Sri Vamana Mahapuranam    Chapters   

ఏడవ అధ్యాయము

పులస్త్య ఉవాచ:

తతో7నంగం విభుర్దృష్ట్వా బ్రహ్మన్‌ నారాయణో మునిః |

ప్రహసై#్యవం వచః ప్రాహ కందర్బ ఇహ ఆస్యతామ్‌. 1

తదక్షుబ్ధత్వ మీక్ష్యాస్య కామో విస్మయ మాగతః | వసంతో7పి మహాచింతాం జగామాశు మహామునే. 2

తతశ్చాప్సరసో దృష్ట్వా స్వాగతేనాభిపూజ్యచ | వసంతమహ భగవానే హ్యేహి స్థీయతా మితి. 3

తతో విహస్య భగవాన్‌ మంజరీం కుసుమావృతమ్‌|

ఆదాయ ప్రాక్సువర్ణాంగీం ఊర్వోర్బాలాం విననిర్మమే. 4

ఊరూద్భవాం సకందర్పో దృష్ట్వా సర్వాంగ సుందరీమ్‌|

అమన్యతతదా7నంగః కిమియం సా ప్రియా రతిః. 5

పులస్త్యవచనము: నారదాః అనంతరం సమర్థుడైన నారాయణ ఋషి కాముని చూచినవ్వుచు, 'కందర్పా! వచ్చియిచ్చట కూర్చొను' మనెను. ఆ మహర్షి స్థైర్యమునకు మన్మథుడు బెదరిపోయెను. మునీ ! వసంతుడు కూడ ఎంతో విచారానికిలోనైనాడు. తర్వాత స్వాగత వాక్యాలతో అప్సరసలను సంభావించి నారాయణుడు వసంతుని కూడ తన సమీపమున కూర్చుండ బెట్టుకొనెను. అంతట నవ్వుచు ఆ మహర్షి ఒక పుష్పమంజరి తీసికొని దానితో తన తొడ (ఊరు) మీద సర్వాంగ సుందరియగునొక స్త్రీయాకృతి నిర్మిచి దానికి ప్రాణము పోసెను. అట్లు ఆ ఋషి ఊరవు నుండి వెలవడిన ఆ అందాలరాశిని చూచి మన్మథుడదరిపడి ఈమె నాభార్యయగు రతియా యనుకొనెను.

తదేవ వదనం చారు స్వక్షి భ్రూకుటిలాలకమ్‌ | సునాసా వంశాధరోష్ట మాలోకనపరాయణమ్‌. 6

తావేవాహార్యవిరతౌ పీవరౌ మగ్నచూచుకౌ | రాజేతే7స్యాః కుచౌ పీనౌ సజ్జనావివ సంహతౌ. 7

తదేవ తనుచార్వంగ్యా వళిత్రయ విభూషితమ్‌ | ఉదరం రాజతే శ్లక్‌ష్ణం రోమావళి విభూషితమ్‌. 8

రోమావళీచ జఘనా ద్యాంతీ స్తనతటం త్వియం | రాజతే భృంగమాలేవ పులినాత్‌ కమలాకరమ్‌. 9

'అదే మొగము. అవే ఆందమైన కనులు, కనుబొమలు, ముంగురులు. అదే అందమైన నాసిక, వంశం, అవే చక్కని అధరోష్ఠాలు. ఎంత చూచినా తనివి తీరదు. ఇద్దరు సత్పురుషుల వలె పరస్పరం ఒరుసుకొని చక్కని చూచుకములతో చిక్కగా మాంసలములుగా నున్న చన్నులు. మూడు వళులతో సన్నగానున్న నడుము, లేత నూగారుతో అందమైన ఉదరం. దాని మీదస్తన భాగం వరకుపైకి వ్యాపించిన రోమావళి, సరోవరం ఒడ్డునుండి వికసించిన తామర పూలకు ఎగబ్రాకే తుమ్మెద గుంపులాగా శోభిల్లుతోంది.

