Sri Vamana Mahapuranam    Chapters   

ముప్పది ఏడవ అధ్యాయము

నారద ఉవాచ :

గతో7ధకస్తుపాతేళే కిమచేష్టత దానవః | శంకరోమందర స్థో7పి యచ్చకారతదుచ్యతామ్‌. 1

పులస్త్య ఉవాచ :

పాతాళస్థోం7ధకో బ్రహ్మన్‌ బాధ్యతేమదనాగ్నినా | సంత ప్తవిగ్రహః సర్వాన్‌ దానవాని దమబ్రవీత్‌. 2

సమేసుహృత్స మేబంధుః నక్రాతాసపితామమ | యస్తామద్రిసు తాంశీఘ్రం మఘాంతి కముపానయేత్‌. 3

ఏవంబ్రువతి దైత్యేంద్రే అంధకేమదన నాంధకే | మేఘగంభీర నిర్ఘోషం ప్రహ్లాదో వాక్యమబ్రపీత్‌. 4

యేయంగిరి సుతావీర ః సామాతా ధర్మతస్తవ | పితాత్రినయనో దేవః శ్రూయతామత్ర కారణమ్‌ 5

తవపిత్రాహ్య పుత్రేణ ధర్మనిత్యే నదానవ | ఆరాధితో మహాదేవః పుత్రార్థాయపురాకిల. 6

తసై#్మత్రిలోచనే నాసీద్‌ దత్తోం7ధో7ప్యేవదానవః | పుత్రకః పుత్రకామస్య ప్రోక్త్వేత్థంవచనం విభో. 7

నేత్రత్రయం హిరణ్యాక్ష నర్మార్థ ముమయామమ | పిహితం యోగసంస్థస్య తతోం7ధమభవత్తమః. 8

తస్మాచ్చతమసోజాతో భూతోనీల ఘనన్వనః | తదిదంగృహ్యంతా దైత్య తవౌపయికమాత్మజమ్‌. 9

యదాతు లోకవిద్విష్టం దుష్టం కర్మకరిష్యతి | త్రైలోక్య జననీంచాపి అభివాంఛిష్యతే7ధమః. 10

ఘాతయిష్యతి వావిప్రం యదాప్రక్షిప్యచాసురాన్‌ | తదాస్య స్వయమేవాహం కరిష్యే కాయశోదనమ్‌. 11

ఏవముక్త్వాగతః శంభుః స్వస్థానం మందరాచలమ్‌ | త్వత్సితా7పి సమభ్యాగా త్త్వామాదాయరసాతలమ్‌ 12

ఏతేన కారణనాంబా శైలేయీ భవితాతవ | సర్వస్యాపీ హజగతో గురుః శంభుః పితాధ్రువమ్‌. 13

నారదుడిలా అన్నాడు : ఓ మహర్షీ ! అలా పాతాళానికి వెళ్ళిన అంధకుడేమి చేశాడు? మందరగిరి మీద నున్న శంకరుడేమి చేశాడో దయచేసి చెప్పండి. అందుకు పులస్త్యుడిలా చెప్పసాగాడు. నారదా! పాతాళానికి పారిపోయిన అంధకుడు మదనజ్వాలల్లో తగలబడుతూ భరించలేక తోటి దానవులతో యిలా అన్నాడు. ''ఇప్పుడు వెంటనే వెళ్ళి ఆ శైల పుత్రిని తెచ్చి నాయెదుట నుంచువాడే నాకు నిజమైన స్నేహితుడు, సోదరుడు, బాంధవుడు, జనకుడు.'' కామాంధుడై అలా మాటాడే అంధకుని వారిస్తూ ప్రహ్లాదుడు మేఘ గంభీరమైన స్వరంతో యిలా మందలించాడు. వత్సా ! ఆ శైల పుత్రి ఎవరనుకున్నావు ? ధర్మతః నీకు తల్లి అవుతుంది. త్రినేత్రుడు తండ్రి. కారణం చెబుతున్నా వినుము. ధర్మనిరతుడైన నీ తండ్రి అపుత్రకుడైన నందున పుత్రార్థియై పూర్వం మహాదేవునిగూర్చి తపంచేశాడు. అతనికి ఒక గ్రుడ్డివాడైన బిడ్డనిస్తూ శంకరుడిలా చెప్పాడు. హిరణ్యాక్షా ! ఒకసారి వినోదార్ధం పార్వతి నా మూడు నేత్రాలు మూసింది. దానితో యోగంలో ఉన్న నా ఎదుట అంధకారం ఆవరించింది. ఆ చీకటిలో నుంచి నీలమేఘంలాంటి గొంతుతొ ఒక భూతం ఆవిర్భవించింది. అలాంటి ఈ అంధకుడిని నీకు తగిన పుత్రునిగా యిస్తున్నాను తీసుకొమ్ము. వీడు అధర్మానికి పాల్పడి దుష్టమైన లోకులకు బాధలు కలిగించినప్పుడు, ముల్లోకజననిని వాంఛించినప్పుడు గానీ, తన రాక్షసులను బంపి విప్రులను సంహరించినప్పుడు కాని నేను స్వయంగా వీడికి దేహశుద్ధి చేస్తా. అలా చెప్పి శంకరుడు తన మందరాచలానికి తిరిగి వెళ్ళాడు. నీతండ్రి నిన్ను తీసుకొని యింటికి వెళ్ళాడు. పాతాళానికి . ఈ కారణాన పార్వతి నీకు తల్లి అవుతుంది. సర్వలోక గురుడైన శివుడు నీకు సాక్షాత్తు తండ్రి అవుతాడు.

