్జున, పర్పటమొదలయిన ఎన్నో రకాలవృక్షాలు ఏపుగా పెరిగి నేత్ర పర్వం గావిస్తాయి. అనేక ధాతుమయాలైన దాని శిఖరాల నుంచి జాలువారే జల పాతాలతో అందాలు చిందించే మూడు సానువులతో అది అలరారుతూంటుంది. లేళ్లు, వానరాలు, సంహాలు, మదపుటేనుగులు జీవాలను చంపి తినే యితర జంతువులతో చకోర మయూరాల నాదాలతో ఆ ప్రదేశం కోలాహలంగా ఉంటుంది. ఆ మూడు శిఖరాలలో ఒకటి బంగారుమయమై దివాకరున కావాసంగా చక్కని పరిమళాలు వెదజల్లే నానపుష్వాలతో నిండి ఉంటుంది. చంద్రున కావసమైన రెండవ శిఖరం రజత నిర్మితం. అది శ్వేతమేఘ సమూహం లాగ తుషారపటలాల్లా గా మనోహరంగా ఉంటుంది. ఇంద్రనీల, వజ్ర, వైడూర్యకాంతులతో దిశలను వెలిగిస్తూ ఉండే మూడవ శిఖరం బ్రహ్మకు నెలవు. సర్వోత్తమమైనది. అది కృతఘ్నులకూ, కౄరులకూ, నాస్తికులకూ, తపస్సుచేయని పాపులకూ గోచరం కాదు.

తస్య సానుమతః పృష్టే సరః కాంచన సంకజమ్‌ | కారండవ సమాకీర్ణం రాజహంససోపశోభితమ్‌ || 16

కుముదోత్పలకల్హారైః పుండరీకైశ్చ మండితమ్‌ | కమలైః శతపత్రైశ్చ కాంచనైః సమలంకృతమ్‌ || 17

పత్రైర్మరకత ప్రఖ్యైః పుషై#్పః కాచన సంనిభైః | గుల్మైః కీచక వేణూనాం సమంతా

త్పరివేష్టితమ్‌ || 18

తస్మిన్‌ సరసి దుష్టాత్మా విరూపో%ంత ర్జవేశయః | ఆసీద్‌గ్రాహో గజేంద్రాణాం రిపు రాకేకరేక్షణః || 19

ఆధూనంతో జ్వలముఖః కదాచి ద్గజయూధపః | మదస్రావీ జలాకాంక్షీ పాద చారీవ పర్వతః || 20

వాసయ న్మద గంధేన గిరి మైరావతో పమః | గజో హ్యంజన సంకాశో మదా చ్చలిత లోచనః || 21

తృషితః పాతు కామో%సౌ అవతీర్ణశ్చ తజ్జలమ్‌ | సలీలః ఫంకజ వనే యూధ మధ్య గత శ్చరన్‌ || 22

గౄహీత స్తేన రౌద్రేణ గ్రాహే ణావ్యక్త మూర్తినా | పశ్యంతీనాం కరేణూనాం క్రోశం తీనాం చ దారుణమ్‌ || 23

హ్రయతే పంకజ వనే గ్రాహేణా తిబలీయసా | వారుణౖః సంయతః పాశై ర్నిష్ప్రయత్ర గతిః కృతః || 24

వేష్ట్య మానః సుఘోరైస్తు పాశైర్నాగో దృఢైస్తథా | విసార్యచ యథా శక్తి విక్రోశం చ మహారవాన్‌ || 25

వ్యథితః స నిరుత్సాహో గౄహీనో ఘోరకర్మణా | పరమాపదమాపన్నో మనసా చింతయ ద్దరిమ్‌ || 26

స తు నాగవరః శ్రీమాన్‌ నారాయణ పరాయణః | తమేవ శరణం దేవం గతః సర్వాత్మనా తదా || 27

ఏకాత్మా నిగృహీతాత్మా విశుద్ధే నాంతరాత్మనా | జన్మజన్మాంతరాభ్యాసాత్‌ భక్తి మాన్‌ గరుడధ్వజే || 28

నాన్యం దేవం మహాదేవాత్‌ పూజయామాస కేశవాత్‌ | మథితామృత ఫేనాభం శంఖ చక్ర గదా ధరమ్‌ || 29

