Sri Vamana Mahapuranam    Chapters   

శ్రీ వామ పురాణ అష్ట చత్వారింశో%ధ్యాయః (48)

పులస్త్య ఉవాచ -

సంనివృత్తే తతో బాణ దానవా:సత్వరం పున:| నంవృత్తాదేవతానాంచ సశస్త్రా యుద్ధలాలసాః|| 1

విష్ణు రప్యమితౌజా స్తం జ్ఞాత్వా%జేయం బలేః సుతమ్‌, ఆహామంత్ర్య సురాన్‌ సర్వాన్‌ యుద్ధ్యధ్వం విగతజ్వరాః|| 2

విష్ణునాథ సమాదిష్టా దేవాః శక్రపురోగమాః యుయుధు ర్దానవైస్సార్ధం విష్ణుస్త్వంతర ధీయత|| 3

మాధవం గత మాజ్ఞాయ శుక్రో బలి మువాచ హ గోవిందేన సురాస్త్యక్తాస్త్వం జయస్వాధునా బలే|| 4

స పురోహితవాక్యేన ప్రీతో యాతే జనార్దనే, గదా మాదాయ తేజస్వీ దేవసైన్య మభిద్రుతః|| 5

బాణో బాహు సహస్రేణ గృహ్య ప్రహరణాన్యథ| దేవసైన్యమభిద్రుత్య నిజఘాన సహస్రశః|| 6

మయో%పి మాయా మాస్థాయ తైసై#్త్రః పూపాంతరైర్ముహుః, యోధయామాస బలవాన్‌ సురాణాంచ వరూధినీమ్‌|| 7

విద్యుజ్జిహ్యః పారిభద్రో వృషపర్వా శ##తేక్షణః, విపాకో విక్షరః సైన్యం తే%పి దేవా నుపాద్రవన్‌|| 8

తేహన్యమానాదితిజై ర్దేవాః శక్రపురోగమాః, గతే జన్దానే దేవే ప్రాయశో విముఖా భవన్‌|| 9

తాన్‌ ప్రభగ్నాన్‌ సురగణాన్‌ బలిబాణ పురోగమాః, పృష్ఠ తశ్చాద్రవన్‌ సర్వే త్రైలోక్య విజగీషవః|| 10

సంబాధ్యమానా దైతేయై ర్దేవాః సేంద్రా భయాతురాః త్రివిష్టవం పరిత్యజ్య బ్రహ్మలోక ముపాగతాః|| 11

బ్రహ్మలోకం గతే ష్విత్థం సేంద్రేష్వపి సురేషు వై | స్వర్గభోక్తా బలి ర్జాతః సపుత్ర భ్రాతృ బాంధవః|| 12

శక్రో%భూద్‌ భగవాన్‌ బ్రహ్మన్‌ బలిః బాణో యమో% భవత్‌

వరుణో%భూన్మయః సోమో రాహుః హ్లాదో హుతాశనః|| 13

స్వర్భాను రభవ త్సూర్యః శుక్ర శ్చాసీద్‌ బృహస్పతిః| యే%న్యే%ప్యధికృతా దేవా స్తేషు జాతాః సురారయః|| 14

పంచమస్య కలే రాదౌ ద్వాపరాంతే సుదారుణః | దేవా%సురో%భూ త్సంగ్రామో యత్ర శక్రో%ప్యభూద్బలిః|| 15

పాతాళాః సప్త తస్యాసన్‌ వశే లోకత్రయం తథా| భూ ర్భువః స్వరితి ఖ్యాతం దశలోకాధిపో బలిః|| 16

స్వర్గే స్వయం నివసతి భుంజన్‌ భోగాన్‌ సుదుర్లభాన్‌ | తత్రో పాసంత గంధర్వా విశ్వావసు పురోగమాః|| 17