భవానపిత పోయుక్తః శాస్త్రవేత్తా గుణాప్లుతః | నేదృశేపాప సంకల్పే మతింకుర్యాద్భవద్విదః. 14

త్రైలోక్య ప్రభురవ్యక్తో భవః సర్వైర్నమస్కృతః | అజేయ స్తస్య భార్యేయం నత్వమర్హో7మరార్థస. 15

నచాపిశక్తః ప్రాప్తుంతాం భవాన్‌ శైలనృపాత్మజామ్‌ | అజిత్వాసగణం రుద్రం సచకామో7ద్యదుర్లభః. 16

యస్తరేత్సాగరం దోర్భ్యాం పాతయేద్భుని భాస్కరమ్‌ |

మేరుముత్పాట యేద్వాసి సజయేచ్ఛూల పాణినమ్‌ 17

ఉతాహోస్వి దిమాశక్యాః క్రియాః కర్తుంనరైర్బలాత్‌ |

సచశక్యో హరోజేతుం సత్యంసత్యం మయోదితమ్‌. 18

కింత్వయా నశ్రుతందైత్య యథాదండోమహీపతిః | పరస్త్రీ కామవాన్మూఢః సరాష్ట్రో నాశమాప్తవాన్‌. 19

ఆసీద్దండో నామనృపః ప్రభూత బలవాహనః | సచవవ్రే మహాతేజాః పౌరోహిత్యాయ భార్గవమ్‌. 20

ఈజేచవివిధైర్యజ్ఞైః నృపితిః శుక్రపాలితః | శుక్రస్యా సీచ్చదుహితా అరజానామ నామతఃః 21

శుక్రఃకదాచి దగమద్‌ వృషపర్వాణ మాసురమ్‌ | తేనార్చితశ్చిరం తత్ర తస్థౌభార్గవ సత్తమః. 22

అరజాస్వగృహేవహ్నిం శుశ్రుషంతీ మహాసుర | అతిష్ఠతి సుచార్వంగీ తతో7భ్యా గాన్నరాధిపః. 23

సవప్రచ్ఛక్వ శుక్రేతి తమూచుః పరిచారికాః | గతః సభగవాన్‌ శుక్రో యజనాయదనోః సుతమ్‌. 24

పప్రచ్ఛనృపతిః కాతు తిష్ఠతే భార్గవాశ్రమే | తాస్తమూచుర్గురోః పుత్రీ సంతిష్ఠత్యరజానృప. 25

తామాశ్రమే శుక్రసుతాం ద్రష్టమిక్ష్వాకునందనః| ప్రవివేశ మహాబాహు ర్దదర్శరజసం తతః. 26

తాందృష్ట్వా కామనంతప్త స్తత్‌ క్షణా దేవపార్థివః | సంజాతో7ధకదండస్తు కృతాంతబల చోదితః. 27

తతో విసర్జయామాన భృత్యాన్‌ భ్రాతృన్‌ సుహృత్తమాన్‌ | శుక్రశిష్యా నపిబలీ ఏకాకీనృప అవ్రజత్‌. 28