సహస్ర భుజ నామాన మాది దేవ మజం విభుమ్‌ | ప్రగృహ్యపుష్కరాగ్రేణ కాంచనం కమలోత్తమమ్‌

ఆపద్విమోక్ష మన్విచ్ఛన్‌ గజః స్తోత్ర ముదీరయత్‌ || 30

ఆ పర్వతాగ్రాన బంగారు కమలాలతో నిండిన చక్కని సరోవరం నీటి బెగ్గురులు రాజహంసలు జల కుక్కుటాల కల ధ్వనులతో నయన శ్రవణాభిరామంగా శోభిస్తుంది. అందులో కలువలు, నల్ల కమలాలు, కల్హారాలు, తెల్ల కమలాలు, శతపత్రాలూ, కాంచన శోభతో నిండి ఉన్నాయి. మరకత మణు ల్లాగ కమల పత్రాలు నలువైపులా పరచుకుని ఉన్నాయి. సరోవరం చుట్టూ వెదురు పొదలు దట్టంగా వ్యాపించాయి. అలాంటి అందమైన సరోవరంలో ఏనుగుల పాలిట మృత్యువులాగ అరమోడ్పు కనులలో నీళ్లలో కన పడకుండా దాడి కొని ఒక భయంకరమైన మొసలి మాటు వేసికొని ఉండేది. అలా ఉండగా నొక పర్యాయం తెల్లని దంతకాంతులతో ముఖం వెలిగి పోతున్న ఒక గజ సమూహ నాయకుడు మద జలధారలు చెంపల నుండి స్రవిస్తూ ఉండగా దాహార్తుడై మద వాసనలతో ఆపర్వతాన్ని ముంచేస్తూ ఐరావతాన్ని బురుడిస్తూ నడుస్తున్న కాటుక కొండ లాగ బయలుదేరి అచటకు వచ్చాడు. మద మూర్ణితనేత్రాలలో నీరు త్రాగుటకై ఆ సరోవరంలోకి ఆతురతతో దిగాడు. నీరు త్రాగి తామర కొలనులో విహరిస్తూన్ని ఆ గజాధిపతిని కనపడకుండా నీళ్లలో పొంచి ఉన్న ఆ క్రూర గ్రాహం గట్టిగా తన కోరలతో పట్టుకున్నది. ప్రక్కనే నిలబడి ఆడ ఏనుడుల గుంపు ఏమీ చేయలేక చూస్తూ ఆక్రోశిస్తూ ఉండిపోయింది. ఆ మొసలి మద గజం కాలు పట్టుకొని సరస్సులోనికి లాగుతూంటే ఆ బలమైన వరుణ పాశానికి లోనై విడిపించుకొనే ప్రయత్నం కూడా చేయలేని అసహాయ స్థితిలో చలనం మాని నిలబడిపోయింది. ఆ ఏనుగ. అలా ఘోరమైన పాశాలతో బంధిపం బడి గజేంద్రుడు శక్తి కొలది ఘీంకరిస్తూ పెడ బొబ్బలు పెట్టసాగాడు. క్రమంగా శక్తీ ఉత్సాహం కోల్పోయి ఘోర విపత్తుకూ బాధకూ తట్టుకొన లేక మనసార హరిని స్మరించాడు. పూర్వజన్మలలో నారాయణుని చరణ కమల భక్తిని అభ్యసించిన వాడై ఉన్నందున, ఆ గజశ్రేష్ఠుదు పూర్వసంస్కార పుణ్య పరిపాకం వల్ల పదిశుద్దమైన అంతఃకరణంతో సర్వేంద్రియాలను ఆ గదుడధ్వజునిపై లగ్నం చేసి నిశ్చలమైన విశ్వాసంతో నా ప్రభువుకు శరణాగతుడై నాడు. అలా అనన్యమైన చిత్తంతో మధించిన అమృతం నుంచి వెలువడే నురుగునకు వలె తెల్లనైన శంఖం, చక్రం, గద ధరించిన ఆ కేశవుని, మంగళ ప్రదాలయినవేయి నామాలతో వెలుగొందే అభవుని, సర్వలోక నాయకుని, కరా(తొండము) గ్రాన బంగారు కమలం పట్టుకొని తన బంధ విముక్తికై దీన హీన స్వరంతో యిలా స్తోత్రం చేశాడు.

