Sri Vamana Mahapuranam    Chapters   

నలుబది నాలుగవ అధ్యాయము

పులస్త్య ఉవాచ :

తస్మింస్తదా దైత్యబలేచ భ##గ్నే శుక్రో7బ్రవీ దంధకమాసురేంద్రమ్‌ |

ఏహ్యేహి వీరాద్యగృహం మహాసుర మోత్స్యాను భూయోహరమేత్య శైలమ్‌. 1

తమువాచాంధకో బ్రహ్మన్‌ నసమ్యగ్భవతోదితమ్‌ | రణాన్నై చాపయాస్యామి కులం వ్యవదిశన్‌ స్వయమ్‌.

పశ్యత్వ ద్విజశార్దూల మమవీర్యం సుదుర్దరమ్‌ | దేవదానవ గంధర్వాన్‌ జేష్యేసేంద్రం మహేశ్వరమ్‌. 3

ఇత్యేవముక్త్వా వచనం హిరణ్యాక్ష సుతో7ంధక | సమాశ్వాస్యా బ్రవీచ్ఛంభుం సారథిం మధురాక్షరమ్‌. 4

సారథే వాహయరథం హరాభ్యాశం మహాబల | యావన్ని హన్మిబాణౌఘైః ప్రమథామరవాహినీమ్‌. 5

ఇత్యంధకవచః శ్రుత్వాసారథి స్తురగాం స్తదా | కృష్ణ వర్ణాన్‌ మహావేగాన్‌ కశయా7భ్యాహనన్మునేః. 6

తే యత్నతో7పితు రగాః ప్రేర్యమాణాహరం ప్రతి | జఘనేష్వవసీదంతః కృచ్ఛ్రేణౌహుశ్చతం రథమ్‌. 7

వహంతస్తురగా దైత్యం ప్రాప్తాః ప్రమథవాహినీమ్‌ | సంవత్సరేణ సాగ్రేణ వాయువేగ సమాఅపి. 8

తతః కార్ముకమానమ్య బాణజాలైర్గణశ్వరాన్‌ | సురాన్‌ సంఛాదయామాప సేంద్రోపేంద్ర మహేశ్వరాన్‌. 9

బాణౖశ్ఛదితమీక్ష్యైవ బలం త్రైలోక్య రక్షితా | సురాన్‌ ప్రోవాచ భగవాం శ్చక్రపాణిర్జనార్దనః. 10

విష్ణు రువాచ :

కింతిష్టధ్వంసుర శ్రేష్ఠా హతేనానేన వైజయః | తస్మాన్మద్య చనం శీఘ్రం క్రియతాం వైజయేప్సవః. 11

శాత్యంతా మన్యతురగాః సమం రథకుటుంబినా | భజ్యతాం స్యందనశ్చాపి విరథః క్రియతాంరిపుః. 12

విరథంతు కృతంపశ్చా దేసంధక్ష్యతి శంకరః | నోపేక్ష్యః శత్రురుద్దిష్టో దేవాచార్యేణ దేవతాః. 13

ఇత్యేవముక్తాః ప్రమథా వాసుదేవేన సామరాః | చక్రుర్వేగం సహేంద్రేణ సమం చక్రధరేణ చ. 14

పులస్త్యుడిలా అన్నాడు : అలా నడుము విరిగిన దైత్యసేనను చూచి శుక్రాచార్యుడంధకాసురునితో ''నోవీరా ! రమ్ము నేటికి యింటికి మరల వచ్చి ఈ మందరగిరిమీద హరునితో పోరాడుదమ''నగా నాతడు, 'బ్రహ్మర్షే ! తమరు చెప్పునది యుక్తముకాదు. నా కుల గౌరవ ప్రతిష్ఠలను మంటగలిపి యుద్ధభూమిని విడచి రాజాలను. ఓ బ్రాహ్మణశ్రేష్ఠా! నా అమోఘ వీర్యాన్ని ప్రదర్శించి నేడు ఇంద్రమహేశ్వరులతోసహా దేవదానవ గంధర్వుల నందరనూ జయిస్తాను. చూస్తూండండి. అని ఆ హిరణ్యాక్ష నందనుడు తనసారథిని బుజ్జగిస్తూ యిలా అన్నాడు. మృదువచనాలతో ఓ మహావీరా సారథీ ! మన రథాన్ని శంకరుడున్న వైపుకు నడపుము. నా బాణ పరంపరతో ఈ ప్రమథామర వాహినులను పరిమార్చెదను. అంధకుని మాటలు విని సారథి నట్లని ఉత్తమాశ్వాలను చండ్రకోలతో గట్టిగా ప్రహరించాడు. మహా వేగంతో పరుగెత్తే ఆ అశ్వాల నడుములు నొప్పిపెట్టగా ఎంగా ప్రయత్నించినా వేగమందుకోలేకపోయాయి. కుంటుకుంటు మెల్లగా రథాన్ని లాగుతూ మందర శైలం మీద ప్రమథుల సేనను సమీపించేసరికి సంవత్సర కాలం పట్టింది. అంతట నా అంధకుడు ప్రచండమైన ధనుస్సు నెక్కుబెట్టి తన బాణ వృష్టితో ఇంద్రోపేంద్ర మహేశ్వర సహితంగా ప్రమథదేవ గణాలందరనూ ముంచివేశాడు. త్రిలోకరక్షకుడైన చక్రపాణి జనార్దనుడు బాణాలతో కప్పబడిన ఆ సైన్యాన్ని చూచి వారలతో యిలా అన్నాడు. ఓ దేవశ్రేష్ఠులారా! అలా చూస్తూ కూర్చున్నారెందుకు? లేవండి. వీరు చచ్చినప్పుడే మనకు జయం కలుగుతుంది. గుర్తుపెట్టుకోండి. విజయం పొందదలచినచో నేను చెప్పినట్లు చేయండి. సారథితో సహా వీని అశ్వాలను మట్టుబెట్టండి. రథాన్ని విరగ్గొట్టి శత్రువును విరథుణ్ణి గావించండి. అప్పుడు హరుడు వీడిని దగ్ధంగావిస్తాడు. ఈ దుష్టుణ్ణి ఏమాత్రం ఉపేక్షించ గూడదు.'' అని హెచ్చరించినంతనే ఆ ప్రమథ దేవగణాలు యింద్రుడు విష్ణువు తోడు పడగా సన్నద్ధులయ్యారు.