తమాగతం శుక్రసుతా ప్రత్యుత్థాయ యశస్వినీ | పూజయామాస సంహృష్టా భ్రాతృభావేన దానవ. 29

నీవు తపస్సు చేశావు, శాస్త్రాలు చదివావు, సద్గుణివి. నీలాంటివాడిటువంటి పాపసంకల్పాలు పెట్టుకోరాదు. ఆ భవుడు త్రిలోకనాధుడు, అవ్యక్తుడు, సర్వనమస్కృతుడు అజేయుడు. ఆయన భార్య నీకు తగినది కాదు. ఓ సురమర్దనా ! ఆ గిరి పుత్రిని, శివుని ఆయన గణాలను జయించనిదే నీవు పొందజాలవు. చేతులతో ఈది సముద్రాన్ని దాటగల వాడు సూర్యుని ఊడబీకి భూమ్మీద పారవేయగలవాడు, మేరుగిరి పెకలించగలవాడే ఆ త్రిశూలిని జయించగలడు.ఒక వేళ అలాంటి పనులు చేయగల శక్తిశాలురున్నప్పటికీ వారందరూ ఏకమైనా సరే హరుని జయింపలేరు. ఇది ముమ్మాటికి నిజం. ఓ దానవా ! దండుడనే రాజు పరస్త్రీ వాంఛతో మూర్ఖుడై రాజ్యంతోసహా నశించి పోయిన విషయం నీవు వినలేదా? అయితే విను. ఒకప్పుడు దండుడనే మహాబలశాలి నరపతి ఉండేవాడు. ఆతడు మహా తేజస్వియగు శుక్రాచార్యుని పురోహితునిగా నియమించుకున్నాడు. ఆయన పర్యవేక్షణలో వివిధాలయిన యాగాలు చేశాడు. శుక్రునికుమార్తె అరజ. ఒక పర్యాయం రాక్షసరాజు వృషపర్వుని వద్దకు వెళ్ళిన శుక్రుడు ఆయన సవర్యలనందుకుంటూ అక్కడే బహుకాలం ఉండి పోయాడు. ఆశ్రమంలో అరజ అగ్నిహోత్రాలు చూచుకుంటూ ఉండేది. అలా ఉండగా ఒకనాడా దండుడాశ్రమానికి వెళ్ళి శుక్రుడెక్కడ అని పరిచారకులను అడిగాడు. వృషపర్వుని యజ్ఞానికి వెళ్ళారని చెప్పగావిని ఆశ్రమం ఎవరు చూస్తున్నారని మరల ప్రశ్నించాడు. గురుపుత్రిక అరజ ఉన్నదని విని లోనికి వెళ్ళి ఆ సుందరిని చూచాడు. అంతటనామె సౌందర్యాన్ని చూచి ఆ ఇక్ష్వాకునందనుడు మృత్యుచోదితుడై కామాగ్నికి లోనైనాడు. వెంటనే తన సేవాపరివారాన్నంతా వెనకకు పంపించాడు. ఆశ్రమ శిష్యులను కూడా బయటకు పంపి తానొక్కడే అరజ ఉన్న చోటకు వెళ్ళాడు. ఆమె ఆ రాజును చాలా సంతోషంతో లేచి స్వాగంతం చెప్పి సోదరభావంతో అతిథి సపర్య చేసింది.

తతస్తామాహ నృపతి ర్బాలే కామాగ్ని తాపితమ్‌ | మాంసమాహ్లాదయ స్వాద్య స్వపరిష్వంగ వారిణా. 30

సా7పిప్రాహ నృపశ్రేష్ఠ మావినీనశఆతురః | పితామమ మహాక్రోధాన్‌ త్రిదశానపి నరిదహేత్‌. 31

మూఢబుద్దే భవాన్‌ భ్రాతా మమాసిత్వ నయాప్లుతః | భగినీధర్మత స్తే7హం భవాన్‌ శిష్యః పితుర్మమ. 32

సో7బ్రవీత్‌ భీరుః మాం శుక్రః కాలేన పరిధక్ష్యతి | కామాగ్ని ర్నిర్దహతిమా మద్యైవ తనుమధ్యమే. 33

సాప్రాహదండం నృపతిం ముహూర్తం పరిపాలయ | తమేవయాచ స్వగురుం సతేదాస్యత్య సంశయమ్‌. 34

దండో7బ్రవీత్‌ సుతవ్వంగి కాలక్షేపోన మేక్షమః | చ్యుతావసర కర్తృత్వే విఘ్నోజాయేత సుందరి. 35

తతో7బ్రవీచ్చ విరజా నాహంత్వాం పార్థివాత్మజ | దాతుంశక్తా స్వమాత్మానం స్వంత్రానహియోషితః. 35

కింవాతే బహునోక్తేన మాత్వం నాశంనరాధిప | గచ్చస్వ శుక్రశాపేన నభృత్యజ్ఞాతి బాంధవః. 36