తిలోత్తమాద్యప్సరసో నృత్యంతి సురతాపన!|| వాదయంతి చ వాద్యాని యక్ష విద్యాధరాదయః|| 18

శ్రీ వామన పురుణంలో నలుబది యెనిమిదవ అధ్యాయము

పులస్త్య వచనము ః-

ఓ నారదా! బాణుడు యుద్ధభూమికి తిరిగి రావడంతో యితరదైత్య వీరులు కూడ తమ తమ శస్త్రాస్త్రాలతో యుద్ధోత్సాహులై తిరిగి వచ్చారు. మహా తేజస్వి అయిన విష్ణువు బాణుడు (బలిసుతుడు) అజేయుడని తెలిసికొని దేవతలతో తలపడగా, తాను అంతర్థానమై పోయాడు. జనార్దునుడు వెళ్లిపోవుట తెలిసికొన్న శుక్రాచార్యుడు ఆనందంతో - ఓ బలీ! గోవిందుడు దేవతలను వదలి వెళ్లాడు. ఇది మంచి అవకాశం. నీవు విజృంభించి వారలను జయించుమని' బలిని ఆదేశించాడు. పురోహితుని మాటలకు సంతోషించి ఆ బలిదైత్యుడు గద తీసికొని దేవతల మీద విరుచుపడ్డాడు. బాణుడు తన వేయి చేతులతో పెక్కు ఆయుధాలను ఉపయోగించి వేలాది దేవతలను సంహరించాడు. మయదానువుడు తన మాయను విస్తరించి నానా రూపాలు ధరించి దేవ సైన్యాన్ని చిందర వందర చేయసాగాడు. విద్యుజ్జిహ్వుడు, పారిభద్రుడు, వృషపర్వుడు, శతాక్షుజు, విరూపాక్షుడు, విక్షరుడు మొదలగు వీరులంతా దేవసైన్యాన్ని చెండాడసాగారు. అలా దానవుల చేత పరాజితులై యింద్రాది దేవతలంతా విష్ణువు లేకుండుట చూచి వెనుకంజ వేశారు. అలా విరిగిపోయిన దేవ సైన్యాన్ని బలి బాణాదులు వెన్నంటి తరిమి వేశారు. ముల్లోక విజయానికి సన్నద్ధులయిన ఆ అసురుల దెబ్బలకు తాళ##లేక దేవతలు స్వర్గాన్ని వదలి పెట్టి బ్రహ్మలోకానికి వెళ్లిపోయారు. అలా యింద్ర సమేతులై దేవతలు బ్రహ్మనెలవు వెళ్లడంతో పుత్ర మిత్ర బంధు పరివారంతో సహా బలి నిష్కంటకమైన స్వర్గానికి అధిపతి అయ్యాడు. ఓ నారదా! యింద్ర పీఠాన్ని కైవసం చేసుకొని బలి ఇంద్రుడయ్యాడు, బాణుడు యముడయ్యాడు. వరుణుడుగా, మయుడు, చంద్రుడుగా రాహువు, అగ్నిగా హ్లాదుడు, సూర్యుడుగా స్వర్భానుడు ఆయా అధికారాలను చేజిక్కించుకున్నారు. బృహస్పతి స్థానానికి శుక్రుని అభిషేకించారు. తక్కిన అధికార లితర దైత్యులకు యిచ్చారు. అయిదవ కలి ద్వాపరయుగాల సంధి కాలంలో ఆ భయంకరమైన దేవాసుర సంగ్రామం జరిగి బలి శక్ర పదవి నలంకరించాడు. సప్త పాతాళాలు భూర్భువస్సు వరాది త్రిలోకాలు వశం గావించుకుని దశలోకాధిపతిగా విఖ్యాతి పొందాడు. స్వర్గ సింహాసనాన్ని అధిరోహించి ఎనలేని దుర్లభ సౌఖ్యాలననుభవించ సాగాడు. విశ్వావసు మొదలయన గంధర్వులు గానంచేస్తూ ఉంటే, తిలొత్తమాదిగా గల అప్సరసలు నాట్యం చేసేవారు. యక్ష కిన్నర వద్యాధరులు వివిధ వాద్యాలు మేళవించి ఆ బలి రాజేంద్రుణ్ణి సంతోషపెట్టేవారు - 18

