Sri Vamana Mahapuranam    Chapters   

ముప్పది ఎనిమిదవ అధ్యాయము

దండ ఉవాచ :

చిత్రాంగదయా స్త్వరజే తత్రసత్యాయథా సుఖమ్‌ | స్మరంత్యాః సురథంవీరం మహాన్కాలః సమభ్యగాత్‌. 1

విశ్వకర్మా7పి మునినా శప్తోవానరతాం గతః | న్యపతన్మేరుశి ఖరాత్‌ భూపృష్టం విధిచోదితః. 2

వనంఘోరం సుగుల్మాడ్యం నదీం శాలూకినీమను | శాల్వేయం పర్వతశ్రేష్ఠం సమావసతి సుందరి. 3

తత్రాసతో7న్య నుచిరం ఫలమూలాన్యథాశ్నతః | కాలో7త్యగాద్‌ వరారోహే బహువర్ష గణోవనే. 4

ఏకదాదైత్య శార్ధూలః కందరాఖ్యః సుతాంప్రియామ్‌ | ప్రతిగృహ్య సమభ్యాగాత్‌ ఖ్యాతాందేవ వతీమితి. 5

తాంచతద్వన మాయాంతీం సమంపిత్రావరాననామ్‌ | దదర్శ వానర శ్రేష్ఠః ప్రజగ్రాహ బలాత్‌ కరే. 6

తతోగృహీతాం కపినా సదైత్యః స్వసుతాంశుభే | కందరోవీక్ష్య సంక్రుద్దః ఖడ్గముద్యమ్య చాద్రవత్‌. 7

తమాపతంతం దైత్యేంద్రం డృష్ట్వా శాఖామృగోబలీ | తథైవ సహచార్వంగ్యా హిమాచలము పాగతః. 8

దదర్శచ మహాదేవం శ్రీకంఠం యమునాతటే | తస్యావిదూరే గహన మాశ్రమం ఋషివర్జితమ్‌. 9

తస్మిన్‌ మహాశ్రమేపుణ్య స్థాప్యదేవవతీం తపిః | న్యమజ్ఞత నకాళింద్యాం పశ్యతో దానవస్యహి. 10

సో7జానత్తాం మృతాంపుత్రీం సమంశాఖా మృగేణహి | జగామచ మహాతేజాః పాతాళం నిలయంనిజమ్‌. 11

సచాపివానరో దేవ్యా కాళింద్యా వేగతోహృతః | నీతః శివీతి విఖ్యాతం దేశం శుభజనావృతమ్‌. 12

తతస్తీర్త్వా7థ వేగేన సకపిః పర్వతంప్రతి | గంతుకామోమహాతేజా యత్రన్యస్తా సులోచనా. 13

దండుడిలా అన్నాడు : ఓ ఆరజా ! ఆ చిత్రాంగద అక్కడ వీరుడైన సురథుడ్ని స్మరిస్తూచాలాకాలం ఉండిపోయింది. దైవోపహతుడై విశ్వకర్మ మునిశాపంవల్ల భయంకరాకారంతో వానరుడై మేరుశిఖరాన్నుంచి భూమ్మీద శాలూకినీ నదీతీరాన శాల్వేయ పర్వతం వద్దభయంకరారణ్యంలో పడిపోయాడు. అక్కడ కందమూల ఫలాలు తింటూ అనేక సంవత్సరాలు గడిపాడు. ఒక పర్యాయం కందరుడు దైత్యశ్రేష్టుడు దేవపతిగా ప్రసిద్ధిగాంచిన తన ప్రియ పుత్రికను వెంట బెట్టుకని అక్కడకు వచ్చాడు. తండ్రితో కలిసివస్తున్న ఆ చంద్రముఖిని చూచి ఆ వానర శ్రేష్ఠుడు బలవంతంగా ఎత్తుకొని పోయాడు. తన కుమార్తె నతడు హరించుకొని పోవుటచూచి మండిపడి ఆ కందరుడు కత్తిదుసి వానిని వెంబడించాడు. తనమీదకు దూకుతున్న దైత్యుని చూచి ఆ కపి దేవవతితో హిమాచలానికి పారిపోయాడు. అక్కడ యమునా తీరాన శ్రీకంఠేశ్వరుని అక్కడకు సమీపంలో ఋషివలెనటువంటి శూన్యాశ్రమాన్ని చూచి ఆ పవిత్రాశ్రమం లోపల వేదవతిని ఉంచి తాను ఆ రాక్షసుడు చూస్తుండగా కాళిందీ జలాల్లో మునిగిపోయాడు. అంత నా దానవుడు వానరంతోబాటు తన కుమార్తె కూడా నదిలో మునిగి చనిపోయిందని భావించి నిరాశుడై తనపాతాళానికి వెళ్ళిపోయాడు. ఆ వానరుడావిధంగా కాళిందీ ప్రవాహంలో కొట్టుకొనిపోయి సజ్జనులకావాసమై 'శివి' అనే దేశం చేరాడు. అక్కడ నీళ్ళల్లో నుండి బయటపడి దేవవతిని వదలి వచ్చినచోటకు వెళ్ళాలని త్వరగా బయలుదేరాడు.