తురగాణాం సహస్రంతు మేఘాభానాం జనార్దనః | నిమిషాంతర మాత్రేణ గదయా వినిపోథయత్‌. 15

హతాశ్వాత్స్యందనాత్‌ స్కందః ప్రగృహ్యరథ పారథిమ్‌ | శక్త్యావిభిన్న హృదయం గతాసుం వ్యసృజద్భువి.

వినాయకాద్యాః ప్రమథాః సమం శ##క్రేణ దైవతైః | సధ్వజాక్షం రథంతూర్ణ మభంజంత తపోధనాః. 17

సహసాస మహాతేజా విరథస్త్యజ్యకార్ముకమ్‌ | గణామాదాయ బలవా సభిదుద్రావ దైవతాన్‌. 18

పదాన్యష్టతతో గత్వా మేఘగంభీరయాగిరా | స్థిత్వాప్రోవాచ దైత్యేంద్రో మహాదేవం సహేతుమత్‌. 19

భిక్షోభవాన్‌ సహానీకస్త్వ సహాయో7స్మి సాంవ్రతమ్‌ | తథా7పిత్వాం విజేష్యామి సశ్యమే7ద్యపరాక్రమమ్‌.

తద్వాక్యం శంకరః శ్రుత్వాసేంద్రాన్‌ సురగణాం స్తదా | బ్రహ్మణా సహితాన్‌ సర్వాన్‌ స్వశరీరేన్యవేశయత్‌.

శరీర స్థాంస్తాన్‌ ప్రమథాన్‌ కృత్వాతేవాంశ్చ శంకరః |

ప్రాహ ఏహ్యేహిదుష్టాత్మన్‌ ఆహమేకో7పి సంస్థితః. 22

తందృష్ట్వా మహదాశ్చర్యం సర్వానురగణ క్షయమ్‌ | దైత్యః శంకరమభ్యాగాద్‌ గదామాదాయ వేగవాన్‌.

తమాపతంతం భగవాన్‌ దృష్ట్వాత్యక్త్వావృషోత్తమమ్‌ | శూలపాణిర్గిరి ప్రస్థే పదాతిః ప్రత్యతిష్ఠతః. 24

వేగేనైవా పతంతంచ బిభేదోరసి భైరవః | దారుణం సుమహద్రూవం కృత్వా త్రైలోక్య భీషణమ్‌. 25

దంష్ట్రా కరాలం రవికోటి సంనిభం మృగారిచర్మాభివృతం జటాధరమ్‌ |

భుజంగ హారామలకంఠ కంధరం విశార్దబాహుం సషడర్ధలోచనమ్‌. 26

ఏతాదృశేన రూపేణ భగవాన్‌ భూత భావనః | బిభేద శత్రుంశూలేన శుభదః శాశ్వతః శివః. 27

స శూలం భైరవం గృహ్య భిన్నేప్యురసి దానవః | విజహారాతి వేగేన క్రోశమాత్రం మహామునేః. 28

తతః కథఃచిద్భగవాన్‌ సంస్తభ్యాత్మానమాత్మనా | తూర్ణముత్పాటయామాన శూలేన సగదంరిపుమ్‌. 29

దైత్యాధిపస్త్వపి గదాం హరమూర్ధ్నిన్య పాతయత్‌ | కరాభ్యాం గృహ్యశూలం చ సముత్పతతదానవః.

సంస్థితః స మహాయోగీ సర్వాధారః ప్రజాపతిః | గదాపాతక్షతాద్భూరి చతుర్ధా7సృగథా వతత్‌. 31

పూర్వాధారా సముద్భూతో భైరవో7గ్ని సమప్రభః | విద్యారాజేతి విఖ్యాతః పద్మమాల విభూషితః. 32