తతో7బ్రవీన్నరపతిః సురనుః శృణుచేష్టితమ్‌ | చిత్రాంగదాయా యద్‌ వృత్తం పురాదేవయుగే శుభేః. 34

విశ్వకర్మసుతా సాధ్వీ నామ్నా చిత్రాంగదా7భవత్‌ | రూప¸°వన సంపన్నా పద్మహీనేవ పద్మినీ. 35

సాకదాచిన్మ హారణ్యం నభీభిః పరివారితా | జగామనైమిషం నామ స్నాతుం కమలలోచనా. 40

సాస్నాతు మవతీర్ణాచ అథాభ్యాగాన్నరేశ్వరః | సుదేవతనయోధీమాన్‌ సురథో నామనామతః.

తాందదర్శచ తన్వంగీంశుభాంగో మదనాతురః. 41

తందృష్ట్వా సానఖీరాహ వచనం సత్యసంయుతమ్‌ | అసౌనరాధిపసుతో మదనేనకదర్ధ్యతే. 42

మదర్ధేచక్షమం మే7న్య స్వప్రదానం సురూపిణః | సఖ్యస్తానబ్రువన్‌ బాలా నప్రగల్భాసి సుందరి. 43

అస్వాతంత్ర్యంత వాస్తీహ ప్రదానే స్వాత్మనో7నఘేః | పితాతనాస్తి ధర్మిష్ఠః సర్వశిల్ప విశారదః. 44

సతేయుక్త మిహాత్మానం దాతుం నరపతేస్వయమ్‌|

అంత నారాజు నన్ను కామానలందహిస్తోంది. నీ కౌగిలింత అనే చల్లటి నీరు చల్లి దానిని చల్లార్చుమనగా నా అరజ, నరవరా ! తొందరపడి ఆత్మనాశనం చేసుకోనవద్దు. నా తండ్ర మహాకోపిష్ఠి. దేవతలను సైతం దహించివేయగలడు. ఓ మూర్ఖుడా! దుర్వినీతుడవైన నీవు నా తండ్రి శిష్యుడవైనందున నాకు సోదరుడవు గుర్తుపెట్టుకో మని మందలించగా ఆ దైవోపహతుడో సుందరీ, శుక్రుడెప్పుడో నన్ను శాపదగ్ధుణ్ణి చేయగలుగునేమోకాని ఈ క్షణాన్నే కామానలం నన్ను దహిస్తుంది. అనగా నా అరజ క్షణకాలమోర్చుకొనుము. నాతండ్రినే అడుగుము. ఆయననన్ను నీకుతప్పుక యివ్వగలడనగా నీ కామార్తుడో అందాలబరిణా ! యిక నెంతకాలమూ ఓర్చుకోలేను. చేజిక్కిన అవకాశాన్ని వదలుకుంటే తర్వాత ఎన్నో విఘ్నాలు వస్తాయి. అనగా నా అరజ ! రాజకుమారా ! స్త్రీలు అస్వతంత్రలుగదా. నన్ను నా అంతట నేను నీకర్పించుకోజాలను. వేయేల ఆత్మ నాశనాన్ని కొనితెచ్చుకోవద్దు. వెళ్ళిపో. శుక్రశాపానలంలో భృత్యజ్ఞాతి బాంధవులతో సహా దగ్ధంకాబోకుము. అని మందలించింది. అంతట ఆ దండుడు సుందరాంగీ ! పూర్వం దేవయుగంలో జరిగిన చిత్రాంగద చేష్టితం చెబుతాను విను. రూప¸°వన లావణ్యాల్లో మిన్నయైన పద్మినీ జాతికి చెందిన చిత్రాంగద అనే సుందరి విశ్వకర్మ పుత్రిక. ఆ చిన్నది ఒక పర్యాయం సఖులతో నైమిషారణ్యానికి స్నానానికై వెళ్ళి నీళ్ళలోకి దిగునంతలో నచట కుసుదేవ తనయుడు సురథుడను రాజు వచ్చి ఆ స్నాన సుందరిని చూచి మదనాగ్నికి ఎర అయినాడు. ఆ రాజును చూచి ఆ సుందరి సఖులతో ఉన్న వాస్తవం చెప్పింది. ఈ రాజు నన్ను చూచి మోహించి కామాగ్నిలో వేగుతున్నాడు. అటువంటి ఆర్తుడికి నన్ను నేను సమర్పించుకొనడమే యుక్తమైనపని. అన్న చిత్రాంగదను వారించి సఖులు, సుందరీ, ఇంత సాహసము చేయవద్దు. నిన్నర్పించుకొనుటకు నీకు స్వతంత్రత లేదు ! సకల ధర్మవిదుడు శిల్పశాస్త్ర పారంగతుడైన నీ తండ్రి ఉండగా ఇలా ఈ రాజుకు లోబడుట తగదు సుమా అని మందలించారు.