జఘనం త్వతివిస్తీర్ణం భాత్యస్యా రశనావృతమ్‌ | క్షీరోదమథనే నద్దం భుజంగేనేవ మందరమ్‌. 10

కదళీస్తంభసదృశై రూర్ద్వమూలై రథోరుభిః | విభాతి సా సుచార్వంగీ పద్మకింజల్కసంనిభా. 11

జానునీ గూఢగుల్ఫేచ శుభే జంఘే త్వరోమశే | పిభాతో7స్యా స్తథా పాదా వలక్తకసమత్విషౌ. 12

ఇతి సంచింతయన్‌ కామ స్తామనిందితలోచనామ్‌ | కామాతురో7సౌ సంజాతః కిముతాన్యో జనో మునే. 13

ఒడ్డాణంతో వెలుగొందే ఈమె జఘన ప్రదేశం క్షీరసాగర మథన వేళ వాసుకిచే చుట్టబడిన మందర పర్వంతంలాగ ఉన్నది. తలక్రిందుగా నుంచబడిన కదళీకాండముల వంటినునుపైన తొడలు. పద్మ కేసరాల వంటి గౌరవర్లంతో శోభిల్లు తోంది. రోమరహితాలయిన మోకాళ్ళు, పుష్టమైన మడములు, లత్తుక రంగు పాదములు ఓహో ఎంత అందంగా ఉన్నవి! నారదా! ఈ విధంగా మన్మథుడంతటి సుందరుడే ఆ సుందరి శోభకు ముగ్ధుడుకాగా నితరుల మాట వేరే చెప్పవలెనా?

మాధవో7ప్యుర్వశీం దృష్ట్వా సంచింతయతనారద | కింస్విత్‌ కామనరేంద్రస్య రాజధానీ స్వయంస్థితా. 14

ఆయాతా శశినో నూన మియం కాంతిర్నిశాక్షయే | రవిరశ్మిప్రతాపార్తిభీతా శరణమాగతా. 15

ఇత్థం సంచింతయన్నేవ అవష్టభ్యాప్సరోగణమ్‌ | తస్థౌ మునిరివధ్యాన మాస్థితః సతుమాధవః . 16

తతః సవిస్మితాన్‌ సర్వాన్‌ కందర్పాదీన్‌ మహామునే |

దృష్ట్వా ప్రోవాచ వచనం స్మితం కృత్వా శుభవ్రతః. 17

ఇయం మమోరుసంభూతా కామాప్సరస మాధవ | నీయతాం సురలోకాయ దీయతాం వాసవాయచ. 18

ఇత్యుక్తాః కంపమానాస్తే జగ్ముర్గృహ్యోర్వశీం దివమ్‌ | సహస్రాక్షాయతాంప్రాదాద్‌ రూప¸°వనశాలినీమ్‌.

అచక్షుశ్చరితంతాభ్యాం ధర్మజాభ్యాం మహామునే | దేవరాజాయ కామాద్యా స్తతో7భూ ద్విస్మయఃపరః . 20

ఏతాదృశం హిచరితం ఖ్యాతిమగ్ర్యాం జగామహ | పాతాలేషు తథామర్త్యే దిక్ష్వష్టాసు జగామచ. 21

ఇక వసంతుడో, ఆమెను చూచి; ఇది మన్మథనృపతి రాజధాని కాదుగదా ! లేక రాత్రి గడచి పోవుటతో సూర్యకిరణతాపానికి భయపడి శరణాగతమైన చంద్రజ్యోత్స్నయా ? ఈ విధంగా వితర్కించుచు, అప్సరల నపవారించి, వసంతుడు మౌనివలె ధ్యానమగ్ను డాయెను. మహామునీ! ఈ విధంగా ఆ స్త్రీ సౌందర్యానికి ముగ్దులై నిలచిన మన్మథ వసంత అప్సరసలను చూచి పుణ్యవ్రతుడైన నారాయణముని నవ్వుతూ - కామా ! వసంతా! అప్సరసలారా! ఈ అప్సరస నా తోడనుండి పుట్టినది. దీనిని మీరు తోడుకొనిపోయి మీ దేవే ద్రునికి సమర్పించుడనెను. ఆ మహర్షి మాటలకు భయకంపితులై మరుమాటాడక మన్మథాదులా యూర్వశిని తీసికొని స్వర్గమునకు వెడలిపోయి యింద్రునకా యిరువురు ధర్మపుత్రుల (నరనారాయణుల) ఉదంతము నివేదించిరి. అది విని దేవేంద్రుడాశ్చర్యపడెను. నరనారాయణుల ఆ అద్భుతగాథ మర్త్య పాతాళాలలో దిగ్దిగంతాలలో వ్యాపించినది.