గజేంద్ర ఉవాచ :-

($) ఓం నమో మూల ప్రకృతయే అజితాయ మహాత్మనే | అనాశ్రితాయ దేవాయ నిఃస్పృహాయ నమో%స్తుతే || 31

నమ ఆద్యాయ బీజాయ ఆర్షేయాయ పవర్తినే | అనంతరాయ చైకాయ అవ్యక్తాయ నమోనమః || 32

నమో గుహ్యాయ గుఢాయ గుణాయ గుణవర్తినే | ఆప్రతర్క్యాప్రమేయాయ అతులాయ నమో నమః || 33

నమః శివాయ శాంతాయ నిశ్చింతాయ యశస్వినే | సనాతనాయ పూర్వాయ పురాణాయ నమో నమః || 34

నమో దేవాది దేవాయ స్వభావాయ నమో నమః | నమో జగత్‌ ప్రతిష్ఠాయ గోవిందాయ నమో నమః || 35

నమో%స్తు పద్మనాభాయ నమో యోగోద్భవాచ చ | విశ్వేశ్వరాయ దేవాయ శివాయ హరయే నమః || 36

నమో స్తుతసై#్మ దేవాయ నిర్గుణాయ గుణాత్మనే | నారాయణాయ విశ్వాయదేవనాం పరమాత్మనే || 37

నమో నమః కారణ వామనాయ నారాయణాయమిత విక్రమాయ | శ్రీ శారజ్గచక్రాసి గరా ధరాయ

నమోస్తు తసై#్మపురుషోత్తమాయ || 38

గుహ్యాయ వేద నిలయాయా మహోదరాయ | సింహాయ దైత్య నిధనాయ చతుర్భుజాయ బ్రహ్మేంద్ర రుద్ర ముని చారణ.

సంస్తుతాయ| దైవోత్తమాయ వరదాయ నమో చ్యుతాయ || 39

నాగేంద్ర దేహ శయనాసన సుప్రియాయ | గో క్షీర హేమ శుక నీల ఘనోపమాయ | పీతంబరాయ మధుకైటభ నాశనాయ |

విశ్వాయ చారు ముకుటాయ నమో జరాయ || 40

నాభి ప్రజాత కమలస్థ చతుర్ముఖాయ | క్షీరోదకార్ణవ నికేత యశో ధరయా | నానా విచిత్ర మకుటాంగద భూషణాయ |

సర్వేశ్వరాయ వరదాయ నమో వరాయ | 41

భక్తి ప్రియాయ వర దీప్త సుదర్మనాయ | పుల్లారవింద విపులాయత లోచనాయ | దేవేంద్ర విఘ్న శమనోద్య త పౌరుషాయ |

యోగేశ్వరాయ విరజాయ నమో వరాయ || 42

బ్రహ్మాయనాయ త్రిదశాయనాయ | లోకాధినాథాయ భవాపనాయ | నారాయణా యాత్మహితాయనాయ |

మహా వరాహాయ నమస్కరోమి || 43

కూటస్థ మవ్యక్త మచింత్య రూపం | నారాయణం కారణ మాది దేవమ్‌ | యుగాంత శేషం పురుషం పురాణం | తందేవ

దేవం శరణం ప్రపద్యే || 44

యోగేశ్వరం చారు విచిత్ర మౌళి | మజ్ఞేయ మగ్య్రం ప్రకృతేః పరస్థమ్‌ | క్షేత్రజ్ఞ మాత్మ ప్రభవం వరేణ్యం

