Sri Vamana Mahapuranam    Chapters   

శ్రీ వామన పురాణ ఏకపంచాశోధ్యాయః (51)

పులస్త ఉవాచ -

దేవ మాతుఃస్థితేదేవే ఉదరేవామనక్వతౌ నిస్తేజస్యోసురా జాతా యథోక్తం విశ్వయోనినా|| 1

నిస్తేజసోసురా దృష్ట్వ ప్రహ్లోదందానవేశ్వరమ్‌ బలి ర్దానవ శార్దూల ఇదంవచన మబ్రవీత్‌ || 2

బలి రువాచ -

తాత! నిస్తేజసో దైత్వాః కేనజాతాస్తు హేతున? | కథ్యతాం పరమజ్ఞోసి శుభాశుభ విశారద! || 3

పులస్త్య ఉవచ -

తత్పౌత్ర వచనం శ్రుత్వ ముహూర్తంధ్యాన మాస్థితః | కిమర్థంతేజసోహాని రితి కస్మా దతీవ హి || 4

స జ్ఞాత్వవాసుదేవోత్థం భయందైత్యే ష్వనుత్తమమ్‌ | చింతయాయాస యోగాత్మా క్వ విష్ణుః సాంప్రతం స్థితః || 5

అధోనాభేఃసపాతాళాన్‌ సప్త సంచింత్య వారద | నాభే రుపరిభూరాదీం ల్లో కాంశ్చర్తురియా ద్వశీ || 6

భూమింసపంకజాకారం తన్మధ్యే సంకజాకృతిమ్‌ | మేరు దదర్శ శైలేంద్రం శాంతకాంభం మహ ర్ధిమత్‌ || 7

తస్యో పరిమహాపుర్య స్త్వష్టౌలోకప తీంస్తథా| తేషా ముపరి వై రాజీం దదృబ్రహ్మణఃపురీమ్‌ || 8

తదధస్తాన్మహాపుణ్య మాశ్రమంసురపూజితమ్‌ | దేవమాతుః స దదృశే మృగ పక్షి గణౖ ర్యుతమ్‌ || 9

తాం ద్వష్ట్వాదేవజననీం సర్వతేజోధికాం మునే | వివేశదానవపతి రన్వే ష్టుంమధుసూదనమ్‌ || 10

స ద్వష్టవాం జ్జగన్నాథం మాధవంవామనాకృతిమ్‌ | సర్వభూతవరేష్యంతం దేవమాతురథోదరే || 11

తం దృష్ట్వాపుండరీకాక్షం శంఖ చక్ర గదాధరమ్‌ | సురాసురగణౖఃర్వః సర్వతోహ్యాప్తవిగ్రహమ్‌ || 12

తేనైవక్రమయోగేన దృష్ట్వావామనతాంగతమ్‌ | దైత్వతేజో హరం విష్ణుం ప్రకృతిస్థోభవ తత్తః || 13

అథోవాచ మహబుద్ధి ర్విరోచనసుతం బలిమ్‌ | ప్రహ్లోదోమధురంవాక్యం ప్రణమ్యమధుసూదనమ్‌ || 14