జనార్దనుడగు విష్ణువు రెప్పపాటు కాలంలో తనగదతో కాటుకకొండల్లాంటి గుర్రాలను వేయింటిని మట్టుపెట్టాడు. గుర్రాలు చావగానే స్కందుడు సారథిని ఒడిసిపట్టి తనశక్తితో గుండెలు చీల్చి నేలమీద విసిరికొట్టాడు. సారథి నేలగూలుటతో వినాయకాది ప్రమథులు యింద్రాది దేవతలు చక్రాలు యిరుసు కేతనంతో సహా రథాన్ని ముక్కలుముక్కలు గావించారు. అంత మహాతేజస్వియగు నా దానవుడు రథాన్నీ ధనుస్సును వదలి గదను తీసుకొని దేవతల మీదకు లంఘించాడు. ఏడెనిమిదడుగులు వెళ్ళి నిలబడి, శివుని చూచి వేఘగంభీర స్వరంతో హేతుబద్ధంగా యిలా అన్నాడు. ''ఓ భిక్షూ ! నీ కిందరు సహాయ పడుచుండగా నేనసహాయుడుగా నిలచిపోయాను. అయినా నిన్ను జయించి తీరుతాను. చూడు నా పరాక్రమం! అంధకుడి మాటలు వింటూనే శంకరుడు ఇంద్రుడు బ్రహ్మతో సహా ఆ దేవతల నందరను తన దేహంలోకి వేసుకున్నాడు. అలా అందరనూ తన శరీరంతో ఉంచుకొని శంకరుడు, ''అరే ! దుష్టా ! రారా; నేనూ ఒక్కడనేరా !'' అని వాడిని యుద్ధానికి ఆహ్వానించాడు. అలా సర్వామర గణాలు క్షణంలో మటుమాయం కావడంచూచి అబ్బురపాటుతో వాడు గదను తీసుకొని శివునిమీదకు దూకాడు. వాడు తనవైపు వేగంగారావడంచూచి హరుడు వృషభాన్నిదిగి శూలపాణియై గిరిప్రస్థం మీద నిలబడ్డాదు. వాడు దగ్గరకు రాగానే త్రిలోక భయంకర మైన భైరవ రూపం ధరించి వాడిని హృదయంలో పొడిచాడు. ఓ మునీ! ఆ సమయాన భయంకరమైన దంష్ట్రలతో, కోటి సూర్యుల కాంతిలో పులితోలు జటాజూటం ధరించి, మెడలో నాగహారాలు వేలాడుతుండగా పది బాహువులతో మూడు నేత్రాలతో శివుడు ఆ శాశ్వతుడు, శుభంకరుడు. భాతభావనుడు వెలిగిపోయాడు. తన వక్షఃస్థలంపగిలినా ఆ మహాదైత్యుడా భైరవ మూర్తిని శూలంతో పాటు ఎత్తుకొని క్రోశం దూరం పారిపోయాడు ! అంత నా భగవంతుడు తమాయించుకొని, మహావేగంతో వాడిని గదతో గూడ శూలానికి గ్రుచ్చి చీల్చాడు. ఆ దైత్యుడు కూడ గదతో హరుణ్ణి నెత్తిమీద ప్రహరించాడు. శివుని చేతిలోని శూలం లాగుకొని ఎగిరి దూకాడు. ఆ సర్వాధారుడు. యోగేశ్వరుడైన ప్రజాపాలకుడు శత్రుగదాఘానికి చిట్లిన తలతో నిలబడగా ప్రణం నుండి నాలుగు ధారలుగట్టిరక్తం కారింది. తూర్పుదిశగా కారిన ధారనుంచి, పద్మమాలాధరుడై అగ్నిసమప్రభతో విద్యారాజనే భైరవుడు బయలుదేరాడు.

తథదక్షిణ ధారోత్థో భైరవః ప్రేతమండితః | కాలరాజేతి విఖ్యాతః కృష్ణాంజన సమప్రభః 33

అథప్రతీచీధారోత్థో భైరవః పత్రభూషితః | అతసీ కుసుమప్రఖ్యః కామరాజేతి విశ్రుతః. 34

ఉదగ్దారాభవశ్చాన్యో భైరవః శూలభూషితః | సోమరాజేతి విఖ్యాతః శ్చక్రమాలా విభూషితః. 35

క్షతస్యరుధిరాజ్ఞాతో భైరవః శూలభూషితః | స్వచ్ఛందరాజో విఖ్యాతః ఇంద్రాయుధ సమప్రభః. 36

భూమిస్థాద్‌ రుధిజ్జాతో భైరవః శూలభూషితః | ఖ్యాతో లలితరాజేతి సౌభాంజనసమ ప్రభః. 37

ఏవం హిసప్తరూపో7సౌ కథ్యతే భైరవోమునే ః | విఘ్నరాజో7ష్టమః ప్రోక్తో భైరవాష్టక ముచ్యతే. 38

ఏవం మహాత్మనా దైత్యః శూలప్రోతో మహాసురః | ఛత్రవద్ధారితో బ్రహ్మన్‌ భైరవేణ త్రిశూలినా. 39

తస్యాసృగుల్బణం బ్రహ్మన్‌ శూల భేదాదవాపతత్‌ | యేనా కంఠం మహాదేవో నిమగ్నః సప్తమూర్తిమాన్‌.

తతఃస్వేదో7భవద్భూరి శ్రమజః శంకరస్యతు | లలాట ఫలకేతస్మా జ్ఞాతా కన్యా7సృగాప్లుతా. 41

యద్భూమ్యాం న్యపత ద్విప్ర ః స్వేదబిందుః శివాననాత్‌ | తస్మాదంగార పుంజాభో బాలకః సమజాయత.

స బాలస్తృషితో7త్యర్థం పసౌరుధిరమాంధకమ్‌ | కన్యాచోత్కృత్య సంజాత మసృగ్విలిలిహే7ద్భుతా. 43

తతస్తామాహ బాలార్క ప్రభాంభైరవమూర్తిమాన్‌ | శంకరో వరదోలోకే శ్రేయో7ర్థాయవచో మహత్‌ 44

త్వాంపూజయిష్యంతి సురా ఋషయః పితరోరగాః | యక్షవిద్యా ధరాశ్చైవ మానవాశ్చ శుభంకరి. 45

త్వాంస్తోష్యంతి సదాదేవిః బలిపుష్పోత్కరైః కరైః | చర్చికేతి శుభంనామ యస్మాద్రుధిర చర్చితా. 46