ఏకదా నిహతేహరౌద్రే హిరణ్యకశిపౌ మునే | అభిషిక్త స్తదారాజ్యే ప్రహ్లాదోనామ దానవః. 22

తస్మిన్శాసతి దైత్యేంద్రే దేవబ్రాహ్మణవూజకే | మఖానిభువిరాజానో యజంతే విధివత్తదా. 23

బ్రహ్మణాశ్చ తపోధర్మం తీర్థయాత్రాశ్చ కుర్వతే | వైశ్యాశ్చ పశువృత్తిస్థాః శూద్రాః శుశ్రూషణరతాః . 24

చాతుర్వర్ణ్యం తతః స్వేస్వే ఆశ్రమే ధర్మకర్మణి | ఆవర్తతతతో దేవా వృత్త్యాయుక్తాభవన్‌ మునే. 25

మునీ! ఒకనాటి విషయము. మహాక్రూరుడైన హిరణ్యకశిపు వధానంతరం ప్రహ్లాదుడను దానవుడు రాజ్యా భిషిక్తుడాయెను. దేవ బ్రాహ్మణ పూజకుడైన ఆ దైత్యేంద్రుని పాలనలో భూమి యందలి రాజులందరు విధ్యుక్తంగా యజ్ఞాదులాచరించిరి. బ్రాహ్మణులు తపోధ్యయన తీర్థయాత్రాది ధర్మ కార్యనిరతులై యుండిరి. వైశ్యులు పశుపాలన వాణిజ్యాదులు శూద్రులు సేవాధర్మము నెరపుచుండిరి. ఆ విధంగా నాలుగు వర్ణాలవారు తమతమ ధర్మాచరణ నిరతులు కాగా దేవతలు కూడ తమ తమ వృత్తుల నిర్వర్తించుచుండిరి.

తతస్తు చ్యవనో నామ భార్గవేంద్రో మహాతపాః | జగామ నర్మదాంస్నాతుం తీర్థంచైవాకులీశ్వరమ్‌. 26

తత్రదృష్ట్వా మహాదేవం నదీంస్నాతుమవాతరత్‌ | అవతీర్ణం ప్రజగ్రాహ నాగః కేకరలోహితః. 27

గృహీతస్తేననాగేన సస్మారమనసాహరిమ్‌ | సంస్మృతే పుండరీకాక్షే నిర్విషో7భూ న్మహోరగః. 28

ఆ సమయాన నొకనాడు బ్రాహ్మణ శ్రేష్ఠుడు భార్గవ వంశీయుడు మహా తపోధనుడైన చ్యవన మహర్షి నర్మదా తీరాన అకులీశ్వర తీర్థంలో స్నానము చేయబోయెను. మహాదేవ దర్శనానంతరం స్నానార్థం నదిలోకి దిగిన వెంటనే ఆ మునిని ఒక గోధుమ వన్నె సర్పము పట్టుకొనెను. సర్పగ్రస్తుడైన ఆ ముని మనసార విష్ణువును స్మరించగా వెంటనే ఆ నాగము విషరహితమాయెను.

నీతస్తేనాతిరౌద్రేణ పన్నగేన రసాతలమ్‌ | నిర్విషశ్చాపి తత్యాజ చ్యవనం భుజగోత్తమః. 29

సంత్యక్తమాత్రో నాగేన త్యవనో భార్గవోత్తమః | చచార నాగకన్యాభిః పూజ్యమానః సమంతతః. 30

విచరన్‌ ప్రవివేశాథ దానవానాం మహత్పురమ్‌ | సంపూజ్యమానో దైత్యేంద్రైః ప్రహ్లాదో7థ దదర్శతమ్‌. 31

భృగుపుత్రేమహాతేజాః పూజాంచక్రే యథార్హతః | సంపూజితోపవిష్టశ్చ పృష్టశ్చాగమనం ప్రతి. 32

సచోవాచ మహారాజః మహాతీర్ధం మహాఫలం | స్నాతుమేవాగతో7స్మ్యద్య ద్రష్టుం చైవాకులీశ్వరమ్‌. 33