అథాపశ్యత్‌ సమాయాంత మంజనంగుహ్య కోత్తమం |

నందయంత్యా సమంపుత్ర్యా గత్వాజిగమిషుఃకపిః . 14

తాందృష్ట్వా7మన్యత శ్రీమాన్‌ సేయం దేవవతీ ధ్రువమ్‌ | తన్మేవృథాశ్రమో జాతో జలమజ్జన సంభవః. 15

ఇతిసంచింతయన్నేవ సమాద్రవత సుందరీమ్‌ | సాతద్బయాచ్ఛన్యపత న్నదీం చైవహిరణ్వతీమ్‌. 16

గుహ్యకోవీక్ష్యతనయాం పతితామాపగాజలే | దుఃఖశోక సమాక్రాంతో జగామాంజన పర్వతమ్‌. 17

తత్రాసౌతవ ఆస్థాయ మౌనవ్రతధరః శుచిః | సమాస్తే వై మహాతేజాః సంవత్సరగణాన్‌ బహూన్‌ . 18

నందయంత్యపివేగేన హిరణ్యత్యా7పవాహితా | నీతాదేశం మహాపుణ్యం కోశలం సాధుభిర్యుతమ్‌. 19

గచ్చంతీ సాచరుదతీ దదృశేవటపాదవమ్‌ | ప్రరోహప్రావృతతనుం జటాధర మినేశ్వరమ్‌. 20

తందృష్ట్వా విపులచ్ఛాయం విశశ్రామ వరాననా | ఉపవిష్ణా శిలాపట్టే తతోవాచం ప్రశుశ్రువే. 21

నసోస్తి పురుషః కశ్చి ద్యస్తంబ్రూయాత్త పోధనమ్‌ | యథాసతనయస్తుభ్య ముద్భుద్దోవటపాద పే. 22

సాశ్రుత్వాతాం తదావాణీం వి స్పష్టాక్షర సంయుతామ్‌ | తిర్యగూర్ద్వమ ధశ్చైవ నమంతాదవలో కయన్‌. 23

దదృశే వృక్షశిఖరే శిశుంపంచాబ్దికం స్థితమ్‌ | పింగళాభిర్జటాభిస్తు ఉద్బద్దం యత్నతః శుభే. 24

తం విబ్రువంతం దృష్ట్వైవ నందయంతీసు దుఃఖితా | ప్రాహ కేనాసి బద్దస్త్వం పాపినావన బాలక. 25

సతామాహమాహా భాగే బద్దో7స్మి కపినావటే | జటాస్వేవం సుదుష్టేన జీవామితపసోబలాత్‌. 26

పురోన్మత్త పురేత్యేవ తత్రదేవో మహేశ్వరః | తత్రాస్తిత పసోరాశిః పితామమ ఋతధ్వజః. 27

తస్యాస్మి జపమానస్య మహాయోగం మహాత్మనః | జాతో7లి బృందసంయుక్తః సర్వశాస్త్రవిశారదః. 28