శ్రీ వామన పురాణంలో ఏబది యొకటవ అధ్యాయము 51

పులస్త్యుని వచనం - దేవమాత ఉదరంలో వామనాకృతితో భగవంతుడు ప్రవేశించినంతనే, ఆ స్వామి చెప్పినట్లే, దైత్యులందరూ తమ తేజస్సును కోల్పోయారు. అలా అసురు లందరు తేజో హీనులగుట చూచి బలి, దానవేశ్వరుడైన ప్రహ్లాదునితో యిలా అన్నాడు. 'తాతా! మీరు పరమ జ్ఞానులు. మన రాక్షస వీరు లంతా యిలా తేజస్సు గోలుపడి యుండుటకు కారణమేదో చెప్పండి.' అంతట మనుమని ప్రశ్న విని ఆ ప్రహ్లాదుడు ముహూర్తకాలం ధ్యానస్థుడై వారలతేజోహానికి కారణ మేమా యని ఆలోచించి అందులకు భగవంతుడగు వాసుదేవుడే కారణ మని తెలుసుకొని, యోగశక్తితో నా సమయాన విష్ణుడెచటనున్నాడా యని అన్వేషించాడు. నారదా! అంతట నా భగవంతుడు నాభికి దిగువ భాగన సప్తపాతాళాలను శోధించాడు. తర్వాత భూమిని దనికి పైన ఉన్న లోకాలను పరిక్రమించాడు. మొదట పద్మాకారంలో ఉన్న భూమిని అనంతరం దాని మధ్య భాగాన గల స్వర్ణశైలం మేరు పర్వతాన్ని సకల ఐశ్వర్యాలతో విరాజిల్లుతున్న దానిని దర్శించాడు. దానిపైన అష్ట దిక్పాలకుల నగరాలనూ వానికి పై భాగాన బ్రహ్మసదనం వైరాజాన్ని కనుగొన్నాడు. దానికి దిగువ భాగాన నొక పుణ్యాశ్రమం కనిపించింది. మృగపక్షి సమాకులమైన ఆ ప్రదేశాన్ని సురలు పూజిస్తున్నారు. ఓ నారదా! ఆ ఆశ్రమంలో అద్భుతమైన తేజస్సుతో వెలిగిపోతున్న దేవమాత అది తిని చూచి శ్రీ హరిని వెదకుటకై అందులో ప్రవేశించాడు. అచట జగత్పిత సర్వభూతవరేణ్యుడైన మాధవుని అదితి గర్బంలో వామనాకృతిలో దర్శించాడు. ఆపుండరీకాక్షుడు శంఖ చక్ర గదా ధారియై సురాసురులచే పరివేష్టితుడై సర్వత్రా వ్యాపించి క్రమంగా మరుగుజ్జు ఆకారంలో యోగశక్తిద్వారా మాతృకుక్షిస్థుడై కనిపించాడు. దైత్యలోక తేజో హరుడు గా నా విష్ణుని గుర్తించి ఆ ప్రహ్లాదుడు ధ్యానముద్రను వీడి ప్రకృతిస్థుడైనాడు. అంతట మనసా మధుసూదనునకు ప్రణామం గావించి మహామతియైన ఆ భక్తాగ్రగణ్యుడు తన మనుషుడు, విరోచన నందనుడు నగు బలితో యిలా అన్నాడు -

ప్రహ్లాద ఉవాచ -

శ్రూయతాంసర్వ మాఖ్యాస్యే యతో మో భయ మాగతమ్‌ | యేన నిస్తేజసో దైత్యా జాతాదైత్యేంద్ర హేతునా || 15

భవతానిర్జితాః దేహః సేంద్ర రుద్రార్క పావకాః | ప్రయాతాః శరణం దేవం హరిం త్రిభువనేశ్వరమ్‌ || 16

స తేషా మభయందత్వా శక్రాదీనాం జగద్గురుః | అవతీర్ణో మహాబాహు రదిత్యా జఠర్రేహరిః || 17

హ్వతాని వ స్తేన బలే తేజాంసీతి మతి ర్మమ | నాలం తమో విషహితుం స్థాతుం సూర్యోదయం బలే || 18

పులస్త్య ఉవాచ -

ప్రహ్లాదవచనం ద్వష్ట్వా క్రోధప్రస్ఫురితాధరః | ప్రహ్లాద మాహాథ బలి ర్భావికర్మప్రచోదితః || 19

బలి రువాచ -

తాత! కోయం హరి ర్నామ యతో నో భయ మాగతమ్‌ సంతి మే శతశో దైత్యా వాసుదేవ బలధికాః || 20

సహస్రశో యై రమరాః ఏంద్ర రుద్రాగ్ని మారుతాః | నిర్జిత్యత్యాజితాఃస్వర్గం భగ్నదర్పా రణాజిరే || 21

యేననూర్య రథా ద్వేగాతే చక్రంకృష్ఠంమహాజవమ్‌ . స విప్రచిత్తి ర్బలవాన్‌ మమసైన్య పురస్సరః || 22

అయఃశంకుః శివః శంభు రసిలోమా విలోమక్వత్‌ | త్రిశిరామకరాక్షశ్చ వ్వషపర్వ నతేక్షణః || 23

ఏతే చాన్యే చ బలినో నానాయుధ విశారదాః | యేషామే కైక శోవిష్ణుః కలాంనార్హతి షోడశీమ్‌ || 24

పులస్త్య ఉవాచ -

పౌత్ర్యైతద్వచఃశ్రుత్వా ప్రహ్లాదఃక్రోథ మూర్ఛితః | దిగ్ధగిత్యాహ స బలిం వై కుంఠాక్షప వాదినమ్‌ || 25