నద్యామేవాతీర్ణో7స్మి గృహీతశ్చాహినాబలాత్‌ | సమానీతో7స్మిపాతాళే దృష్టశ్చా దృష్టశ్చా త్రభవానపి. 34

ఏతచ్ఛ్రుత్వాతువచనం చ్యవనస్యదితీశ్వరః | ప్రోవాచధర్మసంయుక్తం సవాక్యం వాక్యకోవిదః. 35

అంతట ఆ పామా ఋషిని లాగికొని పాతాళమునకు గొనిపోయివదలెను. అచట నామహర్షి నాగకన్యల పూజ లందుకొనుచు నలువైపుల తిరుగుసాగెను. ఆ విధంగా తిరుగుతూ దానవుల యొక్క విశాలమైన నగరంలో ప్రవేశించెను. అక్కడ దైత్యజన పూజ్యుడైన ప్రహ్లాదుడా మునిని చూచెను. మహాతేజస్వి యగు ప్రహ్లాదుడా మహర్షిని యథా విధిగా పూజించి ఆయన వచ్చిన కారణమడిగెను. ఆ మహర్షి, 'ఓ దైత్యేంద్రా ! మహా ఫలప్రదమైన మహాతీర్థ స్నానము, మహేశ్వరుడగునకులీశ్వర దర్శనార్థినై నేడు బయలుదేరితిని. నీట అడుగుపెట్టగనే ఒక నాగమునన్ను గట్టిగాపట్టుకొని ఈపాతాళమునకు గొని తెచ్చినది ఇచట మిమ్ము చూడగలిగితి ననెను. వాక్యవిశారదుడైన ప్రహ్లాదుడంతట చ్యవనునితో ధర్మసంయుక్త ముగ నిట్లనెను.

ప్రహ్లాద ఉవాచ :

భగవన్‌ కానితీర్థాని పృథివ్యాం కానిచాంబరే | రసాతలేచకానిస్యు రేతద్‌ వక్తుం మమార్హసి. 36

ప్రహ్లాదవచనము: "భగవన్‌! ఈ పృథ్వి ఆకాశ పాతాళములలోనే యే పవిత్ర తీర్థములు గలవో దయచేసి ఆనతీయుడు".

చ్యవన ఉవాచ :

పృథివ్యాం నైమిషంతీర్థ మంతరిక్షేచ పుష్కరమ్‌ | చక్రతీర్థం మహాబాహోః రసాతలతలేవిదుః. 37

చ్యవనవచనము: "ఓ మహావీరా ! భూలోకంలో నైమిషం, ఆకాశంలో పుష్కరం. పాతాళంలో చక్రతీర్థం ప్రసిద్ధమైనవి.

పులస్త్య ఉవాచ:

శ్రుత్వా తద్భార్గవవచో దైత్యరాజో మహామునే | నైమిషం గంతుకామస్తు దానవా నిదమబ్రవీత్‌. 38

ప్రహ్లాద ఉవాచ :

ఉత్తిష్ఠధ్వం గమిష్యామః స్నాతుంతీర్థం హి నైమిషమ్‌ | ద్రక్ష్యామః పుండరీకాక్షం పీతవాసస మచ్యుతమ్‌. 39

పులస్త్య ఉవాచ:

ఇత్యుక్తా దానవేంద్రేణ నర్వేతే దైత్యదానవాః | చక్రురుద్యోగమతులం నిర్జగ్ముశ్చరసాతలాత్‌. 40

తేసమభ్యేత్యదైతేయా దానవాశ్చమహాబలాః | నైమిషారణ్యమాగత్య స్నానం చక్రుర్ముదాన్వితాః. 41

తతోదితీశ్వరఃశ్రీమాన్‌ మృగవ్యాంసచచారహ | చరన్‌ సరస్వతీంపుణ్యాం దదర్శవిమలోదకామ్‌. 42

తస్యాదూరేమహాశాఖం శాలవృక్షంశ##రైశ్చితమ్‌ | దదర్శబాణానపరాన్‌ ఖేసంలగ్నాన్‌పరస్పరమ్‌. 43

పులస్త్యవచనము: మహామునీ ! భార్గవుని మాటవిన్నంతనే దైత్యపతి ప్రహ్లాదుడు నైమిషారణ్యము వెళ్లు కోరిక కలిగి ఆ విషయం దానవుల కెరింగించెను.