తం వాసుదేవం శరణం ప్రపద్యే || 45

గజేంద్రస్తనము :-

ఓం ప్రణవ రూపుడ వూ మూల ప్రకృతివీ, అజేయుడ వగు నో మహాత్మా నీకు నమస్కారము. ఆశ్రయ రహితుడవు. స్వతంత్రుడవు. నిష్కాముడవు నగు నీకు నమస్సులు. సృష్టికంతకూ ఆది బీజానివీ, సర్వ ప్రథమ ప్రవర్తకుడవు, అనంతుడవు, ఒక్కడవు అవ్యక్తుడవు నగు నీకు మాటి మాటికీ నమస్సులు. రహస్య మయుడవు, గుప్తుడవు, గుణరూపివి, గుణాలలో విహరించువాడవు, తర్కానికి, ప్రమా(కొలత)కూ అతీతుడవు, సాటి లేని వాడవు నగు నీకు నమస్కారము. శివా! శాంతా! చింతారహితా! యశస్వీ! సనాతనా! వెనుకటివాడా! పురాతనుడా! నీకు నమస్సులు. దేవాధిదేవా! స్వభావరూపా! జగత్ప్రతిష్ఠాపకా! గోవిందా! నీకు నమస్సులు. పద్మనాభా! యోగోధ్భవా విశ్వేశ్వరా మంగళరూపా హరా నీకు ప్రణామాలు నిర్గుణుడూ గుణాత్మకుడునగు దేవునకు నారాయణునకు విశ్వునకు దేవతల పరమ ఆత్మ అయిన ప్రభువునకు ప్రణామములు ఒకనిమిత్తంగా వామనరూపం ధరించిన నారాయణునకు సాటిలేని పరాక్రమం కలవానికి లక్ష్మిని శార్‌ ధనమును చక్రగదా ఖడ్గాలుగను ధరించిన పురుషోత్తమునకు నమోహకములు గుహ్యునకు వేదనిలయునకు, మహోదరునకు (నృ) సింహునకు దైత్యహారుడగు తచుర్భుజునకు బ్రహ్మఇంద్ర, రుద్ర, ముని, చారణులచేతస్తుతింప బడువానికి, దేవోత్తమునకు, చ్యుతి లేని వరదాయకునకు ప్రణామాలు. సర్పశయ్య మీద ప్రీతితో నెల కొని యుండు దేవునకు ఆవు పాలు, బంగారం, శుకం, నీల మేఘం, వీని బోలిన వానికి, పీతాంబర ధారికి, మధుకైట భుల వధించిన వానికి, విశ్వరూపికి, అందమైన కిరీటం గల అజరునకు నమస్సులు. బొడ్డులో నుండి పుట్టిన కమలం మీద బ్రహ్మను కవిగ యుండు వానికి, పాల సముద్రలో నుండు యశోధనునకు, చిత్ర చిత్రాలయిన కిరీటాలు భుజకీర్తులు ఆభరణాలు ధరించు సర్వేశ్వరునకు వరదాతలలో మేటి యగు వానికి ప్రణామములు. బ్రహ్మకు, దేవతలకు నివాస భూతుడైన లోకాధినాధునకు, సంసార నాశకునకు, ఆత్మ కల్యాణానికి తెరపైన నారాయణునకు, ఆది వరహ మూర్తికి నమస్సులు కూటసుడు తెలియని వాడయ్యును గోచరుడయ్యే అచింత్య రూపికి, కారణుడు, ఆదిదేవుడు నగు నారాయణునకు యుగాంత వేళల గూడ విడిచి యుండు పురాణ పురుషునకు దేవతలందరకు స్వామి యుగు వానికి శరణాగతుడ నగు చున్నాను ! యోగేశ్వరుడు చిత్ర విచిత్రమైన సుందర శిరోవేష్టనము గలవానికి, తెలియబడ రాని మొదటి తత్వానికి ప్రకృతి కంటే భిన్నుడైన వానికి, క్షేత్రజ్ఞునకు, ఆత్మభవునకు, వరణీయు డగు వాసుదేవునకు ప్రసన్నుడ నగు చున్నాను !

ఆదృశ్య వవ్యక్త మచింత్య మవ్యయం | మహార్షయో బ్రహ్మమయం సనాతనమ్‌ | వదంతి యం వై పురుషం సనాతనమ్‌ |

తందేవ గుహ్యంశరణం ప్రపద్యే || 46

యదక్షరం బ్రహ్మ వదంతి సర్వగం | నిశమ్య యం మృత్యుముఖాత్ప్రముచ్యతే తమోశ్వరం తృప్త మనుత్తమై ర్గుణౖః |

పరాయణం విష్ణు ముపైమి శాశ్వతమ్‌ || 47

కార్యం క్రియా కారణ మప్రమేయం | హిరణ్య బాహు వర పద్మనాభమ్‌ | మహాబలం వేదనిధిం సురేశం |

ప్రజామి విష్ణంశరణం జనార్దనమ్‌ || 48

కరీట కేయార మహాహీ నిషై#్క | ర్మణ్యుత్తమాలంకృత సర్వ గాత్రమ్‌ | పీతాంబరం కాంచన భక్తి చిత్రం |

మాలాధరం కేశవ మభ్యుపైమి || 49

భవోద్బవం వేద విదాం వరిష్టయ్‌ | యోగాత్మానాం సాంఖ్య విదాం వరిష్ఠమ్‌ | ఆదిత్య రుద్రాశ్వి వసుప్ర భావం