ధిక్త్వాం పాపసమాచారం దుష్టబుద్ధింసుబాలిశమ్‌ | హరిం నిందయతోజిహ్వా కథం న పతితాతవ || 26

శోచస్తత మసి దుర్బుద్ధీ నింద నీయశ్చసాధుభి ః | యత్‌ త్రైలోక్య గురుం విష్ణు మభినిందసిదుర్మతే! || 27

శోచ్య శ్చాస్మి న సందేహూ యేనజాతఃపితాతవ | యస్యత్వంకర్కశ-పుత్రో జాతోదేవానమాన్యకః || 28

భవాన్‌కిలవిజానాతి తథా చామీ మహాసురాః | యథానాన్యఃప్రియఃకశ్చి న్మమతస్మాజ్ఞనార్దనాత్‌ || 29

జాన న్నప్రియతరం ప్రాణభ్యోషి హరింమమ | సర్వేశ్వరేశ్వరందేవం కథం నిందితవా నసి || 30

గురుఃపూజ్యస్తవ పితా పూజ్యస్తస్యాప్యహం గురుః | మమా పి పూజ్యో భగవాన్‌ గురు శ్లోక గురుర్వరిః || 31

గురో ర్గురుగురు ర్మూఢ పూజ్యః పూజ్యతమ స్తవ| పూజ్యం నిందయసే పాప కధం న పతితో స్యధః || 32

శోచనీయా దురాచారా దానవా మీ కృతా స్త్వయా| ఏషాం త్వం కర్కశో రాజా వాసుదేవస్య నిందకః || 33

యస్మా త్పూజ్యోర్చనీయస్య భవతా నిందితో హరి ః తస్మా త్పాప సమాచార రాజ్యనాశ మవాప్నుహి || 34

యధా నాన్యత్‌ ప్రియతరం విద్యతే మమ కేశవాత్‌| మనసా కర్మణా వాచా రాజ్యభ్రష్టస్తధాపత || 35

యధా ప తస్మా దపరం వ్యతిరిక్తం హి వద్యతే| చతుర్దశస్తు లోకేషు రాజ్యభ్రష్టస్తధా పత || 36

సర్వేషా మపి భూతానాం నాన్యల్లోకే పరాయణమ్‌| యధా తధా నుపశ్యేయం భవంతం రాజ్య విచ్యుతమ్‌ || 37