ప్రహ్లాదవచనము: లెండు ! మనమందరము నైమిషతీర్థానికి వెళ్ళి స్నానం చేసి అచట పీతాంబరధరుడు కమలలోచనుడు నగు నచ్యుతుని దర్శింతము.

పుస్త్యవచనము: తమ ప్రభువు మాటలు విని దైత్యదానవులందరు రసాతలము నుండి బయలు వెడలి మహా సంరంభముతో నైమిషారణ్యమును చేరి సంతోషముతో స్నానములు గావించిరి. తర్వాత దైత్యరాజు ప్రహ్లాదుడు మృగయా వినోదము కొరకై అరణ్యములో తిరుగసాగెను. అట్లు తిరుగుచు దానిలో నిర్మలోదకయగు సరస్వతీ నదిని దర్శించెను. ఆ ప్రక్కనే బాణములతో సందులేకుండ వేధింపబడిన గొప్ప శాఖలు గల ఒక సాల వృక్షాన్ని చూచెను. ఆ బాణములు పరస్పర మొకదాని ముఖమును కొకటి అంటుకొని యుండెను.

తతస్తానద్బుతాకారన్‌ బాణాన్‌ నాగోపవీతకాన్‌ | దృష్ట్వా7తులంతదాచక్రే క్రోధందైత్యేశ్వరః కిల. 44

సదదర్శతతో7దూరా త్కృష్ణాజినధరౌమునీ | సమున్నతజటాభారౌ తపస్యాసక్తమానసౌ. 45

తయోశ్చపార్శ్వయోర్దివ్యే ధనుషీలక్షణాన్వితే | శార్‌జ్గమాజగవం చైవ అక్ష¸°్యచ మహేషుదీ. 46

తౌదృష్ట్వా7మన్యతతదా దాంభికావితిదానవః | తతః ప్రోవాచవచనం తావుభౌపురుషోత్తమౌ. 47

అద్భుతాకారాలతో నాగములచే చుట్టబడిన ఆ బాణముల చూడగనే ప్రహ్లాదునకు చాలా కోపము కలిగెను. అక్కడకు దూరంగా ఆతడు నల్లని లేడి చర్మాలు ధరించి దీర్ఘజటలతో నొప్పియున్న ఇరువురు తపస్వులను చూచెను. వారల ప్రక్క చక్కని లక్షణములతో నొప్పియున్న శార్‌జ్గము అజగపమనే రెండు దివ్య ధనుస్సులను పెద్దవగు అక్షయ తూణీరములను కనుగొనెను. ఆ విధంగా కనుపించిన వారలను చూచి దంభు (దొంగ సన్యాసు) లని ఎంచి ఆ పురుషోత్తములతో నిట్లనెను.

కింభవద్భ్యాంసమారబ్ధం దంభంధర్మ వినాశనమ్‌ | క్వతపః క్వ జటాభారః క్వచేమౌ ప్రవరాయుధౌ. 48

అథోవాచనరోదైత్యం కాతేచింతాదితీశ్వర | సామర్థ్యేసతియఃకుర్యాత్‌ తత్సంపద్యేతతస్యహి. 49

అథోవాచదితీశస్తౌ కాశ క్తిర్యువయోరిహ | మయితిష్ఠతిదైత్యేంద్యే ధర్మ సేతుప్రవర్తకే. 50

నరస్తంప్రత్యువాచాథ ఆవాభ్యాం శక్తిరూర్జితా | నకశ్చిచ్ఛక్నుయాద్‌ యోద్దుం నరనారాయణౌయుధి. 51

"మీరు ధర్మ వినాశకరములయిన యిలాంటి దాంభిక కృత్యము లేల చేయుచున్నారు? మీ ఈతపస్సు లెక్కడ? జడలు కట్టిన వేషాలెక్కడ? ఈ దివ్యాస్త్ర శస్త్రాలెక్కడ? అందులకు నరుడిట్లు సమాధానము చెప్పెను. "దైత్యేంద్రాః నీవెందులకు బాధపడెదవు ? సమర్థుడైన వాడు ఏ పని చేసిన నదేవానికి శోభనూ గౌరవాన్ని కల్గిస్తుంది. అంత ప్రహ్లాదుడిట్లనెను: 'ధర్మసేతు స్థాపనకు కంకణం కట్టిన దైత్యరాజును నేనుండగా మీరేమి చేయగలరు? అందులకు నరుడు - మాకు కావలసినన్ని శక్తి సామర్థ్యాలున్నవి. నరనారాయణులమైన మాతో ఎవ్వరూ యుద్ధము చేయలేరు.