ఏతస్మిన్నంతరే రాజా సురథః నత్యవాక్‌ సుధీః. 45

సమభ్యేత్యా7బ్రవీదేనాం కందర్ప శరపీడితః | త్వంముగ్దే హోహయసిమాం దృష్ఠ్వైవ మదిరేక్షణ. 46

త్వద్‌ దృష్టి శరపాతేన స్మరేణాభ్యేత్య తాడితః | తన్మాంకుచతలేతల్పే అభిశాయితు మర్హసి. 47

నోచేత్‌ ప్రధక్ష్యతే కామో భూయోభూయో7తి దర్శనాత్‌ | తతః సాచారుసర్వాంగీ రాజ్ఞోరాజీవలోచనా. 48

వార్యమాణాసఖీభిస్తు ప్రాదాదాత్మాన మాత్మనా | ఏవంపురాతయాతన్వ్యా పరిత్రాతః సభూపతిః. 49

తస్మాన్మా మపిసుశ్రోణి త్వంపరిత్రాతు మర్హసి|

అరజస్కా7బ్రవీద్దండం తస్యాయద్‌ వృత్తముత్తరమ్‌. 50

కింత్వయాన పరిజ్ఞాతం తస్మాత్తే కథయామ్యహమ్‌ |

తదాతయాతు తన్వంగ్యా సురథస్య మహీపతేః. 51

ఆత్మాప్రదత్తః స్వాతంత్ర్యాత్‌ తతస్తామశపత్‌ పితా | యస్మాద్దర్శం పరిత్యజ్య స్త్రీభావాన్‌ మందచేతనే. 52

ఆత్మాప్రదత్త స్తస్మాద్ది నవివాహో భవిష్యతి | వివాహరహితానైవ సుఖలంప్స్యతి భర్తృతః. 53

నచపుత్రఫలం నైవ పతినా యోగమేష్యతి | ఉత్సృష్ట మాత్రేశాపేతు హ్యపోవాహ సరస్వతీ. 54

ఆకృతార్థం నరపతిం యోజనాని త్రయోదశ | అపకృష్టే సరవతౌ సా7పిమోహము పాగతా. 55

తతస్తాంసిషిచుః సఖ్యః సరస్వత్యా జలేనహి | సాహిచ్యనానాసుతరాం శిశిరేణాప్యంథాంభసా. 56

మృతకల్పా మహాబాహో విశ్వకర్మ సుతా7భవత్‌ |

తాంమృతామపి విజ్ఞాయ జగ్ముస్సఖ్య స్త్వరాన్వితాః. 57

కాష్ఠాన్యాహర్తుమపరా వహ్నిమానేతు మాకులాః | హెచతాస్వపి సర్వాసు గతాసు వనముత్తమమ్‌. 58

సంజ్ఞాం లేభేసుచార్వంగీ దిశశ్చాప్యవ లోకయత్‌ | అపశ్యంతీ నరపతిం తథాస్నిగ్ధం సఖీజనమ్‌. 59

నిపపాత సరస్వత్యాః పయసి స్ఫురితేక్షణా | తాంవేగాత్‌ కాంచనాక్షీతు మహానద్యాం నరేశ్వర. 60

గోమత్యాం పరిచిక్షేవ తరంగకుటిలేజలే | తయా7పి తస్యాస్తద్భావ్యం విదిత్వాథ విశాంపతే. 61

మహావనే పరిక్షిప్తా సింహవ్యాఘ్ర భయాకులే | ఏవంతస్యాః స్వతంత్రాయా ఏషావస్థా శ్రుతామయా. 62

తస్మాన్న దాస్యామ్యాత్మానం రక్షంతీ శీలముత్తమమ్‌ | తస్యాస్తద్వచనం శ్రుత్వా దండఃశఖ్రసమోబలీ |