వత్సా! మనందరకూ ఏ దిక్కు నుండి విపత్తు రానున్నదో దేని వవలన దైత్యులందరు తేజో హీను లయినారో ఆ వివర మంతా చెబుతున్నావినుము. నీతో యుద్థం చేసి ఓడి పోయి, యింద్ర రుద్ర, సూర్యాగ్ని మొదలగు దేవత లందరు త్రలోక రాధ్యుడైన శ్రీ హరి కడకు పోయి శరణాగతు లయ్యారు. ఆ జగద్గురు వాయింద్రాదుల కభయ మిచ్చి యిప్పుడు అదితి గర్భంలో పెరుగు తున్నాడు. ఆయనే మన వారందర తేజాలు అపహరించా డని నా విశ్వాసము అంధకారం సూర్యోదయాన్ని ఎంతసేపు ఆప గలుగుతుంరి?. ఓ నారదా! ప్రహ్లాదుని మాటలు వింటూనే కోపంతో పెదవులు కంపించగా భావి కర్మ ప్రతాదితుడై ఆ బలి తాతతో యిలా పురుషవచనాలు పలికాడు. ''పితామహా! మన వారందర భయాలకు కారణం గా నీవు చెబుతున్న ఆ విష్ణు వెవరయ్యా? ఆ వాసుదేవుని మించిన బలాఢ్యులు నా రాక్షస గణంలో ఎందరో ఉన్నారు? యింద్రాగ్ని రుద్ర మరుదణాలకు చెందిన వేలాది దేవతల దర్పాన్ని చూర్ణం చేసి వారలను యుద్థంలో మన వీరులు మట్టి కరిపించారు. పరుగిడుతున్న సూర్యుని రధ చక్రాన్ని బలవంతంగా ఊడ బెరికి విసరి కొట్టిన మహాబలుడు విప్రచిత్తినా సేనా నాయకుడు. అయఃశంకుడు, శివుడు, శంభుడు, అసిలోముడు, విలోమకృత్త, త్రిశిరుడు, మకరాక్షుడు, వృషపర్వుడు, నతేక్షణుడు, వీరలూ, యింకా ఎందరో యుధ ప్రయోగంలో దక్షులు మన ప్రక్కన ఉన్నారు. వీరిలో ఏ వక్కడ పరాక్రమంలోనైనా పదహారవ వంతు కూగా లేని వాడ విష్ణుడు. వాని వల్ల భయమా?'' పౌత్రు డాడిన పరుష వచనాలు విన్నంతనే ప్రహ్లాండు క్రోధ తామ్రాక్షుడై వైకుంఠుని ఆక్షేపిస్తున్న అతడిని ధిక్కరిస్తూ గర్జించాడు. ఛీ! ఛీ! మూర్ఖా! దుష్టాత్మా! ఎంత పాపిష్టి నాలుకరా నీది? ఓరి బాలిశుడా! శ్రీ హరిని నిందించిన నీ నాలుక యింకా తెగి ఏల భూమిపై బడదురా? త్రిలోక గురువైన విష్ణు నింద గావించిన నిన్ను సాధు లోకమంతా గ్హరిస్తుందిరా? నీ దుర్బుద్ది ఎంతైనా చింతించ దగినది రా! నీ వంటి వాని తండ్రిని కన్నందుకు ఎంతో విచారిస్తున్నా. నీ లాంటి కఠోరుడు దేవ నిందకుడు పౌత్రు డగుల నా దౌర్భాగ్యము. నీవు ఈ రాక్షస గణ మంతా, నాకు జనార్దనుని కన్న ప్రియు లెవరూ లేరనే విషయం బాగా ఎరుగుదురు. ఆ శ్రీ హరి నాకు ప్రాణాల కన్నా ప్రియతము డని తెలిసి కూడా ఆ సర్వేశ్వరేశ్వరుని ఎలా నిందించ గలిగితివి? నీకు నీ తండ్రి పూజ్యుడు, వాని (విరోచనుని)కి నేను తండ్రిగా పూజ్యుడు నైన గురువును, ఇక నాకో, ఆ లోక గురువు విష్ణువు పూజ్యతమ గురువు! అలాంటి పమ డురువునే నిందించిన నీవింకనూ అథః పతనం నొందవేమి? నీ మూలంగా ఈ దానవ జాతి అఅంతా అప్రతిష్ఠ పాలయింఇ. నీ వంటి క్రూరుడు వాసుదేవ నిందకుడు రాజుగా ఉండటం వీరల దౌర్బాగ్యం. జగత్పూజ్యుడగు హరిని నిందించిన పాప ఫలంగా నీకు రాజ్య నాశనం కలుగుతుంది. త్రికరణ శుద్దిగా నాకు కేశపుడే ప్రియతముడైతే నీవు రాజ్యభ్రష్టుడవై పోతావు పో! చతుర్దశ లోకాల్లో ఆ దేవుని రూపం కాని వస్తు వేదీ లేనట్లయితే నీవు రాజ్య నాశనం అనుభవించి పతితుడవు కమ్ము! సృష్టిలోని సకల భూత జాలానికి శ్రీ హరి కన్నా శరణ్య అంటూ వేరే లెక పోయి నట్లయితే నీవు రాజ్య భ్రష్టుడిని కావడం త్వరలోనే నేను చూస్తాను.

పులస్త్య ఉవాచ ః

ఏవ ముచ్చరితే వాక్యే బలి ః సత్వరిత స్తదా, అవ తీర్యాసనా ద్ర్బహ్మన్‌! కృతాంజలి పుతో బలీ || 38

శిరసా ప్రణిపత్యా హ ప్రసాదం యాతు మే గురు :, కృతాపరాధా నపి హి క్షమంతి గురవః శిశూన్‌ || 39

తత్సాధు యదహం శప్తో భవతా దానవేశ్వరం!, న బిభేమి పరేభ్యోహం న చ రాజ్య పరిక్షయాత్‌ || 40

నై వ దుఃఖం మమ విభో! యదహం రాజ్య విచ్యుత:, దుఃఖం కృతాపరాధత్వా ద్భవతో మే మహత్తరమ్‌ || 41

తత్‌క్షమ్యతాం తాత! మమాపరాధో, బాలో స్మ్యనాధో స్మి సుదుర్మతిశ్చ, కృతేపి దోషే

గురవః శిశూనాం, క్షమంతి దైన్యం సమూపాగతానామ్‌ || 42

పులస్త ఉవాచ :