వివిధానపిభోగాంశ్చ భుంజన్‌ దైత్యేశ్వరోబలిః | సస్మార మనసా బ్రహ్మన్‌ ప్రహ్లాదం స్వపితామహమ్‌|| 19

సంస్మృతో నప్తృణాచా%థ మహాభాగవతో %సురః, సమభ్యాగా త్త్వరాయుక్తః పాతాళా త్స్వర్గ మవ్యయమ్‌|| 20

తమాగతం సమీక్ష్యైవ త్సక్త్వా సింహాసనం బవిః | కృతాంజలి పుటో భూత్వా వవందే చరణా వుభౌ|| 21

పాదయోఃపతితం వీరం ప్రహ్లాద స్త్వరితోబలిమ్‌ | సముత్థాప్య పరిష్వజ్య వివేశ పరమాసనే|| 22

తం బలిః ప్రాహ భోస్తాత! త్వత్ర్ప సాదాత్సురా మయా| నిర్జితాః శక్ర రాజ్యంచ హృతం వీర్యబలా న్మయా|| 23

తదిదంతాత! మద్వీర్య వినిర్జిత సురోత్తమమ్‌ | త్రైలోక్య రాజ్యం భుంఙ త్వం మయి భృత్యే పురఃస్థితే|| 24

ఏతావతా పుణ్యయుతః స్యామహంతాత! యత్స్వయం| త్వదంఘ్రి పూజాభిరత| స్త్వదుచ్ఛిష్టాన్న భోజనః|| 25

న సాపాలయతో రాజ్యం ధృతి ర్భవతి సత్తమ!| యా ధృతి ర్గురుశుశ్రూషాం కుర్వతో జాయతే విభో!|| 26

తత స్తదుక్తం బలినా వాక్యం శ్రుత్వా ద్విజోత్తమ!| ప్రహ్లాదం ప్రాహ వచనం ధర్మకామార్థ సాధనమ్‌|| 27

మయా కృతం రాజ్య మకంటకం పురా, ప్రశాసితా భూః సుహృదో%ను పూజితాః

దత్తం యథేష్టం జనితా స్తథాత్మజాః, స్థితోబలే! సంప్రతియోగ సాధకః|| 28

గృహీతం పుత్ర! విధివ న్మయా భూయో%ర్పితం తవ | ఏవం భవ గురూణాం త్వం సదా శుశ్రూషణరీతః|| 29

ఇత్యేవ ముక్త్వా వచనం కరే త్వాదాయ దక్షిణ|| శాక్రే సింహాసనే బ్రహ్మన్‌! బలిం తూర్ణం న్యవేశయత్‌|| 30

సోపవిష్టో మహేంద్రస్య సర్వరత్నమయే శుభే| సింహాసనే దైత్యపతిః శుశుభే మఘవా నివ|| 31

తత్రోపవిష్టశైవా సౌ కృతాంజలి పుటో నతః| ప్రహ్లాదం ప్రాహ వచనం మేఘ గంభీరయా గిరా|| 32

యన్మయా తాత! కర్తవ్యం త్రైలోక్య పరిరక్షితా, ధర్మర్ధ కామమోక్షేభ్య స్తదాదిశతు మే భవాన్‌|| 33

తద్వాక్య సమకాలం చ శుక్రః ప్రహ్లాదమబ్రవీత్‌, యద్యుక్తం తన్మహా బాహె!వదస్వాద్యోత్తరం వచః|| 34