ప్రభు ప్రపద్యే చ్యుత మాత్మవంతమ్‌ || 50

శ్రీవాత్సాంకం మహా దేవం దైవ గుహ్య మనౌపమమ్‌ | ప్రపద్యే సూక్ష్మ మచలం వరేణ్య మభయ ప్రదమ్‌ || 51

ప్రభవం సర్వభూతానాం నిర్గుణం పరమేశ్వర్‌ | ప్రపద్యే ముక్త సంగానాం యతీనాం పరమాం గతిమ్‌ || 52

భగవతం గుణాధ్యక్ష మక్షరం పుష్కరేక్షణమ్‌ | శరణ్యం శరణం భక్త్యా ప్రపద్యే భక్త వత్పలమ్‌ || 53

త్రివిక్రమం త్రిలోకేశం సర్వేషాం ప్రపితామహమ్‌ | యోగాత్మనాం మహాత్మానం ప్రపద్యేహం జనార్దనమ్‌ || 54

ఆదిదేవ మజం శంభుం వ్యక్తా వ్యక్తం సనాతనమ్‌ | నారాయణ మణియాం సం ప్రపద్యే బ్రాహ్మణ ప్రియమ్‌ || 55

నమో వరాయ దేవాయ నమః సర్వ సహాయ చ ప్రపద్యే దేవ దేవేశ మణీ యాంస మణోః సదా || 56

ఏకాయ లోకతత్వాయ పరమే పరమాత్మనే నమః | సహస్రశిరసే అనంతాయ మహాత్మనే || 57

త్వామేవ పరమం దేవ మ్వఋషయో వేద పారగాః | కీర్తయంతి చ యం సర్వే బ్రహ్మాదీనం పరాయణమ్‌ || 58

నమస్తే పుండరీకాక్ష భక్తానా మభయప్రద సుబ్రహ్మణ్య నమస్తే%స్తు త్రాహి మాం శరణాగతమ్‌ || 59

ఏ తత్వాన్ని మహర్షులు అదృశ్యము, అవ్యక్తము, అచింత్యము, క్షయము కానిది, సనాతనము (మొదలు లేనిది) బ్రహ్మమయ మనికీర్తిస్తారో ఆ తత్త్వ స్వరూపుడైన సనాతన పురుషుని, గూడమైన దేవుని శరణు వేడు చున్నాను. ఎవనిని అక్షరుడని, బ్రహ్మయని, సర్వోపగతుడని కోనియాడెదరో ఎవనిని (నామమును) విని మృత్యువు ముఖా న్నుంచి తప్పించుకుంటారో అలాంటి ఈశ్వరుని ఉత్తమ గుణాలకు సంతోషించే శాశ్వతుడగు విష్ణువునకు శరణాగతుడనగు చున్నాను. జనార్దనుడైన ఏ ప్రభువు కారణము, కార్యము, క్రియ మూడును తానై ఎలాంటి కొలతలకూ అందని వాడో, హిరణ్య బాహువో, పద్మనాభుడో, వేదాలకు నిధియో అలాంటి మహా బలుడగు విష్ణువును, దేవేశుని, శరణు వేడుచున్నాను. అమూల్యమైన కేయూర కిరీటాది స్వర్ణ రత్నాలంకృతమైన ఉత్తమా భరణాలు శరీరం నిండావెలుగుచుండగా పీతాంబరం, భక్తి అనే చిత్రమాలను ధరించిన కేశవుడే నాకు దిక్కు. సంసార కారణుడు, వేద విదులలో శ్రేష్ఠుడు, యోగులలోను, సాంఖ్యులలోను ఉత్తముడు, ఆదిత్య, వసు, రుద్రాశ్వినుల కాంతితో సర్వులకూ ప్రభువై ఆత్మ స్వరూపి అయిన అభిచ్యుతడే నాకు శరణ్యుడు. శ్రీవత్స చిహ్నంతో సాటి నేలి శోభతో వెలిగే అభయ ప్రదాతకు, సూక్ష్మమూ, శాశ్వతము నగు తత్వానికి శరణాగతుడను. సర్వజీవులకు జని స్థానమై, గుణ రహితుడై, సంగరహితులు, జితేంద్రియులు నగు వారలకు పరమ గతియగు పరమేశ్వరునకు, ప్రపడు నగు భగవంతునకు భక్తితో శరణాగతుడ నగు చున్నాను. త్రివిక్రముడు, త్రిలోకేశుడు, ఎల్ల జీవులకు పితామహుడు, యోగాత్ముడు, మహాత్ముడు నగు జనార్దనుని శరణు వేడు చున్నాను. ఆదిదేవుడు, జన్మరహితుడు. కన్యాణకరుడు, వ్యక్తుడు, అవ్యక్తుడు, సనాతనుడు, అణురూపి, బ్రాహ్మణ ప్రియుడు నగు నారాయణుడే నాకు గతి. ఓ శ్రేష్ఠుడా! నీకు నమస్కారం ! సర్వసహాయా ! నాకు సహాయ పడుము. అణువులలో అణుస్వరూపా ఈ భక్త పరమాణువును కాపాడుము అద్వితీయుడా! ఒకడైన వాడా! లోక తత్త్వ స్వరూపా! ఈ భక్తపరమాణువును కాపాడుము. అద్వితీయుడా! ఒకడైనవాడా! లోక తత్వ స్వరూపా! పరులకు పరమైన తత్వమా! సహస్రశీర్షా అనంతానీకు ప్రణామములు! వేద నిష్ణాతులైన మహర్షులు నిన్నేపరమ తత్వంగా, బ్రహ్మాదులందరకూ ఆధార భూతుడవుగా కొని యాడుదురు. ఓ పుండ రీక నయనా ! నీకు నమస్కారము! అభయ ప్రదాయకా నీకు శరణు! సుబ్రహ్మణ్య దేవా! నీకు నమస్కారము! అభయ ప్రదాయకా నీకు శరణు! సుబ్రహ్మణ్య దేవా! నీకు నమస్కారము! శరణాగతుడనైన నన్ను రక్షించుము.

