Sri Vamana Mahapuranam    Chapters   

ముప్పది రెండవ అధ్యాయము

పులస్త్య ఉవాచ :

సేనాపత్యే7భిషిక్తస్తు కుమారో దైవతైరథ | ప్రణిపత్య భవంభక్త్యా గిరిజాం పాపకం శుచిమ్‌. 1

షట్‌ కృత్తికాశ్చ శిరసా ప్రణమ్య కుటిలామపి | బ్రహ్మాణంచ నమస్కృత్య ఇదంవచన మబ్రవీత్‌. 2

కుమారు ఉవాచ :

నమో7స్తు భవతాం దేవా ఓం నమోస్తు తపోధనాః | యుష్మత్ర్పసాదా జ్జేష్యామి శత్రుమహిష తారకౌ. 3

శిశురస్మిన జానామి వక్తుంకించన దేవతాః | దీయతాం బ్రహ్మణాసార్ధ మనుజ్ఞామ మసాంప్రతమ్‌. 4

ఇత్యేవ ముక్తేవచనే కుమారేణ మహాత్మనా | ముఖం నిరీక్షంతిసురాః సర్వేవిగత సాధ్యసాః. 5

శంకరో7పిసుత స్నేహాత్‌ సముత్థాయ ప్రజాపతిమ్‌ | ఆదాయ దక్షిణ పాణౌ స్కందాంతికముపాగమత్‌. 6

ఆథోమా ప్రాహతనయం పుత్రఃఏహ్యే హిశతృహన్‌| వందన్వ చరణౌదివ్యౌ విష్ణోర్లోక సమస్కృతౌ. 7

తతోవిహస్యాహగుహః కో7యం మాతర్వదస్వమామ్‌ |

యస్యాదరాత్‌ ప్రణామో7యం క్రియతేమద్వి ధైర్జవైః 8

తంమాతా ప్రాహవచనం కృతేకర్మణి పద్మభూః | వక్ష్యతేతవయో7యంహీ మహాత్మా గరుడధ్వజః. 9

కేవలం త్విహమాందేవ స్త్వత్సితా ప్రాహశంకరః | నాన్యః పరతరో7స్మాద్ది వయమవ్యేచ దేహినః. 10

పార్వత్యాగదితే స్కందః వ్రణివత్య జనార్ధనమ్‌ | తస్థౌ కృతాంజలిపుట స్త్వాజ్ఞాం ప్రార్థయతే7చ్యుతాత్‌ 11

కృతాంజలి పుటంస్కంధం భగవాన్‌ భూతభావనః | కృత్వౌ స్వస్త్యయనందేవో హ్యనుజ్ఞాంప్రదదౌతతః. 12

పులస్తుడిట్లనెను :- దేవతలు తనను దేవసేనల కధిపతిగా అభిషేకించిన తర్వాత నా కుమారుడు భక్తితో శివునకు పార్వతికి, అగ్నికి, ఆరుగురు కృత్తికలకు బ్రహ్మకు తలవంచి ప్రణామాలు చేసి యిలా అన్నాడు. ''ఓ దేవతలారా! మీకు నమస్సులు ఓ తపోధనులారా! మీకు ప్రణామాలు. మా అందర అనుగ్రహ ప్రసాదాలతో నేనా శత్రువులను మహిష తారకులను జయించెదను. శిశువు నగుటచే మీతో మాటాడుట నాకు తెలియదు. విరించితో కలిసి మీరందరూ నాకనుజ్ఞ నొసగుడు. అలా మాటడిన కుమారునివచనాలు విని దేవతలంగా భయంవీడి ఒకరినొకరు చూచుకున్నారు. శివుడు కూడ పుత్ర వాత్సల్యంతో లేచి విరించి చేయి పట్టుకొని స్కందుని వద్దకు తీసుకవెళ్ళాడు. అంతట ఉమాదేవి కుమారునితో 'నాయనా! పుత్రా రమ్మురమ్ము! ఓ శత్రుసంహారకా! సర్వజన వంద్యుడైన అచ్యుతుని దివ్య చరణాలకు నమస్కరించుము.' అని అన్నది. అందులకాతడు నవ్వి, 'అమ్మా! నాలాంటివాడు గౌరవంతో ణమస్కరించదగిన ఆయన ఎవరమ్మా? అని అడిగెను. అందులకా అంబిక, ''నీవు మొదట ఆయనకు నమస్కరించుము. తర్వాత ఆయనను గురించి బ్రహ్మ నీకు చెప్పగలడు. ఆయన్ను మించిన దైవం మరొకరెవ్వరూ మాతోసహా లేరని మీ తండ్రి నాకు చెప్పినాడు. కనుక నా గరుడధ్వజునకు నమస్కరించుమనెను. పార్వతి చెప్పిన ప్రకార మాస్కందుడు జనార్దనునకు మ్రొక్కి చేతులు జోడించికొని నిలబడగా నా విష్ణువు స్వస్తివాచనం గావించి అనుజ్ఞ నొసగెను.

నారద ఉవాచ :

యత్తత్‌ స్వస్త్యయనం పుణ్యం కృతవాన్‌ గరుదధ్వజః | శిఖిధ్వజాయ విప్రర్షే తన్మే వ్యాఖ్యాతుమర్హసి. 13

పులస్త్య ఉవాచ :

శృణుస్వస్త్యయనం పుణ్యం యత్ప్రాహ భగవాన్‌హరిః |

స్కందస్య విజయార్థాయ మహిషస్య వధాయచ. 14

స్వస్తితే కరుతాం బ్రహ్మా పద్మయోనీరజోగుణః స్వస్తి చక్రాంకితకరో విష్ణుస్తే విదధాత్వజః. 15

స్వస్తితే శంకరోభక్త్యా సపత్నీకో వృషధ్వజః | పావకః స్వస్తితుభ్యంచ కరోతుశిఖి వాహన. 16

దివాకరః స్వస్తికరోతు తుభ్యం సోమః సభౌమః సబుదోగురుశ్చ |

కావ్యః సదాస్వస్తి కరోతు తుభ్యం శ##నైశ్చతః స్వస్త్యయనం కరోతు. 17

మరీచిరత్రిః పులహః పులస్త్యః క్రతుర్వశిష్ఠో భృగురంగిరాశ్చ |

మృకండుజ స్తేకురుతాం హస్వస్తి స్వస్తి సదాసప్త మహర్షయశ్చ. 18

విశ్వేశ్వినౌ సాధ్యమరుద్గణాగ్నయో దివాకరాః శూలధరా మహేశ్వరాః |

యక్షాః పిశాచావస వో7థకిన్నకాః తేస్వస్తి కుర్వంతు సదోద్య తాస్త్వమీ. 19

నాగాః నుపర్ణాః సరితః నరాంసితీర్థాని పుణ్యాయతనాః సముద్రాః

మహాబలా భూతగణా గణంద్రాః తేన్వస్తి కుర్వంతు సదాసముద్యతాః. 20

స్వస్తి ద్విపాదికేభ్యస్తే చతుష్పాదేభ్య ఏవచ | స్వస్తితే బహుపాదేభ్య స్త్వపాదేభ్యో7ప్య నామయమ్‌. 21