అలా దైత్యేశ్వరుడైన బలి వివిధ స్వర్గభోగాలు అనుభవించి ఒకనాడు తన పితామహుడు పరమభాగవతుడు నగు ప్రహ్లాదుని మనసారా స్మరించాడు. మనుమడు స్మరించి నంతనే ఆ అసురోత్తముడు పాతాళా న్నుంచి త్వరగా స్వర్గానికి చేరుకున్నాడు. అలా వచ్చిన తాత గారిని చూడగానే బలి సింహాసనం దిగి రెండు చేతులూ జోడించుకున ఆ మహనీయునకు సాష్టాంగ పడి మ్రొక్కాడు. చరణాల కడ పడియున్న ఆ మహావీరుని ప్రహ్లాదుడు ప్రేమతో లేవ నెత్తి కౌగలించుకొని శ్రేష్ఠమైన ఆసనం మీద కూర్చున్నాడు. సుఖోపవిష్టుడైన పితామహుని చూచి బలి యిలా అన్నాడు. "పితామహా! తమ అనుగ్రహం వల్ల నా బలాధిక్యత ప్రదర్శించి యింద్ర రాజ్యాన్ని సంపాదించాను. అలా గెలిచిన ఈ త్రిలోక రాజ్యాన్ని తమ రునుభవించండి. నేను భృత్యుడనై సేవ చేస్తాను. తమ చరణాబ్జ పూజచేస్తూ తమ ఉచ్ఛిష్టాన్నం భుజిస్తూ జీవించ గలిగినచో నా అంతటి భాగ్యశాలి మరొక డుండబోడు. ప్రభో! తమబోటి మహనీయుల సేవలో గల్గు తృప్తి సార్ధకత్వం, ఈ రాజ్య పాలనంలో నాకు కలగడం లేదు."ఓ ద్విజోత్తమా! అలా బల పలికిన మాటలు విని, ప్రహ్లాదుడు ధర్మ కామార్థ సాధకా లియన వాక్యాలు చెప్పాడు. "చిరంజీవీ! నేనాడో బంధు మిత్ర పరివారంతో నిష్కంటకంగా సకల విధాలయిన రాజ్యభోగాలు అనుభవించి , సకల గౌరవాలు పొంది, యధేష్టంగా దాన ధర్మాలు చేసాను. పుత్రులను కన్నాను. ఆ భూలోకాధిపత్యాన్ని వదలి యప్పుడు యోగసాధనలో నున్నానయ్యా! నీవు నాకు సమర్పిచిన ఈ రాజ్యాన్ని తిరిగి నీ కిస్తున్నాను. ఇదేవిధంగా పెద్దలను సేవిస్తూ నీవు ఈ రాజ్యాన్ని పరపాలించుము.' అలా అని తన కుడిచేతిలో మనుమని చేయిపట్టుకుని తిరిగి అతనిని ఇంద్ర సింహాసనం మీద కూర్చుండ బెట్టాడు. నారదా! ఆ బలి మహేంద్రుని సర్వ రత్న భూషితమైన సింహపీఠం మీద కూర్చొని మఘవాను (ఇంద్రు)ని వలె ప్రకాశించాడు. అలా సింహాసనం మీద కూర్చొని చేతులు జోడించి మేఘ గంభీ స్వరంతో తాతగారిని యిలా అడిగాడు. "తాతా! ముల్లోక రాజ్య పరిరక్షణ చేస్తూ, ధర్మార్థ కామ మోక్ష సాథకాలయిన కర్తవ్యాలు ఏ విధంగా నేను అనుష్టించ వలెనో దయచేసి ఆదేశించండి" ఆ మాటలందుకుని శుక్రాచార్యుడు గూడ "ఓ మహాభుజా! యోగ్యమైన కర్తవ్యం ఉపదేశించండి" అంటూ ప్రహ్లాదుని అర్థించాడు.

వచనం బలి శుక్రాభ్యాం శ్రుత్వా భాగవతో%సురః, ప్రాహ ధర్మార్థ సంయుక్తం ప్రహ్లాదో వాక్య ముత్తమమ్‌|| 35

యదాయత్యాం క్షమం రాజన్‌! యద్ధితం భువనస్య చ, అవిరోధేన ధర్మస్య అర్థస్యోపార్జనం చ యత్‌|| 36

సర్వ సత్వానుగమనం కామ వర్గ ఫలం చ యత్‌, పరత్రేహ చ యచ్ఛ్రేయః పుత్ర!తత్కర్మ ఆ చర|| 37

యథా శ్లాఘ్యం ప్రయా స్యద్య యథాకీర్తి ర్భవేత్తవ, యథా నా యశసో యోగ స్తథా కురు మహామతే|. 38