ఇత్యేవముక్తా వరదేనచర్చికా భూతాను జాతా హరిచర్మవాసినీ |

మహీం సమంతా ద్విచచారసుందరీ స్థానం గతాహైంగుళతాద్రి ముత్తమమ్‌. 47

తస్యాంగతాయాం వరదః కుజస్య ప్రాదాద్వరం సర్వవరోత్తమం యత్‌ |

గ్రహాధి పత్యం జగతాం శుభాశుభం భవిష్యతి త్వద్వశగం మహాత్మన్‌. 48

హరో7ంధకం వర్ష సహస్రమాత్రం దివ్యం స్వనేత్రార్కహుతాశ##నేన |

చకార సంశుష్కతనుం త్వశోణితం త్వగస్థిశేషం భగవాన్‌సభైరవః. 49

తత్రాగ్నినా నా నేత్రభ##వేన శుద్దః సముక్తపాపో7సురరాట్‌ బభూవ |

తతః ప్రజానాం బహురూపమీశం నాథం హిసర్వస్య చరాచరస్య. 50

జ్ఞాత్వాస సర్వేశ్వరమీశమవ్యయం త్రైలోక్యనాథం వరదం వరేణ్యం |

సర్వైః సురాద్యైర్నతమీడ్యమాద్యంతతో7ంధకః స్తోత్రమిదం చకార. 51

దక్షిణం వైపు కారి రక్తధారనుండి నల్లని కాటుక కాంతితో ప్రేతాలను అలంకరించుకొని కాలరాజనే భైరవుడు ఉద్భవించాడు. పశ్చిమాన ప్రవహించిన ధారనుండి దిరిసెన పువ్వు కాంతితో ఆకులతో అలంకరించుకొని కామరాజు భైరవుడు వచ్చాడు. మరొక భైరవుడు సోమరాజనువాడుత్తర దిక్కుధారనుంచి శూలం చక్రం మాలను ధరించి బయలు దేరాడు. రక్తసిక్తమైన గాయంనుండి ఇంద్రధనుస్సు కాంతితో శూలంపట్టుకొని స్వచ్ఛంద రాజనే భైరవుడు రాగా భూమి మీద పడిన రక్తం నుంచి సౌభాంజన కాంతితో శూలపాణియై లలిత రాజను భైరవుడు నిర్గమించాడు. వీరు సప్తభైరవ మూర్తులు కాగా నో నారదా ! విఘ్నరాజు అష్టమ భైరవుడుగా ఎన్నబడుతున్నాడు వీరలను భైరవాష్టకంగా స్మరిస్తారు. వీరలు పరివేష్టించి యుండగా నా ప్రధాన భైరవమూర్తి త్రిశూలి, ఆ అంధకుడి దేహాన్ని శూలగ్రాన గ్రుచ్చి ఎత్తి ఛత్రం లాగా ధరించాడు ! ఓ బ్రహ్మర్షీ ! ఆ అంధకుడి శరీరం నుండి ధారాపాతంగా రక్తం ప్రవహించి. శూలపాణి అయిన ఆ సప్తభైరమూర్తి మహాదేవుణ్ణి కంఠం వరకు ముంచివేసింది. అప్పుడు విపరీతమైన అలసట వల్ల శంకరుని ఫాలభాగం నుంచి చెమట బిందువులు జారగా వానినుండి రక్తసిక్తమైన దేహంతో నొక బాలిక ఉద్భవించింది. శివుని ముఖాన్నించి కారిన స్వేదబిందువులు భూమిమీద పడగా అందులో నుంచి ఎర్రటి నిప్పు కణాల్లాంటి బాలకుడు పుట్టాడు. గొంతు ఎండి పోతున్న ఆ బాలకుడా అంధకుని రక్తాన్ని గటగటా త్రాగేశాడు. ఆ కన్యకూడ అద్భుతం గొల్పుతూ ఆ రక్తాన్ని నాలుకతో లపలపమంటూ నాకివేసింది. నారదా! అప్పుడు ఆ భైరవమూర్తి శంకరుడు బాలసూర్యుని కాంతితో ఉన్న ఆ బాలికను చూచి లోకహిత కాంక్షతో యిలా అన్నాడు. ఓ కల్యాణీ: నిన్నికమీద దేవ, పితృ, ఋషి, ఉరగ, యక్ష విద్యాధర, మనుష్యాదులంతా భక్తితో పూజిస్తారు. ఎల్లప్పుడు నీకు బలులు పుష్పాంజలులు అర్పించి స్తోత్రపాఠాలు చేస్తారు. రక్తలేపనంగల దానవగుటచే నిన్ను చర్చిక అనే చక్కని పేరుతో పిలుస్తారు. ''ఈ విధంగా వరదాయకుడైన ఆ పరమేశ్వరునిచే అనుజ్ఞాతయై ఆ భూతాల చెల్లెలు చర్చిక, సింహపు చర్మం ధరించి, భూమినలువైపులా సంచరించి ఉత్తమ మైన హైంగులతాద్రికి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిన తరువాత నా వరదేశ్వరుడు భూమినుంచి పుట్టిన బాలకుడు కుజునకు సర్వోత్తమమైన వరం యిస్తూ, ఓ మహాత్మా! నీకీనాటినుండి శుభాశుభకరమైన గ్రహాధిపత్యం యిస్తున్నా. దీనితో జగత్తు మీద ఆధిపత్యం కలిగి ఉంటావ''ని అభినందించాడు. అనంతరం వేయి దివ్య సంవత్సరాల వరకు సూర్యాగ్నిమయాలైన తన నేత్రజ్వాలలతో భగవంతుడైన నా భైరవుడా అంధకుని శరీరంలోని రక్తమాంసాదులను శుష్కింప జేశాడు ! వాడిలో చర్మం ఎముకలు మాత్రమే మిగిపోయాయి. పరమశివుని నేత్రాగ్నిలో అంధకుడు తన పాపాలన్నీ భస్మం గావించుకొని పరిశుద్ధుడయ్యాడు. సర్వేశ్వరుడు, సర్వరూపి, అవ్యయుడు, త్రిలోకపతి, వరదాయకడు, సర్వదేవతలకు ఆరాధ్యుడు నైన ఆ మహాదేవుని నిజతత్వం వానికి అవగతమైంది. అంతట చేతులు జోడించుకొని, ఆ దేవుణ్ణి, శరణ్యుణ్ణి యిలా స్తోత్రం చేశాడు.