తతోమామ బ్రవీత్తాతో నామకృత్వా శుభాననే| జాబానీతి పరిఖ్యాయ తచ్ఛృణుష్వ శుభాననే. 29

పంచవర్ష సహస్రాణి బాలఏవ భవిష్యసి | దశవర్ష సహస్రాణి కుమారత్వే చరిష్యసి. 30

వింశతిం ¸°వనస్థాయీ వీర్యేణ ద్విగుణంతతః | పంచవర్షశతాన్‌ బాలో భోక్ష్యసే బంధనంధృఢమ్‌. 31

అంతట అంజమడను యక్షశ్రేష్ఠుడు తన కూతురు నందయతితో అటువైపు రావడం చూచి ఆమెయే దేవవతి యనుకొని తను నీళ్ళలో దూకడం వ్యర్థమైనదని భావించాడు. అలా అనుకొని ఆమెను పట్టుకొనుటకు లంఘించగా నామె నామె భయపడి హిరణ్వతీ ప్రవాహంలో దూకింది. అలా తన పుత్రిక నదిలో పడిపోవటం చూచి చాలాసేపు దుఃఖించి ఆ యక్షుడంజనాద్రికి వెళ్ళిపోయాడు. అక్కడ మౌనవ్రతంతో ఆ మహాతేజస్వి అనేక సంవత్సరాలు తపస్సులో ఉండి పోయాడు. హరిణ్వతి ప్రవాహంలో కొట్టుకొని పోయిన నందయంతి మహాపుణ్యభూమి అయన కోశల దేశం చేరింది. సాధువు లకు నెలవైన ఆ భూమి మీద విలపిస్తూ పోయిపోయి ఆ సుందరి ఆసంఖ్యాకాలయిన ఊడలతో విశాల ప్రదేశంలో శివుని జటాభారంలాగ విస్తరించిన ఒక మర్రిచెట్టు మూలాన ఒకశిలా వేదిక మీద వెళ్ళి కూర్చున్నది. అవటచ్ఛాయలో విశ్రమించిన ఆమెకు ఇలా కొన్ని మాటలు వినబడ్డాయి.''తపోధనుడైన నాతండ్రికి, నీపుత్రుడు మర్రిచెట్టుకు బంధింపబడి ఉన్నాడని చెప్పగ పుణ్యాత్ములు లేరా'' ఆ మాటలు విని ఆ సుందరాంగి క్రింద పైన ప్రక్కలా నలువైపులా కలయచూచింది. అంతట నామె ఆ మర్రిచెట్టు చిటారుకొమ్మన, తన జడలతో చెట్టుకొమ్మకు గట్టిగా కట్టి వేయబడిన ఐదేండ్ల బాలకుని చూచి చాలా దుఃఖించి బాబూ ! ఏ పాపిష్ఠుడు నిన్నిలా బంధించాడు? అని అడిగింది. అంత నాబాలకుడా నందయంతితో అన్నాడు. ఓమహనీయురాలా! పరమ దుర్మార్గుడైన ఒక కపి నన్నిక్కడ జడలతో బంధించాడు. కేవలం తపోబలంతో బ్రతికి ఉన్నాను. మహేశ్వరునకావాసమైన పురోన్మత్తపురంలో నా తండ్రి పరమ తపోరాశి ఋతధ్వజుడున్నాడు. ఆ మహాయోగి జపసమాధిలో ఉండగా సర్వశాస్త్ర విసారదుడనై తుమ్మెదలతో ఆవరింపబడి నేను జన్మించాను. అంతట నా తండ్రి నాకు జాబాలి అని నామకరణం చేసి యిలా అన్నాడు. నీవు అయిదువేలేండ్లు బాలుడివిగా ఉంటావు. పదివేలేండ్లు కౌమార్యం యిరవై వేలేండ్లు ¸°వనం, తర్వాత నలభై వేలయేండ్లు పైకాలం గడుపుతావు. ఇందులో బాల్యంలో అయిదు వందల ఏండ్లు దృఢ బంధనం అనుభవిస్తాము, కౌమారంలో వేయేండ్లు శరీర బాధతో కష్టపడతావు. ¸°వనంలో రెండువేలేండ్లు పరమ సౌఖ్యాలు అనుభవిస్తావు.