ప్రాచీందిగ్‌ రక్షతాం వజ్రీ దక్షిణాందండనాయకః | పాశీప్రతీచీం రక్షతు లక్ష్మాంశః పాతుచోత్తరామ్‌. 22

వహ్నిర్దక్షిణ పూర్వాంచ కబేరోదక్షిణా పరామ్‌ | ప్రతీచీముత్తరాం వాయుః శివః పూర్వోత్తరామపి. 23

ఉపరిష్టాద్‌ ధ్రువః పుతు అధస్తాచ్చధరాధరః | మునలీలాంగలీ చక్రీ దనుష్మానంతరేషుచ. 24

వారహో7ంబునిధౌపాతు దుర్గేపాతునృకేసరీ | సామవేదధ్వనిః శ్రీమాన్‌ సర్వతః పాతుమాధవః. 25

నారదుడిట్లనెను : ఓ బ్రహ్కర్షీ! స్కందునకా గరుదధ్వజుడొనర్చిన పవిత్రమైన స్వస్తివాచనము నాకు వినపించుడు. అందులకు పులస్త్యుడు, స్కందునకు విజయమూ, మహిషునకు సర్వనాశనము కలుగుటకై శ్రీహరి గావించిన స్వస్తివాచనము నీవిధంగా వివరించాడు. ఓ శిఖిధ్వజా! రజోగుణియైన వర్మయోని విరించి నీకు క్షేమం కలుగ చేయుగాత ! అజుడు చక్రధరుడునైన విష్ణువు నీకు సేమం కలుగజేయుగాక. వృషభారూఢుడగు శంకరుడు సపత్నీకుడై నిన్నెల్లవేళల రక్షించుగాక. పావకుడు మేలు చేయుగాక. దినాకరుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, గురు శుక్ర శ##నైశ్చరులు నీకు సదా క్షేమం కలుగచేయుదురు గాక. మరీచ అత్రి పులహపుంస్తులు, క్రతు వసిష్ఠులు, భృగువు అంగిరసుడు మార్కండేయుడు, సప్తమహర్షులు నీకు సదా కళ్యాణం కలుగజేయుదురుకాక. విశ్వేదేవతలు, ఆశ్వినులు, శూలపాణులైన రుద్రులు, సాధ్యులు మరుత్తులు అగ్నులు యక్షలు పిశాచాలు వసువులు కిన్నరులు వీరందరు నీకు అభ్యుదయానికి సదా తోడ్పడుదురుగాక, నాగులు గరుడులు నదులు సరోవరాలు, తీర్థాలు, పవిత్రక్షేత్రాలు సముద్రాలు మహాబలులైన భూతగణాలు ఆ గణాధ్యక్షులు, అందరూ నీకు క్షేమం కలుగజేయుటకై ఎల్లప్పుడు సన్నద్దులై యుందురుగాక. ద్విపాత్తులు చతుష్పాత్తులు బహుపాదాలుగలవి పాదాలు లేని జీవులందరనుండియు నీకు రక్ష కలుగుకాక. తూర్పుదిక్కున ఇంద్రుడు, దక్షిణాన యముడు, పశ్చిమ దిశన వరుణుడు, ఉత్తరాన చంద్రుడు నిన్ను రక్షింతురుగాక. ఆగ్నేయదిక్కున అగ్ని, నైరుతి దిశన కుబేరుడు, వాయవ్యాన వాయుదేవుడు ఈశాన్నదిశను శివుడు నిన్ను కాపాడుదురుగాక. ఊర్ధ్వదిశన ధ్రువుడు, అధోదిశన శేషుడు, ఈ దిశాంతరాలలో ముసలం, నాగలి చక్రం ధనుస్సు ధరించిన (సంకర్షణ వాసుదేవుడు) వారలు నిన్ను రక్షింతురుగాక. సముద్రజలాల్లో వారాహ ప్రభువు, సంకట స్థలాలలో నరసంహదేవుడు, సామవేదరూపుడయిన మాధవుడు నిన్ను కాపాడుదురుగాక !

పులస్త్య ఉవాచ :

ఏవంకుథ స్వస్త్యయనో గుహః శక్తిధరో7గ్రణీః | ప్రణిపత్యసుతాన్‌ సర్వాన్‌ సముత్పతతభూతలాత్‌. 26

తమన్వేవగణాః సర్వే దత్తాయేముదితైః సురైః అనుజగ్ముః కుమారంతే కామరూపా విహంగమాః 27

మాతరశ్చతథా పర్వాః సముఏత్పేతుర్న భస్తలమ్‌ | సమంస్కందేన బలినా హంతుకామా మహాసురాన్‌. 28

తతః సుదీర్ఘమధ్వానం గద్వాస్కందో7బ్రవీద్గణాన్‌ |

భూమ్యాం తూర్ణం మహావీర్యాః కురుధ్వమవతారణమ్‌. 29

గణాగుహవచః శ్రుత్వా అవతీర్య మహీతలమ్‌ | ఆరాత్‌ పతంతస్తద్దేశం నాదం చక్రుర్బయంకరమ్‌. 30

తన్నినాదోమహీంసర్వా మాపూర్యచ నభస్తలమ్‌ | వివేశార్ణవరంధ్రేణ పాతాళందానవాలయమ్‌. 31

శ్రుతఃసమహిషేణా7థ తారకేణచధీమతా | విరోచనేనజంభేన కుజంభేనాసురేణచ. 32

తేశ్రుత్వాసహసానాదం వజ్రపాతోపమందృడమ్‌ | కిమేతదితిసంచింత్య తూర్జంజగ్ముస్తదాంధకమ్‌.33

తేనమేత్యాంధకేనైన సమందానవపుంగవాః | మంత్రయామాసురుద్విగ్నా

స్తంశబ్దంప్రతినారద. 34

మంత్రయత్సుచదైత్యేషు భూతలాత్‌సూకరాననః | పాతాళ##కేతుర్దైత్యేంద్రః సంప్రాప్తో7థరసాతలమ్‌. 35

నబాణవిద్దోవ్యథితః కంపమానోముహూర్ముహుః | అబ్రవీద్వచనందీనం సమభ్యేత్యాంధకాసురమ్‌. 36

పాతాళ##కేతురువాచ :

గతో7హమాసం దైత్యేంద్ర గాలవస్యాశ్రమంపత్రి | తంవిధ్వంసయితుంయత్నం సమారబ్దంబలాన్మయా. 37

యావత్సూకరరూపేణ ప్రవిశామితమాశ్రమమ్‌ | నజానేతంనరంరాజన్‌ యేనమేప్రహితఃశరః. 38

శరసంభిన్నజత్రుశ్చ భయాత్‌తస్యమహాజవః | ప్రణష్టాశ్రమాత్తస్మా త్సచమాంపృష్ఠతో7న్వగాత్‌. 39