విహస్య త్వరజాం ప్రాహ స్వార్థమర్థక్షయంకరమ్‌. 63

అంతలోపల బుద్దిమంతుడు సత్యవాదియైన సురథుడు మన్మథ పీడితుడై ఆ చిత్రాంగదను సమీపించి యిలా అన్నాడు. ఓ మదిరాక్షీ ! నీ చూపులతోనే నన్ను పిచ్చివాడిని చేశావు. నీ చూపులనే బాణాలతో బాటు మన్మథునికోలలు కూడ నన్ను ప్రహరిస్తున్నవి. కనుక నీ స్తనాలనే మెత్తటి శయ్యమీద నన్ను పరుండబెట్టికొనుము. లేదో, నిన్ను చూస్తూండే కొద్దీ మన్మథుడు నన్ను మాటిమాటికీ ప్రహరిస్తూనే ఉంటాడు. సురథుని మాటలకా సర్వాంగ సుందరి కరగి పోయినసఖులు వద్దంటున్నా వినకుండా తన్నుతాను సమర్పించుకున్నది. ఈ విధంగా ఆ కోమలి పూర్వం ఆరాజు ప్రాణాలు కాపాడింది. అలాగే ఓ సుశ్రోణీ ! నీవు నన్ను కూడా రక్షించదగుదువు. దండుని ఆ మాటలనందుకొని ఆ ఆరజ, అంతవరకేనా రాజా, ఆతర్వాత ఏం జరిగిందీ వినలేదా ? ఆ విషయం నేను చెప్పెద వినుము. అలా తన కుమార్తె స్వతంత్రించి సురథునకు ఆత్మ సమర్పణం చేసుకొనడం వినగానే ఆమె తండ్రి యిలా శపించాడు. ఓసీ! మతి చెడినదానా ! ధర్మమార్గం వదలి స్త్రీ దౌర్బల్యానికి లోనై ఒకడికి ఆత్మసమర్పణం చేసుకున్నావు గనుక యిక నీకు వివాహం జరుగదు. కనుక పురుష సౌఖ్యం భర్త ప్రేమ పొందవు. పుత్రులూ కలుగరు పొమ్ము. ఆ భయంకరమైన శాపాక్షరాలు వెలువడినంతనే కృతకృత్యుడు కాని ఆ సురథుణ్ణి సరస్వతీ నది తన ప్రవాహంలో పదమూడు యోజనాల దురం కొనిపోయి వదలినది. రాజుకనపడక పోవుటతో నామెకూడ మూర్ఛితురాలైంది. అంతట సఖులు సరస్వతీ శీతలోదకాలు ఆమెమీద చల్లి సేదదీర్చుటకు చాలాసేపు ప్రయత్నించారు. అయినా ఆచిత్రాంగద చచ్చినదానివలె పడియుండుటచే మరణించినదని నిశ్చయించుకొని దహనం చేయుటకై కట్టెలు తెచ్చుట కొకరు నిప్పుతెచ్చుట కొకరుగా తలా ఒక ప్రక్క వెళ్ళి పోయారు. సఖులందరూ వెళ్ళిపోయిన తర్వాత తెలివివచ్చి ఆ సుందరి నలువైపులా చూచి నరపతినీ, స్నేహితురాండ్రను కానక ఏడ్చి ఏడ్చి వాచిపోన కండ్లతో హతాశురాలై సరస్వతీ నదిలో పడిపోయింది. ఓ రాజా ! ఆ కాంచనాక్షి సరస్వతి ఆ అభాగ్యురాలిని మహావేగంతో తీసుకుపోయి అలల సుడులతో నిండిన గోమతినదిలోకి నెట్టివేసింది. గోమతి కూడ ఆమె దుస్థితితెలుసుకొని సింహ వ్యాఘ్రాలతో నిండిన ఒక మహారణ్యంలోకి నెట్టివేసింది. ఈ విధంగా ధర్మాన్నెదిరించి స్వతంత్రించిన ఆమె దుస్థితికి లోనైనది. కాబట్టే నేను స్వతంత్రించి ప్రాణప్రదంగా కాపాడుకుంటున్న నా శీలాన్ని నీ కర్పించను అన్నది. ఆ అరజ మాటలు విని ఇంద్రతుల్య బలశాలి అయిన ఆ దండ నృపతి అర్థక్షయం కలుగజేసే స్వార్థంతో నవ్వుతూ యిలా అన్నాడు.