దశవర్ష శతాన్యేవ కౌమారే కాయపీడనమ్‌ | ¸°వనే పరమాన్‌ భోగాన్‌ ద్వినహస్రసమాస్తథా. 32

చత్వారింశచ్చ తాన్యేన వార్థకే కేశముత్తమమ్‌ | లప్స్యసే భూమిశయ్యాఢ్యం కదన్నాన భోజనమ్‌. 33

ఇత్యేవముక్తః పిత్రాహం బాలః పంచాబ్దదేశికః | విచరామి మహీపృష్టం గచ్ఛన్‌ స్నాతుంహిరణ్వతీమ్‌. 34

తతో7పశ్యం కపివరం సో7వదన్మాం క్వయాస్యసి | ఇమాందేవవతీం గృహ్యమూఢస్యస్తామహాశ్రమే. 35

తతో7సౌమాం సమాదాయ విస్పురంతం ప్రయత్నతః|

వటాగ్రే7స్మిన్ను ద్బబంద జాటాభిరపి సుందరి| 36

తథాచరక్షా కపినా కృతాభీరునిరంతరై ః | లతాపాశైర్మహాయంత్ర మధస్తాదుష్ట బుద్దినా. 37

అభేద్యో7యమ నాక్రమ్య ఉపరిష్టాత్తథాపద్య ః | దిశాముఖేషు సర్వేషు కృతం యంత్రం లతామయమ్‌ 38

సంయమ్యమాం కపివరః ప్రయాతో7మర పర్వతమ్‌ | యథేచ్చయా , మయాదృష్ట మేతత్తే గదితంశుభే. 39

భవతీకా మహారణ్య లలనా వరివర్జితా . సమాయాతాసుచార్వంగీ కేనసార్థేన మాంపద. 40

సా7బ్రవీదంజనోనామ గుహ్యకేంద్రః పితామమ | నందయంతీతి మానామ ప్రవ్లుెచాగర్బ సంభవా. 41

తత్రమేజాతకేప్రోక్త మృషిణా ముద్గలేనహి | ఇయం నరేంద్రమహిషీ భవిష్యతిన సంశయః. 42

తద్వాక్య సమకాలంచ వ్యనదద్దేవ దుందుభిః | శివాచాశివనిర్ఘోషా తతోభూయో7బ్రవీన్మునిః. 43

వసందేహో నరపతే ర్మహారాజ్ఞీ భవిష్యతి | మహాంతం సంశయం ఘోరం కన్యాభావే గమిష్యసి|

తతోజగామన ఋషి రేవముక్త్వావచో7ద్బుతమ్‌. 44

పితామామపి చాదాయ సమాగం తుమథైచ్ఛత | తీర్థం తతోహిరణ్వత్వా స్తీరాత్‌ కపిరథోత్సతత్‌. 45

తద్బయాచ్చ మయాహ్యాత్మా క్షిప్తః సాగరగాజలే | తయా7స్మి దేశమానీతా ఇమంమానుష వర్జితమ్‌. 46

శ్రుత్వాజాబాలిరథత ద్వచనం వూతయోజితమ్‌ | ప్రాజహసుందరి గచ్ఛస్వ శ్రీకంఠం యమునాతటే. 47

తత్రాగచ్చతి మధ్యాహ్నే మత్పితాశర్వమరిచ్చతుమ్‌ |

తసై#్మనివేదయాత్మానాం తత్రశ్రేయో7ధిలస్స్యసే. 48

తతస్తుత్వరితా కాలే నందయంతీ తపోనిధిమ్‌ | పరిత్రాణార్థ మగమ ద్దిమాద్రేత్యమునాంనదీమ్‌. 49