తరంగఖురనిర్ఘోషః శ్రూయతేపరమో7సుర | తిష్ఠతిష్ఠేతివదతస్తస్య శూరస్యపృష్ఠతః

తద్భయాదస్మిజలధిం సంప్రాప్తోదక్షిణార్ణవమ్‌. 40

యావత్పశ్యామితత్రస్థాన్‌ నానావేషాకృతీన్‌నరాన్‌ | కేచిద్గర్జంతిఘనవత్‌ ప్రతిగర్జంతి చాపరే. 41

అన్యేచోచుర్వయంనూనం నిఘ్నా మోమహిషాసురమ్‌ | తారకంఘాతయామో7ద్య వదంత్యన్యేసుతేజసః 42

తచ్ఛ్రుత్వాసుతరాంత్రాసో మమజాతో7సురేశ్వర | మహార్ణవంపరిత్యజ్య పతితో7స్మిభయాతురః. 43

ధరణ్యావివృతంగర్తం సమామన్వపతద్‌బలీ | తద్భయాత్‌సంపరిత్యజ్య హిరణ్యపురమాత్మనః. 44

తవాంతికమనుప్రాప్తః ప్రసాదం కర్తుమర్హసి |

పులస్త్యుడిట్లనెను : ఆవిధంగా స్వస్తి వాచనాలు స్వీకరించి, శక్తి ధరులలో శ్రేష్ఠుడైన ఆగుహుడు దేవతలందరకు సాష్టాంగ ప్రణామాలుచేసి లేచి పైకి ఎగిరాడు. ఆయన ననుసరించి, ఆయనకు సందుష్టులై దేవతలిచ్చిన భూతగణాలుకూడ కామరూపులగుటచే పక్షులరూపంలో, ఆకాశమార్గాన బయలుదేరారు. ఆ కార్తికేయునితోబాటు, మాతృగణంకూడ రాక్షస వాధార్థం, ఆకాశవీథిన ఆయనను గమించారు. ఆవిధంగా ఆకాశాన చాలాదూరం ప్రయాణం చేసిన మీదట ఆస్కందుడా గణాలనందరను భూమిమీదకు దిగమని ఆదేశించాడు. గుహుని వచనానుసారం వారంతా భూమిమీదకుదిగి భయంకరంగా బొబ్బలు పెట్టారు. ఆ మహాధ్వని, భూమ్యాకాశాలలోనిండి సముద్రబింలంగుండా రాక్షసులకు నిలయమైన పాతాళానికి వ్యాపించింది. ఆ ప్రళయగర్జన చెవుల పడటంతో మహిషతారకులు, విరోచనజంభకుజంభులు అదిరపడి, యిదేమి పిడుగు పాలువలెనున్నదని వితర్కించుచూ అందరూకలిసి అంధకుని వద్దకు వెళ్ళారు. నారదా ! అలా అంశకుని సమీపించి ఆ దానవవీరులంతా ఉద్విగ్నులై ఆ ధ్వనిని గురించ ఆలోచించసాగారు. వారలా సంప్రదించుకుంటూండగా భూలోకాన్నుంచి పాతాళ##కేతువనే సూకరముఖడు, బాణం దెబ్బతగిలి తూలుకుంటూ భయంకంపితుడై, దైత్యరాజైన అంధకాసురిని సమీపించి దీనవదనంతో యిలా అన్నాడు. ''రాక్షసప్రబో! నేను భూలోకంలో గాలవృషి ఆశ్రమాన్ని ధ్వంసం చేసే సంకల్పంతో పందిరూపందాల్చి వెళ్ళి దానిని పాడుచేయసాగాను. ఇంతలో ఎవడో మానవుడు బాణంతో నామెడ ఎముకను గట్టిగా బద్దలు కొట్టాడు. నేనా చావుదెబ్బకు బయపడి పారిపోగా నాతడు నావెంట పడినాడు. గుర్రపు డెక్కల ధ్వనులమధ్య. 'నిలు! నిలు!' మనుచూ ఆవీరుడు వెంబడించాడు. అంతట భయంతో దక్షిణ సముద్రం చివరకు పరుగుతీసి, కొంచెం వెనుదిరిగి వారెవ్వరో అని పరికించాను. రకరకాల వేషాలు ధరించి ఎందరో మనుష్యులు, వాళ్ళలో కొందరు మేఘాల్లాగ గర్జిస్తూంటే మరికొందరు ప్రతిగర్జనలు చేస్తున్నారు. ఇంకా కొందరు ఈరోజు తప్పకుండా ఆమహీషాసురుణ్ణి చంపేస్తాం, ఆతారకాసురుణ్ణి మట్టి కరిపిస్తాం అంటూ కేకలు పెడుతున్నారు. ప్రభూ! వాళ్ళ సింహనాదాలకు బెదరిపోయి ప్రాణాలరచేతిలో పెట్టుకొని భూలోకాన్నుంచి ఒక పెద్ద బిలంలో పడిపోయాను. నావూరు హిరణ్యపురాన్ని వదిలిపెట్టాను. అయినా ఆ వీరుడుకూడ నన్ను వెంటాడుతున్నాడు. మీ అండకు చేరాను నా ప్రాణాలు రక్షించండి దొరా!''

తచ్ఛ్రుత్వాచాంధకోవాక్యం ప్రాహమేఘస్వనంవచః 45

నభేతవ్యంత్వయాతస్మాత్‌ సత్యంగోప్తా7తాస్మిదానవ | మహిషస్తారకశ్ఛోభౌ బాణశ్చ బలినాంవరః. 46

అనాఖ్యాయైవతేవీరా స్త్వంధకంమహిషాదయః | స్వపరిగ్రహసంయుక్తా భూమింయుద్ధాయనిర్యయుః 47

యత్రతేదారుణాకారా గణాశ్చక్రుర్మహస్వనమ్‌ | తత్రదైత్యాఃసమాజగ్ముః సాయుధాఃసబలామునే. 48

దైత్యానాపతతోదృష్ట్వా కార్తికేయగణాస్తతః | అభ్యద్రవంతసహసా సచోగ్రోమాతృమండలః. 49

తేషాంపురస్సరఃస్థాణుః ప్రగృహ్యవరిఘంబలీ | నిషూదయత్పరబలం క్రుద్దోరుద్రఃపశూనివ. 50

తంనిఘ్నంతంమహాదేవం నిరీక్ష్యకలశోదరః | కుఠారంపాణినాదాయ హంతిసర్వాన్‌ మహాసురాన్‌ 51

జ్వాలాముఖోభయకరఃకరేణాదాయ దాసురమ్‌ | సరథంసగజంసాశ్వం విస్తృతేవదనే7క్షిపత్‌. 52

దండకావ్చాపినంక్రుద్ధః ప్రాసపాణిర్మహాసురమ్‌ | సవాహనంప్రక్షిపతి సముత్పాట్యమహార్ణవే. 53