దైత్యేశ్వరః తతః క్రుద్ధః ప్రతిజ్ఞామారురోహ చ | యథాకథంచిజ్ఞేష్యామి నరనారాయణౌరణ. 52

ఇత్యేవముక్త్వా వచనంమహాత్మా దితీశ్వరః స్థాప్యబలం వనాంతే |

వితత్యచాపం గుణమావికృష్య తలధ్వనిం ఘోరతరం చకార. 53

తతోనరస్త్వాజగవంహి చాప మానమ్యబాణాన్‌ సుబహూన్‌ శితాగ్రాన్‌|

ముమోచతానప్రతిమైః పృష్కత్కై శ్చిచ్ఛేదదైత్య స్తపనీయంపుభైః. 54

ఛిన్నాన్‌ సమీక్ష్యాథనరఃపృషత్కాన్‌ దైత్యేశ్వరేణాప్రతిమేనసంఖ్యే |

క్రుద్ధఃసమానమ్య మహాధనుస్తతో ముమోచచాన్యన్‌ వివిధాన్‌ పృషత్కాన్‌. 55

ఏకంనరోద్వౌ దితిజేశ్వరశ్చ త్రీన్‌ ధర్మ సూనుశ్చతురోదితీశః |

నరస్తుబాణాన్‌ ప్రముమోచ పంచ షడ్‌ దైత్యనాథోనిశితాన్‌ పృషత్కాన్‌. 56

సప్తర్షిముఖ్యో ద్విచతుశ్చదైత్యో నరస్తుషట్‌ త్రీణి చ దైత్యముఖ్యే |

షట్‌ త్రీణిచైకం చ దితీశ్వరేణ ముక్తాని బాణానినరాయ విప్ర. 57

ఏకంచషట్‌ పంచ నరేణ ముక్తా స్త్వష్టౌశరాః సప్తచ దానవేన |

షట్‌ సప్తచాష్టౌ నవషణ్న రేణ ద్విసప్తతిం దైత్యపతిఃససర్జ. 58

ఆ మాటలకు క్రుద్ధుడైన దైత్యేశ్వరుడెట్లైనను సరియే నరనారాయణులను సంగ్రామంలో నిర్జించితీరెదనని ప్రతినబూనెను. అంతట ఆ దైత్యపతి తన సేనలను అరణ్యపు టెల్లల నిలిపివేసి తానొక్కడే వెళ్లి వారలను యుద్ధమునకు రమ్మని ధనుష్టంకారముగావించెను. ఆ కఠోరరవం విని నరుడు తన అజగవచాపాన్ని ఎక్కుపెట్టి వాడియైన బాణాలను పెక్కింటిని శత్రువుపై వదలెను. దైత్యేశ్వరుడు వానినన్నింటిని తన బంగారు రెక్కలు గల బాణాలతో ఖండించివైచెను. తన బాణాలను దైత్యుడు ఖండించుట చూచి క్రుద్ధుడైన నరుడు తన మహాధనువును ఎక్కుపెట్టి రకరకాల బాణాలు గుప్పించసాగెను. నరుడు వేసిన ఒక్కొక్క బాణానికి రెండేసి బాణాలతో దైత్యపతి బదులొసగెను. నరుడు మూడు బాణాలు వేయగా నతడు నాలుగు వేసెను. ఐదు వేయగా నారు తీవ్రశరాలను గుప్పించెను. ఋషీశ్వరుడు ఏడు బాణాలు వేయగా రాక్షసు డెనిమిది ప్రయోగించెను. నరుని తొమ్మిది బాణాలకు పదినారాచములతో బదులొసగెను. నరుడు పండ్రెండు వేయగా దైత్యుడు పదనైదు ప్రయోగించెను. తర్వాత నరుని ముప్పదియారు శరాలను éడెబ్బది రెండు శరాలతో వమ్మొనర్చెను.