సాత్వదీర్ఘేణ కాలేన కందమూలఫలాశనా | నంప్రాప్తా శంకరస్థానం యత్రగచ్ఛతి తాపసః. 50

ముసలితనమలో, నాలుగువేలేండ్లు భూమ్మీద శయనిస్తూ దుష్టాన్నం భుజిస్తూ బాధలనుభవిస్తావు. ఇలా నా తండ్రి నా విషయం వివరించాడు. నేను అయిదేండ్ల బాలుడుగా నడుస్తూ హిరణ్వతీనదికి వెళ్తుండగా ఆ కపివీరుడు చూచి, మూర్ఖుడా ! మహాశ్రమంలో నేనుంచిన దేవవతిని తీసుకొని ఎక్కడికెళ్తున్నావని భయంతో గడతడలాడుతున్న నన్ను పట్టుకొని నా జడలతోనే ఈ వట వృక్షానికి గట్టిగా కట్టివేశాడు. ఆ దుష్టుడు నేను క్రిందపడకుండా తీగలతో త్రాళ్ళతో, క్రిందా పైన నలువైపులా అభేద్యంగా బంధించాడు. ఇలా లతాయేంద్ర బద్ధుణ్ణి గావించి ఆ వానరుడమర పర్వతానికి వెళ్ళిపోయాడు. నేను చూచినదంతా యథాతథంగా నీకు చెప్పాను. ఇక ఓ సుందరీ! నీవెవరు ? ఎవరితో వచ్చ ఈ మహారణ్యంలో వంటరిగా చిక్కుబడి పోయావు. నాకు చెప్పమని ఆ బాలుడడిగాడు. అందులకానందయంతి, అంజనుడను యక్షునకు ప్రవ్లూెచ వలన గలిగిన కుమార్తెను నేను. పేరు నందయంతి. ముద్గలమమర్షి నా జాతకం చూచి నేను నరేంద్ర మహిషినయ్యెదనని జోష్యం చెప్పాడు. వెంటనే శుభాశుభసూచకంగా దేవదుందుభులు మ్రెగాయి . పిడుగుల ధ్వనులు వినిపించాయి. అంతనాఋషి ఈ బాలిక రాజుభార్య కావడం తప్పదు. అయితే కన్యగా ఉన్న దినాల్లో ఆపదల్లో చిక్కుంకుంటుందని తుది నిర్ణయం చెప్పాడు. తర్వాత కొన్నాళ్ళకు మా తండ్రి నన్ను వెంటబెట్టుకొని పవిత్ర తీర్థానికి వెళ్తుండగా హిరణ్వతి నది తీరాన ఒక వానరం నామీద దూకింది. నేను భయంతో సాగరాభి ముఖంగా పోతున్న హిరణ్వతీ ప్రవాహంలో పడిపోయి నిర్మానుష్యమైన ఈ దేశానికి కొట్టుక వచ్చినాను. అంటూ తన వృత్తాంతమంతా వినిపించింది. అదివని జాబాలి ఆమెతో ఓ కోమలీ! నీవు యమునాతీరానగల శ్రీకంఠకేశ్వర వెళ్ళు. ప్రతి దినం మధ్యాహ్నవేళ కచటకు నా తండ్రి శివుని అర్చించుటకు వచ్చును. ఆయనకాళ్ళు పట్టుకొని ఆశ్రయిస్తే నీకు మేలు తప్పక కలుగుతుందని చెప్పాడు. అదివిని నందయంతి తన కష్టాలు పోగొట్టు కొనుటకై త్వరగా హిమాచలాన యమునా తీరానగల శ్రీకంఠక్షేత్రానికి బయలుదేరి చాలా కాలం కందమూల ఫలాలు తింటూ ప్రయాణం చేసి తుదకుశంకర నిలయానికి చేరుకుంది.