అంధక ఉవాచ :

నమో7స్తుతే భైరవభీమమూర్తే త్రిలోకగోప్త్రే శితశూలధారిణ |

వింశార్ధబాహోభుజగేశహారః త్రినేత్ర మాంపాహి విపన్న బుద్ధిమ్‌. 52

జయస్వ సర్వేశ్వర విశ్వమూర్తేః సురాసురైర్వందిత పాదపీఠ |

త్రైలోక్య మాతుర్గురవేవృషాంక భీతః శరణ్యం శరణాగతో7స్మి. 53

త్వాంనాధః దేవాః శివమీరయంతి సిద్ధాహరం స్థాణుం మహర్షయశ్చ |

భీమం చ యక్షామనుజామహేశ్వరం భూతాశ్చ భూతాధిపమామనంతి. 54

నిశాచరా ఉగ్రముపార్చయంతి భ##వేతి పుణ్యాః పిరోనమంతి |

దాసో7స్మితుభ్యం హరః పాహినుహ్యం పాపక్షయంమేకురు లోనాథః. 55

భవాంస్త్రి దేవస్త్రి యుగస్త్రి ధర్మా త్రిపుష్కరశ్చాసివిభోః త్రినేత్ర |

త్రయ్యా రుణిస్త్రి శ్రుతిరవ్యయాత్మన్‌ పునీహిమాంత్వాం శరనం గతో7స్మి. 56

త్రిణాచికేతస్త్రి పదప్రతిష్టః షడంగ నిత్త్వం విషయేష్వలు బ్ధః |

త్రైలోక్యనాదో7సి పునీహి శంభోః దాసో7స్మిభీతః శరణాగతస్తే. 57

కృతం మహత్‌ శంకరతే7పరాధం మయా మహాభూతపతే గిరీశః

కామారిణా నిర్జితమానసేన ప్రసాదయేత్వాం శిరసానతో7స్మి. 58

పాపో7హం పాపకర్మా7హం పాపాత్మా పాపసంభవః |

త్రాహిమాందేవః ఈశానః సర్వపాపహరోభవః. 59

మామేక్రుధ్యస్వదేవేశః త్వయాచైతాదృశో7స్మ్యహమ్‌ | నృష్టః పాపనమాచారో మేప్రసన్నోభ##వేశ్వరః. 60

త్వం కర్తాచైవధాతాచ త్వం జయస్త్వం మహాజయః |

త్వంమంగళ్యస్త్వమోంకార స్త్వమీశానోధ్రువో7వ్యయః 61

త్వం బ్రహ్మాసృష్టి కృన్నాథః త్వం విష్ణుస్త్వం మహేశ్వరః |

త్వమింద్ర స్త్వంవషట్కారో ధర్మస్త్వం చ సురోత్తమః. 62

సూక్ష్మస్త్వం వ్యక్తరూపస్త్వం త్వమ వ్యక్తస్త్వమీశ్వరః |

త్వయా సర్వమిదం వ్యాప్తం జగత్‌స్థావర జంగమమ్‌. 63

త్వమా దిరంతోమధ్యశ్చ త్వమనాదిః సహస్రపాత్‌ | విజయస్త్వం సహస్రాక్షో విరూపాక్షో మహాభుజః. 64

అనంతః సర్వగోవ్యాపి హంసః ప్రాణా7ధిపో7చ్యుత | గీర్వాణ పతిరవ్యగ్రో రుద్రః పశుపతిః శివః. 65

త్రైవిద్యస్త్వం జితక్రోధో జితారిర్వి జితేంద్రియః | జయశ్చ శూలపాణిస్త్వం త్రాహిమాంశరణాగతమ్‌. 66