శతంనరఃత్రీణిశతానిదైత్యః షడ్‌ ధర్మపుత్రో దశ##దైత్యరాజః |

తతో7ప్యసంఖ్యేయతరాన్‌ హిబాణాన్‌ ముమోచతుస్తౌ సుభృశంహికోపాత్‌. 59

తతో నరో బాణగణౖర సంఖ్యై రవాస్తరద్భూమిమథో దిశః ఖమ్‌| 59

సచాపిదైత్యప్రవరఃపృషత్కై శ్చిచ్ఛేదవేగాత్‌ తపనీయపుంఖైః. 60

తతఃపతత్రిభిర్వీరౌ సుభృశంనరదానవౌ | యుద్ధేవరాసై#్త్రర్యుధ్యేతాం ఘోరరూపైః పరస్పరమ్‌. 61

తతస్తుదైత్యేనవరాస్త్రపాణినా చాపేనియుక్తంతుపితామహాస్త్రమ్‌ |

మహేశ్వరాస్త్రం పురుషోత్తమేన సమంసమాహత్వని పేతతుస్తౌ. 62

బ్రహ్మాస్త్రేతు ప్రశమితే ప్రహ్లాదః క్రోధమూర్ఛితః | గదాం ప్రగృహ్య తరసా ప్రచస్కంద రథోత్తమాత్‌.

గదాపాణిం నమాయాంతం దైత్యం నారాయణస్తదా |

దృష్ట్వా7థపృష్ఠతశ్చ క్రే నరం యోద్దుమనాః స్వయం. 64

తతో దితీశః సగదః సమాద్రవత్‌ సశార్‌ఙ్గపాణిం తపసాంనిధానమ్‌|

ఖ్యాతంపురాణర్షి ముదారవిక్రమం నారాయణం నారద లోకపాలమ్‌. 65

ఇతి శ్రీ వామన మహాపురాణ సప్తమో7ధ్యాయః.

నరుడు నూరు బాణములు ప్రయోగింపగా దైత్యవల్లభుడు మున్నూరు నారాచముల వదలెను. అంతట ధర్మ పుత్రుడు ఆరువందలు బాణములు వేయగా రాక్షసపతి వేయి నారాచముల గుప్పించెను. అనంతరం క్రోధోన్మత్తులై వారు ఉభయులూ అసంఖ్యాకాలుగా బాణాలు పరస్పరం వర్షింపసాగిరి. అంతట నరుడు తన శరపరంపరలతో భూమ్యాకాశాలను దశదిశలను ముంచెత్తగా నిమేషకాలంలోనే ఆదైత్య వల్లభుడు స్వర్ణపక్షాలతో ప్రకాశించేతన బాణాలతో వానినన్నింటిని ముక్కలుగావించెను. ఈ విధంగా ఆవీరులిరువురు మహాసాహసంతో రకరకాలయిన శ్రేష్ఠ యుద్ధ సాధనాలతో భయంకరమైన సంగ్రామంకావించిరి. అంతట మహాక్రోధంతో రాక్షసరాజు బ్రహ్మాస్త్రం సంధించగా పురుషోత్తముడగు నరుడు పాశుపతాన్ని ప్రయోగించెను. ఆ రెండు అమోఘాస్త్రాలు పరస్పరంతాడించుకొని క్రిందబడిపోయినవి. తన బ్రహ్మాస్త్రం విఫలమవడంతో కోపంతో మండిపడి ప్రహ్లాదుడు భయంకరమైన గదచేబూని రథమునుండి క్రిందకుదూకెను. గదాపాణియైన నరునిపై బడనున్న దైత్యుని చూచి తాను యుద్ధము చేయనెంచి నరుని వెనుకకు నెట్టివైచెను. అంతట నారాక్షసపతి గదాదండంతో, పరమతపోధనుడు, శార్జపాణి, ఉదార విక్రముడు, లోకపాలకుడు, పురాణ మహర్షి అయిన నారాయణుని వెంబడించెను.

ఇది శ్రీ వామన మహా పురాణమునందలి ఏడవ అధ్యాయము సమాప్తము.

Sri Vamana Mahapuranam    Chapters