పులస్త్య ఉవాచ :-

భక్తిం తస్యామ సంచిత్య నాగస్యా%మోఘ సంభవః | ప్రీతిమా నభవ ద్విష్ణుః శంఖ చక్ర గదాధరః || 60

సాన్నిధ్యం కల్పయామాస తస్మిన్‌ సరసి కేశవః | గరుడస్థో జగత్స్వామీ లోకాధారస్తపోధనః || 61

గ్రాహ గ్రస్తం గజేంద్రం తం తం చ గ్రాహం జలాశయాత్‌ | ఉజ్జహారా ప్రమేయాత్మా తరసా మధుసూదనః || 62

స్థలస్థలం దారయామాస గ్రాహం చక్రేణ మాధవః | మోక్షయమాస నాగేంద్రం పాశేభ్యః శరణాగతమ్‌ || 63

స హి దేవల శాపేన హూహూ గంధర్వ సత్తమః | గ్రాహ్యత్వ మగమత్‌ కృష్ణా ద్వధం ప్రాప్య దివం గతః || 64

గజో%పి విష్ణుణా స్పృష్టో జాతో దివ్య వపుః పుమాన్‌ || ఆప ద్విముక్తా యుగప ద్గజ గంధర్వ సత్తమౌ !! 65

ప్రీతిమాన్‌ పుండరీకాక్షః శరణాగత వత్సలః | అభవ త్వథ దేవేశ స్తాభ్యాం చైవ ప్రపూజితః || 66

ఇదం చ భగవాన్‌ యోగీ గజేంద్రం శరణాగతమ్‌ | ప్రోవాచ ముని శార్దూల! మధురం మధుసూదనః || 67

శ్రీ భగవానువాచ :-

యో మాం త్వం చ సరశ్చైవ గ్రాహస్య చ విదారణమ్‌ | గుల్మ కీచకవేణూనాం రూపం మే రోం సుతస్య చ || 68

అశ్వత్థం భాస్కరం గంగాం నైమిషారణ్య మేవ చ | సంస్మరిష్యంతి మనుజాః ప్రయతాఃస్థిర బుద్ధయః || 69

కీర్తయిష్యంతి భక్త్యా చ శ్రోష్యంతి చ శుచివ్రతాః | దుస్వప్నో నశ్యతే తేషాం సుస్వప్నశ్చ భవిష్యతి || 70

మాత్స్యం కౌర్మం చ వారాహం వామనం తార్ఘ్యమేవ చ | నారసింహం చ నాగేంద్రం సృష్టి ప్రళయ కారకమ్‌ || 71

ఏతాని ప్రాత రుత్థాయ సంస్మరిష్యంతి యే నరాః | సర్వపాపైః ప్రముచ్యంతే పుణ్యం లోక మవాప్నుయుః || 72