ఏత దర్థం శ్రియం దీప్తాం కాంక్షంతే పురుషోత్తమాః, యేనైతాని గృహే%స్మాకం నివసంతి సునిర్వృతాః|| 39

కు లజో వ్యసనే మగ్నః సఖా చార్థ బహిః కృతః, వృద్ధో జ్ఞాతి ర్గుణీ విప్రః కీర్తిశ్చ యశసా సహ|| 40

తస్మా ద్యధైతే నివసంతి పుత్ర! రాజ్యస్తి స్యేహ కులోదతాద్యాః

తథా యతస్వామల సత్వ చేష్ట! యథా యశస్వీ భవితాసి లోకే|| 41

భూమ్యాం సదా బ్రాహ్మణ భూషితాయాం క్షత్రాన్వితాయాం దృఢవాపితాయామ్‌

శుశ్రూషణా సక్త సముద్భవాయా మృద్ధిం ప్రయాంతీహ నరాధిపేంద్రాః|| 42

తస్మా ద్విజాగ్ర్యాః శ్రుతి శాస్త్రయుక్తా నరాధిపాంస్తే ప్రతి యాజయంతు

దివ్యై ర్యజంతు క్రతుభి ర్ద్విజేంద్రా యజ్ఞాగ్ని ధూమేన నృపస్య శాంతిః|| 43

తపో%ధ్యయన సంపన్నా యజనాధ్యాపనే రితాః| సంతు విప్రా బలే! పూజ్యస్త్వత్తో%నుజ్ఞా మవాప్య హి|| 44

స్వాధాయ యజ్ఞ నిరతా దాతారః శస్త్ర జీవినః, క్షత్రియాః సంతుదైత్యేంద్ర! ప్రజా పాలన ధర్మిణః|| 45

యజ్ఞాం ధ్యయన సంపన్నా దాతారః కృషికారిణః, పశుపాల్యం ప్రకుర్వంతు వైశ్యా విపణి జీవినః|| 46

బ్రాహ్మణ క్షత్రియ విశాం సదా శు శ్రూషణ రతాః, శూద్రాః సంత్వసురశ్రేష్ఠ! తవాజ్ఞా కారిణః సదా|| 47

యదా వర్ణాః స్వధర్మస్థా భవంతి దితిజేశ్వర!ధర్మబుద్ధి స్తదా స్యాద్వై ధర్మబద్ధో నృపోదయః|| 48

తస్మా ద్వర్ణాః స్వధర్మస్థాస్త్వయా కార్యాః సదా బలే! తద్‌ వృద్దౌ భవతో బుద్ధి స్తద్ధానౌ హాని రుచ్యతే|| 49