స ఏవ ముక్తోవచనం మహాత్మా, విముక్త మోహూ హరి పాద భక్త ః చిరం విచింత్యా ద్భుత మేత దిత్థ,

మూవాచపౌత్రం మధురం వచో థ || 43

ప్రహ్లాద ఉవాచ :

తాత మోహేన మే జ్ఞానం వివేకశ్చ తిరస్కృత:, ఏనం సర్వగతం విష్ణు జానం స్త్వాం శప్తవా నహమ్‌ || 44

నూన మేతేన భావ్యం వై భవతో యేన దానవ! మమా విశ న్మహాబాహూ! వివేక ప్రతిషేధకః || 45

తస్మాద్‌ రాజ్యం ప్రతి విభో న జ్వరం కర్తు మర్హసి! అవశ్యం భావినో హ్యర్థాన వినశ్యంతి కర్హిచిత్‌ || 46

పుత్ర మిత్ర కళత్రార్ధే రాజ్య భోగ ధనాయ చ, ఆగమే నిర్గమే ప్రాజ్ఞోన విషాదం సమాచరేత్‌ || 47

యథాయథా స మాయాంతి పూర్వ కర్మ విధానతః సుఖ దుఃఖాని దైత్యేంద్ర నర స్తాని సహే త్తథా || 48

ఆపదా మాగమం దృష్ట్యాన విషణ్ణో భ##వే ద్వశీ, సంపదం చ సువీస్తీర్ణాం ప్రాప్య నోధృతమాన్‌ భ##వేత్‌ || 49

ధనక్షయే న మూహ్యంతి న హృష్యంతి ధనాగమే, ధీరాః కార్యేషు చ సదా భవంతి పురుషోత్తమాః || 50

ఏవం విదిత్వా దైత్యేంత్ర న విషాదం కధంచన, కర్తు మర్హసి విద్వాంస్త్వం పండితో నా వసీదతి || 51

తథా న్యచ్ఛ మహాబాహూ హితం శ్రుణు మహార్థకమ్‌, భవతో థ తథాన్యేషాం శ్రుత్వా తచ్చ నమాచర || 52

శరణ్యం శరణం గచ్ఛ తమేవ పురుషోత్తమమ్‌, స తే త్రాతా భయా దస్మా ద్దానవేద్ర! భవిష్యతి || 53

యే సంశ్రితా హరి మనంత మనాది మధ్యం, విష్ణుం చరాచర గురుం హరి మీశితారమ్‌

సంసార గర్త పతితస్య కరావలంబం నూనం న తే భువి నరా జ్వరిణో భవంతి || 54

తన్మనా దానవశ్రేష్ట! తద్భక్తశ్చ భవా ధునా, స ఏష భవతః శ్రేయో విధాస్యతి జనార్దనః || 55

విముక్త పాపశ్చతతో గమిష్యే యత్రాచ్యు అహం చపాపోపశమార్థమీశమారాధ్య యాస్యే ప్రతి తీర్థయాత్రామ్‌,

లోకపతిర్‌ నృసింహాః || 56

పులస్త్య ఉవాచ :

ఇత్యేవ మాశ్వాస్య బలిం మహాత్మా సంస్మృత్య యోగాధిపతిం చ విష్ణుమ్‌, ఆ మంత్ర్య సర్వాన్‌ దను యూధపాలాన్‌