పులస్త్యుడిలా అన్నాడు- శంఖ చక్ర గదాధరుడూ, అమోఘ సంభవుడు (సార్థక జన్ముడు) నగు విష్ణుదేవుడు గజేంద్రుని భక్తికి సంతోషించి ఈ సరస్సులో సాన్నిధ్యాన్ని కల్పించు కొన్నాడు. లోకాధారుడు మహా లోకాధారుడు మహా తపోధనుడు నైన ఆ గరుడవాహనుడు వచ్చి మహా వేగంతో ఆ గజాన్నీ, మొసలినీ రెంటినీ సరుస్సులో నుండి లాగిబయట పడవేసి చక్రంతో మకరి కంఠాన్ని ఉత్తరించాడు. శరణాగతుడైన ఆ గజాధిపునకు బంధ మోక్షం కలిగించాడు. దేవలుని శాపం వల్ల మకరిగా మారిన హూహూ అనే గంధర్వుడు కృష్ణుని చే వధింప బడి శాప విముక్తుడై దివికి చేరుకున్నాడు. గజేంద్రుడు గూడ విష్ణు కరస్పర్శ వలన దివ్యదేహం ధరించాడు. అలా గజ గంధర్వులిద్దరూ ఆపదలు వీడి ముక్తులయ్యారు. అంతట వారిద్దరా పుండరీకాక్షుని పూజించాడు. శరణాగత వత్సలు డైన ఈ మహా యోగి మధుసూదన డంతట నా గజేంద్రుని జూచి ఓ నారదా! ఇలా అన్నాడు. ఎవరైతే నిన్నూ, నన్నూ, ఈ సరోవరాన్ని, ఇచటి గుల్మ, కీచక, రేణువులను, మేరు పుత్రుడైన గిరి శఖరాన్ని, మకరిసంహారాన్ని, అశ్వత్థవృక్షాన్ని, భాస్కరుని, గంగను, నైమిషాన్ని, పవిత్రాంతఃకరణతో, స్థిర బుద్దితో కీర్తిస్తారో, భక్తితో శుచులై ఈ పవిత్రగాధను వింటారో వారల దుస్వప్నాలు నశించి శుభ స్వప్నాలు కలుగుతాయి. ప్రతి దినము ప్రాతఃకాలాన మేల్కాంచి ఏ నరులైతే మత్స్య, కూర్మవరాహ, వామన, గరుడ, నారసింహావతారాలను, వారి కార్యాలను, సృష్టి ప్రలయ కారకుడైన నాగేంద్రుని, సమాహిత చిత్తంతో స్మరిస్తారో వారలు సమస్త పాపాలప నుండి విడి వడి వూణ్యలోకాలకు పోతారు.

పులస్త్య ఉవాచ :-

ఏవ ముక్త్వాహృషీకేశో గజేంద్రం గరుడుధ్వజః స్పర్శయామాస హస్తేన గజం గంధర్వ మేవ చ || 73

తతో దివ్య వపు రూత్వా గజైంద్రో మధుసూదనమ్‌ జగామ శరనం వి ప్ర! నారాయణ పరాయణః || 74

తతో నారాయనణః శ్రీమాన్‌ మోక్షయిత్వా గజోత్తమమ్‌ | పాప బంధాచ్చశాపాచ్చ గ్రాహం చాద్భుత కర్మకృత్‌ || 75

ఋషిభి స్తూయమానశ్చదేవ గుహ్యపరాయణౖః | గతః స భగవాన్‌ విష్ణు ర్దుర్విజ్ఞేయ గతిః ప్రభుః || 76

గజేంద్ర మోక్షణం దృష్ట్వా దేవాః శక్ర పురోగమాః | వవందిరే మహాత్మానం ప్రభుంనారాయణం హరిమ్‌ || 77

మహర్షయ శ్చారణాశ్చ దష్ట్వా గజ విమోక్షణమ్‌ | విస్మయోత్ఫుల్లనయనాః సంస్తువంతి జనార్దనమ్‌ || 78

ప్రజాపతి పతి ర్బ్రహ్మాచక్రపాణి విచేష్టితమ్‌ | గజేంద్ర మోక్షణం దృష్ట్వా ఇదం వచన మబ్రవీత్‌ || 79