తతఃసాదేవదేవేశం శ్రీకంఠంలోక వందితమ్‌ | ప్రతివంద్య తతో7పశ్య దక్షరాం స్తాన్మహామునే. 51

తేషామర్ధంహి విజ్ఞాయ సాతదాచారుహాసినీ | తజ్ఞాబాల్యుదితం శ్లోక మాలిఖచ్ఛాన్య మాత్మనః 52

ముద్గలేనా7స్మిగదితా రాజపత్నీ భవిష్యతి | సాచావస్థామియాం ప్రాప్తా కశ్చిన్మాంత్రాతు మీశ్వరః 53

ఇద్యుల్లిఖ్య శిలాపట్లే గతాస్నాతుం యమస్వసామ్‌ | దదృశేచాశ్రమవరం మత్తకోకిల నాదితమ్‌. 54

తతో7మన్యత సాత్రర్షి ర్నూనంతిష్ఠతి సత్తమః | ఇత్యేవం చింతయంతీసా సంప్రవిష్టా మహాశ్రమమ్‌. 55

తతోదదర్శ దేవాఖాం స్థితాందేవవతీం శుభామ్‌ | సంశుష్కాస్యాం చలన్నేత్రాం పరివ్లూనామి వాబ్జినీమ్‌. 56

సాచాపతంతీం దదృశే యక్షజాం దైత్యనందినీ | కేయమిత్యేవ సంచింత్య సముత్థాయస్థి తా7భవత్‌. 57

తయా7న్యోన్యం సమాలికం గ్యఢంగాఢం సహృత్తయా |

వప్రచ్ఛతుస్తథా7న్యోన్యం కథయామాసతుస్తదా. 58

తేనరిజ్ఞాతతత్వార్థే అన్యోన్యం లలనోత్తమే | సమాసీనే కథాభిస్తే నానారూపాభి రాదరాత్‌. 59

ఏతస్మిన్నంకరే ప్రాప్తః శ్రీకంఠం స్నాతుమాదరాత్‌ |

సతత్త్వజ్ఞో మునిశ్రేష్ఠో అక్షరాణ్యవ లోకయత్‌. 60

సదృష్ట్వా వాచయిత్వాచ తమర్థ మధిగమ్యచ | ముహూర్తం ధ్యానమాస్థాయ వ్యజానచ్చ తపోనిధిః 61

తతః నంపూజ్యదేవేశం త్వరయాస ఋతధ్వజః |

అయోధ్యామగమత్‌ క్షిప్రం ద్రష్టుమిక్ష్వాకుమీశ్వరమ్‌. 62

తందృష్ట్వానృపతి శ్రేష్ఠం తాపసోవాక్య మబ్రవీత్‌ | శ్రూయతాం నరశార్దూల విజ్ఞప్తిర్మమ పార్థివ. 63

మమపుత్రోగుణౖర్యుక్తః సర్మశాస్త్రవిశారదః | ఉదృష్టం కపినారాజన్‌ విషయాంతేత వైవహి. 64

తంహి మోచయితుం నాన్యః శక్తస్త్వత్తన యాదృతే | శకునిర్నామ రాజేంద్ర సహ్యస్త్రవిధి పారగః. 65