అంధకుడిలా ప్రార్థించాడు : ప్రభో ! భీమరూపివగు నో భైరవా ! నీకు నమస్కారము ! త్రిలోకరక్షకా ! శిత శూలపాణీ ! నాగేంద్రహారా! దశభుజధారీ! త్రినయనా! దుర్బుద్దినైన నన్ను కాపాడుము ! సర్వేశ్వరా ! విశ్వరూపా ! నీకు జయమగుగాక ! సురాసుర వందితచరణా, ముల్లోకాలకూ తల్లితండ్రీ అయిన వృషకేతనా! నేను భయంతో నీ అండ జేరితిని. నాకు శరణోసంగుము ప్రభో ! నిన్ను దేవతలు శివుడని కీర్తిస్తారు. సిద్ధులు హరుడవనీ మహర్షులు స్థాణుడవనీ యక్షులు భీముడవనీ, మానావులు మహేశ్వరుడవనీ భజిస్తారు. భూతగణాలు భూతనాథుడవనీ నిశాచరులు ఉగ్రుడవనీ. పుణ్యులు పితరులూ భవుడంటూ నీకు ప్రణతులౌతారు. హరా ! నా పాపాలు హరించు! నీకు దాసుడను ఓ లోకేశ్వరా నన్ను రక్షించుము ! త్రిదేవులు, త్రియుగాలు, త్రిధర్మాలు, త్రిపుష్కరాలు (కమలాలు) త్రివేదాలు, త్రయ్యారుణి, - ఇలా త్రిస్వరూపుడవగు త్రినేత్రుడవు నీవే ! ఓ అవ్యయా ! నన్ను పవిత్రుని గావించి రక్షింపుము. మూడు విధాలా నా చికేతాగ్నివి నీవు. త్రిపదప్రతిష్ఠ గాంచిన వాడవు. వేదాంగవేత్తవు. విషయాలకు అతీతుడవు. ముల్లోకాధిపతివి కళ్యాణ రూపివి, నీకు శరణాగతుడనైనాను. నా భయం పోగొట్టి నన్ను రక్షించుము. ఓ మంగళాకారా ! ఘోరశత్రుడైన కామునకు లొంగిపోయి నేను భయంకరమైన అపరాధం చేశాను. ఓ సర్వ భూతాధీశ్వరా ! గిరీశా ! నీకు శిరసా వందనం చేస్తున్నాను. నా యెడల ప్రసన్నుడవు కమ్ము ! నేను పాపిని, కరుడు గట్టిన పాపాన్ని, పాపంలోనుంచి పుట్టాను. నా ఆత్మ పాపపంకిలమైంది. అలాంటి నన్ను సర్వపాపహరుడవైన భవా ! ఈశానా ! రక్షింపుము! ప్రభూ! నీవే సర్వకారణుడవు. నన్నీవిధంగా పుట్టించావు. కనుక తండ్రీ ! నామీద కోపింపవద్దు. పాపాచారులుగా సృష్టించావు. నా పట్ల కరుణించుము. ప్రసన్నుడవుకమ్ము! నీవే కర్తవు, ధాతవు, జయానివి, మహాజయానివి ! శుభానివి నీవు ప్రణవ ఓంకారం నీవు ధ్రువమై క్షయంలేని తత్వానివి సర్వనియంతవు. బ్రహ్మవు నీవు, పాలించే విష్ణువునీవు; ఈశ్వరుడవు ఇంద్రుడవు వషట్కారానివి ధర్మానివి సర్వమూ దేవేదేవుడవైన నీవే ! సూక్ష్మానివి వ్యక్తానివి అవ్యక్తానివి అన్నీనీవే. స్థావరజంగమాత్మకమైన విశ్వాన్నంతా ఆవరించియున్న ఈశ్వరుడవు నీవే. నీవువిజయుడవు సహస్రనేత్రుడు విరూపాక్షుడవు మహాభుజుడవు అనంతుడవు సర్వవ్యాపివి ప్రాణస్వరూపివైన హంసవు. నీకు చ్యుతి లేదు. గీర్వాణుల నేతవు నీవు శాంతుడవు రుద్రుడవు, పశుపతివి. శివుడవు, త్రయీ (వేదాలు) వేద్యుడవు, త్రయీమయుడవు. క్రోధాన్ని జయించావు. యింద్రియ విజేతవు. అరిషడ్వర్గాన్ని జయించావు. ఓ జయరూపా త్రిశూలధరా! శరణుజొచ్చిన నన్ను రక్షించుము.''

పులస్త్య ఉవాచ :

ఇత్థం మహేశ్వరోబ్రహ్మన్‌ స్తుతో దైత్యాధిపేనతు | ప్రీతియుక్తః పింగశాక్షో హైరణ్యాక్షి మువాచహ. 67

సిద్ధో7సి దానవపతేః పరితుష్టో7స్మితే7ంధకః | వరం వరయ భద్రంతే యమిచ్ఛసి వినా7ంబికామ్‌. 68

అంధక ఉవాచ :

అంబికా జననీ మహ్యం భగవాంస్త్ర్యంబకః పితా | వందామి చరణౌమాతు ర్వందనీయామమాంబికా. 69

వరదో7సియదీశాన తద్యాతు విలయం మమ | శారీరం మానసం వాగ్జం దుష్కృతం దుర్విచింతితమ్‌. 70

తథామేదానవోభావో వ్యపయాతు మహేశ్వరః స్థిరా7స్తుత్వయి భక్తిస్తు వరమేతత్‌ ప్రయచ్చమే. 71

మహాదేవ ఉవాచ :

ఏవం భవతుదైత్యేంద్ర పావంతేయాతు సంక్షయమ్‌ | ముక్తో7సి దైత్య భావశ్చ భృంగీ గణపతిత్భవ. 72

ఇత్యేవముక్త్వావరదః శూలాగ్రాదవతార్యతమ్‌ | నిర్మృజ్యనిజహస్తేన చక్రేనిర్వ్రణ మంధకమ్‌. 73

తతః స్వదేహతోదేవాన్‌ బ్రహ్మాదీనాజుహావనః | తేనిశ్చేరుర్మహాత్మానో నమస్యంతస్త్రిలోచనమ్‌. 74

గణాన్‌ననందీనాహూయ సన్నివేశ్యతదాగ్రతః | భృంగినం దర్శయామాన ధ్రువం నైషో7ంధకేతిహి. 75

నద్యస్త్వమృత వాహిన్యో హ్రదాః పాయసకర్దమాః |

తందృష్ట్వా దానవపతిం సంశుష్కపి శితంరిపుమ్‌ | గణాధిపత్యమావన్నం ప్రశశంసుర్‌వృషధ్వజమ్‌. 76

తతస్తాన్‌ప్రాహ భగవాన్‌ సంపరిష్వజ్య దేవతాః | గచ్ఛధ్వంస్వానిధిష్ణ్యాని భుంజధ్వం త్రిదివంసుఖమ్‌. 77

సహస్రాక్షో7పి సంయాతు పర్వతం మలయం శుభమ్‌ | తత్రస్వకార్యం కృత్వైవ వశ్చాద్యాతుత్రివిష్టపమ్‌.