య ఇదం శ్రుణుయాన్నిత్యం ప్రాత రుత్థాయ మానవః | ప్రాప్నుయా త్పరమాం సిద్థిం దుఃస్వప్నసస్య నశ్యతి || 80

గజేంద్ర మోక్షణం పుణ్యం సర్వ పాప ప్రణాశనమ్‌ | కథితేన స్మృతేనా%థ శ్రుతేన చ తపోధన|

గజేంద్ర మోక్షణనేహ సద్యః పాపా త్ప్రముచ్యతే || 81

ఏత త్పవిత్రం పరమం సుపుణ్యం | సంకీర్తనీయం చరితం మరారేః యస్మిన్‌ కిలోక్తే బహు పాప బంధనాత్‌ |

లభ్యేతమోక్షో ద్విరదేన యద్వత్‌ || 82

అజం వరేణ్యం వర పద్మనాభం | నారాయణం బ్రహ్మ నిధిం సురేశమ్‌ | తం దేవగుహ్యం పురుషం పురాణం |

వందామ్యహం లోక పతిం వరేణ్యమ్‌ || 83

పులస్త్య ఉవాచ :-

ఏతత్తవోక్తం ప్రవరం స్తవానాం | స్తవం మురారే ర్వర నాగ కీర్తనమ్‌ | యం కీర్త్య సంశ్రుత్య తథా విచింత్య |

పాపాపనోదం పరుషోలభేత || 84

ఇతి శ్రీవామన పురాణ అష్ట పంచాశో ధ్యాయః సమాప్తము.

పులస్త్యుడిలా అన్నాడు. గరుడ ధ్వజుడైన ఆహృషీకేశవుడీ విధంగా వరా లిచ్చి ఆ గజ గ్రాహాలను తన చేతితో నిమిరాడు. అంత నా గజేంద్రుడు దివ్య దేహం ధరించి మధుసూదననుని పాదాల కడ శరణాగతు డయ్యాడు. నారదా! అంతట శ్రీ నారాయణ దేవుడా నారాయణ పరాయణుడగు గజరాజునకు మకరి నుండియే కాక పాపాల నుండి కూడ ముక్తి ప్రసాదించాడు. అనంతరమా అద్భుతకర్ముడు విష్ణుడు, ఋషులు, దేవతలు, గంధర్వులు, యక్షులు, స్తోత్రాలు చేస్తూండగా వెళ్లిపోయాడు. దుర్విజ్ఞేయ గమనుడైన శ్రీహరి గావించిన గజేంద్ర మోక్షణాన్ని తిలకించిన యింద్రాది దేవతలందరా భక్త వత్సలు నకు చేతులు మోడ్చి వందనాలు చేశారు. మహర్షులు చారణులు ఆశ్చర్య పులకితులై స్తవనమలు గావించారు. చక్రపాణి నెరపిన అద్భుత చేష్టితాన్ని చూచి ప్రజాపతులలో ముఖ్యుడైన చతుర్ముఖుడు యిలా అన్నాడు. ఈ గజేంద్ర యోక్షణ కథను ప్రాథః కాలాన లేచి నిత్యమూ యే మానవులు వినెదరో వారలకు పరమసిద్ది కలుగుతుంది. దుస్వప్నాలు నశిస్తాయి. ఓ తపోధనా! గజరామోక్షణ గాధ పరమ పవిత్రమైనది. పుణ్యప్రదమైనది. దీనిని చదివినా, స్మరించినా, వినినా, సర్వపాపాలు నశిస్తాయి. ఆ క్షణాన్నే! మురారి యొక్క ఈ పావన చరిత్రం సదా గానం చేయతగినది. దీనిని చదివినచో ఆ గజ రాజునకు వలెనే సకల పాప బంధాల నుంచీ విముక్తి కలుగుతుంది. అజితుడం వరేణ్యుడు, పద్మనాభుడు, నారాయణుడు, బ్రహ్మనిధి. సురేశ్వరుడు, పురాణపురుడషుడు లోకపతి అయిన శ్రీవల్లభునకు నమస్కరిస్తున్నారు. నారదా! నీవడిగిన స్తోత్రాలలో మేటి అయి గజేంద్ర కృత స్తవాన్ని వినిపించాను. దీనిని పాడి విని స్మరించి మానవుడు పాప దూరుడు కాగలడు.-

ఇది శ్రీ వామన ఏబది ఎనిమిదవ అధ్యాయము ముగిసినది.

Sri Vamana Mahapuranam    Chapters