ఇత్థం వచః శ్రావ్య మహాసురేంద్రో బలిం మహాత్మా స బభూవ తూష్ణీమ్‌

తతో యదాజ్ఞాపయసే కరిష్యే ఇత్థంబలిః ప్రాహ వచో మహర్షే|| 50

ఇతి శ్రీ వామన పురాణ అష్ట చత్వారింశో%ధ్యాయః సమాప్తః

బలి శుక్రుల అభ్యర్ధన నాలకించి ఆ భాగవత దైత్యుడు, ధర్మార్థయుక్తమైన ఉత్తమ ఉపదేశం యిచ్చాడు. "వత్సా ! రాజువైన నీవు, భవిష్యత్తులో నిలచి లోకానికి హితం కలగుజేసే కార్యాలు చేయ దగుదువు. ధర్మానికి విరుద్ధం కాని విధంగా, ధనము నార్జించుము. కామ్యసాధనం ఎల్లరకు అనుకూలంగా యిహపరాల్లో శ్రేయం కలిగే విధంగా ఆచరించుము. ఓ మహామతీ! అడుగడుగున శ్లాఘింపబడునట్టుగా, కీర్తి కలుగునట్లుగా, అపయశస్కరంకాని విధంగా కర్మాచరణము చేయుము. ఉత్తములగువారు, తమ యిండ్లలో వృద్ధులు, మిత్రులు, చుట్టాలు, జ్ఞాతులు, గుణవంతులు, బ్రాహ్మణులు గౌరవింపబడుటకు పేరు ప్రతిష్ఠలు కలుగుటకే సరిసంపదలను కాంక్షిస్తారు. అర్ధహీనులను ఆదుకొనుటకే అర్ధోపార్జనం చేస్తారు. కాబట్టి పుత్రా! నీ రాజ్యంలో ఉత్తమ కులజులూ, యోగ్యులగు తదితరులూ, నిశ్చింతగా నివసించుటకు తగిన ఉత్తమ కార్యాలు చేస్తూ నీ యశస్సు దశదిశలా వ్యాపించు నట్టు నడుచు కొనుము. ఎల్లపుడూ భూమి బ్రాహ్మణులతో నలకంరింప బడి, క్షత్రియులతో పరివృతమై సస్యమమృద్ధమై, సేవాభావం గల వారితో కళకళలాడుతూ ఉన్నపుడే, దానిని పరిపాలించు రాజులకు అభివృద్ధి కనుకు రాజుకూ, రాజ్యానికీ కల్యాణం కలిగే పవిత్ర యజ్ఞ యాగాదులు, ఉత్తములూ శ్రుతి శాస్త్రవేత్లూ చేయునట్టుగా, వారు దివ్యమైన క్రతువులూ తపస్సూ చేయునట్టుగా, విప్రుల కనుకూల మగు వాతావరణం నెలకొల్పుము. యజ్ఞాగ్ని ధూమం వల్లనే రాజులకు శాంతి సౌఖ్యాలు కలుగుతాయి. కనుక నోబలీ! నీ రాజ్యంలో నీ అనుజ్ఞతో ఎల్లెడలా తపస్సంపన్నులూ, యజనంయాజనం అధ్యాపనం చేసే విప్రోత్తములు, పూజార్చనలు అందుకొను నట్లుగా యత్నింపుము. శస్త్రోపజీవు లగు క్షత్రియులు, వేదాధ్యాయనం యజ్ఞాలు చేస్తూ, వదాన్యులై ప్రజాపాలనం చేయునట్లుగ ప్రోత్సహించుము. వాణిజ్య ప్రవీణు లగు వైశ్యులు దాతలై యజ్ఞాధ్యాయనం యజ్ఞాలు చేస్తూ వదాన్యులై ప్రజాపాలనం చేయునట్లుగ ప్రోత్సహించుము. వాణిజ్య ప్రవీణులగు వైశ్యులు దాతలై యజ్ఞాధ్యయనాలు చేస్తూ వ్యవసాయం పశుపాలనం చక్కగా నిర్వర్తించు నట్లు జాగ్రత్త వహించుము. బ్రాహ్మణ, క్షత్రయ, వైశ్యులకు వారల ధర్మ నిర్వహణంలో సేవా సహకారాలు అందిస్తూ నీ ఆజ్ఞాను కారులై శూద్రులు మెలగునట్లు చూచుకొనుము. చతుర్వర్ణాల వారు తమ తమ ధర్మాలు చక్కగా ఆచరించిన నాడు ధర్మ వృద్ధి కలుగుతుంది. ధర్మవృద్ధితో రాజులు అభ్యుదయం చేకూరుతుంది. కనుక నీ రాజ్యంలోని వారంతా స్వధర్మ నిరతులగు నట్లు పాటుపడుము. ధర్మహానియే రాజ్యహానికి హేతువని పెద్దల నిర్ణయం. "తన పౌత్రున కిలా హితోపదేవం చేసి ఆ మహనీయుడు ముగించాడు. ఓ నారదా! ఆ బలి చక్రవర్తి,"తమ ఆదేశం తలదాల్చుతున్నా" నని చేతులు జోడించాడు.

ఇది వామన పురాణంలో నలుబది ఎనిమిదవ అధ్యాయము సమాప్తము

Sri Vamana Mahapuranam    Chapters