ఇత్యేవముక్త్వా త్రిదశాన్‌ సమాభాష్యవ్యసర్జయత్‌ | పితామహం సమస్కృత్య పరిష్వజ్య జనార్దనమ్‌ |

తేనినృష్టామహేశేన సురాజగ్ముస్త్రివిష్టపమ్‌. 79

మహేంద్రో మలయంగత్వా కృత్వాకార్యం దివంగతః | గతేషు శక్రప్రాగ్య్రేషు దేవేషు భగవాన్‌ శివః. 80

విసర్జయామాన గణా ననుమాన్యయథార్హతః | గణాశ్చశంకరం దృష్ట్వా స్వంస్వంవాహన మాస్థితాః. 81

జగ్ముస్తే శుభలోకాని మహాభోగాని నారదః | యత్ర కామదుమా గావః సర్వకామఫలాద్రుమాః. 82

పులస్త్యుడిలా చెప్పాడు : ఓ నారదా ! ఆ విధంగా దైత్యాధిపతి చేసిన స్తోత్రానికి సంతోషించి ఆ పింగళాక్షుడా హిరణ్యక్ష పుత్రునితో యిలా అన్నాడు. ''అంధకా! రాక్షసాధిపా ! నీవు సిద్ధుడవైనావు. నేను సంతోంషించాను. అంబిక దక్క మరేదైనా వరమడుగుము. ఇచ్చెదను నీకు భద్రమగుకాక!'' అదివిని అంధకుడు, ''ప్రభో! నేటినుండీ అంబిక నాకు తల్లి త్రినేత్రుడే తండ్రి. ఆ మాతృశ్రీ చరణారవిందాలకివే వందన శతాలు! ఓ ఈశ్వరా! వరదా! నేనింతవరకు మనసా వాచా చేసిన దుష్టాలోచనలు, దుర్భాషలు, శరీరంతోచేసిన దుష్కృత్యాలు అన్నీ విలయమై పోవునట్లనుగ్రహించుము. జన్మతః నాకు సంక్రమించిన దానవ భావం నశింపజేసి నీ పాదపద్మాలపట్ల అచంచలమైన భక్తిని ప్రసాదించు తండ్రి !'' అని ప్రార్థించాడు. అందులకు పరమశివుడు ప్రీతుడై అట్లే అగుగాక! నీపాపమంతా నశించి పోతుంది. నీలోని దైత్య బుద్ధి వదిలించి. నేటి నుండీ నీవు భృంగి అనుపేర గణాధిపతి వయ్యావని వరమిచ్చి త్రిశూలాగ్రాన్నుంచి క్రిందకుదించాడు. వాని శరీరంలోని వ్రణాలన్నింటీని తన చేతితో నిమిరి మాన్పి. ఆరోగ్యవంతుని చేశాడు. అంతవరకు తన శరీరంలో దాచుకొన్న బ్రహ్మాది దేవతల నందరను బయటకు రమ్మని పిలువగా ఆ మహానియులందరూ బయటకు వచ్చి ఆయనకు నమస్కరించారు. అంతట నాత్రిలోచనుడు నందితో సహా గణాలనందరనూ సమావేశపరచి వారలకు భృంగిని చూపి యితడు గణాధిపతి. వెనుకటి అంధకుడు కాడని కంఠోక్తి గావించాడు. గణాధిపత్యం పంపాదించి రక్తమాంసహీనుడై ఎండియున్న ఆ దానవేశ్వరుని చూచి అందరు నా వృషభద్వజుని ప్రశంసిచారు. అంతటనా గౌరీవల్లభుడా దేవతల నందరను ఆలింగనం చేసికొని ''మీమీ నెలవులకు వెళ్ళి సుఖ భోగాలనుభవించుడు, ఇంద్రుడు మాత్రం శుభంకరమైన మలయగిరికి వెళ్ళి తన కార్యం నిర్వర్తించుకొని ఆ మీద స్వర్గానికి వెళ్ళగలడని'' వారలకు వీడ్కోలు పలికాడు. పిమ్మట పితామహునకు నమస్కరించి జనార్దనుని కౌగిలించుకొని వీడ్కోలిచ్చాడు. వారంతట త్రివిష్టపానికి వెళ్ళిపోయారు. శతక్రతువు మలయగిరిలో తన కార్యం చక్కబెట్టుకొని దివికి వెళ్లిపోయాడు. అలా ఇంద్రాది దేవతలనందరను పంపివైచి భగవంతుడగు శివుడు ప్రమథ గణాలనందరను యథోచితంగా గౌరవించి అనుమతించగా వారందరు తమతమ వాహనముల మీద శుభ లోకాలకు వెళ్ళారు. నారదా! అక్కడవారు కామధేనువులు, కల్పవృక్షాలు, అమృతనదులు, వెన్నతెట్టెలు గట్టే పాలసరోపరాల మధ్య మహాభోగాలనుభవించారు.

నద్యస్త్వమృతవాహిన్యో హ్రదాఃపాయసకర్దమాః | స్వాంస్వాంగతిం వ్రయాతేషు వ్రమదేషు మహేశ్వరః 83

సమాదాయాంధకం హస్తే సనందిః శైలమభ్యగాత్‌ | ద్వాఖ్యాంవర్ష సహస్రాఖ్యాం పునరాగాద్దరోగృహమ్‌.

దదృశే చ గిరేః పుత్రీం శ్వేతార్కకుసుమస్థితామ్‌ | సమాయాతం నిరీక్ష్యై సర్వలక్షణ సంయుతమ్‌. 85

త్యక్త్వా7ర్కపుష్పం నిర్గత్య సఖీస్తాః సముపాహ్యయత్‌ |

సమాహుతాశ్చ దేవ్యాతా జయాద్యాస్తూర్ణ మాగమన్‌. 86

తాభిః పరివృతాతస్థౌ హరదర్శనలాలసా | తతస్త్రినేత్రోగిరిజాం దృష్ట్వా ప్రేక్ష్యచ దానవమ్‌ 87

నందినం చ తథాహర్ష దాలిలింగేగిరేః సుతామ్‌ | అథాహచైషదానస్తే కృతోదేవిః మయా7ంధకః. 88

పశ్యస్వ ప్రణతిం యాతం స్వసుతం చారుహాసినిః | ఇత్యుచ్చార్యాంధకం చైవ పుత్రఏహ్యేహిసత్వరమ్‌.