శంకుకర్ణస్యముసలీ హలేనాకృష్యదానవాన్‌ | సంచూర్ణయతిమంత్రీవ రాజానం ప్రాసభృద్‌వశీ. 54

ఖడ్గచర్మధరోవీరః పుష్పదంతోగణశ్రః | ద్విధాత్రిధా చ బహూదా చక్రేదైతేయదానవాన్‌. 55

పింగళోదండముద్యమ్య యత్రయత్ర ప్రధావతి | తత్రతత్రప్రదృశ్యంతే రాశయఃశావదానవైః. 56

సహస్రనయనః శూలం భ్రామయన్‌వైగణాగ్రణీః | ని మానాసురాన్‌వీరః సవాజిరథకుంజరాన్‌. 57

భీమోభీమశిలావర్షైః సపురస్సరతో7సురాన్‌ నిజఘానయథై వేంద్రో వజ్రవృష్ట్యానగోత్తమాన్‌. 58

రౌద్రఃశకటచక్రాక్షో గణఃపంచశిఖోబలీ | బ్రామయన్‌ముద్గరంవేగా న్నిజమానబలాద్రిపూన్‌. 59

గిరిభేదీతలేనైవ సారోహంకుంజరంరణ | భస్మచక్రేమహావేగో రథంచరథినాసహ. 60

సూకరముఖుడి దీనవచనాలువిని అంధకుడు, భయపడకుము నిన్ను తప్పక రక్షిస్తానని మేఘస్వరంలో అభయమిచ్చాడు. అప్పటికే అంధకుడికి తెలుపకనే మహాబలశాలురైన మహిషతారకం, బాణరాక్షసవతలు తమతమ బలాలతో భూలోకానికి యుద్ధం చేసేందుకు వెళ్లారు. స్కందుని గణాలు, భయంకరాకారాలతో తమ గర్జనలతో లోకాలన్నీ కంపింప చేస్తూండే ప్రదేశానికి ఆ రాక్షస నాయకులంతా తమతమ సాయుధబలలాలతో వచ్చి చేరారు. నారదా! అలా రక్కసిమూకలు విరుచుకుపడటం చూచి కార్తికేయుని గణాలు నిప్పులు గురిపిస్తూ, మాతృగణాలతోసహా, శత్రువులమీదకు లంఘించారు. వారిలో ముందుభాగాన బలశాలియైన స్థానువు పెద్ద గుదియ తీసికొని, పశువులను రుద్రుడు సంహరించునట్లుగా పరబలాన్ని చెండాడసాగాడు. ఆ మహాదేవుడు చేసే సంహార కార్యాన్ని చూచి కలశోదరుడు గొడ్డలి తీసుకొని మహారాక్షసులందరను సంహరించాడు. భయంకరమైన అగ్నిగుండంలాంటి నోరు తెరచుకుని జ్వాలాముఖుడు, రెండు చేతులతో రాక్షసును నోటిలోనిక కుక్కుకొని సంహరించాడు. భయంకరమైన ప్రాసపట్టుకొని దండకుడు కోపంతో పిచ్చివాడివలె విజృంభించి వాహనంతోకూడా ఎత్తి మహాసముద్రంలో, ఆ మహాసురుడిని విసరివేశాడు. వ్రజలను వశపరచుకున్న మంత్రి ప్రాసాయుధంతో రాజుతల ముక్కలు చేసినట్లు శంశుకర్ణుడు రాక్షసులను నాగలితో తనవైపు లాగికొని రొకలిబండతో వాళ్ళ తలలు బద్దలు కొట్టసాగాడు.

గణశ్వరుడైన పుష్పదంతుడు ఖడ్గండాలు పట్టుకొని రాక్షసులను రెండు మూడు ముక్కలుగా అనేక ఖండాలుగా నరక మొదలుపెట్టాడు. భయంకరమైన దండాన్ని తిప్పుతూ పింగళుడు ఎక్కడకువెళ్ళితే అక్కడ రాక్షసుల శవాలు కుప్పలుకుప్పలుగా కనిపించాయి. గణపతి సహస్రనయనుడు శూలంత్రిప్పుతూ అశ్వగజరథాలతో సహా రాక్షసవీరులను సంహరించాడు. ఇంద్రుడు పిడుగులు కురిపించి కొండలను పిండిచేసినట్లు భీముడు భయంకరమైన శిలావృష్టితో శత్రువధ గావించాడు. అయిదు జటలుగల శకట చక్రాక్షుడనే కణాధిపతి, తన ముద్గరాన్ని మహావేగంతో త్రిప్పుతూ ఎందరనో యమాలయానికి పంపాడు. ఇక గిరభేద అనే సార్థక నమడు తన అరచేసి దెబ్బలతోనే ఏనుగులతోసహా ఆరోహకులను, రథాలతోసహా రథికులను బూడిదగా పొడిపొడి చేశాడు.

నాడీజంఘో7ంఘ్రిపాతైశ్చ ముష్టిభిర్జానునాసురాన్‌ | కీలాభిర్వజ్రతుల్యాభి ర్జమానబలవాన్‌మునే. 61

కూర్మగ్రీవోగ్రీవయైవ శిరసాచరణనచ | లుంఠనేన తథాదైత్యాన్‌ నిజఘానసవాహనాన్‌. 62

పిండారకస్తుతుండేన శృఃగాభ్యాంచకలిప్రియ | విదారయతిసంగ్రామే దానవాన్‌ సమరోద్దతాన్‌. 63

తతస్తత్‌సైన్యమతులం వధ్యమానంగణశ్వరైః | ప్రదుద్రావాథమహిషః తారకశ్చగణాగ్రణీః 64

తేహన్యమానాఃప్రమథా దానవభ్యాంవరాయుధైః | పరివార్యసమంతాత్తే యుయుధుఃకుపితాస్తదా. 65

హంసాస్యంపట్టిశేనా7థ జమానమహిషాసురమ్‌ | షోడశాక్షస్త్రిశూలేన శతశీర్షోవరాసినా. 66

శ్రుతాయుధస్తుగదయా విశోకోముసలేన తు | బంధుదత్తస్తుశూలేన మూర్ధ్నిత్యమతాడయత్‌. 67

తథా7న్యైఃపార్షదైర్యుద్దే శూలశక్త్యష్టిపట్టిశైః | నాకంపత్తాడ్యమానో7పి మైనాకివపర్వతః 68

తారకోభద్రకాళ్యాచ తథోలూఖలయారణ | వధ్యతేచైకచూడాయా దార్యతేపరమాయుధైః. 69

తౌతాడ్యమానౌప్రమథై ర్మాతృభిశ్చమహాసురౌ | నక్షోభంజగ్మతుర్వీరౌ క్షోభయంతౌగణానపి. 70

మహిషోగదయాతూర్ణం ప్రహారైః ప్రమథానథ | పరాజిత్యపరాధావత్‌ కుమారంప్రతిసాయుధః. 71

తమాపతంతంమహిషం సుచక్రాక్షోనిరీక్ష్యహి | చక్రముద్యమ్యనంక్రుద్దో రురోధదనునందనమ్‌. 72