జగామ కర్తుం త్వథ తీర్థయాత్రామ్‌ || 57

ఇతి శ్రీ వామన పురాణ ఏక పంచాశోధ్యయః సమాప్తః

పులస్త్యుడిలా అన్నాడు = పరమ సాధులైన ప్రహ్లాదుని మాటలు విని బలి ఆపాద మస్తకం కంపించి పోయాడు. వెంటనే ఆసనం నుంచి లేచి చేతులు జోడించుకుని సాగిలపడి ప్రహ్లాదుని చరణాలు పట్టుకుని యిలా విన్నపం చేశాడు. ''గురు జనులు నా యెడ ప్రసన్నులగుదురు గాక! శిశువులు తప్పులు చేసినా తండ్రులు క్షమిస్తారు కదా! ఓ దానవశ్రేష్ఠా! నన్ను శపించి మహెపకారం చేశారు. నేను శత్రువులకు గాని రాజ్యనాశనానికి గాని భయపడు వాడను కాను. మీ పట్ల నేను చేసిన అవనయం అపరాధం ముందు రాజ్య చ్యుతి ఒక ఉఃఖం కానే కాదు. మూర్ఖుడనై మీమనస్సు నొప్పించిన నా యపరాధాన్నిక్షమించండి. పితామహా! నేనే బాలుడను, అనాధుడను, పరమ దుష్ట బుద్ధఇని. దీనులై ప్రార్థించిన శిశువుల అపరాధా లెట్టివైనా పెద్దలు వారిని క్షమింతురు కదా!'' బలి యిలా వేడు కొనగా నా మహాత్ముడగు హరి భక్తాగ్రేసరుడు, క్షణికోద్రేకం వదలి పెట్టి తన తొందర పాటునకు ఆశ్యర్యపడి మనుమని బుజ్జగిస్తూ తీయని మాటలతో యిలా ఓదార్చాడు

'నాయనా! బలీ! క్షణిక మోహం నా వివేకాన్ని మరుగు పరిచింది, జ్ఞానాన్ని అపహరించింది. కాబట్టే విష్ణుడు సర్వోపగతుడన్న సత్యం తెలసి కూడ నిన్ను శపించాను. భవితవ్యం యిలా ఉన్నందున నే కాబోలు క్షణికమైన మోహం నా వివేకాన్ని అడ్డగించింది. కనుక నోరాజా! రాజ్యం పట్ల అనురాగం పెట్టు కొనకుము. కానున్న పనులు కాక తప్పదు. వాని నెవ్వరు అడ్డు కొన లేరు. ప్రాజ్ఞుడు, పుత్ర మిత్ర కళత్ర ధన రాజ్యాదులు సంప్రాప్తమైనపుడు సంతోషించుట కాని నశించిన వేళ దుఃఖించుట కాని చేయ రాదు. పూర్వకర్మ విధానాన్ననుసరించాలి. ధృతి మంతు డగు వాడు అపారమైన సంపదలు కలిగి నప్పుడు పొంగి పోరాదు. అలాగే కష్టపరంపర లెదురైనపుడు కుంగి పోవడం కూడ తగదు. ఉత్తములగు వారు ధన క్షయం జరిగితే బాధ పడరు. ధనాగమ వేళ ఆనందం తో గంతులు వేయరు. రెండింటిని ప్రశాంతంగా స్వీకరిస్తారు. ఓ మహాభుజా! నీవు విద్వాంసుడివి కనుక ఈ సత్యాలు గుర్తించి బాధ పడ వలదు. పండితుడగు వాడు విషాదాన్ని దగ్గరకు రానీయడు. మరొక హిత వాక్యం గూడ అర్థ గర్బిత మైనది చెబుతున్నా. అది నీ క్షేమానికి లోక క్షేమానికి గూడ పరమ ఆవశ్యకము. అది తెలసికుని ఆచరణలో పెట్టుము - సర్వభావేన ఆ పురుషోత్తముడు శరణ్యుడగు హరిని శరణు పొందుము. ఆ ప్రభు వొక్కడే నిన్ను భయ ముక్తుని గావింప సమర్థుడు. ఆ ద్యంత రహితుడు, చరాచర గురువు ఈశ్వరుడు సంసార కూపంలో పడిన వారలకు చేయూత అయిన వాడునగు ఆ హరిని విష్ణుని ఆశ్రయించిన వారలకే తాపము కలుగవు. కనుక నో దానవశ్రేష్ఠా! నీ మనస్సు నా ప్రభువు మీదనే లగ్నము చేసి యుంచుము. ఆయనకు భక్తుడ వగుము. నేను కూడ పాప పరిహారార్థ మా యీశ్వరునారాధించి అనంతరము తీర్థయాత్రలకేగెదను. పాప విముక్తుడ నైనం తనే నా ప్రభు వానృపింహ దేవుని చరణాల కడకు చేరుకొనెదను. ''ఓ నారదా! ఆ విధంగా నా మహాత్ముడు బలిని ఊరడించి, హిత మచనాలు పలికి యోగేశ్వరు డగు విష్టుని స్మరిస్తూ దనుజ వీరులకు వీడ్కోలు పలికి తీర్థయాత్రలకై బయలు దేరాడు.

ఇది శ్రీ వామన పురాణంలో ఏబది యొకటవ అధ్యాయం సమాప్తము.

Sri Vamana Mahapuranam    Chapters