దండ ఉవాచ :

తస్యాయదుత్తరం వృత్తం తత్పితుశ్చ కృశోదరి | సురథస్యత థారాజ్ఞ స్తచ్ఛ్రోతుం మతిమాదధ. 64

యదావకృష్టే నృపతౌ పతితా సామహావనే | తదాగగన సంచారీ దృష్టవాన్‌ గుహ్యకో7జనః. 65

తతఃసో7భ్యేత్యతాం బాలాం పరిసాంత్వ్య ప్రయత్నతః|

ప్రాహమాగచ్ఛ సుభ##గే విషాదం సురథంప్రతి. 66

ధ్రువమేష్యసి తేనత్వం సంయోగమసితేక్షణా | తస్మాద్గచ్ఛస్వశీఘ్రంత్వం ద్రష్ణుం శ్రీకంఠమీశ్వరమ్‌. 67

ఇత్వేవముక్తా సాతేన గుహ్యకేన సులోచనా | శ్రీకంఠ మాగతాతూర్ణం కాళింద్యా దక్షిణతటే. 68

దృష్ణ్వామహేశం శ్రీకంఠం స్నాత్వారవిసుతాజలే | అతిష్ఠత శిరోనమ్రా యావన్మధ్యస్థితోరవిః. 69

అథాజగామ దేవస్య స్నానం కర్తుం తపోధనః | శుభః పాశుపతాచార్యః సామవేదీ ఋతధ్వజః. 70

దదర్శ తత్రతన్వంగీం మునిశ్చిత్రాంగదాంశుభామ్‌ | రతీమివస్థితాం పుణ్యా మనంగపరివర్జితామ్‌. 71

తాందృష్ట్వా సమునిర్ద్యాన మగమత్‌ కే యమిత్యత | అథసాతమృషీం వంద్య కృతాంజలిరుపస్థితా. 72

తాంప్రాహపుత్రి కస్యాసి సుతాసురసుతోపమా? | కిమర్థ మాగతాసీహ నిర్మనుష్య మృగేవనే. 73

తతఃసాప్రాహతమృషిం యథాతథ్యం కృశోదరీ | శ్రుత్వార్షిః కోపమగమ దశపచ్ఛిల్పినాం వరమ్‌. 74

యస్మాత్త్స్య తనుజాతేయం పరదేయా7పి పాపినా |

యోజితానైవ పతినా తస్మాచ్ఛాఖా ముఖో7స్తుసః. 75

ఇత్యుక్త్వా సమహాయోగీ భూయః స్నాత్వావిధానతః|

ఉపాస్య పశ్చిమాం సంధ్యాం పూజయా మాసశంకరమ్‌. 76

సంపూజ్య దేవదేవేశం యథోక్తవిధినా హరమ్‌ | ఉవాచగమ్య తాంనుభ్రూం సుదతీం పతిలాలసామ్‌. 77

దంతుడిలా అన్నాడు : ఓ సన్నని నడుముగలదానా ! తర్వాత నామె తండ్రికి పట్టినగతి సురథరాజు వృత్తాంతం కూడా విను. రాజుతో విడదీయబడి ఆ విధంగా మహారణ్యంలో పడిపోయిన ఆ సుందరిని ఆకాశమార్గాన పోతున్న అంజనుడనే యక్షుడు చూచి సమీపించి సాంత్వన వాక్యాలు పలికి, తరుణీ! సురథుని గూర్చి విచారించకుము. తప్పకుండా మరల మీయిరువురకు సమాగమం కలుగుతుంది. నీవు వెంటనే శ్రీకంఠేశ్వరుని దర్శనానికి వెళ్ళుమని సలహాయిచ్చాడు. యక్షుడు చెప్పినట్లా సునేత్రి ఆలసింపక యమునానది దక్షిణ తీరాన ఉన్న శ్రీకంఠదేవుని క్షేత్రానికి వెళ్ళి యమునలో స్నానం చేసి శివుని చూచి తలవంచుకుని అచటనే సూర్యుడు నడిమింటికి వచ్చేవరకు కూర్చున్నది. అంతట అక్కడకు మహాతపస్వి సామవేది పాశుపతాచార్యుడైన ఋతధ్వజుడు దేవుని దర్శనం స్నానం చేయుటకు వచ్చాడు. మన్మథుడు వదలిన రతీదేవి వలె అక్కడ దీనయైయున్న ఆ సుందరి చిత్రాంగదను చూచి ఆ ముని కొంతసేపాలోచించుచుండగా ఆమె లేచి చేతులుజోడించుకొని నిలబడినది. అంతనా తపస్వి, అమ్మా యీ దేవాంగనవలె ఈ నిర్జనారణ్యంలో పడియున్న నీవెవరవు యిక్కడికేల వచ్చితివని అడుగగా నా జవ్వని, ఏమియు దాచక తనకథనంతను వివరించింది.ఆమె కథనంతను విని మహాకోపంతో నా ఋతధ్వజుడు శిల్పినీ విధంగా శపించాడు. తగిన వరునకివ్వవలసిన కుమార్తెను అలా యివ్వక పతితో సమాగమం కలుగకుండా జేసిన ఆ దుష్టుడు వానరాకారుడౌగాక ! అని శాపాక్షరాలు పలికి మరల విధానం ప్రకారం స్నానంచేసి సాయం సంధ్యను ఉపాసించి యథోక్తవిధిగా శ్రీకంఠుని పూజ గావించాడు. తర్వాత నాఋషి భర్తకోసం తపిచే అందమైన కనుబొమలు , పలువరుసగల ఆ చిత్రాంగదను చూచి ఇలా అన్నాడు.