గదాచక్రాంకితకరౌ గణాసురమహారథౌ | ఆయుధ్యేతాంతదా బ్రహ్మన్‌ లఘుచిత్రంచసుష్ఠుచ. 73

గతాంముమోచమహిషః సమావిధ్యగణాయతు | సుచక్రాక్షోనిజంచక్రం ఉత్సనర్జాసురంప్రతి. 74

గదాంభిత్వాసుతీక్షాణరం చక్రంమహిషమాద్రవత్‌ | తతఉచ్చుక్రుశుర్దైత్యాహా హతోమహిషస్త్వితి 75

తచ్ఛ్రుత్వా7భ్యద్రవద్బాణః ప్రాసమావిధ్యవేగవాన్‌ | జఘానచక్రంరక్తాక్షః పంచ ముష్ఠిశ##తేనహి. 76

ఓ నారదా ! ఇక బలశాలి అయిన నాడీజంఘుడు తన పాదాలతో మోకాళ్ళతో వజ్రాల్లాంటి ముష్టిఘాతాలతో ఉక్కు గుదియలతో శత్రునాశం గావించాడు. కూర్మగ్రీవుడు తన మెడతో తలతో పాదాలతో శత్రువులను చీల్చి మృత్యువుకు విందు చేశాడు. ముద్ధోన్మాదులైన ఆ రాక్షసులను పిండారకుడు తన దవడలతోను దంష్ట్రలతోను కొమ్ములతోను చీల్చి చెండాడాడు. ఆ విధంగా తమకు ఎదురులేని రాక్షససైన్యం గణాధిపతుల చేతుల్లో హతమైపోవడంచూచి మహారోషంతో మహిషుడు తారకుడు, ప్రచండ సేనాధిపతులు, ముందుకు లంఘించారు. ఆ యిద్దరు దైత్య నాయకులు శ్రేష్ఠమైన ఆయుధాలతో తమ్ము ప్రహరించడం చూచి ప్రమథులు నలువైపులనుండి వారిని ముట్టడించి యుద్ధం చేయసాగగా, హసాస్యుడు మహిషుణ్ణిపట్టిశంతో చావమోదాడు. షోడశాక్షడు త్రిశూలంతో శతశీర్షుడు వాడి కరవాలంతో శ్రుతాయుధుడు గదతో విశోకుడు రోకలిబండతో బంధుదత్తుడు శూలంతో ఒక్క పెట్టున వాడిమాడుమీద ప్రహరించాడు. ఇంకా అనేకులు పార్షదులుకూడ శూలాలు శక్తులుపట్టిసాలతో ఆ మహిషుని ప్రహరించినప్పటికీ మైనాక పర్వతంలాగా ఆ వీరుడు ఏమాత్రం చలింపలేదు. భద్రకాళి ఉలూఖలుడు ఏకచూడుడు వాడియైన ఆయుధాలతో తారకుణ్ణి పొడవసాగారు. ఆవిధంగా ప్రమథులు మాతృగణాలు ప్రహరిస్తూన్నా ఆ మహాసురులు ఏమాత్రం బాధకు లోనుగాక పైపెచ్చు ఆ దేవగణాలను హింసింపసాగారు. మహిషుడు ప్రచండగదాయుధంతో ప్రమధులను పరహరించి ఓడించి కార్తికేయుడున్నవైపు పరుగు తీశాడు. అలా మీదకు లంఘిస్తూన్న మహిషుని చూచి సుచక్రాక్షుడు మహాకోపంతో చక్రాయుధంతో వాడికి అడ్దుతగిలాడు. ఓ బ్రహ్మర్షీ! అలా మహారధులైన గణాధ్యక్షులు రాక్షసాధిపతులు. గదలు చక్రాయుధాలుచేబట్టి పరస్పరం ప్రహరించు కుంటూ సముజ్జీలుగా భయంకరంగా అలవోకగా యుద్ధం చేశారు. మహిషుడు గదను విసిరతే సుచక్రాక్షుడు చక్రాన్ని వాడిమీద ప్రయోగించాడు. భయంకరమైన అంచులుగల ఆ చక్రం గదను పొడిపొడిగావించి మహిషుడి మీదికివచ్చింది. అదిచూచి ధైత్యులంతా అయ్యో! మహిషుడు చచ్చాడుగదా! అని ఆక్రోశంచేశారు. అదివిని బాణుడు ప్రాసంతీసుకొని ఎర్రనికండ్లతో అయిదువందల ముష్ఠిఘాతాలతో చక్రాన్ని ఎదుర్కొన్నాడు. మరొక అయిదువందల బాహువులతో సుచక్రాక్షుణ్ణి బంధించగా నాతడు బలవంతుడయిన బాణునిముందు ఏమీ చేయలేకపోయాడు.

పంచబాహుశ##తేనాపి సుచక్రక్షంవవంధనః బలవానపిబాణన నిష్ఫ్రయత్నగతిఃకృతః. 77

సుచక్రాంసచక్రంహి బద్దంబాణాసురేనహి | దృష్ట్వా7ద్రవద్గదాపాణిర్మకరాక్షోమహాబలః 78

గదమామూర్ధ్నిబాణంహి నిజఘానమహాబలః | వేదనార్తోముమోచాథ సుచక్రాక్షంమహాసురః.

నచాపితేనసంయుక్తో వ్రీడాయుక్తోమహామనాః. 79

ససంగ్రామంపరిత్యజ్యా సాలిగ్రామముపాయ¸° | బాణో7పిమకరాక్షేణ తాడితో7భూత్పరాజ్ముఖః. 80

ప్రభజ్యతబలంసర్వం దైత్యానాం సురతాపన క్ష తతఃస్వబలమీక్ష్యైవ ప్రభగ్నంతారకోబలీ.

ఖడ్గోద్యతకరోదైత్యః ప్రదుద్రావగణశ్వరాన్‌. 81

తతస్తుతేనా7ప్రతిమేనసాసినా తేహంసవక్త్రప్రముఖా గణశ్వరాః |

సమాతరశ్చపిపరాజితారణ స్కందంభయార్తాః శరణం ప్రసేదిరే. 82

భగ్నాన్‌గణాన్‌వీక్ష్యమహేశ్వరాత్మజ స్తంతారకంసాసినమాపతంతమ్‌ |

దృష్ట్వైవశక్త్యాహృదయేబిభేద సాభిన్నమర్మాన్యసతత్‌పృథివ్యామ్‌. 83

తస్మిన్‌హతేభ్రాతరిభగ్నదర్పో భయాతురో7భూన్మహిషో మహర్షే |

సంత్యజ్యసంగ్రామశిరోదురాత్మా జగామశైలంనహిమాచలాఖ్యమ్‌. 84

బాణో7పివీరేనిహతే7థతారకేగతే హిమాత్రింమహిషే భయార్తే.