ఆమెలోకవంద్యుడగు శ్రీకంఠకేశ్వరునకు ప్రణమిల్లి అచట వ్రాయబడిన శ్లోకం చదువుకొని అర్థం చేసుకుంది. అంతట నామె కళకళలాడే నవ్వు మొగముతో దాని క్రిందనే జాబాలి చెప్పిన శ్లోకం తాను వ్రాసింది. ఆ వెంటనే తన గాథను కూడ తెలిపే మరొక శ్లోకం కూడా వ్రాసింది ఈ విధంగా ''ముద్గలుడు రాజపత్నివి అవుతావని నాకు జోష్య చెప్పాడు. అయితే నేనీ దురవస్థలో ఉన్నాను. ఎవరో ఒక ప్రభువు నన్ను రక్షించుగాక. ''ఆ శిలావేదకమీద ఆ విధంగా వ్రాసి ఆయె యమునలో స్నానం చేయడానికి వెళ్ళింది. అక్కడ మత్తకోకిల నాదాలతో మారుమ్రోగుతున్న ఆశ్రమాన్ని చూచి ఆ ఋషివర్యడక్కడ తప్పకుండా ఉన్నాడని అనుకుంటూ ఆ ఆశ్రమం లోపల ప్రవేశించింది. అయితే అక్కడ దివ్యకాంతిలో వెలుగుతున్న పవిత్రురాలు దేవవతి ముఖం ఎండిపోయి, కళ్ళలో ప్రాణం పెట్టుకొని వాడిన తామరపూవులా కనిపించింది. ఆ యక్షపుత్రి తనవైపు రావడం చూచి దైత్యకుమారి లేచి నిలబడి ఈమె ఎవరా, అని, లోచించసాగింది. అంతట వారిద్దరు ఒకరినొకరు సమీపించి స్నేహపురస్సరంగా గాఢాలింగనాలు కావించుకున్నారు. ఒకరి నొకరు ప్రశ్నించుకొని పరస్పర వృత్తాంతాలు తెలుసుకున్నారు. అలా వారు కుశల ప్రశ్నలు వేసుకొనుచుండగా నా తత్వదర్శి అయిన మునిశ్రేష్ఠుడు స్నారార్థం శ్రీకంఠేశ్వరాలయానికి వచ్చి అక్కడ శిలావట్టం మీద వ్రాయబడిన అక్షరాలు చదువుకొని ముహూర్తకాలం ధ్యానస్తుడై అంతా సాకల్యంగా తెలుసుకున్నాడు. అంతట నా ఋతధ్వజుడు త్వరగా స్వామిని అర్చించి' ఇక్ష్వాకు చక్రవర్తిని చూచుటకు అయోధ్యకు పోయి చేరుకున్నాడు. ఆ రాజ శ్రేష్ఠుని చూచి ఆ తపస్వి ఓ నరశార్దూలా ! రాజా ! నావిజ్ఞప్తి వినుము. సర్వగణోపేతుడు సర్వశాస్త్రకోవిదుడైన నా కుమారుని ఒక వానరుడు నీ రాజ్యసీమలో బంధించియున్నాడు. అర్థశాస్త్రనిధి అయిన నీ కుమారుడు శకుని తప్ప మరెవ్వరు ఆ బాలుని విడిపించ జాలరన్నాడు.

తన్మునేర్వాక్య మాకర్ణ్య పితామ కృశోదరిః | ఆ దిదేశప్రియంపుత్రం శకునింతాన సాన్యయే. 66

తతః సప్రహితః పిత్రా భ్రాతామమ మహాభుజః | సంప్రాప్తో బంధనోద్దేశం సమం హిపరమర్షిణా. 67

దృష్ట్వాన్నగ్రోధ మత్యుచ్చం ప్రరోహాష్తృతదిజ్‌ ముఖమ్‌ | 68

దదర్మ వృక్షశిఖరే ఉద్బద్ద మృషిపుత్రకమ్‌ |

తాంశ్చనర్వాం ల్లతాపాశాన్‌ దృష్టవాన్‌ నసమంతతః |

దృష్ట్వాన మునిపుత్రంతం స్వజటానం యతంవటే. 69

థనురాదాయ బలవాన్‌ ఆధిజ్యంసచకారహ | లాఘవాదృషి పుత్రంతం రక్షంశ్చిచ్ఛేద మార్గణౖః. 70

కపినాయ త్కృతంసర్వం లతాపాశం చతుర్దిశమ్‌ క్ష పంచవర్ష శ##తేకాలే గతేశక్త స్తదాశ##రైః 71

లతాచ్ఛాన్నం తతస్తూర్ణ మారురోహ మునిర్వటమ్‌ |

ప్రాప్తం స్వపితరందృష్ట్వా జాబాలిః సంయతో7పిసన్‌. 72

ఆదరాత్‌ పితరం మూర్థ్నా వవందత విధానతః | సంపరిష్వజ్య సమునిర్మూర్ద్న్యా మ్రాయసుతంతతః 73

ఉన్మోచయితు మారబ్ధో నశశాక సుసంయతమ్‌ | తతస్తూర్ణం ధనుర్న్యస్య బాణాంశ్చ శకునిర్బలీ. 74