వ్రజస్వశరణం మాతు రేషాశ్రేయస్కరీతవ | ఇత్యుక్తోవిభునానందా అంధకశ్చగణశ్వరః 90

సమాగమ్యాంబికాపాదౌ వవందతురు భావపి అంధకో7పితదా గౌరీం భక్తినమ్రో మహామునే |

స్తుతించక్రే మహాపుణ్యాం పాపఘ్నీం శ్రుతి సంమితామ్‌. 91

అంధక ఉవాచ :

ఓంనమస్యే భవానీంభూతభవ్య ప్రియాంలోక ధాత్రీం స్కందమాతరం

మహాదేవ ప్రియాంధారిణీం.

స్యందినీం చేతనాం త్రైలోక్య మాతరం ధరిత్రీం దేవ

మాతరమథేజ్యాం శ్రుతింస్మృతిం దయాంలజ్జాంకాంతి

మగ్య్రా మసూయాం మతిం నదాపావనీం దైత్య సైన్యక్షయకరీమ్‌.

మహా మాయాం వైజయంతీం, సుశుభాం, కాల రాత్రిం, గోవింద భగినీం, శైల రాజ పుత్రీం,

సర్వ దేవార్చితాం, సర్వ భూతా ర్చితాం, విద్యాం సరస్వతీం, త్రినయన మహిషీం,

నమస్యామి మృడానీం, శరణ్యాం, శరణ ముపగతోహం నమో నమస్తే !!

ఇత్థం స్తుతా సా`Åòంధకేన పరితుష్టా విభావరీ|, ప్రాహ ''పుత్ర! ప్రసన్నాస్మి వృణుష్వ వర ముత్తమమ్‌ 90

భృంగి రువాచ -

''పాపం ప్రశమ మాయాతు త్రివిధం మమ పార్వతి ! తథేశ్వరే చ సతతం భక్తి రస్తు మమాంబికే. 91

పులస్త్య ఉవాచ -

బాఢ మిత్యబ్రవీ ద్గౌరీ హిరణ్యక్ష సుతం తతః | స చాస్తే పూజయన్‌ శర్వం గణానా మధిపోభవత్‌. 92

ఏవం పురా దానవ సత్తమం తం మహేశ్వరేణా థ విరూప దృష్ట్యా కృత్త్వైవ రూపం భయదం చ భైరవం,

భృంగిత్వ మీశేన కృతం స్వభక్త్యా. 93

ఏత త్తవోక్తం హర కీర్తి వర్ధనం, పుణ్యం పవిత్రం శుభదం మహర్షే! సంకీర్తనీయం ద్విజ సత్తమేషు,

ధర్మాయు రారోగ్య దనైషిణా సదా. 94

ఇతి శ్రీవామన పురాణ చతు శ్చత్వారింశోధ్యాయః 44

ఓం! శత సహస్ర ప్రణామాలు. భవానీ మాతకు..భూత భవిష్యాలలో లోక ప్రియం గావించే లోక ధాత్రికి, జనయిత్రికి, స్కందమాతకు, మహా దేవ ప్రియురాలికి నమస్సులు! సకలధారిణికి, క్షీర ప్రదాయినికి, చైతన్య రూపిణికి త్రిలోక జననికి వందనాలు! ఓ ధరిత్రీ, దేవమాతా, యజ్ఞరూపిణీ, వేద రూపిణీ, స్మృతి, దయా, లజ్ఞా, కాంతి రూపిణీ! క్రోధ అసూయారూపిణీ! మతీ! సదాపావనీ! దైత్యసైన్యనాశినీ, మహామాయా, వైజయంతీ! సుశుభా! కాళరాత్రీ! గోవింద సోదరీ, హిమవన్నగపుత్రీ, సర్వదేవ పూజితే! సర్వ భూత గణార్చితే! విద్యే! సరస్వతీ! త్రినేత్రజాయే! మృడానీ! సర్వశరణ్య! నీకు శరణాగతుడను. నన్ను రక్షించుము! నీకు నమస్సులు!'' అంధకుడిలా స్తోత్రం చేయగా సంతోషించి ఆ విభావరి, కాంతిమతి ''పుత్రా! లేలెమ్ము! సంతోషించాను. కావలసిన వరం కోరుకొమ'న్నది. అందుల కాభృంగి, ''ఓపార్వతి తల్లీ! త్రికరణాలానే చేసిన పాపాలు నశింపజేయుము. అంబికే! ఈశ్వర చరణాల పట్ల నాకు ఎల్లపుడు భక్తిస్థిరంగా ఉండునట్లనుగ్రహించు''మని ప్రార్థించగా నామె తథాస్తని ఆ హిరణ్యక్షపుత్రుణ్ణి దీవించింది. వాడు హరుని ఆరాధించి గణాధిపతి అయ్యాడు. 'ఓనారదా! ప్రాచీన కాలంలో విరూపాక్షుడైన పరమశివుడు మహోగ్రమైన భైరవరూపం దాల్చి అంధక మహాదైత్యుడి మద మణిచి, తన కత్యంత భక్తుడైన భృంగిగా మార్చిన ఈ అద్భుత గాధ నీకు వినిపించాను! ఇది పుణ్యప్రదమైనది; పవిత్రమైనది; కళ్యాణములు వర్షించునది; శివ భక్తిని వర్థిల్ల జేయునది; ఉత్తములగు బ్రాహ్మణులు, ధర్మము, ఆయురారోగ్య సంపత్తులు కాంక్షించు వారల సదా కీర్తించ దగినది. అని పులస్త్యుడు ముగించాడు. - 10

ఇది శ్రీ వామన మహాపురాణములో నలుబది నాల్గవ అధ్యాయము - 44

Sri Vamana Mahapuranam    Chapters