భయాద్వివేశోగ్రమపాంనిధానం గణౖర్బదేవధ్యతిసాపరాధే. 85

హత్వాకుమారోరణమూర్ధ్నితారకం ప్రగృహ్యశక్తింమహతాజవేన |

మయూరమారుహ్యశిఖండమండితం య¸°నిహంతుమహిషాసురస్య. 86

సపృష్ఠతఃప్రేక్ష్యశిఖండకేతనం సమాపతంతంవరశక్తిపాణినమ్‌ |

కైలాసముత్సృజ్యహిమాచలం తథా క్రౌంచంసమభ్యేత్యగుహాంనివేశ. 87

దైత్యంప్రవిష్టంనపినాకిసూను ర్జుగోపయత్నాద్‌ భగవాన్‌ గుహో7పి |

న్వబంధుహంతాభవితాకథంత్వహం సంచింతయన్నేవతతఃస్థితో7భూత్‌. 88

తతో7భ్యగాత్పుష్కరసంభవస్తు హరోమురారిస్త్రిదశేశ్వరశ్చి |

అభ్యేత్యచోచుర్మహిషంసశైలం భిందస్వశక్త్యాకురు దేవకార్యమ్‌. 89

తత్కార్తికేయఃప్రియమేవతథ్యం శ్రుత్వావచః ప్రాహసురాన్‌విహస్య |

కథంహిమాతామహనస్తృకంవధే స్వభ్రాతరంభ్రాతృసుతంచమాతుః. 90

ఏషాశ్రుతిశ్చాపిపురాతనీకిల గాయంతియాంవేదనవిదోమహర్షయః |

కృత్వాచయస్యామతముత్తమాయాః స్వర్గంప్రజంతిత్వతిపాపినో7పి. 91

గాంబ్రాహ్మణంవృద్దమథాప్తవాక్యం బాలంస్వబంధుంలలనామదుష్టామ్‌ |

కృతా7పరాధాఅపి నైవవధ్యా ఆచార్యముఖ్యాగురవస్తథైవచ. 92

ఏవంజానన్‌ధర్మమగ్య్రంసురేంద్రా నాహంహన్యాంభ్రాతరంమాతులేయమ్‌ |

మదాదైత్యోనిర్గమిష్యద్గుహాంతః తదాశక్త్యాఘాతయిష్యామిశత్రుమ్‌. 93

శ్రుత్వాకుమారవచనంభగవాన్మహర్షే కృత్వామతింస్వహృదయేగుహమాహశక్రః |

మత్తోభవాన్‌నమతిమాన్‌వదసేకిమర్థం వా క్యంశృణుష్వహరిణాగదితంహి పూర్వమ్‌ 94

సుచక్రాక్షుణ్ణి చక్రంతోసహా బాణుడు బంధించడంచూచి మహాబలుడై నమకరాక్షుడు గదాపాణియై బాణుడిపైదూకి గదతో వానినెత్తిమీద మోదాడు. ఆదెబ్బకు తాళ##లేక బాణుడు సుచక్రాక్షుణ్ణి వదిలిపెట్టాడు. దానితో సిగ్గుతో తలవంచుకుని సుచక్రాక్షుడు యుద్ధభూమి వదిలి సాలిగ్రామానికి వెళ్ళిపోయాడు. మకరాక్షునిచేత చావుదెబ్బతిన్న బాణుడుకూడ కాలికి బుద్ధి చెప్పాడు. ఓ దేవర్షీ! రాక్షస సైన్యమంతా భగ్నమైపోవడం చూచి మహాబలియైన తారకాసురుడు మండిపడి ఖడ్గం తీసికొని ఆ గణాధిపతులందరను వెంబడించి తరిమికొట్టాడు. అలా వాడిచేతుల్లో దెబ్బలుతిని హంసాస్యుడు మొదలయిన గణపతులు మాతృకాగణాలు పారపోయి స్కందునిచేరి మొరపెట్టుకున్నారు. బెదరిపోయిన తన గణాలను కత్తితో మృత్యువులాగా వాండ్లను తరిమికొడుతున్న తారకుణ్ణిచూచి స్కందుడు తన భయంకరమైన శక్తితో వాడి వక్షస్థలాన్ని చీల్చి వేశాడు. దానితో వాడు విగతజీవుడై నేలవ్రాలాడు. అలా తన సోదరుడు నేలగూలడంచూచి మహిషుడి పొగరంతా నీరు గారి పోయింది. భయంతో గడగడ వణుకుతూ ఆ దుర్మార్గుడు యుద్ధభూమిన వదలి హిమాచలంలోని కైలాస శిఖరానికి పారిపోయాడు. తారకుడు స్కందుని శక్తికి బలిగావడం, మహిషుడు హిమగిరికి పారిపోవడం రాక్షసబలాన్ని గణాలు చీల్చిచెండాడడంచూచి బ్రతుకుజీవుడా! అంటూ బాణాసురుడుకూడా పారిపోయి సముద్రజలాల్లో అదృశ్యుడయ్యాడు. అలా తారకుని తనశక్తి కెరగావించి పారిపోతున్న మహిషుణ్ణిచూచి కార్తికేయుడు మయూరంమీదనెక్కి మహా వేగంతో ఆదుష్టుని వెంబడించాడు. ఆ మహిషుడు వెనుకకుతిరిగి చూడగా మయూరధ్వజుడు శక్తితో తనను వెంబడించడం గమనించి కైలాసాన్ని వదలి క్రౌంచగిరి గుహలో దూరి దగుకున్నాడు. అలా క్రౌంచగుహలో దూరిన మహిషుణ్ణి చంపకుండా స్కందుడు నిలబడిపోయి, స్వంత సోదరుణ్ణి ఎలా చంపడమా అని ఆలోచనలోబడినాడు. వెంటనే బ్రహ్మ, విష్ణు, శివుడు, ఇంద్రుడు వచ్చి క్రౌంచ పర్వతంతోసహా ఆ మహిషుణ్ణి భేదించమని కుమారునితో తొందరపెట్టారు. అప్పుడే దేవకార్యం సిద్ధిస్తుందన్నారు. అందుకాగుహుడు చిరునవ్వుతో మీరు చెప్పింది బాగుగానే వుంది. కాని నా మాతామహుని మనుమని. నా మేనమామ కుమారుని, నాసోదరునే ఎలా చంపగలను? గోబ్రహ్మణ వృద్ధులను, ఆప్త వాక్యము పలుకువానిని, బాలురను స్వంత సోదరులను, పతివ్రతయైన భార్యను, ఆచార్యపరులను, గురువులను, అపరాధులైనను సరే వధింపరాదనే వేదములు శాసిస్తున్నాయి. దానిని వేదవేత్తలు మహర్షులు ఉత్తమ వ్రతంగా పాలిస్తూ ఉన్నారు. అతి పాపులసైతం ఆ నీతిని పాటించి స్వర్గర్హులౌతున్నారు. ఈ శ్రేష ధర్మాన్ని తెలిసికూడా, ఓ మహానుభావులారా! నేను నా మేనమామకొడుకును. మాతులేయభ్రాతను సంహరింపలేను. ఆదైత్యుడా గుహనుండి బయటకు వచ్చిన వెంటనే వధిస్తానని చెప్పాడు. నారదా! కుమారుడు చెప్పినదివిని, ఆలోచించి దేవేంద్రుడతనితో యిలా అన్నాడు. కుమారా! నీవు నాకన్న తెలిసినవాడవుకావు. ఎందుకిలా వాదిస్తావు? భగవంతుడు శ్రీహరి స్వయంగా చెప్పిన ధర్మసూక్తివిను. ఒకనికోసం అనేకులను చంపకూడదు అట్లే ఎక్కువమందిన రక్షించుటకు ఒక్కని చంపడం పాపం కానేరదు.