అరురోహవటం తూర్ణం జటామోచయితుంతదా | నచశక్నోతి సంఛన్నం దృఢం కపివరేణహి. 75

యదానశకితస్తేనసంప్రమోచయితుంజటాః | తదా7వతీర్ణః శకునిః సహితః పరమర్షిణా. 76

జగ్రాహచ ధనుర్బాణాం శ్చకార శరమండపమ్‌ | లాఘనాదర్థచంద్రైస్తాం శాఖాంచిచ్ఛేద సత్రిధా. 77

శాఖయా కృత్తయా చాసౌ భారవాహీ తపోధనః | శరసోపానమర్గేణ అవతీర్ణో7థ పాదపాత్‌. 78

తస్మింస్తదాస్వే తనయే ఋతధ్వజ స్త్రాతే నరేంద్రస్య సుతేనధన్వినా |

జాబాలినా భారవహేన సంయుతః సమాజగామాథనదాం పసూర్యజామ్‌. 79

ఇతి శ్రీ వామన మహా పురాణ అష్టాత్రింశో7ధ్యాయః.

ఓ సన్నని నడుముగల అరజా ! ఆ మునిమాటలు విన నా తండ్రి తన ప్రియ తనయుడు శకునిని ఆయనవెంట వెళ్ళమని ఆదేశించాడు. అంతట మహాభుజుడైన నా సోదరుడు మునివెంట వెళ్ళి ఊడలతో దిశలన్నీ కప్పివేస్తూ ఉన్న ఆ బ్రహ్మాండమైన మర్రిచెట్టును సమీపించి వృక్షం చివర కట్టబడి ఉన్న మునికుమారుణ్ణి చూచాడు. ఆ బాలకుని నలు వైపులా లతలు గట్టిగా బంధించి ఉన్నాయి. అతని జటలతోనే అతడు కొమ్మకు బంధింపబడి ఉన్నాడు. అంత నా రాకుమారుడు విల్లెక్కుపెట్టి అతి నేర్పుతో బాలకునకు దెబ్బతగలకుండా చుట్టూ వానరుడు బిగించిన లతా బంధాలు తెగ కొట్టాడు. కపి కట్టిన లతాపాశాలన్నీ అయిదు వందల సంవత్సరాల తర్వాత ఆ మహావీరుని బాణ ఘూతాలకు తెగి పోయాయి. వెంటనే ఆ ముని త్వరగా తెగిన లతలతో కప్పబడిన ఆ వటశాఖాగ్రానకు ఎక్కి కుమారుని చూడగా నా బాలకుడు జడలచే బంధితుడయినందున శిరోనమ్రభావంతో తండ్రికి నమస్కరించాడు. పుత్ర స్నేహంతో ఋతధ్వజుడా జాబాలిని నుదురుపై మాటిమాటికి ముద్దుపెట్టుకున్నాడు. పూర్తి కట్లు విప్పడానికి తండ్రి చేసిన ప్రయత్నాలన్నీ విఫలం కాగా ఆ వీరుడు శకుని విల్లంబులతో చెట్టుమీద ఎక్కి తాను ప్రయత్నించాడు. అయినా బాలకుని కట్లు ఊడలేదు. అంతట నా వీరుడు శకుని విల్లంబులతో చెట్టుమీదనుంచి క్రిందకు దిగి అతి లాఘంగా బాణాలతో ఒక శరమండపాన్ని కట్టి ఆ కొమ్మను మూడు ముక్కలుగా ఖండిచాడు. అంతట నా జాబాలి తలకు కట్టబడిని చిరుగొమ్మల బరువుతో, ఆ బాణాల మెట్లమీద నుంచి మెల్లగా క్రిందకు దిగివచ్చాడు. ఆ విధంగా ధానుష్కులలో ముఖ్యుడైన రాజకుమారుడు బంధవిముక్తుడిని గావించిన కుమారుడు జాబాలిని, తనమీద బరువతో సహా, వెంటబెట్టుకొని ఆ ఋతధ్వజుడు యమునానదికి వెళ్ళాడు.

ఇది శ్రీ వామన మహా పురాణంలో ముప్పది ఎనిమిదవ అద్యాయం సమాప్తం.

7

Sri Vamana Mahapuranam    Chapters