గచ్ఛస్వసుభ##గే దేశం సప్తగోదావరం శుభమ్‌ | తత్రోపాస్య మహేశానం మహాంతం హాటకేశ్వరమ్‌. 78

తత్రస్థితా యారంభోరు ఖ్యాతా దేవ వతీశుభా | ఆగమిష్యతి దైత్యస్య పుత్రీకందర మాలినః. 79

తథా7న్యాగుహ కసుతా నందయంతీతివిశ్రుతా | అంజనసై#్యవ తత్రాపి సమేష్యతి తవస్వినీ |

తథా7న్యాగుహ్య కసుతా నందయంతీవిశ్రుతా | అంజనసై#్యవ తత్రాపి సమేష్యతి తవస్వినీ |

తథా7సరావేదవతీ పర్జన్య దుహితాశుభా. 80

యథాతిన్రః సమేష్యంతి సప్తగోదావరేజలే | హాటకాఖ్యే మహాదేవే తదాసంయోగమేష్యసి. 81

ఇత్యేవముక్తా మునినా బాలా చిత్రాంగదాతదా | సప్తగోదావరం తీర్థ మగమత్త్వరితాతతః. 82

సంప్రాప్య తత్రదేవేశం పూజయంతీ త్రిలోచనమ్‌ | సమధ్యాస్తే శుచిపరా ఫలమూలాశనా7భవత్‌. 83

సచర్షిర్‌ జ్ఞానసంపన్నః శ్రీకంఠాయతనే7లిఖత్‌ | శ్లోకమేకం మహాఖ్యానం తస్యాశ్చప్రియ కామ్యయా. 84

ఓ సుందరీ ! నీవు వెంటనే సప్తగోదావర క్షేత్రానికి వెళ్ళు. ఆ శుభ ప్రదేశంలో మహానుభావుడైన హాటకేశ్వర స్వామిని ఉపాసించుము. అరటికాండముల వంటి తొడలుగలదానా ! నీవక్కడ ఉండగా కందరమాల అనుదైత్యుని పుత్రిక దేవవతి, అంజనుడను యక్షుని కుమార్తె నందయంతి యను తపస్విని, మరొక సుందరి వర్జన్యుని తనయ వేదవతి అక్కడకు చేరుదురు. వీరు మువ్వురూ హాటకేశ్వరుని చరణాలకడ సప్తగోదావర సంగమజలాలలో కలిసినప్పుడు నీవు నీ భర్తను మరల కలుసుకోగలవు. ఆ ముని మాటలు వినినంతనే ఆలసింపక నా చిత్రాంగద సప్తగోదావర సంగమంవద్ద గల హాటకేశ్వర క్షేత్రానికి వెళ్ళి శుచిగా భక్తి శ్రద్ధలతో కందమూలఫలాలు తింటూ నా హాటకేశ్వరుని పూజింపమొదలు పెట్టింది. జ్ఞాన సంపన్నుడైన ఆ ఋషి శ్రీ కంఠేశ్వరుని ఆలయం మీద , చిత్రాంగదకు హితము చేయు సంకల్పముతో ఒక మహాఖ్యాన గర్భితమైన శ్లోకం యీ విధంగా వ్రాశాడు. ''ఈ మృగలోచని దుఃఖాన్వితను పరాఖ్రమంతో పోగొట్టజాలిన, త్రిదశుడుగాని, అసురుడుగాని యక్షుడుగాని నరుడు గాని రజనీచరుడు గాని లేడు!'' అలా విశ్వకర్మ పుత్రిని ఆదేశించి ఆముని, శరణ్యుడు సర్వజనవంద్యుడైన పుష్కరనాథునీపయోష్ణీ (నదిని సేవించుటకై విశాలాక్షిని సంస్మరిస్తూ వెళ్ళాడు.

ఇది శ్రీ వామన మహాపురాణంలో ముప్పది ఏడవ అధ్యాయము ముగిసినది.

Sri Vamana Mahapuranam    Chapters