నైకస్యార్థేబహూన్‌హన్యా దితిశాస్త్రేషు నిశ్చయః | ఏకంహన్యాద్భహుభ్యో7ర్థే నపాపీతేనజాయతే. 95

ఏతచ్ఛ్రుత్వామయాపూర్వం సమయస్థేసచాగ్నిజ | నిహతోనముచిఃపూర్వం సోదరో7పి మమానుజః. 96

తస్మాద్బహూనామర్థాయ సక్రౌంచంమహిషాసురమ్‌ | ఘాతయస్వపరాక్రమ్య శక్త్యాపావకదత్తయా. 97

పురందరవచఃశ్రుత్వా క్రోధాదారక్తలోచనః | కుమారఃప్రాహవచనం కపంమానః శతక్రతుమ్‌. 98

మూఢ కింతేబలంబాహ్యోః శరీరంచాపివృత్రహన్‌ | యేనాధిక్షిపసేమాంత్వం ధ్రువంనమతిమానసి. 99

తమువాచసహస్రాక్ష స్త్వత్తో7హంబలవాన్‌గుహ | తంగుహఃప్రాహేహ్యేహీ యుద్ధ్యస్వబలవాన్‌యది. 100

శక్రః ప్రాహాథబలవాన్‌ జ్ఞాయతే కృత్తికాసుత | ప్రదక్షిణం శీఘ్రతరం యః కుర్యాత్‌ క్రౌంచమేవహి. 101

శ్రుత్వాతద్వచనంస్కందో మయూరం ప్రోహ్యవేగవాన్‌ |

ప్రదక్షిణం పాదచారీ కర్తుం తూర్ణతరో7భ్యగాత్‌. 102

శక్రో7వతీర్య నాగేంద్రాత్‌ పాదేనాథ ప్రదక్షిణం |

కృత్వాతస్థే గుహో7భ్యేత్య మూధకిం సంస్థితో భవాన్‌. 103

తమింద్రః ప్రాహకౌటిల్యం మయాపూర్వం ప్రదక్షిణః |

కృతో7స్యన త్వయాపూర్వం కుమారం శక్రమబ్రవీత్‌. 104

మయాపూర్వం మయాపూర్వం వివదంతౌ పరస్పరం |

ప్రాప్యోచతుర్మ మేశాయ బ్రహ్మణ మాధవాయచ. 105

అథోవాచ హరిః స్కందం ప్రష్టుమర్హసి పర్మతమ్‌ |

యో7యం వక్ష్యతిపూర్వంన భవిష్యతి మహాబలః. 106

తన్మాధవవచః శ్రుత్వా క్రౌంచమభ్యేత్య పావకిః | పవ్రచ్ఛాద్రిమిదంకేన కృతం పూర్వం ప్రదక్షిణమ్‌. 107

ఇత్యేవముక్తః క్రౌంచస్తు ప్రాహపూర్వం మహామతిః |

చకారగోత్రభిత్‌ పశ్ఛాత్త్వయాకృతమథోగుహః. 108

ఏవంబ్రువంతం క్రౌంచం సక్రోధాత్‌ ప్రస్ఫురితాధరః | బిభేదశక్త్యా కౌటిల్యో మహిషేణ సమంతదాః. 109

అధర్మం వినియే నేను పూర్వం, ఓ అగ్నిపుత్రా! యుద్ధంలో నా సోదరుడు తమ్ముడూనైన వముచిదైత్యుని సంహరించాను. కాబట్టి ఎందరో దేవతల రక్షణకోసం క్రౌంచంతోబాటుగ మహిషుణ్ణి వధించుము. అగ్నిదత్తమైన శక్తిని తీసికొని పరాక్రమించుము. ''ఇంద్రుని మాటలువిని కనులెర్రజేసి కదలిపోతూ స్కందుడిలా అన్నాడు. ''ఓ వృత్రహంతా! నీవు మహామూర్ఖుడవు! నన్నిలా ఆక్షేపణ చేస్తున్నావు. నేవెంత నీబలమెంత? నిజంగా నీకు బుద్ధిలేదు.'' అందుకు యింద్రుడు ఓ గుహా! నీకంటే నేనే బలశాలిని అన్నాడు. అయితే రమ్ము! ఎవరు బలవంతులో యుద్ధంలో తేల్చుకుందామని అంటూన్న కుమారునితో ఇంద్రుడు అందుకు ద్వంద్వయుద్ధం అవసంరలేదు. ఈ క్రౌంచపర్వతాన్ని ఎవరు ముందుగా చుట్టివస్తారో వారే బలవంతుని చెప్పగా స్కందుడు వెంటనే నెమలిమీదనుంచి క్రిందకుదిగి పాదచారియై త్వరత్వరగా ఆగిరి ప్రదక్షిణం చేసి వచ్చాడు. ఇంద్రుడు మాత్రం ఐరావతాన్నిదిగి ప్రదక్షిణంచేసి, గుహుడు వచ్చుసరికి, నిలబడియున్నాడు. ఓయి మూర్ఖా! ఇలా నిలబడినావేమని తన్నడిగిన గుహునితో ఇంద్రుడు నా ప్రదక్షిణం నీకన్నా ముందే పూర్తయిందన్నాడు. గుహుడు కాదు. నీకన్నా ముందు నేను చేశానన్నాడు. అలా నేను ముందుచేశానంటే నేను ముందుచేశానని తగవులాడు కుంటూ వారిద్దరు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను తీర్పు చెప్పమన్నారు. అప్పుడు విష్ణువు, ఎవరో చెప్పుట ఎందులకు? క్రౌంచగిరినే అడగండి. అతడే చెప్పుతాడనగా, గుహుడు క్రౌంచుని ముందుగా ఎవరు ప్రక్షిణించారో చెప్పమనికోరాడు. అంతట క్రౌంచుడు, మహామతియైన వగభేరి (ఇంద్రుడే)యే ముందుగా ప్రదక్షిణం చేశాడన్నాడు. దాంతో అగ్ని పుత్రుడి కళ్లెర్రబడ్డాయి,! పెదవులు అదిరాయి! కోపం పట్టలేక ఆ కుటిలాతనయుడు భయంకరమైన తన శక్తితో ఆ క్రౌంచుని లోపలున్న మహిషున్ని చీల్చి సంహరించాడు.

తస్మిన్హతే7థ తనయే బలవాన్‌ సునాభో వేగేన భూమిదరపార్థివజ స్తథాగాత్‌|

బ్రహ్మేంద్ర రుద్రమరుదశ్వి వసుప్రధానా జగ్ముర్దివం మహిషమీక్ష్య హతం గుహేన. 110

స్వమాతులం వీక్ష్యబలీకుమారః శక్తిం సముత్పాట్యనిహంతుకామః |

నివారితశ్చక్ర ధరేణవేగా దాలింగ్య దోర్భ్యాం గురురిత్యుదీత్య 111

సునాభమభ్యేత్య హిమాచలస్తు ప్రగృహ్య హస్తే7న్యత ఏవనీతవాన్‌ |

హరిః కుమారం సశిఖండినంనయ ద్వేగాద్దివంపన్న గశత్రుపత్రః. 112

తతోగుహః ప్రాహహరిం సురేశం మోహేననష్టో భగవాన్‌ వివేకః |

భ్రాతామయా మాతులజోనిరస్త స్తస్మాత్‌ కిరిష్యే స్వశరీరశోషమ్‌. 113

తంప్రాహ విష్ణుర్వ్రజ తీర్థవర్యం పృథూదకం పాపతరోఃకుఠాతమ్‌ |

స్నాత్వౌఘవత్యాం హరమీక్ష్య భక్త్యా భవిష్యసే సూర్యసమప్రభానః. 114

ఇత్యేవముక్తో హరిణాకుమార స్త్వభ్యేత్య తీర్థం ప్రసమీక్ష్యశంభుమ్‌ |

స్నాత్వార్చ్య దేవాన్‌ సతవిప్రకాశో జగామశైలం సదనంహరస్య. 115

సుచక్రనేత్రో7పి మహాశ్రమేతప శ్చకారశైలే పవనాశనస్తు |

ఆరాధయానో వృషభద్వజంతదా హరో7స్యతు ష్టోవతధోబభూవ. 116

దేవాత్సవవ్రేవరమాయుఢార్థే చక్రంతథావైరిపుభాహుషండమ్‌ |

ఛింద్యాద్యథాస్వప్రతిమంకరేణ బాణస్యతన్మేభగవాన్‌దదాత. 117

తమాహశంభుర్వ్రజదత్తమేతద్‌ వరంహిచక్రస్యతవాయుధస్య|

బాణస్యతద్భాహుబలంప్రవృద్ధం సంఛేత్స్యతేనాత్రవిచారణా7స్తి. 118

వరేప్రదత్తేత్రిపురాంతకేన గణశ్వరఃస్కందయుపాజగామ |

నిపత్యపాదౌప్రతివంద్యహృష్టో నివేదయామాసహరప్రసాదమ్‌. 119

ఏవంతవోక్తం మహిషాసురస్య వధం త్రినేత్రాత్మజ శక్తిభేదాత్‌ |

క్రౌంచస్యమృత్యుః శరణాగతార్థం పాపాపహం పుణ్యవివర్థనంచ. 120

ఇతి శ్రీ వామన మహాపురాణ ద్వాత్రింశో7ధ్యాయః.

ఓ నారదా! అలా తనకుమారుడు క్రౌంచుడు చచ్చుట చూచి, నగాధిరాజు కుమారుడైన సువాభుడు అక్కడకు పరుగెత్తుకుంటూ వచ్చాడు. అటు మహిషాసురుడు

వధింపబడటంతో బ్రహ్మేంద్రరుద్రమరుదశ్వినీవస్వాదిదేవతలు ఆనందంతో కేరింతలు కొడుతూ స్వర్గానికి వెళ్ళిపోయారు. అలా వచ్చిన తన మేనమామను చూచి కార్తికేయుడు తనశక్తిని పెరిక సునాభుని కూడ వధించుటకు సిద్ధమయ్యాడు. అంతట శ్రీహరి వెంటనే నతని నాలింగనం చేసుకొని సునాభుడు నీకు పూజ్యుడు బాబూ. అంటూ వారించాడు. హిమవంతుడు కూడ వచ్చి పుత్రుడు సునాభుని చేయిపట్టుకొని వేరొక చోటికి తీసికెళ్ళాడు. అంతట గరడా రూఢుడైన హరి వెంటనే మయూరంతోసహా కార్తికేయుణ్ణి తనవెంట స్వర్గానికి గొని పోయాడు. అక్కడ స్కందుడు శ్రీహరిని చూచి శోకంతో, అజ్ఞానంవల్ల మూర్ఖుడనై నామాతులేయ సోదరుణ్ణ వధించాను. ఆ పాపానికి పరిహారంగా శరీరత్యాగం చేసుకుంటాననగా నా విష్ణువు, అంతకన్న ఘోరమైన పాపాలు కూడ పోగొట్టేది వృథూదకమనే మహాతీర్థం ఉంది. అందులో స్నానం చేసి శివుని దర్శనం చేసుకుంటే సర్వపాపాలుపోయి సూర్య ప్రభతో వెలిగిపోతావు. కాబట్టి అక్కడకు వెళ్ళుమని ఆదేశించాడు. శ్రీహరి మాట ప్రకారం కుమారుడు పృథూదక క్షేత్రానిక వెళ్ళి స్నానంచేసి భక్తితో శంకర దర్శనం గావించి విధ్యుక్తంగా దేవతలనందరను అర్చించాడు. తర్వాత శివుడు నివసించే శైలానికి వెళ్ళాడు. యుద్ధభూమినుండి వెళ్లిన సుచక్రాక్షుడా పర్వంతం మీదనే వాయు భక్షణం చేస్తూ వృషభధ్వజుని గూర్చి కఠోర తపస్సు చేయగా శివుగనుగ్రహించి వరం కోరుకొనుమన్నాడు. అందులకాతడు 'ఓపరమేశ్వరా! నన్నవమానించిన బాణాసురుని బాహువులను ఖండిచగల అద్భుతమైన చక్రాయుధాన్ని అనుగ్రహించుము. అని వేడుకున్నాడు. అందుకు హరుడు తథాస్తు ! నీవు కోరినట్లే, రోజురోజుకూ వృద్ధింగతమగు చున్న బాణాసురుని బాహు సహస్రాన్ని ఖండించే చక్రాన్ని యిస్తున్నాను తీసుకో. ఈ ఆయుద శ్రేష్ఠానికి ఎదురుండదు. సందేహంలేద' ని చక్రప్రదానం చేశాడు. అలా శంకరుని వలన వరంపొంది గణధ్యక్షుడైన సుచక్రాక్షుడు స్కందుని వద్దకు వెళ్ళి నమస్కరించి సంతోషంతో హరుడు తనకు యిచ్చిన విషయమంతా చెప్పాడు.

ఓ మహర్షీ! ఫాలాక్షుని పుత్రుడు కుమారుడు, దివ్యవైన శక్తి ఆయుధంతో గావించిన మహిషాసుర వధ క్రౌంచ భేదనము, శరణాగతుని రక్షించుటకాపర్వతం కావించిన ప్రాణత్యాగం వివరంగా నీకు వినిపించాను. పవిత్రమైన ఈ కథ పాపాలను పోగొట్టి పుణ్యాన్ని పెంపొందిపజేస్తుంది.

ఇది శ్రీ వామనమహాపురాణంలో ముప్పది రెండవ అధ్యాయం ముగిసినది.

7

Sri Vamana Mahapuranam    Chapters